పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
32 – తీర్థావతారమ్
భీష్మ డనియె ‘బుద్ధిశాలీ! ఏ కర్మవిపాకమున ప్రేతత్వము వచ్చును? దేనిచే దానినుండి ముక్తుడగును. అది యెంగింపుమన పులస్త్యుడనియె. ‘రాజోత్తమా! నేనిది యెల్ల నే ప్పెదను. ఇది విని మజి మోహమందవు. సత్పురుషులతో సంభా షించినను, పుణ్యతీర్థ ములను గొనియాడినను మానవులు ప్రేతత్వమునుండి ముక్తిగందురు. భీష్మా! మున్ను వృథువను బ్రాహ్మణుడు వ్రతనిష్టుడు పేరందినవాడు, నిత్య సంతుష్టుడు, స్వాధ్యాయపరుడు యోగజ్ఞుడు నిత్యయోగ సంపన్నుడు. జపయజ్ఞముచే కాలముం బుచ్చువాడు, క్షమ, దయ, సహనము, శాంతి గలవాడు. తత్వజ్ఞుడు , అహింసాపరుడు, మెత్తని మనస్సు గలవాడు, బ్రహ్మచర్యముతో తపోయోగముతో గూడిన వాడు, పితృ కార్యములందు వేదిక కర్మలందు శ్రద్దగలవాడు, పరలోక భయము గలవాడు, యుక్తాయుక్త విచక్షణ గలవాడు, సత్యవ్రతుడు, తియ్యని మాటలు గలవాడు, అతిథి పూజాపరుడు, ఇష్టాపూర్తములు గలవాడు రాగద్వేషాలు, సుఖదుఃఖాలు మొదలయిన ద్వంద్వములన్నియు వదలిన వాడు, స్వకర్మ విధి నిష్టుడు, స్వాధ్యాయాది సత్కర్మ నిరతుడు, సంసారమును గెలుచుటకీలా సత్కర్మాచరణము సేయుటలో నీబ్రాహ్మణ గృహస్థునకు పెక్కు సంవత్సరములు గడచినవి. ఆతనికి తీర్థయాత్రల నేయవలెనను బుద్దిగ లైను ఈ క ళేబర మును పుణ్యతీర్థములం దడి పెదనని మడిగా నియమముగొని పుష్కరమందు స్నానము చేసి సూర్యోదయమునకు ముందు జపము నమస్కారములు చేసి తనదారిం జనుచుండెను.
అప్పుడతడు తనముందతిభయంకరుల నైదుగురు పురుషులం జూచెను. వికృతరూపులు భయంకరులు మహా ఘోరులను పాపులను వాండ్రంగని యించుక గుండె బెదరి కదలక ఆట్టే నిలిచెను. ధైర్యము తెచ్చుకొని మధురముగ మీరెవరు? ఎందులకీ వికృత రూపులై నారు? ఈ వికృత రూపము వచ్చుటకే పాడుపని చేసినారు? ఈవిధంగా ఉన్న మీరందరు నేకడ కేదారిం బయలుదేరినారని యడుగగా పేతలీట్లనిరి : ‘ఎప్పుడు నాకలి దప్పికలందపించుచు తెలివిదప్పితిమి. దిక్కేదో విదిక్కు మూలేదో తెలియవు. నింగి నేలయు క్రింద మీదేదో తెలియము. మా దుఃఖమిది తెల్పితిమి. ఇదే మాకు సుఖమగుచున్నది. తెల్లవారి నది సూర్యోదయ దర్శనమైనది. నేనుప ర్యుషితుడను, రెండవవాడు సూచీముఖుడు. శిఘ్రగుడు, రోహకుడు ఐదవవాడు లేఖకుడను పేరివాడు , అన బ్రాహ్మణుడిట్లనియె.
