పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

22 - వ్రతాధ్యాయము

 వ్రతాధ్యాయము

భీష్మడనియె  సప్త లోకములు భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇహలోకము నందు (ఇక్కడ) శుభమైన రూపము ఆయుస్సు ఆరోగ్యము విశేష లక్మి (సంవద) ఏలా కలుగును? అన పులస్త్యు డనియె. మున్నిందుడు వాయువుతో గూడ అగ్నిని ధానవులను నశింప జేయుమని ఆజ్ఞ యిచ్చెను. ఆయన వేలకొలది ఈసులను దహించేను, తారకుడు మొదలుగా సంహాదుడు దాకా మున్ను చెప్పబడిన రాక సులుపోయి సముద్రములో దాగిరి. వారిని కొల్చుట శక్యముగాదని అగ్ని వాయుదేవులా జోలికి వెళ్ళక యూరుకొనిరి. ఇంతటినుండి ఆ రాక్షసులు దేవతలను, మనుష్యులను, నాగులను, నెల్లరు మునులను పీడించి వెళ్ళి తిరిగి వాండ్రు నివసించుచుండిరి.

ఆ జలదుర్గము బలముచే నా దానవవీరులు ఐదుగురో, ఏడుగురో ముల్లోకములనట్లు పీడించిరి. దేవేంద్రుడప్పుడు మల ఆగ్ని వాయువులను మీరిప్పుడే సముద్రము నింకింప జేయుడ నేను. ప్రభూ! ఈ పని ధర్మము గాదు. ఎన్నో జీవులందు నాశనమై పోవును. కనుక వేరొక యుపాయము చేకొనుము. ఒక్క ఆమడ మేరలో సముద్రములో వందల కొలది ప్రాణులుండును గదా వానిని నశింపజేయుటుచితమగునా? అన సురేంద్రుడు క్రోధ ముచే కన్ను లేఖలు పెక్క రోషముగొని అగ్ని వాయు దేవతలతో నిట్లనియె.

దేవతలెప్పుడును ఒక ధర్మముతో నింకొక ధర్మమునకు ముడి వేటుకొనరు. విశేషించి మీరిద్దరు మహానుభావులయి యుండి యిలా చేయరాదు. ఓ ఆగ్ని గాలితో కలిసి నీవు తెలియక నా మాట ధిక్కరించితివి. కావున మునివ్రత నిష్టుడవై శరీరము దాల్చి ధర్మార్ధశాస్త్ర రహితమైన పుట్టుక నొంది గాలితో సమమైన జన్మ లోకమునందు నీకు కలుగును. నీకు మనుష్య జన్మ వచ్చి నప్పుడు నీవు పుక్కిలించి యుమీసినప్పుడు నీ యుమ్మిచే యీ సముద్రుడిండిపోవును. ఆమీద మరల నీవు దేవత్వము నందెదవు. అని యింద్రుడిచ్చిన యీ శాపము వలన అగ్ని వాయు దేవులిద్దరు మహాత్ములాక్షణములో మానవ దేహమునంది కుంభము నుండి పుట్టిరి. మిత్రావరణుల వీర్యము వలన నొకడు వాశిష్టుడు. ఇంకొకడు అగస్త్యుడు ఉగ్ర తపస్వులుగా జన్మించిరి.

భీష్ముడనియె:  ఈ అగ్ని కి మిత్రావరణులెట్లు తండ్రులైరి. ఈయనకు  కుంభమునుండి  జన్మ యెట్లు వచ్చిన దానతిమ్మన పులస్త్యుడనియె.

ఒకప్పుడు పురాణ పురుషుడు (విష్ణువు) ధర్మసుతుడై గంధక మాదనమున గొప్ప తపస్సు నే నెను. ఈయన తపస్సునకు హడలి యింద్రుడు విఘ్నము కొఱకు అప్సరసలతో వసంతుని మన్మధుని పంపించెను. గీత వాద్యాదులచే, హావభావ విలాసములచే విష్ణువు మోహవశుడు గాలేదు.

