స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము
5వ అధ్యాయము
వ్యాసుని వచనము - ఇక ముందు ధర్మారణ్య మందు నివసించే వారు, గార్హస్త్య మనుసరించే పురుషులు ఏమాచరించాలో దానిని చెప్తాను (1) ధర్మారణ్య మందు పుట్టిన శుద్ధ వంశజులైన బ్రాహ్మణులు పదునెనిమిది వేలు, కాజేశులతో నిర్మింపబడ్డ వాళ్ళు (2) సదాచారులు, పవిత్రులు, బ్రాహ్మణులు, బ్రహ్మవిత్తములు, వారిని దర్శించినంతలో మహా పాపముల నుండి ముక్తులౌతారు (3) యుధిష్ఠురుని వచనము - ఓ పారాశర్య! ప్రభు సదాచారమంటే ఏమిటో వాడు చెప్పండి. ఆచారము నుండి ధర్మం లభిస్తుంది. ఆచారము నుండి ఫలితాన్ని పొందుతారు. ఆచారం వల్ల శ్రీని పొందుతారు. కనుక ఆ ఆచారమంటే ఏమిటో నాకు చెప్పండి. (4) వ్యాసుని వచనము - స్థావరములు, పురుగులు, జలజంతువులు, పక్షులు, పశువులు, నరులు వీరు క్రమంగా ధార్మికులు. వీరికన్న ధార్మికులు సురలు (5) సహస్ర భాగము నుండి మొదటి దాని యందు రెండవది ఒక దాని వెంట ఒకటి (మూడవది అట్ల) వీరందరు మహా భాగులు పాపము నుండి ముక్తిని ఆశ్రయించే వారు (6) నాల్గు రకముల ప్రాణులలో (భూతములలో) ప్రాణులు చాలా ఉత్తములు (వృక్షములు, క్రిములు, పక్షులు, మానవులు) ప్రాణులకన్న బుద్ధి ఉవ జీవులైన వారు శ్రేష్ఠములు ఓ మునులార (7) మతిమంతుల కన్న నరులు శ్రేష్ఠులు. వారి కన్న బ్రాహ్మణులు నలు. బ్రాహ్మణుల కన్న విద్వాంసులు శ్రేష్ఠులు, విద్యాంసుల తను చేయదలచిన దాని యందు బుద్ధి గలవారు శ్రేష్ఠులు (8) వారికన్న చేసేవారు నలు, వారికన్న బ్రహ్మతత్పరులు శ్రేష్టులు. ఓ భారత ముల్లోకములలో వారికన్న శ్రేష్టులు లేరు (9) వారు తపస్సు విద్య ఏవి విశేషములలో పరస్పరము పూజించుకొనేవారు. సర్వభూతములకు ఈశ్వరుడు బ్రాహ్మణుడు. అతడు బ్రహ్మచే పూజింపబడ్డాడు(10) అందువల్ల జగత్తులో ఉన్న దానికంతకు బ్రాహ్మణుడు ఆర్హుడు. ఇతరులుకాదు. వేదాచారుడు అన్నింటికి అందరికి ఆర్హుడు. ఆచారము నుండి తిరిగి విచ్యుతుడు కారాదు (11) అందువల్ల విప్రుడు ఎల్లప్పుడు ఆచారశీలి కావాలి. ఓ ముని! విద్వేషరాగ రహితులై వారాచరించేదాన్ని (12) పదబుద్ధి కలవారు సదాచారమని ధర్మమూలమని బుద్ధులు తెలుసుకొన్నారు. లక్షణము వల్ల హీనుడైనా బాగా ఆచారతత్పరుడైన (13) శ్రద్ధాళువై, అసూయరహితుడైన నరుడు నూరు వత్సరాలు జీవిస్తాడు. శ్తుతి స్మతులలోచెప్పబడింది. తమతమకర్మలలో (14) శ్రద్ధగా సదాచారాన్ని ఆచరించాలి. అదిధర్మమునకు మూలము. దురాచారుడైన పురుషుడు లోకంలో గర్హణీయుడౌతాడు. (15) వ్యాధులతో పీడింప బడుతాడు. ఎప్పుడు అల్పాయువు, బాగా దుఃఖ భాజనుడు ఔతాడు. వరాదీనమైన వనిని వదిలిపెట్టాలి ఎప్పుడూ తన అధీనమైన కర్మను చేయాలి (16)
