పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
36 - అధ్యాయము
అటు తరువాత దేవతలు పెక్కు విమానముల నెక్కి వెళ్ళిపోయిరు. రాముడు కూడా అగస్త్యుని తపోవనానికి వెళ్ళెను. మునుపు ఆగస్త్యుడు ఆశ్రమమునకు రమ్మని నన్ను పిలిచెను కదా! దేవాదేశ ముచే నేను దేవదానవ పూజితుడైన ఆ మునిని వేళ్ళి చూచెదను. ఆ మహానుభావుడు సంతుష్టుడే నాకు ఉపదేశమిచ్చును. దాని చే నేను దుఃఖమును మరల పొందను. నా జననీ జనకులు కౌసల్య దశరథులు సూర్యవంశము నాది. అయిననూ ఇట్టి దుఃఖాన్ని పొందితిని. రాజ్యకాలమున భార్యతో, సోదరునితో వనవాసము, భార్య రావణునిచే ఆపహరింపబడటము, అసహాయుడనై ఉత్తమ సాగరమును దాటి లంకాపురిని ముట్టడించి, రావణకుల క్షయము చేసితిని. అక్కడ సీతను చూచి దేవతల ఎదుట ఆమెను విడిచి వైచితిని. అంత వారు ఆమె పవిత్రురాలని నాతో అనగా గృహమునకు తెచ్చితిని. మరల లోక వాక్యముచే విసర్జించితిని. సీత వనమునందు, నేను పురమునందు నివసించుచుంటిమి. ఉత్తమ వంశమున జన్మించిన నేను, ధనుష్కలలో ఉత్తముడిని - ఇపుడు ఉత్తమ దుఃఖమును పొందితిని. నా హ్మదయ మింకనూ బద్ద లవదు కదా;
బ్రహ్మ నన్ను వజ్రసారము యొక్క మూలముతో నిర్మించెను. ఇపుడు బ్రాహ్మణా దేశమున భూమి పై భ్రమించు చుంటిని. తపము నాచరించుచున్న శంబూకుడను పాపిని నేల కూల్చగా దేవ వాక్యము చే ప్రాణము హృదయములో నిలిచెను. ఈ జగత్తు యొక్క పాతమున మునిగిన మునిని కలి సేదను. అతనిని చూచిన నా దుఃఖము వెంటనే నశించును. సూర్యోదయము చే మంచు యెట్లు కరుగునో ఆదే నా దుఃఖము కూడా నశించును. వచ్చిన దేవతలను జూచి అగస్యుడను దివ్యరి అర్ఘ్యమును గ్రహించి ప్రీతితో వారందరినీ పూజించెను. వారా పూజను స్వీకరించి, మహామునితో మాటలాడి సహచరులతో స్వర్గమునకు వెళ్ళిరి. వారట్లు వేళ్ళగా రాముడు పుష్పకము నుండి దిగి ఆగస్త్యుని వద్దకు వచ్చి అభివాదనము చేసెను. రాజు అనెను 'ముని శేష్ణా' దశరథ సుతుని నేను మిమ్ము నమస్కరించుచుంటిని. ఆదరముతో చూడుము. మిమ్ము చూచి నేను పాపమును పోగొట్టుకొనెదను. అని మరల మరల మునికి నమస్కరించెను. 'మా భృత్యవర్గానికి, పరివారానికి కుశలమే. ముద్రుని జంపి నేను మిమ్ము చూడ గోరి వచ్చితిని.’
