పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

25 - ఆదిత్యశయన వ్రతము

 ఆదిత్యశయన వ్రతము

భీష్ముడనియె  ఉపవాస ఫలము కావలెనని కోరును జబ్బు మనిషి. అలాంటి వానికి పాతమైన వ్రత మానతిమ్మన పులస్త్యుడనియె. ఉపవాసమునకు శ క్తి లేనివానికి నక్త భోజనము (రాత్రి భోజనము) సమ్మతము. ఆదిత్యళ యన వ్రత మందది యనుకూలము. ఆ వ్రతమునందు శంకరు నర్చన జరుగును. హస్త నక్షత్రము సప్తమి తిథి థానువారమును కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రాంతి కూడ యైనచో నది సర్వ కామ సమృద్ధి నిచ్చును. ఉమామహేశ్వర స్యార్చామర్చయేత్సర్యనామభిః ।

సూర్యార్చాం శివలింగం చ ఉభయం పూజయేద్యతః ॥

ఉమాపతే ర వేశ్చాపి న భేదః క్వచిదిష్యతే ।

 యస్మాత్తస్మాన్నృపశ్రే ష్ట గృ హే భానుం సమర్చయేత్ ॥

 హస్తే తు సూర్యాయ నమోస్తు పాదావర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశం ।

స్వాతీషు జంఘే పురుషోత్తమాయ ధాతే విశాఖాసు చ జానుదేశమ్ ॥

 తథానురాధాసు నమోభిపూజ్యమూరుద్ద్వయం చైవ సహస్రభానో ।

జ్యేష్టా స్వనంగాయ నమోస్తు గుహ్యమింద్రాయ భీమాయ కటిం చ మూలే ॥ 

పూర్వోత్తరాషాడయుగే చ నాభిం త్వష్ట్రేనమః న ప్రతురంగగమాయ ।

ఆనాడు చేయవలసినది ఆదిత్య శయన వ్రతము సూర్య నామములు నెప్పి ఉమామహేశ్వర పూజ చేయవలెను. శివలింగమును ఉమామ పాళ్వరులనీ యిద్దరిని గలిసి పూజింపవలెను. కారణము యిద్దరికి భేదము లేకపోవుటయే. శుక్లపక్షములో

హస్త నక్షత్రమున - సూర్యాయ నమః అని

చిత్ర                 ”                       ఆర్కాయ గుల్పములందు (మడమలందు)

స్వాతి               “                      పురుషోత్తమాయ పిక్కలందు

విశాఖ             "                      ధాత్రే మోకాళ్ళు

అనూరాధ       "                      సహస్ర బాహవే ఊరువులు

జ్యేష్ఠ                “                      అనంగాయ నమః గుహ్యము

మూల             “                      ఇంద్రాయ నమః పూర్వాషాఢ

పూర్వాషాడ     “                      భీమాయ నమః కటి, నడుము

ఉత్తరాషాఢ     "                                  "

శ్రవణ            "             తీష్ణాంశవే నమః కుడి

దనిష్ట              “                      విక ర్తనాయ నమః వృషము

శతభిష         “

వరుణ దేవతాక "                   ధ్వాంత వినాశకాయ నమః వక్షః స్థలము

పూర్వాభద్ర, ఉత్తరాభద్ర          ”          చండకరాయ నమః దాహువులు

రేవతి               "                      సామ్నా మధీశాయ నమః అర చేతులు

ఆశ్విని             "                      సప్తాశ్వధురంధరాయ నమః గోళ్ళు

భరణి              "                      కఠోరధామ్నే నమః కంఠము

కృత్తిక

రోహిణి                       "          దివాకరాయ నమః గ్రీవ (మెడ)

మృగశీర్ష                    "          పురారి నాలుక

ధనిష్ఠ 

పునర్వసు                    "          సవిత్రే నమః ముక్కు

పుష్యమి                      "         అంభోరుహ వల్లభాయ నమః లలాటము (నుదురు)

