పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
16వఅధ్యాయము
బ్రహ్మ దేవకృతయజ్ఞవర్ణనమ్
భీష్ముడు పులస్త్యునితో ననియె. బ్రహ్మా ! కమలము వైనుండిపడి తీర్థ మేర్పడినదని చెప్పినావు. ఆ తీర్థము యొక్క ప్రభావమేమి ? అటనున్న భగవంతుడు విష్ణువు శంకరుడు నేమి సేసిరి ? బ్రహ్మయట యజ్ఞమును నెట్లు నే సెను ? అందు సదస్యులు ఋత్విజులు వచ్చిన బ్రాహ్మణులు, యజ్ఞభాగము ద్రవ్యము దక్షిణ యజ్ఞవేది కొలత యజింపబడు ముఖ్యదేవతలెవరని వేదము సెప్పినది ? కోరిక మేమికోరి బ్రహ్మ యజ్ఞమొనరించెను. దేవదేవుడు. ముదిమి మృతిలేనివాడై అక్షయస్వర్గ మందినట్లు కనబడుచున్నది. అంతేకాదు మఱి యితర దేవతలకును నామహానుభావుడు స్వర్గమిచ్చెను. వేదములు ఓషధులు పశువులు భూమియందు యజ్ఞము నిమిత్తంగా సృజింప బడినవని శ్రుతి వినవచ్చును. ఈవిషయములనుగూర్చి నీమాటలువిన గుతూహలమొందితిని. ఇంకొకటి యీ యజ్ఞమందాయనకోరిక యేమి? ఫలమును ఆయన భావనయును ముచ్చటింపుము.
శతరూప యనునావిడ యిట సావిత్రిగా పేర్కొనబడినది. బ్రహ్మ కామె ధర్మపత్నియని చెప్పబడినది. పులస్త్యాది సప్తమునులను దక్షాది ప్రజాపతుల నామేకన్నది. బ్రహ్మ తనపత్రిని తన కేంతో కూర్చుదానిని ఆమెను ధర్మపత్నిగా జేకొనెను. పతివ్రత మహానుభావురాలు చక్కని చిఱునవ్వు గలది వ్రతనిష్ఠకలది. తొలుతటిభార్యను సాధ్విని విడిచి యింకొకయామెనెట్లుపొందెను? ఆమె పేరు ఆమె సమాచార మేమి ? ఏవిభునికూతురు ? బ్రహ్మ కామే యెక్కడ గన బడెను? ఆయనచిత్తము మోహింపజేసినది. ఆ మెగని యాయన కామవశుడయ్యెను. లోకసుందరినా మేను జేప్పట్టెను. యజ్ఞమప్పుడెలా సాగినదో వర్ణింపుము. అదిసరే, బ్రహ్మప్రక్క నామెంజూచి సావిత్రి యేమిచేసినది ? బ్రహ్మ యా మెయెడ ప్రవర్తించిన తీరేమి ! దాపుననున్న నా మెతో బ్రహ్మయన్న మాటలు ఆమె యన్న మాట లదెల్ల దెల్ప నగుదువు. అప్పుడు మీరేమి సేసినారు ? కోపమా ? ఓరిమియా ? మీరుచేసినదేమి? చూచినదేమి ? నేనన్న , యీయంతయు సవిస్తరముగ తెలుపుడు. బ్రహ్మపనులన్నీ , యాయన యజ్ఞవిధిని పూర్తిగ వినగో రేడ. మటియు నా యజ్ఞాచరణములయొక్క ఆనుపూర్వి (క్రమము) మొదలు హోత్రము (హోమప్రక్రియ)హోతయొక్క యాహారము, మొదటి యర్చన యెవరి కెలా జరుపబడినది ? విష్ణుభగవానుడే సహాయమెట్లు సే సెను ? దేవతలెవరేవిధముగా సాయమైరది యెల్ల ఆనతీదగుదువీవు.
దేవలోకమునుండీ మానవలోకమున కేల వచ్చేను ? గార్హపత్యము అస్వాహార్యము (ఆహవనీయము) దాక్షి తాగ్ని ని (లేతాగ్నులను) వేది సుచము సుష్క) సువము పోక్షణ అవబృథ్యమును (యజ్ఞదీక్షాసమాప్తి యందు జేయు ఆవృథస్నానమునకు సంబంధించిన సామగ్రి) నేట్లు సమకూర్చేను ? హవ్యమునారగించు దేవతలను కవ్యములను భుజించు పితృదేవతలను భాగార్థ మెవరెవరి నాహ్వానించెను ? ఈ యజ్ఞేయద్రవ్యవిభాగమాయన తామ పరమేష్టి స్థానమలంకరించుటకీంతమున్ను జేసిన యజ్ఞవిధానమందే విభజించెను. ఆపైని క్షణములు నిమేషములు కాషలు కళలునను త్రికాలవిభాగములను ముహూర్త ములు తిథులు మాసములు దినములు సంవత్సరము ఋతువులు త్రివిధ మగు కాలముల (పగలు రాత్రి సంధ్య) అను మూడువిధకాలముల షుటి కాప్రమాణము ఆయువు క్షేత్రములు ( ఉపాధులు) అపచయము లక్షణము రూపసౌష్టవము మూడువర్గాలు మూడులో కాలు మూడుపావకములు (అగ్నులు) మూడు గుణములు (సత్వ రజ స మోగుణములు) మొదలగు త్రివిధ పర లోకము లింక నయా త్రివిధ విభాగమును దన దివ్యతేజస్సుచే నా స్రష్ట (సృష్టికర్త) యెట్లు సేసెను ?
