పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

24 - అంగారకచతుర్థివ్రతము

అంగారక చతుర్థి వ్రతము

బ్రహ్మ యనియె !- పురుషునికి గాని స్త్రీ కిగానీ వరములిచ్చునది శోక వ్యాధి భయ దుఃఖములు కలుగనీని వ్రతమాన తిమ్మన శంకరుడినియె. పాలసంద్రము లక్ష్మితో విష్ణువెప్పుడు శ్రావణ బహుళ ద్వితీయ నాడు వసించునో ఆనాడు గోవిందుని బూజించిన కోరికలు ఫలించును. గోవు, భూమి, బంగార ము మొదలయిన దానములు సేసిన ఫల మేడువందల కల్పములదాక సిద్దించును . ఆవాహనాది పూజావిధాన మంత మున్ను జేసినట్లే. ఆశూన్యశ యన ద్వితీయవ్రతమని దానికి పేరు.

ఆనాడు విష్ణువు నీచెప్చిన మంత్రముల నర్చింపవలెను. శ్రీవత్సధారిన్ అను నామము మొదలు పేర్కొని ధర్మార్థకామ పురుషార్ధములిచ్చు నా గృహస్థ ధర్మము భంగపడకుండుగాక ! నా అగ్ని దేవతలు నశింపకుందురుగాక. మా దంపతులకు మధ్య భేదమువచ్చి మా పితరుల నోళము కలుగకుండుగాక. యెప్పుడుగాని విష్ణుదేవుడు లక్ష్మిని విడువక యుండునట్లు నా కలతసంబంధము దేవా ! ఎన్నడును విడువడకుండుగాక. ఎట్లు నీ శ యనము పాన్పు లక్ష్మితో నేడవడదో అట్లు నా శయ్యయు నిత్యశోభనముగ నుండి , ఆశూన్యమగుగాక" అని ప్రార్థించి గీతవాద్యాది మంగళవాద్యాది మేళనములు "సేయవలెను.

ఆవన్ని సేయ శక్తి లేనప్పుడు ఘంట వాయించిన జాలును. ఈలా గోవిందుని బూజించి నూనె లేకుండ భోజనము సేయవలెను. నాల్గు నక్త ములు (నాలుగు రోజులు రాత్రి మాత్రమే) భోజనము సేయవలెను. ఉప్పుకారము విడిచి భోజనము సేసి ఆపై సూర్యోదయమందు లక్ష్మివతితోగూడ దీపపు సెమ్మా అన్న పాత్రలతోగూడ సలక్షణమైన చక్కని) శయ్యను దాన మీయవలెను. పాదుకలు (పాదరక్షలు) ( ఉపానహము) గొడుగు చామరము ఆసనము పీట లేక కుర్చీ వారుకోరిన సామగ్రితో తెల్లని వస్త్రములు పూలమాలలతో ఆవ్యంగాయఏలోపములేని విష్ణుభక్తులకు బ్రాహ్మణుని కుటుంబికి వేదవిద్వాంసునకు దాన మీయవలెను. గొడ్రాలి మగనికి మాత్రమెన్నడు నీయరాదు.

ఈలా ఆశూన్య శయనవ్రతము యథావిధి హరినుద్దేశించి లోభపడక నేసినతనికి పత్ని తో నేడబా దెన్నడు గలుగదు. స్త్రీకి భర్తృ విరహము గలుగదు.

ఆ చంద్రముఖమునందు విధవ సేసిన, పుత్రులకు పశు సంపదలకు క్షయముగాదు. ఏడువేలకల్పములీఫల మందుదురు. విష్ణువు నుద్దేశించి చేసిన యీ యశూన్యవతముచేసిన పుణ్యులు విష్ణులోకము నందుదురు .

బ్రహ్మ యనియె ! ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము ధర్మము పరమాత్మ యందు దృఢభక్తియు నెట్లు కలుగు నన నీశ్వరుండనియే. మంచి ప్రశ్న యడిగితివి. శుక్రునకు విరోచనునకు జరిగిన సం వాదమిది. తెల్పెద, ప్రహ్లాదుని కొడుకును. విరోచనుని- పదునా రేండ్లవానిని జూచి సరిగ నీతని రూపమేయని పరిహసించి బాగుబాగు ! విరోచనా ! నీకెల్లప్పుడు శివమగుగాక ! యనెను. అప్పుడాబాలుడు. విప్రో తమ ! నన్ను జూచి యిట్లేల పరిహసించెద వని యడిగెను. విరోచనుడు ప్రతి ప్రభావమున కాశ్చర్యపడి నవ్వితిని. మున్ను త్రిశూలి (శివుడు) దక్షుని బరిమార్పనెంచి కోవముగొన్న నంతట నాయన నుదుటనుండి చెమట చుక యొకటి క్రిందబడెను.

ఆది సప్తపాతాళములను భేదించి సప్తసముద్రములను దహించి ఇంకింప జే నేను. ఎన్నో ముఖములు కండ్లతో భయంకరుడై ముల్లోకముల దహింపబూని నంత శివుడువారించెను.

అందరికి శాంతి చేకూర్చువాడవగుట నన్ని గ్రహములకు నీవు మొదటివాడ వగుము. నీ వలన హర్షించిన జనులు కృతారులె నీ పూజ నొనరింప గలరు. భూమీ బిడ్డ అంగారకుడు అను ప్రసిద్దినందెదవు. నీ రెండవ రూపము దేవలోకమునందుండ గలదు. చవితినాడు నిన్ను పూజించిన మానవులు ఆయురారోగైశ్వర్యము లనంతముగ నందుదురు. అని శివుడనినంత వీరభద్రుడు శాంతినొంది కామరూపధరుడై గ్రహరూపము నందెను.

