పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

39 - అధ్యాయము

భీష్ముడు ఆడిగెను: “దేవా! వామనుని మాహాత్మ్యమును విస్తరముగా చెప్పితివి. ఇక విష్ణువు ఇతర మాహాత్మ్యమును చెప్పుము. ఏ పద్మముచే జగత్తంతా సృజింపబడెనో ఆ పద్మము నాభియందెట్లు ఏర్పడెను? వద్మమధ్యమున పూర్వము వైష్ణవీ సృష్టి ఎట్లేర్పడెను? పాద్మమహాకల్పమున మొత్తం జగత్తు పద్మమయ మెట్లాయెను? జలార్లవగతమయిన నాభియందు, జలముతోనే సాగర జలమున నిద్రించు పద్మ నాభుని ప్రభావము జనించేను. పూర్వము దేవతలు, ఋషిగణములు పుష్కరమున ఎట్లేర్పడిరి? యోగవేత్తల ప్రభూ! ఈ యోగమునంతా తెలియజేయుము. అక్కడ సనాతన లోకమును ఎట్లు నిర్మించితివి? స్థావర జంగమములు నశించి, ఏకార్ణవముగా భూగోళము కాగా, సర్పములు, రాక్షసులు నశించగా, కేవలాకాశముండగా, భూమి పై ధర్మము నశించినపుడు మహా భూతముల విపర్యయ మేర్పడగా, విశ్వపతి మాత్రము గొప్ప తేజస్సు కలిగినవాడై ధ్యాననిష్టుడైన యోగివలే నుండెను. పరమభక్తితో విను నాకు ఇదంతా పూర్తిగా చెప్పుము. శ్రద్దతో కూర్చున్న నాకు నారాయణాత్మకమగు యశస్సును తెలియజేయదగినవాడవు.

అపుడు పులస్త్యుడనేను కురుకుల శ్రేష్ఠా! నారాయణుని కీర్తిని వినుటయందు నీకున్న స్పృహ సద్వంశ జాతుడవై న నీకు తగిన దే. మొదటి పురాణములందు వున్నట్లుగా, దేవతలనుండి విన్నది విన్న ట్లుగా, దీని గూర్చి మహాత్ములగు బ్రాహ్మణులు చెప్పినట్లుగా, తేజస్సులో బృహస్పతి సమానుడగు పరాక రపుత్రుడు వ్యాసుడు తపస్సు చే గాంచి చెప్పినట్లుగా నేను నీకు విన్నంత వరకు భక్తితో చెప్పెదను వినుము. ఋషులద్వారా విన్నది చెప్పెదను. పరుడగు నారాయణుని తెలుసుకొన ఎవరుత్సహింతురు? బ్రహ్మ కూడా అతనిని వాస్తవంగా తెలియడు. ఆది విశ్వదేవసంబంధి కర్మ. అది మహర్షులయందు గు ప్రమైనది. అన్ని యజ్ఞముల కతను యజింపదగిన వాడు. త త్వదర్శులెరుగు త త్వమతడు. ఆధ్యాత్మవేత్తల అధ్యాత్మమతడే. విక ర్ములేగు నరకమతడే. ఆధి దైవతమను దైవము, ఆధిభూత మూ ఆతడే. వేదము నిర్దేశించిన యజ్ఞమతను. విజ్ఞులెరుగు తపమత నే. చేయువాడు, చేయించువాడు, బుద్దిమూలము, పురుషుడు ఆతనే. ప్రణవము, పురుషుడు, శాసకుడు అతనొకడే వివిధముగా భావించబడును. పంచప్రాణములు, ధ్రువము, అక్షరము అతనే. కాలము, ఫలము, యజ్ఞము, యజమానీ, అవిద్య అతనే. వివిధ భావములతో చెప్పబడు అతనే నారాయణుడు.