కర్మవలన బుట్టిన ప్రేతలకు పేరేమి? ఎట్లేర్పడినవి? దానికి కారణమేమి? ఆన ప్రేతలిట్లనిరి. నేనెప్పుడు రుచిగల పదార్థము తినెదను. తిరిగి బ్రాహ్మణునికి వర్యుషితమే పెట్టెదను. ఇందు చేత నాకు పర్యుషితుడను పేరు వచ్చినది. అన్నాదులనడిగి వచ్చిన యెందరో విప్రులనితడు ముల్లుతో బొడిచి తిన్నాడు. అందుచే సూచీముఖుడను పేరొందెను. విప్రులేదైన యడుగవచ్చి నపుడు నేను శీఘ్రముగా వెళ్ళిపోయితిని. అందుచే శీఘ్రగుడను పేరందితిని. విప్రుల జడిసి ఇంటి పైకెక్కి రుచిగల పదార్థమునే కంగారుపడుచును యెవరై నా అన్నము పెట్టుమని అడుగుదురో యని భయపడుచు నింటి పై నొక్కడు కూర్చుని తానే తినునుగాన వీడు రోహకుడను పేరొందెను. ఇక వీడు మౌనము వట్టి నేలమీద కాలితో రాయుచు నెవ్వడడిగిన బెట్టలేదు. వీడు మమ్ములనందని పాపిష్టుడు. లేఖకుడను పేరువాడు.
లేఖకుడు కష్టముమీద నడచును. రోహకుడు తలవంచుకొనియే యుండును. శీఘ్రగుడు కుంటియైనాడు. సూచీముఖుని ముఖము నిండ ముళ్ళే. పర్యుషి కుడి మెడ వ్రేలాడుచుండును. లంబోదరుడనబడును. బృహదష్టుడు వ్రేలాడు పెదవివాడు. మా కథ యిదంత సకారణముగ నీకిదియెల్ల చెప్పితిమి. నీకింకను శ్రద్దగలదేని యడుగుమడిగిన చేప్పెదము అన బ్రాహ్మణుడు భూమినున్న జీవులందరాహార మూలమున నైనవారే. మీ యాహార మే మో వినగోరెదన్న ప్రేతలిట్లనిరి.
వినుమాహారము సర్వజీవులసహ్యించుకొనునది. అది విని మమ్ము మఱిమఱి తెగతిట్టిపోయుదువు. శ్లేష్మమంత్ర పురీ షాలు స్త్రీ యంగములతో గూడినది. ప్రేతలు తిండితినే కొంపలు వట్టి పాడు కొంపలు. ఆళచులు. స్త్రీలచే నంటింపపడినది.
చెల్లచేద రైనవి ఎంగిళ్ళతో. నలముకొన్నవి. మలముచే రోటిగొన్నవి, ఆటగదా పేతలు తిందురు. సిగ్గనునదిలేదు. హోమములు లేవు. విస్తళ్ళుండవు. ప్రేపేతలు తినుట యక్కడనే. గురువుల పూజింపరు. స్త్రీలే గెలుతురు. (పెత్తనము స్త్రీలదే) క్రోధ లోభములలో బడినవి పేతలట తిందురు నా తిండి సంగతి నే జెప్పుకొనుటకు సిగ్గగుచున్నది. తండ్రి! ఇంతకు పై నింక చెప్పుట నావలన గాదు. గట్టి ప్రతనిష్ట గలవాడవు నీవు. ఈ ప్రేతత్వమెట్లు పోవునో అడుగుచున్నాము నిన్ను. ప్రేతలెట్లు కారో యది తపోధనుడవు నాకు దెల్పుమన బ్రాహ్మణుడిట్లనియె.
ఏకరాత్ర ద్వారా త్రాదిగ చాంద్రాయణాది వ్రతాదులుగాని మరి మేలైన వ్రతములు చేసిన ప్రేత కాబోడు. మూడు ముద్దలు లేదా యైదు ఒకటిగాని దినదినము తిన్న వాడు భూతదయగలవాడు ప్రేతమై పుట్టడు.
