పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

5 - పార్వతీ ప్రాదుర్భావము

 భీష్ముడిట్లనియె. దక్షకన్య నతీదేవి దేహమేల విడిచినదీ? ఎందులకు రుద్రుడు దక్షయజ్ఞధ్వంనము నేనెను!

గంగాద్వారమందు మున్ను దక్షుడు యజ్ఞమారంభించెను. ఆటకు దేవాసురపితృమహర్షులు ఇందాదులు నాగులు యక్షులు గరుడులు సస్యౌషథులు కశ్యప- ఆతి- పులస్త్య- పులహ క్రతు- ప్రచేత సాంగిరసులు విచ్చేసిరి. వశిష్ఠమహర్షి వేదిని సమచతురస్రముగ నొనరించి చాతుర్ఘత్రమందు బ్రతిష్ఠించెను. గార్హపత్యము ఆహవనీయము. దక్షిణాగ్నియుంగల అండు- వశిష్టుడు హోత ఆంగిరస్సు ఆధ్వర్యుడు బృహస్పతి ఉద్గాత నారదుడు బ్రాహ్మయునైరీ యజ్ఞమునడచుచుండ అగ్నులందు హోమములు జరుగుచుండ అష్టవసువులు ఏకాదశరుదులు ఆశ్వినులు మరుత్తులువదునల్గురు మనువులు నట కేతెంచిరి. ఇట్లయ్యజ్ఞము ప్రవర్తించుచుండ హోమములు జరుగుచుండ కల్యాణి సతీదేవి యందలి విందులను భక్ష్యభోజ్య పదార్ధసమృద్ధిని ఐడియోజనముల వైశాల్యముగల యయ్యజ్ఞశాలను నమ్మహాయజ్ఞవేడింగని యందజతో బరివేష్టించియున్న యింద్రాది దేవతలునుంగాంచి యనున యముదోవ తండ్రియగు దక్ష ప్రజాపతితో నిట్లనియె.

సతి యిట్లనియె. ఐరావతమెక్కి దేవేంద్రుడు శచీదేవితోవచ్చి యిట విడిడిచేసినాడు. ధర్మములో పాపులను శించుచు నధర్మవరులకు ప్రభువు (నిగహించువాడు) రూపౌర్ణయను భార్యతో నీటతేతెంచినాడు. ఉదశములుకు లేడు వరుణుడు లోకభావనుడు ప్రచేతసుడు గౌరి యను పత్నితోవచ్చి యజ్ఞమండపమునం దున్నాడు. యశులందరికి రాజు విళవసుని కుమారుడు ధనేశుడు సహదేవియను దేవితో నేగుదెంచినాడు. నర్వదేవతలకు ముఖమ్ము ఎల్లజీవుల కడుపులో జఠరాగ్నిగ నుండువాడు, ఎవనికై వేదములు పుట్టెనో యా మహానుభావు డగ్ని దయచేసినాడు. నైరృతిమూలకధిపతి గావింప బడిన నీరృతి రాతనరాజింతితో నేతెంచెను. ఈ జగమందాయపు నిచ్చువాడుగా బహ్మచే నిర్మింపబడినవాడు ప్రాణ-అపాణ-వ్యాన-ఉదోననమానములను వేరనున్న వాయువు నలుబదితొంబది మరుత్తుల గణముతోగూడ యీ యజ్ఞముందు వజావతి దేవతగా నశింవబడు వాయుభగవామ రుదెంచినోడు. జగత్తునకు నేతముఅయిపండు గ్రహాధ్యతకుడు ద్వాదశాత్మ (వండెండు మాసములు పండెండు మూర్తం బకాశించువాడు) సత్వగువనపరిపాలకుడు, వేదములకు వరాయణము (తయీమూర్తియన్న మాట) దేవతలకు పరమారసానము) ఆయుర్దాయమునకు దినములకు వరువు సంజ్ఞాదేవితో లోక పావనుడునగు భాస్కరుడిచటి కేలెంటెను. అతివంశజుడు ద్విజులకు రాజు కీర్తి కాలి నేతానంద కరుడు, లోకపతి భూమి పైగల యోషధులకు పంటలకు నధిపతి నక్షతములకు రాజు తారావతి వల్ను లతో (రోహిణితో) శశి (చందుడు) వచ్చినాడు. అష్టవసువులు ఆశ్వినీదేవతలు. వనస్పతి గంధర్వాప్సరోగణములు విద్యాధరులు భూత సంఘములు భేతాళురు యక్షరాక్షసులు భయంకర కర్ములు పాడాపహారులగు భూత ప్రేత పిశాచులు నదులు నదములు సముదద్వీప పర్వతములు గామ్యారణ్య పశుజాతులు ఇంగము=కదలునది నేంగము=కదలనిదయు (చరాచరభూత సంఘము) నర్వమేతెంచినది. కశ్యప-అతి వశిష్ట-పులస్త్యపులహ సనకాది మహర్షులు కర్మయోగనిరతులైన సర్వ వర్ణాశమస్థులు వేయేల బహ్మయొక్క సృష్టి యంతయు నిటకు వచ్చినది. అప్పనెల్లెండ్రు మేనల్లుడు మేనకోడండు బావమరదులు సపుత మీతకళత బాంధవముగా నందరు విచ్చేసిరి. నీ చేయ దానయాన స్వీకారములం దర్పింపబడి నారు. ఆహూతులందఱకు స్వాగతమిచ్చితివి. మర్యాద చేయవలసిన వారందటికి మర్యాదలు చేసితివి. ఇక్కడకు నాస్వామి భగవంతుడాయన యొక్కడే రాడయ్యెను. ఆయన లేనందున నిది యెల్ల నాకు (శూన్యముగ కనిపించుచున్నది. నీవు నాభర్తను బిలువలేదనుకొందును, బహుశ కి మఱచి యుందువు. ఉన్నదున్న ట్లెల్ల నాకు జెప్పుము.

