పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
10 - ఏకోద్దిష్ట శ్రాద్ధవిధి
ఏకోద్దిష్ట శ్రాద్ధ విధి
పులస్త్యుడనియే. బ్రహ్మ మున్నా నతిచ్చిన ఏకోద్దిష్ట శ్రాద్ధవిధిం దెల్పెద. తండ్రి చనిపోగా, కొడుకులు బ్రాహ్మణులు పదిరోజులు మైలపట్టవలెను. క్షత్రియుడు పండ్రెండు, వైశ్యుడు పదేనురోజులు పట్టవలెను. శూద్రు డొక్కనెల ఆశాచము వట్టవలెను. పురుడుకూడ యిట్లే. పోయినవానీకి పండ్రెండురోజులు పిండప్రదానమును శాస్త్రము విధించినది. కారణము ఆ పోయినవానికి (వేత) యమపురి జేరుటకు బండ్రెండు రోజులు పట్టును. అందుచే నాజీవుని కీవ్రయాణములో దారిబతై మవనరము. ఆ రోజులలో వాని పుత్రకళత్రములు జ్ఞాతులు కూడ యింటినుండి దూరముగ నుందురు. వరస్పర రాగానుబంధముం బట్టి సుఖ దుఃఖములు కూడ పరస్పర మొకేరీతి ననుభవింవలయుం గావున వేతలు గమ్యస్థానముం జేరక నిరాశ్రయులై యున్నన్ని రోజులు నిక్కడ తదనుబంధులు ఇల్లువిడిచి నిరాశ్రయులుగా నుందురు. కావున దానినే మేలయవియనుట జరుగుచున్నదనిభావము) అందువలననే ఆకాశమణదు (పితృశ్లోకమండన్న మాట). సర్వదాహశాంత్యర్ధము దారిలో ప్రయాణ శ్రమ శాంతించుటకు వారినుద్దేశించి నీళ్లవదలవలెనని విధియేర్పడినది వదు నొకండవరోజున సగోత్రులకు (జ్ఞాతులకు) మైల పోయినతర్వాత పదునొకండు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను.
రెండవరోజున గూడ ఆవిధముగా ఏకోద్దిష్టము నేయవలెను. ఆవాహనము నేయుట ఆగౌకరణము వివ్వేదేవార్చనము లేకుండ వృదేవతల నొక్కరికే యీ అర్చన చేయవలయును. (అందుచేతనే యిడి ఏకోద్దిష్ట మనబడినది. అంతేగాక ఇందు పవిత్వమొక్కటే ఆర్షము (పూజ) అర్ఘ్యదికము నొక్కటేవిండమునొక్కడే. ఇటకు దయచేయండి వెళ్ళండి. అని స్వస్తి శుభమగుగాక ! యని వచించి చివర సాగనంపుచు జాహ్మణహస్తమందు తీలోదకము విడువవలెను. తరువాత తా నిష్టులతో భోజనముచేయుట మొదలగు పనులు లోగడ జెప్పినట్లే కావింపవలెనని వేదవిదు లెఱుంగుదురు. ఈ తీరున ప్రతిమాసము (మాసికము) జరుపవలెన్లు, సూతక్షమువేళ్సిన మూడవరోజున శయ్యదానము చేయవలెను; బంగారపు పురషవిగ్రహము గావించి పండ్లు వస్త్రములతోగూడ నావాభరణభూషితు లయిన బ్రాహ్మణదంపతులను బూజించి మంచముపై కూర్చుండబెట్టి వెండిగిన్నెలో ఆవుపాలు పెరుగుతో మధుపర్కము (తేనె) నీయవలెను. పితృభక్తుడైన కర్త లలాటమందలి యెముక చిన్నడి యా మధుపర్కమందు కలిపి దాహ్మణ దంపతులచే నామధుపర్కమును దాపింపవలెను. పార్వతీయులగు (వర్వతప్రాంతవాసులు) బాహ్మణులలో నీవిధానము కనబడును. అందుచే శ్రీవిధముగ నిచ్బిన శయ్య (శయ్యాదానము) దూష్యము ఉత్తమ బాహ్మణులీ దానము వట్టరాదు. అదివట్టివచో నాబాహ్మణుడు పునస్సంస్కారము చేసికోవలెను. (ఉపనయనాది సంస్కారాలు) ఈ శయ్యా దానవిధానము వేదమునందు పురాణమునందు గర్హింపబడినది.