శత్రుమిత్రులందు, మానావమానములందు బంగారము, మట్టిపెడ్డయందు సమబుద్ధిగలవాడు ప్రేతగాడు. గురు దేవత లతిధి పూజలందాదరము గలవాడు ప్రేతగాడు. శుక్లపక్షములో చతుర్ధి తిధి మంగళ వారము కలిసివచ్చినపుడు పితరులనుద్దేశించి శ్రద్దతో శ్రాద్ధము పెట్టినవాడు ప్రేతగాడు. క్రోధము జయించి, పాడువిమర్శలు మాని, ఆశ అంటూ వీడి, క్షమ గళి, దానశీలుడైన నతడు ప్రేత గాడు. గోబ్రాహ్మణులను, తీర్థముల, నదుల, పర్వతముల, దేవతలను మ్రొక్కువాడు ప్రేత గాడు.
ప్రేతలిట్లనిరి : పలురకముల ధర్మముల విన్నాము. మరీ దుఃఖితులమైయున్నాము. ప్రేతయగుటకు కారణము తెల్పుమన బ్రాహ్మణుడనియె.
శూద్రాన్నము తిని యది కడుపులో నుండగానే చచ్చినవాడు, తల్లిదండ్రుల, నన్నదమ్ముల, నక్క చెల్లెళ్ళ, కొడుకును ఏ కారణము లేకుండనే విడిచి పెట్టినవాడు చేయించరాని వాని చేత యజ్ఞము సేయించుటవలన, యోగ్యునిచేత చేయించక విడిచినవాడు శూద్ర సేవయందాస క్తి గలవాడు, తనదగ్గర దాచిన తనసొత్తు కాజేసినవాడు, మిత్రదోహి, శూద్రుని వంట పై మక్కువ గలవాడు, నమ్మిన వానికి ద్రోహము నేసిన వాడు, మాయావి. గో బ్రాహ్మణ హంతకుడు, దొంగ త్రాగుబోతు, గురుతల్పగాడు, భూమిని కన్యను నపహరించినవాడు, అందరికిచ్చిన దక్షిణగొని తానొక్కడే దాచుకొన్న వాడు , నాస్తిక భావము గలవాడు ప్రేత యగును.
ఈలా విప్రో త్తముడు మాటలాడుచున్నాడు. ఆకాశమందు దుందుభి ధ్వని యైనది. దేవతలు వేలకొలది పూలవావ గురిపించిరి. పేతల కంతలు విమానములు వచ్చెను. ఈ విప్రుని సంభాషణవలన పుణ్య సంకీర్తనము వలన నీ శుభము జరిగినది. అందువలన సర్వప్రయత్నమున సత్పురుష సంభాషణ మొనరింపుము. ఓ గంగా కుమారా! నీకు శ్రేయస్సు కావలెనన్న తొట్రుపడక సదోషి నేయుము. సర్వధర్మతిలక మీ వంచపేతకథను పఠించినవాని కులమున ప్రేత కలుగడు. మిగుల భక్తిశ్రద్ధలతో విన్న వాడు ప్రేతగాడు.
భీష్ముడనియె : అంతరిక్షమందు పుష్కరమును ధర్మశీలు రెందులకు కీర్తించిరి ? అది యిక్కడ యెట్లు లభించును? లభించిన దది యెట్లు ఫలమిచ్చును? ఆదంత నాకానతిమ్ము కుతూహలముతో నడుగుచున్నానన పులస్త్యుడనియె.
దక్షిణాపథమందున్న మునికోటి పుష్కరమందు స్నానము సేయవచ్చెను. పుష్కరమాక సమందున్నది.