ఆశ్రేష                          "          వేద శరీరధారిణే శిరస్సు

మఖ                            "          విబుధ ప్రియాయ చేతులు

పూర్వ ఫల్గుని              "           గోబ్రాహ్మణ నందనాయ కన్నులు

ఉత్తర ఫల్గుని              "          విశ్వేశ్వరాయ కను బొమలు

నూనె, మాంసము, కారము లేని యాహారము తినవలెను. భుక్త శేషము తినరాదు. రాజా! ఈలా న కములు చేసి పునర్వసు నక్షత్రమందు శాలి బియ్యమొక ప్రస్తము ఉదుంబర పాత్రమునందుంచి ఆవు నెయ్యితో బంగారము విప్రునియ వలెను. స ప్రమ పారణమందు వస్త్రముల చాపు ఆధికముగ నీయవలె. పదునాల్గవ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలయిన వానితో బ్రాహ్మణునికి భోజనము పెట్టి బంగారు తామర పువ్వు ఎనిమిదంగుళాల విరిచినది పద్మరాగ మణులు దేవతలతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను విరుద్ధగ్రంధి వర్ణి తాల తలగడతో, వితానముతో, వక్క దుప్పటితో. పాదుక లు, పాదరక్షలు, గొడుగు చామరము (వింజామర , పీట (ఆసనము), ఆద్దము ఆలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందలంకరించి కపిల గోవును వస్త్రము కప్పి, వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ములతో, దూడతో, కంచు పాలచెంబుతో మంత్ర పూర్వకముగా పూర్వాత్థాము దాటకుండ దానమీయవలెను.

దాన మిచ్చునపుడు పఠించవలసిన మంత్రము భావము

ఆదిత్యమూర్తి భగవంతుడా! నీ శయనమెప్పుడూ ఆశూన్యమో (నిండుగా నుండునో) కాంతిచే, ధైర్యముచే, సంపద చే పుష్టిచే నేలాంటి లోటు లేనిదో అలా నాకు సర్వ వృద్ధులు గలుగుగాక! అలా నన్ను సర్వ దుఃఖ సాగరము నుండి యుద్ధరింపు ఆని పలికి ప్రదక్షిణము సేసి నమస్కరించి యా విప్రుని సాగనంపవలెను. శయ్య గోవు వంటి సత్కరించిన సామగ్రినంతయు నో ద్విజు నింటికి జేర్చవలెను.

గుణహీనుని దాంభికునికి వెల్లడింపరాదు. ఇందుమౌళి (చంద్ర శేఖరు) నుద్దేశించిన యీ వ్రత వైభవము వెల్లడింప రాదు. గోవులు, విప్రులు , దేవతలు, ఋషులను నిందించు వాండ్రకు, సంయోగులను నిందించు వాండ్లకు వెల్లడించరాదు. భక్తుడు దాంతుడు నైన వానికే యీ రహస్యము తెలుపదగినది, అని వేదవేత్త లందురు.

ఈ వ్రత మాచరించిన స్త్రీ పురుషుడు బంధుప్రీతి ధనాది సంపదల కెడవడడు. భార్యా పుత్రాదులతో నిరంతరానంద భరితులగుదురు. మున్ను వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులి వ్రత మాచరించిరి. ఈ కథ పఠించినను నీ ఫలము సిద్ధించును. విన్న ను పాపములన్నియు పోయి ఫలములివి కల్గును. నరకము పాలైన పితరులను గూడ యిది యుద్ద రించును.

 రావి, మట్టి, మేడి, నందీశ ము, నేరేడు, మారేడు నను నీ ఆట వృక్షముల పుల్లలతో మార్గశిరము మొదలు రెండేసి నెలకొక్క దానిచే దంత ధావనము చేయవలెను. పండ్రెండు మాసాలైనంత దధ్యన్నము, వితానము (చాందిని) జెండా చామరలతో నుదక కుంచములయందు రత్నాలతో దానము చేయవలెను. విత్తలోభము సేయకూడదు. దానిచే సర్వైశ్వర్య సంపన్ను లగుదురు.

ఇది ఆదిత్యశయన వ్రతమను యిరువది యెద - అధ్యాయము.