పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
41 - ఏకచత్వారింశత్తమోఽధ్యాయః
పులస్త్యుడిట్లు చెప్పెను ఆదిత్యులు, వసవులు, రుద్రులు, మహాబలులగు ఆశ్వినులు, వారి వారి బలములతో, అనుచరులతో యథాక్రమముగా సన్నద్ధులైరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు. వారి నాయకుడుగా శ్రేష్టమగు గజము నధిరోహించెను. అతనికి కుడి వైపు పక్షిరాజును పతాకము పై గలిగినది. అందమైన చక్రములే చరణములుగా గలిగి, బంగారు గొడుగుతో నున్న రథముండెను. వేలకొలదిగా యకులు దేవ గంధర్వులు అనుసరించిరి. స్వర్గముననున్న ఆమిత తేజస్కులగు బ్రహ్మర్షులతని స్తుతించిరి. వజమును విదుల్చుటచే (ఝుళిపించుటచే) ఏర్పడు మెరుపు, ఇంద్రాయుధ కాంతులతో ఆ రథము స్వేచ్ఛగా విహరించు మేఘ సమూహముతో నున్న పర్వతము వలె నుండెను. దాని నధిరోహించి భగవానుడు జగత్తునంతా పర్యటించెను. యజ్ఞము యొక్క ముఖమున నిలిచిన విప్రులు హవిస్సుల నిచ్చునప్పుడు గానము చేయుచుండిరి. స్వర్గ సంగ్రామ సమయాన దేవ వాద్యములు నినదించుచుండగా వందలకొలది ఆప్సరసల గణములు ఇంద్రుని చెంత నర్తించుచుండిరి. నాగరాజుగల కేతువుతో (ధ్వజముతో) సూర్యుని వలే వేయి గుర్రములతో కూడి ప్రకాశించుచుండెను. మనోవేగము గల ఆ రథము మాతలిని గలిగి, భాస్కరుని తేజస్సు అంతటా అలుముకొనగా ప్రకాశించుచున్న మేరువు వలె నుండెను.
యముడు దండము నెత్తి, కాలపాశముతో ముద్గరమును దైత్యులకు చూపించు చూ సురగణ సైన్యమున నిలిచేను. వరుణుడు నాలుగు సముద్రములతో యుండి, సర్పములతో, శంఖమును, ముత్యపు నగను ధరించి, జలమయమగు శరీరమును దాల్చి, కాలపాశముల నెక్కు పెట్టి, వాయువుచే పేరితమైన జలము వంటి తెల్లని గుర్రములతో, అనేక లీలల జేయుచూ, తెల్లని వస్త్రముల దాల్చి ప్రవాళ ములచే అందమైన ఆంగదములతో, మణులతో అందమైన హారముతో దేవ సైన్యము మధ్య పాశము దాల్చి నిలి చెను. యుద్ధ సమయమున కై వేచి చూస్తూ కట్ట తెగిన సముద్రము వలె నుండెను. యక్ష రాక్షస సైన్యముతో, గుహ్యకులతో నున్న కుబేరుడు శంఖ పద్మాది నిధుల ప్రభువగు రాజరాజేశ్వరుడు, గదను ధరించి కనిపించెను. విమానమున నిలిచి యుద్దము చేయు కుబేరుడు పుష్పక విమానమున నిలిచి, నర వాహనుడై ప్రకాశించెను. తూర్పు వైపు ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు మహాబలులుగా నిలిచిరి.
వారు తమ తమ దిక్కులలో చరిస్తూ దేవ బలమును పెంచిరి. ఏడు గుర్రాలు పూన్చిన దానిని, వాయువేగముగల రథమును, ప్రకాశించు దానిని ఎక్కి సూర్యుడు మేరుపర్యంత గమనము గలిగి, స్వర్గ ద్వార మునకు చక్రమగు దానితో లోకమును నాశనములేనిదిగా జేయుచూ, ఉదయ సమయముల జే నెను. సహస్ర కిరణములు గల తేజస్సుతో దేవతల మధ్య ద్వాదశాత్ముడగు సూర్యుడు చరించెను. ఇక చంద్రుడు తెల్ల ని గుర్రాల రథము పై మంచునీటితో నున్న చల్లని కాంతితో జగత్తు నాహ్లాదపరుస్తూ శోభిల్లెను. నక్షత్రములతో నున్న పామకరుడు, ద్విజేశ్వరుడు, శశాంకుడు, రాత్రి చీకటిని పారదోలు వాడు, నక్షత్రరాజు, ఆకాశ మున కాంతి వెదజల్లువాడగు చంద్రుని, పవిత్ర ఓషధుల నిధిని, అమృత నిధిని, జగత్తు యొక్క ఇతర భాగమగు వానిని పామమునే ఆయుధముగా ధరించి నిలపగా దానవులు చూచిరి. ఇక, ఎవరు అన్ని ప్రాణుల ప్రాణమో, నరులయందు ఐదు విధములుగా భిన్న మైనవాడో, ఏడు స్కంధముల చేరినవాడో, ముల్లోకముల ధరించువాడో, అగ్ని కి కర్తయో, అన్నిటి నెలవు, ప్రభువో, ఎవరి స వస్వరగతమైన యునికి వాక్కుచే చెప్పబడునో, చలభూతమని, ఆశ రీరియని ఎవరి నందురో అతను వాయువు.
ఆకాశమున గమనమును గలిగి, శీఘముగా కదలువాడు, శబ్దమునకు కారణమగు వానినుండి (ఆకాశము) జన్మించిన వాడు, అగు ఆ వాయువు తన తేజస్సుతో పైకెగసి, అన్ని ప్రాణుల ఆయువై దైత్యులను బాధించుచూ మేఘములతో గూడి వీచెను. దేవ విధ్యాధరాది గణములతో మారుత ము శుభ్రమగు కిరణములతో కుబుసము విడిచిన పామువలే క్రీడించేను. తీవ్రముగా, రోషముతో గూడినదగు విషమును వదులు చూ సర్పరాజులు నోరు తెరచి ఆకాశమున శరముల వలే విడిగా చరించిరి. పర్వతములు శిలాశృంగ ములతో, వందలకొలది శాఖలున్న చెట్లతో దానవుల బలమును దెబ్బతీయుటకు సుర గణముల జేరిరి. పద్మనాభుడు, త్రివిక్రముడు, యుగాంతమున నల్ల నీ మార్గము గలవాడు, జగత్తుకు ప్రభువు, అన్నింటి కారణము, హవ్యమును భుజించువాడు, మధువను రాక్షసుని చంపినవాడు, క్రతువులయందుండువాడు, భూమి, నీరు, ఆకాశ ముగా రూపు దాల్చినవాడు, నల్ల నివాడు, శాంతిని నెలకొల్పువాడు, శత్రువుల చంపువాడగు విష్ణువు దేవతాదులకు ఆవిఘ్నమగునట్లు చేనెను. కుడిచేత ఆన్ని ఆయుధముల నశింపజేయునది, గొప్పది, శత్రువులకు మృత్యువు నొసగు కాలరూప గదను ధరించి, ఇతర చేతులతో శార్జము మొదలగు ఆయుధ జాలమును ధరించెను.
