పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

20 - బహూనాం వ్రతానాం ప్రశంసా

భీష్ముడు పుష్కర క్షేత్ర మధ్య ప్రదేశము. కథ చాల వింతై నది చక్కనిది పాపనాశనమునై న మహిమ. ఇది ఋషులు వర్ణించినారు. చివరి ప్రదేశకథ నెప్పితిరి. ఇచ్చట విష్ణువు పాదము నుంచుట మొద లుగ పుష్కర క్షేత్రము తుది ప్రవేశ కథను సవి స్తరముగా దెలుపుమన పులస్త్యు డనియె:. మునుపు రథంతర కలమందు పుష్పవాహనుడను రోజు లోకప్రసిద్ధుడు. సూర్యుని వంటి తేజస్వి యొకడుండెను. అతని తపస్సుకు సంతుష్టుడే బ్రహ్మ బంగారు తామరపువ్వు ననుగ్రహించెను. కామగవిమానమది యెక్కి యా రాజు సప్త ద్వీపములందు యధేష్టముగ సంచరించెను. ఆ కల్పము ముందది యొక ద్వీపమట్టులె సువిశాలమై పుష్కర ద్వీపమను ప్రసిద్దినందెను. పుష్కరము-తామరపువ్వు. ఆ పుష్పమే యతనికి వాహనమైనందున నతనిని పుష్పవాహనుడని దేవతలు దానవులు పేర్కొనిరి. మూడు లోకములందు తపః ప్రభావమున నా రాజునకు సాటి యెవ్వరు లేరు. ఆతని రాణి లావణ్యవతియను పేర ప్రసిద్దిగని వేలకొలది స్త్రీల వ్రళంలసందినది. పరమేశ్వరునికి పార్వతి యట్లా జేనికెంతేని యిష్టురాలయ్యెను. ఆతనికి పదివేల మంది కొడుకులు గలిగిరందరు పరమ ధర్మాత్ములు, పరమశూరులు. వారింగని యాతడెంతో యాశ్చర్యపడుచుండెను.

ఽకతటి ప్రచేతసుడను మహర్షి యథ్యాగతుడై నంత నతనిం బూజించి యా రాజ తనకు గల్గిన యా విభూతి వైభవమనుపమానము శాశ్వతము దేవమానవుల పూజలందినది సాక్షాత్తు కమల (కమలమందుదయించిన మహాలక్ష్మి) నా ధర్మ పత్ని గృహలక్ష్మినీ నా చేసిన కొలది తపస్సున కే మెచ్చి పర మేష్టి గృహముగ ఇద్మము ననుగ్రహించెను. నా గృహమందు మంత్రం యేనుగులు, రథములు, టపరివారము వందలు కోట్లుగ నా గృహమలంకరింపబడి నిత్య శోభన మైనది. తారాగ్రహ నక్షత్రాదులకు సూర్య చంద్ర కిరణములకు నాకాక సంచారులగు దేవతలకుం గూడ చౌరరానిది యెటు పోయినదో గుర్తింపరాని గగన పధమున స్వేచ్ఛా సంచారము సేయు దివ్య విమాసము నాకిది యెట్లు లభించినది? ఇంకొక తల్లి కడుపునం బుట్టిన మత యే జీవి సేయని ధర్మము నేనేమి చేసితి? నా బిడ్డలు సేసినారా? నా భార్య సేసినదా? ప్రచేతమహర్షిసత్తమ! అనతిమ్మన నమ్ముని జన్మాంతరమున నీవు చేసిన యద్భుత చరిత్రమది దీనికి కారణ మాలింపుమని యమ్ముని యిట్లనుగ్రహించెను.

మునుపొక బోయకులమందు నీకు అతి ఘోర మైన జన్మ కలిగినది. నీ శరీరమంతటా కీళ్ళు సడలి, దుర్గంధము కలదై , గోళ్ళు కలిగినదై యుండెను. నీకు మిత్రుడు, బంధువులు, పుత్రులు, సోదరి, తల్లి ఎవరూ లేకుండిరి. రాజా! అపుడు నీకు ఈ శ్రీ ఎక్కువ ఇష్టమైనదై యుండెను. ఽకప్పుడు ఘోరమైన అనావృష్టి కలుగగా, ఆకలి బాధతో నీవు ఆహారమునకై తిరిగి ఏదీ పొంద లేక ఽక పద్మములతో నిండిన సరస్సును చూచితివి. పద్మములను పెక్కు గ్రహించి అమ్ముటకై విదిశాపురానికి వెళ్ళి దాని నమ్ముటకు పురమంతా తిరిగిననూ ఎవరూ కొనరైరి - నీవు అలసి ఆకలి బాధ చేత పీడింపబడితివి,

 పుష్పవాహనుని పూర్వజన్మ వృత్తాంతము

ఆకలికి బక్కచిక్కి పెండ్లాముతో నొక్కడవు నింటి ముంగిట గూర్చున్నాను. అప్పుడు రాత్రి నీవొక మంగళ ధ్వని విన్నావు. భార్యతో నది వేదిక వినిపించిన చోటి కేగితివి. అచట విష్ణు పూజా మండలము ఆట అనంగవతి యను వేళ్వ ద్వాదశీ వ్రతము చేయుచు మాఘ మాసమున ద్వాదశీ వ్రతము సేసి గురువునకు లవణ పర్వతము. పరుపు, తలగడలు మొదలగు సామగ్రితో శయ్యను దానము చేసెను. బంగారు విష్ణు విగ్రహమును అలంకరించి చక్కగా పూజ నే నేను. ఆమెను జూచి యా బోయదంపతు లిట్లనుకొనిరి. ఈ కమలములతో మన కేమి పని? వీనితో విష్ణువు నలంకరింతమనీ భ క్తిగొని విష్ణువును పూజించి తామర పూలతో శయ్య నేర్పరచి యా ప్రదేశమునం జక్కగా బూజించిరి. అనంగవతి (వేశ్య) యా దంపతుల భ క్తి పూజ చూచి మూడు వందల

బస్తాల ధాన్యము, మూడు బంగారు ఫలములు పండ్ల) నిమ్మని పరివారమున కొజ్ఞ యిచ్చెను. కాని యా దానము నా బోయలు కేవల సత్వగుణ సంపత్తిదే తీసికొనరైరి. పోనిమ్మని యా వేశ్య వారికి భక్ష్య భోజ్య శోష్య పేయ రూపములగు ఆహారము విందు చేసి భుజింపుడని కోరెను. అదియు నా యిద్దరు నీవేళ వదు రేపు తిందుమనిరి. నీ వ్రతము సందర్భములో మేము నుపవాసమున్న చో శుభమగుననిరి. పుట్టినది మొదలు మేమిద్దరము పరమ పాపిష్టులము. దేవీ మహా పుణ్యురాలవు ప్రతనిష్టురాలవు, నీ యింట నీ ప్రసాదమున మా మేను లేశ మాత్రమీ ధర్మము కల్గుగాక అని యా యిద్దరు నా యింట నారాత్రి జాగరణము సేసిరి. వేకువనే యా దంపతులకా వేశ్య ఉప్పు కొండతో శయ్యాదానము గూడ నే సెను. గురువునకు భ క్తితో నొక గ్రామము, బ్రాహ్మణులకు వస్తాలంకార సహితముగ బండెండు గోవులను గూడ దానము నే నేను. కుంటి గ్రుడ్డి వాండ్లతో బీదలతో ఆప్తమిత్ర బంధులతో భోజనము విందు నే నేను. అంతయునైన తరువాత నా దంపతులను పూజించి సాగనం పెను. ఆ బోయవు, ఆ నీ పెండ్లామే యిప్పుడు రాజును రాణియునై పుట్టినారు. పుణ్యాత్ములు తమరు.

విష్ణువును పుష్కర ప్రకరమున (పద్మముల రాశిచే) ఇట్లు పూజించుట వలన నే పాపమెల్ల మోయు నీకి పుష్కరము మందిరమైనది. రాజా ఆ సత్యముయొక్క మహిమ ఆ ఆలోభము (ఆశ లేకపోవుట) అను తపస్సు వలన చతుర్ముఖుడు సంతుష్టుడే నీకి కామగ విమానమును అనుగ్రహించెను. కావున నీవిక పుష్కర క్షేత్రమున నివసింపుము. సత్త్వకల్ప మాశ్రయించి కేవల సత్త్వ గుణ సంపన్నుడవై విభూతీ ద్వాదశి వ్రతము సేయుము. అది చేసితివేని తప్పక మోక్షమందెదవు. అని సెప్పి యమ్ముని యక్కడనే ఆంతర్ధాన మయ్యెను. పుష్పవాహన మహారాజు ముని సెప్పినట్లు నే నెను.

రాజా! ఇది నేసినచో నిక నెన్నడు వ్రతభంగము కలుగనే కలుగదు. సమయము దప్పక పండెండు ద్వాదశి వ్రతములు యధాశ కి నెట్లయిన యీ వ్రతము నిర్వర్తించ వలసినదే.

ఇక విప్రులకు దక్షిణ  జేష్ట పుష్కరమందు వుష్కర క్షేత్రము మొదట గోవులు మధ్యమందు భూదానము కనిష్ట పుష్కరమందు (చీర) బంగారమును దక్షిణగా నీయవలెనని సృృతులున్నవి. మొదటిది బ్రహ్మదేవ రాకము ద్వితీయము వైష్ణవము తృతీయము రుద్ర దేవతాకము. ఈలా త్రిమూర్తులు సంతుష్టినందుదురు. ఇది జనముల పాపములనెడలు పుణ్యకధ భ క్తితో చదివిన విన్న ను జ్ఞానమును బొందును. దానము చేసిన యాగోవు రోమములెన్ని గలవన్ని యేండ్లు దేవలోకమున నివసించును.

