స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

30వ అధ్యాయము

తా॥ వ్యాసలిట్లా అన్నారు. పూర్వం త్రేతా యుగం వచ్చాక విష్ణు అంశతో రాఘవుడు నూర్యవంశ మందు పుట్టాడు. ఆతడే రాముడు రాజీవ లోచనుడు  ఆ రాముడు లక్ష్మణుడు ఇద్దరు కాక వక్షధరులు (పిల్లజుట్టు) తండ్రి గారి మాటలతో వారిద్దరు విశ్వామిత్రుని అనుసరించారు. యజ్ఞ నంరక్షణ కొరకు రాజు ఆ కుమారులను చంపాడు. ధనుర్బాణములు ధరించిన వీరులు వారు తండ్రి ఆ జ్ఞాపాలకులు  దారిలో వెళ్తున్నంతలో తాటక అనురాక్షసి వచ్చి విఘ్నాన్ని కల్గిస్తూ ముందు నిలబడింది. ఋషి ఆజ్ఞతో రాముడు తాటకను చంపాడు. విశ్వామిత్రుడు రామునకు ధనుర్వేద విద్యను ఇచ్చాడు  ఇంద్రుని యోగంతో శిలయైన అహల్య గౌతముని భార్య రాముని పాదస్పర్శతో తిరిగి నిజ రూపానికి చేరింది  విశ్వామిత్రుని యజ్ఞం ముగిశాక రఘూత్తముడు, పరమమైన బాణములతో మారీచుని సుబాహుని కొట్టాడు  జనకుని ఇంటి యందున్న ఈశ్వర ధనువును భగ్న మొనర్చాడు రాముడు పదునైదవ ఏట ఆరేళ్ళ వయస్సు గల సీతను  రమ్యమైన సీతను, అయోనిజను అప్పుడు వివాహ మాడాడు, ఓ రాజ!, రాముడు సీతను పొంది అప్పుడు కృతకృత్యుడయ్యాడు అయోధ్యకు వెళ్తూ మార్గంలో జామదగ్నిని చూచాడు. ఓ రాజ! అప్పుడు దేవతలకు కూడా సహించరాని యుద్ధం జరిగింది వారికి  పిదప పరశురాముని వదలి సీతతో కూడి ఇంటికి వచ్చాడు. రాముడు పిదప పన్నెండు సంవత్సరాలు ఆమెతో కూడి రాముడు సుఖించాడు. ఇరువది ఏడవ సంవత్సరమందు రాముని యువరాజుగా చేయదలచిన దశరధుని, కైకేయి రెండు వరములడిగింది.  అందులో ఒకటి రాముడు సీత, లక్ష్మణులతో కూడి జడలు ధరించి పదునాల్గు సంవత్సరాలు అడవికి వెళ్ళాలి. రెండవ వరము నా కొడుకు భరతుడు యువరాజ్యాధిపుడు కావాలి. మంధర వచనంతో మూఢురాలైన ఆమె ఈ వరాన్ని కోరింది  జానకిలక్ష్మణులు తోడుగా రాముని రాజు అడవికి పంపాడు. మూడు రాత్రులు నీరుమాత్రమే భుజించి, నాల్గవరోజు ఫలాహారుడై  ఐదవరోజురాముడు చిత్రకూటముందు వాసాన్ని కల్పించాడు. పిదప దశరధుడు రామ, అని అరుస్తూ పలవరిస్తూ స్వర్గం చేరాడు.  బ్రాహ్మణ శాపంను సఫలం చేస్తూ స్వర్గానికి వెళ్ళాడా ఏమీ. ఆ పిదప భరత శత్రుఘ్నులు చిత్ర కూటమునకు వచ్చారు. తండ్రి స్వర్గగతుడైనాడని రామునకు నివేదించాడు, ఓ రాజ భరతుని ఓదార్చి ఆతని తిరిగి వెళ్ళమని చెప్పాడు రాముడు. 