శయ్యాదానము వట్టినవారందరు నరకమునకుం బోదురు. టంగారముతో చేరి యిచ్చిన దంపతులచే ననుభవింపబడిన యా శయ్యను. తెలియక తాకినను తాకిషవారు నరకము తొత్తురు.. నవద్దమందు భుజింపరాదు. భుజించెనా చాంద్రాయణము చేయవలెను. పితృభక్తిచేత పుత్రులిడి చేయవలసినదే. పితృదేవతల నుద్దేశించి వృషో త్పర్ణనం (ఆబోతున కచ్పువేసి వదలుట) చేయవలసినది. కపిల గోదానము కర్తవ్యమే. రష్యములతో భోజ్యములతో కరణము కర్తవ్యము ప్రేతుడు. (మరణించినవాడు) నపిండీకరణమువలన నూర్ధ్వలోకమునందు పార్వణము. భుజించును. గావున నిది అవశ్యకర్తవ్యం వృద్ధి శ్రాద్ధాదులందు గృహస్థునకు నపిండికరణద్ధము కర్తవ్యము. దానితోనే ముందు వానిని గలుపవలెను. పొర్వణ శ్రాద్దమందు పర్వములలో (అమావాస్యాది శ్రాద్ధములన్నమాట) పితృదేవతల నావాహించవలెను. అందు వేతుని వేరే నిర్దేశింపవలెను. గంధము, ఉదకము, నువ్వులు నింపిన సాల్లు పాత్రలు (దొన్నెల) అక్కడ ఉంచవలెను. పితృపాత్రలందు (వేతపాత్ర వాసేచనము క్రియవలెను కూరతో నుదకము చల్లవలెనన్నమాట. అదేవిధముగా పితృతత్పరుడై నాల్గు ఎండములనేర్పరచి “యే నమూనా” అను మంత్రముతో నన్న మును రెండు రెరడుగ విభజించవలెను. ఇదేవిధముగా అర్ఘ్యమునుగూరి మొదటనే పితరులకు ప్రేతకు వేరువేరుగా విభజించి యీయవలెను.
అలా చేయవలైన ప్రేత నాల్గవ, పితృత్వము (ప్రితృదేవతా భావముచు) పొంది ఆర్నిష్వార్తిదీ పితరులతో పాటగ నుత్తమమైన అమృతమునందుకొనును. సపిండీకరణమైన తర్వాత నావేతకు వేరుగా ఉండప్రదానమీయబడదు. ఆ పేతోద్దిష్టమైన పిండము. పితరులతోనే యవలయుదు. అది వారియందు చేరియున్నది. గ్రావున ఆది, మొధలు సంక్రాంతి యందు గ్రహణాదిపర్వములందు పెట్టు. తద్దినము (శార్దము) త్రిపించముగానే ఆచరింపవలెను. అనగా మూడే పిండము లందు విహితములు. ఏకోద్దిష్టము ఒక్క మృతడినమందే, మతాహమందు ఏకోద్దిష్టము విడిచి దైవమువిశ్వేదేవతా సహితముగ నేడిచేసినను పితృదేవతా పరిహాసపాత్రుడగును. దానివలన భాతృనష్టముకూడ గల్గును. మృత దినముందు పార్వణము చేసినచో సా (పేత అధోగతి పొందుము. పితృదేవతలతో గూడినవాడు నవళడీకరణముద్వారా స్వర్గము నందును. అందువలన వేతత్వము నుండి మోక్షము విడుదలయుగల్గును. పాండ్యమందు ఆమ శ్రాద్ధము. (పిండితో) పెట్టవలెను. పిండితోనే అగ్నౌ కరణము పిండ ప్రదానముకూడ చేయవలెను. ఆమీద సపిండికరణము ఒక మాస మందు లేదా మూడు మాసములుగానీ జరుపబడినేని దానం పొందిన జీవుడు ప్రత్వము క్రియేకాదు బంధము క్తియును బొందును ( మోక్షమందువన్నమాట).