ఈ పై నిక వ్రతముల కెల్ల నుత్తమమగు నింకొక వ్రతమానతిత్తును. ఇది మహా పాతకనాశనము రుద్రుడానతిచ్చినదిది. ఽక యేడాది నకవత మాచరించి (రాత్రి మాత్రమే భోజనము సేని) ఽక కుటుంబీకి బ్రాహ్మణునికి గోవుతో బంగారు చక్రము  తికూలము దానమీవలెను. ఇటు సినతడు శివలోక మందును దేవతతమను పేర నిది పర మపుణ్యము . ఒంటిపూజ భోజనము చేసి ఎదలో ఆవునువును వదలవలెను. తిలధేను దానము కూడ చేయవలెను. పుణ్యవ్రతమీది సేసి నతడు శివలోకమందానందించును. ఇది భదవతము భయకములమ హరించును. బంగారు నీలోత్పలము (నల్ల కల్వపూవు) చేయించి పంచదార నింపిన పాత్రతో దానమీయవలెను. ఏడాది రోజు విడిచి రోజు నక్త భోజనము (రాత్రి మాత్రమే భోజనము) సేన వృషభముగూడ దానమిచ్చి నతడు విష్ణులోకమందును. ఆషాఢ పూర్ణిమ మొదలు నాల్గు మాసములు చాతుర్మాస్యము తలంటు మానివేసి భోజన పొత్రము దానము నేసిన విష్ణు భవనమందును, వసంత ఋతువులో పెరుగు పాలు నేయి వదలి (తాను భుజింపక) రసపాత్రముతోగూడ సన్నని వస్త్రములు దానము చేసినచో గౌరీవ్రతమనబడును. ఇవి యిచ్చునపుడు “గౌరిమే ప్రియతామ్" నాయెడల గౌరీదేవి ప్రసన్నురాలగును గావుత అని పలికి యీయవలెను. ఇది నేసిన భవానీ లోకమునందును పుష్యశుద్ధ త్రయోదశినాడు నక్తము నేని బంగారపు ఆశాక పుష్పమును వది యంగుళముల పొడవైన చెఱకు గడతో విప్రునికి వస్త్రముతోగూడ “ప్రద్యుమ్న  ప్రియతామతి” ప్రద్యుమ్నుడు ప్రసన్నుడగుగావుతమని యీయవలెను. ఇది నేసి నతడు విష్ణులోకమందు ఽక కల్పము నివసించి యే తోకములేనివాడై జన్మించును. ఇది కామవ్రతము అను పేరిది. శోక నాశనము - ఆషాఢాది ప్రతమందు చాతుర్మాస్యమందు (నాల్గు నెలలు) ఏ పండుగాని తినక చివర బ్రాహ్మణునికి బెల్లముతోగూడ నేతితోడి బంగారు పాత్రము దానమిచ్చిన ఫాలున శుక్ల తృతీయ నుంచి యొక్క సంవత్సరము ఉప్పును తినగూడదు. సంవత్సరము చివర శయ్యాదానము సర్వసామగ్రితో గృహమును విప్ర దంపతులను బూజించి భవానీ ప్రియతామ్" భవాని (గౌరి) ప్రీతి చెందుగావుతమని యీయవలెను. సౌభాగ్యమను పేరి యీ వ్రతము చేసిన పుణ్వుడు గౌరీలోక మందొక కల్పముండును. మానవుడు సంధ్యవేళల మౌనవ్రతమూని యేడాది చివర నేతి కడవను బట్టలదాపు రెండు వస్త్రములను) తక్కెడ ఘంటను బ్రాహ్మణునకియవలె. పునరావృత్తిలేని తిటిగిరాని) సారస్వత లోకమును (సరస్వతీలోకమును) బొందును. సారస్వత వ్రతమను పేర నిది రూపమును (అందమును) విద్యను యొసంగును.

పంచమి తిథియందు లక్ష్మిదేవినర్చించి యుపవాసముండి యేడాది చివర బంగారము దక్షిణగా బంగారు కమలమీయ వలెను. అటు సేసిన యతడు విష్ణులోక మందును, జన్మ జన్మలకును లక్ష్మి గల్గును. లక్ష్మీవ్రతమనునది దుఃఖశోకవినాశ కము.

శివునిముందు విష్ణువుముందు (దేవాలయములో) అలికి ముగ్గులు వెట్టి యారు మాసాలు పూజించి చివర గోవును జలకుంభమును దానమిచ్చినచో నతడు పదివేలేండ్రు ప్రభువై పైని శివపురమునందును, ఇది ఆయుర్ర్వతము సర్వకామప్రదము.

రావి చెట్టును భాస్కరుని గంగను ఏకాగ్ర మనస్కుడే మొక్కి యొక్క యేడు ఏకభ క్తము సేసి మాత్సర్యము విడిచి సమాప్తియందు బ్రాహ్మణ దంపతులను బూజించి మూడావులతో బంగారు వృక్షమును దానమిచ్చిన యతడు అశ్వమేధము చేసిన ఫలమందును. కీర్తివ్రతమను పేరనిది యైశ్వర్యమును కీర్తిని యిచ్చును.

హరినిగాని హరునిగాని నేతితో నభి షేకము చేసి పూలతో అక్షతలతో చర్చించి గోమయముతో మండలమొనరించి యర్చించి యేడాది చివర బంగారు కమలమును తిలధేనువుతో గలిపి యెనిమిదంగుళాల శూలముతో దానమీయవలెను. ఇది నేసిన శివలోక మందును ఈ దానము సామవేదియగు విప్రునికియవలెను. సామ వ్రతమని ప్రసిద్ధము.

నవమినాడు ఏకథ క్షము సేసి బంగరు జరీ రవికెలు వస్త్రములు బంగారు సింహముద్ర విప్రునికియవలెను. ఇది శివ వ్రతము, ఇది. నేసిన ధన్యుడు.

ఆర్బుదము : జన్మలు అందగాడై శత్రువులకు జయింప వక ముగాక ప్రభువై శోభించును. ఇది వీర వ్రతమను పేర మానవులకు సుఖప్రదము.

చైత్రాదిగ నాలుగు మాసములు దయగొని జలదానము చేయవలెను. వ్రతము చివర అన్నము వస్త్రములతో మణికము (రత్నము) తిలపాత్రను బంగారమును నొసంగవలెను. దీనిచే బ్రహ్మలోకమందును కల్పాంతము దనుక ఐశ్వర్యమిచ్చును. ఇది ఆనందవ్రతమనబడును.

శంకరునికి ఽక్క సంవత్సరము పంచామృత స్నానము గావించి చివర మిరల పంచామృతములతో గూడ గోవును విప్రునికి శంఖముతోనీయవలెను. ఆ పుణ్యుడు అంకర స్థానమందును ఽక్క కల్పమునుండి యా పై భూమి పై ప్రభువాను. ఇది ధృతివ్రతమను పేర విననై నది. మానవుడు హింస వదలి యేడాది చివర గోదానము చేసినచో నిది అహింసా వ్రతము.

 వ్రతము చివర బంగారు వెండిని గోవును దానము చేసిన నతడు ఆశ్వమేధ ఫలమందును ఆహింసా వ్రతమును పేర నిది సేసి నతడు కల్పాంతమునందు ప్రభువగును. వేకువన లేచి స్నానము చేసి దంపతి పూజ చేసి భోజనము పెట్టి యథాశ క్తి పూల మాలల వస్త్రములచే భూషణములచే బూజించిన పుణ్యశిలియొక్క కల్పము సూర్యలోక మందుండును. సూర్య వ్రతమను పేర నిది వినబడినది.

ఆషాడము మొదలు నాల్గు మాసములు ప్రాతఃస్నానము చేసి దంపతులకు భోజనము పెట్టి కార్తీక మాసమందు గోవు నిచ్చిన నతడు విష్ణులోకమందును ఇది వైష్ణవ వ్రతము.

ఒక ఆయనమునుండి యింకొక ఆయనముదాక ఆటు మాసాలు పువ్వు తాకరాదు. నేయి వాడరాదు, ఆమీద గోవుతో పూవులు అన్నము ఘృత ధేనువుతో గలిపి బ్రాహ్మణునికొసగి నతడు శివలోకమేగును. ఇది శీలవ్రతమనబడును. ఇది ఉత్తమ శీలమును ఆరోగ్యమునిచ్చును.

ఽక సంవత్సరము త్రయోదశి తిథియందు పాలు మాత్రము త్రాగి సంవత్సరము చివర పితృ దేవతలకు కొద్దము వెట్టి యైదు పాలిచ్చు గోవులను ఎట్టిరంగు వస్త్రములను జలకుంభములను దానమిచ్చినతడు విష్ణులోక మేగును. పితరుల నూరు తరాల వారినుద్దరించును. కల్పాంతమందు సార్వభౌముడగును, పితృవతమను పేర నీది స్మృతిసిద్ధము.

వత్సరాంతమున దీపమును, చక్రమును, శూలమును, బంగారమును దానమివ్వవలెను విప్రునకు వస్త్రయుగ్మము -కూడా ఇచ్చు నరుడు తేజస్వి యగును.

రుద్రలోకమునూ పొందును. ఇది దీ స్త్రీవ్రతమని పేరొందినది. కార్తీకము మొదలు మూడవ నెలయందు గోమూత్ర మును, యవలద్రవమును త్రావి.

ఒక సంవత్సరము వరకు రాత్రి గడిపి, సంవత్సరము చివర గోవును దానమివ్వవలేను. అడైన కల్పమువరకు గౌరీలోకమున నుండి, తరువాత రాజగును.

ఇది ఎల్లప్పుడూ కల్యాణము కలిగించు రుద్రవ్రతమనునది . గంధానులేపనాన్ని నాలుగు నెలలు వదిలి విప్రునకు ముత్యపు గంధాక్షతలను, శుభ్రవస్త్రములను దానమివ్వవలెను. వరుణ వదమును ప్రాప్తింపజేయు దృడవ్రతమిది.

 వైశాఖమున పూలు, ఉప్పు వదలి గోదానము చేసిన విష్ణుపదమున కల్పము వరకు వుండి రాజగును. కీర్తికామ ఫలములనొసగు ఇది శాంతివ్రతమనబడును . బంగారముతో, తిలరాశిలోనుంచిన బ్రహ్మాండమును చేసి బ్రాహ్మణుని, వహ్నిని సంతర్పించి విప్రదంపతులను మాల్యవస్థ విభూషణాలతో పూజించి యథాశ కి మూడు పలములకు పైన ఉండునట్లు చేసి మంచి రోజున ‘విశ్వాత్మ ప్రీతి చెందుగాత' యని దానమిచ్చిన మోక్షమునందును.