తా । । పిదప భరత శత్రుఘ్నులు నంది గ్రామమునకు వచ్చారు. వారిద్దరు రాజ్యమును ధరించి అక్కడ పాదుక పూజ చేయసాగారు మహాత్ముడైన అత్రినిచూచి దండ కారణ్యమునకు వెళ్ళాడు రాముడు - రక్షోగణముల వథ ఆరంభముందు విరాధుని చంపాక  పన్నెండున్నర సంవత్సర మందు పంచవటి యందున్నాడు. రాముడు పిదప శూర్పణఖ యను నిశాచరిని వికృత రూపిగా చేశాడు. జానకితో కూడి అడవి యందు తిరుగుతున్న అతని దగ్గరకు  సీతాపహరణం కొరకు ఆవహార రాక్షసుడు వచ్చాడు. పిదవ మామకృష్ణ అష్టమియందు వృందంజ గల ముహూర్తమందు. దశకంధరుడు రామ లక్ష్మణులు లేకుండా, సీత నెత్తుకు వెళ్ళాడు. మారీచా శ్రమమునకు వెళ్ళగావాడు మృగ రూపం ధరించి లక్ష్మణునితో కూడిన రాముని దూరంగా తీసుకెళ్ళాడు. మృగరూపం ధరించిన మారీచుని రాముడు వేగంగా చంపాడు తిరిగి ఆశ్రమమునకు వచ్చాక రాముడు అక్కడ సీత లేని ఆశ్రమం చూశాడు. అక్కడే సిగ్గుపడుతూ ఆమె ఆడలకుముకి పిట్టలా ఏడ్చింది రామరామ అని రాక్షనుని చేహరింపబడుతున్న నన్ను రక్షించు నన్ను రక్షించు అని. ఆకలిగొన్న డేగ, ఏర్చే మన వల్లంకి పిట్టను ఎత్తుకుపోయినట్టు కామవశుడై రాక్షసుడు జనకాత్మజను ఎత్తుకెళ్ళాడు. వీడు సీత నెత్తుకెళ్తున్నాడు. అనే మాటను అప్పుడు పక్షిరాజువిని రాక్షసేంద్రునితో యుద్ధం చేశాడు. రావణుడు చంపగా పడిపోయాడు. మావుకృష్ణ నవమి యందు రావణుడు ఇంట్లో ఆమెనుంచాడు అన్నదమ్ములు రామ లక్ష్మణులు వారు ఆమెను వెదుకుతూ వచ్చి జటాయువును చూచి, రాక్షసునితో సంహరింపబడ్డటుగా గ్రహించి, సీతను గూర్చి తెలుసుకొన్నాక రాముడు భక్తితో ఆ పక్షికి సంస్కారం చేశాడు ముందు రాముడు నడువగా లక్ష్మణుడు ఆతని అడుగులననుసరించాడు. పంపా తీరమునకు వచ్చి శబరిని అనుగ్రహించి, ఆ నీటిని స్పృశించాక హనుమంతుని చూచాడు. పిదప రాముడు హనుమంతునితో కూడా స్నేహం చేశాడు పిదప సుగ్రీవుని సమీపించి, వాను పేరుగల వానరుని చంపాడు. రామునితో సంవబడి హనుమంతుడు మొదలగు వారు ప్రియను వేడుక వేళ్ళారు అప్పుడు వాయుసూనుడు అంగుళీయకమును తీసుకొని వెళ్ళాడు. పదవ నెలలో పంపాతి వానరులకు ఆమెను గూర్చి చెప్పాడు పిదప ఆతని మాట ప్రకారము శతయోజనమైన లబ్దిని దాటాడు. హనుమంతుడు రాత్రి పూట ఆ లంకలో అంతట ఆమెను వెతికాడు. ఆ రాత్రి శేషమందు హనుమంతునకు సీత దర్శనం లభించింది. ద్వాదశి యందు హనుమంతుడు శింశుపా వృక్షమందు కూర్చున్నాడు .