వారిలో వెండవదానము చేయువా డేడవవాడు. మొత్తము నపిండులు నమాన పిండ భోక్త లేడుగురు పురుషులు. “సోవిండ్యం సా ప్రపౌరుషమ్” ఏడు తరములదాక సాపిండ్యముండునన్న మాట. హవ్యములు (దేవతల నుద్దేశించి యిచ్చు హోమ ద్రవ్యములు) కవ్యములు (పితృదేవతల నుద్దేశించి యిచ్చు ద్రవ్యములు) ఏ విధముగా నీయవలెను ? ఎవరిచే నీయబడిన యా కవ్యములు. నెవ్వరిచ్చినవి యెవరందుకొందురు? మానవమాతులైన బ్రాహ్మణులు తిన్నడి ఆర్నీలో హోమముచేసినదియు నగు నా యన్నమును శుభులు ఆడభులునైన వేత లేట్లు తిందుర ? అని మీమ్మడు ప్రశ్నింప పులస్త్యు డిట్లనియె. వితరులు వస్తురూపులు పితామహులు రుదులు. ప్రపితామహు లాదిత్యరూపులు.. ఈ విషయము వేదమునుండి వినబడుచున్నది. పేరు గోతమును పితృదేవతల కాయాహవ్యముల నందించును. శాడ్డము యొక్క తత్త్వ మును (యథార్థ స్థితిని)-మంత్రము ద్వారా భక్తితో పొందవలెను. పితృదేవతలకు అగ్ని ష్వాత్రాడి పితృదేవత లధిపతు లుగా నున్నారు. పోయిన తండ్రి తాత లింకొకచోట పుట్టినను (ఇంకొక జన్మ పొందినను) వారి నామస్తోత్రములు దేశ కాలాడులు వారికుండును. వారికి వారి వుత్రపౌత్యాధులు చేయు నీ ఆర్షణము పూజ (కార్ధము) ఆ పొణులను నంపీతులంజేయును. చనిపోయిన తండ్రి తల్లి తాతగినీ కర్మానుకూలతరబట్టి డివ్యుడైనచో నప్పుడుగూడ హనినుద్దేశించి పెట్టిన యన్నము దీర్యము (దేవతల కుచితమైన అమృతముగా) సో మోజీ కందును. దైత్యుడై నచో వారి కుచిత మైన భోగము మాంసార మగును. వశువైనచో పశువుల కాహారమై గాసము గడ్డి మొదలయిన భోగధూపమగును. సర్పజన్మమెత్తినచోనడే శ్రాద్ధాన్నము వాయువగును. (సర్పములు వాయుభక్షకములుకనుక).
యక్షుడైనచో నరుగును. థాసుడైన మాంషమగును. ! దానవుడైన ఈ క్షరూపమగు పానమగును. మనుష్య జన్మమెత్తిన నన్న పానాది రూపమగును. స్త్రీకి పురుషునికి రతి శ క్తిగ ఇతరులకు భోజన వైభవముతోగూడిన దాన శ క్తి రూపము ఆరోగ్యము మొదలగు పెక్కు విధముల రూపొందును. శారిద్ద మీది పువ్వు. దీని ఫలము బ్రాహ సాయు జ్యము (కేవల మోక్షము). రాజా ! ఆయువును పుతులను ధనమును విద్యను (జ్ఞానమును) స్వర్గము మోతానందమును రాజ్యమునుగూడ తాగిద్దాదులచే నందీతులైన పితృగణము లెత్తురు. మున్ను కౌశికుని కుమారులు మోక్షముం టోందీరని (వేదముల వలన వినబడుతున్నది. వారైదు జన్మముల శంఖండము పొండి. తుదకు ఉరగుబహ్మ పదము వండినారు నా విని భీష్ముడు, కౌశికజాతులు ఆ వరమో త్తమ ము క్రియోగము రెట్లు పొందిరి కి. ఐదుజన్మములలోనే కర్మ య మెట్లయినది ? అని యడుగ పులస్త్యు డిట్లనియె.