 మోక్షమునిచ్చు ఇది బ్రహ్మవ్రతము  పగలంతా పాలను మాత్రమే స్వీకరించి గోదానమును చేయువాడు పరమ వదమును పొందును. ఇది సువ్రతమనునది.

మూడురోజులు క్షీరమునే గ్రహించి పలముకంటె ఎక్కువ వుండునట్లు బంగారు కల్పవృక్షమును బియ్యంలో వుంచి దానమిచ్చిన బ్రహ్మపదమునొందును. ఇది బ్రహ్మవ్రతము. ఒక నెల ఉపవసించి బ్రాహ్మణునికి అందమైన గోవును దానమిచ్చువాడు విష్ణులోకమునొందును  ఇది భీమవ్రతము. రోజంతా పొలనే స్వీకరించి ఇరువది పలములకంటె పైన వుండునట్లు బంగారు భూమి నిచ్చువాడు రుద్రలోక మునొందును. ధనమునొసగు ఏడువందల కల్పములు వేంటనుండును.

మామ మాసములో లేదా చైత్రమాసములో గుడధేనువును . దానమిచ్చిన గుడవత మనబడునుఁ దీనిచే గౌరీలోక మును పొందును.

 పరమానందమునిచ్చు ఇది మహావ్రతము. పశమురోజులు ఉపవసించి, విప్రుడికి తెల్లని గోవుల రెంటిని దాన మిచ్చిన బ్రహ్మలోకమున దేవాసురులచే పూజనొందును. కల్పాంతమున రాజగును. ఇది ప్రభావ్రతము ప ల మన రాజగును. ఇది ప్రభావతము

ఒక వత్సరము ఒక పూట భోజనమే చేయుచూ తక్ష్యములు, జలముగల కుంభమును దానమిచ్చిన శివలోక మున కల్చమువరకు వుండును. ఇది ప్రాప్తి వ్రతము

 ఆషమిలయందు రాత్రి మాత్రమే భుజించి సంవత్సరం చివర్లో ధేనువును దానమిచ్చువాడు స్వర్గ మును చేరును. ఇది సుగతివ్రత మనబడును. సంవత్సరాది మొదలుగ నాలుగు ఋతువుల యందు-వివుడికి ఇంధనమును దానమిచ్చువాడు, చివర మృతధేనువును దానమిచ్చిన వర బ్రహ్మను పొందును. ఇది ఆన్ని పాపముల నశింప చేయు వైశ్వానర వ్రతము . ఏకాదశిన రాత్రి మాతమే భుజించి సంవత్సరాంతమున సువర్ణ చక్రమును దాన మిచ్చుట కృష్ణ వ్రతము. దీనిచే, విష్ణుపదము లభించుమ. కల్పాంత మున రాజ్యలాభమును కలిగించును.

పాయసమునే భుజించుచూ సంవత్సరాంతమున విప్రునికి రెండు గోవుల దానమిచ్చుట దేవి వ్రతము. దీనిచే కల్ప తొలము లక్ష్మీ లోకమున నివసించును. సప్తమియందు రాత్రి మాత్రమే భుజించుచూ సంవత్సరము గడిపి చివర పాలిచ్చు గోవును దానమిచ్చుట భానువ్రతము. దీనిచే సూర్యలోకము లభించును.

 హేమంతమున చతుర్ధియందు రాత్రి మాత్రమే భుజించి, రెండు గోవుల దానమిచ్చుట వై నాయక వ్రతము. దీనీచే శివలోక ము లభించును. చాతుర్మాస్యమున మహాఫలముల వదలి హేమంతమున రెండు గోవులను, కార్తికమున. బంగారుపళ్ళను.

దానమిచ్చుట సౌర వ్రతము. దీనిచే సూర్యలోకము ప్రాప్తించును. ద్వాదశ ద్వాదశిలు. ఉపవాసము చేసి యథాశక్తి ! బాహ్మణుని గోవు, వస్త్రములు, కొంచనములచేత పూజించుట విమువ్రతము. దీనిచే వరమపదము నొందును. చతుర్దశినాడు రాత్రి మాత్రమే భుజించి, సంవత్సరం చివరలో గోవుల రెంటిని దానమిచ్చుట శ్రియంబిక వ్రతము. దీనిచే శివవదము ప్రాప్తించును.

 ఏడురాత్రు లుపవసించి విపునికి మృత కుంఠమును దానమిచ్చుట వరవ్రతము. దీనినే బ్రహ్మలోకము లభించును. కాశీలో గోవును దానమిచ్చుట మంత్రవ్రతము. దీనిచే ఇంద్రలోకము లభించును. ముఖవాసమును విడిచి సంవత్సరాంతమున గోదానమిచ్చుట హరుణ వ్రతము. దీనిచే వరుణ లోకము లభించును. చాంద్రాయణమాచరించి బంగారు చందుని దానమిచ్చుట చంద్రవ్రతము. దీనిచే చంద్రలోకము లభించును.

జ్యేష్ఠమాసమున ఆయిదగ్నులమధ్య నిలిచి సంవత్సరం చివరలో బంగారు గోవును దానమిచ్చుట రుద్రవ్రతము. దీనిచే స్వర్గము నొందును. తృతీయనాడు శివాలయమున ఒక్కమారైన విధిపూర్వకముగా పూజించి సమా పినాడు ధేనువును దానమిచ్చుట భవానీవ్రత మనబడును. మాఘమున రాత్రి తడిబట్టలు ధరిస్తూ సప్తమిన గోవును దాన మిచ్చుట పవన వ్రతము. దీనిచే కల్పము స్వర్గమున ఉండి చివర రాజగును.

మూడురాతు లుపవసించి ఫాల్గునమున శుభమగు ధనమును దానమిచ్చుట ధామవ్రతము. దీనిచే ఆదిత్యలోక ము నొందును- ఉపవసిస్తూ మూడు సంధ్యలు విప్రదంపతులను విభూషణములతో పూజించి దానమిచ్చుట మోక్షవ్రతము. దీనినే మోక్షము లభించును. కక్ష విదియనాడు ఉప్పు పాత్రను, గోవును విప్రుడికి దానమిచ్చువాడు శివమందిరము నొందును.

 వస్త్రము, దక్షిణ. వుండునట్లు కంచు పాత్రను దానమిచ్చుటచే, చివర గోదానముచే శివమందిరము నేగును. ఇది సోమవ్రతము. దీనిచే కల్పాంతమున రాజరాజగును. పాడ్యమినాడు ఒక్కపట భుజించి దానమిచ్చుట శిలివ్రతము. దీనినే వైశ్వానర పదము నొందును. రెండు గుర్రాలలోనున్న రథమును రెండు వరిములకంటే ఎక్కువ బంగారముతో చేయించి, ఉపవసించి దానమిచ్చినవాడు నూరు కల్పములు స్వర్గమున నుండును. చివర . రాజరాజగుమ. ఇది, ఆశ్వవతమనబడును. అట్లే రెండు ఏనుగులతో బంగారు రథమును చేయించి దానమిచ్చుట కరివ్రతము. దీనినే వేయి కల్పములు సత్యలోకముననుండి భూమికి వచ్చిననూ రాజగును. దశమినాడు ఒక్కపూట భుజించి సమాప్తికాగా పదిగోవుల దానమిచ్చుట, బంగారు దీవమును దానమిచ్చుట విశ్వవతము, బ్రహ్మాండాధిపతి యగును. కార్తీక పుష్కర మున కన్యాదానము చేయువాడు ఇరువదియొక గుణములు కలిగి బ్రహ్మలోకమును చేరును.

కన్యాదానముకంటే గొప్పదానము మరొకటి లేదు. విశేషముగా కార్తీక మాసాన, పుష్కరమున కన్యాదానము మిక్కిలి ప్రశ స్తము విప్రులకు విధిపూర్వకముగా దానమిచ్చువారికి అక్షయలోకము కలుగును. నువ్వుల పిండితో ఏనుగును చేసి రత్నములతోసహా నీటి మధ్యలో నిలిచి విపునికి ఇచ్చువారికి ప్రళయమువరకు ఆక్షయలోకము కలుగును.

 ద్విజులు తప్పక సేయవలసిన ధర్మములు

ఈ వ్రత పుష్టిని సంపదను ఎవ్వడు చదువునో, వినునో అతడు నూరు మన్వంతరములు గందర్వ లోకాధిపతియగును. విశ్వప్రసిద్ధమైన ఈ పుష్టివ్రతము పరమ పుణ్యము భార! భీష్మా చార్యా నీకిపుడు తెల్పితిని. ఇక వినవలేననుకోరిక గలదేని ద్విజులకు ఆపశ్యకరణీయ ధర్మముల దెలి పెదనాలింపుము.

 అవశ్యాచరణీయాః ధర్మా

శరీర శ్శుద్ధి మనశుద్దియు, స్నానము సేయక, కలుగవు. ఆందుచే స్నానము, మొట్ట మొదట . విధింపబడినది. నదీ ప్రముఖ ప్రవాహములందు స్నానము సేయవలెను. అనుద్దృత జలము= తోడుకొనకుండ వచ్చు నీరు ప్రశ సము. తెలిసిన మంత్ర వేత మూల మంత్రముతో తీర్థమును మొదట:కల్పించుకొనవలెను. 'ఓనమో నారాయణాయ" అనునది "మూలమంత్రము. దర్శచేత ధరించి శుచియై నియమ మూని యాచమనము చేయవలెను. నాల్గుమూరల మేర చతురస్రముగ ,నలు చదర ముగ) యొక హద్దు వేర్పరచి ఈ క్రింది మంత్రములతో గంగను ఆవాహనము చేయవలెను. ఆ మంత్రములు -- మూలము

విష్ణుపాదమునం బుట్టితివి వైష్ణవివి. విష్ణుపు నీ దేవత. కావున పుట్టినదాది చివర దాక మమ్ము పాపముల నుండి రక్షింపుమమ్మ ! ముప్పదిన్నరకోట్లు తీర్థ ములు భూమి పై నాక సమందంతరిక్షమున గలవని వాయుదేవుడు నెప్పెను. జాహ్నవి నందిని నలిని యనునవి దేవతలందు నీ పేర్లు ప్రసిద్దములు. . దక్ష పృథ్వి కుభగ విశ్వకాయ శివసిత విద్యాధరి సుప్రసన్న లోక ప్రసాదిని యమ నీ పుణ్య నామములు స్నానమందు కీర్తింపవలేను. ఆనుడు త్రిపథగామీని {భూమీ, ఆకాశము పాతాళము లందు ప్రవహించునది) యేడుసార్లు కరసంపుట మొనరించి చూపించినంత సన్నిధీ దయ నేయును. ఆ మీద మూడు నాలు శందు ఏడు మారులు ఆయా మంతముల లెక్క ననుసరించి జలమును నడి నెత్తిన జల్లుకొనవలెను. ఆ పైని మృత్తిక (మన్ను) చే వి .