 ఆతనే అన్నింటినీ చేయువాడు, చేయనివాడు కూడా. అతనే చేయించువాడు. ఇంద్రాది దేవతల కర్మ ఆతనే. ఆద్యుడై న ఆతనిని మనము పూజించుదము. అతనే కర్మణ్యతచే ఆనందించువాడు. ఎవడు వక్తయో, చెప్పబడదగునది ఎవరో, నేనెవరో నీకు చెప్పెదను. ఏది వినబడుచున్నదో, ఏది వినదగినదో, ఏది వివిధముగా చెప్పబడినదో, కథ యేదో, శ్రుతులేవో, ధర్మి, ధర్మతత్పరుడెవరో చెప్పెదను. విశ్వము, విశ్వపతి నారాయణుడేయని చెప్పబడుచున్నది. ఏది సత్యమో, అనృతము కూడానో, ఏది ఆది, మధ్య, అంత్యమైనదో, ఏది అవధి లేనిదో, ఏది కలుగబోవునదో, చరాచరమూ, దానికంటే ఇతర మేదో అది ప్రధానభూతుడై న పురుషో త్తముడే. నాలుగువేల సంవత్సరములు కృతయుగమని ఆందురు. రెండువందల సంవత్సరాల సంధ్యాకాలముండెను. భీష్మా! ధర్మము నాలుగు పాళ్ళలో నుండి, అధర్మ మనునది లేకుండెను. అపుడు మానవులు స్వధర్మనిరతులై , శాంతులై యుండి జన్మించుదురు. విప్రులు ధర్మ పరులుగా. పాలకులు రాజవృ తీపరులుగా, వైర్యులు కృషినిరతులుగా, శూద్రులు సేవాపరులుగా వుండిరి. అపుడు సత్యము, సత్త్వము, ధర్మము విశేషము గా వర్ధిల్లును. సత్పురుషులాచరించునదే ధర్మము. దానిచేతనే లోకము వ్యవహరించును. ఇది కృతయుగమున ధర్మలక్ష్మణులైన ప్రాణుల, నీచజన్ములైన నరుల అందరి వర్తనము.

మూడు వేల సంవత్సరములు త్రేతాయుగమనబడును. ఇందు కూడా రెండు వందల సంవత్సరాల సంధ్యాకాల ముండును. ధర్మాధర్మములు సమపాళ్ళలో నుండును. సత్వము, సత్యము, కర్మ, ధర్మము విధించబడియుండును. త్రేతాయుగమున వర్ణములవారు లోభముతో కూడియుండి వికృతినొందెదరు . నాలుగు వర్ణముల వికృతి సహనము, దుర్బలత. ఇది త్రేతాయుగమునకు చెందిన విచిత్రగతి దేవునిచే నిర్మింపబడినది. రెండు వేల సంవత్సరముల ప్రమాణము గలది ద్వాపరము. అందుకూడా రెండువందల సంవత్సరాల సంధ్యాకాలముండును. అందుకూడా ప్రాణులు రజస్సు చే కూడినవారై ధనము (ప్రయోజనము)ను కోరువారై యుందురు. మూడులు, కృతఘ్నులు, ము! దులు జన్మింతురు. ధర్మాధర్మములలో క్రమముగా ఆధర్మము పెచ్చరిల్లును, కలియుగమున ఎన్నో విపర్యయములతో ధర్మము క్షీణించును. పవిత్రభాపము సడలును. ఆ స్త్రీకభావము వదిలి వేయబడును. వతోపవాసాదులు విడువ బడును. యుగపర్యయమగు కలియుగము రెండు వేల రెండువందల సంవత్సరాలలో అధర్మము మిక్కుటమగును.