బలశాలి మూర్ఖుడు పండితుడు నన నేయొక్కడలేడు. పాండిత్యము బలము తెలివిననునివెల్ల పూర్వకర్మానుసారము గల్గును. చేసిననుకృతముంబట్టి స్వర్గమునకేగి చిరకాల మచట శోభించి పుణ్యతీపఃపరిపాకముచే నుత్తమ క్షేత్రము లందు (ఉత్త ములయిన తల్లిదండ్రులకు పుట్టి మున్నెట్టపుణ్య వర్ణించికొని రెట్లు ఫలమనుభవింతుర  అని యిట్లు దతుడు వలుక నతీదేవి రోమోరణితలోచనయె నాన్నా ! నా ముండివు పల్కిన డిడియంతయు నింతే. జనమెల్ల తాము చేసిన పుణ్యఫలముగ నైశ్వర్యమునందునన్న వూట ముమ్మాటికీ నిజమే. పుణ్యముచే జన్మము వచ్చును. పుణ్యము వందు భోగములు ప్రతిష్ఠితములు. (భోగములకు పుణ్య మాధారమన్న మాట) అందువలన నీ యీ అల్లుడు జగదీశ్వరుడు సర్వోత్తమముడు. ఈ నీ యజ్ఞమునందు నీవు పిలువగా వచ్చిన యీదేవతలకందరికిని నాయాస్థానము లీ బుద్ధిమంతు డిచ్చినవే. ఆ మహానుతావునీ యుత్ర మలక్షణములను వర్ణింవ, చతుర్ముఖుని నాలుక కూడ చాలదు. బూడిద - యెముకలు పుర్రెలు స్మశానవానము గోనసాదినభాలు ఇవన్నియు నీయనకు భూషణములే. వీథి రహస్య మెవ్వరుం గుర్తించలేరు. కొనియాడలేరు. ఈయన ధాత, విధాతయును. డిపాలకుడు. ఈ రుద్రుని యనుగ్రహమున నింద్రుడు స్వర్గాధిపతియైనాడు. రుద్రునియందు దేవత్వమే యున్నచో శివుడు సర్వాంతర్యామియే యైనచో నానిజముచే నీయజ్ఞము నీక్షణమున శంకరుడు ధ్వంసము చేయుగాక ! నాకేదేని యించుక తపస్సు నేజేసిన ధర్మమునున్న చో నాధర్మఫలముగ నీయజ్ఞము నశింపదగియున్నది. ఆ దేవునికి నేను ప్రియురాలనేని స్వామి నన్ను దరింపజేయగలడేని యా నత్యము జే నీ గర్వమడగుగాక ! అని పలికి యోగమూనీ య్య గాగ్ని చే తననుదాను దేవాసుర నాగగంధర్వప్రథమగణు గుహ్యథాదు లిడియేమి.. యేమని యనుచుండ తనకువానుడేహముంగాలకొనెను.