ధర్మాత్ములకును పాపాత్ములకును నాతడే గతి. చతుర్వర్ణ వ్యవస్థ మూలపురుషుడు రక్షకుడు పరంజ్యోతి యని వినబడు ( శ్రుతులు) పర మతపస్సు పరాత్పరము చతురాశ్రమముల కాధారము పరమాత్మయని శ్రుతులేని బేర్కొన్న వి. భూతములకు ప్రాణము, అగ్ని, తేజస్సులకు అగ్ని మనుష్యులకు మనస్సు తపస్వులలో తపస్సు వినయశీలురలో వినయగుణము తేజశ్శాలుర లో తేజస్సు తానై యీయెల్ల తాను సృజించు లోకపితామహుడు ఆ మహా మహుడు యజ్ఞమువలన గతినిగోరి యజ్ఞసంకల్ప మెందులకు జే సెను? ఇది నా సంశయ మింతకుమించినదిలేదు. దేవతలు దైత్యులు పర మాశ్చర్యమూర్తి బ్రహ్మయని స్తోత్రపాఠములు సేయుదురు. చేతలను వింతయైనవాడే. తత్త్వమును బట్టి సత్యమైన వేదవాణి యాయ సను బర తత్త్వముగానే పేర్కొనెను.
పులస్త్యుడనియే :
యజ్ఞపురుషస్వరూపము
యజ్ఞద్రవ్యసముదయము
పురుషసూక్తార్థము
బ్రహ్మను గూర్చిన నీప్రశ్న భారమైనది చాల పెద్దది. ఐనా ఓపినంత సెప్పెదను. ఆ పెద్ద గొప్పతన మాలింపుము. వేయికన్నులుగల వేయికన్నుల వేల్పునుగ వేయిపాదములు వేయిచెవులు వేయిచేతులు వేయినాలుకలు వేయిరూపులుగలవానిగను వేయిమంది ప్రభువులకు పై ప్రభువుగ వేలకొలది యిచ్చుదాతగ వేలకొలది దినువానిగ వేయి సేతులు పోనిగ నున్న యాపరతత్త్వమును యథాశక్తి పేర్కొనుచున్నాను. హవనము (హోమము) సవనము హోమద్రవ్యము (హవిస్సు) హో త పవిత్రములయిన పాత్రలు వేదము దీక్ష చరువు సుక్కుసువము సోమము అవభృత్తు ప్రోక్షణి దక్షిణా ధనము అధ్వర్యుడు సామవేదవిప్రుడు (ఉద్దాత) సదస్య (యజ్ఞపదమందలి సభ్యులు] “హవనమ్” అను పదము మొదలు భవం చమమ్ అన్న పదముదాక యివి యజ్ఞద్రవ్య ముల పేర్లు. ఆమీద “అగ్నే భుజమ్” దగ్గరనుంచి శాశ్వతః ప్రభుః అన్నదాక యజ్ఞ పురుషస్వరూపము వర్ణింప బడినది. ఆ శబ్దముల నిర్వచనము అర్థము శ్రాతపరిభాషకు సంబంధించినది. శ్రాతులవలననే వినవలసినది. అందుచేనది యిచట ప్రకటింపలేదు.
యజ్ఞపరిభాషలు
(వాడుక మాటలు)
హవనము =హోమము; సవనము =యజ్ఞము; హవ్యము=హోమపదార్థం హోత=హోమము సేయునతడు పాత్రలు పవిత్రములు వేది దీక్ష చరువు స్రువము సృక్కు సోమము అవబృధము హోమము సేయులన్నము పక్వాన్నము ప్రోక్షణి– ధక్షిణాధనము అధ్వర్యులు సామగుడు సదస్యులు సదనము సదస్సు యూపము సమి(థలు] త్కుశలు స్థాలి=దర్వి చమసwచతురశ్రముగానుండు పాత్ర ఉలూఖలములు=జోలు ప్రాగ్వంశము =పర్న శాల యజ్ఞభూమి (హోత) రెండవ బంధనము=పశుబంధం హ్రస్వములు అతి ప్రమాణాలు ప్రమాణములు స్థావరము ప్రాయశ్చిత్తములు వాజులు–హవిస్సులు స్థండిలములు-దర్భలను ఆగ్ని నుంచుభూమి కుశలు=దర్భలు వహ్ని భాగము భవము చయము=ఇటుకలతోటి అగ్ని వేది అ గేయుజము-ముందారగించేది హోమభుజము హోమమారగించునది శుభార్చిషము-ప్రదక్షిణార్చి ఆధ్వర్వుగణము-ఆధ్వర్యుడు ప్రతి ప్రస్థాత నేష్టఉన్నత హోతృగణము–హోత ప్రశాస్త్ర, అచ్ఛావాకుడు-గ్రావక్తుతు ఉద్దాతృగణము. ఉద్ధాత ప్రస్తోత-ప్రతిహర బ్రహ్మ బ్రాహ్మణాచ్ఛంసి అగ్నిద్రుడు హోత.
వేద వేత్తలగు విప్రులు యజ్ఞము శాశ్వత ప్రభువందురు. మహారాజ! పుణ్యకథను నీవడుగుచున్నావు విను. బ్రహ్మదేవుడు భూలోకమందెందులకు యజ్ఞము సే సెనన; అటదేవతలకు నిటమానవులకు హితవు కావలెనని లోకములు సృష్టికావలెనని పరమేష్ఠియజ్ఞము సేసెను. ఇందుపాల్గొన్న వారు దేవతలు సప్త రులు త్రినేత్రుడు (శివుడు) మహానుభావులు సనత్కుమారుడు మహాత్ముడు మనువు భగవంతుడు ప్రజాపతి అగ్ని వైశ్వానరాగ్ని వంటి మహానువులు. ఇక నీయజ్ఞానుష్టాన విధానము వినుము.
