పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

2 - సృష్టిఖండ విషయవర్ణనమ్

నూతుడిట్లనియె!, నర్వలోకేశ్వరునకు. విశ్వకారణునకు - నమస్కారము. ఏ పరమేశ్వరుడు ప్రకృతి ననుసరించి . సృష్టిసంకల్పము జేసి లోకములను , యోగారూఢుడై - చరాచరాత్మకనర్వభూతములను సృజించెనో యట్టి - విశ్వకర్మను చిద్రూపుని లోకసాక్షిని పుట్టుకలేని వానిని నమస్కరించెదను. పురాణాఖ్యానములను డెబవీకొననెంచి యవిభుని శరణు సొచ్చెదను. త్రిమూర్త్యాత్మక మైన తత్త్వమునకు మొక్కి యిందానిది దిక్పాలకులకు సూర్యునకు మునీశేష్ఠుడగు వసిష్ఠునకు తపస్వియైన, లోమహర్షణనకు వేదవ్యాసభగవానునకు భృగువాక్యముననుసరించు నావురాణ పురుషునకు నమస్కరించెదను. ఆబహవాడి వలన నేను పురాణములను విన్నాను. ఆయన సర్వజ్ఞుడు. బ్రహ్మతేజసంపన్నుడు. సర్వలోక వంద్యుడు,

అవ్యక్తము సదసద్విలక్షణము నగు పరబ్రహ్మ మహత్తు దగ్గర నుంచి సృష్టివిశేషమును సృష్టించుననునది నిశ్చయమైనమాట. హిరణ్మయాండం నుండి బ్రహ్మ పుట్టెను. ఆ బ్రహ్మాండమునకు నావరణముగా జలమున్నది. దాని కావరణముగ తేజస్సు వాయువు. నా వాయువునకాకాశము నావరణములుగా నున్నవి. భూతా.. యనగా నాకాశము, మహ తత్వముచేతను అది అవ్యక్తము చేతను అవరింపబడియున్నది. ఆవ్యక్తమనగా పరమాత్మయే. ఆ యవ్య క్షము చేతనే మహ తత్వము(బుజ్జి) ఆవరింపబడియున్నది. లోకములయొక్క యావిర్భావము హిరణ్మయాండము' (బంగారు గుడ్డునుండియే. నదులు పర్వతములు మొదలగు వానీ పుట్టుక' మొదలు - వికీలీ కాది సర్వ సృష్టియు గల్పాది. కాలపరిగణనము ప్రతిసర్గము బ్రహ్మయొక్క బుడ్డితత్త్వమునుండియే. యేర్పడినవి. బ్రహ్మయొక్క ముఖములనుండి భృగ్వేది మహర్షులు' (అయోనిజులు పుట్టిరి, కల్పములందు సృష్టికి. సృష్టికి నడిమి సంధి స్వరూపము, భృగ్వాది . ఋషులయొక్క ప్రజాస్టర్గము బ్రహ్మర్షియైన వశిష్ఠునియొక్క మహత్వము . స్వాయంభువ మనువుయొక్క యంతరము - విష్ణునాభి కమలమునుండి బ్రహ్మ మొదలుగా గలిగిన రాజనసృష్టి ద్వీప సముద్ర పర్వతములయొక్క వర్ణనము వాని యోజన ప్రమాణము నచట జీవించు జీవులయొక్క చరిత్ర నామీద నవవరములు అందలి నదీపర్వతముల వర్ణనము ' నీ పురాణ మందు వర్ణింపబడినది. సూర్యాది జ్యోతిర్మండలములు ధువుడు 'సూర్యాడి గహాధుల రథములు - శీంశుమార - చక్రము సృష్టి తరువాత లయము లయము తరువాత సృష్టి జరుగుటయు.

దేవర్షి పితృగణములకుకూడ నవీన్తరముగ చెప్పుట శక్యము కాదు. నైమిత్తి కాదిప్రళయములు ఇళయ స్వరూపము యుగసంధులు రౌరవాది నరకములు ప్రతి నర్గమని పిలువబడు బహ్మయొక్క యువసంహార(లయ) స్వరూపము బ్రాహ్మకూడ నీత్యుడు కాదు అన్న విషయము విషయభోగముయొక్క దౌష్ట్యము (జీవులను విషయము.