అట్టి విష్ణువు, కశ్యప సంతానమగు పక్షిరాజు నధిరోహించెను. గరుత్మంతుడు సర్పములే భోజనముగా గలవాడు, నోట వున్న సర్పరాజుతో విలసిల్లువాడు, అమృతారంథముతో ఉన్న తమగు మందర పర్వతము వలే నున్న వాడు, దేవాసుర యుద్ధాలలో అనేక పర్యాయములు పరాక్రమము చూపించినవాడు, అమృతమునకై మ హేంద్రునిచే వజపాత చిహ్న ముపొందినవాడు, విచిత పత్రములే వస్త్రములై ధాతువులు గల పర్వతము వలె నున్న వాడు, మిక్కిలి క్రోధముచే, చంద్రుని వంటి కాంతిచే, సర్ప ఫణములతో కూడిన కాంతివంతమగు మణిరత్నముతో భాసించువాడు, ఆందమైన ఈకలు గల రెక్కలతో ఆకాశ మును లీలగా కమ్ముకొని యుగాంతమున ఇంద్రధనుస్సుతో కూడిన మేఘములతో నున్న ఆకాశము వలె నుండెను. నీలలోహితపీత వర్ణముల పతాకములతో అలరారుచుండెను. అట్టి ఆరుణుని ఆనుజుడగు గరుత్మంతుని అధిరోహించి విష్ణువు సమరమున నిలువ, సురగణములు, మునులు సమాహిత మనస్కులై ఆతని ననుసరించిరి. ఉత్తమ మంత్రముల వాక్కులచే స్తుతించిరి. వరుణ యమ కుబేరాదులు, గరుడుడు చుట్టూ నిలిచి రక్షించుచుండగా, ఇంద్రుడు ముందు విరాజిల్లుచుండగా, జయించు, సహించు, భాసించు శీలముగల విష్ణు తేజస్సుతో కూడుకొనిన దేవలము యుద్ధము చేయుటకై సిద్దముగా నుండినది.
దేవతలకు స్వస్తియగు గాక యని బృహస్పతి, దైత్వులకు స్వస్తి యగు గాక యని శుక్రాచార్యుడు పలికిరి. అపుడా రెండు బలాల మధ్య ఘోర యుద్ధము జరిగెను. పరస్పరము జయించు కోరికతో దేవ దానవులట తలవడిరి. అనేక విధముల ఆయుధములు చేబూని, పర్వతములు పర్వతములతో ఢీ కొనినట్లు దైత్యులు దేవతలతో తలపడిరి. ఆ యుద్దమత్యద్బుతముగ భాసించేను. దర్పము ఒక వైపు, వినయము మరొక వైపు వుండి ధర్మా ధర్మములతో కూడినదిగా ఆ యుద్ద ముండెను. మిక్కిలి జవముగల గుర్రములతో, పేరితములైన గజములతో వారు చేత కత్తుల బూని అన్ని వైపుల నుండి ఆకాక మున ఎగిసి పడుచుండిరి. నాగలి వంటి ఆయుధములు విసరబడుచుండెను. బోణములు విడువబడుచుండెను. బాపములు వెదజల్ల బడుచుండెను. వీనితో ఆ యుద్దము ఘోరముగ నుండెను. జగత్తుకు భయమును గొల్పుచూ, యుగసమాప్తి వలె నుండెను. పరిమలను, ముద్దరములను పర్వతములను విడుచుచూ దానవులు ఇంద్రాది దేవతలను బాధించిరి. బలవంతులగు దానవులట్లు బాధించగా, వాడిన ముఖాలతో దేవతలు ఆ ర్తి నొందిరి. అస్త్ర శూలములతో, పరిమలతో తలలు తెగి, ఎదలు చీలి, రక్తము కారుతుండగా రణమున దేవతలు నేల కూలిరి.
బాణ పరంపరచే బాధింపబడి, శరములతో ప్రయత్న ముడుగునట్లు చేయబడి దానవ మాయను పొందిన దేవతలు కదలుటకు కూడా అశక్తులైరి. అసురులచే దెబ్బతిని ఆయుధములు కదల్చలేని సుర సేన స్తంభించినట్లు, ప్రాణము లేని ఆకృతివలె యుండెను. సహస్రాక్షుడగు ఇంద్రుడు దైత్యుల బాణములను తన వజ్రాయుధముతో ఛేదించి దైత్య బలమును ప్రవేశించెను. దైత్య ప్రముఖుల నందరినీ వధించి దైత్య బలమును తన తామసమగు అస్త్రజాలముతో చీకటి మయముగా చేయగా దైత్యులు ఒకరి నొకరు తెలియలేక పోయిరి. ఇంద్రుని తేజస్సుతో ఘోరమగు తమస్సుతో కూడిన వారైరి. ఇక సురోత్తములు మాయా పాశములనుండి విడివడి, యత్నము గలవారై దైత్యుల తమోభూతమైన తలలను నేల పడదోసిరి. నాళ ముపొంది, నీలమగు తమస్సుతో చేష్టలుడిగిన దానవులు వెంటనే రెక్కలు తెగిన గుట్టల వలె నేల కూలిరి. అపుడక్కడ దానవుల దేహముల నెలవు అంధకార మయమూ, తమోమయము ఆయెను. అపుడు మయుడు ఆ తమస్సును దహించుచూ మహామాయను సృజించెను. యుగాంతమున పుట్టిన అగ్ని వలె నున్న ఆ ఉర్వుని మాయ ఇంద్రుని మాయను నశింపజే నెను. అపుడు దైత్యులు ఆదిత్యుని రూపుచే మరల యుద్దమున వెంటనే లేచిరి.
ఆ ఔర్వి మాయచే దేవతలందరూ దహింపబడుచూ, చంద్రుని చల్ల ని కిరణాల జలముగల కొలను చేరిరి. ఆ ఔర్వుని అగ్నిచే దహింపబడుచూ, ఖిన్నులై దేవతలు శరణుగోరి దేవేంద్రునికి విన్నవించిరి. మాయ చేత దేవ సైన్యము దహింపబడుట, దానవులచే చంపబడుట చూచి ఇంద్రుడడుగగా, వరుణుడిట్లు విన్న వించెను. ‘ఇంద్రా! పూర్వము బ్రహ్మర్షి కి జన్మించిన ఉర్వుడను బ్రహ్మ సదృశుడు దారుణ తపస్సును చేసెను. తపించుచున్న సూర్యునివలె నున్న అతని మునిగణములు, దేవరులు, దేవతలు వచ్చి చేరిరి. దానవేశ్వరుడగు హిరణ్యకశిపుడను దానవుడు పరమ తేజస్వియగు ఋషిని చేరి పూర్వమిట్లు విన్న వించెను.’ భగవాన్! బ్రహ్మ ర్పులు ధర్మసంహితమగు వచనమునిట్లు చెప్పెదరు. ఋషివంశములలో ఈ కులము యొక్క మూలము భిన్నమైనది. నీ వొక్కడివి సంతతి లేని వాడవు, గోత్రమునకు వేరొకడు లేడు. కౌమారవ్రతమును పాటించుచూ క్లేశము ననుభ వించుచుంటివి. ఉత్తములగు మునుల గోత్రములనేకము. ప్రజలు లేక అవి విడిగా యున్న వైననూ ఏక దేహముగలవానివలె యున్నవి.
అందరూ ఇట్లుండగా, నా పుత్రులతో నేమి కారణము? లేదు కదా!