యజ్ఞవరాహవర్ణనమ్
మున్ను భగవంతుడు విష్ణువు సముద్రమందు వటపత్రమున (రావియాకునందు ) నిదురపోవుచుండ నాయన నాభి నుండి పద్మము (పుష్కరము ఉదయించేను. ఆందుండి బ్రహ్మ మొదలు గల నీ పేర్కొనబడినదేవత లుదయించిరి.
విష్ణునాభికమలమందు బుట్టి బ్రహ్మ ఆ పద్మము కోటర మందు నిద్రవోవుచుండగా నాపుష్కరమందు దేవతలు ఋషులు పుట్టిరి. ఇదే బ్రహ్మయొక్క అవతారము “పౌష్కరకము” అను ప్రసిద్ధినందినది. వేదములు స్మృతులు సంహితల రూపమున పురాణమీలా జెప్పబడినది.
యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావము
వేదముఖుడే న వరాహమూర్తి బ్రహ్మనుండి యుదయించెను. ఆ సృష్టికర్త కు సహాయముకొఱకే యారూపున నవతరించెను. పుష్కరమందు కోకాముఖమను పేర విశాలమైన తీర్థము నేర్పరచి యందాయన యుదయించెను. ఆయన పాదములు వేదములు. కోర యూపస్తంభము క్రతువులు హస్తములు చితి ముఖము జిహ్వ అగ్ని. రోమములు దర్బలు. బ్రహ్మ శిరస్సు పగలు రాత్రియు కన్నులు వేదాంగములు జెవులు. నేయి ముక్కు సువము మూతి సామధ్వని ఆర్పు. సత్యధర్మమయుడు. వేదోక్తకర్మము పరాక్రమము. ప్రాయశ్చిత్తము గోళ్లు. పశువుమోకాళ్లు వాయువు మంత్రములు ఎముకలు ఆపస్సు ముఖము రూపము ఉద్ధాత ఆంత్రము (పేగు లింగము హోమము బీజము వనౌషధులు మూలికలు. వాయువు అంతరాత్మ మంత్రములు ఎముకలు ఆపస్సు స్పీక్కుసోమము రక్తము వేదములు బుజములు హవిస్సు వాసన హవ్యము కవ్యము నెడల అతి వేగముగలవాడు . ప్రాగ్వశము శరీరము రకరకాలదీక్షలచేనర్పింపబడి తేజస్సంపన్నుడై నవాడు దక్షిణహృదయము యోగి మహాసత్రస్వరూపుడు. ఉపాకర్మేషివలన సోంపుగోన్న వాడు ప్రవర్గయందగు నావరములు (అట్టిట్టు తిరుగుడులు) భూషణములు ఛాయ యను ధర్మపత్ని సహాయముగలవాడు మణిశృంగమట్లు (మణిమయమైనకొండశిఖర మట్లు) ఎత్తైనవాడు. సర్వలోకములకు హితవు సేయు ప్రధానసంకల్పముగలవాడు. శమదమసంపన్న జమున్ను హిరణ్యాక్షునిచే చాప జుటగాజు టుకొనిపోబడిన భూమిని కోరలతో పై కెత్తి (మూడవయవతారము ) తరువాత కొనివచ్చి తానెధరించినవాడు. హరిఅవతారమట్లు తననుద్దరించుటచేతనే పృథివి సుఖమందెను. బ్రహ్మ హితవు కొఱకిట్లు ఆదివరాహమూర్తి చేఉన్న సముద్రము నీటిపాలైన భూదేవి పుష్కరమందుద్దరింపబడినది.
ఆలాటి యీ పుష్కర క్షేత్రమందలి కోకాముఖ తీర్థ మందు దేవ దానవ వసు రుద్రాదిత్య సిద్ద సాధ్య యక్ష రాక్షస కిన్నర విశ్వేదేవులతో, మూర్తి గొన్న దిగ్విదిక్కులతో, పృథివితో, నదులతో, సాగరములతో, చరాచర గురుడు వేద విద్వరుడు బ్రహ్మదేవుడు దయచేసి వసించు చున్నవాడు. విష్ణుభగవానుని గూర్చి ప్రభూ ! ఈ కోకాముఖము గోప్యము. (రహస్యము) ఇది నీచేతనే యెల్లపుడు పాలింప బడ వలెను. ఈ నాయజ్ఞ మందిట రక్ష యీయ వలయు నన, విష్ణువు భగవంతుడా ! ఇట్లే సేసెద నని యపుడు బ్రహ్మకు మాట యిచ్చెను. మఱల బ్రహ్మ యెదుట నిలువబడిన యా విష్ణుదేవుం గూర్చి వెండియు నిట్లనియె.