కౌశికుడను మహర్షి కురు మేతమందుండువాడు ఆతని కొడుకుల పేర్లు వారు చేసిన చేతలనుబట్టి వచ్చినవే తెలి పెద వినుము : స్వనృపుడు శోధనుడు హింసుడు - విశునుడు కవి వాగ్ధుషుడు పితృవర్తీ అనువారు. అందరును గర్గా చార్యుల శిష్యులే. తండి పోయిన తర్వాత తీవమైన దుర్భిక్షము ఘోరమైన అనావృష్టియు పచ్చినది. ఆ తపోధనులు గర్గాజతో గోవు నొకదాని నడవిలో మేపుచుండిరి. ఈ కపిల గోవును తిందము. మన మాకలికి జాల కుమిలిపోవుచున్నా మని పాపాలోచన చేయుచున్నతరి. వారిలో (పితృవర్తి) చిన్నవాడు ఈ యావును తప్పనిసరిగా చేంవవలసినదే యైనచో శాడకూపమున నాపని చేయుడు. ఆ గోవు వద్ద వినియోగమైనచో మనకు గోహత్యా పావము నశించును, ఇదీ నిక్క మనెను. అంతట నిట్లు సేయుమని యన్న అచే నాజ్ఞాపింపబడి పితృవర్తి యనువాడు శద్ధతో దానీ నుపయోగించి శాద్ధము బెట్టెను. ఆ తద్దినమందు వారిని దైవస్థానమందు (విశ్వేదేవస్థానమందు) ఇద్దరను పితృస్థానమందు ముగ్గురను అతిథిగా నొక్కని గూర్చుండబెట్టి తాను తద్దినము పెట్టువాడై పితరులను స్మరించుచు, మంత్రవత్తుగా శ్రాద్ధము పెట్టెను. అవ్వల నందరును శంకగొనక గురువునకు ఆవు పులివాతబడిన దిదిగో దూడ గైకొనుమనిరి. ఆ యేడ్యురు తపోధను లీలాగున నా ధేనువుం దినివేసిరి. అది యెంతేని కూరమైన పనియైనను వైదికమయిన బలము (వేదోక్తమైన పని చేసి నందువలని శక్తి) జడుపు విడిచి యా దుండగమున కొడబడి యావుం దినివేసిరి. అవ్వల కాలము జరిగి చనిపోయి వారు దశవురమందు కిరాతులై వుట్టిరి. పితృదేవతా భవభావితు లగుటచే వారు జాతిస్మరత్వముం బొందిరి, వారికి పూర్వ జన్మ జ్ఞప్తి గల్గినదన్నమాట. ఆ జన్మమందు వైరాగ్యమెరింగికొని కర్మానుసారముగ పాణములు విడిచి యొక తీర్థము చివర లోకుల కెవ్వరికి గనబడకుండ యననులే (ఆహారము లేక) వరమవదించి కాలంతరమను గిరియం దా లేడుగురు మృగములై, జన్మించిరి. విజ్ఞానయోగ మొంది వా రామేను విడిచిరి.
విరక్తులై అవ్వల నా కొండనుండి క్రింది కురికీ వడి చచ్చి (ప్రపాతమునంది) మానన నరస్సునం దా యేడ్వురు యోగులు చక్రవాకములై పుట్టిరి. వేరుచేత క్రియచేత వారు 1. సుమనుడు 2. కుసుముడు, 3. వసు 4. చిత్త దర్శి 5. సుదర్శి 6. జ్ఞాత 7. జ్ఞానపారగుడు నయి జ్యేష్ఠ ననువర్తించుచు నయ్యేష్ఠుర యోగపావను లయిరి. అందులో ముగ్గురు చిత్తము చలించి యోగభ్రష్టు లయిరి.
అందులో నొకడు, అణుహుడను పాంచాలరాజు మిగుల తేజరిల్లుచు మగువలతో మహాబల వరాక్రముడై వివిధ భోగము లనుభవించుచు కీడించుచుండు వానిం జూచి వావి చతురంగబల వాహన వైభవముం జూచి యా చక్రవాక పను లలో నొక్కడు రాజ్యకాము డయ్యెను.