రుద్రుడు పత్ని గతించిన వార్త విని మీగుల దుఃఖించి దక్షయజ్ఞ ధ్వంసముం జేయనెంచీ ప్రమథగణకోటిని గ్రహముల నాయకత్వమున భూతపేrఓబాదులను యజ్ఞము జెఠప నాజ్ఞను వారేగి యూండలినీ సాశనము నేసిరి. యజ్ఞము చెడ నయ్యెడ, దశపుడు బహము గోల్పడి చేయునదిలేక హడలిపోయి వచ్చి వినాశిని మహాదేవా ! నీవు దేవ ప్రభు వీశ్వరుడనవి. యెఱుంగనైతివి. నీవీ జగత్తునకు ప్రభువవు. అందరు వేల్పులు నీకొడినారు. దయ చూపుము. నీ గణముల మరలింపుము. వేవిధముల వారు నానాభూషణభూషితులు వెక్కురకములగుకోరలు వెదవులుంగలవారు నానావిధాయుధములబూని విజృంభించినారు. ఎక్కురకాల విషసర్పములుం గరచుకొయున్న జటాభారముల శోభించుచున్నారు. దిటవుయై విజృంభించి దర్పముచేనతిమోరులై ఘోరునెల్ల కూల్చుచున్నారు. అందరు కామరూపులు వికృతరూపులు సర్వకామసమృద్దులు అనివార్యబలులు నత్యుగ్రులు యోగబలనములు యోగ మార్గములు జూలును జటలుం గళి కసిగొని పెదపులంగఱచుచు నవ్వుమొగములతో గజేంద్ర గండస్థలాటోపమున గడుడిట్టలై సింహళ రీరులై విజృంభించినారు. కొందరు శత్రుమదవాసనచేదూగుచు దీపమడైరుపెక్కిన కందిన) కునులం జిత్రవిచిత్రవస్త్రములందోల్చి ఘోరతపములొనరించి బ్రహ్మాదులవలన బడసిన వరములచే గడుఉట్టలై సింహ వ్యాఘ భల్లూకముట్టార్పుచు. పులితోళ్ళ గట్టుకొని మెడలో హారముల ట్లున్న పాముల చుట్టలం జందెములుగ గై నేసికొని శూలములు కత్తులుపట్టిసముల (అడకత్తులు) గండ్రగొడ్డళ్ళు ప్రాసములుం (ఈ పెలు) జేకొనిన పరమదుర్ధర్డు లై నగణేశ్వరులచే, గ్రహములచే సూర్యుడ ట్రావర్తింపబడి, దేవదేవా! మహాదేవా! యజ్ఞపురుడు హడలిపోయి, ఇవేడింలో లేడియైడిదివమ్మునకు పాపోయినాడు. శంకరా ! నమస్కారము, శంఖసమప్రభ శరీరా, వందనము.

దేహాపాయ దశలోనున్న దనుడిట్లు స్తుతింవ నీదివ్యస్తోత్రముచే మిక్కిలి యారాధింపబడి రద్రుడు ఓ ప్రజావతీ ! నీకు నీ యజ్ఞఫలము సంపూర్ణముగ నే నిచ్చుచున్నాను. సర్వాభీష్టసిద్ధిని జొండిదను అన నాతడు పరమేశ్వరుని మొక్కి ప్రథమగణము లద్దె చూచుచుండ న్వగృహమునకుం జనెను .

పరమేశ్వరుడును పత్నీవిరహాకవిహ్వలుడే ఆ సతీదేవినే  నా ప్రియురాలా యేటవోయినని తలచికొనుచుండ నారదుడు వచ్చి దేవేశ ! హిమవంతునికి మేనాదేవి యందేవి యవకరించిన, నీప్రాణప్రియ యింకొక మేనుదాల్చినది. ఆ తల్లి వేదవేదార్ధవేదిని యన విని యీశ్వరుడు ధ్యానింత నాథ్యానమందేట్టయెదుట నవతరించిన యా దేవి దర్శించి తాను కృతార్థుడనైతి ననుకొనెను. ఆమె వనము నొడి తిరిగి వరమేశ్వరుని పెండ్లాడినది.

ఇది పద్మపురాణమున సృష్టి ఖండమున దక్షయజ్ఞవిధ్వంస పార్వతీ ప్రాదుర్భావాది వర్ణనమను నైదవ అధ్యాయము.