అనగా అగస్త్యుడిట్లనెను “రామా ! జగద్వంద్యా ! సనాతనా ! నీకు స్వాగతము. నీ దర్శనముచే నేను, మునులు పవిత్రులమైతిమి. ఇదిగో నీకై ఆర్ఘ్యము. నా భాగ్యము చేత నీవిక్కడికి వచ్చితివి. పెక్కు ఉత్తమ గుణములు గల నీవు నిత్యము పూజ్యుడవు గదా ! కనుక నిన్ను మా ఎదలోనుంచి పూజించవలెను. దేవతలు నీవు శూద్రుని జరిపి వచ్చితివని అనిరి. బ్రాహ్మణ పుత్రుని నీవు నీ ధర్మముతో బ్రతికించితివి. రామా ! నీవు నా చెంత నుండుము. ఉదయాన పుష్పక విమానములో అయోధ్యకు వెళ్ళుము. ఇక ఈ ఆభరణము విశ్వకర్మ నిర్మించినది. తన కాంతిచే ప్రకాశించుచున్న ఈ ఆభరణమును నాయనా ! నీవు గ్రహించి నాకు ప్రియము చేకూర్చుము. లభించిన దానిని మరల దానమిచ్చుటచే గొప్పఫలము లభించును. ఇంద్రుడు మొదలైన దేవతో తములనందరినీ రక్షింప నీవు సమర్దుడవు కదా ! కనుక నీకే ఇచ్చుచుంటిని. గ్రహించుము అనగా ఇక్ష్వాకుమహారథుడగు రాముడు చేతులు జోడించి, తన ధర్మమును స్మరిస్తూ ఇట్లనెను. “భగవాన్ ! ప్రతిగ్రహము (తీసుకొనుట) అనునది నాకు గర్హితము. క్షత్రియుడను, విజాతీయుడనగు నేను దీనినేట్లు స్వీకరించేద?"
బ్రాహ్మణుడిచ్చినదానిని నీవు చెప్పుము. పుత్రులు గల వానిని, గృహము గల వానిని, సమర్థుడిని, ఆపదను కూడా పొందలేదు. ఎట్ల దానమును తీసికొనెద ను ? ఏక పత్నీవ్రతుడగు నా భార్య కూడా లేదిపుడు. ఇక నిస్సంశయముగా నేను దోషమున పాలుపంచుకొనెడివాడినయ్యెదను. కష్టకాలమును పొందిన క్షత్రియుడు కూడా దానము స్వీకరించిన దోషమును పొందడనుటలో మనువే ప్రమాణము. తల్లిదండ్రులు వృద్ధులు, భార్య సాధ్వి, పుత్రుడు శిశరవు అయినవాడు అకార్యములు వంద చేనైనా వారిని పోషించవలెనని మనువనేను. ఓ ము నిస తమా ! నేను నీ దానమును స్వీకరించ లేను. మీకు కోపము కలిగించుట నా ఉద్దేశము కాదు.
ఆనగా అగస్త్యుడనేను. పాలకులు దానమును గ్రహించిన దోషము లేదు. రాజా ! నీవు ముల్లోకములను తరింప జేయ సమర్దుడవు. బ్రాహ్మణుడూ అందునా తపస్వియైన ఇతడిని నీవు తరింపజేయుము. అందుకని నేను నీకిది దానమిచ్చు చుంటిని. స్వీకరించుము.
ఆపుడు అగస్త్యుడు బదులుపలికెను. “రామా! బ్రహ్మ భూతమైన కృతయుగమునందు ప్రజలందరూ పాలకులు లేనివారైరి. దేవతలరాజు శతక్రతువుండెను. తమకు రాజు కావ లేనని ప్రజలు దేవేశుని చేరిరి. 'దేవతల రాజ శతకము వుండగా మాకు పాలకుడు లేకున్నా డు. మా శ్రేయస్సుకై పాలకుని ఇపుడు సృష్టించుము. ఆతనిని పూజించుచు పురుషులు రాజ్యముననుభవింతురు.' అనగా అపుడు బ్రహ్మ ఇంద్రాది లోక పాలకులను పిలిచి వారి తేజస్సుయొక్క భాగమును వినియో గించమని యనెను. అపుడు లోకపాలురు తమ తేజస్సున నాలుగవ భాగమును ఇచ్చిరి. క్షయములేనందున బ్రహ్మను అక్షయుడందురు.