ఇక నీవు తాపస శ్రేష్టుడవు, ప్రజాపతితో సమానమగు కాంతి గలవాడవు. కనుక, వంశము కై ప్రయత్నించుము ఆత్మ వృద్ధిని గావించుకొనుము. నీ గొప్ప తేజస్సును కేంద్రీకృతము చేసి రెండవ శరీరమును నిర్మించుము. ఆని మునులనగా ఆ ముని మనసున దెబ్బతిని ఆ ఋషి గణముల గర్జించుచూ ఇట్లనేను ‘పూర్వము మునులకు విహితమైన శాశ్వత ధర్మమిది. వన్య మూల ఫలముల దిను మునికి ఋషిప్రో క్షమైన కర్మయే ఆచరణీయము. బ్రహ్మ యోనియం దుద్భవించిన ఆత్మవర్తి యగు బ్రాహ్మణుడికి బ్రహ్మచర్యమే శ్రేయస్కరము. దీనిని సరిగా పాలించినచో ఈ బ్రహ్మచర్యము బ్రహ్మను కూడా కదిలించగలదు. గృహస్థాశ్రమమున నున్న జనుల వృత్తి మువ్విధము. వనాశ్రమమున నివసించు మాకు వనమున నుండుటే విహితము. ఏ వనమున జలభక్షులు, పాయుథవులు, యజ్ఞ కర్మల నాచరించువారు, పంచాగ్నుల మధ్య తపస్సు చేయువారు నివసింతురో, అనుసరించుటకు కషమగు వ్రతముల నాచరించువారుందురో అక్కడే మా నివాసము. బ్రహ్మచర్యము ద్వారానే పరమగతిని ప్రార్థించుదురు కదా!’ ‘బ్రహ్మచర్యము ద్వారా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడనబడును.’ అని బ్రహ్మచర్యము తెలిసిన ఉత్తమ లోక వాసులగు జనులనెదరు.
బ్రహ్మచర్యమున ధర్మమున్నది, తపస్సున్నది. బ్రహ్మచర్యమును పాటించు బ్రాహ్మణులు స్వర్గమున నున్న ట్లే. యోగము లేక సిద్ది లేదు ఉత్తమ కీర్తి లేదు. ఓ ధీరుడా! బ్రహ్మచర్యము దప్ప కీర్తిమూలము లోకమున లేదు. పంచేంద్రియాలను, పంచభూతాలను నిగ్రహించి బ్రహ్మచర్యమున మనసు నిలుపువానికి ఇంతకంటే తప నేమి? సంస్కారము లేని కేశములతో నుండుట, సంకల్పించక వ్రతక్రియను చేయుట, బ్రహ్మచర్యములేని ఆచరణ ఇవీయన్నీ దంభము అని చెప్పబడును. ఎక్కడ భార్య? ఎక్కడ సంయోగము? ఎక్కడిది భావ విపర్యయము? ఈ ప్రజ బ్రహ్మ మానసపుత్రికదా! ఆత్మను జయించిన మీరు తపశ్శక్తివున్న చో ప్రాజాపత్యకర్మతో మానసపుత్రులను సృజించండి. తపస్విజనులు తపోనిర్మిత యోనిని గ్రహించవలేను. తపస్వులకు దారయోగము (భార్యతో కలియుట) బిజమనిగానీ, వ్రతమనిగానీ చెప్పబడలేదు. ఇక మీరు నిర్భయంగా, సత్పురుష లైననూ అసత్పురుషులవలే ధర్మము లోపించినట్లు అంటిరో, దానికి నేను మనస్సు చే, జ్వలించు దేహముగల పుత్రుని భార్యతో కలియకనే నా శరీరమునుండి సృజించెదను. నా ఆత్మ ప్రాజాపత్యవిధిచే మరియొక ఆత్మను జనింపజేయును. ప్రజలను దహింప కోరుచున్నట్లు ఉండును.
వరుణుడు చెప్పసాగెను -
అట్లు ఉర్వుడు తపస్సుగ నుండి తన తొడను అగ్ని యందుంచి పుత్రుని కలిగించు అరణిని ఒక దర్భతో మధించెను. అపుడతని తొడను చీల్చుకొని ఈ శ్రేష్టమైన తేజస్సు జగత్తును దహించకోరి బయల్వెడలెను. ఉర్వుని తొడను చీల్చుకొని వచ్చి నందున ఔర్వమని ఈ అగ్ని కి పేరు. పరమ కోపముగలిగి ముల్లోకములను దహింపగోరినట్లుండెను. పుట్టగానే దీనముగా తండ్రి నిట్లడిగెను ‘నాయనా! నన్ను ఆకలి బాధించుచున్నది. నన్ను విడువుము. ముల్లోకముల భక్షించేదను.’ అని స్వర్గమున కెగియు జ్వాలలతో ఆన్ని దిక్కుల విస్తరించుచూ ఆ ఆగ్ని అన్ని ప్రాణుల దహించుచూ పెరిగిపోయేను. ఇంతలో బ్రహ్మ ఉర్వుడను ఆ ముని వద్దకు వచ్చి “నీ పుత్రుని నివారించుము. జగత్తు పట్ల దయ చూపుము. ఈ నీ కుమారునికి సహాయము చే నెదను. పుత్రా! ఇది నిజము. నా మాట వినుము.’అనగా ఔర్వుడు’ ధన్యుడను. అనుగ్రహింపబడితిని. శిశువునైన నాకు భగవాన్ నీవే. ఈ బుద్ధిని పాతముకై ఇచ్చుచుంటివి. ప్రొద్దుననే సమాగమము కోరబడినపుడు ఈ పుత్రుడు ఏ హవ్యములతో సుఖము నొందును? ఇతని నివాస మెక్కడ? గొప్ప తేజస్సు గల ఈతనికి భగవాన్ నీవే భోజన మివ్వగలవు.
అనగా బ్రహ్మ అతనితో సముద్రమున ఐడబ ముఖమున ఈ అగ్ని నివసించగలదు. నాకు కారణము జలము. దానినమేయముగా ఇతను పొంది నియతముగా జలరూపమగు హవిస్సును గ్రోలుచూ ఆక్కడనే వుండును. ఆ నీటి మొత్తమునితనికి ఆలయముగా చేసెదను. పిదప యుగాంతమున ఇతను, నేను కలసి పోతదన్నది లేకుండా చేయుచూ తిరిగెదము. ప్రళయమున ఈ ఆగ్ని జలమును భక్షించునట్లు నేను చేసితిని. దేవాసుర రాక్షసులతో అన్ని ప్రాణులనీతడు దహించును. అనగా ఆ అగ్ని సరేనని తండ్రియగు ఉర్వునికి నమస్కరించి, జ్వాల మండలముతోకూడి సముద్ర ముఖమును ప్రవేశించేను. అటు పై బ్రహ్మ వెనుదిరిగెను. ఋషులందరూ ఔర్వాగ్ని ప్రభావమునెఱిగి తమ తమ గతులను పొందిరి. ఆ మహాద్బుతమును జూచి హిరణ్యకశిపుడు ఉర్వునకు సాష్టాంగప్రణామము చేసి ఇట్లనెను. ‘భగవాన్!’ లోకాల సాక్షిగా జరిగిన ఇది మహాద్భుతము. నీ తపస్సుచే పితామహుడు సంతసించెను. మహావ్రతా! నేను నీ పుత్రునికి, నీకూ భృత్యుడనని తెలియుము. నీ కర్మచే గొప్పవాడవైతివి. నీ ఆరాధనమున ఆసక్తిగల నేను ఆపదనొందుట చూడుము. నేను కష్ట మొందినచో నీకే పరాజయము కాగలదు.