ఇక పితృవర్తియను విపుడు శ్రాద్ధము పెట్టినవాడు పితృవత్సలుడును వెని జెప్పిన రాజు యొక్క మంత్రు లను బలవాహన సమృద్దులను జూచి తామాలాటి మంతులమైన బాగుండునని కోరి యీ మర్త్యలోకమున పుట్టిరి. విభా జుని కొడుకు జాహ్మదత్తుడయ్యెను. మంత్రి కుమారులుగా వుట్టి పుండరీకుడు సుబాలకుడు నను పెళ్లండిరి. బ్రహ్మదత్తుడు కావల్య నగరమందభిషిక్తుడయ్యెను. అతడే ముందటిజన్మమందు పితృవత్సలుడు. శ్రాద్ధకర్త ఫాంచాల రాజయ్యెను. యోగవేత్త సర్వజంతు చిత్రమెరిగిన వాడయ్యెను.
ఆ పాంచాలరాజునకు సుదేవుని కుమార్తె నన్నతి యను నామె భార్యయయ్యెను. మున్ను: ద్ధమందు. జంవ బడిన కపిలగోవే యిపుడు రాజ్ఞాయైనది. పితృకార్యమందుపయోగింపబడుటచే నామె బహ్మవాడిని యయ్యెను. ఆ రాజ నందనునండావెతో రాజ్యమేలెను.
ఒకతణి నాత డామేతో నుద్యానమున కేగెను. ఆట కీటకముల జంట కామకలహమాడుకొనుచుండం గనెను.
అక్కడ మగ కీటకము. తలవంచికొనియున్న యాడు భీమం గని కామబాణముల మేనుడికి గద్దదికతో ఓసి ! నీ కేడైన కామిని లోకమల దెందును లేదు. నడుము క్షీణము పెద్ద పిరుదులు. నిండు మొగము. చెంగుచెంగున నడతువు. మేనీ రంగా, బంగారమే ముద్దుమొగము మొలకనవ్వు, బెల్లము పంచదారపై మక్కువగొన్న నీ చక్కని మొగము కనీపించు చున్నది. నేను డిన్న నీవు తిందువు. నేను స్నానము చేసితీనా నీవు స్నానము చేయుదువు ఎటకేని నేనేనీతినా దేగు వడెదవు. కోపించితీనా బెదరి కంగారువడుదువు. ఎందుకే చెప్పు. కల్యాణి ! ఎప్పుడు తలవంచికొనియుందువవ వివీ, కోపమున మండిపడి, యా యాడుచీమ యిట్లనియె. ఓరి ! శఠ ! ఏమి వేలుచుంటివి ? మిఠాయి పొడి నన్ను విడిచి నీవ మెక్కితివ ? లేద ! చెప్పుము. నన్ను గాదని వలచి యింకొకదానికి మన నిచ్చితివిగదా.
పిపీలిక యిట్లనియె. చక్కనిదాన! నీ పోలిక గని నే నింకొకదానికి మనసిచ్చితిని. భామిని ! ఇదొక్క తప్పు నైరింపుము. ఇట్లు మజీ సేయను. సు స్తని కినుక విడుము. నిజము నీ పాదములాన ! పాదములంటి పలుకుచు ప్రణతుడ నైన నా యెడ దయగొను. సుశోణి (వలుద పికబదులదాన) నీవు కోపించిన నీ యెదుట చావు సిద్దము. వామోరు ! నీవు సంతుష్టురాలైన నా మనోరధములు సంపూర్ణములు. నా మోము పున్నమ చందమామ గద! తధాస్వాది మమృత రసోదయమే.
వలపుకొనిన నా మోమది తనివార గ్రోలుము. ఇది గణించి ఓ కల్యాణి యెల్లవేళల నాయెడ దయ నూపుము అనవిని యవ్వల నా యాడుచీమ యా చీమ యెడ వలపుటలుక విడిచి ప్రసన్నమయ్యే. వాని వలం. దనను దా నప్ప నము చేసికొనెను.