ఆ చెమట చుక్క వలన జనించి గ్రహమై దీపించెను. నీ తేజస్సు సుదూరము ప్రసరించెను. ఒకప్పుడు చూద్రుడు, నిన్ను బూజించి శత్రుకులము పాలిట పిడుగై యసురుడై జన్మించెను. నీ దీప్తి విదూరము (చాలా దూరము) దీపించునదగుట చేతనే విరోచనుడను పేరు నీకు సార్ధకమైనది. ఈ రూప సంపద యిలాటిదని నేనాశ్చర్యపడి సాధు సాధు బాగు బాగని మెచ్చికొన్నాను. నిన్ను జూచిననే చాలు నైశ్వర్య మద్భుతముగా గలుగును. ఇక నిన్న ర్చించినచో వైభవ మేమనవలెను? శూద్రుడు చేయుచున్న యీ అంగారక వ్రత మైన గవాది దానము చూచినంత మాత్రాన రాక్షసుని గర్భమున పుట్టువు వచ్చినది. ఆన్న శుక్రుని వాక్యము విని ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు శుక్రాచార్యుని మరల యిట్లడిగెను. భగవంతుడ! ఆ వ్రతమునున్న దున్న ట్లు వినగోరెదను.

జన్మాంతరమున నా యీయబడు దానము నేను జూచుట, ఆ వ్రత ప్రభావము, విధానము నానతిమ్మన శుక్రు డాదరముతో నిట్లు నే ప్పెను.

మంగళ వారమునాడు చతుర్థి తిథి కలిసి వచ్చినపుడు . మృత్తికా స్నానము చేసి . పద్మరాగమణి నలంకరించుకొని “ఆగ్నిర్మూర్గా దివః" ఆన్న మంత్రము నుత్తరముగా నిలిచి జపింపవలెను.

శూద్రుడు మౌనముతో భోగము అనుభవింపక కుజుని స్మరింపవలెను. సూర్యాస్తమయము తర్వాత ఇంటి ముంగిట - నావు పేడతో నలికి పూల మాలలతో ఆడతలతో చర్చించి కుంకుమతో అష్టదళ పద్మమును వ్రాయవలెను. కుంకుమము లేనిచో ఎట్టి చందనమైన మంచిదే. నాల్గు గిన్నె లలో భక్ష్యభోజ్యాదులతో ర కళాపమద్దీ, వరి బియ్యము వండి, నాల్గు గిన్నెలలో పద్మరాగాలు సమకూర్చి నాల్గు కోణము లందు నాల్గు గిన్నెలుంచి రకరకాల పండ్లుంచి గంధమాల్యాదికమంతయు గూర్చి బంగారు తొడుగు కొమ్మలతోడి వెండి డెక్కలతోడి సాధువైన కపిల గోవును నూత్న వస్త్రముల నలంకరించి కంచు పాలచెంబుగొని కుంకుమ పూసి నూతన వస్త్రములతో సప్త ధాన్యములు సమకూర్చి బంగారు ముద్రగ అంగుష్టమాత్ర పురుషుని దీర్ఘ బాహువుగ చతుర్భుజుని రాగి బెల్లపు కడవ పైనుంచి సామస్వర జుడు, సామవేది, జితేంద్రియుడు, చక్కని రూపము, మాట, నడవడియు గల ద్విజునకు కుటుంబి కీయవలెను. దాంభికునికి మాత్రమీయరాదు.

ఆ దానము చేయునపుడు భూమికుమార పినాకి (శివుని) చెమట నుండి పుట్టినవాడ రూపము (అందము) కోరి నిన్ను శరణంటిని. అర్ఘ్యమిదే చేకొనుము. నీకు నమస్కారము అను అర్థముగల యీ మంత్రమును పఠించుచు రక్తచందనోదకముతో నర్ఘ్య మీయవలెను. ఆపై నా విప్రుని ఎఱ్ఱని పూల మాలలతో వస్త్రములు గంధము మొదలయిన వానితో నర్చించి అదే మంత్రముతో గోమిధునముతో బాటు భౌముని  ఆంగారక విగ్రహమును యధాశ క్తి తలగడలు మొదలగు సర్వోపసరములతో సాధన శయ్యా దానము చేయవలెను. లోకమున యా ఇంటిలో నేది కావలెనని కోరునో నా వస్తువు గుణవంతుని కీయవలెను. ఆది యక్షయమగును. ఆపై ప్రదక్షిణము సేసి యా విప్రో త్తముని సాగనంపి పాలు మాత్రము ద్రావి న క వ్రతము సేయవలెను. ఈలా యెనిమిది మంగళ వారములు (అంగారకాష్టము) నాలుగు వారాలై నను చేయవచ్చును. ఆ పుణ్యమిదె నె ప్పెద.

రూవము సౌభాగ్యము జన్మ జన్మము నందును. విష్ణువునందు కాని శివునందు గాని భక్తుడు సప్త ద్వీపాధిపు డగును. సప్త సహస్ర కల్పములు రుద్రలోకమందు విహరించును. అందుచే దైత్యేంద్ర నీవు నీ వ్రత మాచరింపుము అని యిట్లు ఈక్రాచార్యులచే తెలుపబడినది. యా రాక్షసుడిదియెల్ల చక్కగ నొనరించేను. రాజా! నీవు నిదియెల్ల జరుపుము. అక్షయఫల మగునని వేదవిదులనిరి. వేరు మనసు లేక యిది విన్నతనికి నీ ఫలము భగవంతు డనుగ్రహించును.

ఇది అంగారక చతుర్థి వ్రతమను నిరువది నాల్గ - అధ్యాయము.