స్కంద మహా పురాణము లోని బ్రహ్మ ఖండము లోని ధర్మారణ్య ఖండము

29వ అధ్యాయము

 తా ॥ సూతులిట్లన్నారు - ఇకముందు, లోహాసురుని చేష్టలను వినండి. బలియొక్క నూరుగురు పుత్రుల గురించి వివరంగా చెబుతాను ఎప్పడైతే వృద్ధులైన ఆ అన్నదమ్ములు ఉత్తమ స్థానాన్ని పొందారో, వాటి నుండి దైత్యులైన లోహసురునిలో వైరాగ్యమేర్పడింది. ఏం చేయను ఎక్కడికి వెళ్ళను ? తప్పుకు ఉత్తమ స్థానమేది. దేవతలు, మునులు,నరులు తెలుసుకోలేని అంతము గల తత్వమేది  నేను ఏదేవుని ఆరాధించాలి, ఎవనిని మిక్కిలిగా హృదయంలో ధ్యానించాలి. అని ఆలోచిస్తున్న ఆ మహాత్మునకు ఇట్లా బుద్ధి పుట్టింది తలలో గంగను ధరించిన సూర్యచంద్రులను కళ్ళుగా గలిగిన, హృదయంలో నారాయణుని, కటిమండల మందు బ్రహ్మను ఇంద్రాది దేవతల నందరిని తన దేహమందు ప్రతిబింబించుకున్న వానిని అట్టి ఆత్మను (పరమాత్మను) నిరంజనమును, అకల్మషమైన మనస్సుతో ధ్యానిస్తాను. ఆ ఆత్మను నీటిలో సూర్యబింబమునువలె మహాత్ములు చూడగలుగుతున్నారు గదా. అని మనస్సులో అనుకొని ఆ రాక్షసుడు చాలా దుష్కరమైన తపస్సును ఆచరించాడు. ఘోరమైన జన్మ భయంతో భయపడి మహాత్ములకు దుష్కరమైన తపమాచరించారు. నీరును భక్షిస్తూ, వాయువు భక్షిస్తూ, ఎండినుకులు తింటూ, నూరువత్సరాలు దీప్యమైన, ఉగ్రమైన గొప్ప తపస్సును ఆచరించగానే, త్రిశూలమును ధరించిన భగవంతుడు ఆనందవడ్డాడు ఈశ్వరునీ వచనము :- నీమనస్సు కిష్టమైన నీకు క్షేమకరమైన వరమును కోరు కోటలోహామర! నీ తపోబలం వల్ల నేను నికివ్వగలిగింది ఏమిలేదు(9). అని అనగా దానవుడు శివుని ఎదుట ఇట్లు పలికాడు  లోహానరుని వచనము :- ఓ దేవేశ! ఒకవేళ నీవు సంతుష్టుడవైతే నేనోక వరం కోరుతాను, నా శరీరం ముసలిదీ కాకూడదు. నాకు మృత్యువు నుండి భయం ఉండకూడదు ఓ ప్రభు ! ఈ జన్మలో ఇది జరగాలి. నా హృదయంలో నీవు వుండాలి అని అనగా, శివుడు ఆ రాక్షసునితో అట్లాగే కానిమ్మని అన్నాడు అదృష్టవశాత్తు శివుని నుండి వరము పొందిన ఆతడు తిరిగి గొప్ప తపమాచరించాడు సంసార సాగరం నుండి తరించే కొరకు అందమైన సరస్వతీ తీరమందు తపమాచరించాడు. వేలకొలది అర్బుదములతో కూడిన సంవత్సరాలు గడిచాయి. ఆతని తపో బలంతో భయపడి భగవానీంద్రుడు అనుమానించ సాగాడు దైత్యుడైన లోహాసురుని వల్ల ఎటి స్థితిలో పదచ్యుతి కారాదు. ఇంద్రుడు మారు రూపంతో ఆశ్రమమందలి అడవికి వచ్చి మహానురుని కదిలించి తపో భంగం ఆచరించాడు. తీక్షణమైన కర్కశ పిడికిటి గుద్దులతో ఆ రాక్షసుని శరీరం పై కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు ధ్యానాన్ని విడిచి చూచాడు. ఇంద్రుడు అదంతా తపోబల నాశనం కొరకు చేశాడు. వానికి కర్కశులైన ఇంద్రాదులతో యుద్ధం జరిగింది. ఒక్కనికి అనేక మందితో యుద్ధం జరిగింది. వానితో యుద్ధంలో ఆ దేవతలు రక్తసిక్త శరీరులై దెబ్బలతో శిథిలమైన శరీరం కలవారై త్రాహి త్రాహి రక్షించు అని అంటూ కేశవుని శరణువేడారు.