మానవులపుడు కాముకులు, తాపసులు, ముద్రులవుదురు. దృఢముగా నిశ్చయించువాడు సాధువు, సత్యవాక్కుగల వాడూ వుండడు. అహంకార ము గలిగి, స్నేహబంధములు తొలిగి, మానవులు నా స్త్రీకులయ్యేదరు. నా క్రికులై బ్రాహ్మణులయందు భ కిలేనివారై యుందురు. కలియుగమున విప్రులందరు శూద్రులతో సమానమైన ఆచారముగలవారగుదురు. ఆశ్రమ వివర్యాసము కలియుగమున పెచ్చరిల్లును. యుగాంతమున వర్ణముల సందోహమేర్పడును. ఇట్టివి పన్నెండువేలు 'యుగ' మనబడును. వేయి యుగములు బ్రహ్మ యొక్క పగలు అనబడును. ఆ పగలు గడవగా అందరి జీవుల శరీర సమా పిచూచీ కాలము సంహరింపదలచును. దేవతల, బ్రాహ్మణుల, దైత్యదానవుల, యక్షరాక్షస పక్షుల, గంధర్వాప్సరసల, సర్పములు, పర్వతముల, నదుల, పశువుల, పక్షుల, జలచరముల నన్నింటిని సంహరించ గోరి సర్వభూతపతి జగత్తును సంహరించుట కై గొప్ప నాశనము చేయును. సూర్యుడు నేత్రముల గ్రహించువాడై, వాయువు ప్రాణుల ప్రాణము తీయువాడై, వహ్ని లోకములన్నింటిని దహించువాడై, మేఘముగ్రమై వర్షించువాడై యుండును. అపుడు గొప్ప యోగి యగు నారాయణుడు వెలుగుచున్న కిరణములచే సముద్రముల ఎండగొట్టును.

అటు పై సముద్రముల, బావుల, నదుల, పర్వతముల జలమును ద్రావి  వేయికిరణముల కాంతి గలిగి భూమిని చీల్చి రసాతలమున జలము యొక్క ఉత్తమోత్తమ రసమును ద్రావుచూ ఆనందించుచూ నుండును. ప్రాణులయం దున్న మూర్త ము, అమూర్తము, ఇతర ము అంతా పురుషోత్తముడు, ఆరవిందాక్షుడు గ్రహించును. వాయువు బలవంతుడై లోకముల కంపింపజేయుచునుండును. అపుడు హరి ప్రాణాసానమునొంది వాయువుతో ఆక్రమించును. అపుడు దేవగణముల, ప్రాణు. లన్నింటి పంచేంద్రియగుణములన్నీ ఆ యా భూతములగును. మేయము (వాసనచూడదగినది) వాసనచూచునది, శరీరము ఇవి పృథివిని ఆశ్రయించిన గుణాలు. భగవంతుడొక ముహూర్తమున లోకయాతను నశింపజేయును. నాలుక, రసము స్నేహము (జిడ్డు) ఆనునవి నీటి నాశయించును. రూపము, చక్షువు, నేత్రజ్యోతిని ఆశ్రయించును. స్పర్శ, ప్రాణము, చేష వాయువును, శబ్దము, శ్రోత్రము, శ్రవణము ఆకాశమును ఆశ్రయించును. మనస్సు, బుద్ధి, చిత్తము చేత్రజ్ఞుని చేరును. పర మేష్టి, హృషీ కేశుని చేరును. అపుడు భగవంతుని కిరణములచే కప్పబడి, పాయువుచే పేరితులై భూమిళాఖను ఆశ్రయిం చును. వారిని నశింపజేయుటకై పుట్టిన అగ్ని వందరకాలుగా జ్వలించుచుండును. విశ్వము నంతా దహించుచూ సంవర్త కాగ్ని యుండును.

ఆ అగ్ని పర్వతవృక్షములను, పొదలను, తీగలను, గడ్డిని, ఎవ్యవిమానములను, పురములను, ఆశ్ర య యోగ్యమైన వానినన్నింటినీ మిగుల దహించి, లోక ము లన్నింటిని భస్మమువలె చేసివే సెను. యుగాంతమున లోకసంభవమైన ఆ భస్మమును ధరించిన పిదప నల్లటి పెద్ద మేమమొకటి వంద విధాలుగామారి వివిధముగా వర్షించును. ఆ దివ్య జలముతో హవిస్సుతోవలె శ్రీహరి భూమిని సంతోషింపజేసెను. అపుడు పాలవంటి ఆ రుచికరమైన జలముతో పుణ్యశిశిరముతో భూమి సంత సించెను. ఆ నీటితో కలిసి భూమి పాల సాధర్మ్యమును పొందెను. ఒకే సముద్రజలమువలె నుండినది, ప్రాణులు లేనిదిగా భూమి యుండెను. గొప్పప్రాణులునూ, గొప్ప తేజస్వియగు ప్రభువును చేరినవి. సూర్యుడు, పాయువులేని ఆకాశము వుండగా, జగత్తు సూక్ష్మమవగా తనకుతాను సముద్రముల ప్రాణుల శుష్కింపజేసి, దహించి, సంకోచింపజేసి ఒక డుగా నిద్రించును. గొప్ప విక్రమ ముగలవాడై అతను పౌరుల రూపముదాల్చి ఏకార్ణ వజలమున యోగమునుపాసించుచుండెను. అపుడు అనేక వేల యుగములు ఆట గడిచినవి. వ్యకు డే నవాడెవడూ ఆవ్యకమును తెలియ లేకుండెను. పురుషుడనగ నెవడు ? యోగమనగా, యోగియనగా నెవడు ?