బ్రహ్మణా విష్ణుదేవేన ప్రసంగః
ముందున్న విష్ణువుం గూర్చి బ్రహ్మ యిట్లనియె. నా పరమ దైవము పరిమ గురువు నీవే కదా. నా పరం ధామము ఇంద్రాది దేవతలకును పరమ గమ్య స్థానము వైకుంఠము. వికసిత స్వచ్ఛపద్మాక్ష ! శత్రుపక్ష క్షయావహ ! దానవులు నా యజ్ఞమును ధ్వంసము సేయకుండ సేయ వలయు. ఇదే నీకు ప్రణామము. అన విష విట్లనియె. వెడలుము. దేవేశ్వర ! దానవుల నంత మొందింతును. ఇంక నీట నడ్డు దవులు నందల యాతుధానులను వ్యధ వేటు వాండ్లను రాక్షసులను మట్టు వెట్టెదను. శుభమగు గాక ! నిలువు మని సహాయ పడుట కెదురు సూచుచుండెను వెంటనే శుభవాయువులు వీచెను. దిక్కులు ప్రసన్నము లయ్యెను. జ్యోతిస్సు లుద్దీప ములై చంద్రునికి బ్రదక్షిణము దిటిగినవి. గ్రహములు విగ్రహములం పోరాట ముడిగినవి. నదులు తేరుకొన్నవి. భూమి దుమ్మెడలేను. (అచ్చమయ్యెను) ఆపస్సులు=జలములు సర్వానంద మొసగెను. నదులు తమ దారిం బారినవి. సముద్రము షోభింపలేదు. (ఉప్పెనలు లేవు) అంతరంగ శుద్దిగ నరుల యింద్రియములు పరిశుద్దము లయ్యె. మహర్పు లే బెడద లేక వేదములను గంఠ మెత్తి వల్లించిరి. ఆ యజ్ఞ మందగ్నులు హవిఃపాక మందు హవిర్భాగముల నందుకొని పచనము సేసి దేవతల కందించుట యందు మంగళ కరములయ్యెను. ప్రదక్షిణార్చులు=ప్రదక్షిణముగా దిజుగు జ్వాలతో శుభలక్షణము లయ్యె నన్నమాట. లోకములు ధర్మవర్తనమున బ్రవర్తించి సంతుష్ట మనస్కము లయ్యెను.
బ్రహ్మకృతయజ్ఞే దిక్పాలానాం ప్రవృత్తిః
అన్న మాట అన్నట్టులగు విష్ణుని శత్రుసంహార నిమిత్తములైన మాటలు విని యా పై దేవదానవులతో రాక్షసులతో గూడ భూత ప్రేత పిశాచములు గూడ వరుసగ నటకు వచ్చిరి. వానస్పత్యములు=పూచికాచేడు చెట్లు ఓషధులు (మూలికలు) కోరినవి కోరనివి బ్రహ్మయాజ్ఞచే వాయు వన్ని దెసల నుండి కొని తెచ్చెను. ఉత్తర మందున్న మర్యానా పర్వత మందుండు దేవతలందరు దక్షిణ దిశ గా బయలు దేరి యజ్ఞపర్వతము సేరి నిలిచిరి. పడమటి దెస నున్న గంధర్వాపరసలు మునులు వేదపారగులు వచ్చి యట క్రతువు నందు నిల్చిరి. అందరు దేవతలు దానవులు ఆసురుల గుంపులు, పగ వెనుక బెట్టి యెండొరుల యెడ నెంతో ప్రీతిగొని యందఱును ఋషుల పరిచర్య సేయుచుండిరి. ఋషులు బ్రహ్మర్షులు దేవర్షులు ద్విజులు రాజర్షులు పరమ శేష్ఠు లన్ని యెడల నుండి వచ్చిరి. ఈయజ్ఞ మందెవ్వరు (ఏదేవత) యజింపబడు నని చూచి ముచ్చట గొని పశువులు, పక్షులుగూడ యట నరుదెంచెను. బ్రాహ్మణులు భోజనప్రియు లన్ని వర్ణముల వారు వరుసగా నంద రేగు తెంచిరి.
వరుణుడు సమర్థుడు గదా! స్వయముగ వచ్చి రత్న మును అన్నము నిచ్చెను. వరుణుడు తనలోకమునుండి స్వయముగా అన్నము వండెను. (ఇట అన్న శబ్దము అన్ని వంటకములను దెలుపును) వాయువు రకరకాల భక్ష్యములనుండి పిండివంటలను దయారు చేసెను. సూర్యుడు రసములను వండెను. సోము డన్న ము వండెను. బృహస్పతి మతిదాత. ఈయందఱకు తెలివి నిచ్చు వాడయ్యెను. గంగాదేవి నర్మద రకరకాల వస్త్రదానములనుజేసిరి. ధనాధ్యక్షుడు కుబేరుడు ధనదానమును సేసెను. నదములు=(పడమటగా పారు నదులు). వానికి అధ్యక్షసానము సరస్వతీనది గంగాదేవి నర్మదా నదితో మటియుం గల పుణ్య నదులు కూపములు (బావులు) పల్వలములు=చెఱువులు కుండములు [వస] వణములు=దోలులు దేవఖాతములు అన్ని నీటి వనరులు సప్త సముద్రాలు సప్త ఋషులు = బుద్ధి-తెలివి పండ=తత్త్వ మేలుగ దగినది; 2 మేధ=జ్ఞాపకశక్తి 3. చార్వి=ఊహాపోహలందు నేర్పుగలది 4 చత్వ =చక్కగా నడిగి విసుగు లేక వినే తెల్వి 5 గృహీత = చెప్పినది చక్కగా గ్రహించుట 6 గురుశుశ్రూష= సహనము గల బుద్ధి 7. ప్రతిభ= ఒక విషయము మంచి వాగోరణితో సమయోచితముగ శ్రుతి స్మృతి పురాణేతిహాసానుభవములు వెక్కు చూపి వినువారు ప్రశ్నించ కుండ విషయములను దెల్పు బుద్ధి. ఉప్పు చెఱకు- సుర (కల్లు) సర్సి= నేయ్యి దధి_పెరుగు దుగ్గ–పాలు జల- నీరు వీనితోడివి-భూర్-భువర్-సువర్-మహర్-జనస్-తపస్స-సత్యస ప్రలోకాలు-సప్తపాతాళాలు- అతల- వితల- సుతల- రసాతల- మహాతల- తలాతల పాతాళములు, సప్త ద్వీపాలు, సప్త వర్తనములు, చెట్లు, తీగలు, గడ్డి, కూరలు, పండ్లు, భూమ్యాది పంచభూతాలు, నవగ్రహ జీవులు, ధర్మశాస్త్రములు, వేదభాష్య సూత్రములు, బ్రహ్మ నిర్మించిన మూర్తము(ఆకారముగలది) అమూర్తము=నిరాకారము. మూర్త దృశ్యము(కనిపించేది)
యజ్ఞశాలా వైభవము
దేవతల సన్నిధిలో నట ఋషుల సమావేశ మందు బ్రహ్మ కుడి వైపు విష్ణువు (సనాతనుడు) ఎడమను రుద్రుడు పినాకి (పినాక మను విల్లుపూనువాడు) వర ప్రదాత ప్రభువు నలంకరించిరి. మహాత్ముడు బ్రహ్మ ఋత్విగ్వర ణము కావించేను. భృగువు హోతగా వరింప బడెను. పులస్త్యుడు అధ్వర్యుడు మరీచి ఉద్గాత. నారదుడు బ్రహ్మ - సనత్కుమారాదులు సదస్యులు.దక్షాదీ ప్రజాపతులు బ్రాహ్మణాది వర్ణములవారు నట నుండిరి.