తా ॥ ఆ రాత్రి, సీతకు విశ్వాసం కలిగే కొరకు రామ కథ చెప్పాడు. త్రయోదశి యందు అక్షయుడు మొదలగు వారితో యుద్ధం జరిగింది త్రయోదశి యందు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో కపిబంధింవ బడ్డాడు. దారుణమైన వాక్యములను రాక్షసాధి పతితోక అన్నాడు వాయుసూనుడు బ్రహ్మాస్త్రముతో బంధింపబడి రావణునితో పలికారు. లోకయందలి వహ్నితో లంకా దహనం చేశాడు  పూర్ణిమ వాటికి కపి తిరిగి మహేంద్రాద్రికి వచ్చాడు. మార్గశీర్ష ప్రతివద నుండి ఐదురోజులు మార్గంలో  వర్షం పడుతున్న రోజున మధువనాన్ని ధ్వంసం చేశారు. సప్తమీ యందు సీత, ప్రత్యభిజ్ఞ (గుర్తింపు)ను రామునకిచ్చి కథ అంతా చెప్పాడు. సీతమణినివ్వటం అంతా రామునకు చెప్పాడు. అష్టమీ ఉత్తర ఫల్గుని విజయ అను పేరుగల ముహూర్త మందు  సూర్యుడు ఆకాశ మధ్యానికి రాగా రాముడు బయలుదేరాడు. రాముడు దక్షిణ దిశకు వెళ్ళటానికి ప్రతిజ్ఞ చేశాడు. నేను సముద్రాన్ని దాటి కూడా రాక్షసేశ్వరుని చంపుతాను. దక్షిణ దిక్కుగా బయల్దేరిన ఆతనికి సుగ్రీవుడు తోడున్నాడు ఏడు రోజులకు సముద్ర తీరమందు సైన్యము విడిది చేసింది. పౌషశుక్ల ప్రతిపద తృతీయన నముద్రం వైపు సైన్యంతో సహా, రాముడు బయల్దేరాడు చతుర్ది రోజు విభీషణుడు రామునితో కలిశాడు. పంచమి రోజు సముద్రాన్ని దాటే కొరకు ఆలోచన జరిగింది నాల్గు రోజులు రాముడు ప్రాయోపవేశం చేశాడు. సముద్రుని నుండి వరం లభించింది. ఉపాయము కూడా చెప్పాడు దశమి యందు సేతువు నారంభించి త్రయోదశి యందు ముగించారు. చతుర్దశి రోజు రాముడు సువేలాద్రి యందు సైన్యముంచోడు పూర్ణిమ నుండి ద్వితీయ వరకు మూడు రోజులు సైన్యం సముద్రాన్ని దాటింది. శూరవానర సైన్యంతో రాముడు సముద్రాన్ని దాటాడు శుభ లక్షణుడు రాముడు సీత కొరకు లంకను అడ్డగించాడు. (ముట్టడి), తృతీయ నుండి దశమి వరకు ఎనిమిది రోజులు సైన్యనివేశము ఏకాదశి రోజున, శుకసారణులు అక్కడికి వచ్చారు. పౌషకృష్ణ ద్వాదశి రోజున సైన్యముల లెక్కింపు శార్దూలుడు వానరుల బలాబలముల వర్ణించాడు. త్రయోదశి నుండి అమా వరకు మూడు రోజులు లంకలో  రావణుడు సైన్యమును లెక్కించాడు. రణోత్సాహము చేశాడు. మాఘశుక్లం తొలి రోజున అంగదుడు రావణుని దగ్గర కెళ్ళాడు.

