పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

29 - వ్రతాధ్యాయము

-వ్రతాధ్యాయము

పులస్త్యుడనియె సర్వాభీష్టములిచ్చు సౌభాగ్యశ యనము అను వ్రతమును గూర్చి తెల్పెదను. మున్ను భూర్బువ స్వరాది లోకములందు సర్వభూతముల సౌభాగ్యమొక్కచో నెలవుకొన్నది. అది వైకుంఠ మెల్లజొచ్చి విష్ణువు వక్షస్థలమునందున్న ది. ఆపై కొంతకాలానికి సృష్టి జరుగునెడ, లోక ప్రధాన పురుషునితో కూడ అహంకారావృతమై నంత, బ్రహ్మకు కృష్ణునకు తగవురాగా నగ్ని యందు భయంకరమగు నెఱని యగ్ని జ్వాల లేచెను. దానిచే దపించిన హరియొక్క వక్షస్థలము మంద బ్లీ నిలిచియుండెను, ఆది రస రూపమును (జల రూపమును) బొందలేక జైయుండి సౌభాగ్య రూపమైయున్నంత బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడు దక్షుడు రూపమును లావణ్యను గూర్చు దాని నెత్తి త్రాగినంత నా దక్షప్రజాపతికి బలము తేజస్సు నెంతో కల్గినవి. ఆ త్రాగగా భూమి పై బడినంత నా చినుకు ఎనిమిది భాగములయ్యెను.

దాని నుండి ఓషధులేడు (మూలికలు), సౌభాగ్యమునిచ్చునవి జనించినవి . చెఱుకు, నిష్పావములు, శాలిధాన్యము, పెరుగు, వెన్న మొదలగు రూపముల ఆవుపాలు, కుసుంభముపుప్వు ఎనిమిదవదిగ ఉప్పు నని సౌభాగ్యాష్టకమని పేరు. నెనిమిది వస్తువులు పుట్టినవి. యోగజ్ఞానమేటిగినవాడు బ్రహ్మ కుమారుడు దక్షుడు తాగినందున నాయనకొక కూతురు సతియను పేర నుదయించెను.

లోకములనెల్ల మించిన లాలిత్యము సౌందర్యము) గలదౌట వలన నాక తడే లలితాయను పేరు పెట్టెను. త్రైలోక్య సుందరియగు నాదేవిని పినాకపాణి శంకరుడు వివాహమాడెను. సౌభాగ్య స్వరూపిణిని ఆ దేవిని ఆరాధించి నతడందని సౌభాగ్యమున్నది.

భీష్ముడనియె  మునీశ్వర! ఆ లలితాదేవి యారాధనమెట్లు సేయవలె. జగత్తునకు శాంతి కల్గుటకు విధానమది యానతిమ్మన పులస్త్యుడనియె.

వసంత ఋతువు రాగానే శుక్ల తృతీయ తిథియందు పూర్వాహ్లమున నువ్వులతో స్నానము చేయవలెను. ఆనాడే కదా ఆ దేవీ సుందరి విశ్వాత్మకుడగు శివునిచే పాణిగ్రహణ మంత్రములతో వివాహము చేసికొనబడినది. ఆమెతోగూడ విశ్వేశ్వరు నా తదియ నాడు అర్చింపవలెను. రకరకాల పండ్లతో ధూపదివములతో నైవేద్యములతో నావేళ పూజింపవలెను. ఆ దేవతల ప్రతిమను పంచగవ్యముతో గంధజలములతో ఇందు శేఖరునితో, గూడ గౌరీదే వినభి షేకించి యర్చింపవలెను.

 శ్రీ లలితా చంద్ర శేఖరార్చనము

పాటలాయై నమః (పాదౌ పూజయామి) దేవ్యాః శివస్య పాదౌ పూజయామి అని ప్రారంభించి పాదాదిశిరః పర్యంతము గల విధానమున నర్చింపవలెను.

శివపార్వతుల నిట్లలించి నైవేదము సమర్పించి చైతమున - శృంగాటక ముల భుజించి, ప్రాతఃకోలమున స్నాన మును. జపమును ముగించుకొని శుచిగా ద్విజదంపతులను మాల్య, వస్త్రములతో పూజించి సౌభాగ్యాష్టకముతోని. రెండు బంగారు బొమ్మలను. “లలితా ప్రసన్నురాలవుగాత" యని బ్రాహ్మణునికి దానమివ్వవలెను. ఇట్లు: ఓ రాజా ! సంవత్సర కాలము.ప్రతి తదియ చేయవలెను. ఇక ఆహార , మంత్రవి శేషములను వినుము.

