స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

31వ అధ్యాయము

తా ॥ శ్రీ రాముడిట్లన్నాడుఓ విభు! మీరు ఏయే తీర్థములను సేవించారు. ఓ మానద! వీనిలో ఉత్తమ తీర్థమేదో దానిని గూర్చి నాకు చెప్పండి నేను సీతాహరణ సందర్భంలో బ్రహ్మ రాక్షసులను చంపాను. ఆ పాప విశుద్ధి కొరకు ఉత్తమోత్తమమైన తీర్థమును గూర్చి చెప్పండి అనగా వసిష్ఠులిట్లా అన్నారు - గంగ నర్మద, తాపి, యమున, సరస్వతి గండకి, గోమతి, పూర్ణ ఈ నదులు పరమ పావనమైనవి వీనిలో నర్మద శ్రేష్టమైనది, త్రిపథ గామిని గంగ ఓ రాఘవ! దర్శన మాత్రం చేతనే పాపములను అన్నిటిని కాల్చివేస్తుంది. చూడటం వల్ల నూరు జన్మల పాపము, వెళ్ళటం వల్ల, మూడు వందల జన్మల పాపము, స్నానం వల్ల వేయి జన్మల పావమును హరిస్తుంది. దేవానది. కలియుగంలో  నర్మదా తీరమును చేరి, శాకమూలములతో పండ్లతో ఒక బ్రాహ్మణునికి భోజనం పెడ్తే కోటి భోజనముల ఫలాన్ని పొందుతాడు.  గంగ, గంగ అని స్మరిస్తే నూర్ల యోజనముల దూరమందున్నను అన్ని పాపముల నుండి ముక్తుడై ఆతడు విష్ణు లోకమునకు వెళ్తాడు ఫాల్గుణమా సాంత మందు అమావాస్య యందు, అట్లాగే భాద్రపద కృష్ణ పక్షమందు గంగను చేరి స్నానము పితృ తర్పణము  ఆచరిస్తే పిండదాన మాచరిస్తే ఆతడు అక్షయఫలము పొందుతాడు. జ్యేష్ఠ / ఆషాఢ మాసము వచ్చాక బావి యందు స్నానమాచరించిన వారు  ఎనుబదినాలు విధములైన నరకములను చూడరు, ఓ మహారాజ! మహాపాతకులైన ఓ రామ! తపతి నదిని స్మరించగానే నవ గోత్రములను ఉద్ధరిస్తారు. నూటొక్క కులమును ఉద్ధరిస్తారు. యమున నది యందు నరుడు స్నానం చేసి సర్వ పాపముల నుండి ముక్తుడౌతాడు మహాపాతక యుతుడైన ఆతడు కూడా ఉత్తమ గతిని పొందుతాడు. కార్తిక మాసం కృత్తిక నక్షత్ర యోగ మందు నరస్వతీ నది యందు స్నాన మాచరించాలి.  ఆతడు గరుడుని అధిరోహించి, దేవతలతో స్తుతింపబడుతు వెళ్తాడు. కార్తిక మాసమందు తూర్పు ముఖమైన సరస్వతి యందు స్నానంచేసి ప్రాచి యందలి మాధవుని స్తుతిస్తే ఆతడు ఉత్తమ గతిని చేరుకుంటాడు. గండకి పుణ్య తీర్థమందు స్నానం చేసిన నరుడు శాలగ్రామ శిలను పూజిస్తే ఆతడు తిరిగి తల్లి పాలు తాగువాడు (జన్మ కాడు. కృష్ణుని సన్నిధి యందు గోమతి నది జలములందు స్నానమాచరించాలి నరుడు చతుర్భుజుడై చిరకాలము వైకుంఠ మందు ఆనందిస్తాడు. చర్మణ్వతికి నమస్కరించి ఆనీటిని స్పృశించిన నరుడు పూర్వజులైన దశవూర్వులను దశవరులను తరింపచేస్తాడు. రెంటి సంగమమును చూచి లేదా సాగర ధ్వనిని విన్ననరుడు  పదివేల బ్రహ్మహత్యల పాతకియైన పవిత్రుడై ఉత్తమ గతికి చేరుకుంటాడు. మాఘ మాసమందు ప్రయాగ యందు మజ్జన మాచరించిన నరుడు ఈ లోకమందు సుఖమనుభవించి, చివర విష్ణు పదమును చేరుతాడు. ప్రభాస తీర్థమందు నరులు మూడు రాత్రులు బ్రహ్మచారులుగా ఉంటే ఓ రామ!