అప్పుడు మన్మథుడు, వసంతుడు ఆప్సరోగణము బాధనొందెను. వారినింకను సంక్షోభ పెట్టుటకు నరాగ్రజుడు (నారాయణుడు) తన తొడ నుండి త్రిలోక మోహినియగు నొక సుందరిని బుట్టించెను. ఆమెచే దేవతలందరు మోహవశులైరి. వసంతుడు మన్మథుడును మోహపడిరి.

అప్పుడు హరి అప్సరసల దేవతల ముందిట్లనియె. ఈమె ఊరువు నుండి పుట్టినది గావున ఊర్వశి యని లోకమున పేరొందును. సూర్యుడు మోహవశుడై జగన్మోహినినా మెను రమ్మని పిలిచెను. ఆమె మంచిదని సూర్యలోకమునకు చనుచుండ త్రోవలో సరియైన రక్షణలేక వరుణుడామెను గోరెను. అతనిం జూచి యామె మిత్రుడు నన్ను మున్ను కోరెను ప్రభూ! నాకు సూర్యుడే భర్త అనెను. అప్పుడు వరుణుడు మనసు నా పై నుంచి వెళ్ళుమనెను.

మంచిదని యట్లామె వెళ్ళగా మిత్రుడు ధర్మము నబద్దము పాలు చేసితివి గావున సోముని పౌత్రుని నీవిపుడు మనుష్య లోకమున బొందుమనెను. ఆపై మిత్రుడు వరుణుడును దమ వీర్యము జల కుంభమునందు విడిచిరి. దాన నిద్దరు మునీంద్రులు పుట్టిరి. మున్ను నిమియను రోజూ స్త్రీలతో జూదమాడెను. ఆ నడిమి బ్రహ్మ కుదయించిన వశిష్టుడు వచ్చెను. ఆయనను పూజింవ నందున నాయన నిమిని దేహములేని జంతువవు గమ్మని శపించెను. ఆ రొజూ వశిష్టని యట్లే శపించెను. అన్యోన్య శాపమున నిద్దరును శరీరములు లేనివారై కేవల తేజస్సులైరి.

ఆ యిద్దరు కాప మోచనమునకై జగత్పతి బ్రహ్మదరి కేగిరి, ఆపై బ్రహ్మ యానతి నిమి విశ్రాంతి కొఱకు కన్ను లందు జొచ్చెను. ఆతని విశ్రాంతి కొఱకు లోకములకు దాన నిమేషము లేర్పడెను. వశిష్టుడు మునుపటివలె నా జలకుంభమందే యుండెను. ఆ పై నాల్గు చేతులతో అక్ష సూత్రము కమండలువు బూని ఆగస్త్యుడను పేర మహర్షి పరమశాంతుడై యవతరించెను.

మలయ పర్వతమందొక చోట వైఖానస విధానమున భార్యతో బ్రాహ్మణ పరివారముతో నేవ్వరూ చేయజాలనీ తపస్సు నే నేను. ఆపై చాలా కాలమునకు తారకాది రాక్షసులచే జగతు పీడ నొందుట గని కోపము గని వరుణాలయమును (సముద్రమును) త్రాగివే నెను.

ఇందువలన శంక రాదులందరు నీయనకు వరదాతలైరి. బ్రహ్మ విష్ణు భగవానుడు వరమీయ నాముని దగ్గరకు జనిరి. నీ యిష్టమైన వరము కోరుము. భద్రమగు గావున నీకు. మునీ! యనిరి. ఆగస్యుడు; ఇరువదివేల  బ్రహ్మ కల్పములు దక్షిణాకాశ మార్గమందు వైమానికుడను (విమానవిహారముచేయువాడను) జేయును. నా విమానోదయమయినప్పటి నుండి నా పూజ సేసిన పుణ్యుడు పర్యాయముగా సప్త లోకాధిపతి కాగలడు. ఎవడు పుష్కరమందు నా పేరనున్న యాశ్రమమును కీర్తించునో నతడును పుణ్యాత్ముడగు గావుత. ఇదియే నేను కోరు వరము. ఇక్కడ భ క్తితో పిండ శ్రాద్ధము చేసిన వారి పితృదేవతలు ద్యులోకమున వసించి యింత కాలము నాతో వసింతురు గావున. ఇది నే కోరు వరము. ఇట్లే జరుగునని పలికి దేవతలు వచ్చిన దారిం జనిరి. అందుచే బుధులు (పండితులు) ఆగస్త్యులకు ధనమీయ వలసినదే.