పరబ్రహ్మమును ధ్యానించుచు పండ్రెండేండ్లు వారు గడిపిరి. బ్రహ్మ, ఇంద్రాదులు, దేవతలు, మహర్షులు నీటకు వచ్చిరి. ఋషు లంతర్ధానముగనుండి మిక్కిలి యసాధ్యములైన ధర్మములు సెప్పిరి. విప్రులార! పుష్కరమును మంత్రములతో బిలువుడు. “అపోహిషామయోభువః” అను ఋక్కులతో బిలిచిన దేవత దగ్గరకు వచ్చును. అఘమర్షణ మంత్ర జపము చే ఫలమిచ్చును. ఆ వాక్యము చివర విప్రులపై నేసిరి. దానిచే వారు దేశ నిమిత్తముగా పుణ్యులైరి. దక్షిణా త్తర దేశ ములవారు ధర్మశాస్త్రములందింత మున్ను నింద్యులైన కొండజాతి బ్రాహ్మణులు శ్రాద్దములందు కేతనమున కర్హులు గాని వారును పుణ్యులైరి. ఈ కారణము చేతనే రాజా! పుష్కరమింతదాక ఆకాశమందే యుండెను. కార్తికమందు స్నానము చేసినచో పుష్కరము పవిత్ర తనిచ్చును. బ్రహ్మతో గూడ నందరకది పుణ్యమిచ్చును. అచటికి యాత్రవచ్చిన అన్ని వర్ణములవారు మంత్రము లేకున్న పుణ్యవంతులగుదురు.
వారు ద్విజులతో సమానులే సందియములేదు. కార్తీక మాసమందు అగ్నిదేవతాకము. కృత్తికా నక్షత్ర మెప్పుడేని వచ్చునేని స్నానము దానమున నది యెంతో ఉత్తమము. యమదేవతాక నక్షత్రము యమదేవతా తిధియందు వచ్చినా అది పుణ్యతిథి యని యతులు కొనియాడిరి. ప్రజాపతి దేవతాకమగు తిధి యందు ప్రజాపతి దేవతాకమగు నక్షత్రము వచ్చెనేని యది మహాకార్తిక యనబడును. దేవతలకుగూడ యది లభింపదు.
ఎపుడు మంగళ భాను గురువారములు మూడిటియందు సూర్య కుజ గురు దేవతాకములై న తిథులు కలిసివచ్చినచో స్నానము చేసిననాడు పుష్కరమందు స్నానాది విధులు సేసినచో పుష్కర అశ్వమేధ పుణ్యము లభించును. నిశ్చయ మీది. ఇప్పుడిట దానము పితృ తర్పణమున క్షయ పుణ్యమిచ్చును. విశాఖా నక్షత్రమందాదివారము కృత్తికా నక్షత్రమందు చంద్రుడు కలిసివచ్చు నేని యది పుష్కర యోగమను పేరందినది. పుష్కర తీర్థమందది. యతి దుర్లభము. అంతరిక్షమునుండి యవతరించిన బ్రహ్మ దేవ కాకమగు నీ శుభ తీర్థమందు స్నానము చేసిన వారికి పుణ్యలోకములు మహోదయములు. వారింకొక పుణ్యము యంతమున్ను జేసిన చేయని దానియందు మటి యు పేశము చేయుదురు. ఈయామిని మహారాజా! సత్యమిది యుదాహరింపబడినది. తీర్ధముల కెల్ల ప్రవర మిదియని పఠింపబడినది. దీని మించినదిక పఠింపబడ లేదు. విశేషించి కార్తికమాసమందిది పుణ్యకరము పాపహరము.
సర స్వతి ఉదుంబర వనమునుండి (మేడిచెట్ల తోపుతో) వచ్చినది. దానిచే పుష్కర తీర్థమందు నిండింపబడినది. మణులచే సేవింపబడినది. దగ్గరలో దక్షిణదిశ పర్వత శిఖరమున్నది. అది నల్లని కాటుక వంటిది. నీలపు రంగు గరిక తోడిది. దానితో నా శిఖరము పుష్కరముతో నిండును. వర్షకాలములో మబ్బుగ య దైత్తుగ నుండును. కదంబ పుష్ప సమృద్ధము (కడిమిపూట) కుటజములు - అర్జునపుష్పాలతో సొంపుగానున్నది. సూర్యరథ మార్గమిటైత్తున శిఖర మెక్కనే పులకరించిన స్నిగ్ధములై స్త్రీల కురుల మనోహర ముల పయోధరములతో నట్లు మారేడు పండ్లతో నా శిఖర ము ఖాసించును. యింక రించు తుమ్మెద లంతట శోభించును. కోకిలల కుహూ కారములతో, నెమళ్ళ కేంకారవములతో నింపుగొన్నది. ఆ చక్కని శృంగము పై నుండి మనోహరమీ పుణ్యనది పుణ్యజలాలతో బ్రహ్మ కుమారి వేదురు స్తంభమునుండి ఉత్తరాభిముఖియై ఈ విపులమైన నది బయలుదేరినది. కొంత దూర మేగి యతి కొలది దూరమునుండియే నది వెనుదిరిగివచ్చును. అది మొదలాదేవి ప్రసన్న మై ప్రాణులపై దయ చే నంతర్గానము విడిచి వెల్లడియైనది. కనుక సుప్రభ. నంద ప్రాచి సరస్వతి అని పుష్కర తీర్థ ముందు బ్రహ్మ పేరు పెట్టినది. వంచస్రోతస్సులు ఆ సరస్వతి తీరమందేంతో చక్కని తీర్థములు ఆలయములున్నవి. సిద్ధులు మునులు వానిని నలువైపుల సేవింతురు. వానియందెల్ల సర స్వతి ధర్మ హేతువగును.