అనగా ఉర్వుడు అతనితో ఇట్లనెను ‘నన్ను నీవు గురువుగా భావించుటచే నేను ధన్యుడనై అనుగ్రహింపబడినాను. ఈ తపస్సు చే ఇక నీకు భయము కలుగదు. సువ్రతా! నా పుత్రుడు నిర్మించిన మాయనే అవలంబించు. ఇంధనములేని ఆగ్నితో కూడినది, అగ్నులు కూడా తాకలేనటువంటిది నీ వశమున నుండి నీ వంక శత్రువుల ఆణచగలదు. నీ వశమును రక్షించగలదు. శత్రు వక్షమును దహించివేయగలదు.’ ఆనేనని వరుణుడు చెప్పి ‘పూర్వము ఉర్వు ఏ పుత్రుడగు ఔర్వుడు నిర్మించిన మాయ ఇది. సహించ శక్యముగానిది. దేవతలూ చేరరానిది. ఆ దైత్యుడు వధింపబడినచో ఈ మాయక క్తి లేనిదగును. ఎవరి తేజస్సుతో ఈ మాయ సృజింపబడెనో, అట్టి ఈ మాయకు పూర్వము శాపమివ్వబడెను. ఈ మాయ నశించి భగవంతుడు సుఖముగ నుండవలెనన్న నాకు చంద్రుని ఇవ్వుము. అతనితో కలిసి, జలజంతువులతో కూడి నీ ప్రసాదముచే ఈ మాయను వధించెదను. సంశయములేదు' అనగా దేవతలకు వృద్ధిని కలుగ జేయు ఇంద్రుడు ఆలాగేనని సంతోషముగా వలికి మంచే ఆయుధమైన చంద్రుని యుద్ధమున కై ఇట్లాదేశించెను. చంద్రా! నీవు వెళ్ళి అసురుల వినాశానికై దేవతల జయానికై వరుణునికి సహాయము చేయుము.
నీవు తగిన జోడియగు వీరునవని అభిప్రాయము. నక్షత్రాల రాజువు కూడా. వేదవేత్తలు అన్ని లోకములందు రసములన్నీ నీవేనని తెలియుదురు. నీతో సమానమగు శిశిరాయుధుడు (మంచే ఆయుధముగా గలవాడు) లోకమున లేడు. సాగరమున, ఆకాశమున కూడా నీ ఈ క్షయము, వృద్ధి అవ్యకమైనవి. అహోరాత్రములచే కాలమును ప్రవర్తింపజేయుచూ జగత్తును మోహపరచుచుంటివి. నీయందున్న ఈ మచ్చ కుందేలువలె నున్నది లోక ముయొక్క ఛాయయే. చంద్రుడా! నీ మాయను నక్షత్ర కారకులగువారునూ తెలియజాలరు. ఆదిత్య మార్గమునకు, నక్షత్రములకు పైన నున్నాను. చీకటిని పారదోలి అఖిల జగత్తులో వెలుగు నింపుచున్నావు. చల్లని కిరణములు గలవాడవు, మంచు శరీరము గలవాడవు, నక్షత్రరాజువు. ఆయా కాలయోగరూపుడవు, యజింవ బడదగువాడవు. యజ్ఞమును వహించువాడవు, నాళములేని వాడవు. ఓషధులకు ప్రభువువు. క్రియలకు కారణము జలకారణము, అనుష్ణకిరణుడవు, శీతాంశువు, అమృతమునకాధారమువూ చపలుడవు, శ్వేత వాహనుడవు, నీవే కాంతిమయ శరీరుల కాంతివి. సోమము ద్రావువారి సోమము, అన్ని ప్రాణులయందు సౌమ్యుడవు, చీకటిని చీల్చువాడవు, నక్షత్రరాజువు. కనుక ఓ చంద్రా! నీవు వరుణునితో వెళ్ళి మమ్ములను రణమున దహించుచున్న ఆసురీ మాయను శమింప జేయుము.
అనగా అపుడు చంద్రుడిట్లనెను. “దేవరాజా! యుద్దముకొరకు నీవు చెప్పుచున్న ప్లే నేను దైత్యులమాయను తొలగించు నట్లు మంచును కురిపించెదను. మంచుతో కప్పబడి, చలితో దెబ్బతినువారిని చూడుము. అట్లే మంచుకిరణములనుండి వెడలు పాశములతోని హిమవర్షములు దైత్యులను వాయువు మేఘములను కమ్మినట్లు కమ్మి వేయును, ఆపుడు పాశములను, శీతకిరణములను దాల్చి మహాబలులైన వరుణుడు, చంద్రుడు హిమముతో, పాశములతో దానవుల వధించసాగిరి. వారిద్దరూ యుద్దములో, శోభిల్లిన సముద్రాలవలె చరించిరి. మహద్బలము గల ఆ దానవ సైన్యము, వారు చుట్టుముట్టడంతో సంవర్తక మేఘములు కురియుచూ చుట్టు ముట్టగా జగత్తువలె తల్లడిల్లినది. వారిద్దరూ ఆయుధములనెత్తి దైత్యేంద్రుడు నిర్మించిన ఆ మాయను శమింపజేసిరి. రణమున శీత కిరణములతో దెబ్బతిని, పాశములతో కప్పబడి దైత్యులు తలలు తెగి, పర్వతాలవలే కదలకుండిరి. శీతకిరణముల దెబ్బతిని దైత్యులందరూ నేలకూలి, అవయవముల పై పామము కమ్ము కోగా వేడిలేని అగ్నులవలేనుండిరి. ఆకాశమున ఆ దైత్యుల విమానములు విచిత్రములుగా పైకెగియుచూ, నేల కూలుచూ వుండెను.
దానవుడగు మయుడు దానవులు పాశములచే కట్టబడుటను, చల్లని కిరణములచే కప్పబడుటను చూచి మాయావియై పేరొందిన పార్వత మాయను అంతటా సృజించెను. ఆ మాయ గుట్టలతో విస్తరించి ఖడ్గపట్టములతో వెలుగుచుండెను. వివిధ వృక్షముల కూటమిని గలిగి, గుహలు మిక్కుటంగా నున్న అడవులతో, సింహ, వ్యాఘ్ర గణములతో ఈ హామృగగణములతో నిండియుండెను. అందు వృక్షములు గాలి వీచుటచే తిరుగుచుండెను. తన ఇష్టముననుసరించు వేళ్ళు ఆ మాయ మెల్లని ధ్వని చేయుచుండెను. శిలా వర్షముతో, వృక్షముల ఎల్లెడల వడవేయుచూ ఆ మాయ దేవ సంఘములను బాధించుచూ దానవులను పునరుజ్జీవింప జే నెను. అపుడు చంద్రుని మాయ, వరుణుని మాయ మాయమాయెను. అపుడు పృథివి ఘోరమైన సంచారముగల దాయెను. వృక్షములతో కప్పబడని దేవుడొక డై ననూ కనబడకపోయెను. విష్ణువు దప్ప మిగిలిన దేవగణమంతా ధనుస్సులు విరిగి, ఆయుధములు విరిగి చేష్టలుడిగియుండెను. యుద్ధమున నిలిచిన విష్ణువు మాత్రము చలించక యుండెను. సహించు శీలముగలవాడు కనుక విష్ణువు యుద్ధమున ఇట్టి కాలమును గమనించి కాలము తెలిసిన వాడై నందున కోపించలేదు.
అపుడు శ్రీహరి దేవాసురయుద్దమును చూడ గోరెను. అప్పుడు విష్ణువు మాటచే ప్రేరితులై అగ్ని, వాయువు ఆ మాయను లాగివేసిరి. మిక్కిలి వేగముతో వారెగినపడగా ఆ యుద్ధమున పార్వత మాయ దహింపబడి, భస్మమై నశించెను. అగ్ని, వాయువు, యుగాంతమున పెచ్చరిల్లునట్లు, దైత్య సేనను దహించిరి. ముందు పాయువు వేగముగా వీచగా, తరువాత అగ్ని వర్ధిల్లెను. వారిద్దరూ యుద్ధమున క్రీడించునట్లు తిరగసాగిరి. అన్ని ప్రాణులు భస్మముగా చేయబడెను. దానవుల విమానాలు ఎల్లెడల నేల కూలసాగేను. గాలి వాని రెక్కలు విరవసాగెను. అగ్ని దానిని దహించుచుండెను. ఇట్లు మాయ వధ మొదలవగా, విష్ణువు నందరూ స్తుతించిరి. దైత్యులందరూ చేష్టలుడిగినవారు కాగా, ముల్లోకములు వారి బంధనము నుండి బయటపడెను. దేవతలందరూ సంతసించి ‘బాగు బాగు' అని అనుచుండిరి. ఇంద్రునికి విజయము, దైత్యులకు పరాజయము కలుగగా దిక్కులన్నీ ప్రసన్నము లాయేను. ధర్మము విస్తరించగా చంద్ర పథము నుండి తొలిగి సూర్యుడు తన స్థానమున నుండెను.
