పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

27 - తటాక ప్రతిష్ఠా విధి

 తటాక ప్రతిష్ఠా విధి

చెఱువులు, తోటలు, నూతులు, దిగుడు బావులు, తామర కొలనులు, దేవాలయములు ప్రతిష్టించు విధాన మానతిమ్మని భీష్ముడడుగ పులస్త్యు డనియె. రాజోత్తమ! పురాణములందిది వఠింపబడినది వినుము. ఉత్తరాయణమందు రక్ల పక్షమున శాస్తోక్ష శుభలగ్నమున బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసి శుభ ప్రదేశమున చెఱువునకు దగ్గరగా నాల్గు హస్తముల) మూరల ప్రదేశ మందు నలు చదరముగ నాల్గు ముఖాల వేదిక యేర్పరచి పదునారు మూరల విశాలమైన మండపము చతుర్ముఖముతో నేర్పరపవలెను. వేదిక చుట్టు ఆరత్ని మాత్రములగు గర్తములు గంటలు తొమ్మిది యేడు ఆయిదు సూటియైన ముఖములతో విత స్త్రీ జానెడు యోని ఆజేడంగుళముల వీరివి గలదియు నేర్పరుప వలెను. మధ్య గంత మూడు పర్వము లెక్కువగా నున్న మేఘములతో నమర్చవలెను. జెండాలతో నలు వైపుల ఒకే రంగులోనున్న జెండాలుండవలెను. రావి, మేడి, జువ్వి, మట్లి కొమ్మల మండపము నలుదిక్కుల ద్వార మేర్పరుప వలెను. ఆట నెనమండుగురు హోతల ద్వార పాపానమండుగురు ఎనమండుగురు జావకలతో వేదపారంగుల నేర్పరుప వలెను. వారు సర్వ లక్షణ సంపన్నులు, మంత్ర విధులు , జితేంద్రియులు కులశీల సంపన్నులైన వారిని కూర్చుండ బెట్టి వలెను. ప్రతి గుంటయందు కలకలు యజ్ఞ సాధనములు, విసనకలు రెండు ఆసనములు, సువిశాలమైన రాగిచెంబు నుంచవలెను. ప్రతి దేవతకు బలు లనేక రంగులలో నీయవలెను. ఆచార్యుడు ఆరత్ని మాత్రము పాలకొమ్మ యూప స్తంభము నిలుపవలెను. ఐశ్వర్యము కోరువాడు యజమాని యెత్తుగల యూపమైన నిలుపవలెను. ఇరువదియైదు మంది ఋత్విజులను గూర్చుండ బెట్టవలెను. సువర్ణాలంకృతములగు కంకణములు, కుండలములు, భుజకీర్తు కటథములు, ఉంగరాలు, పవిత్రములు, వివిధ వస్త్రము లందరికి సమముగ ఆచార్యునకు రెట్టింపుగ నీయవలెను. బంగారు తాబేలు మొసలి వెండి చాప డుండుభము రాగిది, కుంభీరము కప్ప ఇనుపది శీంకుమారకము ఈలా మొదటనే యివన్ని యు సమకూర్చి తెల్లని మాలలు, వస్త్రములు గట్టుకొని తెల్లని గంధములు పూసికొని వేద పారగులు అన్ని మూలికల యుదకములచే స్నానము చేయగా యజమానుడు వత్నితో కొడుకులతో మనుమలతో గలిసి వడమటి ద్వారము నుండి యాగ మండపములోనికి ప్రవేశింపవలెను.