తా ॥ సీతకు ఆమె భర్త తలను (మాయతల) చూపారు. మాఘ శుక్ల ద్వితీయ నుండి ఏడు రోజులు అష్టమి వరకు రాక్షసులకు వానరులకు సంకుల సమరం జరిగింది. మాఘ శుక్ల నవమి యందు రాత్రి ఇంద్రజిత్తుతో యుద్ధంలో ఆతడు రామ లక్ష్మణులను నాగ పాశంతో బంధించాడు. కపీశులంతా వ్యాకులులు కాగా అందరు అన్ని విధముల చావగా రాముడు, వాయువు ఉపదేశంతో గరుడుని స్మరించాడు. నాగపాశ విమోక్షం కొరకు దశమి నాడు గరుడుడు వచ్చాడు: మాఘశుక్ల ఏకాదశిన రెండు రోజులు యుద్ధ విశ్రాంతి, ద్వాదశి రోజున ఆంజనేయుడు ధూమ్రాక్షుని చంపాడు ఆతడే త్రయోదశి రోజున కంచనుని చంపాడు. యుద్ధంలో రామునకు రావణుడు మాయాసీతను చూపి  అందరీని సైన్యమందున్న వారిని భయపెట్టాడు. మాఘ శుక్ల చతుర్దశి నుండి బహుళ పాడ్యమి వరకు మూడు రోజులలో ప్రహస్తుని, నీలుడు చంపాడు. మాఘకృష్ణ ద్వితీయ నుండి చతుర్థి వరకు మూడు రోజులు రామునితో జరిగిన ఘోర యుద్ధంలో రావణుడు యుద్ధభూమి నుండి పరుగెత్తాడు. వంచమి నుండి ఆష్టమి వరకు రావణుడు కుంభకరుని మేల్కొలిపాడు. ఆ పిదవ నాలుగు రోజులు ఆతడు భుజించాడు. నవమి మొదలు నాలుగు రోజులు కుంభకర్ణుడు యుద్ధం చేశాడు బహువానరుల భక్షించే రాక్షసుని రాముడు యుద్ధంలో చంపాడు (కుంభకర్ణుని) అమావాస్య దినమందు శోకవుతిండి, ఐంది ఫాల్గున ప్రతివద నుండి చతుర్థి వరకు నాల్గు రోజులు నరాంతకుడు మొదలుగా ఐదుగురు రాక్షసులు చంపబడ్డారు పంచమి నుండి సప్తమి వరకు మూడు రోజులలో అతికాయ వధ జరిగింది. అష్టమి నుండి ద్వాదశి వరకు ఐదు రోజులలో  నికుంభులు వీరిద్దరు చంపబడ్డారు. నాల్గు రోజులలో మకరాక్షుడు చంపబడ్డాడు. ఫాల్గున కృష్ణ ద్వితీయనాడు ఇంద్రజిత్తు జయించాడు. తృతీయ నుండి సప్తమి వరకు ఐదు రోజులు ఓషధి తేవాలనే వ్యగ్రత వలన యుద్ధ విరామము  దుర్బుద్ధి గల రావణుడు అష్టమినాడు మాయ మైధిలిని చంపాడు. శోకాధిక్యం వల్ల అప్పుడు రాముడు సైన్యమును జాగ్రత్త పరిచాడు  పిదప త్రయోదశి వరకు ఐదు రోజులలో యుద్ధంలో విఖ్యాత బల పౌరుషములు కల ఇంద్రజిత్తు లక్ష్మణునితో చంపబడ్డాడు.

