స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
28 - అథ కటాహతీర్థే మాహాత్మ్యమ్
కటాహ తీర్థేముయొక్క మాహాత్మ్యము
ఋషులు పలికిరి: – సర్వార్థములు తెలిసినవాడా, వేదవేదాంతముల సారమును ఎరిగినవాడా! వేంకటాద్రియందు పావనమగు కటాహమను తీర్థేము కలదు-1. ఆ తీర్థేము యొక్క మాహాత్మ్యము వినియున్నాము, మూడు లోకములందును ప్రసిద్ధము. వ్యాసుని శిష్యుడవైన నీవు మాకు దీనిని గూర్చి వివరముగా తెల్పుము-2. పూర్వము బ్రహ్మ మానసపుత్రుడు, మహర్షి- అగు నారదుడు నైమిషారణ్యమునకు వచ్చెను- 3. అపుడు మహర్షులు నారదునికి అర్ఘ్యము, పాద్యము మున్నగువాటిచే అర్చించి, యథావిధిగా దర్భాసనమునందు ఆసీనునిగా చేసి మహాభక్తితో తలలు వంచి వినయముతో ప్రార్థించిరి-4, 5. ఓ నారద! ముల్లోకముల యందును ధర్మమును ఉపదేశించుటలో నీకంటే అధికులు ఎవరును లేరు-6. మహాపుణ్యము, సమస్తదేవతలు అర్చించునది, వైకుంఠము నుండి వచ్చినది, దివ్యమైనది, సిద్దులు, గంధర్వులచే పూజింపబడునది అగు వేంకటాద్రిపై కల కటాహతీర్థేమును గూర్చి వనములో నివసించు మాకు తెలియజెప్పుము.
నారదుడు చెప్పెను: - శౌనకాది మహామునులారా! వినుడు. కటాహతీర్థేము యొక్క మహత్తును ముల్లోకములలో ఎవరు తెలిసికొనగలరు - 9. మహాదేవుడు మాత్రమే ఆ తీర్థేము యొక్క వైభవమును తెలిసికొనగలడు. పుణ్యమును ప్రసాదింపగల తీర్థేములు ఈ బ్రహ్మాండములో ఎన్నో కలవు. ఆ గంగాది తీర్థేములన్నియు తమ పాపములను పోగొట్టుకొనుటకు కటాహతీర్థేమునే సేవించుచున్నవి-10, 11. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర జాతులవారు ఈ తీర్థేమునందలి జలమును తాకుచున్నారని ఆ తీర్థేపు నీటిని త్రాగని మానవుడు చండాలునిగా పుట్టి కుంభీపాక నరకమందు పడితీరును- 12. బ్రహ్మచారీ కాని, గృహస్థు కాని, వానప్రస్థుడుకాని, యతీశ్వరుడుకాని ఈ తీర్థేమును సేవించి పరమపదమును పొందుచున్నారు. శృతుల యందు, స్మృతుల యందు, పురాణముల యందు ఆ తీర్థేముయొక్క ప్రశంస కలదు-13, 14. పంచ మహాపాతకములను నాశనము చేయు ఆ తీర్థేము యొక్క ప్రభావము అనేక విధములుగా వర్ణితమైనది. అన్ని లోకములను పవిత్రము చేయు ఈ తీర్థేమును గూర్చి అద్భుతముగ వర్ణితమైనది-15. పదివేల బ్రహ్మహత్యలు, సురాపానములు, గురుతల్ప గమనము, దొంగతనములు, కోటి సంసర్గ దోషములు ఈ తీర్థే సేవనమువలన వెంటనే నశించును-16, 17. నిష్కృతి లేనటువంటి వివిధ పాపములు అన్నియు ఈ తీర్థే స్నానము వలన నశించును-18. ఈ తీర్థేము మహాపుణ్య ప్రథము. భగవంతుని పాదములనుండి జాలువారినది. కుష్ఠు మున్నగు రోగములతో కూడియున్నచో ప్రతిదినము ఈ తీర్థేము యొక్క నీటిని త్రాగవలయును.