వద్మపురాణమ్. పెట్టు తికమకల స్వరూపము నంసారమువలని బాధ, మోక్షము దుర్లభమగుట, వైరాగ్యమువలన సంసారము నెడల దోషదృష్టి లావతయ లక్షణము. బ్రహ్మానందము బొందినవాడు దేనికిని భయపడడు అను విషయము, భూతహావృత్తి నివృత్తియొక్క ఫలము, వశిష్టుడు అతని కుమారుడు శ క్తియొక్క వృత్తాంతము నాయన యెడల విశ్వామిత నిమిత్తముగ సౌదాసుని వలన వశిష్ఠ నిగ్రహము, శ క్తివలన అదృశ్యంతి యనునామేవలన పరాశరుడుదయించుట, పరాశరునికి పితృకన్య యందు వ్యాసుడు నాయనకు శుకుడుగలుగుట, విశ్వామిత్రునకు,వరాశరునియెడలద్వేషము,విశ్వామితుని జంపనెంచివశిష్ఠుడు బహ్మదండము నుండి యగ్నిని బుట్టించుట, యా యిద్దరికి సంధిచేయవలెనని కణ్వమహర్షి యా యగ్నిని చల్లార్చుట వ్యాసకృత వేదవిభాగము . ఆయన శిష్యశిష్యులచేత చేయబడిన నా యావేదశాఖావిభాగము . వయాగ క్షేత్రమందు ముని వరులడుగగా కృష్ణుడు వారికి చేసినయుపదేశ విశేషములు నిదెల్ల నీపురాణమందలి విషయనంగహము. బ్రహ్మ పులస్త్యునకు పులస్త్యుడు భీష్మునికి, వామీద సూతుని వలన శౌనకాది మహర్షులకు గమముగా వచ్చిన పురాణనందదాయము దీనియందు వర్ణింపబడినది. ఈ పురాణమందు నాలుగవ వంతైన చదివిన యతడు సర్వపురాణములను జదివినట్లే వాలుగు వేదములు సాంగముగ జదివి యుపనిషత్తులు, తెలిసి యెవడు పురాణములు కూడ తెలిసికొనునో యతడే పండితుడనబడును, ఇతిహాన పురాణములచేత, వేదము నుపబృంహింపవలెను. అనగా ఇతిహాస పురాణములు నిగూఢవేదార్థ రహస్యములను సులభభాషలో వ్యాఖ్యానము చేయబడినవన్న మాట. అల్పడతునకు  ఇతడు నన్ను దెబ్బకొట్టును అని వేదము భయపడును., అనగా ఇతిహాస పురాణములను సమగముగ జదివి వ్యాసానుగహపాత్ముడై యందలి యగాధ రహస్యములను దెలిసికొన్నవాడు దప్ప వేద హదమును జక్కగా గవాంపలేడని, తాత్పర్యము. ఈ పురాణమందొక్క యధ్యాయము జదివినను అడి బహ్మ స్వయముగా జెప్పినది గావున విపత్తుల నుండి ముక్తుడై యభిష్టగతినందగలడు. అతి పురాతనమైన ధర్మవరంపరను సృష్టిపరంపరను దెలుపునది గావున పురాణము” అని విర్వచనము జేయబడినది. ఈ నీరు క్లిని-దెలిసిన యతడు సర్వ పాపముక్తుడగును, పురాx ఆనతి అతి ప్రాచీన విషయమును బొందునడి'. అనగా చెప్పనది -పురాణం) వేరొకచో, వ్యాసులు (వరాహి నవమ్..వింత ప్రాచీనమో అంత కొత్తది జనగా. నెప్పుడో ద్వాపరమందు జెప్పబడినదైనను నిద్ర యన్ని కాలములకు... నన్ని దేశములకు , నన్నిపాతలకు .వంబంధించిన నర్వవిజ్ఞానమును నందించునది యని చెప్పినారు.) అపుడు ఋషులిట్లనిరి. బ్రహ్మ మానసపుతుడైన వుల స్యభగవానుడు భీష్మునితో కలిసికొనెను. పాపాత్ముల కాయన దర్శనము దుర్లభము. క్షత్రియుడాయనను గలియుటయు నారాధించుటయు జాణ యాశ్చర్యమైన విషయము, ఆయన చేసిన తపస్సు నియమము నెట్టివే?-దీనివలన నమ్ముని సంతుష్టుడే యాయనతో మాట్లాడెను గదా! "పర్వము " లేక పర్వములో సగము లేక సంపూర్ణ పురాణము నేస్థానము నుండి యెక్కడ గనబడి పులస్త్య మహర్షి తెలివెనో యా విశేషములను మాకు- చెలువుము వినవలెనని సావధాన మనస్కులమై యున్నాము.