పరాధీనుడు దుఃఖి ఎప్పుడూ ఆత్మవశమైన వాడునుఖి. ఏ పని చేస్తుండగా అంతరాత్మ ప్రసన్నంగా ఉంటుందో (17) అపని చేయాలి. విపరీతమైన కర్మను ఎవ్వడూ చేయరాదు. నియమములు, యమములు, ధర్మసర్వస్వము అవి మొదట చెప్పబడింది. (18) అందువల్ల ధర్మాన్ని కోరేవారు వాటి కొరకే ప్రయత్నించాలి. యమములు పది. అవి నత్యము, క్షమ, ఋజువర్తనము, ధ్యానము, అహింస, క్రూరభావము లేకుండుట. (19) దమము, ప్రసాదము, మాధుర్యము, మృదుత అని. నియమములు, వది - అవి చము, స్నానము, తవము, దానము, మౌనము, ఇజ్య (పూజ) అధ్యయనము, వ్రతము (20) ఉమహావము ఉష్ణదండనము అని. ఈమము, క్రోధము, దమము, మోహము, మాత్సర్యము, లోభము (21) ఇవి అరిషట్ వర్గములు వీటిని జయిస్తే అంతట విజయవంతుడౌతాడు. ధర్మాన్ని మెల్లమెల్లగా సంపాదించాలి, శృంగమనువురుగు ఎట్ల పుట్టను తయారు చేస్తుందో అట్ల (22) వరపీడను చేయరాదు. పరలోక పహాయి ధరము. ధర్మము రక్షింపబడితే అది పరలోకంలో సహాయంగా ఉంటుంది (23) పితృమాతృ సుతులు, భ్రాతృ, యోషిత్ బంధుజనులు, ఇంకొ ఇతరులు, ఒంటరిగానే పురు. ప్రాణులు (ఒంటరిగా) అ స హాయులుగానే చస్తారు (24) సుకృతాన్ని ఒంటరిగానే అనుభవిస్తాడు. దుష్పరాన్ని ఒంటరిగానే అనుభవిస్తాడు. దేహంలోంచి ప్రాణంపోయాక, కాషలోషములను వలె ఒంటరిగా వదలి (25) బంధువులు విముఖులై పోతారు. ధర్మము, పోయే ప్రాణిని అనుసరిస్తుంది. అందువల్ల ఇక్కడ పై లోకంలో పహాయం చేసే ధర్మాన్ని సంపాదించాలి (28) ధర్మాన్ని సహాయంగా పొంది దుప్తరమైన తమస్సును దాటాలి. ప్రతిరోజు ఉత్తములలో ఉత్తమోత్తములలో బుద్ధిమంతుడు సంబంధములు ఆచరించాలి (27) ఆధములను ఆధమాధములను వదలి కులమును మేలు వైపుకు తీసుకు పోవాలి. ఉత్తములను, ఉత్తములనే అనుసరించాలి. హనులను వదలాలి బ్రాహ్మణుడు షుడౌతాడు. పాపములో చూద్రుడౌతాడు (28) అధ్యయన స్వభావంలేని, సదాచారములు అతిక్రమించే, అలసుడైన, దుష్టమైన అన్నమును తినే బ్రాహ్మణుని యముడు బాధిస్తాడు (29) అందువల్ల ద్విజుడు ఎల్లవ్వడు ప్రయత్న పూర్వకముగా సదాచారమును అభ్యసించాలి. తీర్థములు కూడా సదాచారము గల వాని వమాగమమును కోరుకుంటాయి. (30) రాత్రియొక్క చివరిఆర్థయమము బ్రాహ్మ సమయముఅని అనబడుతుంది. ఆ బ్రాహ్మముహూర్త మందు లేచి, ఎవ్వడూ ప్రాజ్ఞుడు తన హితమును గురించి ఆలోచించాలి (31) తొలుత గణపతిని స్మరించాలి. వెదవ పార్వతితో కూడిన శివుని స్మరించాలి. శ్రీ సమేతమైన శ్రీరంగమును, కమలోద్భవుడైన బ్రహ్మనుస్మరించాలి(32).