ఆవుకొమ్ము ఉదకము చైత్రమందు, వైశాఖమునందావు పేడ, జ్యేష్ఠమున మందారపువ్వు, ఆషాడ మున మారేడాకు, పెరుగు శ్రావణమున, నభస్యమందు-భాద్రపదమునకుశోదకము, ఆశ్వయుజమున ఆవుపాలు, " కార్తిక మందు పృష దాజ్యము, మార్గశిర మున గోమూత్రము, పుష్యమందు ఆవునెయ్యి, మామమున నల్లనువ్వులు, పాల్గుణమందు పంచగవ్యము ప్రాశనము సేయవలెను. (తినవలెను) లలితా అన్న నామము మొదలు.. ఉమానామ ముదాక. చైత్రాది ఫాల్గుణముదాక దైవ నామములు పండేండు చైతము మొదలు ఫాల్గునము దాక కీర్తించి ధ్యానములు చేయవలెను. . పండ్రెండవ నెలలో ఫాల్గున ములో ద్వాదశినాడు కృష్ణు నర్చింపవలెను. భద్రాసహితముగ నానాడు కృష్ణునితో లక్ష్మి నర్చించ వలెను.

 పూర్ణిమనాడు బ్రహ్మను వత్ని సరస్వతితో పర లోక మం దభయము కోరు జ్ఞాని యర్పింప వలెను. ఆలాగే సౌభాగ్యష్టకము ఐశ్వర్యము కోరువాడు దానమీయవలెను. అవి ఎనిమిది పువ్వులు మల్లీ, ఆశోక ము, కమలము, కదంబము. కడిమి, ఉత్పలము (క లువ), చంపక ము, కుబ్జము, కరవీర ము (గన్నేరు) బాణము-వాడని తామర పువ్వు, సిందు వార మువావిలి అన్ని మాసములందీయదగినదే. జపా=మందారము - కుసుంభము కుసుంబాపుప్వు) మాలతి శతపతీక ఈయవలసినవే. సంవత్సరమంత దొరికినంతవరకు ఉపవాసముండి శ్రీయును పెళ్లి కాని పిల్లయు భక్తి తో నిట్లు శివుని లలితను భక్తితో గొలిచి వ్రతసమాప్తి యందు (ఉద్వాసనలో) సర్వోపస్కరములతో (సాధనసామాగ్రితో కయ్యాదానము చేయవలెను.

ఉమామహేశ్వరుల బంగారు విగ్రహములు, వృషభము, గోవుతో బ్రాహ్మణదానమును వీనిని స్థాపించి శయ్యాదానము సేయవలెను.  నంవత్సర మెల్ల ద్వాదశినాడు కేశవుని మహాలక్ష్మితో, సావిత్రితో  బహ్మను నిలిపి ఈజించి మానవుడెల్ల కోరికల నందును యథాశక్తి మిధునములను దంపతులను వస్త్రాదులచే బూజించీ ధాన్యము ఆలంకారములు= ఆభరణములు. గోవులను మఱియుంగల ధనములను సమర్పించి లోభించక వింతగొనక సమర్పింప వలెను. ఈలా సౌభాగ్యశయనవ్రత మాచరించినతడు సర్వాభీష్టములనందును. శాశ్వతపుణ్యలోకమందును. ఇందు ఫలమేదేనొకటి త్యాగము సేయుటయు చాల మంచిది.

దానిచే యశస్సు కీర్తియునందును. సౌభాగ్యమారోగ్యము సౌందర్యముగొని వస్త్రాలంకార భూషణము లేడవడవక సౌభాగ్యక యనదానము చేసినతడు రంజిల్లును. ఎవడు పండెండేళ్లు లేదా ఏడెనిమిదేండ్లు వ్రతమాచరించినతడు బ్రహ్మలోక మందు చక్కగ పూజింపబడుచు పదివేలకల్పములు . విరాజిల్లును. ఆపై విష్ణులోకము (వైకుంఠము) నంది శివలోకమేగును.

రాజా ! శ్రీ కాని, కుమారి (పెండ్లికానిది) కాని, లలితాదేవి యనుగ్రహలాలితయై యదేఫలమునందును. ఈ వ్రతవిధానము విన్న వాడును నిట బుద్దినర్పించినవాడును విద్యాధరుడై (అమరుడై) స్వర్గలోక మందు చిరనివాసమందును. ఈ సౌభాగ్యవ్రతము సృష్టించినతడు మదనుడు (మన్మథుడు) శతధనుష్కడు నరేశ్వరుడిది యాచరించెను. పవనుడు (వాయుదేవుడు) నందీశ్వరుడునొనరించెను. భీష్మరాజా ! మహాద్భుతముకాదాయిది.

ఇది వ్రతాధ్యాయము అను నిరువదితొమ్మిద - అధ్యాయము.