 ఆశ్వక్రాంతా! రథక్రాంతా! విష్ణుక్రాంతా! వసుంధరా! మృ త్రికా! నా పాపము హరింపుము నా చేసిన చెడుపనిని హరింపుము. వరాహమూర్తి విష్ణువు నూరు బాహువులుగల వానిచే మున్ను నీ వుద్దరింపబడితివి. సర్వలోకములు పుట్టుటకు ఆరణివి (అగ్నికి మేడియట్లు) సువ్రతవు నీవు అను నీ భావముగల యీ మంత్రములచే స్నానము చేసి యా పైని యథావిధిని ఆచ మనము సేసి మడిబట్టల గట్టుకొని ఆపై త్రైలోక్య మా ప్యాయనముకొరకు దేవర్షి పితృ తర్పణము చేయవలెను. ఆ వరుస యెట్లన ; బ్రహ్మ విష్ణువు రుద్రుడు ప్రజాపతి దేవతలు యక్షులు నాగులు గంధర్వులు అప్సరోగణము క్రూర సర్పములు (నాగులు) సుపర్ణులు తరువులు జంభకాదులు విద్యాధరులు జలధరులు ఆకాశ గాములు (ఆకాశ సంచారులు) నిరాధారులు పాపరతులు ధర్మ పరులునై న జీవులు కూడ ఆప్యాయన మునకిదిగో నేను నీరు వదలుచున్నాను. అని మంత్రము. పఠించి తర్పణము సేయ పలేను.

దేవతలకు ఉపవీతముగను, మనుష్యులకు (ఋషులను) నివీతిగను భక్తితో సేయవలెను.

 మనుష్యులలో  చేదువారు ఋషులు ఋషిపత్రులు సనకుడు. సనండడు సనాతనుడు కపిలుడు ఆసరి. వోర పంచశిరుడు వీరందరు నేప్పుడు నా యిచ్చిన యుదకముచే దృష్టి నండదురుగాక. మరీచి అంగిరస్సు పులస్త్యుడు పులహుడు క్రతువు ప్రచేతనుడు వశిష్ఠుడు భృగువు నారదుడు మొదలగు నందరిని పేర్కొని యందరు తృప్తులగుదురు. ఈలా దేవ బ్రహ్మర్షుల సందరను నక్షతలతోడి జలములచే --తర్పణము చేయవలెను.

ఆమీద అపసవ్యముగా (ప్రాచీనావీతిగా) మోకాలు నేలకానించి ఆగ్నీష్పాత్తులు సౌమ్యులు హవిష్మంతులు ఊష్మపులు సుకాలినులు బర్హిషదులు ఆద్యపులు మొదలగు పితృదేవతలను భక్తి తో నువ్వులు, చందనముతోడి జలముతో తర్పణము సేయవలెను.

ఆ మీద మన పితరులను ప్రాచీనావీతిగానే పితృపితామహాది వళమును వరుసగా నామగోతాదులను పేర్కొని మాతామహవర్గమును, ఈ జన్మమున బంధువులు వాటి యితర జన్మములందు బంధువులైన వారందరు తృప్తి నందుదురుగాక. నాయిచ్చు నుదకము కాక్షించు సంద రికి తృప్తి గల్గు గాక యని యక్షతలతో భూతలమునందేనిచ్చు నీ యుదకములచే దృప్తి సెం దుదురు గావు త మని తర్పణము భకి తో నొనరింపవలె.

పితృతర్పణమయిన తరువాత ఆచమనము చేసి ముందు యథావిధిని పద్మమును లిఖింపవలెను. ఆపై పలు ఆవతలు నువ్వులు రక్త చందనముతో సూర్యనామములు నెప్పుచు సూర్యుని కర్ఘ్యమీయపలెను. ఆ పై విశ్వరూప ఆనునది మొదలు ప్రభాకర అనుదాక సూర్య నామములు పేర్కొనీ సూర్యభగవానునికి నమస్కరించి మూడుసార్లు ప్రదక్షిణము సేసి బ్రాహ్మణుని గోవును బంగారమును జూచి చేతదాకి యింటికి వెళ్ళవలయును. తన యింట సూర్యభగవానుని ప్రతిమనుగూడ ఈజింప వలెను. అటు తరువాత బ్రాహ్మణులు భోజనము చేసిన పిమ్మట . భోజనము చేయవలెను. ఈ విధిచేత ఋషులందరు సిద్ధిని పొందిరి.

ఇది శ్రీ పద్మపురాణమున మొదటిసృష్టిఖండమందు స్నానవిధియను ఇరువదియవ అధ్యాయము.

ఆయా నామములతో పాదాది నమః సర్వాత్మనే యన్న దాక శిరస్సు దాక ప్రత్యంగ పూజ చేయవలెను. ( ఇట మూలము చూడుడు.) ఈలా గోవిందుని గంధ, పుష్ప మాల్యధూపదీప నైవేదాదు. లచే దర్చించి యవలమండల మేర్పరచి మన్నుతో నలుచదరముగా ఆరత్ని మాతముగ ఉ తరపువే పు పలముగా సరుగు నేర్పరుపవలేను. ఆది యంతో సాపుగా నందముగా మూడువై పుల వకములు మూడంగుళముల యెత్తు మూడు తీగె లేర్ప రుపవలెను. వాని వైశాల్యము రెండంగుళము లుండవలెను. ఆ సండలము (అరుగు) మీద గోడ ఎనిమిది అంగుళము లెత్తుండ పలేను. నదీలోని యిసుక తో సూర్యునియందు లక్ష్మి విగ్రహము నుంచవలెను. సూర్యుని మధ్యనున్న లక్ష్మి ని తెలిసినవా డర్పించవలెను.  ఆయర్చన న మోదేవ్యే అన్న నామము దగ్గర నుంచి సర్వసిద్ధియేదాకా శ్లోక రూపమగు నీ మంత్రములు చదివి పూజ సేయవలెను. ఆపై శుభవస్త్రములు సూర్యునికి గప్పి పండ్లతో నానాథన్యములతో బంగారు కమలముతో పూజింపవలెను. వెండి గిన్నెలలో దర్బోధక ము నుంచవలెను. ఆ పైని నృత్య గీతాది మేళనము చేయవలెను. మూడుజాములైన తరువాతలేచి బాహ్మణ వీధునము లను బూజింప వలెను, శక్తినిబట్టి యొకటి మొదలు ముగ్గురు దంపతులను పస్తమాల్యగంధాదులచే శయనమందుంచి పూజింపవలెను. నమోస్తు జల శాయినే జలమునం బరుండు స్వామికి నమస్కారమనియూ పూజ సేయ వలెను. అవ్వల నృత్యగితవాద్యాదులతో రాత్రి జాగరణము చేసి ప్రభాత మందు వేకువను. స్నానము చేసి దంపతిపూజ నేయవలెను. యధాశక్తి డబ్బులోభముగొనక వారికి భోజనముం బెట్టవలెను. భక్తితో పురాణములను విని . యారోజు గడుపవలేను. ఈ విధానముతో ప్రతి మాసము యొక్క సంవత్సరము వ్రతమాచరింపవలేను.

వ్రతోద్యాపనమందు గుడధేనువుతో చక్కని పరుపు పక్క తలగడలతో శయ్యాదానము చేయవలెను. లక్ష్మి ప్రభుత్వము నన్ను వదలిపోనట్లు అలాగే చక్కని రూపురేఖలు ఆరోగ్య మశోకము గూడ నాకెప్పుడు నుండుగాక. దేవునితో గాకుండ లక్ష్మి యెట్లు జయశాలిని యెప్పుడు గాదో, ఆలా నాకు నిరతమక తృణము విష్ణువందు పరమభక్తి యుండుగాక అను యథా లక్ష్మీ ! అను శ్లోకము మొదలు భక్తిరస్ర్యచ కేక వే రెండు శ్లోకముల రూపమున నున్న నీ మంత్రము  నెప్పి గుడ ధేనువుతో శయ్యా దానమును లక్ష్మితో గూడిన సూర్య విగ్రహమును యైశ్వర్యముకోరువాడు దానమీయవలెను. వాడని కలువలు కర వీర పువ్వులు, కుంకుమ పువ్వు, మొగిలి, సిందూరము (వాలివి), మల్లి, గులాబి, కదంబము, కడిమి, కుబ్జకము, జాజీ యను పూవులివ్వి ప్రశస్తములు ఎప్పుడూ దానమీయ వలసినవి.

భీష్ముడనియె  గుడ ధేనుదానవిధానమానతిమ్ము మునీశ్వరా! గుడధేను స్వరూపమేమి? ఏ మంత్రముతో  ఏది యీయవలె నిట వాకొనుము. అన పులుస్తుండనియె :

 గుడ ధేను దానము

వులస్త్య ఉవాచ  

నాల్గు మూరల కృష్ణాజినము తూర్పు మెడగా భూమి పై బరువవలెను. ఆ భూమి ముందు ఆవు పేడతో నలికి దర్భలు వరచి, పలుచని లేడి చర్మము పరచి, దూడను గూర్చి తూర్పు మొగంగా మట్టతోనట్లు నాల్గు మణగుల బెల్లముతో ఆవును దూడను కూర్చవలెను. దూడ నొక్క మణుగుతో, నాల్గు మణుగులతో జేసినది ఉత్తమము. రెండు మణుగులతోడి మధ్యమము, అర్ధ భారము (మణుగులో సగము దూడ) ఒక్క మణుగుతోడిది కనిష్టము (ఆఖరు రకము) నాలగవ వంతు బెల్లముతో కూడ ఆ దూడను ఆవును యథాశక్తి నేర్పరుపనగును. వానికి పలుచని వస్త్రములు కప్పవలెను.