కటాహతీర్థేముయొక్క మహిమపై శ్రద్ద చూపనివారికి వరకము ప్రాప్తమగువమట:- అతడు రోగములన్నియు పోయి విష్ణు లోకమును పొందును. ఒకసారి శివుడు పార్వతికి ఏకాంతమున ఈ తీర్థేము యొక్క వైభవమును తెల్పెను. పైన చెప్పిన వాటి గురించి ఎన్నడును సందేహము కలిగి ఉండరాదు-20, 21. ఇది కేవలము అర్ధవాదమని ఎప్పుడును అనకూడదు. అట్లన్న నాస్తికుల నాలుక కొనపై యమకింకరులు కాల్చిన గొడ్డలిని ఉంచుదురు. కనుక కటాహ తీర్థేమును ప్రయత్నించి అయినను సేవింపవలయును-22, 23. అన్ని దుఃఖములను అణచునది, మోక్షమును ఇచ్చునది అగు ఈ తీర్థే జలము తాగినచో అన్ని కోరికలు తీరును-24. అని మహానుభావుడగు నారదుడు మాకీ విషయమును తెల్పి మూడు లోకములను పావనము చేయు కాశికి వెళ్లాను-25. కాని నారదుడు నైమిషమునందు ఈ తీర్థేవైభవమును సంక్షిప్తముగా తెల్పెను-26. ఆ విషయమును మాపై దయ ఉంచి విస్తరముగా తెల్పుము.
కటాహతీర్థేముయొక్క నీటిని త్రాగు క్రమము:- నైమిషారణ్యమునందు నివసించు ఓ తపోధనులారా, కటాహతీర్థేముయొక్క వైభవమును వినుడు-28. ఈ కటాహతీర్థేము అన్ని లోకములయందు ప్రసిద్ధి పొందినది. అన్ని సంపదలను కలుగజేయునది. అన్ని పాపములను నాశనము చేయునది-29. దుఃస్వప్నములను దూరము చేయునది. మహాపాతకముల బారి నుండి కాపాడునది, మహా విఘ్నములను తొలగించునది. గొప్ప శాంతిని ప్రసాదించునది-30. తలచినంతనే మానవుల పాపములను నాశనము చేయునది అగు ఈ తీర్థేము యొక్క నీటిని అష్టాక్షర మంత్రమును పఠించుచు త్రాగవలెను-31. లేనిచో కేశవాది ఇరవై నాలు నామములను స్మరించుచు త్రాగవలెను. కనీసము కేశవాది మూడు నామములతో అయినను శుభప్రదమగు నీటిని త్రాగవలెను-32. వేంకటేశుని అష్టాక్షరి మంత్రముతో కటాహతీర్థే జలమును త్రాగినచో భుక్తిముక్తి కలుగును-33. మంత్రమును పఠించకుండా నీటిని త్రాగు బ్రాహ్మణుడు ‘పూర్వజన్మలో నేను చేసిన పాపమును నాశనము చేయుము’ అని పలికి నీటిని త్రాగినచో మోక్షమును కలిగించును-34. స్వామి పుష్కరిణిలో స్నానము, వరాహస్వామి దర్శనము, కటాహ తీర్థేమున నీటిని త్రాగుట మూడును ముల్లోకముల యందు దుర్లభము. బ్రహ్మహత్యా పాతకమును సహితము నాశనము చేయు ఈ తీర్థేము యొక్క వైభవమును ఏమని వర్ణింపగలము.
కేశవుడమ బ్రాహ్మణుని కథ:-పూర్వము కేశవుడు అను బ్రాహ్మణుడు దుర్బుద్ధి వలన ఒక బ్రాహ్మణుని ఖడ్గముతో సంహరించి బ్రహ్మహత్యా పాతకమును పొందెను-37. మహాపాపమును ఒనర్చిన ఆ కేశవుడు కటాహ తీర్థేమునందు నీటిని త్రాగి ఆ బ్రహ్మహత్య నుండి ముక్తిని పొందెను.