అటు దగ్గరగా బ్రాహ్మణులు ఋత్విక్కులుగా వరింప బడిరి. వారిని కుబేరుడు వస్త్రాభరణములతో నలంకరించెను. ఉంగరాలు కంకణములు కిరీటములచే వారు భూషింప బడిరి. నలుగురు ఇద్దరు పదిమంది సల్లురు పదునాల్గురు మొత్త ము ముప్పదినల్గురు విప్రులను సాష్టాంగ ప్రణామముచేసి బ్రహ్మ ఋత్విక్కులుగా వరించెను. వారందరు నాయనచే ప్రణిపాత పురస్సరముగా బూజింప బడిరి.
బ్రహ్మ ఋత్విగ్వరణ వైభవమ్
తామందరు నీక్రతు వందు నన్న నుగ్రహింప వలయు. ఈమే నా పత్ని సావిత్రి. ద్విజులు మీరు నా దిక్కు అని బ్రహ్మ విన్నవించెను.
బ్రహ్మదీక్షాస్వీకారము
విశ్వకర్మను బిలిచి బ్రాహ్మణోత్త ము లట యజ్ఞ మందు విధి విహితముగా శీర్ష ముండనము చేయించిరి. దంపతుల కెండలో నార బెట్టిన దీక్షా వస్త్రములను గట్ల నిచ్చిరి. విప్రులు వేద ఘోషచే స్వర్గమును గూడ ప్రతిధ్వనింప జేసిరీ. క్షత్రియులెల్ల జగత్తు పాలించుచు సాయుధులై యట నిల్చిరి.
అనేక విధములైన భక్ష్యములను పిండి వంటలను వైశ్యులు సమ కూర్చిరి. మున్ను విననిది చూడనిది యా యజ్ఞ వైభవము చూచి ప్రజాపతి సృష్టికర్త యెంతో హర్షించి వైశ్యులకు ‘ప్రాగ్వాట’ అను పేరు (బిరుదు) . నొసగెను. ఈ యజ్ఞ మందు ద్విజులకు పాదము లొత్తుట శూద్రుల కర్తవ్యము. శుశ్రూష కొ కే మిమ్ము నేను తురీయ స్థానమం దుంచినాను. ద్విజులకు క్షత్రబంధువులకువై శ్యులకు మీలాటివారు శుశ్రూష చేయ వలయు నని బ్రహ్మ యిలా చేసెను.
యజ్ఞారంభము
ఇంద్రుని ద్వారాధ్యక్షునిగ, వరుణుని రసము లిచ్చు వానిగ, ధనదుని [కుబేరుని] ధన ప్రదునిగ, పవనుని (వాయువుని) సువాసనల నిచ్చు వాసిగ, సూర్యుని వెలుగు నిచ్చువానిగ, నియమించెను. మాధవుడు విష్ణువు ప్రభుత్వ మందు (సర్వాధికారి స్థానమందు) ఉండెను. సోముడు వారికి సోమ మందించువాడై వారి ఎడమప్రక్క నుండెను. పత్ని సావిత్రి పరమసుందరి చక్కగ సత్కరింపబడి యుండడు. యధ్వర్యుడు(బృహస్పతిదేవి!రా త్వరగా రావాలి యగ్ను లెల్ల యెగసినవి. దీక్షా సమయ మైనది యని కేక వేట, నామె యింటిపనులు చక్కబెట్టు కొనుటలో, మునిగి తేలుచు స్త్రీస్వభావముచే రాదయ్యేను. ఇక్కడింకా గుమ్మాని కలంకారం ఏమీ చేయలేదు. గోడమీద బొమ్మలు బొట్టు పెట్టలేదు. ముంగిలివాకిట స్వస్తికము మ్రుగ్గు వెట్టలేదు. భాండములు. గిన్నెలుగట్రా కడుగుకోవటమేమి. చేయలేదు. నారాయణుని వెళ్లామింతవరకూ రాలేదు. అగ్ని భార్య స్వాహ, యముని యిల్లాలు ధూమ్రోర్లా, వరుణుని, భార్య గౌరి, వాయువు పెండ్లాము. సు ప్రభ, కుబేరుని భార్య వైశ్రవణి, శంభునిల్లాలు జగత్తున కిష్టురాలు గౌతి మేధ, శ్రద్ద, విభూతి, అనసూయ, దృతి, క్షమా, గంగ, సరస్వతి, ఎవరూ కన్యక లింతదాకా రాలేదు. ఇంద్రుని. భార్య ఇంద్రాణి, (శచీదేవి) శశిప్రియ రోహిణి, వశిష్ఠుని ఆవిడ అరుంధతి, సపరుల భార్యలు, అత్రి భార్య అనసూయ, ఇంకా ఉన్న వారు. పేరంటాండ్లు, కోడళ్లు, కూతుళ్లు, చెలులు, చెల్లెండ్రు అందరూ ఇందాకా రాలేదు. వాళ్లురానిచో నేనొక్కతేనూ రాను. వెళ్లి విరించికి ఒక్కముహూర్తము ఉండుమని అందరినీ కలిసి నేను తొందరగా వస్తానని చెప్పు. మహాబుద్ధిమంతులు సర్వదేవతలతో గలిసి తమరూ నేనూ నీ మహాయజ్ఞమందెంతో శోభ నందెదము. సందేహం లేదు. అని ఆలా మాట్లాడు చున్నా మెను వదలి యధ్వర్యుడు బ్రహ్మ దగ్గరకు వచ్చెను.