ఆన విని భీష్మడు ఆ ఆగస్త్య మునికి ఆర్ధమునెలా యీయవలెను? అగస్త్యపూజావిధానమేలా సేయవలె నానతిమ్మన పులస్త్యుడనియె.

రాత్రి అగస్త్యోదయమైన తరువాత వేకువను తెల్ల నువ్వులతో స్నానము చేయవలెను. తెల్లని వస్త్రములు దాల్చి. యింట పూల మాలలతో, వస్త్రములంకరించి పంచ రత్నములతో, నేతి పాత్రతో కూడ ఒచ్చునోరములేని కుంభమును నిలుపవలెను. కుంభము ముందు బొటన వేలంత బంగారు పురుష విగ్రహము నాల్లు బాహువులతో నుంచవలేను, కుంభము చుట్టు ఏడు ధాన్య వర్వతములుంచి కుంభముఖాన చతుర్భుజుని బ్రహ్మనుంచి కంచుపాత్ర తెల్ల యక్షతలతో మంత్రముతో విప్రునకీయ వలెను. చేయి సాచి కుంభము పై నుంచి దక్షిణ దిశగా మోము పెట్టిన పాలిచ్చు తెల్ల గోవును దూడతో మనస్సు నిల్పి పూల మాలలు ఘంటయు నలంకరించి బ్రాహ్మణున కీయవలెను. ఏడు రాత్రు లుదయమందిలా యీయవలేనని, పదునేడు సంవత్సరముల పైని కూడా యీ దానము చేయవలెనని కొందరందురు.

ఇట ఆగ స్త్య మంత్రము "కాశ పుష్ప నమోస్తుతే." అని. జెల్లు పువ్వువలే తెల్లనివాడా) అగ్నికి వాయువునకు జనించిన వాడా! మిత్రావరుణుల పుత్రుడా కుంభయోని (కుంభమందు పుట్టిన వాడా) నమస్కారం అని యీ మంత్రార్ధము. పండ్లు దినక ఈలా ప్రతి సంవత్సరము చేయవలెను. హోమము సేసి సమాప్తి చేసి యా పై ఫలము తినవచ్చును. ఈ విధిని ధనము నివేదించిన పుణ్యుడు చక్కదనము ఆరోగ్యముతోడి జన్మ మీ లోకమందందును. సప్త ధనము లిచ్చినవాడు భూరాది సత్యలోకము దనుక గల సప్తలోకముల నందును. ఇది చదివి విన్న యాతడు విష్ణులోకమందు దేవ సంఘముచే బూజింపబడును. జ్ఞాన సంపన్ను డగును.

            భీష్ముడు సౌభాగ్యారోగ్యము లిచ్చునది, శత్రుక్షయకరము భుక్తి ముక్తు లిచ్చునదాన తిమ్మన పులస్త్యుడనియే. ఆంధకారి (శివుడు) ఉమాదేవికి జెప్పిన చక్కని కథలందలి కథ యొకటి యిపుడు ముచ్చటింతునన, గౌరీదేవి - దేవేశ్వరా! సావిత్రి నాకును లక్ష్మికిని శాపమిచ్చెగదా, నేను లక్ష్మీవలె ప్రధానత్వమును (ప్రాముఖ్యమును పొందెదనో యా రీతి నెప్పుమన శంకరు గనియె.

            దేవీ! శ్రద్ధతో విను. స్వయముగా జేసిన పుణ్యమిది. పరమోత్తమ మారాధనము పురుషులకు స్త్రీలకు గూడ చేయ వలసినది. వైశాఖము శ్రావణము మార్గశిరమున గాని శుక్ల తృతీయనాడు తెల్ల ఆవాలతో స్నానము చేసి గోమూత్రము, గోరోచనము, గోక్షీరము, గోఘృతము చందనముతో గలిపి పెరుగును నుదుట బొట్టు పెట్టుకోవలెను. ఆది సౌభాగ్యారోగ్యము లిచ్చునది. లలితా ప్రియము ప్రతి పక్షమందు పురుషుడు గాని పుణ్యస్త్రీ కాని ఎల్లని వలువలు పువ్వులు ధరించవలెను. తెల్లనివియు విధవ పత్రము. శుక్రవస్త్ర మొక్కటే కట్టుకొనవలె. కుమారి సువాసినీయైన పిల్ల పలుచని చక్కని వస్త్రముల జత ధరింపవలెను. వంచగవముచే నా పై పాలతో మాత్రమే తేనెతో స్నానము చేసి పుష్పగంధములచే పూజింపవలెను, తెల్ల పువ్వులతో నానావిధ ఫలములతో పూజింప. వలే. ధాన్యము పేలాలు, ఉప్పు, బెల్లము నేతితో గూడ పాలు, తెల్ల అక్షతలు, తెల్ల నువ్వులు నను వీనిచే నర్చింపవలెను.