ముత్యపుచిప్పలు చెప్పులు, చెఱకుగడలు పాదములు, తెల్లని  ముత్యాలు కన్నులు, తెల్లని దారాలు సిరులు పేగులు, తెల్ల కంబళలు కంటపం, రాగితో చేసిన చెక్కిళ్ళు వృష్టగములు కభిషి తెల్లని ఏలికానుకలను రానములు, దవడముల కను బొమలు వెన్న పొదుగులు, బంగారపు కన్నులు, ఇంద్రనీల మణులు కనురెప్పలు, పట్టుబట్ట తోకలు, కంచుచెంబు, పాలచెంబు, తెల్లనివి, చక్కనివి బంగారపు కొమ్ములు, వెండి డెక్కలుగా ఆవును దూడను బొమ్మలుగా తయారు చేయవలెను. ఆ పైని రకరకాల పండ్లు, మంచి గంధము లత్తరులు నింపిన కరండకములు.

ఈలా పూజా సామగ్రి యేర్పరచి దూపదీపాదులచే నర్చించవలెను. సర్వ భూతముల లక్ష్మి యెవరో యే దేవి సర్వ దేవతలందున్నదో ఆ తల్లి గోవు రూపమున నా పాపమును పోగొట్టు గావుత. విష్ణు వక్షస్థలము లక్ష్మిగా, యగ్నియందు స్వాహా దేవిగా, చంద్ర సూర్యుల ఇంద్రుని యొక్క శక్తియే గోవు. ఆ ఆవు నాకు వరములిచ్చు గావుత. పితృదేవతలకీవు స్వధా దేవివి, యజ్ఞములందు హవిస్సు లారగించు దేవతలకు స్వాహా దేవివి నీవే కావున గోమాతో నా ఐశ్వర్యమును నా కనుగ్రహింపుము. అని యీ విధముగా గో పూజా విధానము దాన విధానము పురాణములందు జదువబడి యున్నది. పాపములెల్ల పోనడచునవి దశ ధేనువులు చెప్పబడినవి. వాని స్వరూపమును, వాని పేర్లను జెప్పెద రాజా! వినుము.

1. గుడ ధేనువు, 2. దృత ధేనువు, 3. తిల ధేనువు, 4. జలధేనువు, 5. క్షీర ధేనువు, 6. మధు (తేనె) ధేనువు 7. శర్కరా (పంచదార) ధేనువు, 8. దధి ధేనువు, 9. రస ధేనువు, 10. కేవలము ఆవు. కొందరిట సువర్ణ ధేనువును గూడ యిష్టపడుదురు. వెన్న, నువ్వులతోడి ధేనువును మరి కొందరు ఋషలభిలషించిరి. అన్నిటికి నిదే పూజా విధానము. ఇదే పూజా సామాగ్రిని స్మృతులు నెప్పినవి. ప్రతి పర్వమందు మంత్ర పూర్వకముగా ఆవాహనము చేసి పితృదేవతలకు జరువు శ్రాద్దమట్లు, యీ గోవు తీయవలసినవి. ఇవి భుక్తిని, ముక్తిని గూడ యిచ్చును.

భీష్మ ఉవాచ  

గుడ ధేనువు వ్రశ క్తిలోనే నీ యెల్ల ధేనువులను గూర్చి చెప్పితిని. ఇవన్ని ధేనువులును సర్వయజ్ఞ ఫలమునిచ్చును. సర్వ పాప హరములు, శుభములు. విశోక ద్వాదశి వ్రతము సర్వోత్తమ మగుటచే నా ప్రసంగమున నిట గుడ ధేను దానము గడు ప్రశస్తం. ఉత్తర దక్షిణాయన పుణ్యకాలములందు విషువమందు రాత్రి పగలు సమ ప్రమాణములో నున్న వేళ విషవమందురు. విషువత్తు అని యనవచ్చును. వ్యతీపాతయందు ఆపరాగములందు గుడ ధన్వాదులివి యన్ని యు నీయదగినది. ఈ విశోక ద్వాదశి గూడ సర్వ పాపహరము. శుభకరము, ఇందుపవాసమున్న మానవుడా విష్ణు పరమపదమందును మరణమువేళ హరిసరము సేసిన ధన్యుడు. విష్ణువు పురమునకు (వైకుంఠము) ఏగును. ధర్మవిదుడాతడు నూట ఎనిమిది వేల ఆర్బుదముల కాలము ఈ లోకము సౌభాగ్యము ఆయుర్ధాయంతో . ఆరోగ్యము , నందుమ. వానీ శోకము దుర్గతి గలుగవు. శ్రీయైన నృత్య గీతాదులతో నీవు ప్రత మాచరించిన నదేఫలమందును. విష్ణువు ముందు నృత్యము గీత వాదనము పాట పాడిన అనంతమగును. ఒకమాటు సేసినను అనంత ఫలమిచ్చును. నే నిట్లు మధు - ముర - నరక + ఆరి : మధువు - మరుడు - నరకుడను ముగ్గురకు శత్రువైన హరి చరిత్రమును ఎవ్వడు శ్రద్దగా వినునో ఆ దేవుని ఆర్చనము గనునో, జనులందరికీ యాలోచన నిచ్చునో అతడు ఇంద్రలోక మున (స్వర్గమందు) ఒక్క కల్పకాలము నివసించును. దేవతా సంఘములచే పూజింపబడును.

భీష్ముడు, భగవంతుడా పరలోకమున దేవతలు ఋషులు పూజించునది ఆశయమగునదియు, నైన యు తమ దాన మాహాత్మ్యమాలింప గోరెదను. అన పులస్తుడిట్లనియె. రాజోత్తమ! పది విధములైన “మేరు దానము” ను గూర్చి చెప్పెదను. ఆవి యిచ్చినతడు దేవతలు పూజించు పుణ్యలోకములందును. ఈ నేను జెప్పిన దానములను గురించి చదివిననూ విన్న నూ ఆచరించిననూ గలుగుఫలము పురాణములందు వేదములందు యజ్ఞములందు. దేవాలయములం దెందును లేదు. అందుచే నీ పర్వత దానమును గూర్చి. ముచ్చటింతును.

ధ్యానశైలము  లవణ  గుడఁబెల్లము ఆ బంగారు నువ్వులు  ప్రత్తి  నెయ్యి  రత్నము  వెండి  శర్కరాచలము  పంచదారకొండ, వీనిని దానము చేయు విధానము వరుసగా జెప్పెద. అయనమందు విషువత్తు నందు పుష్యమాసమందు వ్యతీపాతయందు దినయమందు శుక్లపక్ష తృతీయమందు ఉపరాగమందు చంద్ర క్షయం తిథియందు వివాహమందు ఉత్సవమందు యజ్ఞములందు ద్వాదశియందు శుక్లపక్ష పూర్ణి మయందు శుభ నక్షత్రమందు ధాన్య శైలాది దానములు నేయవలెను. జ్యేష్ట పుష్కరమందు కార్తిక మాసమందు చేయవలెను. తీర్తములందు దేవాలయములందు గోళాలలో తన యింటి ముంగిట గాని భక్తితో మండపము నలు చదరముగ నుత్తరాభి ముఖముగా వేయవలెను. ఈశాన్య దిశ గా నైన కేవలము తూర్పు ముఖముగా నై నను మంచిదే. ఆపు పేడతో నలికిన యా మండపమున రూమిపై దర్భలు వరచి ఆ నడుమ పర్వతముతోడి విష్కంభము నుంచవలెను, ఇచట వేయి ద్రోణముల ధాన్యము ప్రోవు పర్వతాకారమున నుంచుట ఉత్తమ పశము. అయిదువందలు మధ్యమము మూడు వందలు కనిష్టము. మధ్య మూడు బంగారు వృక్షములతో మహాప్రీపా (వేదవడు అను నొక రకము ధాన్యము) తో మేరువు నా మండపము మధ్య నేర్పరుపవలెను. ఆకసమందై నను. మీదుగా నైనను అది వేయవచ్చును. ఆ పర్వత మునకు మీదుగా నాలుగు శిఖరములు వెండివి కొండకు పిటిదియందు వెనుక భాగము నిల్పవలేను. అందు తూర్పు దానికి ముత్యాలు వజ్రము, దక్షిణ శిఖరమును గోమేదము పద్మరాగము పడమట గరుడ నీలము ఉత్తరమున వైడూర్య పుష్పరాగములు రత్నములు పొదుగవలెను. చందనము చెక్కలచేత పవడములచే పూల తీగలతో ముత్యాల వేదిక యేర్పఱుపవలెను.

తగవంతులు బ్రహ్మ విష్ణువు శివుడు సూర్యుడు నను బంగారుమూర్తులనిట ప్రతిష్ఠించవలెను. నలుదెసల చెఱకులు వెదుళ్ళ ఆవరణ మేర్పరచి నేయి, ఆభి షేకోదకము జాలువారుటకు దారులేర్పరుపవలెను. తూర్పుదేస దక్షిణ దెస తెల్లని వస్త్రములు మేమం కిగాను వడమటిదేస కర్పూరములు (రంగుల) ఉత్తరపు వైవు ఎల్లనివి వస్త్రములు మేఘవర క్రిగా నేర్పరుపవలెను. వరుసగా ఇంద్రాది డిక్పాలురెనమండుగురను వెండి ప్రతిమలను నిలువవలేను. చుట్టునంతట నానావనముల వరుసలు అందములైన లమాలలు రంగురంగుల గంధపు పూతమీద తెల్లని వస్త్రముపై పూలతో నేర్పరచిన పంచవర్ణ వితానకము (అయిదు రంగుల చాందిని) ఈలా మొట్లమొదలు మేరుగిరిని నేర్పఱచి దానికి విష్కంథ పర్వతములను దానికి నాలుగవవంతు ప్రమాణములో నలుదెసల నిలిపి చక్కగ రంగు రంగులు పూసి తూర్పు బంగారు మందర పర్వతము నేర్పరుపవలెను. 