అన్ని భూతములు తమ ప్రవృత్తి ననుసరించి యుండెను. పాలకులు చరిత్ర గలవారిగ నుండిరి. భేదము లేక మృత్యువు బంధించుచుండెను. నిత్యము అగ్ని కి హవనము చేయుచుండిరి. యజ్ఞములచే శోభించు దేవతలు స్వర్గమార్గమును చూపు చుండిరి. లోకపాలురందరు తమ తమ దిక్కులందు సంధానించుచుండిరి. తపస్సు యుండగా సిద్ధిని పొందుచుండిరి, ఆది లేక పాపము నాచరించువారైరి. దేవ పశము సంతోషముతో, దానవ పక్షము విషాదముతో నుండెను. ధర్మము మూడు పాదములలో, అధర్మము ఒక పాదములో నుండెను. మహా ద్వారము తొలిగి, మంచి మార్గము మాత్రమే వుండెను. లోకములన్నీ ధర్మము ననుసరించుచుండెను. ఆశ్రమములను పాటించుచుండెను. రాజులు ప్రజా రక్షణ చేయుచుండిరి. దానవ తమస్సు శాంతించి లోకములు ప్రశాంతమాయెను. ఆ విధంగా అగ్ని, వాయువు యుద్ధ కర్మ యందుండగా జయము నొందిన లోకములన్నీ విమలములయ్యెను. వారిద్దరి నుండి దైత్యులు పొందిన భయాన్ని విని కాలనేమియను దైత్యుడు యుద్ధమున ప్రత్యక్షమయ్యెను. ప్రకాశించు మకుటముతో, చిరుగజ్జల ఆభరణాలతో, మందర పర్వతము వలె నుండి, మహా రజతముతో కప్పబడి యుండెను. నూరు చేతులు, ముఖాలుగలిగి, నూగు తలలు, ఆయుధాలతో, నూరు శిఖరాలు గల పర్వతము వలె నుండి ఒకమూల గ్రీష్మ కాలంలో అగ్ని వలె పెరిగెను.
ఆ కాలనేమి ధూమ్రవర్ణ కేశములు గలిగి, శత్రువులు గలిగి, దంతములతో, వికటమగు ముఖముతో నుండెను. ముల్లోకముల మధ్య వ్యాపించు విపుల శరీరమును ధరించుచూ, చేతులతో ఆకాశాన్ని కొలుచుచూ, కాళ్ళతో భూమి పై పర్వతముల తన్ను చూ, ముఖముల నుండి వచ్చు గాలులతో వర్షి చు మేఘముల తోసివేయు చూ వెడల్పైన కన్నులతో కాంతితో మందరపర్వతము వలె నిలిచెను. దేవగణముల నన్నింటినీ యుద్ధమున దహింపకోరి వచ్చినట్లు, సురగణముల బెదిరించుచూ, అన్ని దిక్కులనూ కప్పి వేయు చూ, సంవర్తకాలమున హర్షముతో పైకెగిసిన మృత్యువు వలె అతనుండెను. చక్కని తలము ఎత్తు గలిగి విపులమైన వేళ్ళు గలిగి, వేలాడుచున్న కదలుచూ వున్న ఆభరణములతో తన కుడి చేతినెత్తి దెబ్బతిని యున్న దానవులను నిలుమని యనుచున్న కాలనేమిని దేవతలు చూచిరి. యుద్ధమున శత్రువుల కాలము నాపివేయు ఆ కాలనేమిని చూచి వారు భయవిహ్వలు లై నారు, భయముతో విప్పారిన కళ్ళతో వారు ప్రాణుల కబళించు కాలనేమిని చూచిరి. అపర నారాయణుని వలె త్రివిక్రముడై పరాక్రమిస్తున్న కాలనేమి వస్త్రములు గాలికి కదలాడుచుండినవి, ఆట్లు ఆభ్యుదయమును పొందిన ఆ దానవుడు దేవతలందరినీ భయ పెట్టుచూ, యుద్దమున కుపక్రమించెను.
రణమున అటునిటు తిరుగుచూ దేవేంద్రునితో తలపడిన ఆ కాలనేమి యను దైత్యుడు ఏమవుతో నున్న మందరము వలె భాసించెను. అపుడు ఇంద్రాది దేవతలు అపర మృత్యువు వలె వచ్చి పడుచున్న ఆ కాలనేమిని చూచి వ్యథ నొందిరి దానవులకు ప్రీతిని కలిగించగోరి ఆ మహా సురుడు గ్రీష్మ కాలము చివర మేమము వలే గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను. ముల్లోకముల వ్యాపించిన అతనిని చూచి అమృతమును ద్రావిన వారి వలె దానవరాజులు విశ్రాంతి లేక లేచి నిలిచిరి. భయము లేక వారు మయ లారాది దైత్యులతో తారకామయ సంగ్రామమున, యుద్ధము కోరి వెళ్ళిన ఆ దైత్యులు విరాజిల్లిరి. మంత్రము నుచ్చరించుచున్న వారికి, వ్యూహమున పరుగులిడువారికి, ఆ దానవుని చూచువారికి ప్రీతి కలిగెను, మయుని ముఖ్య యుద్ధవీరులు హర్షమునొంది థయము వీడి యుద్ధముచేయుటకు సిద్ధపడిరి. మయుడు, రారుడు, వరాహుడు, హయగ్రీవుడను దానవుడు, విప్రచితిసుతుడు శ్వేతుడు, ఖరుడు అంబుడు ఇరువురు, రిష్టుడను బలపు తుడు, కిశోరుడు సుర్బానుడు, అమరప్రఖ్యుడను గొప్ప యోధుడు . వీరంతా అస్త్రములందు నేర్పరులు.
ఈ దానవులంతా తపస్సునాచరించువారు, ఆస్త్రవిద్య చక్కగా తెలిసినవారు. ఆట్టి ఈ ధన్యులు కాలనేమిని చేరిరి. వారు బరువే న గదలతో, చక్రములతో, గొడ్డళ్ళతో, మృత్యువువంటి నాగళ్ళతో, విసరగలగు ముద్దరములతో, అస్త్రములవంటి రాళ్ళతో, దారుణ శైలములతో, సదృసములతో, థిండిపాల, పరిమ, ఆయసవంటి ఆయుధములతో, వధించునవి, బరువై నవై న శతఘ్నులతో, యంత్రములచే విడవబడిన వదునైన ఆయుధములతో, పాశములతో, సర్పమువంటి నోరుగలిగిన బాణములతో, విసర గలుగు వజ్రములతో, ప్రకాశించు తోమరములతో, ఒర లేని ఖడ్గములతో, పదునై న శూలములతో. అవేళ ముతో శరాసనాలను గ్రహించిన దైత్యులలో కాలనేమిని చేరగా, ఆ దైత్య సేన మీగుల శోభిల్లెను. మేఘముల రాక చే పూర్తిగా మరుగున పడిన వనపంక్తి వలె అవయవములన్నీ మరుగునపడగా ఇంద్రునిపాలనలోనున్న దేవతల సేన కూడా మోదమునొందినది.