            అది విని సూతుడిట్లనియే! గంగానది సాధుహితకారిణి పర్వతమును భేదించుకొని నవేగముగ- ప్రవహించిన గంగాద్వారము అను మహాతీర్థమందు భీష్ముడు - పితృభక్తి వరుడు - మహానుభావులవలన ధర్మవి శేషములను వినగోరి నూరేండ్లు వేగా సమాధియందు పరబ్రహ్మణ్యానమందుండెను. ఆయన తికాల స్నానముచేసి దేవపితృతర్పణముజేసి బహ్మయజ్ఞ స్వాధ్యాయనిష్టుడే శరీరమును గ్లేశ బెట్టుచుండగా చూచి బహ, సంతుష్టుడె కుమారుడయిన పులస్త్యునిజూచి నీవు స్వయముగానేగి మహావీరుడు, గురుకుల శ్రేష్ఠుడునగు భీష్ముని తపస్పునుండి మరలింపుము. కారణమేమనగా నామహానుభావుడు ల క్షితో పితృధ్యాన నిష్టుడే ఉన్నాడు. అతని పాంఛితమును వెంటనే యొసంగుము. నా విని పులస్త్యుడు గంగాద్వారమునకేగి భీమని గని 'మంగళమగుగాక! నీ మనసులో గల వర మడుగుము. నీ తపస్సునకు చతుర్ముఖుడు, సంతుష్టుడైనాడు. ఆయన వంపగా నీకు వరములిచ్చుటకు వచ్చితిని.' అన విని భీష్ముడు మనస్సునకు, వీనులకును విందైన యా మాటకు తృప్తుడై, కనులు తెఱచి ఎదుటనున్న పులస్త్యునికి సాష్టాంగ ప్రణతుడై యిపుడు నా జన్మము సఫలమైనది. ఈరోజు సుశోభనము. జగద్వంద్యమైన నీ చరణద్వంద్వమును గాంచితిని. తమ దర్శనము వలన తవపలఃసిద్ది యయినది. పవిత్ర నదీతీరమున వరములీయ నీవు దయచేయుట మరియు విశేషము. నేను స్వయముగా నల్లిన చిత్రాసన మిదిగో. సుఖకరమగు దీనిపై నాసీనుడవు గమ్ము. మారేడాకుల దొన్నెలో దూర్వాత కుసుమ కుశ సహితముగా తెల్ల యావాలు పెరుగు తేనె యవలు పాలు నను ఎనిమిది పవిత్ర పదార్థములతో కూడినది, (అష్టాంగము నగు ఋషి నిర్దిష్ట మైన ఆర్య మిదిగో, స్వీకరింపుడనియె. తేజస్వియగు భీష్ముని యీ మాటను విని బ్రహ్మ మానసపుత్రుడు " పులస్త్య భగవానుడా యాసనమును గ్రహించి, యర్ఘ్య పాద్యాదులనుగొని యా సదాచారమునకు మిక్కిలి సంప్రీతుడయ్యెను. మరియు నతడిట్లనియె.

నీవు సత్య నిష్ఠుడవు. నత్య ప్రతిజ్ఞుడవు. దానశీలుడవు. అభిమాన ధనుడవు. సర్వమిత్రుడవు. ఓరిమి కలవాడవు, శత్రునిగ్రహమందు పరమ పరాక్రమ వంతుడవు, ధర్మజ్ఞుడవు. కృతజ్ఞుడవు. దయానిధివి. ప్రియభాషివి. పెద్దలను పూజించువాడవు. ధర్మరహస్యముల నెరిగినవాడవు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడవు. సాధువుల యెడ వాత్సల్యము గలవాడవు. నాయనా! ప్రణతుడవై నీవు చూపిన భక్తికి సంతుష్టుడనైతిని. నీ చెప్పవలసినది చెప్పుము. అటుపై నేను జెప్పెదను.' నావిని భీష్ముడు 'భగవంతుడా! భగవంతుడగు బ్రహ్మ ఏ కాలమందేక్కడ నుండి దేవాదుల సృష్టి నేనెనో నాకు దెలుపుము. విష్ణువు స్థితి నెట్లు నే నెను, రుద్రుడెట్లేర్పడినాడు, దేవతలు ఋషులు నెట్లు సృజింపబడిరి, ఆకాశాది పంచ భూతములు, పురగిరి. సరిత్సాగర ద్వీప గ్రామారణ్యాదులను జావతులను సప్తఋషులను యక్షరక్షగంధర్వులను జ్యోతిర్మండలమును నేట్లు సృజించెనో సెలవిము. సావిని పులస్త్య మహర్షి యిట్లనియె.