తా ॥ సూతులిట్లన్నారు :- వాసుదేవుడైన జనార్దనుడు దేవతల మాటను విని కేశవుడు నూర్ల నంవత్సరాలు వానితో యుద్ధం చేశాడు వరములతో అధికుడైన ఆ రాక్షసుడు నారాయణు విజయించాడు. లోహానురునితో జయించబడిన నారాయణుడు  బ్రహ్మతో రుద్రునితో చాలాసార్లు ఆలోచన చేశాడు. ముగ్గురు దేవతలు చర్చించుకొని తిరిగి యుద్ధ ప్రయత్నం చేశారు. దైత్యుడైన లోపాసురుని నిత్యనూతనమైన శరీరాన్ని చూచాక తిరిగి దైత్య కేశవులడు గోవ్ప యుద్ధం జరిగింది  విష్ణువు ప్రభ విష్ణువు ఆ రాక్షసుని చంపలేక పోయాడు. కేశవుడు ఆతనిని భూమిపై పడవేశాడు  పడిలేవబోతున్న వానిని చూచిపినాకి వరమేశ్వరుడు వాని హృదయమును రూప రహితమైన తన రూపముతో బంధించాడు బ్రహ్మ ఆ రాక్షసుని కంఠ మందు ఉన్నాడు పురుషోత్తముడు తాను నిల్చొని ఆతని పాదములను ఏడ్పించ సాగాడు. ఆ పిదవ దైత్యుడు, భూమి యందు గట్టిగా బంధింపబడ్డా లేచాడు. లేచిన దేవతలను పడవేస్తున్న ఆ రాకనుని చూచి  దివ్యవాణిలో కమలాసనుడు విరించి ఇట్లా అన్నాడు బ్రహ్మ వచనము -: ఓ లోహానుర! మిక్కిలిగా ధర్మవాక్కులను ఎప్పుడూ రక్షిస్తూ ఉండు. నీవు రుద్రుని ఏది ప్రార్థించావో అదే నీరు లభించింది  నేను విష్ణువు రుద్రుడు ముగ్గురము దేవతోత్తములము. ప్రాణికోటి ప్రలయం జరిగేదాకనీ శరీర మందుంటాము  ఓ దానవేశ! భావ భక్తితోనే వప్రాప్తి కలుతుంది. శివున్ని కదిలించాలనే బుద్ధి నీలాకలుతుంది.  కదిలి కలేని వాటిన్ని ప్రాసాదములను బ్రాహ్మణులను వురములను కదిలించేవాడు త్వరలోనే పాతకములకు లోనౌతాడు. శ్మశానం లాగా అతనిని విడిచి పెట్టాలి. ఆతడు సత్యధర్మ బహిష్కృతుడు. నీవు సత్య వార్యుడవు. నీకు క్షేమం కలగని. దేవతలను కదిలించరు  పితరులు ఏ మార్గంలో వెళ్ళారో పితామహులు ఏ మార్గంలో వెళ్లారో మార్గంలో వెళ్ళాలి. నజనుల మార్గాన్ని విడువరాదు  ఓ దానవేశ! నీ తండ్రి ముల్లోకములను హరికి ఇచ్చాడు. మాటకు బద్ధుడైన ఆ రాజు పాతాళంలో రాజ్యం చేశాడు. అట్లాగే నీవు కూడా వాక్కు అనే పాశముతో శివ భక్తి కలవాడవై భూమియందు ఉండు. ఓ దైత్యేంద్ర ! వాక్వైకల్యమును పొందవద్దు.  నీకు వరములను కూడా ఇస్తాము. దేవతలను కదల్చరాదు.