ఆ దేవ సేన చంద్ర సూర్యుల తేజస్సులతో, శిశిరము, ఉష్ణములతో కూడి వాయువేగ మును, తారాగణపతాక మును కలిగి ప్రకాశించెను. మేమయులే వస్త్రములై గ్రహనక్షత్రములే హాసములై యమేంద్ర కుబేరులు వరుణుడు రక్షించుచుండగా, అగ్ని వాయువులు ప్రకాశించుచుండగా ఆ సేన వెలుగుచుండెను. అస్త్రములు గలిగి భయంకరముగా నుండిన దేవ సేన, రాక్షస సేన ఆప్పుడు యుద్ధమున ఎదురుపడెను. యుగసమాప్తి జరుగునపుడు ఆకాశము, పృథివి కలిసిన ఎంత ఘోరముగా నుండునో, దేవదానవుల యుద్ధమూ అంత ఘోరముగా నుండెను. శ్రమ, ఓర్పు పరాక్రమమొకవైపు, దర్పము వినయము మరొక వైపు, దైత్ములు, దేవతలలో నుండెను. సురాసురులపుడు తమ బలములతో బయల్వెడలిరి. పూర్వాపర నముద్రజలములతో బయల్వెడలిన మేఘములపలే వారు తమతమ బలములతో హర్షము నొందిరి. పుష్పించిన పర్వత ప్రదేశాలలోని వనములతో పర్వతాలవలె వారు హరించిరి. అపుడు భేరీవాద్యాలను అనేక విధాలుగా మోగించిరి. శంఖాలను పూరించిరి. బ్రహ్మాండమును, భూమిని. దిక్కుల నన్నింటిని పూరించుచూ ధనుష్టంకార ధ్వని, ధనుస్సుల ఆవ్యక్త మధురధ్వని బయల్వెడలెను.
దుందుభుల నాదముతో దైత్యులశబ్దము అంతర్షి తమాయెను, ఆట్టి ఆ నేసలు ఒక్కమారుగా పరస్పరము ఎదు. ర్కొనిరి. యుద్ధము చేయగోరిన కొందరు బాహుయుద్ధములో డాహువులతో దేవతల ఘోర మైన ఆయుధములను భగ్నముచేసిరి. బరువైన గదలు సృజించిరి. కొందరు గదల దెబ్బలు తిని ఆవయవములు విరిగి బాణములతో ముక్కలై నేలకూలిరి. కొందరు ప్రాణముల విడిచిరి. అపుడు వారు రథములను, గుర్రములను, వేగముగా వెళ్లు విమానములనెక్కి రోషముతో ఎదుర్కొనిరి. కోపముతో పెదవుల కొరుకుచూ యుద్ద మున తిరుగుచున్నవారు, రథములు రథములతో, సైనికులు సైనికులతో తలబడిరి అపుడు ఆ శబ్దము పెద్దదాయెను. ఆ శబ్దము వర్షర్తువున మేమముల ధ్వనివలె నుండెను. కొందరు రథముల విరుగగొట్టిరి. కొందరు రథములచే తొక బడిరి. కొందరు చేతులతో పైకెత్తి కొరుకు చుండిరి. మరికొందరు అగ్రముల దెబ్బతిని యుద్ధముననేలగూలుచూ రక్తమును కక్కుచుండిరి.
నీటిని విడుచుచున్న మేఘములవలెనున్న వారి బాణవర్షముతో మేమఛన్నమై ఆ యుద్ధము దుర్దినము వలె భాసించెను. ఇంతలో మిగుల కోపించిన కాలనేమి సముద్రజలముతో నిండిన మేఘమువలె వర్దిల్లెను. మేరుపతీగలతాకిడిని. పిడుగుల వర్షమును గల మేషములు పర్వతములపంటి ఆతని అవయవాల తాకిడికి నేలరాలినవి. కోపముతో నిశ్వాసముతీయు. చున్న ఆతని కనుబొమముడినుండి చెమటబిందువులు రాలుచుండెను. అప్పుడతని ముఖమునుండి అనేక మంటలు నిప్పురవ్వ లతో బయల్వెడలినవి. అతని చేతులు ఆకాశమున ఎల్లెడలా వ్యాపించినవి. పర్వతమునుండి బయల్వెడలుచున్న ఐదుతలల పాములవలె ఆ చేతులుండెను. అట్టి కాలనేమి అనేక అస్త్రజాలములతో, ధనుస్సులతో, పరిమలతో నిలవగా, ఎత్తైన పర్వతము లతో కప్పబడినట్లు ఆకాశ గంగ (పాలపుంత) యుండెను. గాలి తన వస్త్రములను రెపరెపలాడించుచుండగా సంగ్రామముచేయు లాలసగల కాలనేమీ సంధ్యాకాలమున ఎండలోని శిలలతో మేరుపర్వతమా యన్నట్లుండెను. తొడల వేగముతో పర్వతశిఖర ముల పై నున్న చెట్లను రాల్చుచూ దానితో కాలనేమి వజముతో పర్వతములను పడవేసినట్లు దేవగణములను.. నేలకూల్చెను. కాలనేమియొక్క కత్తులవంటి చేతులతో దెబ్బలుతిన్న దేవతలు తల వెంట్రుకలు తెగి, చిందరవందరగా మారి యుద్దమున కదల, లేక పోయిరి.
దేవతలు కొందరు పిడికిలి దెబ్బలతో నేల కూలగా మరికొందరు దళమునుండి వేరైరి. కాలనేమినుండి భయము నొంది యక్షరాక్షసగంధర్వులు కిందపడి ప్రయత్నించగలిగియూ మనసు చెదరి ప్రయత్నించ లేక పోయిరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు కూడా ఆ బాణపరంపర చే బంధింపబడి ప్రయత్నమును కోల్పోయి కదలలేకుండెను. వరుణుడు కాలనేమిచే నీరులేని మేమమువలె, సముద్రమువలె వ్యాపారములేనివాడుగా చేయబ డెను. ఆ కాలరూపుడగు కాలనేమి ఎదుర్కొనగా లోకపాలుడగు కుక్షేతడు కూడా సామాన్యునివలె ఆక్రోశించుచూ కదలకుండెను. సర్వహరుడు, మృత్యువే ఆయుధముగా గలవాడగు యముడు ఆ యుద్దమున యముడను ఆవస్థను విడిచి దక్షిణ దిక్కుకు చేరెను. ఈ విధంగా కాలనేమి లోకపాలురను పారద్రోలి, వారి కర్మనపహరించి అన్ని దిక్కులయందు తన శరీరమును నాలుగు విధములుగా చేసేను. అతను " నక్షత్రమార్గమును చేరి చంద్రుని కాంతిని, కర్మను అపహరించేను. జ్వలించు సూర్యుని చలింపజేసి అతని శాసనమును దినకర్మను హరించెను.
దేవతల ముఖమగు. అగ్ని దేవుని జయించి అతను తన ముఖమున్నాశ్రయించునట్లు చేసెను. వాయువును త్వరగా జయించి తన వళముననుండునట్లు చేసెను. బలవంతముగా ఆతను సముద్రమునుండి వీర్యవంతములగు నదులను తెచ్చి తన అభిముఖమున దేహములుగ నుండునట్లు చేసెను. నీటిని తన వశముననుంచుకొని జగత్తును పర్వతములతో కప్పివే నెను. అన్ని లోకము లకు ప్యాపించి భయముకలిగించు ఆ దైత్యుడు స్వయంభువు వలె నుండెను. లోకపాలురు, చంద్రసూర్యులు, అగ్ని వాయు వులు తన శరీరముగా నుండగా అతను యుద్ధమున రాజిల్లెను. లోక ముల కారణమైన పొర మేష్ట్యస్థానముననున్న కాలనేమిని, దేవతలు పితామహుని స్తుతించినట్లు దైత్యులు స్తుతించిరి. విపరీత కర్మచేత ఐదు ఆతనిని చేర లేదు. అవి వేదము, ధర్మము , ఓర్పు, సత్యము నారాయణుని ఆశ్రయించియుండు లక్ష్మి.. ఇవి తనవద్దయుండనందు చేత ఆ దానవరాజు కోపముతో వైష్ణవ పదమును కోరుతూ వెళ్లెను. ఆపుడతను శంఖ చక్రముల ధరించి, దానవుల వినాశనానికి గదను తిప్పుచూ గరుత్మంతుడిపై కూర్చునిన విష్ణువును చూచెను.