 దక్షిణ దిశ గంధమాదనము అను వర్వతము గోధుమలతో కలధౌతము (బంగారము చేర్చి యేర్పరుపవలెను. బంగారము తో మానసాచలమను కొండను చేతగొనిన యక్షేశ్వరుని ప్రతిమ నతినిలువన చుట్టు వెండితో చేసిన వనములు ప్రతిమలు నిలుపవలేను. ఆ మీదిది తిలపర్వతము అనేక సుగంధ పుష్పములతో బంగరు రావి యాకులు బంగారు హంసలతో వెండిపూల వనముతో వస్త్రము పెరుగు తెల్లని నీటి సరసు గోవును నిలిపి మినుముతోనైన కొండను వస్త్రముతో పూలతో బంగారప వృక్షమును పైగా నిలిపి బంగారపు జెండా యేర్పరచి యా ప్రతిమను రూపొందించవలెను. తేనెతోడి మంగళ సరస్సు వనముతో వెండి జెండా లతో నలంకరింపవలెను. వేద పురాణములు తెలిసిన ఉత్తమ చరిత్ర రూపురేఖలు కలవారి నల్గురు బ్రాహ్మణములచే హోమము సేయింపవలెను. వారు తూర్పుగా ఒక్క వైశాల్యముగల కొండ యేర్పరచి నువ్వులు నేయి సమిధలు కుశలతో హోమములు చేసి రాత్రి జాగరణము సేయవలెను.

ఆచరణలో ఆలోచనలో నేలాటి తొందరపాటులేక వారా పై చేయవలసిన పర్వతముల ఆవాహనము రీతి సెప్పెదను. ఓ తిలపర్వతమూర్తీ! సర్వదేవతా సంమము భాగ్యనిధివి మా యింటి జరుగునే దేని విరుద్దమును (కష్టమును) ఓ దేవమూర్తీ! వెంటనే వారింపుము. క్షేమము నొనరింపుము. పరమశాంతి నలరింపుము. ఎంతో భక్తితో నిన్ను పూజించుచున్నాను. భగవంతుడివే యీశ్వరుడవు బ్రహ్మ విష్ణు సూర్య స్వరూపుడవు, లోకపాలుర, సారము (మూర్తము) నీరాకారము (అమూర్తము) నైనవాడవు వసు రుద్రాదిత్యులకు విశ్వమూ ర్తివి నీవు మందిరమగు స్థానమవు. అందువలన తననుగ్రహించు నాకు. నీ శిరసు నందమరులు నమరులు. నెప్పుడుండకపోరు. పారీకది యాధారము. కావున నన్ను సంసార సాగరమునుండి యుద్ధరింపుము అని యిలా ఆ మేరువును మందర పర్వతమును పూజింవవలెను. ఓ మందర పర్వతమూర్తీ! నీవు చైత్రరధునితో భద్రాశ్వ పర్వత రాజముతో నెల్లపుడు శోభిల్లుదువు గావున వెనువెంటనే సంతోషము కూర్పుము.

జంబూ ద్వీపమందు వీవు చూడామణివి (శిరోరత్నమవు) గంధమాదనా! గంధర్వ సంఘముతో నెల్లపుడు శోభింతువు. నీవలన నాకు కీర్తి (పేరు ప్రతిష్టలు) కలుగుగాక! కేతుమాలునితో వైభ్రాజ వనముతో బంగారు గనుల శోభ గలవాడవు గావున నీ వలన నా కెల్లపుడు సంతుష్టి కలుగుగాక! ఉత్తర కురువులతో సావిత్ర వనముతో (సూర్యదేవతాకమయిన వనము) రాణించు చుందువు. సుపార్శ్వ పర్వత ప్రభూ! నా యైశ్వర్య మక్షయమగునుగావుత! ఈలా ఆ పర్వతమూర్తులను ఆవాహనము సేసి వేకువను వెలుగు రాగానే స్నానము చేసి మధ్యమ పర్వతమును గురువునకు దానమీయవలెను. విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. భీష్మరాజా! గోవులను సమృద్ధిగా నీయవలెను. ఇరువది నాల్గుగాని పదిగాని శక్తిననుసరించి యేడు ఎనిమిది యెదుగాని యీయవచ్చును. ఆపై పాలిచ్చు కపిల గోవొక్కటియేని  గురువునకీయవలెను. సర్వ వర్వత దానవిధి యిది యీలా సృ్మతులందు వినబడుచున్నది. పూజలో నవే మంత్రాలు అవే పూజాది సామగ్రి గ్రహములకు లోకపాలురకు బ్రహ్మాది దేవతలకు నంతట నాయా దేవతా మంత్రమున నాయా దేవతలకు హోమము పర్వతదాన మందు పఠింపబడినది. నిత్యము సుపమానము సేయవలెను. ఆశకుడైన నక్తము సమ్మతమే. సర్వశైల దాన విధానము క్రమముగా వినుము. ఆందు మంత్రములు వాని ఫలము లాలింపుము. ధాన్యపర్వత దాన మంత్రము; అన్నము బ్రహ్మ అన్నములు ప్రాణములు. భూతములు పుట్టును ఆన్నముచే జగత్తు వృద్ధినొందును. అన్న మే లక్ష్మి అన్న మే విష్ణువు. ఈ మంత్రమున ధాన్య పర్వత రూపమున నన్ను కాపాడుమని దానమీయవలెను. ఈలా యిచ్చినతడు నూరు మన్వంతరముల కాలము దేవలోకమున వసించును. అవ్సరసలు గంధర్వులుతో విహరించును.

లవణాచల దానము (ఉప్పు) :

దీనివలన శివలోకము గల్గును. పదునారు ద్రోణముల ఉప్పు ఉత్తమము. దానిలో సగముకు మధ్యమము నాలుగు ఆధమము. పేదవాడొక్క ద్రోణము పైగా నీయవలేను. (ద్రోణము = కుంచము) దాన విధానమింత ముందన్నట్లే.

ఇక విష్కంభ పర్వతదానము. పదునాల్గు విష్కంభ పర్వతములు బ్రహ్మాది దేవతలనుద్దేశించి యీ మున్ను జెప్పిన విధినే యీయవలెను. ఆలాగే బంగారు గృహముల బ్రహ్మ మొదలగు పదునల్గురు లోకపాలుర నుద్దేశించి లవణ పర్వత రూపముల బంగారమీయవలెను. దానవిధాన మింతమున్ను జెప్పినట్లే. సరస్సులు అడవిచెట్లు వాటి గృహ సామగ్రి నేర్పరుపవలేను. ఈనాడు జాగరము. సేయవలెను. దాన మంత్రములు “సౌభాగ్యరస సంయుక్తః” అన్న మంత్రమిది నుపయోగింపవలెను. ఉప్పు సౌభాగ్య రసముతో రుచితో గూడినది.  ఆ రస స్వరూపుడవై పర్వతమూర్తీ నన్ను కష్టముల గట్టెక్కింపుము నీవు శివులకు (పార్వతి పరమేశ్వరులకు) ప్రియుడవు కావున నెప్పుడు శాంతి ననుగ్రహింపుము. విష్ణువు శరీరమునుండి పుట్టితివి గావున ఆరోగ్యము పెంపొందింతువు. కావున లవణ పర్వతమూర్తివై సంసార సాగరమునుండి రక్షింపుము. ఈ లవణపర్వత దానము సేసి నతడు కల్పకాలము ఉమాలోకమందు నందుండి యా పై మోక్షమందును.

గుడపర్వతదానము  ఇది నేసినతడు దేవతల పూజలందుచు స్వర్గమందుండును. పది ఐదు మూడు మణుగులు బెల్లము, పేదవాడు ఆరమణగులీయవలెను. ఆమంత్రణము పూజ బంగారు వృక్షము దేవతాపూజ విష్కంథ పర్వతదానము సరస్సులు వనదేవతలు హోమనిధి జాగరణ లోకపాలుర ఆధివాస కి మంత్రమిదంతయు ధాన్య పర్వతదానమునక ట్లే. దేవతలయందు విశ్వాత్ముడు విష్ణువువలె వేదములందు సామవేదమట్లు యోగులకు మహాదేవుడట్లు సర్వ మంత్రములకు ప్రణవమట్లు. స్త్రీలకు పార్వతి యట్లు రసములకెల్ల గుడము బెల్లము పరమోత్తమ రసముగా పార్వతిచే నిర్మింపబడితివి గావున నన్నెల్లప్పుడు గావుము అను నీ యర్థముగల యీ మంత్రముతో గుడపర్వత దానమిచ్చినవాడు గంధర్వులతో గౌరీలోకమందు వసించును. నూరు కల్పములటనుండి యా పై వచ్చి సప్త ద్వీపాధివతియగును. ఆయురారోగ్య సంపన్నుడు శత్రువుల వలన పరాజయమందనివాడై అతడు రాణించును.

సువర్ణాచల దానవిధి  ఇది సర్వపాపహరము. ఇది యిచ్చిన దాత బ్రహ్మ భవనము (లోకము) నందును. వేయి పలముల బంగారము ఉత్తమము. అయిదు వందల పలముల తూకము మధ్యమము. దానిలో సగమధమము. పేదవాడొక్క మాత్సర్యము గొనక శక్తికొలది ఫలము మించి యీయవచ్చును. ధాన్యపర్వతదానవిధానమే దీనికిని. విష్కంభ పర్వతములను ఋత్విక్కులకియవలెను. మంత్రము “నమస్తే మొదలు నగో త్తమ!” దాక నమస్కారము సర్వబీజము బ్రహ్మయొక్క గర్బము నీవు ఆనంత ఫలదాతవు కావున నన్ను రక్షింపుము. సువర్ణ పర్వతా! ఆగ్ని నుండి పుట్టితివి. నీ జగత్పతికి బంగారుకొండవై పుట్టితివి కావున నగో త్తమా నన్ను రక్షింపుము అని యీ కనక వర్వత దానము చేసి నతదానందకారకమగు బ్రహ్మలోకమందును, ఆందు నూరు కల్పములు సుఖించి మోక్షమందును.

తిలపర్వత దానము  ఈ దానమిచ్చి నతడు పర మో త్తమమగు విష్ణులోకమందును.

పది ద్రోణములుత్తమము. సగము మధ్యమము మూడు కనిష్టము విష్కంభ పర్వతాదిక మంతయు నీమున్ను జెప్పినట్లే. ఇక దానమంత్రి మావింపుము.

