స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

12వ అధ్యాయము

 తా ॥ వ్యానునివచనము ఓ నృప శ్రేష్ఠ! దేవతలు నత్యమందిరమును రక్షణకొరకు ఏర్పరచారు. అది మొదటిదే. ఆ నగరం పేరు స్థారకమైనట్టిదే తూర్పున ధర్మేశ్వరుని ఆలయము. దక్షిణముందు గణాధిపతి, వశ్చిమముందు సూర్యుడు స్థాపించబడ్డాడు. ఉత్తరమందు స్వయంభువుడు యుధిష్ఠిరుని వచనము - గణేశుని ఎవరు స్థాపించారు. ఎందుకు ఆతనిని స్థాపించారు. ఓ మహాభాగ! స్థాపించిన వాని పేరేమి. ఆలపించకుండా వాడు చెప్పండి. అనగా వ్యాస వచనము – ఇవ్వడు నీతునేను గజోత్పత్తి కారణమును చెప్తున్నాను.  ఆచారము వ్రతారము దేవతలు మాతలు అంత కలిశారు! ఓ మహారాజ ధర్మారణ్యమందు చండినుతుని స్థాపించారు.  ఓ నృపశ్రేష్ఠ! పత్యయేష కులభూమి యందు దేవతలు దీనిని నిర్మించారు. పతాకములు ధ్వజములతోనూ ప్రాకారము గూడా ఏర్పడింది.  ప్రాకార మండలముల మధ్య బ్రాహ్మణుల ఆయ తన మందు, వాని మధ్య ఇటుకలతో బాగా శోభిస్తున్న పీఠాన్ని రచించారు. శుద్ధమైన, తోరణములు గల వాలునా రాజ మార్గములు ఏర్పరచబడ్డాయి. పూర్వముందు ధర్మేశ్వరుడు దక్షిణమందు గణనాయకుడు పశ్చిమమందు భానువు ఉత్తరమందు వ్వయంభువును స్థాపించబడ్డారు. ధర్మేశ్వరోత్పత్తి వృత్తాంత కథను మీ ముందు చెప్పాను గణేశ ఉత్పత్తి హేతువును ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒకసారి పార్వతి శరీరమును వలుగుపిండి పెట్టుకోసాగింది.  అందువల్ల పుట్టిన, తన శరీరం నుండి వచ్చిన మలమును చూచి. దానిని చేత థరించి దానితో సురూపమైన ప్రతిమను చేసి చూసింది అందులో ప్రాణం పోసింది. అది ఆమె ఎదురుగా నిల్చుంది. అప్పుడు అతడు తల్లితో ఇట్లన్నాడు. మీ ఆజ్ఞతో నేనేం చేయాలి, అని పార్వతి వచనము - నేను స్నానం చేసే వరకు నీవు నా ద్వారమందుండు, అని వరకు మొదలుగా గల ఆయుధములన్నీ నా ద్వారమందు నీవుండగా తోడుంటాయి. ఎవరు విఘ్నం చేయరాదు అనగా మహాదేవి ఇట్ల పలుకగా ఆతడు సాయుధుడై ద్వారమందున్నాడు ఇంతలో దేవుడైన మహాదేవుడు వచ్చాడు. మహేశ్వరుడు లోపలికి ప్రవేశించటానికి మతిలో తలచాడు ద్వారమందున్న గణేశుడు ఆతనికి ప్రవేశాన్ని కల్గించలేదు. అప్పుడు కోపగించిన మహాదేవుడు, అతడు పరస్పరము యుద్ధము చేశారు యుద్ధముచేసి వారిద్దరు ఒకరినొకరు చంపదలిచారు. శివుని లలాటముందు పరమమైన దాని యందు పరశువుతో కొట్టాడు అప్పుడు మహాదేవుడు శూలమెత్తి కొట్టాడు. శూలంతో శిరస్సును ఛేదించాడు. ఆతల భూమి పై పడింది పడిపోయిన కొడుకును చూచి పార్వతి దుఃఖించింది. అప్పుడు అతడు అక్కడ పడగా పెద్ద హాహాకారమైంది.

