స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

19వ అధ్యాయము

తా ॥ వ్యాసుని వచనము - నరుడు ఇంద్ర వరంలో స్నానం చేసి ఇంద్రేశ్వర శివుని చూచిన ఏడు జన్మల నుండి చేసిన పాపము నుండి ముక్తుడౌతాడు. అనుమానము లేదు యధిష్ఠిరుని వచనము - సర్వోత్తమోత్తమమైన ఆ తీర్థమును తొలుత ఎవరు నిర్మించారు. ఓ భగవాన్! ద్విజసత్తమ మీరు నాకు ఉన్నదున్నట్లుగా చెప్పండి. వ్యాసుని వచనము - ఇంద్రుడే సుదుష్కరమైన తపమాచరించాడు, ఓ మహారాజ! గ్రామమునకు ఉత్తర దిగ్భాగంలో నూరు సంవత్సరాలు శివుని ఉద్దేశించి ఒక కాలిబొటన వేలి మీద నిలబడి మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆ మహాతేజడు చేతులు పైకెత్తి సూర్యునకు అభిముఖుడైచేశాడు వృతాసురుని చంపటం వల్ల వచ్చిన పావనివృత్తి కొరకు, ఏకాగ్రమనస్కుడై పరిశుద్ధుడై శివుని ఆరాధనలో ఆసక్తుడైనాడు శశిరేఖరుడు, శంభువు ఆ తపస్సుతో అప్పుడు సంతుష్టుడైనాడు. అక్కడికి జటిలుడు (జడలుగల) భస్మము ధరించిన వాడు, వృషభధ్వజడు, ఖట్వాంగుడు, వంచత్రుడుపదిచేతులుకలవాడు, త్రిలోచనుడు, గంగాధరుడు, వృషారూఢుడు, భూతప్రేతాదులతో చుట్టబడిన వాడు సుప్రసన్నడు, సురశ్రేష్ఠుడు, కృపాళువు, వరదాయకుడు వచ్చాడు. సంతోషించిన ఆ దేవుడు దేవేంద్రునితో ఇట్లా అన్నాడు   హరుని వచనము- ఓ దేవ! నీవు యచించేదానివి వేను నీకిస్తాను. ఇంద్రుని వచనము - ఓ కృపాసింధు! మహేశ్వర దేవ, నీవు సంతోషిస్తే నన్ను ప్రతిరోజు బ్రహ్మహత్య బాధ పెడుతోంది వృతాసురుని చంపటం వల్ల వచ్చిన పాపమును ఎవ్వడూ వాడు దుఃఖం కల్గించే దాన్ని నశింపచేయి, ఓ విభు! హరుని వచనము - సురవతి! ధర్మారణ్యంలో బ్రహ్మహత్య పీడించదు. ఆవులను, బ్రాహ్మణులను, పిల్లలను, స్త్రీలను వీరిని చంపిన పాపము పీడించదు  ఓ దేవేంద్ర! నా మాట వలన బ్రహ్మ కేశవుల ! మాటల వలన యముని మాట వలన ఓ జిష్ణు హత్య ఇక్కడ ఉండదు. ఓ మహారాజ! నీవు ప్రవేశించి ఇక్కడ స్నానమాచరించు అనగా ఇంద్రుని వచనము - ఓ కృపాసింధు, మహేశ్వర, నీవు నా విషయమందు తుష్ఠుడవైతే, ఓ మహాదేవ! శంకర, నా పేరుతో స్థాపించబడి ఉండు  ఆ మహాదేవుడు అట్లాగే కాని అని పలికి సుప్రసన్నుడైన హరుడు, అక్కడే పాపప్రణాశకమైన లింగ రూపాన్ని చూపించాడు తాబేలుడి నుండి పుట్టించి శంభువు ఆత్మ యోగముతో అక్కడే ఉన్నాడు, శ్రీకంఠుడు, అని కాలత్రయ విదులు అన్నారు.