ఇంద్రాది సకల దేవతలను వసిష్టాది మునులను, గంగాది అన్ని నదులను, శ్రీశైలము మొదలుగా అన్ని గిరులను (33) పాల సముద్రము మొదలుగా నముద్రములను మానసాది నరస్సులను, నందనాది వనములను కామధేనువు మొదలుగా ధేనువులను (34) కల్పవృక్షాది వృక్షములను, కాంచనము మొదలుగా గల ధాతువులను, ఉర్వశి ముఖ్యులైన దేవతాత్రీలను, ప్రహ్లాదుడు మొదలుగా హరిభక్తులను (35) సర్వతీర్థముల కన్న ఉత్తమోత్తమమైన తల్లి పాదములను స్మరించి, తండ్రిని, గురువులను హృదయంలో ధ్యానించి, ప్రసన్నమైన బుద్ధి కలవాడై (36) పిదవ అవశ్యమైన దానిని చేయుటకు నైఋతి దిశకు వెళ్ళాలి. గ్రామము నుండి నూరుధనువుల దూరం వెళ్ళాలి (4 మూరలపై కొలత ధనువు) నగరము నుండైతే వాళింతల రెట్టింపు దూరం వెళ్ళాలి (37) భూమిని గడ్డితో కప్పితలను బట్టతో కప్పుకొని, యజ్ఞోపవీతమును చెవికి ధరించి ఉత్తర దిక్కుగా ముఖం పెట్టి వగలు రెండు సంధ్యలందు (38) మౌనంగా మల మూత్రములు వదలాలి. రాత్రిపూట దక్షిణ ముఖంగా వదలాలి. నిలబడి వదలరాదు. త్వరత్వరగా వదలరాదు. విప్రులకు గోవులకు, అగ్నికి వాయువునకు ఎదురుగా నిలబడి వదలరాదు (39) నాగలితో దున్నబడిన భూభాగమందు వదలరాదు. రథన మూహములు వెళ్ళే మార్గమందు వదలరాదు. దిగ్భాగములను చూడరాదు. జ్యోతిశ్చక్రమును ఆకాశమును, మలమును చూడరాదు (40) ఎడమ చేతితో శిశ్నమును ధరించి ప్రయత్నించి లేవాలి. ఏదవ మట్టిని తీసుకోవాలి. అందులో జంతువుల ఎముకలు ఉండరాదు (41) ఎలుకలు తవ్వినది, ఉచ్చిష్టమైనది కేశములతో కుడినది తీసుకోరాదు. కొంచం మన్నును ముడికి రాయాలి ఎదవ నీటితో కడగాలి (42) తిరిగి ఎడమ చేతితో ముడిని కడుగుకోవాలి. ఇట్లా ఐదుసార్లు చేయాలి. ఒక్కొక్క కాలికి మూడేసి సార్లు మట్టి రాయాలి. అట్లాగే చేతులకు గూడా రాయిలీ (43) ఈ విధముగా గృహస్తు గంధ లేపము నశించే దాక శాచము చేయాలి. క్రమంగా బ్రహ్మచర్యాది మూడు ఆశ్రమములలో రెట్టింపుగా చేయాలి (44) వగలు విధించిన శాచముకన్న రాత్రిపూట సగమే ఆచరించాలి. పర గ్రామ మందు అందులో పగ(1/4) మాచరించాలి. మార్గమందు అందులో సగమే (1/8) ఆచరించాలి (45) రోగులకు అందులో సగము. ఆరోగ్యంగా ఉంటే తక్కువగా ఆచరించరాదు. సర్వ నదుల నీళ్ళతో, పర్వతములా ఉన్న మట్టి సమూహములతో ఆచరించాలి (48) శాచమును అవ్వరే ఆచరించాలి. దుష్టంగా మారితే శుద్ధి కాదు.వచ్చి ఉసిరికాయ పరిమాణంగల మట్టిని కౌచమునకు తీసుకోవాలని చెప్పారు (47) అన్ని ఆహుతులు ఇట్లాగే చాంద్రాయణ మందు ఆహారములు ఇదే ప్రమాణము. తూర్పు ముఖంగానో, ఉత్తర ముఖంగానో బాగా కూర్చొని పని ప్రదేశ మందు (కూర్చొని) (48) ఉముక, బొగ్గులు, ఎముకలు, బూడిద ఇవిలేని నీటిని తాకాలి (ఆచమించాలి) అతి స్వచ్ఛమైన నీటితో, అది హృదయం చేరే వరకు, తొందర పడకుండా (49) బ్రాహ్మణుడు బ్రహ్మ తీర్థం, దృష్టి పూతమైన తీర్థంలో ఆచమించాలి. కంఠము వరకు నీళ్ళు వెళ్ళే దాకా రాజు ఆచమించాలి. ఉరుజుడు (వైశ్యుడు) తాలువు వరకు నీరు చేరేటట్లు ఆచమించాలి (50) శ్రీ చూద్రులు నీటిని తాకటంతోనే శుదులౌతారు. శిరము అనగా కంఠము వరకు గాని శిఖను వీటిలో విడువటం వరకు గాని అని గ్రహించాలి (51).
