స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
26 - తుంబురు (ఘోణ) తీర్థము యొక్క మహిమ
సూతుడు చెప్పెను:- శౌనకాది మహామునులారా మీకిపుడు అన్ని పాపములను పోగొట్టు ఘోణ తీర్థేముయొక్క మాహాత్మ్యమును చేప్పెదను -1. అచట స్నానము చేయుట అనునది పూర్వజన్మ తపఃఫలము వలన కలుగును. ఉత్తరాఫల్గుణి నక్షత్రముతో కూడుకున్న పౌర్ణమినాడు సూర్యుడు మీనరాశిమందు ఉండగా మధ్యాహ్న సమయమునందు ముల్లోకములయందు ఉన్న గంగామున్నగు తీర్థేములన్నియు తుంబతీర్థేమునకు వచ్చుచున్నవి.
ఋషులు పలికిరి:- సర్వం తెలిసినవాడా, అన్ని శాస్త్రముల సారమునుఎరిగినవాడా, సూతుడా! పరమపావనమగు ఘోణ తీర్థేమునందు ఏ నిమిత్తము సూర్యుడు మీనరాశిలో ఉన్నపుడు గంగాది తీర్థేములు వచ్చుచున్నవి.
సూతుడు చెప్పెను:- పాపములు చేసిన మానవుల మనయందు స్నానముచేసి తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి -6. కాని సంక్రమించిన ఆ పాపములను మనమెట్లు పోగొట్టుకొనగలము. అని గంగాది తీర్థేములు ఆలోచించినవి -7. నారద మహర్షి చెప్పిన మనోహరమైన, దివ్యమైన అన్ని పాపములను పోగొట్టునట్టి మాటలను తలచుకొనిరి -8. ఆ మాటలననుసరించి బ్రహ్మహత్యమున్నగు ఘోరపాపములను నశింపచేయు వేంకటాద్రికి వెళ్ళి అచట తీర్థేములలో ఉత్తమమగు స్వామి పుష్కరిణియందు స్నానము చేసిరి -9. పిమ్మట అతి పవిత్రమగు ఫణతీర్థేమునందు ఉత్తరాఫల్గుణితో చంద్రుడు కూడిన పౌర్ణమినాడు సూర్యుడు మీనరాశిలో ఉండగా సర్వతీర్థేములు స్నానము చేసినవి. ఇక ఆ తీర్థేము యొక్క మహత్తును గూర్చి మల్లోకములయందు ఎవరు తెలిసికొనగలరు.
ఘోణ తీర్థేమునందు స్నానము చేయుటకు విముఖులగు వారికి మహాదోషములు కలుగుట:- కనుక వణతీర్థే ములలో కెల్ల పుణ్యతనుమైనది -12. తోటలు నర కువాడు, క్రూరుడు, కన్యలను, అశ్వములను విక్రయించువాడు, ఘోణస్నానమును ఇచ్చగింపనివాడు బ్రహ్మఘాతకుడనబడును -13. దేవుని ద్రవ్యమును, ఇచ్చిన దానిని అపహరించువాడు ఘోణస్నానము వదలినవాడు బ్రహ్మషూత కుడు -14. చెరువులను, వంతెనలను పడగొట్టువాడు, పరస్త్రీలతో రమించువాడు,ఫణస్నానము వదలినవాడు దొంగ అనబడును -15. బ్రాహ్మణునికి ఇచ్చుచునని పలికి ఇవ్వనివాడు, ఘోణస్నానము వదలినవాడు సురాపానము చేసినవానితో సమానుడు -16. గురువులను బ్రాహ్మణులను ద్వేషించువాడు, తనను తాను పొగడుకొనువాడు, ఫణస్నానము వదలినవాడు దొంగ అనబడును -17. సంస్కృతముకాని అన్నమును భుజించినవాడు, పితృశేషమగు అన్నమును భుజించినవాడు, ఘోణస్నానము వదలినవాడు దొంగ అనబడును -18. పితృశేషమగు అన్నమును దానము చేయువాడు, తల్లి దండ్రులను ద్వేషించువాడు, ఘోణస్నానము వదలినవాడు దొంగ అనబడును -19. పరస్త్రీలతో రమించువాడు, సోదరుని భార్యతో రమించువాడు, ఫణస్నానమును వదలినవాడు గురుతల్పమును చేరినవాడితో సమానుడు - 20. చండాలునితో మాట్లాడు విప్రుని, దర్భలను ఎల్లప్పుడు ధరించని వానిని ఘోణస్నానము వదలినవానిని గురుతల్పగుడందురు -21.