ఆ విష్ణువు నీటితోనున్న మేఘమువలె నుండి, మెరుపువంటి పచ్చని వస్త్రముల ధరించి కశ్యపసంతానమైన పక్షి రాజును బంగారు రెక్కలు గల దాని నెక్కియుండెను. దుష్టులగు దైత్యులను నశింపజేయుటకు ఆకాశమున నిలుచునట్లున్న ఆ క్షోభింప శక్యముగాని విష్ణువును క్షోభనొందిన హృదయముతో కాలనేమి ఇట్లనెను. “ఇతనే మా శత్రువు. మా పూర్వికుల ప్రాణముతీసినవాడు. సముద్రమున వసించు మధు, కైటభులను చంపినదితనే. మాకు ఆసమానమైన శత్రువందురు కదా! పెక్కు యుద్ధములలో పెక్కు దానవులు ఇతని చేతిలో అసువులు బాసిరి. లోక మున దయలేనివాడు. స్త్రీలన్న నూ, పిల్లలన్న నూ సిగ్గులేని వాడు. దానవ స్త్రీ ల సీమంతమును తొలగించినవాడు. దేవతల విష్ణువు, వైకుంఠుడు,సర్పములలో ఆనంతుడు, స్వయంభువుకు స్వయం భువుడు, దేవతలకు నాథుడైన ఇతను మాచే విడిగా చూడబడు వాడు. నుండువాడు) ఇతని కోపముచే హిరణ్యకశిపుడు మరణిం చెను. ఇతని ఛాయనాశ్రయించిన దేవతలు యజ్ఞముఖమున నిలిచి మహర్షులచే నివ్వబడినది, మూడు విధాలుగ వేల్చబడినది యగు ఆజ్యమును గ్రహింతురు. దేవశత్రువులకితను మరణకారకుడు. మా కులాలు యుద్ధమున ఇతని చక్రమునే ప్రవేశించినవి.
ఇతనే యుద్దములలో దేవతల కొరకు ప్రాణము లివ్వడానికి సిద్దముగానున్నవాడు కదా ! శత్రువుల పై ఇతను తేజస్సుతోనున్న చక్రమును విడుచును. దైత్యులకు మృత్యువువంటి ఈ విష్ణువు, మృత్యువై నేను నిలిచినపుడు గడిచిన కాలానికి ఫలాన్ని తప్పక పొందును' నా అదృష్టవశాత్తు ఆ విష్ణవే నా ఎదుట నిలిచాడు. ఇతనిని బాహువుతో పిండిచేసిన నశించును. ఈనాడి యుద్ధమున నేను నా పూర్వీకుల ఋణమునుండి విముక్తి ని పొందెదను. ఈ దానవులకు భయముగొలు నారాయణుని దేవగణములను త్వరగా యుద్ధ మున వధించెదను. వేరొక జాతికి చెందిన ఇతను యుద్ధమున దానవులను బాధించును. పూర్వము అనంతుడై, వద్మనాభుడని పేరొందెను. ఏకార్ణవమున మధుకైటభుల వధించెను. శరీరమును ముందు పై భాగము సింహముగా, కింది భాగము నరునిగా చేసి పూర్వము నా పూర్వుడై న హిరణ్యకశిపుని వధించెను. దేవతల ఆరణియగు అదితి శుభుడగు ఇతనిని తనగర్భమునదాల్చగా మూడు అడుగులతో ముల్లోకముల హరించెను. మరల ఇప్పుడీ తారకామయమైన యుద్దమునందు దాపురించాడు. ఇక నాతో తలపడి ఇతను నశించ గలడు.
ఇట్లనేక విధములుగా పలికి, నారాయణుడు రణమున సరిలేని మాటలతో యుద్ధమునే కోరెను. అసురేంద్రుడు తనను అవమానించిన నూ విష్ణువు కోపించ లేదు. గొప్ప క్షమాబిలముతో, నవ్వుతో ఇట్లనెను. “దే త్యుడా ! దర్పముచే కలిగిన బలము అల్పమైనది. కానీ క్రోధమునుండి జనించని బలము స్థిరమైనది. దర్పమునుండి కలిగిన దోషాలతో నీవు చంపబడినట్లే. ఓరిమిని వదలి పలుకుచుంటివి. నా అభిప్రాయములో నీవధముడివి. నీ పోగ్బలము తుచ్చమైనది. స్త్రీలు గర్జించుచోట పురుషులుందురా ? నీ పూర్వీకుల మార్గమును నీవనుసరించునట్లు చూచెదను. ప్రజావతి నిర్మించిన సేతువును వదిలి క్షేమము నెవడు పొందును ? దేవతల కర్మలను పాడుచేయు నిన్నీ నాడు నశింపజేసెదను. దేవతలను వారివారి స్థాన ములయందు నిలి పెదను.” ఆని నిష్ణువు పలుకు చుండగా దానవుడు క్రోధముతో నవ్వెను. అన్ని ఆయుధములను రణమున పైకెత్తి కోపముతో మిక్కిలి ఎరుపెక్కిన కళ్ళుగల ఆ దానవుడు విష్ణువు వక్షస్థలము పై పడవేసెను. మయుడుతారుడు మొదలగు దానవులుకూడా రణమున ఖడ్గములబూని విష్ణువునెదిరించిరి.
అన్ని ఆయుధములనెత్తి తనతో తలబడిన ఆ దైత్యవీరులను చూచియూ, విష్ణువు స్థిరమగు పర్వతము వలే కదలక నిలిచియుండెను. సుపర్ణునితో తలపడిన కాలనేమి పెద్దగదను చేతులతో నెత్తి గరుడుని పై వే నేను. జ్వలిందు ఆ గద గరుడుని పై వడగా విష్ణుపు విస్మయమునొందెను. గరుడుడు వ్యధనొందుట, తన శరీరము గాయపడుటను జూచి విష్ణువు కోపముతో ఎరుపెక్కిన కళ్ళతో చక మును గ్రహించెను. సుపర్ణునితో సమానముగా వేగముగా పెరిగెను. అపుడతని భుజములు వ్యాపించి అన్ని వై వుల పెరిగిపోయినవి. తన శక్తి చే లోకముల నాక్ర మించదలిచినట్లు విష్ణువు వర్దిల్లెను. దేవతల జయమునకై ఆకాశ తలమున వర్థిలుచున్న విష్ణువును చూచి దేవగంధర్వాదులు, ఋషులు స్తుతించిరి. ఆ విష్ణువపుడు తెల్లని కిరీటముతో ఆకాశ మున చిత్రించునట్లుండెను. పాదాలతో భూమినాక్రమించి, చేతులతో దిక్కులను కప్పి, సూర్యునివంటి శాంతిగలిగి వేల ఆకులతో శత్రువులదునుమాడునట్లుండెను. జ్వలించు అగ్నివలె భయంకరముగా చూచుటకు మనోహరముగా ఆణువువరకూ నిలిచి వజ్రనాభు డై భయముగొల్పునట్లు యుండెను.