- ప్రత్యంగ పూజ:

“పాదయోః వరదాయై” (అని పాదములు మొదలు లలాటము దాకా) పూజ చేయవలెను.

ఈలా పూజించి ఆ దేవత ముందు పద్మ మును బదు చారు రెక్కలతో కర్ణి కతో పద్మమును హస్తముతో తాకుచు పూజ చేయవలెను. తూర్పున గౌరిని, నైరుతి మూల ఆవర్లను, ఆగ్నేయమున దక్షిణమున భవాని, పడమట రుద్రాణి, మదన సౌమ్య తాపిని వాయవ్యమున పాటలను, ఉత్తరమున పొటలను,. ఈశాన్యమున సాధ్యను, పద్య సౌమ్య మంగళ కుముద సతి భద్ర అను దేవతల మధ్యను నిలిపి పూవు కర్ణికలమీద లలిత నుంచవలెను. పూలతో అక్షతలతో సమస్కరించి సువాసినిని పూజించి గీత మంగళ వాద్య ఘోషములతో మేళవించి ఎల్లని వస్త్రములు మాలలు గంధాదులతో సువాసినిని పూజింపవలెను. సిందూరము, కుంకుమతో స్నానము దేవికి చాలా ప్రియములు కావున వానిని సువాసినుల శిరస్సు నందుంచి స్నానము చేయింపవలెను. ఆమీద ఉపదేశమిచ్చిన గురువును బూజింపవలేను గురుపూజ లేనివన్నియు వ్యర్థమే. మంత్ర జపములు చేసి నల్ల గలువలతో గౌరీని పూజ చేయవలె. మార్గశిరమున జాజి పువ్వులు, పుష్యమున పసుపుపచ్చని కురంటకములతో, గోరంట పువ్వులు, మొల్లలు, తెల్ల గల్వలు, మామమందు వావిలి, జాజి పూవులతో, పాల్గుణమున చైత్రమున మల్లెలు అశోకములు, వైఖమున గంధిపాటలములు, జ్యేష్ఠమున కమలములు, మందార పువ్వులు, ఆషాఢమున తామర పూవులు, శ్రావణమున మందారములు మాలతీ పువ్వులతో దేవిని పూజింపవలెను. గోమూత్రము, గోమయము, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, దర్భనీరు, మారేడుపత్రి, జిల్లేడు పువ్వులు, తామర పూలు, ఆవు కొమ్ము నీరు, పంచగవ్యము మారేడు నను వీనిని క్రమముగా తినిపింపవలెను. ఈ ప్రాశనము భాద్రపద శుక్లమందు జెప్పబడినది. శుక్ల కృష్ణ పక్షములందేల్ల తదియనాడు దంపతులకు భక్తితో భోజనము పెట్టి వస్త్ర మాల్య గంధాదులతో పురుషునకు పీతాంబరములు స్త్రీకి పట్టు చీరలు పెట్టవలెను. నిష్పావములు, జీలకర్ర, ఉప్పు, చెఱకుగర్ర, బెల్లము సువాసినికి పురుషునకు బంగారు కలువ పూవుతో చేర్చి యీయవలెను . “యధాసాగరత" అన్న యీ మంత్ర భావమును భావించి, దేవిని ప్రార్షింపవలెను. భావము - దేవీ! పర మేశ్వరుడు నిన్ను కౌగలించకుండ వెళ్ళడో అలా నన్ను సంసార సాగరము నుండి యుద్ధరింపుము. కుముద మొదలు పార్వతి దాకగల దేవీ నామములను పండ్రెండును శ్రావణాదీగ పండ్రెండు మాసములందు జపించి దేవి నాయెడల ప్రీతి సెందుగాక యని పలుకవలెను. వ్రత సరూ ప్రియందు బంగారు కమలముతో శయ్యాదానము చేయవలెను. నలుగురు, పండ్రెండుగురు దంపతులను పూజ చేయవలెను.