ఇచ్చిన దానము, చేసిన స్నానమిట యక్షయ ఫలదము. ఇట ధాన్యదానము తిలదానమును పరమ శ్రేష్టమని మునీశ్వరులందురు. ఇట స్త్రీగాని పురుషుడు గాని మనస్సు మార్చి ప్రాయోపవేశము చేసినా బోయిబ్రహ్మలోకమందు ఈలాటి ఫలమనుభవించును. ఆ పుష్కరమునందు చనిపోయిన స్థావరజంగములు కర్మక్షయ మై యనుకోకుండ నంద రాని యజ్ఞఫలమందుదురు.
సరస్వతి ధర్మఫలమున కరణి. జన్మాది దుఃఖముల మనసు దిగుతొందినవారికి సర్వవిధముల చక్కని ఫలమిచ్చునది. సరస్వతీ మహానది సర్వప్రయత్నములచే సేవింపదగినది. ఆ జలము పవిత్రము. నెప్పుడు త్రోవువారు వారు మనుష్యులు గారీ జగత్తునందున్న దేవతలు, యజ్ఞదానతపస్సులచే ద్విజులందు ఫలమట స్నానము చే నైజముగ బుట్టినశూద్రులు గూడ పొందుదురు. పుష్కరదర్శనమాత్రమున మహాపాపులు పాపము లు వాని స్వర్గమందుదురు. ఇట ఉపవాసమున్న తడు కొలది శ్రమతో పౌండరీక యజ్ఞము సేసిన ఫలమందును.
పుష్కరమందుపవాసమున్న యతడు పౌండరీక యాగ ఫలమందును. మాఘమాసమందు బ్రాహ్మణునకిట తిలదా నము యధాశక్తి భక్తి తో జేసినతడు విష్ణుక మందును. అట స్నానము, ఉపవాసము పంచగవ్య ప్రాశనము సేసినతడు స్వర్గ మందును. ఆ పుష్కరము దగ్గర వసించు దొంగలు మొదలగు జాతులుకూడ స్వర్గమంచుదురు. సందియములేదు, శూద్ర వృత్తి గలవాండుకూడ మూడురాత్రులుపవాసముండి బ్రాహ్మణులకిట ద్రవ్యమిచ్చినచో బ్రహ్మశక్తితోగూడి మరణించినపుడు పద్మమందు గూర్చుండి నాల్గు భుజములుకలవారై బ్రహ్మతో సారూప్యము, సాయుజ్యమునందుదురు. పునర్జన్మమందరు.
నది శ్రేష్ఠురాలు గంగానది సరస్వతీ నదితో విడవడి, ఆ పుణ్యనదిని జూచి యామె నోదార్చవలెననికోరి యాకాశ మందుండి బయలుదేరినది. సిద్దులెల్లరు సేవించు సరస్వతీనది దగ్గర కేగినది. ఆలా గంగాసంగ మమందిన సరస్వతీ జలమును విద్యాధరులు సేవించిరి. దానినొక దోనెడు సేవించినవాడు పరమపదమందును. తూర్పుదేసకు చూచి గంగానదితో సరస్వతీ సఖీ ! గంగా ! నేనొంటరిదాననై నిన్ను విడిచితిని. బంధువు నేడలి నేనెటకు పోవుదును ! అనెను. ఆమెను జూచి గంగ యేడ్చుచు, దిగులుపడి తూర్పునుంచి చూడవచ్చిన యా మహానుభావురాలింజూచి కౌగలించుకొని బాధతో ఆమె కన్నీరు తుడిచి యిట్లనెను.