     మధువను రాక్షసుని వధించినపుడు విష్ణువు మేని చెమటనుండి పుట్టినవి తిలలు (నువ్వులు) కుళలు (దర్భలు) మాషములు (మినుములు). కావున శాంతిననుగ్రహింపుము. దేవతల నుద్దేశించిన హవ్యమందు పితృ దేవతల నుద్దేశించు కవమందు రక్షణమిచ్చునవి తిలలే. ఓ తిలపర్వత సార్వభౌమా! లక్ష్మిని (సంపదను) నాకు గూర్పుము నీకిదే నమస్కారము. ఈలా మంత్రము నెప్పి తిలాచలమిచ్చి నతడు పునరావృత్తి లేని విష్ణువదము (వైకుంఠము) నందును.

కార్పాన వర్వత దానము  (పత్తి) ఇరువది షది యైదు భారముల పత్తి ఉత్తమ మధ్యమ  కనిష్ట దానములుగా వర్ణింపబడినవి. బీదవాడొక్కటి మంచి యీయవచ్చును. డబ్బు లోభము మాంత్రము పనికిరాదు. మిగతాదంతయు ధాన్యపర్వతము నట్లే, ఇది వేకువను లేక రాత్రి యీయవచ్చును. మంత్రము. త్వమేవ భవ అన్న దాక  ఇట లోకులకావరణము నీవే. ఓ ప్రతి పర్వతమూర్తి మా పాపములెల్ల ధ్వంసము సేయుము. అని శివసన్నిధిలో నీ దానము సేసినతడు రుద్రలోక మందు ఒక కల్ప కాలముండును.

ఘృతాచలదానము మృతము (ఆవునెయ్యి)  తేజోమయము పుణ్యము మహాపాతక నాశనము. ఇరువది కడవలు  ఉత్తమము వది మధ్యమము ఆయదు ఆధమము, ఆల్పదని రెండు కడవలిచ్చిన ఊలును. విషంథ పర్వతములను వానిలో నాలుగోవంతు నేతితో నేర్పరుపవలెను. శాలిధాన్యము నించిన పాత్రలు పైనుంచవలెను. వానిపై శోభగా విధిననుసరించి మూత్ర లుంచవలెను. తెల్టని వస్త్రములచే వానిని కప్పవలెను. చెఱకుగడలు పండ్లతో వానినలంకరింపవలెను. మిగతాదెల ధాన్య పర్వత విధానమే. ఆధివాసన పూర్వముగా బంగారు దేవతా ప్రతిమల నర్చించవలెను. ప్రభాతమందు వేకువగాని రాతిగాని గురువునకవి . వివేదింపవలెను వేకువను శాంతమనస్కుడై విష్కంభ పర్వతములను ఋత్విక్కులకీయవలెను. విశ్వాత్మ విశ్వరూపుడు మృతార్చి నేతితో దీపించువాడు కావున నిధి శంకరుడు ప్రీతినందు  గావుత.  తేజోమయము బ్రహ్మగావున ఆది నీరూపమున నీయందున్నదిగావున నో హృతపర్వతరాజమా మమ్ము రక్షింపుము. ఈ విధిని  మృత పర్వత దానము వేయవలెను. మహాపాపియైన నిర్ధానిచే శివలోక మందును.

హంసలు, సారసములుతో (బెగ్గురు పక్షులతో) కూడి చిఱుగంటల మోయ పూలమాల లింపుగొల్పు విమానముద్రం దప్సరసలతో సిద్దులు విద్యాధరులతో పితరులతో అభిమానమున భూత ప్రళయము విహరించును. రత్నాచలదానము వేలకొలది ముక్తా ఫలములతో నిర్మింపబడను. (ముత్యాలకొండ) ఉత్తమము వేయి ముత్యాలతో మధ్యమము ఆయిదువండలు మూడు వందల యేబదితో ఆగమము నిర్మింపలేను.తూర్పున వజములు గోమేదములు దక్షిణమున ఇంద్రనీలములు పుష్యరాగములు పద్మ రాగములు పడమట వైడూర్యములు విద్రుమములు(పగడములు) ఉత్తరమున పద్మరాగములు గరుడమణలతో గంధచకాదనమను పేళ నీరత్న పర్వతము కూర్పవలెను. మిగిలినదంత ధాన్యపర్వతమున కిట్లే జరుపవలెను. అలాగే వృక్షము అను దేవతలను ఆవాహనము సేసి గంధ పుష్పాదులచే బూజించి ప్రభాతమందు.  విసర్జన మొనరింపవలెను. మున్నట్లు గురువునకు ఋత్విక్కులకు దానమీయవలెను. సర్వదేవతలు సత్వరత్నాలయందున్నారు. నీవు రత్నమయుడవు కొండ దేవతవు. మమ్మేవ్పుడు రక్షింపుము అను మంత్రము పఠించవలెను. రత్నదానముచే జనార్దనుడు సంతోషించును. మంతప్రసాదపూర్వకముగా పూజ జరిగినది కావున నోరత్నగిరి ! మమ్ము రక్షింపుము అని యట్లు  రత్నగిరినిచ్చినతడు దేవేశ్వరులచే బూజలందుకొనిరి. విష్ణులోకమున కేగును. నూరుకల్పములు పైగా నట నివసించును. రూపము ఆరోగ్యము సుగుణసంపద గలిగి సప్తద్వీపాధీశుడగును. బ్రహ్మ హత్యాదిపాతకమే కొంచెమిహమందు పర మందు చేసినదెల్ల వజ్రముచే (పిడుగుచే) కొండవలె సర్వము నశించును. ఈ పైని తాప్యాచలదానము సెప్పెడ.

దీని వలన నరుడు సోమలోకమందును ఈ వెండికొండ పదివేల పలముల వెండితో జేసినది  ఉత్తమము. అయిదు వేలది మధ్యమము. దానిలోసగచురమము. శ క్తిలేనివారు ఇరువది పలముల పైగా వెండితో చేయింపవలెను. వానిలో నాలుగో వంతుగొని విష్కంభ పర్వతాలు సేయవలెను. లోగడవలె మండరాది పర్వతమును వెండితో యధావిధి జేయవలెను. తెలిసిన తడు వెండితో లోకపాలుర ముద్రలను జేయింపవలెను. ఈపర్వతము నితంబమునందు (పిరిదిభాగము) బంగారముతో, బ్రహ్మ విష్ణు సూర్యుల ప్రతిమలను గూర్చవలేను.

మిగిలిన పూజాది విధానము మున్ను పర్వతములకట్లు గావింపవలెను. వెండి కొండను ప్రభాతమందు గురువున కీయవలెను. విష్కంభశైలము ఋత్విక్కులకు వ స్త్రభూషణాదులచే నర్చించి యీయవలెను. ఆ రౌవ్యపర్వతము గురువున కొసగవలె. దర్భను చేతబూని యీ మంత్రము పఠించుచు మచ్చరము గొనక నిదియీయవలెను. ఈ రజతము (వెండి) పితరులకు చంద్రునికి శంకరునికెంతో యిష్టముగదా! ఓ రజతపర్వతరాజా! శోక సంసారసాగరమునుండి మమ్ముద్ధరింపుము. అని యిట్లుంచి వెండికొండ నర్సించినతడు పదివేల గోవులనిచ్చిన ఫలమందును. సోమగంధర్వులు కిన్నరు లస్పరసలగణములతో పూజలందుచు జ్ఞానియై ప్రళయము దాక  వసించును.

శర్కరాచలము (చక్కరకొండ) దానము, దీనివలన విష్ణు సూర్యరుద్రులు సంతోషింతురు. ఎనిమిది నాలుగు రెండు భార ముల పంచదారతో నిడి మూడు సామాన్యుడొకటి లేక సగముతో చేయవచ్చును. నాలుగోవంతుచే విష్కంభ పర్వతములు నిల్వవలెను. బంగారు జరీవస్త్రము. కప్పవలెను. మిగిలిన శ లాపము ధాన్యపర్వతమట్లే, మేరువు పై బంగారు చెట్లు నిల్వవలెను. (ప్రతిమలుగా) మందారము పారిజాతము కల్పము, హరి చందనము తూర్పున సంతానముంచవలె. శర్కర పర్వతములందు తప్పక యుంచనగును. మందరమున దేవత కాముడు (మన్మధుడు) పడమటి భాగ ముగా నుండవలెను. గంధమాదన శిఖరమున కుబేరుడు ఉత్తరాభిముఖుడుగ మధ్యమున విపులమను పర్వతముననుంచి తూర్పు ముఖమై వేద మూర్తి హంసను, దక్షిణముఖముగ సురభి (కామధేనువు) బంగారపు పలుపుతో దక్షిణాభిముఖముగ నుంచవలెను. ధాన్యపర్వతమునట్లు ఆవాహనాదులు చేసి గురువునకీయవలెను. నాల్గు  విష్కంభపర్వతములను ఋత్విక్కుల కీయవలెను. ఆచట  నీమంత్రములను జదువవలెను.

ఈ చక్కెర కొండ పరమ సౌభాగ్యామృతసారము. అందుచే నామూర్తిగొన్న నీవెల్లపుడు నాకానాందము కూర్పుము. దేవతలమృతమును ద్రావునపుడు చిందులు భూమి పై పడెను. వానిచే సర్వసమృద్ధుడైన పర్వతమూర్తివి నీవు నన్ను సంసార సాగరము నుండి కాపాడుము. అను మంత్రముచే నీదానముచేసినతడు సర్వపాపము వెడలి బ్రహ్మ మందిరమునకేగును.

చంద్రసూర్యప్రభమైన విమానమెక్కి తన పై నాధారవడి బ్రతుకు జనముతో గూడ విష్ణువలే ప్రకాశించుచు వైకుంఠమున భాసించును. నూరుకల్పములట్లుండి సప్తద్వీపాధిపతియగును. ముప్పదివేల జన్మములు ఆయురారోగ్యసంపన్ను డై రాణించును.

ఈ పర్వతదానములన్నిటియందు యథాశక్తి మాత్సర్యము గొనక యధాశ క్తి నుప్పుకారము లేకుండ బ్రాహ్మణ నుజ్ఞ గొని తాను భోజనము సేసి వారి యిండ్లకు సర్వసామాగ్రి పంపవలెను. సర్వశైలదానము పరమో త్తమము. నీకు తెలిపితిని. ఇంక నీవేది యిష్టమడుగుమది భీష్మప్రభూ నీకు తెల్పితి నన భీష్ముడు ఇట్లనియె.