ఆ బ్రహ్మ లోకపాలుర అంశ లను నరుల యందు వినియోగించి ప్రజల క్షేమమును తెలిసిన పాలకుని చేనెను. ఇంద్రుని అంత చే పాలకుడు అందరినీ ఆజ్ఞాపించును. వరుణుని యంశ చే అందరినీ పోషించును. కుబేరుని ఆంశ చే ఆందరికీ ప్రయోజనముల చేకూర్చును. యముని ఆంశ చే ప్రజలను శాసించును. నీవు ఇంద్రుని ఆంశ చే పాలకుడవై తీవి. నన్ను తరింపజేయుటకు ఆభరణమును స్వీకరించుము.
అనగా అప్పుడు రాముడు మునిచేతినుండి దివ్యమై, సూర్యునివలె జ్వలించుచున్న ఆభరణమును గ్రహించెను. దానిని గ్రహించి, తేరిపార జూచి చాలా సేపు ఆలోచించెను. ముత్యములు విచిత్రముగా, ధా శ్రీఫలమువలె నుండెను. బంగారములో పొదగబడెను. వజ్ర విద్రుమనీలములు, పద్మరాగములు గో మేధములు, వే డూర్యములు, పుష్యరాగములు పొదగబడినవి. విశ్వకర్మ దానినట్లు చక్కగా నిర్మించెను. అట్టి ఆభరణమును చూచి ప్రీతినొందిన రాముడు మరల ఆలోచించెను.“ఇట్టి రత్నములనింతకుమును పెప్పుడూ చూడలేదు. ఇది ప్రకాశించుచూ భూమియంత విలువగలవిగా నున్నవి. విభీషణుని లంకయందునూ " ఇట్టివానిని మునుపు నేను చూడలేదు.” అని ఆలోచించి రాముడు ఆమునిని ఆభరణమెట్లు వచ్చినదో తెలియగోరి ఆడిగెను. “మహాముని ! అత్యద్భుతమైన దీనిని రాజులూ పొందలేరు . మీరెట్లు పొందితిరి ? దేనినుండి ఎవరు నిర్మించిరి? కుతూహలము వలన అడుగుచుంటిని. అరచేతిలో నుంచినచో ఆర చేతి మధ్యభాగము ప్రకాశించిన యెడల అది అన్ని శాస్త్రము లలో నిందించబడిన “ఆధమ రత్నమని తెలియపలయును. దిక్కులను ప్రకాశింపజేసినచో ఆది మధ్యమము. దాని కాంతి మూడు పాయలై పైకి పోవుచున్న “ఉత్తమరత్నమని” తెలియవలయును. ఇవి ఉత్తమజాతి రత్నములనీ ఋషులందురు.
మీరు అనేక దివ్యమైన ఆశ్చర్యములకు నెలవు." అని రాముడనగా అగస్త్యుడనెను. “రామా ! వినుము. మునుప త్రేతాయుగమున జరిగినది. ద్వాపరము రాగా వనమున నేను గాంచితిని. ఇది ఆశ్చర్యమును కలిగించును. వినుము. పూర్వము తేతాయుగమున అతి విశాలమైన అరణ్యముండెను. ఎల్లెడలా వందలకొలది యోజనముల విశాలమైనది. అందు మృగ, వ్యాఘ్రములు లేకుండెను. అట్టి నిర్జనారణ్యమున ఉ తమ తపస్సు చేయవలెనని నేను అరణ్యమును చేరితిని. ఆ ఆరణ్యమధ్యలో కందమూలఫలాలుండెను. వివిధశాక ములుండెను. ఆ ఆరయం మధ్యలో ఐదుయోజనాల వెడల్పుగల సరస్సుండెను, హంసలు, అడవికొంగలు, చక్రవాకములు ఉండెను. ఎల్లడెలా తాబేళ్లు తిరుగుచుండెను. కొంగలు బారులు కట్టియుండెను. ఆ సరస్సు తీరమున ఉత్తమ తపస్సు చేయడానికి నేను వెళ్లి తిని. అట్టి శుభ ప్రదేశాన్ని చేరి, ఎట్టి హింసలేని ఆ ప్రదేశములో గ్రీష్మకాల రాత్రిని గడిపితిని. ప్రొద్దుననే లేచి ఆ సరస్సును చేరగా వృద్దాప్యమంటని శవమొకటి కనిపించెను. సరస్సుకు దగ్గరలోనే గొప్పకాం తితో ఆ శవముండెను. దానిని గూర్చి ఒక్క క్షణము ఆలోచించుచుంటిని.