 గురుపూజ ముందు నేసి తరువాత నందరిని బూజింపవలెను. ఇది అనంతతృతీయా వ్రతము. అనంత ఫలదము. ఇందు దేవి సర్వపాపహర సౌభాగ్యారోగ్య వర్తి ని. లోభముచే దీనినేన్నడూ ఉల్లంఘింపరాదు. గాని పురుషుడుగాని యుపవాస వ్రతపూర్వకముగా జరువవలెను. గర్భిణి ప్రసవించినది కుమారి (పెండ్లి కాని పిల్ల రోగిణి, మైల వడినది యింకొకరిచే జేయింపవలెను. ఈ అనంతతృతీయావ్రతమాచరించినతడు కోటి కల్పములు పైగా శివలోకమందు విహరించును. పేదవాడును ఒక్క సంవత్సరముపవాసముండి యీ పుష్పాదులతో మంత్ర విధానమున జేసినదే ఫలమందును. తన రథముకోరి యైన నీ వ్రతము చేసిన గౌరీదేవి యనుగ్రహమున పురుషజన్మమందును. ఇది చదివిన విన్న ను నిచ్చట మనస్సునర్పించినను దేవతలచే దేవతా సుందరులచే కిన్నరులచే పూజలందును.

రసకల్యాణినీ వ్రతము, ఇది యింత కల్పములందలి ప్రజలెరుగుదురు. మాఘశుక్ల తృతీయనాడు గంధము పౌలు నువ్వులతో స్నానము చేయవలెను. దేవిని తేనె చెఱకురసము గంధోదకముచే స్నానము , నేయించి కుంకుమపూజ సేయవలెను. లలితాయై నమః అని ఎడమ మడమను శాంత్యైయని పీక్కలు మోకాళ్ళను శ్రీయై యని ఊరువులు మదాలసాయైయని నడుము, . అమలాయై యని కడుపు మదనవాసిన్యై యని స్తనములు కుముదాయై యని మాధవ్యై యని భుజము కమలాయైయని భుజము పైని సుఖస్మితే అని కనుబొమలు రద్రాణ్యేయని నుదురు శంకరాయైయని యలకలు చుదనాయ నీ మరల నుదురు మోహనాయేయని కనుబొమలు చంద్రార్ధ దారియ్యై యని నేత్రములు రుష్యైయనీ మరల ముఖము ఉత్కంఠిన్యై యని కంఠము అమృతాయని కడుపు రంభాయె యని బాహువులు, విశోకాయై యని చేతులు, మన్మథాహ్వాయే యని హృదయము, పాట లాయై యని ఉదరము, సురత వాసిన్యై యని కటిని నడుమును వంకజ శియే యని తొడలు గౌర్యైనమః అని పిక్కలు మోకాళ్ళు శాంత్యైయని మడమలు ధరాధరాయై యని పాదములు విశ్వకాయైనమః అని శిరస్సు, కామిన్యై వాసుదేవ్యై జగచ్ఛియై ఆనందదాయై నందాయై నమో భవాన్యై సుభద్రాయై నమోనమః అని యీలా యధావిధిని పూజించి బ్రాహ్మణ దంపతుల నర్చింపవలెను. వారికి మధురాన్నము భోజనము పెట్టి మాత్సర్యముగొనక మోదకములతో ఉండ్రాళ్ళు మిఠాయిలాటి భక్ష్యములతో ఉదక కుండము తెల్లని బట్టల చాపులు రెండోసగి యిది లవణ వ్రతము స్వీకరించుగావుత. బంగారు కమలము గంధము పూలమాలలతో నిచ్చి యర్చింపవలెను.