మూ॥ వ్యాసఉవాచ –

తా ॥   వ్యాసుని వచనము - దానవేశ్వరుడు బ్రహ్మ వాక్యమును విని సంతుష్టుడై ప్రసన్నమైన వాక్కులతో బ్రహ్మ కేశవుడు శివుడు వీరితో ఇట్లన్నాడు. లోహసురుని వచనము - మీ బలంతో కాకుండా వాక్పాశబద్ధుణై ఉంటాను. బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు సురసత్తములు. వీరు నా శరీరంలో ఉండేట్టైతే ఆ పిదప  నాకు  లభించనిదేముంది. ఈ నా శరీరము ముగ్గురు దేవతలతో ఆధిష్టించబడింది ఓ సురోత్తములార! నా ప్రభావంతో (పేరుతో) భూమియందు ప్రసిద్ధి చెందని అని అనగా లోహాసురుని వాక్యంతో సంతోషించిన ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆతనికిట్ల ప్రత్యుత్తరమిచ్బారు  దైత్యుడు నత్య వాక్పాశముతో సత్యం నుండి కదలలేదు కనుక దానిలో నత్యంతో, నంతుషలమై మేము నీకు మనోభిప్పితమును ఇవ్వదలిచాము  బ్రహ్మ వచము - గయాశ్రదేశమందు స్నానము బ్రహ్మ జ్ఞానము దేహ త్యాగము ఎట్లాగో అట్లాంటిదే ఓ దైత్య! ధర్మేశ్వర పురమందున్న (ముందున్న) ధర్మారణ్య మందున్న  కూప మందు తర్పణము, శ్రాద్ధము ప్రశస్తమని స్వర్గమందు పితరులంటారు. గయయందు పిండదానముతో పితరులేట్లా తృప్తులౌతారో. అట్లాగే విశుద్ధమైన ధర్మారణ్య కూప మందు తర్పణమును కోరుతారు. ఓ దానవేంద్ర! నీ శరీరము ఒక తీర్థమౌతుంది. ఇరువది ఒక్కమారులు గయ యందు తర్పణం చేస్తే. పితురులకు ఏ తృప్తి కలుగుతుందో, ఓ దానవాధివ! ధర్మేశ్వరుని ముందున్న కూపం నుండి ఒక సారి పితృతర్పణం చేస్తే ఆ తృప్తి వదింతలు కల్గుతుంది. నిజమే అనుమానం లేదు. పితరులకు ఇక్కడ పిండ దానంలో అక్షయ్య వేన తృప్తి కలుగుతుంది. శివ రూపం మధ్యలో గల ధర్మారణ్య వ్రదేశమందు  శ్రాద్ధ పిండోదర క్రియలకు శ్రద్ధతో చేయాలి. అట్లాగే అంతరాల ప్రదేశమందు మాతులౌడ పిండములు విశ్లేషించి ఇవ్వాలి. అట్లాగే శరీర మందెక్కడైవా నీవు చింతనలో నత్యమే గల వాడవు ఓ సువ్రత. ముల్లోకములందు పొందరాని నత్యము నీది అవి దేవలోక మందు భావిస్తారు. మా వాక్యంతో సత్యంతో అది అట్లాగే శానికీ అనురత్తమ. నీ తీర్థము భూమియందు గయతో సమానమైన అధికమైన తీర్థమైంది. నీ శరీరమందు మేము ఉండటము తప్పదు అనుమానం లేదు. నీ సత్యపాశంతో గట్టిగా బంధింప బడ్డాము ఓ పుణ్యాత్మ! విష వచనము గయ ప్రయాగలడన్న అధికమైన వలమని చెప్పారు. లోహాయ యందు చతుర్దశి యందు అమావాస్య యందు పిండ దానము వల్ల గయాధిక్య వలము  ఇక్కడ బలి పుత్రుని పత్యంతో గొప్ప సంతృప్తి కలుతుంది. ఇందులో అనుమానం లేదు శరీరంలో మేమున్నాము. పుణ్యమైన నీరు గల సరస్వతీ నది బ్రహ్మలోకం నుండి వస్తుంది. నాతో కలిసి ఉండినదై దేహ అవయవములను తడుపుతాయి ద్వారకావావుడైన దేవుడెట్లాగో అట్లాగే మహేశ్వరుడు. బ్రహ్మ ఎక్కడుంటారో ఈ మూడు అవి ఈ భూమిపై తీర్థ ముతాయి పాతాల మందు స్వర్గ లోకమందు యను క్షయ మందు ప్రసిద్ధమౌతుంది. ఓ అమర శ్రేష్ట! పితరుల తృప్తి హేతువులుగా ప్రవర్ధమై పోయి ఇక పితృకృతమైన ఉత్కృష్టమైన మరో గాధను చెబుతాను పుత్రులకు నా ఆజ్ఞా రూపమైనది. ఓ పుణ్యాత్మ! దానిని వినుము 

మూ ॥ పితర ఊచు :

