పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

28 - వృషారోపణ విధి

వృషారోపణ విధి

భీష్మడనియె : చెట్లను నాటుట యేట్లు? దాని ఫలమేమి తెలుపు మన పులస్త్యుడనియె. చెట్లను నాటుట ఉద్యానము లేర్పరచుటను దేలి పెద. తటాక ప్రతిష్ఠకు వలెనే సర్వము పూర్తిచేసి ఋత్విగాదులను బూజించి అన్ని మూలికల యుదకములచే చెట్లను దడిపి పెరుగు అక్షతలచే వాని నలంకరించి యితన వస్త్రములు కప్పి బంగారు సూది చే వానికి చెవులు కుట్టవలెను.

ఐంగారు శలాకతో కాటుక పెట్టవలెను. ఏడెనిమిది పండ్లు కడిగి. చెట్ల వేదిక పై ప్రత్యేక మలంకరింపవలెను. గుసలు ధూపము వేయవలెను. రాగి పళ్ళెముల పై సప్త ధాన్యములు పోసి దాని పై చెట్లనుంచి నూతన వస్త్రములతో గంధములతో అన్ని చెట్ల దగ్గర కుంభములుంచి పూజించి సాయంకాలము బలి నివేదనము సేసి ఇంద్రాది లోక పాలుర పూజించి యిట్లు వనస్పతి కధి వాసనము (వనస్పతి=వృక్షము) సేయవలెను.

ఆపై తెల్లని వస్త్రము అలంకరించి బంగారు మొలత్రాళ్ళు కంచు పాల చెంబుతో బంగారు తొడుగు తొడిగిన కొమ్ముల తోడి పాలిచ్చు గోవును చెట్ల నడుమ నుండి ఉత్తర దిశగా వదలవలేను. ఆపై నభి షేక మంత్రముతో, మంగళవాద్యములతో గానములతో, ఋగ్యశ మంత్రములతో, వరుణ దేవతా మంత్రములతో నా కుంభములతోనే వానికి స్న వనము (స్నానము) బ్రాహ్మణులు సేయవలెను. ప్రాతఃకాల సమయమున యజమాని తెల్లని వస్త్రములు ధరించి వానిని పూజింపవలేను.

సంపన్నులైనచో నెల్ల మొత్వజులను గోవులతో సత్కరింపవలెను. దానికి బంగారు సూత్రములు, కంకణములు, ఉంగరములు పవిత్రములు చేయించి వారిని సత్కరించవలెను. వస్త్రములు వరుపులు దిండ్లతోడి శయ్యాదానము చేయవలెను. పాదుకల నీయవలెను. నాల్గు రోజులు క్షీరాభిషేకము గావించవలెను. నేతితో హోమము సేయవలెను, మోదుగ సమిధలు హోమమున కుత్తమములు. నాల్గవరోజు ఊరేగింపు ఉత్సవము జరువవలెను.

ఋత్విజులకు దక్షిణ యీయవలెను. పురోహితునికి రెట్టింపు దక్షిణ యిచ్చి నమస్కరించి యా వృక్షమాపణము "నేయవలెను. ఈలా వృశారోపణ విధి చేసిన ప్రజుడు సర్వ కామములందును, ఉత్తమ స్థానమందును, స్వర్ణ మనుభవించును. పది వేలమంది యింద్రుల కాలములు సుఖించును. శరీరములో రోమములెన్ని గలవంత కాలము తన నాశ్రయించిన జీవులను భూతముల నుద్దరించును. ఈ విధానము విన్న తడును దేవతలచే పూజింపబడును. బ్రహ్మలోకమందు రాజించును. ఇది నేసినచో పుత్రులు లేని వారికి పుత్రులు కల్గుదురు. తీర్ధములందు పిండ ప్రధానము చేయును. భీష్మ రాజేంద్రా! తప్పక యత్నించి ముందు ఆక్వతా రోపణము రావిచెట్టు మొలవేయుము. ఆ వృక్షము వేయిమంది పుత్రులు చేసిన సేవ నీకు కూర్ప గలదు.

 ఆయా చెట్లు ఆయా ఫలములు

రావిచెట్టు నాటిన ధనవంతు డగును. ఆకము - శోక నాశనము. జువ్వి యజ్ఞము సమకూర్చును.

ఇతి శ్రీపాద్మపురాణే ప్రథమే సృష్టిఖండే వృషారోపణవిధిర్నామ అష్టావింశోఽధ్యాయః

క్షీరి ఆయుర్దాయ మిచ్చును. నేరేడు ఆడపిల్ల నిచ్చును. దానిమ్మ ఉత్తమ భార్య నిచ్చును. రాగి రోగము నశింపజేయును. పలాశము (మోదుగ) వేద సంపత్తి నిచ్చును. విభీతకము నాటిన పేతత్వము గల్గును నరకమందును. అంకోలము = ఊడుగ - కులవృద్ధి చేయును. ఖదిరము = చండ్ర - రోగము పోగొట్టును. నింబము - వేప . నూర్య ప్రీతి కరము. శ్రీవృక్షము = మారేడు - శంకర ప్రీతికరము. పాటల = కలిగొట్టు - పార్వతి ప్రీతికరము. శింశుపా = అగరు వలన అప్సర సమావేశము. కుందము = మొల్ల - గంధర్వ సమాగమము. తింతిడికా = చింతదాస వర్గము ( సేవకులు సమృద్ధం). వంజులము - శత్రువులను దొంగలను గూర్చును. చందనము = మంచి గంధపు చెట్టు - ఐశ్వర్య ప్రదము పుణ్య ప్రదము. చంపకము, సం పెంగ - సౌభాగ్య ప్రదము. కరీరము = వెదురు . వరస్త్రీ సంగమము కూర్చును. తాడి చెట్టు - సంతాన నాళము. వకులము = కులవర్ధకము పొగడ - కుల వర్గనము. నారికేళము (కొబ్బరి} - బహు భార్యలను గూర్చును. ద్రాక్ష - సర్వాంగ సుందరి భార్యయగును. కోలి = బదరి 2 రేగు - రతిప్రద. కేతకి = వెలుగలి - శత్రునాశనము చేయును. ఈలా చెల్లింకనెన్నో నాట వలసినవి. వానిని ప్రతిష్ఠించినవారు మంచి ప్రతిష్ట నందుదురు.

ఇది వృశారోపణ విధియను నిరువది యెనిమిద - అధ్యాయము.