ఇట “కుముదా" దేవి ప్రీతినందుగావుత, లవణ వ్రతమిది గ్రహించుగావుత మని నెలనెల యిలా దేవి నర్చించవలేను. మాఘమందు ఉప్పు, ఫాల్గునమున బెల్లము చైత్రమందు వెన్న , వైశాఖమందు తేనె, జ్యేష్ఠమందు పానీయము, అషాఢమందు జీలకర్ర, శ్రావణమందు పాలు, భాద్రపద మున పెరుగు, ఆశ్వయుజమున నెయ్యి, కార్తికమున తేనె, మార్గశిరమున ధనియాలు, పుష్యమందు పంచదార తినరాదు. వ్రతము చివర నిండు కరకము బరిణె (కరవడ) ఒక రకము పాత్ర ప్రతినెలలో ద్వీకాలవేళ ఉదయము సాయంత్రము యందు భక్ష్యపాత్ర నీయవలెను. లడ్లు సేవక లు సంయావము, పూరికా, బూరె, పాటలము, ఎఱ బొద్దుగ, పున్నాగము, కవిగొట్టుd.

మాఘమాసము మొదలు వరుసగా నేతితో నిండిన నారిక. పిష్టి (పిష) పిండితో నిండిన నందికి పాలకూర, దధ్యోదనము కుముద మాధవి, రంభ, సుభద్ర, శివ జయులలిత, కమల, అనంగ మంగళం తిలాలస. ఇవి మాఘమాసము మొదలు పుష్యమాసముదాక పండ్రెండు నెలలు పేర్కొనవలసిన దేవతలు వీరు ప్రీతి చెందుదురుగాకయని యీ వ్రతము చేయవలెను.

పంచగవ్య పాశనము అన్ని యెడల నేయవలెను. ఉపవాసము చేయవలెను. ఆశకురాలు న క్రమ నేయవచ్చును.

తిరిగి మామ మాసము రాగానే పంచదార కలశ ముపై తన బొటనవేలంత బంగారు గౌరీ ప్రతిమ పంచరత్నములతో నాల్గు చేతులు చంద్రునితో తెల్లని వస్త్రము పెగవునుగూర్చి ఆశ సూత్రముతో కమండలువుతో గో మిధునమును తెల్ల వస్త్ర ముతో గూడిన దానిని దూర వస్త్రముతో పాత్రతో భవాని ప్రీతి సెందుగావుతమని దానమీయవలెను. ఈలా రసకల్యాణినీ వ్రతము చేసిన క్షణమున పాపము క్తినందును. వేయి జన్మములనైన దుఃఖమందడు. అగ్నిష్టామములు వేయి చేసిన ఫలమందును. పెండ్లికానిది అయినది, విధవ పాపాత్మురాలై నను నదే ఫలమందును. సౌభాగ్యారోగ్య సంపన్నురాలై గౌరీలోకమందును. ఇది చదివిన విన్నను నిదే ఫల మందును.

ఆగ్ర్యానందకరీ తృతీయా వ్రతము ఆషాడ శుక్ల తృతీయ తిథి బ్రహ్మర్షము మమ హస్త మూల నక్షత్రము కలిసి వచ్చినపుడు నేయవలసిన వ్రతమిది. దర్భలతో గంధోదకముతో స్నానము చేసి, తెల్లని వస్త్రములు పూలమాలలు ధరింపవలెను. సువాసనలుగల పూలతో గంధముతో తాను తెల్ల ని పూవులు వస్త్రములు ధరించి మహాదేవునితో గూడ భవానినర్చింవవలెను. “వాసు దేవ్యై నమః పాదౌ" అని ప్రారంభించి ప్రసన్న వదనౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని నామములు నెప్పి ప్రత్యంగ పూజ చేయవలెను.