తా ॥ పితరుల వచనము శంకరుని ముందరి స్థానము నరులకు రుద్రలోకము నిచ్చేది. పావముతో కొట్టబడి సనరులకు పాప దేహవిశుద్ధి కొరకు (60) దానియందు తిలోదక మిచ్చినా, దానితో తర్పితులై సధ్గతిని పొందుతారు. నరక మందున్న పితరులు మేథస్సు గల వుత్రునితో తర్పితులైన ధతినందుతారు ఇక్కడ, పితృముక్తి కొరకు గోదానము శ్రేష్టమని అంటారు. రుద్రుని కేశవుని చూచి పితరులనుద్దేశించి (62) నువ్వులు, తెలిక పిండి పిండముతో మేము గొప్ప తృప్తిని పొందుతాము చతుర్ధశి యందు, అమావాస్య యందు అట్లాగే పితృతర్పణం చేయాలి అజ్ఞాత గోత్ర జనగల వారికి పిండములు వదలాలి. వారు కూడా, పిండమును ఇవ్వగానే (పొందగానే) అందరు స్వర్గానికి చేరుతారు. అని శ్రుతి మానవులు పుణ్యం కోరేవారు భాద్రపదమాసం వస్తే అన్ని పనులు వదిలి లోహయిష్టమునకు వెళ్ళాలి. అజ్ఞాత గోత్రనామములు గల వారికి పిండ మంత్రమిది, నీను పితృ వంశ మందు మరణించిన వారు అట్లాగే మాతృవంశ ముందు మరణించిన వారు గడచిన గోత్రమందు జన్మించిన వారు వారందరికి ఈ పిండము చేరని విష్ణువు వచనము - ఓ సురత్తమ! నా ఎదుట ఈ మంత్రములో చంద్రుడు క్షీణించాక చతుర్ధశి యందు భాద్రపద మందు పిండం వదలాలి  పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. అనుమానం లేదు. నువ్వులు, తెలిక పిండి పిండముతో పితరులు మోక్షమందుతారు.  క్షణ త్రయంలో, ఈ భూమి యందు మానవులు నీరుత్తుతారు. లోహయష్టి యందు తిల తర్పణం వల్ల ముక్తులౌతారు. అనుమానం లేదు. స్నానంచేసి ఎవరైతే ఇక్కడ తరుల పిండోదశ క్రియలా చరిస్తారో వారితరులు బ్రహ్మ ఉన్నంత వరకు రాత్రింబగళ్ళు తనలోతారు.  భాద్రపద మాసంలోని అమావాస్య రోజు ఈ సరస్పుకు వచ్బి బ్రాహ్మణుడు యష్టిక మందు పితృ తర్పణ మాచిరంచిన ఆతని  పితరులు ప్రళయ కాలందాతృవులౌతారు. వారికి భగవాన్ ఆదిదేవుడైన మహేశ్వరుడు ప్రసన్నుడౌతాడు.ఈ తీర్థానికి వెళ్ళాలని ఎవరనుకుంటారో వారికీ ఈశుడు ప్రసన్నుడు. ఆవు పాలు తెల్ల నువ్వులు వీటితో తర్పణంను, సారస్వత జలమందు స్నానం చేస్తే వాని పితరులకు అక్షయమైన తృప్తి కలుగుతుంది.  సక్తులో (పేలపిండి) పాలతో సహ శ్రాధ మాచరించాలి  పితరులకు ఆనందాన్ని కోరేవారు అమావాస్య రోజున అట్లాచేయాలి. రుద్ర తీర్థమందు ధేనువును దానం చేయాలి. యమ తీర్థమందు వస్త్రములివ్వాలి  పితరుల ముక్తి కొరకు విష్ణు తీర్థమందు హిరణ్య దానం చేయాలి. అక్షతలు లేకున్నా దర్భలు లేకున్నా ఆననం లేకున్నా నీటి మాత్రంతో లోహయష్టియందు శ్రాద్ధము గయాశ్రాద్ధ వలాన్నిస్తుంది

మూ ॥ సూత ఉవాచ -

తా ॥ సూతుని వచనము - ఓ విప్రులార ! నేను మీకు లోహాను రవి చేష్టితమును చెప్పాను. దీనిని విన్న బ్రహ్మవతి, గోహంతకుడు అన్ని పాపముల నుండి ముక్తులౌతారు  ఇరువది యొక్కమార్లు గయలో పిండదానం వల్ల వచ్చే ఫలితాన్ని ఒక్కసారి దీనిని విన్నవారు పొందుతారు నాలుగు కోట్ల రెండు లక్షల ఒక వేయి నూరు గోవులను దానం జేసిన వాడౌతాడు, ఈ మాహాత్మ్యాన్ని విన్నవాడు అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు మూడవదైన బ్రహ్మఖండ మందు పూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ్యమందు లోహాసుర మాహాత్మ్య సంపూర్తి అనునది ఇరువది తొమ్మిదవ అధ్యాయము.