 తా ॥ అట్టి నరులు యమలోకమును, కుంభీ పాకాది నరకమును చూడరు. నైమిశారణ్య వాసియైన నరుడు దేవత్వాన్ని పొందుతాడు  అది దేవతలకు ఆలయం కనుక. అదే, భూమి యందు దుర్లభము. ఓ రామ! కురుక్షేత్ర మందు చంద్ర సూర్య గ్రహణమందు నరుడు  హేమము దానం చేస్తే ఓ రాజేంద్ర ! ఆతడు తిరిగి త్తనపాయి (శిశుజన్మనెత్తడు) కాడు శ్రీస్థలము దర్శనమాచరించిన నరుడు పాపముల నుండి ముక్తుడౌతాడు.  అన్ని దుఃఖములు నాశనవే విషు లోకమందు ప్రకాశిస్తాడు. ఓ రాఘవ! ఈ భూమి యందు నరుడు భూమి నీ గోవును పూజ్యభావంతో స్పృశిస్తే అన్ని కోరికలను తీర్చే ఋషి లోకమునకు ఆ నరుడు వెళ్లారు. వైశాఖ మాసమందు ఉజ్జయిని యందు శివైనది యందు స్నానమాచరించాలి ఆతడు తన పూర్వులకు వేలకొలది మందికి ఖారమైనదౌరవ నరకం నుండి విముక్తిని కళిస్తాడు. ఓ రామ నరుడు మూడు రోజులు సింధు నదిలో స్నానం చేస్తే  ఆతడు సర్వపాపముల నుండి విముక్తుడైలాస మందు ఆనందమందుతాడు. కోటి తీర్థమందు నరుడు స్నానంచేసి, కోటీశ్వరుడైన శివుని చూచిన నరుడు  ఎప్పుడూ బ్రహ్మహత్యాది పావములతో తాకబడడు మహా అయోధ్య యందు తిరిగే జ్ఞానహీనమైన జంతువులు కూడా  విష్ణు పాదోద్భవమైన గంగా జలం తాగితే పావములన్నింటి నుండి ముక్తమౌతాయి. శుభమైన సూర్యోదయమందు వేదవతి యందు స్నానం చేసిన నరుడు  రోగములన్నింటి నుండి ముక్తుడౌతాడు. వరమై ననుఖమును పొందుతాడు. ఓ రామ! అంతట తీర్థములు స్నానపానములతో మునకలతో  మనుష్యుల పావములను అవలీలగా నశింపచేస్తాయి. తీర్ఘములన్నింటిలో ఉత్తమ తీర్థము ధర్మారణ్యమని అన్నారు. బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు వారితో పూర్వం మొదట స్థాపించబడింది. అన్ని అరణ్యములకు అన్ని తీర్థములకు విశిష్టమైంది భుక్తి ముక్తులనిచ్పేదీ ధర్మారణ్యము కన్న ఉత్తమమైనది లేదు. ధర్మారణ్యమందున్న వారిని స్వర్గమందు దేవతలు ప్రశంసిస్తారు  వారు పుణ్యులు వారు వుణ్యం చేసిన వారు, కలిలో ధర్మారణ్యమందు అన్ని పాపముల నశింప చేసే ఆ స్థలమందు నివసించిన నరులు, ఓ రామదేవl  బ్రహ్మ హత్యాది పావములు, అన్ని దొంగతనముల పాపములు, వరదార ప్రసంగాదులు, అభ్యభక్షణాదులు  అగమ్య గమనాదులు, అస్పర్శస్పర్శ వాదులు ఇవన్ని ధర్మారణ్యమందు మునగటం వల్ల లోతులకు (పాపములు) నాశనమౌతాయి.  బ్రహమ్నుడు, కృతన్నుడు బాలన్నుడు. అబద్ధమాడు వాడు, స్త్రీలను గోవులను చంపువాడు గ్రామనాశరుడు వీరంతా ధర్మారణ్యమందు పాప విముక్తులౌతారు  పాపులైన ప్రాణులకు ఈ భువియందు ఇంతకన్న పవిత్రమైనది లేదు. స్వర్గమును, కీర్తిని, ఆయుస్సును, వాంఛితమైన కోరికలను ఇచ్చేది శుభమైనది  కొములకు కోరికలనిచ్చేది. యతులకు ముక్తినిచ్చే క్షేత్రము. సిద్ధులు సిద్ధినిచ్చేదని ప్రతి యుగంలో ధర్మారణ్యము చెప్పబడింది.