  తా ॥ చతుర్ధశి యందు రావణుడు యుద్ధ విరామం నుండి దీక్షితుడైనాడు. అమావాస్య రోజున దశకంధరుడు యుద్ధమునకు వెళ్లాడు. చైత్రశుక్ల ప్రతి పదనుండి పంచమి వరకు ఐదు రోజులు రావణుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రాక్షసుల వధ ఎక్కువైంది చైత్ర శుక్ల అష్టమి వరకు స్యందన అశ్వముల సంహారము. చైత్ర శుక్ల నవమి యందు సౌమిత్రి శక్తి ఛేదించబడింది రాముడు కోపానికి రావణుని పరుగెత్తించాడు యుద్ధం నుండి. విభీషణుని ఉపదేశంతో హనుమంతుని యుద్ధము లక్ష్మణుని కొరకు ద్రోణ పర్వతం నుండి ఓషధిని తేవటానికి రావటం. విశల్యను తీసుకొని లక్ష్మణుని రక్షించటం దశమినాడు  రాత్రి రాక్షసులకు యుద్ధ విరామము ఏకాదశిన రామునకు రధము మరిమాతలి సారిది.  ద్వాదశిన యుద్ధానికి వచ్చాడు. బహుళ చతుర్దశి వరకు పదునెనిమిది రోజులు. రాముడు రావణుని ద్విరధ మందు చంపాడు  రావణాదులకు సంస్కారములు అమావాస్య రోజు జరిగాయి. యుద్ధము వరంగా జరిగాక రాముడు జయాన్ని పొందాడు మాఘ శుక్ల ద్వితీయ మొదలుకొని చైత్రకృష్ణ చతుర్దశి వరకు ఎనుబది ఏడు రోజులు, మధ్యలో పదునైదు రోజులు యుద్ధ విరామము, పోను డెబ్బది రెండు రోజులు యుద్ధం జరిగింది. వైశాఖం తొలిరోజున రాముడు రణభూమి యందున్నాడు. ద్వితీయనాడు లంకా రాజ్యమందు విభీషణుడు అభిషిక్తుడైనాడ  తృతీయన సీతాశుద్ధి దేవతల నుండి వర లాభము. అక్కడికి దశరథుని రాక, దానిని అంగీకరించటం లంకేశుని త్వరగా చంపి లక్ష్మణాగ్రజుడు విభువు రాముడు, రాక్షసునితో బాధింపబడ్డ, పుణ్యవతియైన జానికిని తీసుకొని రావటము వరమ ప్రీతితో జానకిని తోడుకొని రాముడు మరలాడు వైశాఖ చతుర్ధి రోజున రాముడు పుష్పక మెక్కాడు. ఆకాశమార్గం ద్వారా మరిలి తిరిగి అయోధ్య నగరాన్ని గూర్చి వచ్చాడు, పదునాల్గు సంవత్సరాలు సంపూర్తిగా నిండాక మాధవ పంచమి యందు భరద్వాజా శ్రమంలో రాముడు తన వారితో కూడి ఉవవిష్ణుడై నాడు. షష్ఠినాడు పుష్పకం ద్వారా నంది గ్రామానికి వచ్చాడు  రాముడు అయోధ్య యందు సప్తమి రోజు తిరిగి అభిషిక్తుడైనాడు. పదునాల్గు నెలల పది రోజుల కాలం సీత రాముడు లేకుండా రావణుని ఇంట్లో ఉంది. నలుబది రెండవ సంవత్సరమున రాముడు రాజ్యం చేశాడు అప్పుడు సీతకు ముప్పది మూడు సంవత్సరాలున్నాయి. ప్రభువు రాముడు పదునాల్గవ సంవత్సరం చివర తన నగరానికి వచ్చాడు  అయోధ్య నగరి ప్రవేశించి ముదితుడై రావణ దర్పహారి రాముడు తమ్ములతో కూడి రాజ్యపాలన చేశాడు  పదివేల నూర్ల సంవత్సరాలు రాముడు రాజ్యం పాలించే రాముడు త్రిదివాలయమునకు వెళ్ళాడు.