మహానుభావురాల నెచ్చెలి ! నీకు జేయరాని పని చేసితిని. దేవతలకార్యమింకొంటిచేయ శక్యమగుటలేదు. ఇందువలన దేవతలు నిన్ను దర్శింపవచ్చినారు. త్రికరణశుద్ధిగ వీరికి బూజ సేయుము. ఆనగా సరస్వతి పూజగావించెను. క్రమ ముగా బ్రహ్మ పు తనదిగ కూడ సఖురాండ్రను గలిసికొనెను. జేమరాలు గంగతో మధ్యమురాలు బ్రహ్మ క్షత్రియులుకలియుట యిదిలోక ప్రసిద్ధము. బ్రహ్మపుత్ర పడమటి ముఖముగా గంగ ఉత్తర ముఖము గాను సాగిరి. ఆ మీద దేవతలందరు పుష్కరమునకు వచ్చిరి. ఆసాధ్యమైన పని చేసినదని యామెను నిట్లు స్తుతించిరి.
దేవతలు సరస్వతిని స్తుతించుట
తల్లీ ! నీవు సిద్ధివి. స్వధ - స్వాహవు. పరశుసవితురాలవు. సంధ్యా, రాత్రి, ప్రథ, భూతి, మేధ, శ్రద్ద, సర్వతీర్ధమయివి. అందరిదేవతలతోగూడిన దానవు ప్రాచీనదియని తెలియవలసినవి. బ్రహ్మయన్న మాటకూడ యదే. ఆక్కడ బ్రహ్మతీర్థమున్నది. గుద్దావటమను పేరుగలది. అది దర్శనమాత్రమున నీమహాపాపులు బ్రహ్మసామీప్య మందుదురు.
అచట ప్రాయోపవేశము సేసిన పుణ్యులు చనిపోయి బ్రహ్మయానమున నేభయము లేక స్వర్గమేగుదురు. బ్రహ్మ వేత్తలట నేకొంచెము దానము చేసిననునది నూరుజన్మలాపుణ్యము సేసినవారగుదురు.
అచ్చట ఖండస్ఫుటిత సంస్కారము చేసికొన్న వారు బ్రహ్మలోకమునందు సుఖింతురు. ఇట పూజ జపముతో హోమముచే సెనేని బ్రహ్మశక్తి వరుల ఫలమనంతమగును. అచట దీపము వెట్టినవా డతీంద్రియ జ్ఞాననేత్రసంపన్నుడగును. ధూప దానముచే బ్రహ్మస్థానమందును. పలుమాటలేల ! గంగాది సంగమమందేది దానము చేసిననది బ్రతికియుండగాను, చనిపోయిన నదీ యనంతఫల సాధక ము. మార్కండేయ మహర్షి చూపింపగా నిట రాముడువచ్చి. దశరథుని కి పిండ ప్రదానము చేసెను. ఆట నలుచదరముగా పిండ వాపియున్నది. పిండములువేయు నూయి. అందు పితరులకు పిండమువేసిన వారు హంసవాహనము పై స్వర్గ మేగుదురు. ఆ వాపియందు బ్రహ్మ పితృమేధ మాచరించెను.