కాళ్ళు రెండు కడుక్కోకుండా ఆచమించినచో అశుచి అనబడుతుంది. విశుద్ధి కొరకు నీటిని మూడుసార్లు తాగి ఎదవ ఇంద్రియములను (నోరు,చెవులు, కండ్లు,ముక్కులు,గుదము, శిశ్నము) శుద్ధి చేసుకోవాలి (52) బొటనవేలి మూల ప్రదేశముతో క్రింద పెదవులను తుడుచుకోవాలి. జలముతో హృదయమును వృశించి అన్ని వేళ్ళతో శిరస్సును స్పృశించాలి. (53) అంగుళి అగ్రములతో భుజములు నశించి వీటిలో అంతట స్పృశించాలి. రాజమార్గాన్ని ఆశ్రయించి వచ్చినచో ముందు ఆచరించినా మళ్ళీ ఆచరించాలి (54) స్నానం చేశాక, భోంచేశాక, వీరు తాగాక శుభకర్మల ప్రారంభ మందు, నిద్రపోయిలేచాక, వస్త్రములు ధరించాక, అమంగలమును చూచాక (55) ప్రమాదంవల (పొరపాటున) అరుచిని స్మరించాక రెండుసార్లు ఆచమిస్తే శుచిఔతాడు. ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా దంతధావనం చేసుకోవాలి. ఆచమించి ఆశుచియే. ఎందువల్లనంటే వళ్ళుతోముకోలేదు. కాబట్టి (56) ప్రతివద, దర్శము, షష్ఠి, నవమి, ఆదివారము ఈ రోజుల్లో వళ్ళమ పుల్లతో(కర్రతో) తోమితే, ఏడుతరాల వరకు కులము దగ్ధమౌతుంది (57) దంతకాష్ట్రములు లభించకపోతే, నిషిధమైన వారమందు, వన్నెండుసార్లు పుకిలిస్తే ముఖం పరిశుధమౌతుంది (58) చిటికెన వేలి యొక్క అగ్ర భాగమంత లావు గలది, బెరడు కలది, పుండ్లు లేనిది, రోగములేనిది పన్నెండంగుళముల పొడవైనది, పచ్చిది ఐయ్యుండాలి పళ్ళుతో మేది, పుల్ల (59) అదంత ధావనం వుల్లను ఒక్కొక్క అంగుళం చొప్పున కొరకాలి, చప్పరించాలి. ప్రాతః స్నానము శుద్ధి కొరకు ఆచరించాలి. ప్రత్యేకించి తీర్థమందు ఆచరించాలి (60) ఎందువల్లనంటే ఈ శరీరము ఎప్పుడూ మలినమైందే కనుక ప్రాతః స్నానము వల్ల శుధమౌతుంది. శరీరంలోని మలము రాత్రింబగళ్ళు తొమ్మిది రంధ్రముల నుండి ప్రవహిస్తూనే ఉంది (61) ఉత్సాహము, మేధ, సౌభాగ్యము,రూపము, నంవద వీటిని వర్ధింప చేసేది స్నానము. దీనిని ప్రాజాపత్యముతో నమానమైనదన్నారు. ఇది మహా పాపములను నశింపచే సేది (82) ప్రాతః స్నానము పాపమును హరిస్తుంది. అలక్ష్మిని, గ్లానిని హరిస్తుంది. అశుచిని, దు:న్వప్నమును హరిస్తుంది. తుష్టిని, పుష్టిని ఇస్తుంది (63) దుష్టమైనవి, ప్రొదున్నే స్నానం చేసే జనుని ఎక్కడా సమీపించవు. ప్రాత స్నానము వలన దృష్టి వలము అదృష్ట (కనుపించని) ఫలము కలుగుతాయి (64) ఓ నృపోత్తములార! ప్రసంగవశం వలన స్నాన విధిని చెప్తున్నాను. మామూలు స్నానం కన్నా విధి ప్రకారము స్నానము నూరు గుణముల ఉత్తమమైనదని అన్నారు (65) విశుధమైన, దర్భలు, నువ్వులు, గోమయము గలిగిన మట్టిని తీసుకొని, శుచియైన ప్రదేశమందుంచి ఆచమించి స్నానమాచరించాలి (66) వదములు చదువుతూ శిఖను ముడి వేసుకొని నీటి మధ్య యందు ప్రవేశించాలి. తన శాఖ వారికి చెప్పిన ప్రకారము శాస్త్ర ప్రకారము స్నాన మాచరించాలి (67).