తా ॥ మృత్రుని హత్యతో బాగా భయపడిన దేవరాజు నన్నిధిలో ఇంద్రేశ్వరుడు అప్పుడు అక్కడ ధర్మారణ్యంలో ఉన్నాడు, ఓ నృవ!  సర్వపాపముల నుండి విశుద్ధి కొరకు, లోకములకు మేలు చేసే కొరకు ఉన్నాడు. ఓ రాజేంద్ర ఇంద్రేశ్వరుని ఎల్లప్పుడు పుష్ప ధూపాదులతో భక్తితో పూజించిన నరుడు సర్వ పాపముల నుండి ముక్తుడౌతాడు. అష్టమి యందు, చతుర్ధశి యందు విశేషించి మనువమందు సర్వ పాపముల నుండి విశుద్ధి కొరకు పూజిస్తే శివ లోకంలో వెలిగిపోతాడు. ఆతని ఎదుట జలతర్పణము చేసిన నరుడు సప్త గోత్రములను ఉద్ధరిస్తాడు, కులములో నూటొక్క మందిని ఉద్ధరిస్తాడు. చతుర్థశి యందు అంగములలో ఏవో రుద్ర జపము చేసినవారు సర్వ పాపముల నుండి విడుదులై పరమ పదాన్ని పొందుతారు బంగారు కన్ను చేవ మధ్యలో ఒకరాయి పెట్టి, దానిని ఉత్తమమైన ఇంద్రతీర్థంలో బ్రాహ్మణులకు దానం చేసినవారికి అరవై జన్మల పరకు గుడ్డి తనము రాదు. వారి కళ్ళలో ఎప్పుడూ నిర్మలత్వం ఉంటుంది. ఆతని ఎదుట స్నానం చేయగానే మహారోగములు అట్లాగే ఇతరమైనవి తొలగిపోతాయి  ఏకాగ్రచిత్తంతో పూజిస్తే అన్ని రోగముల నుండి ముక్తుడౌతాడు. నరుడు కుండంలో స్నానం చేసి పితరులకు తర్పణ చేస్తే ఆతని పితరులు, ఎదుహలు, ఎల్లప్పుడూ తృపులౌతారు, ఓ భూవ! మహారోగములతో కుష్ఠాదులతో వీడింపబడి ప్రాణులు స్నానమాత్రంతో శుద్రులై వారు దివ్యదేహం కలవారౌతారు. జ్వరాది కష్టములను పొందిన నరులు తను హితము కొరకు  స్నానం చేస్తే చేసినంత మాత్రంలో సంసిద్ధులైనారు. దివ్యదేహం కలవారౌతారు. స్నానం చేసి దేవుని పూజిస్తే జ్వర బంధనం నుండి ముక్తులౌతారు ఒకరోజు జ్వరము రెండు రోజుల జ్వరము, నాల్గు రోజుల కొచ్చే జ్వరము, మూడు రోజుల కొచ్చే జ్వరము, విషమ జ్వరపీడ, మసజ్వరము, వక్షజ్వరము ఇవన్నీ ఇంద్రేశ్వరుని ప్రసాదం వల్ల నశిస్తాయి. అనుమానం లేదు. జ్వరం లేని వాడౌతాడు. నిశ్చయము, ఓ భూపతి! సశ్యము ఇది సత్యము వంధ్య, దుర్భగ, తాళవంధ్య, మృతవ్రజ, మృతవత్స, మహాదున ఇట్టి స్త్రీలు శివుని ఎదుట ఈ కుండమందు స్నానం చేసి, ఏకాగ్ర చిత్తంతో పూజించాలి. స్నాన మాత్రంతో శుద్ధులౌతారు.ఇటువంటి అనేక విధములైన వరములను ఇచ్చి, పినాకధారి, సురాసురులతో సేవించబడుతూ ఆతడు న్వపురమునకు వెళ్ళాడు, ఓ పార్థ! మహా తేజస్సు గల శక్రుడు పిదప తన పురమునకు వెళ్ళాడు. జయంతుడు కూడా అక్కడ ఉత్తమమైన లింగాన్నీ స్థాపించాడు  హరుడు జయంతుని పూజకు తుష్టుడైనాడు. ఆలింగమును సదా స్తుతించాడు జయంతుడు, మరేశ్వరుడు త్రికాలమందు వుత్రునితో కూడిన వాడై పూజించే కొరకు వస్తాడు ఓ మహాబాహు! తన స్థానమును వదలి వచ్చి పూజిస్తాడు. సర్వ సౌఖ్య ప్రదాయకమైన ఇదంతా చెప్పాను ఇంద్రేశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో జయంతుని పూజిస్తే కూడా అంత వుణ్యమే వస్తుంది, ఓ రాజేంద్రా! ఇది సత్యము, సత్యము అనుమానము లేదు ఓ మహారాజ! కుండమందు. స్నానం చేసి, ఏకాగ్రమానమడి పూజించి, సర్వపాపముల నుండి విశుద్ధమైన ఆత్మ కలవాడై ఇంద్ర లోకంలో వెలుగొందుతాడు. భక్తితో దీనిని విన్న నరుడు సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. సర్వకామములను పొందుతాడు. జయంతేశుని అనుగ్రహం వల్ల అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు ఇంద్రేశ్వర జయంతేశ్వర మహిమ వర్ణన మనునది పందొమ్మిదవ అధ్యాయము.