ఈ సరస్సు తీరాన ప్రాణి ఒక టీ లేదు. ఈ శవమెవ్వరిది ? దేవుడా, మునియా, రాజా ? మునికాదు, రాజై వుండునా ? రాజపుత్రుడైన ఇట్లు సంభవించుట ఎట్లు ? సాయంత్రం, రాత్రి లేదా ప్రొద్దున మరణించియుండవచ్చునా? తప్పక దీని నిష్కియను తెలియవలయు" అని ఆలోచించుచునుండగనే ఒక ముహూర్తములో అద్భుతమును గాంచితిని. ఒక దివ్యమైన విమానము, హంసలతో లాగబడుచూ మనో వేగముతో ఎదుట నిలిచెను. వేలకొలది ఆవ్పరసలు, అదే సంఖ్యలో గంధర్వులు ఆ నరుని ఆనందింపజేయుచూ దివ్యగేయాలను గానము చేయుచుండిరి. వాద్యముల మోగించుచుండిరి. అపుడు నేను విమానమునుండి దిగిన నరుని చూచితిని. అతను నేలదిగి. తన మాంసమును తినుచుండెను, మాంసమును ఇష్టమువచ్చినంత తిని సరస్సులో దిగి మరల విమానము నెక్కెను. అపుడు నేను దేవునివలెనున్న అతనితో ఇట్లంటిని. ఓ స్వర్గవాసి ! ఇదంతా యేమి ? నీ ఆహారము జుగుప్సితమైనది. గత మాత్రము త్తమమైనది. రహస్యము కానిచో చెప్పుము. వినగోరితిని. సి వేవరు ! ఈ ఆహార మేమి ? నీవెందుకు దీనిని భుజించుచుంటివి ? నీవెక్కడ వుందువు ప్రభువువలె నుంటివి. శవ మెట్లు నిర్మించబడెను నింద్యమగు ఆహార మేమిటో వినగోరుచున్నాను.
అని నేననగా విని ఆ స్వర్గవాసి చేతులు జోడించి ఇట్లు బదులిచ్చెను. బ్రాహ్మణా ! సుఖదుఃఖములచే జనించిన నా ఈ వృత్తాంతమును వున్నది వున్నట్లుగా చెప్పెద వినుము. కోరిక దాట సులభము కానిది కదా ! పూర్వము విదర్భరాజు “వాసుదేవుడనువాడుండెను. గొప్పకీర్తిగల యతడు నా తండ్రి. ఇద్దరు స్త్రీ లవలన అతనికిద్దరు పుత్రులు గలిగిరి. నేను శ్వేతుడనువాడను. చిన్న వాడు సుర థుడు. నా తండ్రి మరణించగా పౌరులు నన్ను రాజ్యసింహాసనము పై నభి షేకించిరి. ధర్మమును ఆచరిస్తూ నేను రాజ్యమును పాలించుచుంటిని. ఇట్లు పెక్కు వేల సంవత్సరములు గడిచినవి. ప్రజలను నేను ఆధికకాలమును పాలించితిని. ఒకానొక కారణముచే వైరాగ్యమును పొంది మరణించు ఆలోచనతో తపోవనమును చేరితిని. ఈ వనము పక్షులు లేనిదై మనోహరముగా నుండ, దానిని ప్రవేశించి తపము చేయుటకు సరస్పుతీర మును చేరితిని. సుర థుని అభిషేకించి, ఘోరతపస్సు చేయవలెనని ఈ సరస్సును చేరి, పదివేల సంవత్సరములు తపమాచరించి, కల్యాణకరమగు బ్రహ్మలోక మను భవనమును చేరితిని.