రజస్వల మాటలను, కుక్క అరుపును, చండాలుని మాటలను విన్న తరువాత భోజనము చేసినవానిని, ఘోణస్నానము వదలిన వానిని సంసర్గదోషము చేసిన వాడందురు -22. పురాణము, వివాహము, మౌంజీ మున్నగు ధర్మములను విఘ్నము చేయువానిని, ఫణస్నానము వదలినవానిని పశువులను చంపినవానిగా పరిగణింతురు -23. శరణుకోరిన వానిని చంపినవానిని, ఏ తీర్థేమునకు పోనివానిని, ఘోణస్నానము వదలినవానిని శిశుహంతుకుడందురు -24. పితృ యజ్ఞము చేయనివానిని, భార్యను వదలిన వానిని, కులాధముని, ఫణస్నానము వదిలిన వానిని గోవును చంపినవాడందురు -25. మహా పాపములతో సమానమైన నీచపాపములు చేసినవానిని, ఘోణస్నానము వదలిన వానిని ఆశ్రయించును.
ఘోన స్నానము చేసినవారికి అన్ని పాపములు నశించుట :-మహాపాపములు చేసినవాని, కుక్క మాంసము తినువాని, కులాధముని, క్రూరుని, కుటుంబమును నాశనముచేయువాని, దానములు చేయనివాని, కర్మలు వదలివేసినవాని -27. పశువులను చంపినవాని, ఇతరులకు ద్రోహము చేసినవాని ఆశ్రయించినవాని, పిసినారి, అబద్ధములు చెప్పువాని, దంభుని, ఇతరుల భార్యతో రమించువాని -28. మిత్ర ద్రోహము చేసినవాని, కృతఘ్నుని, శిశువులను చంపువాని, పాపములు చేయువాని, ఇతరుల ధనమును ఆశించువాని -29. సత్యము చెప్పనివాని, వ్యవసాయము చేయువాని, స్వామిద్రోహము చేసినవాని, వంచకుని, లోభముకలవాని, తండ్రిని చంపినవాని, దేవుని పై పరాజీముఖత కలవాని -30. తనను తాను ప్రశంసించుకొనువాని, ధర్మమును విఘ్నము చేయువాని, శఠుని, అపాత్రునియందు ధనము వ్యయము చేయువాని.
చక్కని ఆకులు పండ్లుకల చెట్టును నరికినవాని, విశ్వాసఘాతకుని, వీరులను హత్యచేసినవాని -32. అగ్నిని పోషించనివాని, పుత్రులులేనివాని, విషమును ప్రయోగించువాని, గురువును ద్వేషించువాని, పాపిని, దంపతుల మధ్య తగవులు పెట్టువాని -33. గ్రామమునకు నాయకత్వము వహించువాని, దేవాలయమును నిర్వహించువాని, జీతము తీసికొని చదువు చెప్పువాని, క్రూరమగు కర్మలు చేయు బ్రాహ్మణుని -34. సేవకులచే పాపములు చేయించువాని, రహస్యముగా షాపములు చేయువాని, తెలియక పాపములు చేయువాని, తెలిసి చెడ్డపనులు చేయువాని పాపములను మనోహరమగు ఫణ తీర్థేము నశింపజేయును. ఆహా ఘోణ తీర్థేము యొక్క గొప్పదనము ఏమని చెప్పగలము.
తుంబురుడను గంధర్వుని చరిత్ర
సూతుడు పలికెను:- అన్ని పాపములను పోగొట్టునది, మోక్షమును ప్రసాదించునది అగు కథను చెప్పేదను - 37. పూర్వము మహాతేజస్సుకలవాడు, అన్ని విద్యలలో విశారదుడు, సర్వజ్ఞుడు, నీతిమంతుడు, బ్రాహ్మణుడు, ఇంద్రియములను జయించినవాడు అగు గార్యుడు ఇట్లు అడిగెను -38. మహాత్ముడగు దేవలునికి నమస్కరించి, ఓ మహానుభావ, నాయందు కరుణ చూపుము. అన్ని పాపములను హరించునది, శుభకరమైనది అగు ఫణ తీర్థేమును గూర్చి వివరింపుము.