ఈ రకముగా స్నానంచేసి వస్త్రముతో బాగా రుద్ధి ఉతికి వస్త్రములను స్వీకరించాలి. ఆచమించి ఆవిదవ దర్భలతో కూడి ప్రాతః సంధ్యను ఆచరించాలి (68) విప్రుడు ప్రాణాయామములను ఆచరిస్తూ మనసును దృఢముగా నియమించిన, ఆ క్షణం లోనే అహోరాత్రములందు చేసిన పాపముల నుండి ముక్తుడౌతాడు (69) పదిసార్లు గాని పన్నెండు సార్లు గాని ప్రాణాయమములు చేసిన యెడల, మనస్సునియమిస్తే ఆతడు అప్పుడు మహాతపస్సు ఆచరించినట్లే. (70) వ్యాహృతి, ప్రణవములతో కూడిన ప్రాణాయామములు వదహారు. ప్రతిరోజు చేసిన ప్రాణాయామములు బ్రూణహత్యవల్ల వచ్చిన పాపమును మానంలో తొలగించిన విత్రుని చేస్తాయి. (71) పార్థివ ధాతువుల మలములు ధమని వలన కాల్చబడినట్లు ఇంద్రియముల వల్ల జరిగిన దోషములు ప్రాణ సంయమము వలన కాలిపోతాయి. (72) ఏకాక్షరము వరమైన బ్రహ్మ ప్రాణాయామము వరమమైన తపస్సు. ఓ నృపోత్తమ! గాయత్రి కంటె వరమైనది పావనమైనది లేదు (73) కర్మ ద్వారా, మనస్సుతో, మాటతో రాత్రి చేసిన పాపము నుండి పూర్వ నంద్యయందు లేచి ప్రాణాయామములతో శుద్ధపరచుకోవాలి (74) మనోవాక్కాయ కర్మలతో వగలు చేసిన పావము, వశ్చిమ సంధ్య యందు కూర్చొని ప్రాణాయామములాచరిస్తే పోతుంది. కూర్చొని పశ్చిమ సంధ్యను ఆచరిస్తే అది పగలు చేసిన మలమును నశింపచేస్తుంది (75) ఎవడు పూర్వమును ఆచరించడో, ఎవడు పశ్చిమ సంధ్యను ఆచరించడో వానిని అన్ని ద్విజకర్మల నుండి శూద్రునివలె బహిష్కరించాలి (76) నీటి దగ్గరకు చేరి నిత్యకర్మను ఆచరించాలి. ఏదవ శాస్త్ర ప్రకారము ఒకదాని వెంట ఒకటిగా ఆచమనము వగైరా చేయాలి (77) పిదప ఆపోహిష్ట అని మూడు మంత్రములలో మార్గన మాచరించాలి. భూమి పై శిరస్సు పై ఆకాశమందు భూమి పై తలపై (76) అట్లాగే తల పై ఆకాశమందు భూమి పై ఇట్ల తొమ్మిది విధములుగా మార్జన మాచరించాలి. భూమి అనగా చరణములు. ఆకాశమనగా హృదయము అన్నారు. శిరమనగా శిరస్సే. వాటి వర్ణనము అని ఉదహరింపబడింది (79) వారుణ మంత్రము, ఆగ్నేయ మంత్రము వాయవ్య మంత్రము, ఇంద్ర మంత్రము ఈ మంత్ర స్థానముల కన్నను (స్నానములకన్నను) వరమైన ఈ బ్రాహ్మస్నానము ఉత్తమమైనది. బ్రాహ్మస్నానముతో, స్నానం చేసినవాడు బాహ్యాభ్యంతరము లందు శుచియైనాడు (80) దేవ పూజాది కర్మలన్నిటి యందు ఆరతను పొందుతాడు. రాత్రింబగళ్ళు నీళ్ళలో మునిగిన జాలరులు పవిత్రమైనవారా? (81) అట్లా నూరు సార్లు స్నానం చేసినా భావదూషితులైన వారు శుద్ధులు కోరు. అంతః కరణ శుద్ధులైన వారిని దైవశక్తి పవిత్రులను చేస్తుంది. (82) భస్మధూసరములైన గాడిదలు పావనములని అనబడుతాయా, మనస్సు నిర్మలమైన వాడు, సర్వమలములు తొలగిపోయి సర్వతీర్థములందు స్నానం చేసిన వాడౌతాడు (83) నిర్మలమైన మనస్సు కలవాడు నూరు క్రతువులు ఆచరించినట్లు. ఓ ముని! నిర్మలమైన మన స్సేదో దాని గురించి విను (84).