 వెనుక, చుట్టూ ప్రక్కల ఎదుట ఎవడూ తెలియుట లేదు. కనబడుట లేదు. వంచ భూతములను, ప్రజాపతిని, భూధరుడిని, సురేంద్రుని, పితామహుడగు వేద నిలయుని, మునిని సమాపనము చేసి నిద్రించగో రెను ప్రభువు. ఇట్లు లోకము ఏకార్ణవముకాగా గొప్ప కాంతిగల నౌరాయణుడు సలిలముతో భూమిని కప్పినపుడు, హంస నారాయణుడాయెను. రజస్సు మధ్యలో పారిజాక్షుడగు నారాయణుడు, ఆక్షయబ్రహ్మ యని తెలియబడువాడుండేను. ఆత్మరూపసరూపమగు తమస్సుతో కప్పబడి యతను సాత్విక మనస్సును గ్రహించి సత్వమును పొందెను. అపుడు బ్రహ్మకు తత్వజ్ఞానమును, ఉపనిషత్తను రహస్యమును చెప్పెను. పురుషుడే యజ్ఞమని పర మముగా చెప్పబడెను. ఇతర పురుషుడనబడువాడు నారాయణుడే. యజ్ఞమును చేయు! బ్రాహ్మణులు, ఋత్విక్కులనబడువారు ఇతని ముఖములనుండే వచ్చినారని శ్రుతి చెప్పుచున్నది. బ్రహ్మను మొదట ముఖమునుండి సృజించి తరువాత సామవేత్తయగు ఉద్గాతను, ఆధ్వర్యుడగు హోతను బాహువులనుండి సృజించెను.

 బ్రహ్మను, బ్రాహ్మణునినుండి శంసి, స్తోత అనువారిని సృజించెను. మేడ్రమునుండి మైత్రావరుణుడను హోతను, ఉదరమునుండి ప్రతిహర్త , పోతయనువారిని, చేతులనుండి ఆగ్నీధ్రుని, ఉన్నే తను యజుర్వేదిని, తొడలనుండి ఆచ్చావా క్కుని, సామగాయకుడగు సుబ్రహ్మణ్యుని ఇట్లు పదహారుగురుని సృజించెను. స్వయంభువు అన్ని యజ్ఞములకు ఋత్విక్కు లను సృజించెను. ఇక ఆపుడు పురుషుడగు నారాయణుడు యజ్ఞమనబడును. అన్ని వేద ములు, అంగములు, ఉపనిషత్తులు, క్రియలతో ఏకార్ణవమున నిద్రించగా ఆశ్చర్య మాయెను. విప్రులారా వినుడు! అపుడు మార్కండేయముని కుతూహలముతో భగవంతునిచే మింగబడి అతని కుడియందుండెను. ఎన్నో వేల సంవత్సరములు ఆందు తిరుగుచూ తీరప్రసంగముచే పృధివీ తీర్ధ మను గాంచెను. పుణ్యాశ్రమములు, దేవాలయములు, రాష్ట్రాలు, చిత్రములు, పురములు మున్నగువానిని చూచెను. జప హోమపరులపుడు శాంతులై, నిర్మలుడై యుండిరి. మార్కండేయుడపుడతని నోటినుండి మెల్లిగా బయటకు వచ్చెను. దేవ మాయచే, బయటకు వెడలునున్న తనను తెలుసుకొనలేక పోయెను. బయల్వెడలి ఏకార్ణవముగా నున్న జగత్తును, ఎల్ల డెలా చీకటితో కప్పబడినదానిని మార్కండేయుడు చూ చేను. అపుడు అతనికి తి ప్రభయము కలిగెను. అతను తన జీవితవ్యత్యయమును గోంచి భీతినొందెను.