దేవలుడు చెప్పెను:- తుంబురుడను గంధర్వుడు పతివ్రతయగు భార్యను శపించి పాపమును పొందినవాడై ఈ తీర్థేము నందు స్నానము చేసి స్వామిని సేవించి, తిరిగి వచ్చుటలేని విష్ణులోకమును పొందెను.
గార్గ్యుడు చెప్పెను:- ఓ ఋషీ! సర్వవిద్యా విశారదుడైన తుంబురుడు ఏల రూపవతి అయిన తన భార్యను శపించెను? -42. సకల సద్గుణములు గల ఆమెయందు ఏమిదోషమున్నది? దీనిని వినుటకు నాకు కుతూహలము కలదు.
తుంబురుడు తన భార్యకు మాఘస్నానము చేయవలసిన విధి చెప్పుట:- తుంబురుడను గంధర్వుడు భార్యతో ఇట్లనెను: మాఘ త్రయమందు కల్మషములను తొలగించు స్నాన మును నాతో కలసి చేయుము -44. మాఘమాసమునందు సూర్యుడు ఉదయింపగనే అన్ని కల్మషములను నాశనము చేయు ఈ తీర్థేము యొక్క తీరమునందు విష్ణుపూజ కొరకు గోమయముతో అలుకుము -45. పద్మము, స్వస్తిక్ మున్నగు శుభకరమగు ముగ్గులను తీర్చి దిద్దుము. మంగళప్రదమగు విష్ణుమాసమునందు నాకు సేవ చేయుము -46. మాఘమాసము నందు విష్ణువు కొరకు దీపవర్తికను తయారు చేయుము, స్వామి ఎదుట పొగవచ్చుచున్న అగ్నిని భక్తితో సమర్పించుము -47. స్వామి కొరకు శుచివై వంటచేయుము. భక్తితో నాతో కలసి ప్రదక్షిణము, నమస్కారము చేయుము -48. దేవ దేవుడగు స్వామికి ప్రతిదినము సపర్య చేయుము. విష్ణు సంబంధమైన పురాణములను వినుము -49. నిత్యము స్నానముచేసి విష్ణుపాదోదకమును త్రోవుము, కృష్ణా, విష్ణు, ముకుందా, నారాయణ, జనార్దనా -50. అచ్యుతా, అనంతా, విశ్వాత్మా అని ఎల్లప్పుడు కీర్తించుము. కోపము మాత్సర్యము, లోభము మున్నగునవి వదలి వ్రతమును ఆచరింపుము -51. దానివలన నీకు ముక్తి కలుగును. విష్ణులోక ప్రాప్తి కలుగును.
తుంబురు భార్యకు శాపమిచ్చి శాపావసానము తెల్పుట:- ఈ విధముగా భర్త చెప్పగా అతడి భార్య కోపముతో సహింపరాని, దుర్గతిని కలిగించు మాటలనిట్లనెను -52. మాఘమాసమునందు చలి ఉండును. సూర్యోదయ సమయంలో స్నానము చేయుట ఎట్లు? -53. నీవు చెప్పిన పనులు నేను చేయజాలను. నీతో కలసి ప్రాతఃకాలమునందు స్నానముచేయును -54. చలికి నేను మరణించినచో నీవు రక్షింపజాలవు అని ఆమె పలుకగా గంధర్వునికి కోపము వచ్చేను -55. స్వభావము చేత శాంతుడైనప్పటికి అప్రియముగా పలుకుచున్న భార్యకు శాపమిచ్చెను. ధర్మవిముఖుడైన పుత్రుని, అప్రియముగా పలుకు భార్యను, వేదములు చదువని రాజును వెంటనే శాపముతో దండింపవలెను. అను న్యాయమును దలచి అతడు భార్యకు శాపమిచ్చెను -56,57. అన్ని పాపములను నశింపజేయునది, మహాపుణ్య ప్రదము అగు వేంకటాద్రి పై ఘోణ తీర్థేముయొక్క సమీపమున రావిచెట్టు తొర్రలో నీరులేనిచోట కప్పవై పడి ఉండుము అని భర్త శాపమివ్వగా ఆ గంధర్వ స్త్రీ భర్త పాదములపై పడి క్షమింపుమని వేడగా ఆ తుంబురుడు శాప విమోచనము నిట్లు చెప్పెను.