ఋషులు అడిగిరి:- ఈ కేశవుడు ఎవని కుమారుడు? భయంకరము, అతి క్రూరము అగు బ్రహ్మహత్యను ఎట్లు చేసినాడు? మాకు చెప్పవలసినది.
సూతుడు చెప్పెను: -తుంగభద్రానది ఒడ్డున గంధర్వులు సేవించు వేదాధ్యమను గొప్ప ఆగ్రహారము కలదు40. ఆ వేదపురమునందు బ్రాహ్మణులందరు వేదసారము నెరిగిన వారు, శబ్దశాస్త్రమును చదివినవారు, జ్యోతి శాస్త్రము తెలిసినవారు-41. మీమాంస, తర్కము నేర్చినవారు. వేదాంతమును ఆకళింపు చేసుకొన్నవారు. ధర్మశాస్త్రములను పాటించువారు, అన్నదానము చేయువారు -42. పుత్రులు కలవారు. అట్టి వేదపురమునందు పద్మనాభుడను బ్రాహ్మణుడు కలడు.
వేశ్యాలోలుడగు కేశవునికి బ్రహ్మహత్యా పాతకము చుడ్పుకొనుట:- అతడి కుమారుడు కేశవుడు అన్ని కర్మలను వదలి పెట్టెను. తల్లిని, తండ్రిని పతివ్రతయగు భార్యను కూడా వదలి పెట్టెను-44. ఎప్పుడూ వేశ్యలయందు ఆసక్తుడై వారి గృహమున ప్రవేశించెను. రెండు నాళ్లు ఆమెను అనుభవించి రెండు నిష్కములనామెకిచ్చి సుఖమును పొందెను. కాని ధనము అయిపోవుటచే వేశ్య ఆతడిని విడిచి పెట్టెను-45, 46. ఆమెను తిరిగి పొందవలెనను కోరికతో అక్కడక్కడ దొంగతనము చేయసాగెను. వాటిని ఆమెకిచ్చి చాలాకాలము కలసి జీవించేను. కలసి భుజించేను- 47. ఆమెతో కలసి ఒకే పాత్రయందు మద్యమును త్రాగెను. ఒకనాడు కిరాతులతో కలసి దొంగతనమునకు బయలు దేరెను.
కిరాత వేషమును ధరించిన ఆ కేశవుడు సాహసి అయి ఖడ్గమును ధరించి ఒక బ్రాహ్మణుని ఇంటి ప్రవేశించెను-49. ఆ ఇంటి యజమానిని తన ఖడ్గముతో తెగనరకి చాల ధనమును అపహరించి వేశ్య ఇంటికి వెళ్లాను-50. పోవుచున్న అతడిని భయంకరమగు బ్రహ్మహత్య అనుసరించెను. అది నల్లటి వస్త్రములు ధరించి రాద్రములో ఎర్రని వెంట్రుకలు కలిగి ఉండెను -51. అట్టహాసముగా గర్జించుచు, ఆకాశమును కంపింప జేయుచు ఆ బ్రహ్మహత్య ఆ బ్రాహ్మణుని వెంటపడేను-52. ఓ శౌనకాది మహానుభావులారా! బ్రహ్మహత్యచే అనుసరింపబడుచున్న దురాత్ముడగు ఆ బ్రాహ్మణుడు తిరిగి తిరిగి తన గ్రామమునకు చేరెను-53. భయభీతుడగు అతడు తన ఇంటికి వెళ్లేమ. బ్రహ్మహత్య కూడ అతడితో ఆ ఇంటిలోనికి ప్రవేశించెను-54. రక్షింపుము, రక్షింపుమనీ కేశవుడు తండ్రిని శరణు వేడెను. అతడి తండ్రి భయపడకుమని చెప్పి అతడిని రక్షించుటకు ఉద్యుక్తుడయ్యెను.
తన కుమారుని రక్షించుటకు ప్రయత్నించుచున్న పద్మనాభునితో బ్రహ్మహత్య మాట్లాడుట క్రూరమగు ఆ బ్రహ్మహత్య కేశవుని తండ్రితో ఇట్లనెను. 56.