పూర్వకర్మవశమున తన నర్వసత్వరత జ్ఞానమువలన బ్రహ్మదత్తు డా చీమ పలుకులన్నియు దెలిసి యల్లన నవ్వి యదెల్ల జెప్పెను. నావిని భీష్ముడు బ్రహ్మదత్తుడు నర్వభూతరుతజ్ఞాన మెట్లుపొందెను. ఆ చక్రవాకములు నాలు నెక్కడ యేకులమందు నేమైనవి ? సర్వజ్ఞుడ వదియెల్లు నా వానతిమ్మన, పులస్త్యు డనియె.
ఆ పురమంద ఆ నాల్గు చక్రవాకము లోక వృద్ధ బ్రాహ్మణుని కొడుకులై జాతిస్మరులై పుట్టినారు. ధృతి మంతుడు తత్వదర్శి విద్యావక్షుడు తపోధికుడు నను పేర్లవారు. వారు పేరునకు దగిన క్రీయ గలవారు. వారందరకు తవసు సేయవలెనను తలంత గల్గెను. మేము పరముతపస్సిద్దీ నందెదమన విని తరిడి సుదరిద్రుడు మహాతవన్వీ, దీన ముగ నాయనలార ! ఇడి మీకు ధర్మముగాదు. ముదుసలి దండ్రివి అందును. నిరు పేద నడవిని విడిచిపోవు టిదేమి? నన్ను బానీ మీకు మరి ధర్మ మెక్కడ ? గతి యెక్కడున్నది ? అన వారు తండ్రీ! నీకు వృత్తి (బతుకుతెరువు) ఏర్పరుష జడియే యున్నది. మా మాట విను. ఇది యీ భూమి నేలు రాజు వ్రతము. అతడు నీకు పుష్కలముగ నిష్ణును. కురు చేత్రమం దే విప్రులు దశపురమందు వ్యాధులెవరైరి, కాలంజర గిరిపై మృగములై ది. వారు మానస సరస్సునందు చక్ర వాకములైరి. అని వేకువవేళ నీవు పఠించినంజాలు నీ కతను పుష్కలముగ నిచ్చును. అని తండ్రికిం జెప్పి వారు తపస్సునకు తిరిగి వనమునకుం జనిరి.
ఆ వృద్ధ బ్రాహ్మణుడును స్వార్థసిద్ధి కిట్టటు పరిథమించెను.. మున్ను పాంచాల రాజు ఆయుహుడును పుత్రార్థియై దేవదేవు నీశ్వరుల బ్రహ్మను బితామహు నారాధించెను.
కొంతకాలమునకు సంతుష్టుడై బ్రహ్మ నీ యభిప్సిత మడుగుమనెను, అలమవు నాకు దేవా! బలపరాక్రమ శాలీం గొడుకు నిము. అతడు సర్వవిద్యాపారంగతుడు ధార్మికుడు యోగివరడును సర్వన త్వరతజ్ఞానియుం గావలెనన బహ్మ యథే యగుగాక యని యన్ని, భూతములు చూచుచుండ నక్కడ యంతర్ధావతుండెను. అవ్వల, నతనిఖష్మ డోత్రుడు ప్రతాపశాలి నర్వసత్త్వదయాపరుడు నర్వసత్వబలాధికుడు సర్వసత్వరతజ్ఞుడు నర్వవర్వేక్వశ్వరుడు కుమారు డుదయించెను.
ఆమీధ యోగనత్వముతో (ప్రత్వగుణసంపత్తితో) శాతడు చీమువద్దకు వచ్చెను. అక్కడనే శ్రీఉంచు కీటక మిథునముం జూచెను. చూచి విన్మయమండి నవ్వుచున్న యాతనిం జూచి నన్నతి యేదో సంశయించుచున్న దియై యా నరనాధు నిట్లడిగెను.
