పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

26 - రోహిణీ చంద్రశయన వ్రతమ్

 రోహిణీ చంద్రశయన వ్రతము

దీర్ఘాయురారోగ్య కులాభివృద్దులతో పురుషుడు యావతుటుంబము రూప సంపదతో పెక్కు జన్మలు శోభించుచు అక్షయ స్వర్ణ భోగము అనుభవించుటకు జేయనగు వ్రతమానతిమ్మన భీష్ము నకు పులస్త్యుడనియె. అక్షయ స్వర్గ కారణమగు వ్రతము రహస్యమిది తెల్పెదను. పురాణవేత్తలే యేలు గుదురందు చంద్ర నామములతో నారాయణు నర్చింపవలయును. సోమవారము పూర్తి మ తిధియైన నాడు లేదా బ్రహ్మ నక్షత్రము పూర్ణిమయందే ననాడు పంచ గవ్యములతో తెల్లావాలతో స్నానము చేయవలెను. “ఆప్యాయస్వ" యను మంత్రమును నూట యెనిమిది మారులు జపింపవలెను.

శూద్రుడై నను పాషండుల (నా స్త్రీకుల) మాటలాడక జపము సేసి యింటికి వచ్చి ఫల పుష్పాదులతో చంద్ర నోమములు నెప్పి చంద్రుని బూజ సేయవలెను. పాదాది ప్రత్యంగ పూజ ఆయా నామములతో జేయవలెను. ఇందు పత్ని రోహిణిని కూడ పూజించి ధూప దీప నివేదనములు సేసి రాత్రి నేల పై పరుండి ప్రొద్దున లేచి ఉపవసించి గోమూత్ర ప్రాశనము చేసి మాంసము కారము లేకుండ ఎనిమిది యిరువది మూడు ముద్దలు తిని ముహూర్త మాత్రము ఇతిహాసము వినవలెను. (భారతము) కదంబము (కడిమి) మొదలగు పూలు, తెల్ల పూలతో విష్ణువు నర్చింపవలేను. ఈలా యొక్క సంవత్సరము సేసి నాల్గు అంగుళముల రోహిణి ముద్ర, ఆరంగుళము చంద్ర ముద్ర చేయించి దానమీయవలెను. తెల్లగోవును దాని మీయవలెను. త్రైలోక్యాధిపతియై చంద్ర లోకమందు తిరిగి జన్మించును. ఈ వ్రతము సర్వ పుణ్యఫల ప్రదము.

ఇది రోహిణీ చంద్రశయన వ్రతమను ఇరువదియార - అధ్యాయము.