బృహస్పతి బ్రహ్మతో ప్రసంగము
సావిత్రి రాలేదు. స్వామీ ! ఇంటి పనులలో నున్నది. సఖురాండ్రు రా నంతవరకు నేను రావడం జరుగదు. అని యన్నది. స్వామీ ! సమయము దాటి పోవుచున్నది. తాతా ! ఇపుడు నీ కేది రుచించు నట్ల కావింవు మన బ్రహ్మ కొంచెము కోపముతో !- ఇంకొక పత్ని ని నా కొఱకు దేవతలతో జని ఇంద్రా ! త్వరగా తీసికొని రా య జము సాగేటట్లు తొలము కొఱత పడ కుండునట్లు శీఘ్రంగా చేయి. నీ వింకొక స్త్రీని తీసికొని రా. నా య ఆ సమాప్తి యగు దాక వర్ణము కులము మాట పై మనసు పెట్ట వదు. ఈ క్రతువు పూర్తి యైన తర్వాత నామెను నేను తిని వదలి పెట్టెదను - అని బ్రహ్మ పలుక, నిందుడు వెళ్ళి ధరాతల మేల్ల తిఱిగి స్త్రీలను చూచెను. అందఱును నింకొకరి భార్యలే. ఒక గొల్లపిల్ల మాత్రము కన్య, రూపవతి, చక్కని ముక్కు, కళ్ళు, అలాటి అందగత్తె, దేవతాస్త్రి గంధర్వ, ఆసురి, వన్నగి. యింకొకతే లేనే లేదు. ఎంతో చక్కని దానిని రెండవ లక్ష్మీ దేవి యట్లున్న దానిం జూచేను. తన రూప సంపదచే చూచు వారి మనో భావమును నిమురింప జేయు నట్లుండెను. అనగా మై మఱపు గూర్చుచుండె నన్న మాట. ఎక్కడైన వేఱేది యందమున నెంతేని ఆ వక్తువు లభించు నా సొంపెల్ల యామె శరీర మందు దర్శించెను. యీమె కన్య యగు నేని (పెండ్లికానిదేని నా కింతటి పుణ్యము సేపినవాడింకొకడు భూమియం దుండడు. ఈ సుందరీరత్నము ఈ సౌభాగ్యవతి యందు పితామహ డనురక్తు డగునేని నా శ్రమ సఫల మగును.
తన యవయవములచే, జట్టుచే, చెక్కిళ్ళచే, కన్నులచే, పెదవులచే, వరుసగా నల్లని మబ్బు (నలుపు) బంగారము తామర పువ్వు, పవడము , అను వాని, కాంతిని జుట్టు చెక్కిళ్ళు కన్నులు పెదవి యను వాని ద్వారా భాసింప జేయు నందకత్తెను మన్మథు డనెడి యశోక వృక్షము దొదివిన మొగ్గ యట్లున్న దానిని బ్రహ్మ మతొక రూపముదాహరణ కనిపింప హర నేత్రాగ్ని కి దగ్గమైన మన్మథునితో నేత్రాగ్ని జ్వాలచే తనకూదాతెలివితో తయారుచేయబడినదయినచో నాయన నైపుణ్యమున కీమె పరాకాష్ట. యీలాటి దింకొక రూపము లోగడసృష్టించ లేదన్న మాట. ఆపై చూచు నా కన్నులకు విందు గొలుపు నీ మేనున్న తాగ్రము లీమె పాలిండ్లు చూచిన నేవని హృదయమం దత్యాశ్చర్వ మెందులకు గలుగదు ! రాగముచే ఎరుపుచే, (విపరీతమోహముచేననిశ్లేష) నణగారిన మేను (రూపము గల) యీమె పెదవి సృష్టమే. ఆయిన దీనిని సేవించు వాని కిది మోశానందము నిచ్చుచున్నదే. ముంగురులు కౌటిల్యము వంకరలు దిరిగినను వంకర నడకలు (కపటము బూనిన దని శ్లేష.) సుఖము నొసంగు చున్నవి. ఇట దోషము కూడ యందము గొని గుణమయి భాసించుచున్నది. సొంపు గొని యీ పిల్ల కనుగొనలు (వాల్చూపులు) చెవి దాక వచ్చి సొంపు గొన్న వి. కాబట్టి ఏదో యొక కారణముం బట్టి జావములో తెలివి తేటలేర్పడునని తెలిసిన వారందురు. చెవులకు నేత్రములు భూషణములు. కన్నులడు చెక్కిళ్ల భూషణములు. ఇక్కడి కుండలములకు కాటుక లకు నేలాటి యవసరము లేదు. హృదయమును రెండుగా జేయుట కటాక్షములకు న్యాయము గాదు. (అనగా ఆవాలు చూపులు పైవాలినంత నెంతధీరునికై న మనసట్టిట్టగు నన్న మాట.) నీ చుట్టాలిక డ నున్న వారు దుఃఖము పాలెట్లగుదురు ? పాత్రోచితమయిన గుణముల వలన వికారము గూడ సర్వ సుందరమని (చక్కదనము) అందురు. ఒక పిల్ల కోసము వృద్దక్షణశ తానాం- పెంపుగొన్న యీ నూరు క్షణముల ఫలము ఇందున కనబడినది. శుభలక్షణము.