తా ॥ వికలమైన పార్వతిని చూచి దేవ దేవుడైన మహేశ్వరుడు, దేవుడు తాను కూడా చింతించ సాగాడు. వ్యర్థంగా నేను ఎంత పని చేశాను అని ఇంతలో అక్కడ గజాసురుని చూచాడు. సర్వలోకైక పూజితుడు ఆ మహాదైత్యుణ్ణీ చూసి పార్వతిచేసిన ఆ పిల్ల వానిని తీసుకొని వాని శిరస్సుపై కొట్టాడు వాడు చచ్చాడు. ఆ మహాదేవుని సన్నిధి యందు ఆ గణవతి లేచాడు పిదప ఆతనికి గజాసురుడనే పేరును పెట్టాడు. దేవతలంతా కూడాను ఆనందించారు. మునులు కూడా హర్షించారు కుటుంబమునకు కుశలమును చేసే అతనిని స్తోత్రములతో ఎప్పుడూ స్తుతిస్తున్నారు. మోదకముల కొరకు అర్చకునకు తనకుటుంబమును అమ్ముకునే ఆ ఏకదంతుని, తెలిసిన వానిని, దక్షిణ రాజమార్గమందు పూజించి స్వయంభువుడు, దేవతల పూజనందిన మహాదేవుని అర్చించాడు  జడలుగలవాడు, వామనుడు, నాగము యజ్ఞోపవీతముగా గలవాడు. మూడు కన్నుల వాడు, మహాయమువాడు, రెండు చేతులలో గొడ్డలి గలవాడు చేత కమలమును ధరించినవాడు, సర్వ విఘ్నములను నశింపచే సేవాడు, లోకరక్షణ కొరకు నగరమునకు దక్షిణ దిక్కు నందున్నవాడు మవనన్నుడు, గణాధ్యక్షుడు, సిద్ధిబుద్దులతో నమస్కరింవబడేవాడు, సింధూరము వంటవాడు, దేవతాశ్రేషుడు తీవ్రమైన అంకుశము ధరించినవాడు, శుభుడు ఐన ఆతనిని అందరు నూరు పూలతో శుభమైన పూలతో అర్చించారు. అట్లా అర్చించబడ్డ వానివి, అమరాధివుడు మహాభక్తితో నమస్కరించాడు. ఏదవ ఆతనిని దేవతలు స్తుతించారు. దేవతల వచనము - సురేశునకు నమస్కారము, గణములకు వతియైన వానికి నమస్కారము. గజానన! నీకు నమస్కారము. మహాదేవునకు ఆది దైవతమైన వాడ భక్తికి ప్రీతి చెందేవాడ, దేవ, గణాధ్యక్ష నీకు నమస్కారము. ఈ విధమైన శుభమైన స్తోత్రములతో గణాధివుని స్తుతించగా, ఆనందించి గణాధ్యక్షుడు ఇట్లా వలికాడు గణాధ్యక్షుని వచనము - ఓ దేవతలార ! మీ విషయంలో నేను తుష్టుడనైనాను. మీ వాంఛితమేమిటో చెప్పండి. మీ వాంఛితాన్ని ఇస్తాను. అనగా దేవతలిట్లన్నారు - ఓ మహాభాగ! నీవిక్కడ ఉండి మా కార్యాన్ని నెరవేరు. ధర్మారణ్యమందునన వివ్రుల, వణిక్ జనుల బ్రహ్మచర్యాది యుక్తుల, ధార్మికుల, వర్ణాశ్రమేతరుల రక్షకుడవుగా ఎల్లప్పుడూ ఉండు, ఓ గణేశ్వర నీ అనుగ్రహం వల్ల ద్విజులు ధన సౌఖ్యయుతులై, ఓ మహాభాగ ఉండనీ మహాబలులైన వణిజులను అందరిని ఎప్పుడూ  నీవు రక్షించు ఓ దేవ! చంద్రుడు సూర్యుడు భూమి ఉన్నంత కాలము రక్షించు అని అనగా ఆ మహేశ్వరుడు గణనాథుడు అట్లాగే తానిమ్మని ఆతడు వలికాడు  దేవతలు ఆనందపడి గణాధివుని పూజించ సాగాడు. ఏదవ దేవతలు ఆనందపడి పుష్పము ధూపము మొదలగు తర్పణములతో  పూజించారు. లోకంలోని ఇతరులైన మనుజులు నిర్విఘ్నము కొరకు పూజించాలి వివాహ ఉత్పష యజ్ఞము లందు తొలుత ఈతనిని ఆరాధించాలి. ధర్మారజ్యో దృవులకు ఎల్లప్పుడూ ప్రసన్నుడవుకమ్ము అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మఖండ మందు పూర్వ భాగమందు గణేశ ప్రస్థావన వర్ణన మనునది పన్నెండవ అధ్యాయము.