విశ్వేశుడు ప్రసన్నుడైతే అప్పుడు మనను నిర్మల మౌతుంది. లేకపోలేదు. అందువలన చేతస్సు విశుద్ధి కొరకు కాశీనాథుని సమాశ్రయించాలి. (85) ఈశరీరాన్ని వదలి పరబ్రహ్మను పొందుతాడు. ద్రుపద అంతము వరకు జపించి చేతితో నీళ్ళు తీమకొని (86) శాస్త్రి జరిగినవాడు, శంచ మంత్రములో అమె మరణమును చేయాలి. వీళ్ళలో మునిగి, విద్వాంసుడు మూడుమార్లు అనుమరణము జపిస్తే (87) వీటి యందుగాని స్థలమందుని అమమర్షణముచేస్తే ఆతని పాపముల సమూహములు నశిస్తాయి. సూర్యోదయమైతే చీకట్లు తొలగిపోయినట్లు (88) శిరస్సు లేనటు వంటి గాయత్రిని, మహావ్యాహృతి ముందు గల దానిని, ప్రణవము తొలుత గల దానిని జపిస్తూ నిలబడి వీటిని మూడు దోసిళ్ళు వదలాలి (89) ఆ వజోదకముతో త్వరగా మందేహలను రాక్షసులు నశిస్తారు. పర్వతాలవలె వారు సూర్య తేజస్సును లోపింప చేస్తుంటారు (90) సూర్యునికి నహాయము కొరకు అంజలితో మూడు సార్లు నీటిని మందేహంల వాశం కొరకు వదలని బ్రాహ్మణుడు ముందేహుడౌతాడు (91) ప్రొద్దుటి వూట జపానూ నూర్యుడు కన్పించే వరకు నిలబడాలి. సాయంకాలము నక్షత్రములు కన్పించే వరకు జపిస్తూ కూర్చోవాలి (92) తన హితాన్ని కోరే బ్రాహ్మణుడు కాలలోపాన్ని చేయకూడదు. నగము సూర్యుడు ఉదయించగానే ఉదయ కాలమందు సాయంకాల మందు బ్రాహ్మణుడు వజ్రోదకమును వదలాలి (93) శాస్త్రం ప్రకారం చేసినా సంధ్య కాలాతీతమైతే వలంలేనిదౌతుంది. దానికిదే దృష్టాంతము, ఏమంటే వంధ్యమైన స్త్రీని సంభోగించినట్లు (94) బ్రాహ్మణుడు నీటిలో ఎడమచేయిని ఉంచి సంధ్యను ఆచరిస్తే అది వృషలీ అనబడుతుంది. అది రాక్షస గణములకు ఆనందాన్ని కల్గిస్తుంది (95) ఎదవ ఆయాశాఖల వారికి చెప్పిన రీతిలో వారు ఉపస్థానమును చేయాలి. గాయత్రిని వేయి మారులు, లేదా నూరు మారులు లేదా (96) వది నరులు దేవి కొరకు చేసి సూర్య ఉపస్థానమును చేయాలి. దేవిని, వేయి మార్లు గాయత్రి జవముతో ఉత్తమముగా నూరు మార్లతో మధ్యమముగా పదిమార్లతో తక్కువగా (97) ఆరాధించే బ్రాహ్మణుని పాపములు అంటుకోవు. రక్తచందనము కలిసిన పూలు దర్భలు కలిగిన నీటితో (98) వేదోక్తము లేదా ఆగమోక్తమైన మంత్రములతో అరమును ఇవ్వాలి. సూర్యుని పూజిస్తే ముల్లోకములను అర్చించినట్లే (99) సూర్యుని పూజిస్తే ఆతడు సుతులను పశుసంపదను ధనమును ఇస్తాడు. వ్యాధులను హరిస్తాడు. ఆయువునిస్తాడు. కోరిన వాటిని కూడా వూరిస్తాడు (100) ఈ ఆదిత్యుడు రుద్రుడు. ఈ సూర్యుడు హరి ఈ రవి హిరణ్య రూపుడు ఈ అర్యమా వేదముల స్వరూపుడు (101).
తమ శాఖవారికి చెప్పిన విధముగా పిదవ తర్పణము చేయాలి. బ్రహ్మాది అఖిల దేవతలకు మరీచ్యాది మునులకు (102) చందనము, అగరు, కర్పూరము, వామనగల వూలు వీనితో బద్ధమైన నీటితో తర్పణ చేయాలి. తృవ్యంతు (తృప్తిని పొందండి) అని ఉచ్చరించాలి (103) సనతాదులను మనుష్యులకు వీతిలో, యవలతో తర్పణ చేయాలి. బ్రాహ్మణులు, రెండు బొటన వేళ్ళ మధ్య దర్భలను చక్కగా వటుకొని (104) కవ్యవాట్ (పితరులకై అన్నంమోసే వ్యక్తి) అగ్ని మొదలగు వారికి పితరులకు దేవతలకు తర్పణ వదలాలి. ప్రాచీనావీతి కలిగి దర్భలు అంతకు రెట్టింపు పవ్వులు కలిపి (తర్పణం చేయాలి) (105) ఆదివార మందు శుక్ల త్రయోదశి, సప్తమి తిధులందు రాత్రియందు శ్రేయస్సును కోరుకునే బ్రాహ్మణుడు తిల