బ్రహ్మ పురాణ పురుషుడు. వరమాత్మ రూపవర్ణాది రహితుడు, విషయ దూరడు, జన్మ నానములు లేనివాడు. గుణవరిణామము లేనివాడు. కేవలుడు నర్వసముడు. అనుపమానుడు. సద్రూపుడు. బ్రహ్మయను నామముచే - సా వస్తు వును జ్ఞానులు పేర్కొందురు. పరమ గుహ్యము: నిత్యమ. అజము - అక్షయము అవ్యయమునై, పురషరూపమున కాలరూపముననున్న యా వరమాత్మను గూర్చి నమస్కరించి సృష్టి యెట్లు నేనెనో చెప్పుచున్నాను.

మునుపు తామరపువ్వు పాన్పు నుండి బహ్మ సాత్త్వికాడి గుణముల యభివ్యక్తి ననుసరించి సృష్టికాల మందు ప్రధాన తత్త్వముతో సృష్టి బీజములైన కర్మవాసనలతో తైజనము, భూతాడి, తామసము నను పేర యహంకార తత్వము మూడు విధములై మహత్తత్వము నుండి పుట్టినది. పంచ భూతములు వంచేండియములు పంచకర్మేండిరియములు. యను నివి మహత్తత్వమునుండి పొడమినవి. వృధివ్య క్షేజో వాయురాకాశములను గూర్చి వివరముగ చెప్పుచున్నాను. శబ్దమాత్సమైన ఆకాశమును భూతాదియయిన తత్త్వము ఆవరించి యుండెను. ఆయాకాశము మరల వ్యాకరించునట్టి స్పర్శాను గుణమును సృజించెను. అదే వాయువు. . భూతములలో కెల్ల- బలిష్టమైనది. ఆ వాయువుయొక్క గుణము స్పర్శము. శబ్దమాతమైన యాకాశము స్పర్శనతమైన వాయువాకమించెను. ఆ వాయువు వికారము చెంది రూపమాతమును సృజించెను. ఆ రూపతన్మాత జ్యోతి స్వరూపము.