ఇంద్ర ఉవాచ
సృష్టికర్త నానా రూవముల నంద చందముల చక్క ఆ దిద్దుటలో తన నేర్పున కెల్ల యెల్లగ నీమెను బ్రదర్శించెను. మానసుల మనముల నీమె తన లీలా విలాసముల స్నేహ భరితములు సేయుచున్నది. ఇలా విమర్శించుచు నామె సౌందర్యమునకుం దెల్లవోయి మేను బులకలం గ్రమ్ముకొనెను. క్రొత్త బంగారు వన్నె మేను తామర రేకు లంత కన్నులుం గల యామేం గని, దేవగంధర్వాదుల నెందరినో చూచితి. నీలాటి యంద గత్తెం జూడ లేదు. త్రిభువనము లందున్న యంద మెల్ల జేకొని విధాత యీమె రూపు దిద్దిను. అని యింద్రు డిట్లామెను బలుక రించెను. సుందరి ! నీ వెందుండి వచ్చితివి ? చెప్పుము. ఒంటిక తై పై వీధులం నిలిచినావు ! మేన నీవు దాల్చిన నగలు నీకు భూషణములు కావు. వానికే నీవు భూషణమవు. సునేత్రా ! దేవివి కావు, గంధర్వివికావు. ఆసు రివికావు. నాగివి కావు. మున్ను నేజూచిన కిన్నరివికావు. ఎంతో ఆడుగుచున్నాను గదా ! జవా బీయ వేమి ? అన్నంత నప్పు డాకన్య సిగ్గువడి వణకుచు యింద్రుని కిట్లనెను.
నేనైతే గొల్ల పిల్లను, ఓవీరుడా ! ఇక్కడ ఆవుపాలు పెరుగు అవీ ఆమ్ము చున్నాను. ఇదిగో వెన్న మంచిది ఇదిగో మీగడ పెఱుగు. తపశ్శాలివిలా ఉన్నావు. పెఱుగా మజ్లిగా ఏమిరుచి నీకు కావాలి ఆది చెప్పు. ఇష్టము వచ్చి నది తీనికో. ఆన నింద్రుడామెను చేత గట్టిగా మెలివడు బట్టు కొని యా విశాలాక్షిని బ్రహ్మయున్న చోటికి గొంపోయెను.
అట్లు కొని పోవుచుండ నామె గోల పెట్టుచు ఆయ్యో, అయ్యా ! అమ్మా, అన్నయ్యా ! అని గోల పెట్టుచు. ఈ నరుడు నన్ను బలాత్కారముగ కొని పోవుచున్నాడు. నాతో పని ఉంటే మా అయ్య నడుగుకో. ఆతడు నన్నిస్తాడు. తప్పక తమతో నిజ మాడుచున్నాను. ఏ పిల్ల భక్తి యందు వాత్సల్యము కల వానిని కోరదు ? ధర్మవత్సలా ! నీ కీయ రాని వక్తువు నా తండ్రి కేదీ లేదు. తలవంచి యా యనను బ్రతిమాలేదను. సంతుష్టుడై యత డిచ్చును. మా తండ్రి మనసు దెలియకుండ నీకు నన్ని తునేని ధర్మము దెబ్బ తినును. ఆందుచే నేను నిన్ను బ్రతిమాలుట లేదు. మా ఆయ్య నీ కిచ్చెనేని నీవశములో నే నుంటాను.
ఇట్లు ముచ్చటింప నింద్రుడాబాలికను గొంపోయి బ్రహ్మ ముందు నిలిపి : అబలా ! ఏదో పరియాచకంగా నిన్ను తీసికొని వచ్చినాను. విశాలాక్షి ! వర వర్ణిని = సాధ్వి (పతివ్రతా!) ఆనేను - గోపక న్యయు బ్రహ్మను జూచి గౌరవర్ణుడు = (వసుపుఎఱు పుగలిసినరంగువాడు). చక్కని బుజాలు మూపులు తెల్ల దామర లవంటి కన్నులు మేలిమి బంగారు నోనట్లు నిండుగ్గా బలిసిన తొమ్ము. మదపు పేనుగు తొండ మట్టి తొడలు, ఎఱ్ఱని గోళ్లు గల యాతని తనకు ప్రాప్తించిన వానిం గని తానతాను మన్మథబాణములకు గురియేతి నను కోనెను. ఆతడు లభించేనన్న తలపుతో నామే మతి దప్పిన ధట్లు కనిపించెను. గోపిక తనను దానిచ్చుకొను సధికారము తనకున్నట్లను కొనెను. ఈతడు నన్నందగత్తె నని తనకు నేననీ జేకొన నిచ్చగించునేని, నా కంటే ధన్యురాలిం కొక తే భూమిపై లేదు. ఈయనచే నేను గొని రా బడితిని. ఈయన కంట బడితిని. ఈతని విడిచిన జావగును. విడువకున్న నాబ్రతుకు సుఖ మగును. ఈయన గాదన్న అవమానము వలన పాడువడిన రూపుతో నందకు దుఃఖము గూర్చు దాన నయ్యెదను. ఏయింతియేని ఈయన అనుగ్రహము గోని జూచివం జాలు. నాబిడ ధన్యురాలు అదృష్టవంతురాలు. సందేహము లేదు. కౌగిలించు కొనేనా మఱి యేమనవలెను ? ఆ శేష జగ త్సౌందర్యము వేర వేర సంచారములో నున్న దదెల్ల లావణ్య మీ యొక్క చోట విశ్వయోని వరమాత్మ ప్రదర్శించినాడు. ఈయనకు మన్మధుడుసాటి. మన్మథుని సాధ్వి రతీదేవికి సాటి నేను.