దానవులు మరణించుటచే వారి మెదడు, ఎముకలు, మూలుగ, రక్త ము వీనితో తడిసిన అద్వితీయ ప్రహరణము దాల్చియుండెను.. పూలదండను గలిగి, కొమగమనమును. కామరూపమును గలిగియుండెను. స్వయంభువుచే స్వయముగా సృష్టింపబడిన విష్ణువు శత్రువులకు భయముగొల్సు నట్లుండెను. రోషముతోనున్న , నిత్యయుద్దముతో దర్పించిన రూపమును దాల్చెను. ఆ మూర్తిని విడుచుటచే స్థావరజంగమలోక ములన్నీ మోహమునొందును. రాక్షసులు మొదలగు భూతములు మహాయుద్దమున తృప్తి ని పొందును. ఆట్టి అసమానకర్మగలవానిని, సూర్యసమానకాంతిగలవానిని దేవతలు, ఋషులు స్తుతించిరి. కోపముచే వెలుగు విష్ణువు, చక్రము నెత్తి యుద్ద మున రాక్షసతేజస్సును తన తేజస్సుతో నశింపజేసెను. ఆ చక్రము కాలనేమి బాహువుల ఛేదించేను. ఆ నూరు తలలు ఘోరముగా అగ్ని చూర్ణములు వెడలు అట్టహాసములతో నుండెను. వానిని చక్రముతో వారి ఖండించగా, చేతులు, తలలు తెగిననూ కాలనేమి మొండెము నిలిచియుండెను. అపుడు గరుడుడు రెక్కలు విప్పార్చి కొమ్మలు లేని చెట్టువలెనున్న ఆ మొండెము వక్షమున గొట్టసాగెను. అపుడు భూతలమును క్షోభ పెట్టుచూ ఆ మొండెము నింగినివీడి నేలగూలెను.
ఆ దే త్యులు నేలగూలగా దేవతలు, ఋషులు కలసి బాగు, బాగని హరిని పూజించిరి. మిగిలిన దైత్యులు యుద్దమున కదలలేక పోయిరి. చేతులను సర్వత్ర విప్పార్చిన హరి కొందరిని జుట్టుపట్టుకొని, మరికొందరి కుత్తుక లు బట్టుకొని బాధించెను. కొందరి తలలు నరి కెను. గదలు, చక్రములతో దహింపబడిన దానవులు సత్వమును, ప్రాణములనూ కోల్పో యిరి. అన్ని అవయవముల గోల్పోయి భూతలము పై పడిపోయిరి. వారందరూ ఆట్లు నశించగా విష్ణువు ఇంద్రునికి ప్రియ మగునది చేసి తన కర్మ నిర్వర్తించిన వాడాయెను. తార కామ య మైన ఆ యుద్దమట్లుకాగా లోక పితామహుడ గు బ్రహ్మ ఆకు డకు వచ్చెను. దేవదేవుడగు హరిని పూజించుచూ ఇట్లనెను. “దేవా! గొప్పకార్యము నాచరించితివి. దేవతలకు శల్యమగు దైత్యుడు నశించెను. దైత్యనాశముచే మేము సంతోషించితిమి. నీవు వధించిన ఈ కాలనేమీయనువాడు మహాసురుడు . నీవు దప్ప ఇతనిని వధించు శాసకుడెవడూలేడు. ఈ కాలనేమి దేవతలను లోకములను చరాచర ములతో సహా పరిభవించుచూ, నేల దొక్కి నన్ను గూడా యుద్ధమునకు ఆహ్వానించుచున్నాడు.
ఆట్లు యమునివంటి కాలనేమిని వధించిన నీ ఈ కర్మచే నేను సంతోషించితిని. ఇక రమ్ము. నీకు శుభమగు గాత ! ఉత్తమస్వర్గమునకు వెళ్ళెదము. బ్రహ్మర్షులు ఆక్కడనుండి నీ రాక కై ఎదురుచూచుచుండిరి. ఓ (శేషదేవా ! నీకే వరమిచ్చెదను? స్వస్థానములనున్న దేవతలందరికి నీవే వరములనిచ్చువాడవు. ఈ మూడులోకములు దైత్యభాధ తొలగి వర్థిల్లును. ఇంద్రునికై జరిగిన ఈ యుద్ద ములో దైత్యబాధతొలగినది. శ్రీహరీ !” అనగా విష్ణువు ఇంద్రాది దేవతల నుద్దేశించి కల్యాణమగునట్లు వలి కెను. “ఇక్కడకు వచ్చిన దేవతలారా వినుడు. ఇంద్రుడిని ముందడుకొని మనమందరమూ కాలనేమి మొదలగు రాక్షసుల వధించితిమి. దానవులు పరాక్రమము గలవారు. ఇంద్రునికంటెనూ గోప్పవారు. ఈ గోప్పయుద్ధమున ఇందరు వధింపబడగా విరోచనుడు, స్వర్భానువు మాత్రమే మిగిలారు ఇక ఇంద్రుడు, వరుణుడు, తమ తమ దిక్కులను పాలించుదురు గాక !
యముడు దక్షిణదికు ను, కుబేరుడు ఉత్తరదిక్కును పాలించుగాక ! చంద్రుడు నక్షత్రములతో ఎల్లప్పుడూ కలిసియుండుగాక ! ఆయనములతో సూర్యుడు ఋతుముఖమును సేవించుగాక ! యాజ్ఞికులచే పూజింపబడిన ఆజ్య భాగములు ప్రవర్తించుగాక ! విప్రులు వేదదృష్టకర్మచే అగ్నులను వ్రేల్చుదురు గాక ! బలిహోమముతో దేవతలు, స్వాధ్యాయముతో మహర్షులు, రౌద్దముతో పితృదేవతలు సుఖముగా తృప్తి నొందెదరు గాక ! అగ్ని మూడు విధములుగా జ్వలించుగాక ! తమ గుణములతో మూడు వర్ణములు ముల్లోకములను తృప్తి నొందజేయుదురు గాక ! దీక్షగైకొనిన ద్విజాతులచే ఋతువులు ప్రవ రించుగాక ! యజ్ఞములనొనరించినవారు విడివిడిగా దక్షిణలచే యజ్ఞముల సంపన్న మొనరించెదరు గాక ! తమ సౌమ్య కర్మలచే సూర్యుడు లోక ములను, చంద్రుడు రసములను, వాయువు ప్రాణులయందలి ప్రాణములను తృప్తి నొంద జేయుగాక ! మహేంద్ర, మలయపర్వతములందు పుట్టినవి, ముల్లోకములకు తల్లులవంటివియగు నదులు సముద్రమును చేరుగాక ! దైత్యుల నుండి కలుగు భీతి విడవబడుగాక ! దేవతలారా ! శాంతించుడు. మీకు స్వస్తి అగుగాక ! సనాతనమగు బ్రహ్మలోకమునకు వెళ్ళేదను.
స్వగృహమునగానీ, స్వర్గమునగానీ, వి శేషముగా యుద్దమునగానీ నిర్భయంగా విశ్వాసంతో వెళ్ళరాదు. దానవులు ముడులు గదా !. ఏ ఒక్క బలహీనత, లభించిననూ దెబ్బతీ నెదరు. వీరి స్థితి స్థిర మైనది కాదు. మీ సౌమ్యమగు నిజభావ ముల ఋజుతయందే మీ మనస్సుండును.' అని సత్యవిక్రముడు విష్ణుపు దేవగణాలతో పలికి, మహాయశస్సుగలవాడై బ్రహ్మతో కలిసి బ్రహ్మ లోకమునకు వెళ్ళెను. భగవాన్ విష్ణువు దేవతలకు గొప్ప ప్రీతిని కలుగజేసెను. నీవు నన్నడిగిన ఈ అద్భు తము దానవులకు, విష్ణువుకు మధ్య జరిగిన తారకామ యయుద్ధమున జరిగినది.
ఇది శ్రీ పాద్మపురాణమున మొదటిదగు సృష్టిఖండమున పద్మోద్భవము, దేవాసుర యుద్దమను నలుబదియొకట - అధ్యాయము.