రాజా ! హఠాత్తుగ నీ కీ వేట్టినవ్వేల కల్గినది ? ఆసమయముననయిన యీ నవ్వునకు కారణమెరుంగకున్నాను. ఆన రాజకుమారు డా చీమ లుకు విని, ఈ వ వ్వనురాగభరితమే విరనముగ నేర్పడినది. ఓ చక్కని నవ్వుదాన ! ఈ నగపునకు మరి యేకొటచెము కారణము లేదు. అందుల కామె యంగీకరించలేదు. మరియు నా దేవి నీ మాట యిది ఆఖడ్గము. నన్నే వక్తిహసించితివీ. నీతో నిథుడు నే జీవింపను. ఆడుచీమపలుకు దేవుడుగాక మనుజుడెట్లెరుంగగలడు! అందుచే నీచే నిపుడు నేనే పరిహసింవబడితిని. ఇంతకు నేమున్నది ? అనెను. అడి వినీ రాజు మారువర్కిక హరి వచన మది యేమో తెలియగోరి యకల్మషుడై నియమమూని యేడురాత్రు లద్దె యుండెను. స్వప్నాంతమందు బ్రహ్మ ప్రభాత కాలమందు నగరమందు పర్యటించుచువచ్చి నీ వెయవల్ని వృద్దబాహ్మణోత్తముని వలన నా వలు కెల్ల నేరుగగలదని యంతర్థానమయ్యెను. వేకువనే రాజు భార్యతో మంత్రులతో పురము వెడలి యట ముందేదో పలుకుచువచ్చుచున్న యొక్క ముదుసలిం జూచెను. ఆపుడా బ్రాహ్మణుడు “యే విప్రముఖ్యా. తే ఒత్ర వనంతి సిద్దా” అను శ్లోకము పఠించు చుండెను. అది విని యా రాజు శోకముగొని జాతినరండయ్యె. అతని యిద్దరు మంత్రులును నట్లే జన్మాంతర వృత్తాంత మెల్ల స్మరించినవారైరి.
కామశాస్త్రరచయిత సర్వశాస్త్రవేత్త బాభవ్యుడను నా బాలుడే పాంచాలరాజను పేరందెను. పుండరీకుడు ధర్మా త్ముడు వేదశాస్త్రప్రవ ర్తకు డయ్యెను. వారిద్దరు జాతిస్మరులై శోకించుచు నాముందు వాలిరి. అయ్యో మేము కోరి కర్మ బంధమునబడి కర్మ విభష్టులమైతిమి. అని యెంతో యేడ్చి యా యోగపారగులు లాశ్చర్యముగొని నిద్దమహిమను మరల మరల యభినందించిరి. అతడు నారాజునకు ధనము సర్వసమృద్ధమయిన గ్రామముల నొసంగి ధనమదముగొన్న యా ముదుసలి బ్రాహ్మణుని నట విడిచి రాజలక్షణసంపన్ను దన పుత్రుని విష్వక్సేనుడను పేర వానిని రాజ్యమందు వట్టాభిషేకించెను. అవ్వల నా బ్రాహ్మదత్తాదులు యోగివరులందరు. మానససరోవర జలమ్మున పితృభక్తులు మచ్చర మేమి యును లేనివారై వసించిరి. సన్నతియు హరథరితయయ్యె, నేనే నీకిది చూపితిని. రాజా ! యోగఫల మిదియెల్ల యెట్టయెదుట లక్షితమైనది, నీ యనుగ్రహమున నా కీ ఫలమెల్ల పాప్తించినది. ఆని యథినందించెను. ఆటుపై యోగులు వారెల్లరు యోగమూని తపోబలముచే బహ్మరంధ్రమున పరమపదించిరి. ఇట్లు పితామహులు తుష్టులై ఆయువు ధనము ఇద్య స్వర్గము మోక్షముష్టుణములు సుతుని రాజ్యమును నరులకిత్తురు. ఇది బ్రహ్మదత్తుని పితృమాహాత్మ్య మన విద్వాంసుడై (తెలిసి) విపులకు వినిఖించునేది వినునేని చదువునేని నూడుకోట్ల కల్పములకుప్రిని బ్రహ్మలోకము నంద ధేజరిల్లును.
ఇది పితృమాహాత్మ్యకథనమను పదియవ యధ్యాయము.