మహానుభావుడు, తాపసి, ఇంద్రియములను జయించినవాడు అగు అగస్త్యుడు హొణతీర్థేమునందు పౌర్ణమి తిథినాడు ఆ రావిచెట్టు వద్ద శిష్యులకు ఫణ తీర్థేము యొక్క వైభవమును వర్ణించును -61, 62. అపుడా చెట్టు తొర్రలో ఉన్న నీవు మోక్షదాయికమగు ఫణ తీర్థేముయొక్క మహత్తును విందువు -63. అన్ని పాపములు నశింపగా పూర్వరూపమును పొంది నాతో రమింతువు అని శాపవిమోచనమును చెప్పను -64. పతివ్రతయగు ఆమె భర్తయొక్క శాపము వలన కప్పుగా మారెను. మెల్ల మెల్లగా శేషాద్రిపై ఉన్న ఘోణతీర్థేవరే ణతీర్థేమునకు వెళ్ళి అచట ఉన్న రావిచెట్టు తొర్రలో పదివేల సంవత్సరములు అచటనే గడిపెను.
తరువాత కొంతకాలమునకు మనోహరమగు వేంకటాద్రికి అగస్త్యుడు శిష్యసమేతుడై వచ్చి స్వామి పుష్కరిణియందు నియమ పూర్వకముగా స్నానము చేసెను -67. పుష్కరిణికి దక్షిణమందున్న వరాహస్వామికి నమస్కరించి వేంకటేశుని ఆలయమునకు వెళ్ళెను -68. అచట వేదములచే తెలియదగినవాడు, విశాలమైన కన్నులు కలవాడు, దేవదేవుడు, నిత్యుడు అగు స్వామికి నమస్కరించి అగస్త్యుడు మౌణతీర్థేమునకు వెళ్లాను -69. అచట తీర్థేమునందు స్నానము చేసి తన శిష్యులతో కూడి రావిచెట్టు నీడలో కూర్చుండెను -70. బ్రహ్మహత్యా పాతకమును కూడ నాశనము చేయునది, అన్ని శుభములను ఇచ్చునది, పుణ్యప్రదమైనది, అన్ని విధములైన సంపదలను ఇచ్చునది అగు ఘోణతీర్థేముయొక్క మాహాత్మ్యమును శిష్యులకు వివరించెను.
ఘోణతీర్థేమువద్ద అగస్త్యుని దర్శించుట వలన తుంబురు పత్నికి మండూకత్వము పోవుట:- ఆ వైభవమును విన్న మండూకము యోగిపాదములపై పడెను, అపుడామెకు జ్ఞానదీపము వలన మునియొక్క వైభవము తెలిసికొనెను -73. పూర్వరూపమగు మనోహరమైన స్త్రీ రూపమును పొందెను. ఓ అగస్త్యా యోగులలో శ్రేష్ఠుడా, దయానిధీ నన్ను రక్షింపుము -74. దయతో నన్ను రక్షింపుము నేను భర్త మాటను విననిదానిని. అని పలికి ఆమె ఊరకుండెను.
అగస్త్యుడు చెప్పెను:-నీ వెవరు? నీకు శుభము కలుగును, నీకీ కప్పరూపము వచ్చుటకు పూర్వ జన్మమునందు ఏమి పాపము చేసితివో చెప్పుము.
ఆమె చెప్పెను :- అన్ని విద్యలలో విశారదుడగు తుంబురుడు అను గంధర్వుని భార్యను నేను -77. అన్ని ధర్మములు తెలిసిన నా భర్త ఎల్లప్పుడు అన్ని ధర్మములను తనతో పాటింపుమని కోరెను -78. పరలోకమునందును ఉపకారము చేయునట్టి నా భర్త మాటలను విని సహింపక దుర్గతిని కలిగించు మాటలను నాకు పుట్టిన దుర్బుద్ధివలన పలికితిని.
