స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

34వ అధ్యాయము

ఆర్జుమడు చెప్పెను:- మీరు చెప్పిన అమృతమువంటి వాక్కులను చెవులను దోసిళ్లతో తాగినప్పటికి నా మనస్సుకు తృప్తి కలుగలేదు. మరింత వినవలెనను ఆకాంక్ష కలుగుచున్నది. మీ మాటలను వినవలెనను కోరిక కలిగిన నాకు కరుణ కలిగిన మీరు ఎటువంటి చింతను పొందక చెప్పవలసినది. ఓ మహామునీ! ఈ నదియందు ఎచట ఎచట పాపములను పోగొట్టు తీర్థేములు కలవో వినకోరిక కలిగినది. ఏఏ పుణ్యనదులు ఈ నదితో సంగమించుచున్నవి? ఎచట స్నానము చేయుట వలన జనులు పాపమును పోగొట్టుకొని యమభయములేక జీవింతురు, శివుడు, విష్ణువు మున్నగు దేవతల ఆలయములు ఈ నది యొక్క తీరమునందు ఎచట కలవు?, ఆ యా క్షేత్రములయందు విధి పూర్వకముగా స్నానము చేయుటవలన, దానము చేయట వలన ఇతర శుభకర్మలు చేయుట వలన, ఎటువంటి ఫలమును మానవులు పొందగలరు?. వేదములన్నియు తెలిసిన మహానుభావా! ఈ విషయమంతయు ఉపాఖ్యాన సహితముగా నాకు వివరింపుము. వినుటకు నాకు మిక్కిలి ఇష్టము కలదు. కావున విస్తరముగా వివరించి చెప్పవలయును-.

 భరద్వాజుడు చెప్పెమ:- ఓ అర్జునా! నీవడిగినదంతయు విస్తారముగ చెప్పెదను. అగస్త్య తీర్థేముతో మొదలు పెట్టి మిగిలిన తీర్థేములన్నిటి వైభవమును చెప్పెదను. అంతులేని జ్ఞానము కలవాడు, అన్ని లోకముల హితమును కోరువాడు దేవతలకు రాక్షసులకు కూడా పూజ్యుడు అగు అగస్త్యుని చేత భూమికి కొనిరాబడిన ఆ సువర్ణముఖరి యందు స్నానము చేసినవారు ధన్యులగుదురు . మూడు లోకములయందు పవిత్రమైన ఆ తీర్థేము అగస్త్య తీర్థేమని పేరు పొందినది. అచట స్నానము చేయుట వలన మహా పాతకములు కూడా నశించును ముందు జన్మల యందు చేసిన పాపములన్నియు ఇచట స్నానము చేసినందున నశించి మానవులు స్వర్గమును పొందుదురు. ఇంద్రియ నిగ్రహము కల్గిన యతులు ఇచట స్నానము చేసినచో, గోవులను, భూమిని, నువ్వులను, బంగారమును దానమిచ్చినచో గంగాద్వారము నందు వాటిని దానము చేసిన దానికి వందరెట్ల ఫలమును పొందగలరు. లోకమునకు ఆనందమును కలిగించుటకై అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన శివుడిచట అగస్త్యేశుడను పేర ప్రసిద్ధిని పొందెను. ఈ నది యందు స్నానము చేసి, ఆ శివలింగమును పూజించిన వారు పదిఅశ్వమేధ యాగములను చేసిన ఫలమును తప్పక పొందుదురు.

సూర్యుడు ధనూరాశినుండి మకరరాశిలోనికి ప్రవేశించుకాలము ఉత్తరాయణ పుణ్యకాలమని ప్రసిద్ధి పొందినది. ఆ సమయము నందు ఇచట నీయమపూర్వకంగా స్నానము చేసి దేవతలచే సదా పూజింపబడు పార్వతీనాథుడగు శివుని దర్శించినవారు వేయి అగ్నిష్టోమములను, వంద వాజపేయములను చేసిన ఫలమును పొంది స్వర్గమందు దేవతలచే అర్చింపబడుదురు.  సంక్రమణసమయమందు అగస్త్యేశుని పూజించినవారు సమస్త మంగళములను తప్పక పొందుదురు.

దేవ, ఋషి, పితృ తీర్థేముల మాహాత్మ్యము:- ఆ తీర్థేమునకు ఈశాన్యమున క్రోసు దూరమున దేవ, ఋషి పితృ తీర్థేములను మూడు తీర్థేములు కలవు. అగస్త్యునిచే పూజింపబడిన దేవతలు, ఋషులు, పితరులు అన్ని కోరికలను తీర్చుదురు. కనుకనే ఆ తీర్థేములు మూడు దేవ, ఋషి, పితృదేవతల నామములచే ప్రసిద్ధి పొందవలెనని వారు కోరిరి. ఈ మూడు తీర్థేముల యందు ఎవరైతే విధిపూర్వకముగా తర్పణములు విడచుదురో వారు ఋణత్రయము నుండి విముక్తులై క్షయమనునది లేని ఊర్ధ్వలోకమును పొందుదురు.

