స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
11వ అధ్యాయము
తా ॥ యుధిష్ఠిరుని వచనము - ద్విజసత్తమ! ఆ తరువాత ఏం జరిగిందో చెప్పండి. మీ వచనా మృతమును తాగినాక, నోరు తృప్తి కలగలేదు ఓ ప్రభు అనగా వ్యాసుని వచనము – కొఃత కాలం గడిచాక యుగాంత నమయం కాగా త్రేతాయుగం ఆదియందు లోల జిహ్వాకుడను రాక్షసుడు వుంటాడు. వానితో పచారపరమైన ముల్లోకమంతా భయ పెట్టబడింది. అతడు అన్ని లోకములను జయించి ధరారణ్యమునకు వచ్చాడు. పుణ్యమైన రమ్యమైనదాన్నంతాచూచి, బ్రాహ్మణులున్నదానిని చూచిబ్రహ్మద్వేషంవల్ల శుభమైన నగరాన్ని తగులబెట్టాడు. పట్టణం తగలబడి పోతోంటే చూచి బ్రాహ్మణులంతా నష్ట పోయారు.అ ధర్మారణ్యముందున్న వారు వచ్చిన చోటికి వెళ్ళారు. అప్పుడు శ్రీవూతాదులైన దేవతలను రాక్షసుడుతోపగించాడు. శబ్దముతోనే భయపెడూ రాక్షసుని బాధిస్తూనే ఉన్నారు. అప్పుడు ఆ దేవతలు నూర్లకొలది వేలకొలది కూడి, త్రిశూలములు ధరించి, శంఖము చక్రము గదలు ధరించి కమండలులు ధరించి, కొందరు, కొరడ,ఖడ్గములు ధరించి, ఒకరు పాశాంకు శములు ధరించి, మరొకరు ఖడ్గడాలువులు ధరించి ఒక పరచవు ధరించి, ఇందీవ్య ఆయుధమును ధరించి, రకరకాల ఆభరణములతో భూషణములతోకూడి, రకరకాల రత్నములలో శోధిస్తూ రాక్షసుల నాశనం కొరకు, బ్రాహ్మణుల హితం కొరకు, లోలజిహ్వడను రాక్షసుడున్న చోటికి వారు వచ్చారు. మహాదంష్ట్రలు, మహాశాయము, విద్యుత్ ఉహ్వము, భయంకర రూపముగల రాక్షసుడు వారిని చూచి సింహవాదము చేశాడు. ఆ గొప్ప ధ్వనితో ముల్లోకములు భయపడ్డాయి. ఆ శబ్దం దీక్కుల నిండా నిండిపోయింది. అనేక సముద్రములు క్షోభించాయి. ఓ కృప! అప్పుడు ధర్మారణ్య మందు పెద్ద కోలాహలమైంది. దానిని చూచివానవుడునల కూబరుని పంపాడు. ఓ నలకూబర! నీవువెళ్ళి అదేమిటో చూడు, చూసి నాకు చెప్పు. ఆతని మాటను విని నలకూబరుడు వెళ్ళాడు. అక్కడ శ్రీమాత లోల జిహ్వులకు జరిగిన మహా యుద్ధమును చూచి, జరిగింది జరిగినట్టు, చూచింది చూచినటు ఇంద్రుని ఎదురుగా అతడు చెప్పాడు.
తా ॥ ఇక్కడి నుండి ధర్మారణ్యమునకు వెళ్ళి ముల్లోకములను బాధిస్తున్నాడు. దానిని విని ఇంద్రుడు విష్ణువునకు నివే దించ భూమికి వచ్చాడు. రమ్యమైన నగరం తగులబెట్టబడింది. దేవతలకూ దుర్లభమైంది ఆ నగరము. అక్కడ బ్రాహ్మణులు లేరు. వారంతా పది దిక్కులకు పోయారు. శ్రీ మాత యోగిని అక్కడ యుద్ధాన్ని చేస్తోంది. ప్రజలంతా హాహాకారం చేస్తూ ఇటు అటు వరుగెత్తుతున్నారు దానిని విని వాసుదేవుడు సుదర్శవాన్ని గ్రహించి సత్యలోకం నుండి అప్పుడు భూలోకానికి వచ్చాడు పిదప ధర్మారణ్యమునకు వచ్చి అ చక్రమును వదిలాడు. అప్పుడు ఆ లోలజిహ్వుడు మూర్ఛ పోయి వడిపోయాడు. త్రిశూలంతో శక్తులు భిన్నం చేయగా క్రోధమూరితుడై కొట్టబడుతూ రాక్షసుడు ప్రాణములు వదిలి స్వర్గమునకు వెళ్ళాడు. అప్పుడు దేవతలు గంధర్వులు హర నిర్బరమానములై సత్యలోకం నుండి వచ్చి జగన్నాధుని స్తుతించారు. చనిపోయిన రాక్షసుని చూచి విష్ణువు ఇట్లా అన్నాడు. ఋషుల ఆశ్రమములలోని ఆ బ్రాహ్మణులందరు ఎక్కడున్నారు. పిదప దేవతలు గంధర్వులు ఇటు నటు పరుగెత్తిన బ్రాహ్మణులను త్వరగా శోధించి ఇట్లా పలికారు. ఓ విప్రులార! మా మాట వినండి. రాక సాధముడు చంపబడ్డాడు. దేవుడైన వాసుదేవుని చక్రంతో చంపబడ్డాడు దానిని బ్రాహ్మణులందరు ఆనందంతో వికసించిన కళ్ళు గలవారై అప్పుడు వారుతిరిగి వచ్చారు. ఓ రాజ! తమతమ స్థానము లందు ఉన్నారు. అప్పుడు ఓ రాజా! మనోహరమైన వాక్యము శ్రీ కాంతునితో అన్నారు. ఓ జగత్ర్పభు, నీవు సత్యలోకం నుండి వచ్చి, బ్రాహ్మణుల క్షేమం కొరకులవట దాన్ని తిరిగి స్థాపించావు. ఇది సత్య మందిరమని లోకంలో ప్రసిద్ధమౌతుంది. కృతయుగ మందు ధర్మారణ్యము త్రేతా యుగమందు సత్య మందిరము అని దానిని విని వాసుదేవుడు అట్లాగేతాని అని అన్నాడు. పిదప బ్రాహ్మణులందరు వుత్ర పౌత్ర నమన్వితులై భార్యలతో, అనుచరులతో కూడి పూర్వం మాదిరిగా నివసించారు. తను యజ్ఞము మొదలగు క్రియలలో, అధ్యయనాదులందు ఉన్నారు. ధర్మ సత్య మందిర మందలి విషయాన్ని అంతా చెప్పాను. అని శ్రీ స్కాంద మహాపురాణముందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు ధర్మారణ్య మాహాత్మ్యమందు లోలజిహ్వడను రాక్షసుని చంపటము వెుదలుగా సత్యమందిర సంస్థావన వర్ణనమనునది పదకొండవ అధ్యాయము.