మూ ॥ బ్రహ్మోవాచ -

బ్రహ్మవచనము - వసిష్ఠుని వచనమును విని ధర్మాచరణులలో శ్రేష్ఠుడైన రాముడు హృదయానంద కారకమైన చాలా ఆనందాన్ని పొంది(39) వికసించిన హృదయం గల రాముడు, శరీరం, గగుర్పొడువగా శుభవ్రతుడు రాముడు ధర్మారణ్యమునకు వెళ్ళుటకు తలచాడు (40) అక్కడ పురుగులు పక్షులు మొదలగునవి మనుష్యులు, పశువులు మూడు రాత్రులు సేవిస్తే అన్ని పాపముల నుండి ముక్తులౌతారు (41) కుశస్థలము, కాశి, శూలపాణి, భైరవుడు వీరెట్లా ముక్తి నిచ్చేవారో అట్లాగే ధర్మారణ్యము ఉత్తమమైనది, ఓ రామ! (42) ఆ పిదప మహేష్వాసుడు రాముడు చాలా ఆనందం పొందినవాడై నీతతో తమ్ములతో కూడి తీర్థయాత్రకై బయలుదేరాడు (43) అప్పుడు రాముని కవీశ్వరుడు హనుమంతుడు అనుసరించారు ఆనందంతో కౌసల్య సుమిత్ర కైకేయి (44) లక్షణోపేతుడైన లక్ష్మణుడు మహామతి భరతుడు, సైన్యంతో శత్రుఘ్నుడు, అయోధ్యావాసులు (45) ప్రకృతులు (పౌరులు) ధర్మారణ్యమునకై బయలుదేరారు, ఓ నరవ్యాఘ్రు! పరమానందంతో కూడిన వారై అవ్వడు రాముని వారు అనుసరించారు (48) రాజు తీర్థయాత్ర విధిని అనుసరించుటకు గృహము నుండి బయలుదేరాడు. రాజు స్వతులమునకు ఆచార్యుడైన వసిష్ఠునితో ఇట్లా అన్నాడు (47) శ్రీ రాముని వచనము - ఇది గొప్ప ఆశ్చర్యము. ద్వారక యందు మొదట ఏం జరిగింది. ఎంత కాలానికిది నంభవించిందో, వసిష్ఠుడ! నాకు చెప్ప (48) వసిష్ఠుని వచనము - ఓ మహారాజ! ఎంత కాలమునకు ఇది ఏర్పడిందో నాకు తెలియదు. లోమశకుడు, జాంబవంతుడు కారణాన్ని తెలుసుకొని ఉంటారు. (49) నానా జన్మాంతరములందు చేసిన పాపము శరీర మందు ఏదుందో వాటన్నిటికి ఈ క్షేత్రము ఉత్తమ ప్రాయశ్చిత్తము అని అన్నారు (50) అనే వసిష్టుని మాటను విని జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైన రాముడు తీర్థయాత్రకు బయలుదేరుటకు స్థిరనిశ్చయం కలవాడై ఇక యాత్రా విధిని ఆచరించాడు. (51) వసిష్టుని ముందుంచుకొని మహామండల నృవులను ముందుండేట్లు ఏర్పరచి ఉత్తర దిక్కుగా బయల్దేరాడు (52) వృష్ఠుని ముందుంచుకొని వశ్చిమ దిక్కుగా బయల్దేరాడు. గ్రామము నుండి గ్రామానికి దాటుతూ దేశము నుండి దేశానికి, వనం నుండి మరోవనానికి దాటుతూ (53) అన్నిటిని వదలి రాముడు సైన్యంతో కూడి, పరిజనంతో కూడి