సంసారసాగరాత్తోవకము ఆరోగ్యకరము చిన్న వ్రతమొకటి ఆనతిమ్మున పులస్త్యుడిట్ల నీయె :

సౌరధర్మమిదివినుము. కల్యాణ సప్తసప్తమీ వ్రత విధ్యుపాసన విషయము సప్తమి తిధియందు చేయవలసిన ఆరాధనలివి. కల్యాణ సప్తమ మొదలగు సప్తసప్తములు. (ఏడు రకములు) అన్నియు పుణ్యమిచ్చునవి. దేవతలు పూజించునవి.

వీని విధాన సక్రమముగా చేప్పెదను. శుక్ల పక్షములో భానువారము సప్తమి కలిసివచ్చినప్పుడది కల్యాణి సప్తమి విజయసప్తమి యనబడును. ప్రాతఃకాలమున ఆవుపాలతో నదీ స్నానము చేయవలేను తెల్లని వస్త్రములు ధరించి యక్షతలతో తూర్పు ముఖముగా కూర్చుండి అష్టదళ పద్మము నడుమ గుండ్రని కర్ణిక తో గూర్పవలెను పూలతో నక్షతలతో చుట్టును సూర్య భగవానుని నానము చేయవలెను. తూర్పున దివాకరాయ , దక్షిణమున మార్తాండాయ నైరుతి దివాకరాయ పడమట దివాక రాయ వాయవ్య మూల ఉత్తరమున క ర్తనాయ వాయవ్యమున 8వ రేకున దేవాయ యని మొదట మధ్య చివర నమోస్తు పరమాత్మనే అని మంత్రములచే నర్చిచి సూర్యనమస్కారములుచేసి తెల్లని వస్త్రముల చేత పండు తక్ష్యములచే, గంధముచే మాలలచే ధూప దీపములచే స్థండిలమున (అరుగుమీద) బెల్లము చే గాని యుప్పుచేగాని భక్తితో సూర్యభగవానుసర్చింపవలెను . ఆపై వ్యాహృతి మంత్రముతో.

బ్రాహ్మణోత్తములను విసర్జించి యథాశక్తి భక్తి తో బెల్లము పాలు నెయ్యి మొదలయిన వానితో వారికి సంతర్పణము సేయవలెను. తిలపాత్రమ బంగారమును బ్రాహ్మణునికి సమర్పింప వలెను. ఈలా నియమానుసారము చేసి ప్రొద్దున లేచి స్నానజపాదులు సేసికొని విప్రులతో నేయి పాయసముతో భోజనము చేసి బిడాల వ్రతములో లేని బ్రాహ్మణ విద్వాంసునికి నేయి పాత్రను నీటి బిందెతో దివాకరుడు సూర్యభగవానుడు ప్రీతి చెందుగాక యని నివేదింపవలెను. ఈరా  ప్రతీ మాసము సప్తమినాడు సేయవలెను.

త్రయోదశినాడు మూడు పాలిచ్చు గోవులను వస్త్రాలంకారములతో బంగారు తోడుగల, కొమ్ములతో దానమీయ వలెను. పేదవాడైనచో మాత్సర్యము గొనక యొక దానినైన యీయవలెను. పిసినిగొట్లు కాకూడదు. దానివలన నథోగతిపాలౌను. ఈలా కల్యాణసప్తమీ పతము సేసినతడు సర్వపాపముక్తుడై సూర్యలోకము విలసిల్లును. ఆయురారోగ్యైశ్వర్యము అక్షయముగ పొందును.

మాఘశుక్ల పంచమినాడు పండ్లతో నువ్వులతో స్నానముసేసి జపము సేసికొని జావమాత్రము త్రావి ఉపవాసవత మూని బ్రహ్మ దారియై రాత్రి పరుండవలెను. ఆ పై తెల్ల వారినంత లేచి స్నా నజపాదులు సేసికొని శుచియై బంగారుపద్మ ముసు చేసి “అర్కాయ” అని పూజింపవలెను.

ఎర్రకర వీర పువ్వులతో ఎఱ్ఱ వస్త్రముల చాపుతో ఆదిత్యా నీచేత నెల్లపుడు లోకము శోకరహితమగునో యిట్లు. నాకు శోక ము లేకుండుగావుత. నీ పై ప్రతి జన్మమందు భక్తి నాకుండుగాక , అని షష్టియందు పూజించి బ్రాహ్మణులను బూజింపవలె. బెల్లము పాత్రములతో బూని యిట్లు పూజించి మంచి వస్త్రముల చాపు పద్మమును బ్రాహ్మణునికి సమర్పింపవలేను. నూనె ఉప్పలేకుండ స క్షమియందు భోజనమనేని మౌనమూని పురాణ శ్రవణము: సేయవలెను. ఐశ్వర్యము కోరునతడు చేయవలసి (నది. ఇట్లు రెండు పక్షములందు సేయవలె తిరిగి మాఘ శుక్ల సప్తమీదాక సేయవలెను. వ్రతము చివర బంగారు కమలముతో చెలబును,పరుపుతో శయ్యను, పాలిచ్చు క పిలగోవును ధానమీయవలెను. ఈలా లోభింపక యథావిధి యొనరించినతడు శోకము పొందడు. రోగాది దుర వస్తలందడు. ఏ కోరిక లు లేని యతడు వర బ్రహ్మమునందును. ఇది చదివిన విన్న వాడుకూడ యింద్రలోక మందును ఇక దుఃఖము నొందడు.

ఫలసప్తమీ వ్రతము

            మార్గశిర పంచమినాడు వ్రత సంకల్పమొనరించి షష్టినాడుపవసించి బంగారపు కమలము చేయించి పంచదారతో కుటుంబియగు బ్రాహ్మణుని కియవలెను.

ఒక పలము బంగారముతో సూర్యునిరూపుచేయించి భానువు నాయెడ ప్రీతినందుగాక యని విప్రుని కీయవలెను. ‘దద్యాద్వికాలమేలాయామ్’ శక్తి ననుసరించి విప్రులను పూజించి సప్తమి నాడు పాలుమాత్రము త్రావి మార్గశిర బహుళ సప్తమి దాక పండుతినరాదు. ఈలా విశోక సవమీ వ్రతము సేసినతడు పర మగతి నందును. కోట్లు వేలు జన్మలటనానందించును. నూతన వస్త్రములు పూలమాలలతో శర్కరాపాత్రదాన మీతీరున శుక్ల కృష్ణ సప్తములు రెండింటను జేయవలెను. ఈ మంత్రము జపింపవలెను.

 “భానురర్క” ఇత్యాదిగ పండ్రెండు సూర్యనామములు. చైత్రాదిగ నొక్కొక్క పేరు జపింపవలెను ఫలమును త్యాగముచేసి యిలా చేసిన భక్తులకనంత ఫలమనగా మోక్షము గల్గును. అనంతఫలమే నాకు గలుగుగాక అన్న యీ మంత్ర మును గూడ జపించవలెను. ఇది యనంతఫలదా సప్తమీని జేసిన ధన్యుడు ఇరువదియొక్క పూర్వము, రాబోవు తరముల వారిని గూడ యుద్ధరించును. ఈ విషయమును చదివిన విన్న పుణ్యుడు కల్యాణ వంతుడగును. పాపముక్తుడై సూర్యలోకమందును. ఫలసప్తమి సురాపానాది పాపములనెల్ల నశింపజేయును.

 శర్కరాసప్తమీ వ్రతము

ఆయురారోగ్యైశ్వర్యము లనంతములగుట కిది చేయవలెను. మాఘ శుద్ధ సప్తమినుండి చేయవలసినదిది. సర్వవేద మయుడవు నీవు వేదములందు పేర్కొనబడినావు. అమృత సంపదయంతయు నీ స్వరూపమే కావున నాకు శాంతినిమ్ము అను. నగముగల మంతమిది పఠింపవలెను. తక్కిన విధానమంతా లోగడ సప్తముల విధముగానే చేయపలె. సూర్యదేవుడమృతము తావుచుండనాయన ముఖమునుండి యమృతబిందువు రాలినవట. ఆవే కాలిదాన్యము, పెసలు, చెఱకుగా నేర్పడినవి. చక్కెర వానిరూపమే. కనుక యిది సూర్యభగవానుని కెంతో యిష్టము. ఈ సప్తమీ వ్రతమశ్వమేధఫలమిచ్చును. హోమములందు దేవతలకు కవ్యములందు పితృదేవతలకిది ఎంతో ఇష్టము. సర్వపాపహర ము, పుత్రపౌత్రాది వర్గని. ఈ శర్కరా సప్తమీ వ్రతము ఫలశ్రుతిదాక చదువవలెను.

కమలసప్తమీవ్రతము

 చైత్ర వైశాఖ శుక్ల సప్తమినాడు చేయవలసినది. తెల్లావాలతోడి నీళ్లలో స్నానము సేయవలెను. నమస్తే వద్మ హప్రాయ 281 శ్లోక మీట మంత్రము. ద్వికాల వేళలో ప్రాత సంధ్య రాత్రి కాలములో రెండిటి సంధిలో నిందుదానాదికము సేయవలె.

మందార సప్తమీవ్రతము

            మాఘశుద్ధ పంచమి నారంభము - బంగారు మందార పువ్వు భాస్కరుసకర్పింపవలెను. ఎనిమిది దికలందు ఎనిమిది నామములు నెప్పబడినవి. కర్ణిక యందపర మహావిష్ణుని నిలుపవలెను. (కేవల పర బ్రహ్మము)

శుభసప్తమీ వ్రతము

ఆశ్వయుజ శుక్ల సప్తమినాడు ప్రారంభము చేయవలసినదిది. ఈ సప్తమీవ్రతమురేడేండ్లు యథావిధి నొనరించిన పుణ్యుడు సప్తలోకాధీశ్వరుడై విష్ణువు యొక్క పరమవదమందును.

ఇది సృష్టి ఖండమున పుష్కర మాహాత్మ్యమందు ఇరువది యొకట - అధ్యాయము ముగిసినది.