దేవుని దర్శించుటచే ఆనందించిన మార్కండేయువు విస్మయము నొంది శంకించినవాడై ఇట్లాలోచించెను. “చిత్త మోహమా? స్వప్నమా ? రెంటికంటే భిన్నమగు భావమగును. ఇది సత్యము కావచ్చును. స్వప్నము మాత్రము కానేరదు. చంద్రుడు, సూర్యుడు, వాయువు లేనిదీ, పర్వతములు, భూతలములేనిది ఇది ఏమిలోక మగును” అని శోక ము నొందెను. పర్వతమువలే నుండి నిద్రించుచున్న పురుషుని గాంచెను. “అతనపుడు నీటియందు సగము మునిగియుండెను. సముద్రమున మునిగిన మేఘమువలె నుండెను. కొద్దీగా విడవబడిన చంద్ర సూర్యులతో, కాంతితో తపించుచున్న వానివలె నుండెను. గొప్ప కాంతితో, గాంభీర్యములో సముద్రమువలె ప్రకాశించుచున్న దేవుని చూచుటకు వచ్చి” ఎవర తన ని విస్మ యము నొందెను. అపుడు ముని మరల నారాయణుని కుక్ష్మి యందు ప్రవేశ పెట్టబడగా మార్కండేయువు మరల కుక్ష్మిని దేరి స్వప్న మును. గాంచితినని పూర్వమువలె పృధివియందు తిరగసాగేను. పుణ్యతీర్ధ జలమునుగల వనమును, వివిధాశ్రమములను. యజ్ఞము లుచేయుచున్న వారిని, గురుదక్షిణ లనిచ్చిన వారిని వందలకొలదిగా బ్రాహ్మణులను భగవంతుని కుయందు చూచెను. మంచి ప్రవర్తన గలవారిని, వర్ణ బ్రాహ్మణపూర్వులను అందరినీ చూచెను.

పూర్వము వలే నాలుగు ఆశ్రమముల గాంచెను. ఇట్లు బుద్ధిమంతుడగు మార్కండేయువు సందసంవత్సరముల పైబడి పృథివి పై చరించుచు, భగవంతుని కుడియందు చూ చేను. అపుడోక మారు మరల కుక్ష్మినుండి బయల్వెడ లేను. రావి చెట్టు కొమ్మ పై నిద్రించుచున్న బాలునొక ని నిద్రించుచుండగా చూచి, ఆట్లే జగత్తు ఏకార్ణవజలముగా నుండుటను, మంచుతో నిండి యుండుటను, ఆవ్యక్తి మున లోకము క్రీడించుటను, ప్రాణు లేవీ లేకుండుటను చూచి ఆతను విస్మయము నొందెను. సూర్యునివలె ప్రకాశించుచున్న ఆ బాలుని చూడలేక పోయెను. ఆతను కూడా ఒంటరిగా నీటియందు నిలిచి ఆలోచించెను. మునుపు చూసిన దే వనుకొందును. దేవమాయచే శంకించితిని. అని ఆగాధ సలిలమున మార్కండేయువు విస్మయముతో నిద్రించెను. భీతిల్లిన కళ్ళతో పురుషుని చూచుటకు క్రిందికి వెళ్ళేను. అపుడు భగవానుడు “బాలా ! నీకు స్వాగతము” ఆని మేఘసమానమగు స్వరముతో పలికి ‘మార్కండేయా ! భయపడవలదు. నా వద్దకు రమ్ము’ అనెను