నా ఈ దుఃఖము తీరి పోయినది తండ్రి గాదు తల్లి గాదు కారణము. ఒక వేళ నితడు నన్ను జేకొనడేని నిండుక నా విషయము మాటలాడడేని యీయననే తలచుకొని శోకించుట వలన నాకు చావగును. ఏ యవరాధము లేకుండ లాటి దురవస్థకు నేను పాలు గావలసి యుందును, కుచములకు రత్నా అలంకార శోథ రావలె నని ఆచ్చము తామర పూవు వంటి శోభ గల యీతని ముఖము చూచుచుండగా నా మనస్సు ధ్యానమున దిగెను. ఓ వాయువు ! నీతని శరీర స్పర్శ సంయోగము మహాయోగ మని యను కొనుట లేదు. అందుకే ప్రాణుల శరీర మే మంచిదని తెగ తిఱుగుచున్నావు. లేదా ఇతని తప్పు లేదు. నీవు ఇష్టము వచ్చినట్లు తిరుగు స్వేద్భా చారుడవు. తిరుగుబోతువు కదా ! మన్మథా ! మారా ! విరహలను జంపువాడవునీవు ముషితుడవు = మోసగింపబడినావు నిజ మిది. నీవు నీ ప్రియురాలిని బెండ్లామును రక్షించుకో.
నీ కంటె ఆందగాడు ఈతడు కనబడు చున్నాడు. ఇతడు, నా మనోరత్న మను (మనస్సు అను రత్నమును) నా సర్వస్వమును దొంగిలించి నాడు నిజ మిది. ఈయన ముఖ మండు గనిపించు శోభ వేడి మచ్చగల చంద్రునం చెట్లుండును? కళంకము గలవానికి నిష్కళంకునితో సామ్య మేమి బాగుండదు.
తామర పువ్వు ఈతని కన్నులకు సాటి రాదు. నీటి శంఖముతో ఈయన చేవి సంకుపులకు పోలిక యేమి ? ఈయన పెద వికి పవడము సామ్యముండదు. ఈయన పెదవి ఆత్మసమైన ఈ తనయందున్న, అమృతమును సర్వాంతర స్ధమైన ఐహ్మానందమును జాల్కొల్పును. (అట్టి దానికి జడమైన యీ పవడముతో పోలిక లేదన్న మాట) కొంచే మేని మంచి పని వందల కొలది జన్మముల జేసితి నేని ఆ ప్రసాదముచే నీ మహాపురుషుడు నే కోరినవాడు భర్త యగును. అని యిలా చింతించుచు పరాధీనయై గోపిక యుండగా బహ్మ యజ్ఞము కొఱకు తొందర గోని హరిం గూర్చి ప్రభూ! మహానుబావురాలగు నీమె ‘గాయత్రి’ యను పేరుతో విలసిల్లును. అనగానే బ్రహ్మనుగూర్చి విష్ణుమూర్తి యిటు పల్కెను.
బ్రహ్మతో విష్ణువు
ఈమె నిపుడు నే నిత్తును జగత్ప్రభూ ! గాంధర్వ వివాహమున వివాహ మాడుము. దీనికిమారు సేయకుము. ఆలస్యము వద్దు. దేవాః యీమె పాణిం గ్రహింపుము. కంగారు పడకు. ఆని హరి యనగానే పితామహుడు గాంధర్వ వివాహముచే నామెను గైకొనెను. బ్రహ్మ జగత్తు నందధ్వర్యుల కెల్ల ను తముని బృహస్పతిం గని, ఈ మేను నేను పత్నిని జేసి కొన్నాను. మా గృహ మందు బ్రవేశింప జేయు మనెను. లేడికొమ్ము చేబట్టి పట్టు చీర పై గప్పుకొని యా దేవపత్ని వేద పారగులైన ఋత్విక్కులచే నపుడు పత్నీ శాలకు రావింప బడెను. మేడి దండముతో లేడిచర్మము పై దాల్చి యపుడమ్మహా యజ్ఞమున బ్రహ్మ తన తేజస్సుచేతనే తానేంతో శోభించెను. ఆవ్వల వేదపారగు లైన బ్రాహ్మణులు శుక్రాచార్యులతో ప్రారంభము సేసిరి. వారు వేదోక్త విధానమున సర్వ మొనరించిరి. ఆ విధముగ పుష్కర క్షేత మందా యిజ్ఞము వేయి యుగములు జరిగెను.
ఇది శ్రీ పద్మపురాణము ప్రథమము సృష్టిఖండము బ్రహ్మయజ్ఞములో గాయత్రీ సంగ్రహమను పదునాఱవ యధ్యాయము.