స్వర్గముచేరిననూ నన్ను ఆకలిదప్పులు మీగుల బాధించసాగిన వి. ఇంద్రియములు బాధించసాగినవి. అపుడు ముల్లోకముల శ్రేష్ఠుడగు పితామహునితో ఇట్లఁటిని. 'భగవాన్! స్వర్గలోక మిది, ఆకలిదప్పులు లేనిది. నాకిట్లు ఆకలి దప్పికలు కలుగుట ఏ కర్మ ఫలము ? నాకు ఆహార మేమిటో చెప్పుము' అనగా బ్రహ్మ చాలా సేపు ఆలోచించి నాతో ఇట్లనెను. “నీ దేహమునుండి పొందు మాంసముదప్ప వేరొక ఆహారము నీకు లేదు. నిత్యమూ నీవు నీ మాంసమును ఆరగింపుము. ఉత్తమ తపము చరించుచూ నీ శరీరమును బాగుగా పోషించితివి. శ్వేతా ! మహీతలమున ఇవ్వని చో కలుగదు. పూర్వము భిక్షను సూచించుచున్న ప్రాణికి కోపముతో నీవు దానమివ్వలేదు. భ్రాంతి చే అతిథికి ఇంట ఆతిథ్యమివ్వలేదు. దానిచే నీవు స్వర్గమునకు వచ్చికూడా ఆకలిదప్పుల పొందితివి. ఆట్టి నీవు ఆహర ములచే పుష్టి నొందిన నీ శరీర మునే భుజించుము. దానిచే నీకు తృప్తి కలుగును. అనగా బ్రాహ్మణునితో నిట్లంటిని. నా దేహమును చినివేయగా మరల వేరొకటి లేదు. ఆకలి తీరుట లేదు. ఓదనము దక్క శరీర మునకు ఆకలి తీరుటెట్లు అక్షయముగా తినుచున్న నూ ప్రీతి కలుగుట లేదు.
అపుడు బ్రహ్మ ఇట్లనెను : “శ్వేతా ! నీ దేహము ఆక్షయ మైనది. దినదినమూ నీ శవము పుష్టిని పొందగలదు. రాజా ! వంద సంవత్సరములు నిండువరకు నీవు నీ మాంసమునే తినుము. గొప్ప తపస్వియగు అగస్త్యుడు అరణ్యమునకు వచ్చువరకు ఆట్లు చేయుము. తేజస్వియగు ఆగస్త్యుడు ఇంద్రాది దేవతలను, దానవులను తరింపజేయుటకు సమర్ధుడు. ఆతని రాక చే నీవు కష్టమునుండి ముక్తిని పొందేదవు. రాజర్షీ ! దేవదానవులనే తరింపజేయగలవాడు అగస్త్యుడు. ఇక నీ ఈ కుత్సిత ఆహారమును గూర్చి చెప్పుట యేమి ? మహాత్ముడగు అగస్త్యుడు గొప్పదగు దేవకార్యమును నిర్వర్తించెను. సముద్ర మును ఇంకిపోవునట్లుగా చేసి దానవుల సంహారమునకు దోడ్పడెను. సూర్యుని పై ద్వేషముతో పెరిగిన వింధ్యను అణిచివే నెను. వేలాడుచున్న ఈ భూమి పై బరువువలన దక్షిణదిక్కు పైకెగియగా ముల్లోకములు సంకటములోనుండ, నేను దేవతలతో వెళ్లి అగస్త్యుని జగత్తును సమముగా చేయుము అని దక్షిణ దిక్కుకు పంపితిని. అపుడా ముని నిలువగా భూమియంతయూ సమ మాయెను. ఓ రాజేంద్రా ! ముని చేసినది ఇప్పటికీ అట్లే కనిపించుచున్నది.