బ్రహ్మహత్య పలికెను:- ద్విజోత్తముడవగు ఓ పద్మనాభా, నీవీతని రక్షింపకుము. ఇతడు మద్యమును ద్రాగినవాడు, దొంగతనము చేసినవాడు, మహాపాతకమగు బ్రహ్మహత్య చేసినవాడ-57. తల్లికి, తండ్రికి ద్రోహము చేసినవాడు, భార్యను వదలి పెట్టిన చెడుబుద్ధికలవాడు. వేశ్యలంపటము కలవాడు. కనుక ఈ దురాత్ముని వదలి పెట్టుము-58. ఈ మహాపాపిని నీవు రక్షింప పూనినట్లయితే నీ భార్యను, ఇతడి భార్యను, నిన్ను, ఇతడిని, మొత్తము వంశమును తినివేయగలను. నీ ఈ పుత్రుని వదలినచో ఇప్పటికి మీమ్మందరిని వదలి పెట్టగలను-59, 60. ఒక్కని కొరకు కుటుంబమునంతను నాశనము చేసుకొనుట తగదు. అని ఆ బ్రహ్మహత్య పలుకగా పద్మనాభుడు దానితో ఇట్లనెను.
పద్మనాభుడు పలికెను:- పుత్రునిపై ప్రేమ నన్ను బాధించుచున్నది. కనుక అతడిని ఎట్లు వదలి పెట్టగలను? ఆది విని బ్రహ్మహత్య పద్మనాభునితో ఇట్లనెను-62.
బ్రహ్మహత్య పలికెను:- నీ పుత్రుడు పతితుడు. వర్ణము, ఆశ్రమము నుండి బహిష్కరింపబడినాడు. ఇతడియందు నీవు వాత్సల్యము పెంచుకొనకు. ఇతడిని చూచుటయే నిందింపతగినదీ-63. అని పలికి ఆ బ్రహ్మహత్య పద్మనాభుడు చూచుచుండగనే అతడి కుమారుని చేతితో చరచెను-64. అతడు తండ్రి రక్షింపుము. రక్షింపుమని గట్టిగా అరచచు ఏడ్చెను. అది చూచి అతడి తండ్రి, తల్లి, భార్య ఏడ్వసాగిరి.
పద్మవాభునికి భరద్వాజు బ్రహ్మ మండి విముక్తిని పొందు ఉపాయమున చెప్పుట:- ఆ సమయమున మహానుభావుడగు భరద్వాజ మహాముని ఆ పద్మనాభుని అదృష్టము కొద్ది అచటకు వచ్చేను-66. పద్మనాభుడు భరద్వాజ మహామునికి నమస్కరించి, స్తోత్రము చేసి పుత్రుని రక్షింపవలసినదని శరణు వేడెను-67. మహానుభావుడవగు ఓ భరద్వాజుడా! నీవు సాక్షాత్తు విష్ణువు యొక్క అంశకలవాడవు. నీ దర్శనము పాపాత్ములకు ఎప్పుడును కలుగదు-68. నా ఈ పుత్రుడు బ్రహ్మహత్య, సురాపానము, దొంగతనము చేసినాడు. ఇతడిని చంపుటకు బ్రహ్మహత్య వెంటపడినది 69. నా పుత్రుడు మహాపాతకముల నుండి బయటపడుటకు, పరమగు బ్రహ్మహత్య వీలగునంత త్వరలో నాశనమగునట్లు ఒక ఉపాయమును చెప్పి నా కుమారుని రక్షింపుము. నాకు ఒక్కడే కుమారుడు వేరొకడు లేడు-70, 71. ఈ కుమారుడు మరణించినచో నా వంశము నిలచిపోవును. అపుడు పితరులకు పిండదానము చేయువాడు కూడ ఉండడు -72. కనుక మా యందు దయచూపుము అని పలుకగా సాక్షాత్తు నారాయణనుని అంశకల భరద్వాజుడు చాలా సేపు ధ్యానము చేసి పద్మనాభునితో ఇట్లనెను.