  వేణా సువర్ణ ముఖరీ నదుల సంగమము:- ఆ తీర్థేములకు గుత్తరమున రెండు యోజనముల దూరమున సువర్ణముఖరీ నదిలో వేణా అను ఒక గొప్పనది కలసెను. మిక్కలి వేగముగా ప్రవహించుట వలన ఒడ్డున ఉన్న చెట్లను కూలద్రోయుచు కాలువల నుండి బయటకు వచ్చిన జలధారలతో అడవులను ముంచెత్తుచూ. ఎత్తైన ఇసుక తిన్నెలపై ఆటలయందు మునిగిన గుంపులు కలదై, తామరల వాసనకు లోనైన తుమ్మెదల గుంపులు కలగినదై. ఎత్తైన పర్వతముల నెన్నిటినో దాచుచు, మరింత నీరు నింపుకొనుచు ఆ నది సువర్ణముఖరిని చేరెను. ఆ రెండు నదులు కలసిన చోట విధిపూర్వకముగ స్నానము చేసిన వారికి పది అశ్వమేధములను చేసిన పుణ్యము కలుగును. వేణానదితో కలసిన సువర్ణముఖరి అడవులను కొండలను దాటుచు ఉత్తరముగా ప్రవహించెను. నాలు యోజనములు అడవులు, కొండల

ఆ ప్రదేశమునకు తూర్పున ఆర్థయోజనపు దూరమున సువర్ణముఖరీ నది తూర్పు వైపుగా ప్రవహించు ప్రదేశము కలదు. అచట అగస్త్యేశ్వరుడను పేర ప్రసిద్ధిపొందిన శివుని లింగము కలదు. ఆ లింగమును స్మరించినంతనే దేవతల, మానవుల పాపములన్నియు నశించును. అచట సువర్ణముఖరి యందు ఇంద్రియ నిగ్రహము కలిగి స్నానము చేసి అగస్త్యునిచే ప్రతిష్ఠింపబడిన పార్వతీ వల్లభుని దర్శించు వారు ధన్యులు. వారు పూర్వజన్మలలో చేసిన పాపమంతయు నశింపగా వారు స్వర్గమునందు అనంతకాలము సుఖముగా జీవింతురు, తరువాత ఆ సువర్ణముఖరి ఉత్తర వాహినిగా ఆర్థయోజనపు దూరము అనేక తీర్థేములు గలదై పారుచున్నది.

సువర్ణముఖరితో వ్యాఘ్రుపదము ఆమ నది వెంగమించుట:- ఆ ప్రదేశమునందు గిరకతాటి, తాటి, మద్ది మున్నగు చెట్లచే నిండినచోట సువర్ణముఖరితో వ్యానుపదము అమనది సంగమించేను. మౌరమైన పెక్కు పాపములను కూడా నాశనము చేయునట్టిది, ఇరుప్రక్కలా దట్టమైన అడవులు కలది. సిద్దస్త్రీలు, గంధర్వగ్రీలు ఎల్లప్పుడు స్నానము చేయునది. తాపస కన్యలచే సమర్పింపబడు బలిపుష్పములు కలది. హంసలు భగ్గురు

పక్షులు మున్నగు పక్షుల గుంపులచే కోలాహలముగా ఉండునది, తూర్పువైపుగా ప్రవహించుచు కొండల నడుమన పారుచున్నదై. సువర్ణముఖరిని చేరిన చోట స్నానము చేసిన మానవులు పది అశ్వమేధములను పూర్తి చేసిన ఫలమును పొందుదురు.

శంఖ తీర్థేముయొక్క వర్ణనము:- ఆ వ్యాఘ్రపదమను నదీతీరమునందు, సమస్త లోకముల పాపములను హరింపగలుగు శంఖతీర్థేము కలదు. బ్రహ్మర్షులు నివసించునది, దేవతలు, గంధర్వులచే సేవింపబడునది, ఆ నదిని చూచుట చేత, స్నానము చేయుట చేత, నీటిని త్రాగుట చేత మిక్కిలి ఆనందమును కలిగించునది.  అగు ఆ శంఖతీర్థేమున 'శంభేశుడు' అను పేర ఈశ్వరుడు కలడు. శంఖుడను మునిచే ప్రతిష్ఠింపబడుటచే ఆ పేర ప్రసిద్ధిని పొందెను.  ఆ తీర్థేమునందు స్నానము చేసి ఈశ్వరుని దర్శించిన వారికి పది అశ్వమేధములను చేసిన ఫలము కలుగును. వారు స్వర్గమునకు పోవుదురు.  అటువంటి ఆ వ్యాఘ్ర పదమను నదితో ఒక యోజనము దూరము ప్రవహించి, మునులచే సేవింప బడుచు స్వచ్ఛమైన, పవిత్రమైన నీరు కలదై శేషాద్రి సమీపమును చేరెను.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీస్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున అగస్త్య తీర్థేము మున్నగు వివిధ తీర్థేముల

మాహాత్మమును వర్ణించుట అను ముప్పై నాల్గవ అధ్యాయము.