యజ్ఞవేత్తలలో ను త్తముడు బ్రహ్మ యట యజ్ఞమును జేసేను.చాల యుత్తమ ప్రదక్షిణలిచ్చెను. పితరులు, వసువులు; పితామహులు, రుదులు; ఆదిత్యులు ప్రపితామహులు, ఆ మూడు విధాలవారిని బిలిచి బ్రహ్మయిట్లనియె. మీరు ముగ్గురు నిటనుండి పిండదానాదిక ము తీసికొనవలెను. ఇట సేసిన పితృకార్య మనంతమగుమ. బ్రతుకుకొఱకు పితరులట సంతుష్టులగుదురు. వారు తర్పణమును తృప్తి నిచట పొందుదురు. ఇట పిండ ప్రదానమువలన స్వరమందుదురు. అందుచే సర్వము విడిచి తూర్పున నిట పిండదానము సేయవలెను. పుత్రుడది సేసి పితృలందరికి తర్పణము సేయవలెను. ప్రాచీనే శ్వరీదేవునిముందు ఆతీర్థము ప్రతిష్ఠింపబడినది. ఆట జలము స్పృశించినంజాలు జన్మ బంధవిముక్తి గనును.
ఇట స్నానము సేసినచో బ్రహ్మక నుచరుడగును. ఆతీర్థమున స్నానముచేసి సమాధినిష్ఠుడై (చిత్తమునిరోధించిన వాడై) కొంచెమేని అన్నము పెట్టినను స్వర్గ మందును బ్రహ్మభక్తులకట స్నానముచేసి యన్నము కొంచెము పెట్టి గంటి లేక జావతో గూడ బంగారము దక్షిణతో బెట్టినను హాయిగ స్వర్గమం దానందింతురు.
ఆట తూర్పుదెస నున్నది సరస్వతి. వెదుకనక్కర లేదు. అందు స్నానము తపోయజ్ఞాదిరూపమగు ఫలము. ఆమెను ద్రావునరులు సురులేయని మార్కండేయులుయన్నారు. సరస్వతీ నదిలో స్నానమునకు నియమ మేమియులేదు. తినిగాని తిన కేకాని పగలుగాని రాత్రిగాని ఆ తీర్థము సర్వతీ త్తమము తూర్పువై పుదని ఋషులన్నారు. పుణ్యము పాపహరమూ, మనస్సున భావించి యట స్నానముచేసి విష్ణువును సేవింతురు. వారు స్వర్గమందుదురు. దేవతలకెల్ల మేటి విషవు. ఆయనచే సరస్వతి సేవింపబడినది. ఈమాట బ్రహ్మ కుమారుడు (నారదుడు) సెప్పెను, అందువలన సరస్వతిదినిల్చి మందాకినిం దర్శింతురు.
ఆతీర్థము త్తమో త్తమమని బ్రహ్మయనెను. మందాకినీసమమని దేవత ఆటనున్నారు. ఆ సరస్వతిని కొనియాడినారు. ఆమె యొంటరిదైన దీనురాలయినదని బ్రహ్మరూపిణిని యామెనే చ్చలిని బ్రహ్మ సృజించెను. హరియు హరిణి కమలనయన వుట్టించెను.
వజ్రపాణి యామెను వట్రిణిగానొనరించెను. వజ్రాయుధ సమమగ పాపములమేదంబోరు నీలకంఠుడు శివుడు చక్కని వేడిసొంపుగలదానిని సరస్వతితో పుట్టించెను. చెలికత్తెలతో చూడబడుచు శ్రీ సుందరి, సంతోషించుచు వారున్న చోటు నామెనుగాంచి పెక్కుదేవతలతో తూర్పు ప్రయాణమైనది.
ఆ నది దేవతలందరికన్న చాలా మీన్న సరస్వతియని ఋషులందురు. తూర్పుననున్న సరస్వతి జలమును త్రావిన జంతువులుగూడ యజ్ఞములు సేసిన ద్విజోత్త ములతో బాటు స్వర్గమందును. ఇచట నీమె చింతామణియని యనుకొన వలసినది. ఆరత్నమట్లు యామె కోరినకోర్కెలనిచ్చును. దక్షిణ దిక్కునుజూచి మజి పడమటిగానేగినది. గంగ యూ తూర్పు దెసగానే గుము నన్ను మఱువవద్దు. తీరాదేవి ! వచ్చినదారినేగుమని యామెతో నన్నది.
ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టిఖండమునందలి తీర్ధావతారమను ముప్పది రెండ - అధ్యాయము.