తర్పణమును ఎప్పుడూ చేయరాదు (106) ఒకవేళ చేస్తే ఆ ఎదవ తెల్లని నవ్వులతో చేయాలి, ఆచేసేవాడు. పిదవ ఒక్కొక్కరి పేరు ఉచ్చరిస్తూ పదునాలురు యములకు తర్పణ చేయాలి. (107) పిదవ తన గోత్రాన్ని ఉచ్చరించి సంతోషంతో తన పితరులకు తర్పణం వదలాలి. నవ్యమైన (కుడి) మోకాలును భూమిఠానించి (మంచి) పితృతీర్థముతో, వాక్కును అదుపులో ఉంచుకొని (108) దేవతలకై ఒక్కొక్క అంజలిని, ననకాదులకు రెండేసి దోసిళ్ళను, పితరులకు మూడేసి దోసిళ్ళను ఇవ్వాలి. ఆడవారికి ఒక్కొక్క దోసిలిని ఇవ్వాలి. ‘దోసిలితో నీరు విడవాలి (109) దేవతలకు అంగుళుల అగ్రభాగంతో వదలాలి. ఋషులకు అంగుళుల మూలము నుండి నీరు వదలాలి. బ్రాహ్మతర్పణము బొటన వేలి మూలమందు వదలలాలి. ప్రజావతికి చేయిమధ్య నుండి నీరు వదలాలి (110) బొటన వేలు ప్రదేశిని (చూపుడువేలు) వీటి మధ్య నుండి పితరులకు తీర్థం వదలాలి అని అన్నారు. బ్రహ్మ మొదలుకొని స్తంబము వరకు (బోదెలేని చిన్నచెటు వరకు) దేవ, ఋషి, పితృ, మానవులు (111) పితరులు, మాతృ మాతామహాదులు అందరు తృప్తి నందని. ఇండా వేరే చెప్పబడిన వేదోక్తములు వురాణములందలి మంత్రములు వరించి (112) సాంగముగా పితరులకు సుఖమునిచ్చే తర్పణ మాచరించాలి. పిదప అగ్నికార్యమును చేసి పిదప వేదాభ్యాసమాచరించాలి (113) వేదాభ్యాసము ఐదు రకములు. వ్వతారము, అర్థవిచారణము, అభ్యానము తపస్సు శిష్యులకు బోధించుట అని (114) లభించిన దానిని రక్షించుట కొరకు లభించని దానిని పొందే కొరకు ప్రయత్నము చేయాలి. ఓ నృపోత్తమ! ఇది బ్రాహ్మణులకు ప్రాతః కాల కృత్యమని చెప్పబడింది (115) లేదా ప్రొద్దున్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని, శాచ ఆచమనములు చేసి దంత ధావనమును (పుల్లను) తెచ్చినమలాలి (116) శరీరాన్నంతా శుద్ధి చేసుకొని ప్రాతః సంధ్యను ఆచరించాలి. వేదార్థములను వివిధ శాస్త్రములను అభ్యసించాలి (117) శుచులైన హితులైన మేధా సమన్వితులైన శిష్యులను అభ్యసింప చేయాలి యోగక్షేమాది సిద్ధి కొరకు ఈశ్వరుని గూడా సేవించాలి (118).
పిదప మధ్యాహ్న సిద్ధి కొరకు ముందు చెప్పినట్లు స్నాన మాచరించాలి. స్నానం చేసి మధ్యాహ్న సంధ్యను ఉపాసించాలి. విచక్షణుడు (119) (దేవతను) బాగా పూజించి నైమిత్తిక విధిని ఆచరించాలి. పవిత్రమైన అగ్నిని జ్వలింపచేసి వైశ్వ దేవాన్ని ఆచరించాలి (120) అనుములు, ఆళ్ళు, మినుములు, శనగలు, ఎర్రధాన్యము వీటిని వదలాలి. శైలవశ్వము పనికి రాదు, అవక్వమైన అన్నము ఉప్పగలిగిన పదార్థము అన్ని విడువాలి (121) కందిపప్పు గల అన్నము, చిరు సెనగల అన్నము గుండ్రటి ధాన్యము నుండి వచ్చిన వానిని విడువాలి, తినగా మిగిలినది చద్దిది వైశ్వదేవ మందు విడిచి పెట్టాలి (వాడరాదు). (122) ధర్భలు చేత ధరించి మంచిగా ఆచమనము చేసి ప్రాణాయామము చేసి వృషాధిక అనే మంత్రముతో వీటిని చుట్టూ చల్లాలి (123) ప్రదక్షిణంగా నీటిని చల్లి దర్భలను రెండు (మూర్ల) వరిచి, రాపోర్థ అనే దేవ మంత్రముతో వహ్నిని తన వంముఖ ముందుంచు కోవాలి (124) వైశ్వానరుని గంధపుష్ప అక్షతలతో బాగా పూజించి విచక్షణుడు తన శాఖ వారికి చెప్పిన ప్రకారము హోమమును చేయాలి (125) బాటసారి వృత్తి క్షీణించిన వారు, విద్యార్థి గురుపోషకుడు, యతి బ్రహ్మచారి ఈ ఆరుగురు ధరం