తా ॥ రాముడు రాజ్య పాలన చేయగా ప్రజలంతా (లోకములు) హర్షంతో నిండిన మనస్సు గల వారైనారు. నరులు ధనధాన్యములు, పుత్రపౌత్రులు గల వారైనారు. వరుణుడు అనుకున్నట్లు పర్షం కురిశాడు. పంటలు సమృద్ధిగా పండాయి. ఆవులు కుండల కొలది పాలిచ్చాయి. చెట్లు ఎల్లప్పుడు పండ్లతో నిండి ఉన్నాయి ఓ నరాధిప! రామ రాజ్యంలో ఆధి వ్యాధులు లేవు. స్త్రీలు పతివ్రతలుగా ఉన్నారు. నరులు పితృ భక్తి పరులైనారు  బ్రాహ్మణులు ఎల్లప్పుడు వేదవరులైనారు. క్షత్రియులు ద్విజ సేవనులైనారు. వైశ్యులు ఇతరులు ఎల్లప్పుడు బ్రాహ్మణుల యందు గోవుల యందు భక్తి గలవారైనారు యోని సంకరము గాని, ఆచార సంకరము గాని ఆక్కడ లేదు. వంధ్య దుర్భగ (గయ్యాళి) ఐన స్త్రీ , ఒకే సంతానం గల స్త్రీ (కాక వంధ్య) చచ్చిన సంతానం గల స్త్రీ లేరు. ఒక్క విధవ లేదు. భర్త గల స్త్రీ దుఃఖించేదీ కన్పించలేదు. మాతాపితరులను గురువును అవమానపరిచేవారు ఎవ్వరూ లేరు  పుణ్యాత్ముడెవ్వడూ వృద్దుల వాక్యాలను ఉల్లంఘించటం లేదు. భూమి హరణము లేదు. వరనారీ వరాజ్ముఖులే ఉన్నారు ప్రజలు అవవాదం వేసేనారు కాదు. దరిద్రులు రోగ గ్రస్తులు లేరు. దొంగలు, జూదకారులు, కల్లు అమ్మే వాళ్ళు పాపులు లేరు. బంగారు దొంగలు, బ్రాహ్మణ హంతకులు, గురుతల్పగులు లేరు. స్త్రీ హంతకులు, బాలహంతకులు, అబద్ధాలాడు వారు లేరు. వృత్తి లోపించేసేవారు, కూటసాక్షులు లేరు. శఠులు కృతఘ్నులు మలినులు కన్పించరు. వేద పారగులైన బ్రాహ్మణులు అంతటా ఎల్లప్పుడు పూజింపబడే వారు అతి ప్రసిద్ధమైన రామ రాజ్యంలో అవైష్ణవుడు లేడు ప్రతికాని వాడు లేడు రాజ్యపాలన చేస్తున్న ఆ రాముని పురోహితుడు వదతాం వరుడు వసిష్ఠుడు మునులతో పాటు అనేక తీర్థములు సేవించి బ్రహ్మపుత్రుడు, మహాభాగుడు ఐన వసిష్టుడు తపోనిధి వచ్చాడు. మునులతో కూడిన గురువును రాముడు పూజించాడు ఎదుర్కొని అర్ఘ్యపాద్యములిచ్చి మధువరాదుల పూజతో గౌరవించాడు. వసిష్ఠుడు, మునిపుంగవుడు రాముని కుశలమును అడిగాడు (104) రాజ్యమందు, అశ్వగజములు కోశ దేశములు, భ్రాతృభృత్యులు వీరందరు కుశలమేనా అని రాముని అడుగగా రాముడిట్లన్నాడు  రాముని వచనము - మీ అనుగ్రహంవల్ల ఎల్లప్పుడు అంతటా నాకీ వేళ కుశలమే. రాముడు వసిష్టుని ముని వుంగవుని కుశలమడిగాడు భార్యా పుత్రులతో కూడి నీవు అన్ని విధముల కుశలమే కదా అని. అతడు, అన్ని తీర్థముల గూర్చి అంతా చెప్పాడు  భూమి యందలి క్షేత్రములు, ఆలయాలు సేవించాము అని రామునకు చెప్పాడు అంతట క్షేమమే అని అప్పుడు రాజీవలోచనుడైన రాముడు విస్మయా విష్ణహృదయుడై తీర్థములన్నింటిలో ఉత్తమోత్తమమైన తీర్థమాహాత్మ్యమును చెప్పమని వసిష్ఠున్ని అడిగాడు  అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు రామచంద్ర వర్ణన మనునది ముప్పదవ అధ్యాయము.