భరద్వాజుడు చెప్పెను:- ఓ పద్మనాభా! నీ కుమారుడు చేసిన పాపము అతిక్రూరమైనది. పదివేల ప్రాయశ్చిత్తములు చేసినను ఈ పాపమునకు శాంతి లేదు-75. అయినప్పటికి నీ కుమారునికి పాపశాంతి కొరకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను వినుము-76. గంగకు దక్షిణ భాగమున రెండు వందల యోజనముల దూరమున, తూర్పు సముద్రమునకు పడమరగా ఐదు యోజనముల దూరము గలదు-77. సువర్ణముఖి నదీ తీరమునకు ఉత్తరమున క్రోసు దూరమున వేంకటాద్రి అను పర్వతము, సమస్త లోకములచే ఆరాధింపబడునది కలదు-78. ఆ పర్వతము మేరువు సంతానము. మహాపుణ్య ప్రదము, సమస్త దేవతలచే ఆరాధింపబడునది, వైకుంఠమునుండి వచ్చినది. విష్ణువునకు మిక్కిలి ఇష్టమైన ఆటస్థలము-79. గరుడుని కంటె వేగముగా పోవునది, స్వర్ణముఖినదీతీరమునందు, దేవతలు, ఋషులు మొదలగు వారిచే పూజింపబడునది.
ఆ వేంకటాద్రియందు విష్ణుమూర్తి స్వయముగా లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవులతో వచ్చి యుండెను-81. ఆ వేంకటేశుడు మోక్షమునిచ్చువాడు. ఆ వేంకటేశుని ఆలయమునకు ఉత్తరమునందు మంగలప్రదమగు కటాహ తీర్థేము కలదు. ఆ తీర్థేము బ్రహ్మహత్య మున్నగు పాపములను హరించును. కోరిన ఆర్థములను తీర్చునది-82, 83. ఆ తీర్థేమునకు పోయి, నీవు కుమారునితో కలసి ఆ తీర్థేజలమును త్రాగుము. అని భరద్వాజుడు వేదసంమితమగు మాటలను చెప్పగా ఆ పద్మనాభుడు భరద్వాజునికి తలవంచి నమస్కారము చేసి వేంకటాద్రికి వెళ్ళెను-84, 85.
భరద్వాజుడు చెప్పిన విధముగా కేశవుడు కటాహతీర్థేమున వీటిని త్రాగుట చేత బ్రహ్మహత్య మండి విముక్తిని పొందుట:-ఆ వేంకటాద్రికి వెళ్లి స్వామి పుష్కరిణి యందు ఆ బ్రాహ్మణుడు కుమారునితో కలసి నియమ పూర్వకముగా స్నానము చేసెను-86. వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయమునకు వెళ్లాను. అచట ప్రదక్షిణము చేసి విమానమునకు నమస్కరించెను-87. తరువాత ఆ పద్మనాభుడు తన కుమారుడగు కేశవునితో బ్రహ్మహత్యను నాశనము చేయు కటాహ తీర్థేమునకు వెళ్లి ఆ తీర్థే జలమును త్రాగెను-88. అపుడా బ్రహ్మహత్య శీఘ్రముగా మాయమయ్యెను. పిమ్మట ఆ బ్రాహ్మణుడు దయాసముద్రుడగు స్వామి వద్దకు కుమారునితో వచ్చి స్వామిని దర్శించెను. అపుడు స్వామి వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను-89, 90. వారు కటాహ తీర్థేజలమును పానము చేయుటచే మిక్కిలి సంతసించి ఇట్లనెను.
బ్రహ్మహత్య నుండి బయట పడిన కుమారునితో వచ్చిన పద్మనాభునితో స్వామి పలుకుట:
స్వామి పలికెను:- తపోధనులగు ఓ శౌనకాది మహామునులారా! కటాహతీర్థే మాహాత్మ్యమును మీకు సోదాహరణముగా నేను విన్నది విన్నట్లు మీకు చెప్పితిని-97, 98.
ఎనభైఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచలమాహాత్మ్యమందలి కటాహతీర్థేముయొక్క ప్రశంసనము అను ఇరవై ఎనిమిదవ అధ్యాయము.