కొరకు క్షమాచరించే వారు (126) అతిథి, బాటసారి, వంశపారం పర్యంగా ప్రతి పారగుడైనవాడు వీరిని గమనించాలి. బ్రహ్మలోకొన్ని కోరే గృహసులు వీరిని గౌరవించాలి (127) శ్వపాతునకు, కుక్కకు అన్నం పెట్టరాదు. వ్యర్థమౌతుంది (నిష్పలం). యాచకుడు వస్తే యోగ్యతా యోగ్యతలు ఆలోచించరాదు (128) కుక్కలకు, వతితులకు, ఛండాలురకు ఎవరోగులకు, తారులకు, పురుగులకు అన్నమును బైట భూమి మీద ఉంచాలి (పెటాలి) (129) ఐంద్ర వారుణ, వాయవ్య సౌమ్య నైఋతములైన కాకములు నేను భూమి మీద నేను పెట్టిన ఈ పిండాన్ని స్వీకరించండి (130) అని ఈ విధముగా భూత బలిచేసి ఒక ఆవును పాలు పితుకుటకు వట్టే అంత సేపు అతిథి వస్తున్నాడేమో అని ఎదిరిచూచి పిదవ భోజన గృహమునకు వెళ్ళాలి (131) నిత్య సౌథమును వాయన బలి ఇవ్వకుండా ఆచరించాలి. నిత్యత్రార్ధ మందు తన సామర్థ్యానికి తగ్గటు ముగ్గురుకి, ఇద్దరికి లేదా ఒకరికి భోజనం పెట్టాలి. (132) పితృయజ్ఞము కొరకు నీటిని పై నుండి ఇవ్వాలి. నిత్య శ్రాద్ధము, దైవము లేకుండ నియమాదులు లేకుండ (133) దక్షిణ లేకుండ ఆచరించాలి. ఇది చేసే వాడికి తినేవారికి (ఇద్దరి) చక్కగా తృప్తిగా ఉండాలి (నిచ్చేది). ఈ విధముగా పితృయజ్ఞము. నాచరించి స్వస్థమైన బుద్ధి కలవాడై తొందర లేని వాడై (రోగము లేని వాడై) (134).
మంచి ఆసనంపై కూర్చొని పిల్లలతో కూడి భుజించాలి. మంచి వాసనగల అందమైన మల్లెపూల మాల ధరించి శుభ్రమైన రెండు వస్త్రముల గలవాడై (135) తూర్పు ముఖముగా గాని, ఉత్తర ముఖముగా గాని కూర్చొని పితరులు సేవించిన దానిని భుజించాలి.ఏ (కుప్పగా ఉంచి) దానిపైన, అట్లాగే క్రింద (136) ఆపోశన విధానమాచరించి, బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు భుజించాలి. భూమిపై మూడు బలులుంచాలి. దానిపైన నీరుంచాలి (137) ఒకసారి నీటిని తాకి ప్రాణాది ఆహుతి వంచకమును జతరకుండ అగ్ని యందు వేయాలి (కడుపులోకి) చేత దరలు ధరించి, ప్రసన్నమైన బుద్ధి కలిగి భుజించాలి (138) దర్భలు చేత ధరించి తిన్నవానికి దోషముండదు. తెములు, తీటాదులున్నా దానిని తినొచ్చు, ధరలు ధరించి (139) పిదప మౌనంగా భుజించాలి. పండ్లు (కొరుకుడు) చవ్వడు చేయరాదు. కడుగదగిన చేతిని కుడి బొటన వేలు మొదటి నుండి (140) అపుణ్యనిలయమైన కౌరవమందు, అధోలోకమందు నివసించే వారికి, ఉచ్చిఉదకమును కోరే వారికి అక్షయ్యము కలగని (141) అని పలికి నీరు వదలాలి. మళ్ళీ ఆచమనం చేసి, మేధావియైన ఆతడు శుచియై ప్రయత్నంగా, పిదప ముఖ శుద్ధిని చేసుకొని వురోణ శ్రవణాదులతో (142) మిగిలిన దినమును గడిపి పిదప సంధ్యను ఆచరించాలి. గృహమందు చేసే సంధ్య సాధారణము. గోషమందు చేసేది దాని కన్న పదింతలు మంచిది అని అన్నారు. (143) నదిలో చేసేది పదివేల ఉత్తమమైనది. శివసన్నిధిలో చేసేది అనంతమైనది. అబద్ధము, మద్యవువానన, పగలు సంభోగము శూద్రస్థానము, వీటిని బయట ఉపాసించిన సంధ్య పవిత్ర పరుస్తుంది. (144) ఈనిత్యతన విధిని ఉద్దేశ పూర్వకముగావే చెప్పాను. విప్రుడు ఈ రకముగా ఆచరిస్తే ఏవిధముగా నునశించడు. (145) అని శ్రీస్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు వూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ్య మందు సదాచార వర్ణనమనునది ఐదవ అధ్యాయము.