అగస్త్యుడు చెప్పిన పతివ్రతా ధర్మములు:
అగస్త్యుడు చెప్పెను:- నీ భర్త కుశాగ్రబుద్ది. కనుకనే నిన్ను కోపముతో శపించెను. నీకీ విధముగా భర్తవాక్యమును విననందువల్ల శాపమిచ్చుట యుక్తమే -81. భర్త వాక్యమును వినక స్వేచ్చగా ప్రవర్తించు స్త్రీ సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకము నందుండును -82. స్త్రీకి స్వాతంత్ర్యము ఉండరాదు. ఆమె భర్త మాటను జవదాటరాదు. పుణ్య ప్రదమగు పాతివ్రత్యము వలన, భర్తకు సేవ సేయుట వలన స్త్రీలు విష్ణు పదమును పొందుదురు. ఎన్ని వ్రతములు చేసినను ఫలములేదు -83, 84. పతియే జగన్మాత, అతడే విష్ణువు, బ్రహ్మ, శివుడు, అతడే గురువు, తీర్థేము అని బుధులు తెల్పుదురు -85. భర్తమాటను వినక స్త్రీ ఎన్ని వ్రతములు చేసినను ఆమె శుద్ధురాలుకాదు. ధర్మము తెలిసినవారు చెప్పునట్లు భర్తలేని స్త్రీ చేసిన వ్రతములు నిరుపయోగములు. భర్త అనుమతితో చేసినచో అవి సఫలములగును - 86,87. భర్త పాదోదకముచే స్నానము చేసిన స్త్రీ లక్ష్మితో సమానమగును. ఆమె గంగాది తీర్థేములన్నిటిలో స్నానము చేసినట్లే. దీనియందు సందేహము లేదు -88. కనుక నీవు చేసిన దోషముయొక్క ఫలమును అనుభవించుచు ఇచటనే ఉంటివి -89. ఘోణ తీర్థేము యొక్క వైభవమును వినుటచేత నీకు మండూకరూపము నుండి విముక్తి కలిగి పూర్వ రూపమును పొందితివి -90. దీని వలన ఈ తీర్థేము యొక్క వైభవము జగత్తులో ప్రసిద్ధిని పొందినది.
ఘోణతీర్థేమునందు స్నానము చేసినవారికి పలువిధములైన ఫలము కలుగుట:- సర్వపాపములను నాశనము చేయునది, మహాపుణ్య ప్రదము అగు ఘోణ తీర్థేమునందు పౌర్ణమినాడు స్నానము చేయువారికి యజ్ఞము చేసిన ఫలము, పదివేల తీర్థేముల యందు స్నానము చేసిన ఫలము కలుగును. వేయి కపిల గోవులను ప్రతిదినము దానమిచ్చిన ఫలము కలుగును -92, 93. వేయి కోట్ల రత్నములను ప్రతిదినము ఇచ్చిన ఫలము ఫణతీర్థేస్నానము వలన కలుగును -94. వేయి మదపుటేనుగులు, పదివేల గుర్రములు దానమిచ్చిన ఫలము ఫణ తీర్థేస్నానము వలన కలుగును -95. కన్యాదానము చేయుటవలన ఏ ఫలము కలుగునని ఋషులచే చెప్పబడినదో ఆ ఫలము ఘోణ తీర్థే స్నానము వలన కలుగును.
కురుక్షేత్రమునందు వేయి బంగారు పట్టు వస్త్రములను దానమిచ్చిన ఫలము ఘోణతీర్థే స్నానము వలన కలుగును -97. గురువుకొరకు, బ్రాహ్మణుని కొరకు, స్వామికొరకు మరణించిన వారికి ఎటువంటి సద్గతి కలుగునో అట్టిది మౌణతీర్థే స్నానము వలన కలుగును - 98. ఆపదలో ఉన్నవారి ఆపదలను తొలగించినవారికి, తీర్థేములను ఎల్లప్పుడు సేవించువారికి ఏ ఫలము కలుగునో అట్టిది ఘోణతీర్థేస్నానము వలన కలగును -99. గ్రహణ సమయమున పితరులకు శ్రాద్ధకర్మ చేయువారికి ఎట్టి ఫలము కలుగునో అది ఘోణ తీర్థే స్నానము వలన కలుగును -100. గంగయందు, నర్మదయందు, సరయునందు, చంద్రభాగయందు అన్ని పుణ్య తీర్థేములయందు స్నానము చేయుటవలన మానవుడు ఎట్టి ఫలమును పొందునో అట్టి ఫలమును ఘోణ తీర్థేస్నానము వలన పొందును -101. కనుక ఓ బుధులారా! ఘోణ తీర్థేము తీర్థేములన్నిటిలోకి పుణ్యతమమైనది -102. అన్ని పాపములను నశింపజేయు ఈ అధ్యాయమును విన్నవారు వాజపేయ యాగఫలమును పొంది, శాశ్వతమగు విష్ణులోకమును పొందుదురు.
ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమునందు తుంబురుతీర్థేముయొక్క మాహాత్మ్య వర్ణనము అను ఇరవై ఆరవ అధ్యాయము.