బయలుదేరాడు. ఏనుగులు, గుర్థములు వేల కొలది రథములు బండ్లు కోట్ల కొలది (54) లెక్కలేనన్ని పల్లకీలు వీటితో అప్పుడు రాముడు బయల్దేరాడు. గజము నధిరోహించి, అనేకములైన మిత్ర దేశములను చూస్తూ (55) తెల్లని గొడుగు, శుభమైన చామరములు కలిగి, జనము వీస్తుండగా రాముడక్కడికి వెళ్ళాడు (56) నృత్య గీతములతో కూడిన భయంకరమైన వాదిత్రముల ధ్వనితో నూతులు పోగడ్తుండగా ఆనందంతో రాముడు వెళ్ళాడు (57) పది రోజుల నాటికి ఉత్తమమైన ధర్మారణ్యానికి రాముడు వచ్చాడు. దగ్గర్లోనే రాముడు గుండ్రంగా ఉన్న నగరాన్ని చూచి (58)

అక్కడ నిలబడి సైన్యంతో కూడి ఆ రాత్రి ఆ నగరంలో గడిపాడు. ఆ క్షేత్రము నిర్జనమైనదని విని, భయానకంగా ఉన్నదాన్ని చూచాడు (59) అక్కడ నివసించాడు. వ్యాఘ్ర సింహములతో నిండిందని, యక్ష రాక్షసులున్నారని జనుల వలన రాముడు విన్నాడు. ధర్మారణ్యమను పేరుగల అరణ్యమిది. దానిని వీని రాముడు చింతించకండి అని (60) అక్కడున్న వణిజులకు. శూరులకు, తమతమ పనులలో సమర్థులైన వారికి చెప్పాడు (61) సమర్ధులు గొప్ప శరీరం కలవారు మహా బల పరాక్రమ వంతులు ఐనవారిని అందరిని సమావేశ పరచి ఆ సమయంలో ఇట్లా రాముడు వారితో అన్నాడు (62) బంగారుతో చేసిన నా పల్లకిని తొందరగా ఆలసించ కుండా మోయండి. ఒక్క క్షణ కాలంలో నేను ధర్మారణ్యం చేరేట్టు చేయండి. (63) అక్కడ స్నానం చేసి, సానం చేస్తే అన్ని పాపముల నుండి ముక్తుణ్ణౌతాను. ఈ విధముగా వణిజులందరు రామునితో ప్రేరేపింపబడి (64) అట్లాగే కానిమ్మని వారంతా ఆ పల్లకిని అప్పుడు మోశారు. సైనికులతో రాముడు క్షేత్ర మధ్యంలోకి ప్రవేశించగానే (65) ఆతని పల్లకి ‘యొక్క నడక మందగించింది, ఓ భారత, వాద్యముల ధ్వని మందగించింది. ఏనుగులు మందగమనలైనాయి (66) గుఱ్ఱములు అట్లాగే ఐనాయి. రాముడాశ్చర్య పడ్డాడు. వినయంతో రామడు ముని పుంగవుడు గురువు ఐన వసిష్ఠునడిగాడు (67) ఓ మునీశ్వర! నా మనసులో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ ఇట్లా మందగమనం కలవిగా ఎందుకైనాయి. త్రికాలజ్ఞుడైన ముని ధర్మక్షేత్రమునకు వచ్చిన రామునితో ఇట్లా అన్నాడు. (68) ఓ రామ! పురాతన తీర్థమందు పాదచారుడవై వెళ్ళిన, ఆ పిదప సైన్యమునకు సుఖం కలుగుతుంది (69) పిదప రాముడు పాదచారియై