ఐదు రంగుల పిండితో మండలమేర్పరచవలెను. దానికి పదునారు అరలుగల చక్రము విజించి పద్మగర్బుని బ్రహ్మను నాల్గు ముఖములు గలవానిని నాల్గంగుళముల చుట్టు కొలత పై బ్రహ్మ విగ్రహమును తయారు చేసి వేదిక నడుమ నిలువ వలేను. నవ గ్రహములను లోకపాలురను మంత్ర పూర్వకముగ ప్రతిష్టింపవలెను. ఆ మధ్య వరుణ దేవతా మంత్ర పూర్వకముగ కలశ స్థాపన చేయవలెను. బ్రహ్మ, విష్ణు, శివులను ఆ పద్మము రేకులందు ప్రతిష్టింపవలెను. వినాయకుని, అంబికను, కమలము పై లోక శాంతి నిమి త్తము నిలిపి పంచ భూతముల నుంచవలెను. పూలు, పండ్లు, భక్ష్యములతో నీలా ఆధివాసనము చేసి ఆపై యజించుడు (యాగము కావింపుడని) ఋత్విక్కులను గూర్చి పలికి ఆచార్యుని (పురోహితున్ని పూజించవలెను. తూర్పున ఋగ్వేదకుని దక్షిణమున ఋగ్వేద పదములు, సామవేదికులు, ఉత్తర మునం దధర్వణవేదికి ఇద్దరిద్దరిగ నిలుపవలెను. ఉత్తరాభి ముఖంగా యజమానుడు కూర్చుండవలెను. యజింపుడని మరల వారిని గూర్చి యజమాని పలుకవలెను. జావకులను ఉత్కృష్ట మంత్ర జపములు నేయుడనవలెను. ఈలా వారిని ఆదేశించి అగ్నిని బ్రజ్వలింపజేసి నేయి సమిధలను హోమము చేసి ఆహుతితీయవలెను. ఋత్విక్కులు వారుణ మంత్రములతోనే యాజ్య హోమము సేయవలెను. విధి విహితముగ గ్రహములకు, నింద్రునికి ఈశ్వరునికి మరుత్తులకు లోక పాలురకు, విశ్వకర్మకు హోమములు సేసి శాంతి సూక్తము, రుద్ర సూక్తము, మంగళకరమగు పావమానము, పురుష సూక్తము నను వీనిని తూర్పుదిశ బహ్వృచులు (ఋగ్వేదులు) జపింపవలెను. ఇంద్ర సూక్త రౌద్రము, సౌవ్యము, కౌశ్మాండము జాత వేదసము, సౌరసూక్తమును దక్షిణదిక యజుర్వేదులు జపింప వలెను. వైరాజము, పౌరుషము, పురుష సూక్తము) సౌపర్ణము రుద్ర సంహిత, శైవము, పంచనిధనము, గాయత్రము; జ్యేష్ట సామ వామదేవ్యము, బృహత్సామ, గౌరవము, రథంతరము, గోవ్రతం వికీర్ణము , రక్షోమ్నము, యమము నను సామలను సామవేదులు పశ్చిమ ద్వారమందు గానము చేయవలెను. ఉత్తర దిశ యందు అధర్వణవేదులు శాంతి పౌష్టిక సూక్తములను జపింతురు. మనసు వరుణ ప్రభువు పై నుంచి వారు అధర్వణ మంత్రములను జపింప వలెను. ముందు రోజు రాత్రియే యీలా అధివాసనము గావించి గజ, అశ్వ, రథ సంస్పర్శ గల చోటి నుండి, పుట్టల నుండి, గొల్ల పల్లెల నుండి, గోకులము నుండి మన్ను తెచ్చి కడవలందుంచి, ఓషధుల నించి, గోరోచనం, ఆవాల పిండి, గంధములు, గుగ్గులు అను వానిచే పంచ గవ్యముతో కూడ వానికి స్వాపనము చేయవలెను. ముందు యీలా నేసి రాత్రినిలా గడపి తెల్లవారగనే బ్రాహ్మణులకు నూరు గోవులనీయవలెను. ఎనిమిది ఆు ఏబది ముప్పదియాఱు ఇరువదిగాని యీయవచ్చును. ఆవల శుభలగ్న మందు వేద శబ్దములతో సంగీతములతో మంగళ వాద్యముతో బంగారు నగల నలంకరించి గోవును నీట నిలిపి సామవేదికా గోవు నీయవలెను. బంగారు పాత్ర పంచరత్నములతోడ చేకొని యందు మొసళ్ళను చేపలు మొదలయినవానినందునిచి నల్గురు విపులు వేద వేదాంగజులు కలిసి యెత్తి పట్టుకొన్నదానిని మహానదుల జలము లభించిన వానిని పెరుగు అక్షతలనలంకరించిన దానిని ఉత్తరాభిముఖముగా మునిగిపోకుండ జలమధ్యమందుంచి అధర్వణ మంత్రములచే జక్కగ స్నానముగావించీ ఆపోహిషా అను మంత్రముచే మాయాశ క్తి ఆధిష్టానమయిన దానిని నీటిమధ్యనుంచి తిరిగి మండపమునకువచ్చి సదస్యులను పూజించి పూర్తిగ బలి నీయవలెను. తిరిగి దానములు హోమములు నాల్గు నిర్వర్తించవలెను.

నాల్గవరోజు కర్తవ్యముగావించి అక్కడగూడ యథాశక్తి యజ్ఞపాత్రములు యజ్ఞ సాధనములను ఋత్విక్కులకు సరిగా పంచి యీయవలెను. మండపము బంగారు పాత్రలు శయ్యను విప్రునికియవలెను. ఆపై వేయిమంది లేదా ఎనిమిదివందల మందికి, ఏబదిమంది, యిరువదిమంది కై న భోజనము పెట్టవలెను. ఈలా తటాక ప్రతిష్ణావిధి పురాణములందు తెలుపబడినది. నూతులు దిగుడు బావులు పుష్కరిణుల ప్రతిష్టావిధి యీలా కనిపించుచున్నది. ప్రాసాదములందు (రాజప్రాసాదములందు) ఉద్యానవనము లందు మంత్రపూర్వకముగ జేయవలసినదిది. శ క్తి లేనప్పుడు బ్రహ్మ ఏకాగ్ని విధానమట్టు తగ్గించి చేయవచ్చును. గాని లోభత్వము మాత్రము పనికి రాదు. వర్షకాలమందున్న నీరు ఆగ్నిష్టోమములాటిది. శరత్కాలమందు నీరు నాలాటి ఫలమునే యిచ్చును. వాజపేయాలిరాత్రములవంటి హేమంత శిశిరముల నున్న నీరట్టిది. గ్రీష్మమందున్న నీరు ఆశ్వమేధయాగ సమమందురు. అది రాజసూయ ఫలము మించినదందురు. దేశ కారిపాత్రానుసార ము శుద్ధబుద్ధితో జరుపు నాయాధర్మములనంతఫలములనిచ్చును. ఆలా చేసిన పుణ్యాత్ముడు బ్రహ్మలోక మేగి అనేక కల్పములిట నానందించును. స్వర్గాది పుణ్యలోకములెన్నో యంగనలతో ననుభవించి ధర్మపత్నులతో యోగబలమున విష్ణులోకమునందును.

ఇది తటాక ప్రతిష్ట విధియను నిర్వదియేడ - అధ్యాయము.