ఆది రూపము గుణముగాగలదీ, స్పర్శ' రూపమయిన పొయువారూవ తస్మాత్ర-నావరించెను. జ్యోతిస్సు వికారమును బొంది రస తన్మాత్రను సృజించెను. దానినుండి యుదకములుపుట్టినవి. అవి గంధ తన్మాత్రను సృజించినవి. దానినుండి వృథివి జనించినది అందువలన దానికి గంధము గుణమైనది. ఇంద్రియములు తై జనములు. అవే దేవతలు. అవి పదకొండు  అవే దేవతలని వై కారికములని చెప్పబడును.  కర్మేంద్రియములు  జ్ఞానేంద్రియములు " మనస్సు వదకొండవది. చర్మము కన్ను ముక్కు నాలుక చెలి యివి అయిదు జ్ఞానేంద్రియములు. వరుసగ శబ్ద-స్పర్శరూపరన (రుచి)గంధములను అయిదు విషయములను గహించుట వీనిపని. ఇక కర్మేంద్రియములు వాక్కు-(పాణి) - పాదము-వాయువు-ఉపస్థయనునవి వీని గుణములు మాటగమనము – శిల్పము - గ్రహించుట శిల్పరచన మొదలయిన పనులన్న మాట) వినాశము (శరీరములోని మలములను విసర్జించుట). ఇది పాయువు(గుదము) - ఉవస్థ అని రెండిటి యొక్క లక్షణము. ఆకాశ వాయుతేజో జల - భూములకేడియేడుకతములు; తరవాతి తరవాతి భూత గుణములతోఇగూడి కూడియుండును. అనగా వృథివి గుణమయిన గంధము దాని ముందున్న నీటి యొక్క రనముతోపాటుండును, నీడు దాని ముందరితేజో భూతము యొక్క రూపగుణముతో గూడ కలిసియుండును. రూపగుణము దానిముందున్న వాయువునందు స్పర్శగుణముతోపాటుండన్ను " నర్మగుణము దాని ముందున్న ఆకాశ భూతమందు శబ్దగుణముతో గూడి యుండుమ ఈ విధముగ పంచీకృత పంచభూతవికారమే ప్రపంచమసలిడునన్న మాట. ఆయా వందభూత గుణసంబంధముచేతనే జీవులు శాంతములు ఘోరములు మూడులునని నీళాటి విశ్లేషములు. భేదములు గలుగునని చెప్పబడినవి. నానావిధ బలములుగలి విడబడియున్న యీపాణి సంఘము సంహతి (నంయోగము) లేకుండ  నంతానమును. గనజాలవు. అస్యోన్య సంయోగముచే నొండొరులు కలిసికొని యొండొరుల యాశయమువలన (ఆధారము వలన) ఒకే సంఖాత మందు లక్ష్యము పెట్టికొని మైక్యంటోంది పురుషాధిష్ఠితము లగుటవలన వ్యక స్థితి స్వీకరణమందు మహదాది తత్త్వము లోకయండమునను ఉత్పాదన చేయును. అది క్రమముగా నీటిలో బుడగవలె వివృతమగును. అనగా వ్యక స్థితినందును. దాని యందవ్యక్త రూపుడై విష్ణువు అంతర్యామియై యుండును. బహ్మ బ్రహ్మస్వరూపమున దనకు దానయైయుండును. ఆ బ్రహ్మకు మేరువు. ఉల్బము అగును పర్వతములు . జరాయువు .మావి రూపమువొందును, గర్భము సముద్రములు. ద్వీపములు . సముద్రము జ్యోతిశ్చక్రము దేవాసుర మానుషాది జీవనంతతి . దాని. యందుద్భవించును. ఆకాశాది పంచభూతములు మరియు పడిరెట్లుగానున్న వానిచే,నీయండమావృతమైయుండును. భూతాది. కూడ (అహం కారతత్వము) దాని నావరించియుండును. ఆ భూతాడి నావరించి మహత్తుండును, (బుడ్డి తత్వము) అది. యవ్యక్త ముచే నావరింపబడును. ఈ వివిధవరణలచేత నర్వభూతములచే నీ బ్రహ్మాండము బీజయుతమైన కొబ్బరికాయ వెలుపలి డిప్పలచేత నావరింపబడినట్లావృతమైయిండును. అప్పుడు - బ్రహ్మ స్వయముగ జగములను సృజించుటకు బూనుకొనును; ఆ నృష్టించిన దానిని కల్పాంతమువరకు  యుగయుగమునందు , నవతరించి - రక్షించును, ఆ ఒక్క భగవంతుడే బ్రహ్మ విష్ణు శివరూపమున వేరువేరు . పేర్లంది సత్వరజస్తమో గుణములనెడి సత్తువగొని యింతింతన.

రానీవరాక్రమముగలవాడై కల్పాంతమందు తమోగుణోదేకు రూపమయిన రౌద్రరూపమును దాల్చును. ఆ రూపముతో నర్వభూతములను భక్షించును. అప్పుడు జగత్తంతయు నొటే, నము&మగును" అప్పుతండులో శేషశయనమందు సర్వవ్వరూపముతానయై శయనించును, . . మేలని రూఢమూని మురల సృష్టి గావించును. సృష్టి స్థితి (యములను బ్రహ్మ విష్ణు శివస్వరూపుడై గావించును. వృథివ్యాది పంచభూతములు సర్వభూతములకు , బ్రభువు విశ్వరూపుడును అవ్యయుడైన యాతడే. అందువలన భూతములందు జరుగు సృష్టి ప్రముఖ వ్యాపారమీయనకే యువకారకము. అతడే సృష్టింపబడు పదార్థము, అతడే నృజించువాడు. పాలింపవలసిన దానిని బాలించువాడు నాయనయే. బ్రహ్మాది వివిధావస్థల యందు ఆన్ని మూర్తులు నాయనయే. ఆయనయే బ్రహ్మ. వరిష్ణుడు-వరదుడు వరేణ్యుడు నా ప్రభువే.

ఇది వద్మపురాణమున సృష్టిఖండమున పురాణావతారమున రెండవ అధ్యాయము. .