సైన్యంతో కూడిన వాడై నరమభావనుడై మధువాసక మనుగ్రామానికి వచ్చాడు (70) గురువు చెప్పిన పద్ధతిలో మాతృ పూజ చేశాడు. నానా విధములైన అనేక రకముల ఉవహారములతో ప్రతిష్ఠానిధి పూర్వకముగా పూజించాడు (71) పిదప రాముడ తటముందు హరి క్షేత్రమును చూచి ఆ ప్రదేశములు అన్ని విధముల యజ్ఞ యోగ్యములని భావించి (72) రఘూధ్వహుడు రాముడు తనను కృతకృత్యునిగా భావించాడు. సువర్ణాక్ష ఉత్తరతట మందు ధర్మస్థానమును చూచి (73) సైన్య సమూహము నుండి దిగి క్షేత్ర మధ్యమందు తిరిగాడు. అక్కడ అన్ని తీర్థములందు దేవాలయములందు (74) రాముడు శాస్త్ర ప్రకారం చెప్పిన కర్మలను వీధి ప్రకారం ఆచరించాడు. మిక్కిలి శ్రద్ధ కలవాడై విధి ప్రకారము శ్రాద్ధము చేశాడు (75) రామేశుని స్థాపించాడు. తిరిగి కామేశ్వరుని స్థాపించాడు. ఆ స్థానం నుండి వాయు ప్రదేశ మందు సువర్ణ ఉభయ తటములందు (76) ఈ విధముగా స్థాపించి దశరథాత్మజుడు రాముడు కృతకృత్యుడైనాడు. అన్ని విధులను చేసి సభ యందు కూర్చున్నాడు. (77) ఆ రఘునందనుడు ఆ రాత్రి ఆ నదీ తీరమందు నిద్రపోయాడు. పిదప అర్థరాత్రి అయ్యాక రాజీవలోచనుడు రాముడు (78) మేల్కొని అప్పుడు ఏకాకియైన ధర్మవతలుడైన రాముడు ఆ క్షణ కాలమందు రాముడు స్త్రీ రోదనమును విన్నాడు (79) అర్ధరాత్రి దీనమైన వచనములతో లేడిపిల్లవలె ఏడుస్తున్న ధ్వని విన్నాడు. రాముడు చాలా తొందరగా చారులతో ఆమెను వెతికించాడు. (80) కరుణమైన స్వరముతో ఏడుస్తున్న అతి విహ్వలయైన ఆ స్త్రీని చూచారు. రాముని దూతలు ఏడుస్తున్న ఆమెను అడిగారు. (81) దూతల వచనము - ఓ సుభగే! నీవెవరు. దేవతా స్త్రీవా, కాక రాక్షస స్త్రీవా ఎవ్వనిచే భయ పెట్టబడ్డావు. నీ ధనాన్ని ఎవరెత్తుకెళ్ళారు. (82) వికలపై దారుణ శబ్దములను మాటి మాటికి చేస్తున్నావు. రాజైన రాముడడుగుతున్నాడు. ఉన్నదున్నట్లుగా చెప్పు అనగా ఆమె అంది. ఓ దూతలార! మీ స్వామిని నా దగ్గరకు పంపండి. నేను నా మానస మందలి దుఃఖమును శాంతి కొరకు ఆతనికి నివేదిస్తాను (84) అట్లాగే అని పలికి ఆ పిదప దూతలు రాముని దగ్గరకు వచ్చి ఇట్లన్నారు. (85) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు పూర్వభాగ మందు ధరారణ్య మాహాత్మ్య మందు దూతల రాక అనునది ముప్పది ఒకటవ అధ్యాయము.