అపుడు మార్కండేయు విట్లనెను నన్నవి మానించుచూ పేరు పెట్టి నన్ను పిలుచువారెవరు? వేలకొలది దివ్యపారములు ఇట్లు భయ పెట్టువాడు ఎవరు ? దేవతలకు నూ నాయందు ఇట్లాచరించుట సదాచారము కాదు. నన్ను బ్రహ్మ కూడా స్నేహముతో “దీర్ఘాయువు” అని పిలుచును. ఎవరిపుడు ఘోర తపమునా శ్రయించి జీవితము గోల్పోయి నన్ను మార్కం డేయ అని పిలిచి మృత్యువును చూడగోరుచున్నాడు ? అని మీగల క్షోభించి క్రోధముతో మార్కండేయువనగా మధుసూద నుడు మరల అతనితో నిట్లనెను. వతా ! నేను తేజస్సును హృషీ కేశు డినితండ్రిని, గురువును, ఆయువునిచ్చువాడను, సనాతనుడిని, నీవెందుకు నన్ను సమీపించుటలేదు? పూర్వము నీ తండ్రి ఆంగీరసుడను మహాముని పుత్రుని గోరి తీవ్రతపస్సు నాశ్రయించి నన్ను ఆరాధించెను. అతని గొప్ప తపస్సును చూచి నేమ తేజస్వియగు నిన్నతనికి ప్రసాదించితిని. లేనిచో, యోగమాయతో క్రీడించువానిని, ఏకార్ణవ ముననున్న వానిని చూడనుత్సాహము చూపువాడెవడుండును అనగా సంతోషము నిండిన హృదయముతో విస్మయమున విప్పారిన కన్నులుగల మార్కండేయువు తల పై చేతులు జోడించి నామగోత్రములను భక్తి తో పలికి, భగవానునికి నమస్కారమును చేసెను.

నమస్కరించి మార్కండేయుడిట్లనెను. పాపరహితుడై న దేవా ! ఈ మాయను వా స్తవముగా తెలియగోరు చున్నాను. బాలరూపమున నీవు ఏకార్ణవ మధ్యన శ యినించుట ఏమి ? ప్రభూ ! లోకమున నీవే పేరుతో తెలియుచున్నావు ? మహాత్ముడవనుకొందును. ఇతరుడెవడట్లుండ గలడు ! అనగా భగవంతుడు చెప్పెను. “నేను నారాయణుడను, సర్వభూత నాశనకారకుడను; వేయితలలు, ముఖములు, పాదములు కలవాడను. ఆదిత్యుని వర్ల ముతో, ముఖమున బ్రహ్మ మయుడిని. హవ్యవాహనుడగు ఆగ్ని ని జ్వాలలతో కూడిన వాడిని, ఇంద్రపదముననున్న శక్రుడిని, ఋతువుల వత్సరమును, యోగిజనమందు సాంఖ్యమును, యుగాంతమునందలి ఆవర్త నమును నేనే. అన్ని సత్వములు, దేవతలు నేనే. నర్పములలోనేను ఆది శేషువును, పక్షులలో గరుత్మంతుడిని. అన్ని ప్రాణులకు యముడిని, కాలమనువాడనునేనే. నేనే ధర్మము, అన్ని ఆశ్రమములవారికి తపస్సు నేనే. దయాపరమైన ధర్మము, పాలసముద్రమును, పరమసత్వము, ప్రజాపతినేనే, నేనే సాంఖ్యము, యోగము, పర మపదముకూడా . నేనే యజ్ఞమును, క్రియను, విద్యాధిపుడిని, జ్యోతిని, వాయువును, భూమిని, నీటిని, ఆకాశ మును, సముద్రమును, నక్షత్రములు, దశ దిశ లు నేనే. నేనే వర్షమును, సోమమును, మేమము, సూర్యుడు, పరమసనాతనుని, నేనే పరాయణము.