అనగా నేను విని నా శరీరమునే ఆహారముగా భుజించుచుంటిని. నేడు నూరు సంవత్సరములు పూర్తి అయినవి. అయిననూ నా కుత్సితాహారము శయము నొందుట లేదు. నాకు తృప్తి కలుగుటలేదు. కష్టములో నున్న నేను రాత్రింబవళ్ళూ మునిని గూర్చే ధ్యానించుచుంటిని. ఈ వనమున ఆ ముని ఎప్పుడు దర్శనమిచ్చునో గదా అని ఆలోచించుచున్న నేను నూరు సంవత్సరములు గడిపితిని. ఆ మునియే నాకు గతి. . ఇది నిశ్చయము. ఆగస్త్యుడు దక్క నాకు వేరుగతి లేదు. 'రామా ! ఆ రాజట్లనగా నేను విని కుత్సితాహారమును జూచి దయనొందితిని. అతని పాపమును నశింపజేసి అమృతమును భుజించునట్లు చేసెదననుకొని అతనితో నిట్లంటిని. అగస్త్యుడేమి చేయును ? నేనే నీ దురితమును నశింప జే నెదను. నీవు ఇష్టము వచ్చినది నా నుండి కోరుము అన ఆతను నాతో బ్రహ్మమాట నేరొక విధంగా ఎట్లగును ? మైత్రావరుణు డై న అగస్త్యుడే దక్క వేరొకరు నన్ను తరింపజేయ జాలరు. నేనడగక పోయిననూ బ్రహ్మ నాతో ఇట్లనెను. అని అతడనగా నేను అతనితో “నేనే అగస్త్యుడ నని” యంటిని. నేను నీ భాగ్యము చే కనబడితిని. సంశయములేదు."అనగా ఆ శ్వేతుడు అగస్త్యుడను నేనే అని తెలిసి దండమువలె నేల పై బడెను. అపుడు నేను అతనిని లేపి “సికొర కేమి చేయుదు"నని యంటిని.
అపుడా రాజు ఇట్లనెను : “భగవాన్ ! నన్నీ కుత్పితాహారముగా నున్న నా దుష్కృతమునుండి రక్షింపుము. దానిచే అక్షయలోకమగు స్వర్గము లభించును.' అని అతను దానమిచ్చెను. “నా పై ఆనుగ్రహముతో దీనిని స్వీకరించుము. ఇక్కడ ఇదే గోవులు, సువర్ణ ము, ధనము, వస్త్రములు, భక్ష్యము, భోజ్యము. ఈ ఆభరణమును స్వీకరించుము. అన్ని కోరికల దీర్చు, అన్ని భోగములనిచ్చు ఈ ఆభరణమును గ్రహింపుము. నన్ను అనుగ్రహించుము. తరింపజేయుము." అని ఆ స్వర్గ వాసి దుఃఖముతో పలుక గా ఆతనిని రక్షించవలెనను బుద్దిక లిగినది. దయతోనే దక్క లోభముతో కాదు. రామా ! నేనా ఆభరణమును తీసికొనగానే, ఆ నరుడి పూర్వదేహము నశించి, ఆతను స్వర మును పొందెను. ఇంద్రుని వంటి ఆ శ్వేతుడే నాకీ ఆభరణము నిచ్చెను. ఆ కారణము చేతనే ఆభరణము నిచ్చెనని తేనియుము. ఈ విధంగా శ్వేతుడు పాపము తోలగినవాడాయెను.
ఇదీ శ్రీ పాద్మపురాణమున మొదటిదగు సృష్టి ఖండమున రామాగ స్త్యసంవాదమను ముప్పదియార - అధ్యాయము.