ఓయీ విప్రాః భవిష్యమున అన్నిటియందు నేనే యుండగలను. ఏదేది వినుచుంటివో, కనుచుంటివో, అనుభవించు చుంటివో అది నేనే యని జ్ఞ పిన యుంచుకొనుము. పూర్వము నేనే జగత్తును సృజించితిని. నేడు నూ సృజించెద చూడుము. మార్కండేయా! అఖిలజగత్తును నేనే ప్రతియుగమున రక్షించుచుంటిని. చెప్పినదంతా అవధరింపుము. ధర్మముల వినగోరి నా ఉదరమున నివసించుము. బ్రహ్మ, ఋమలతో దేవతలు నా శరీరమున యుండిరి. ఆవ్యక ముతో కలిసిన వ్యక్తరూపునిగ నన్నె జుగుము. నేను ఒక యక్షరము గల మంత్రమును. పితామహుడు మూడక్షరములవాడు-త్రివర్ణ మును దాటిన ఓంకారము పరమాత్మను దర్శింపజేయును. ఇట్లు సనాతనుడని నన్నందురు అని అనగా మార్కండేయువు విష్ణువు నోటిలోకి చేరెను. తరువాత ముని శేషుడు భగవంతుని ఉదరమును ప్రవేశించెను. అతని వద్ద ఏకాంతమును ఆవ్య యహంసను సేవించగోరెను. అక్షయమనునది వివిధముగనుండి ఆ మహార్ణవమున సూర్యచంద్రులు లేకుండిరి. హంస యను ప్రభువు మెల్లగ చరించుచుఁ జగత్తును సృజించుచు కాలపర్యయమున విహరించుచుండెను. అట్లే శుచియై తపమునాచరింప గోరెను. తన దేహమును నీటిచే కప్పి మర్త్యలోక మును మహాభూతములను విసర్జింప విశ్వమును పరమాత్మ ధ్యానించెను.

ఇట్లు ధ్యానించుచుండగానే, అర్ణవమున, నిరాకాశ మున, జలమయమున, సూక్ష్మమైన జగత్శయమున ఈశ్వరుడు సలిలమును చేరి క్షోభపరిచేను. అపుడు నీటిమధ్యనుండి సూక్ష్మమైన రంధ్ర మేర్పడెను. శబ్దముగూర్చి రంధ్రము ద్వారా వాయువు ఏర్పడి లోన సంక్షోభమునొంది పెరిగెను. బలమైన వాయువు అట్లు వేగముగా ఆ సముద్రమును క్షోభ పెట్టెను. క్షోభిల్లిన సముద్రము నీటిమధ్య నల్లని ఆగ్ని యొక టి ఉద్భవించెను. ఆ అగ్ని నీటిని ఎండించ సాగేను. అపుడు సముద్ర మంత రంధ్ర మేర్పడి ఆకాశమున విస్తరించెను. ఆత్మ తేజస్సుచే దివ్యమగు అమృతర సమువంటి నీరు ఏర్పడెను. ఛిద్రమునుండి ఆకాశము, ఆకాశమునుండి వాయువు, ఆందు సంఘర్షణచేత అగ్ని ఏర్పడేను. మహాభూత సృష్టిని చేయు , పితామహుడు ఇది చూచి బ్రహ్మ జన్మతో లోక సృష్టి కై బహు రూపముల దాల్చి ధ్యానించెను.

అతనిని సంపూర్ణమగు ఐశ్వర్యము గలిగిన ఉత్తముడిగా, యోగిగా తెలిసి బ్రహ్మపదమును విశ్వసించి యోగ మును తెలిసిన వాడై నియోగించెను. అపుడా మహాజలమున లోక ములన్నింటిని సృజించు మహేశ్వరుడగు హరి విధివత్తు జల క్రీడను చేసెను. నాభి నుండి పద్మమును సృజించెను. ఆది సహస్రవక్త ములతో స్వచ్చమై సూర్యకాంతిని గలిగి బంగారము వలె నుండెను. అగ్ని జ్వాలలవంటి ఉజ్వలకాంతిని గలిగి శరత్కాలసూర్యునివలె తేజస్సును గలిగి విష్ణుమూర్తి తనువు పై పెరుగు ఆుద మైన శైవలము వలే ఉదార కాంతి గలిగి ఆ క మలము ప్రకాశించసాగెను.

ఇది శ్రీ పద్మపురాణమున మొదటి సృష్టి ఖండమున పద్మప్రాదుర్భావమను ముప్పదితొమ్మిద - అధ్యాయము.