ఇట్లు నేసి పార్వతీ పరమేశ్వరులముందు పలు రంగుల పిండితో కమలములు కలువలు - పొన్ను తోకూడ శంఖము చక్రములను జేయించి యుంచవలెను. ఈ పిండి రేణువులెన్ని యక్కడ రాలుతో అన్ని వేల సంవత్సరములు శివలోకమున రాణించును. నాల్లు శ క్తికొలది నేతి చెంబులు బంగారముతో, జలపాత్రము కరకము = కుండి) ద్విజునకు నాల్గు మాసములు ప్రతిపక్షమునందిలా దానమీయవలెను. ఆషాఢ శుక్ల తృతీయనుంచి నాల్గు మాసాలు ఇట్లు చేసి ఆ పైని నాల్గు మాసాలు ప్రతివక్షమందు నాల్గు తిలపాత్రలు నాల్గు నేతి చెంబులు కరక ము పై నుంచి గంధోదకము పుష్నోదకము చందనము కుంకుమోదకము పెరుగు పాలు ఆవుకొమ్ములో నీరు, కృష్ణ చూర్ణముతో గలిపిన తామరపూల నీరు, వట్టివేరు నీళ్ళు, యవల పిండి, నీరు, తిలోదకము ఇవి మార్గశిరాది నాల్గు మాసాలు రెండు పక్షములందు తినవలసినవి.

ఆర్చనమందెల్లయెడల తెల్లపువ్వులే ప్రళ స్తములు. దానమిచ్చు సమయమున పఠించవలసిన మంత్రము:

“గౌరీ మే ప్రీయతాం నిత్యమ్." నిత్యము పావము నశింపజేయుటకు నాయెడ గౌరి ప్రీతి సెందుగాక. లలితాదేవి సౌభాగ్యమనుగ్రహించుగాక. భవాని సర్వ సిద్దులగుగాక! ఇది యీ మంత్రార్థము. సంవత్సరము పూర్తియందు బెల్లము కుంకుమ ఉప్పు చందనముతోని కుంభము బంగారు తామరపూవుతో దానమీయవలెను. ఉమాదేవి ప్రీతికి బంగారపుది, చెఱకుతో పండ్లతో ఆ స్తరణతో తలగడతో శయ్యాదానము బ్రాహ్మణ దంపతులకు “గౌరిమే ప్రియతామ్" అని నేప్పుడు దానమీయవలెను. ఇందువలన ఫలము ఆత్మానందకరి = బ్రహ్మానందమును సమకూర్చు సంపదను ఆయురారోగ్యమును సంపదను పొందును. ఎన్నడును శోక మందడు. ఆ పెండ్లికానిది విధవకూడ యీ ఫలమందును. ఇది నేసిన పుణ్యుడు రుద్రలోకమందును పునరావృత్తి నొందడు. ఇది "విన్న వినిపించి నతడు కల్పమెల్ల ఇంద్రలోక మేగి పూజింపబడును.

శంకరుడనియె ఈలా వ్రత నిష్టురాలైన పుణ్యురాలు సామాన్య శ్రీయే యీ మహాఫలమునందునేని,

సావిత్రి యేపాటిది? ఆమే యిచ్చిన శాపమేపాటిది? ఈ వ్రతము చేసిన పుణ్యురాలు త్రైలోక్య సుందరియై తీరును. మటి యెవ్వతెకు నీలాటి గౌరవముండదు. లక్ష్మి విష్ణువు సేవట్టి గదా యాయనక న్న ముందైన శివునికూడ మొక్కదగినదై నది. మున్ను నేను నీకొ కే దక్షయజ్ఞము తుద ముట్టించితిని. లక్ష్మి కొఱకే విష్ణువు వారిథిని మథించెను. మీ యిద్దరి ఆజ్ఞ నే నెదను. ఎన్నడు జడియకు. కోపము గొన్నది సావిత్రిని గౌరవింపవలేను. బ్రతిమాలి ప్రసన్నురాలింగావించికొనవలెను. నేను, విష్ణువు, బ్రహ్మ కూడ గౌరవము గోరి సావిత్రిని గౌరవింపవలసినదే. బ్రాహ్మణోత్తములకు భోజనములు విద్యాధరులందఱకు భోగములు మనుష్యుల కభీష్టసిద్ధిని సర్వమును ప్రభు విచ్చినాడు. బ్రహ్మ సదనమే నేగెను. సుందరీ! నీ విట నుండుము ఆని పలికి రుద్రుడేగెను గౌరియట నుండెను. ఒక్క యుగమంత యా యజ్ఞమునందగ్ని దేవుడు దేవతలగూర్చి హవ్యములను త్రిలోక ప్రీతి కై వహించుచునే యుండెను. రుద్రుడు ధర్మములను గౌరీదేవి సేసిన ధర్మములను సరస్వతి వ్రత వైభవము నీ ఏట ముచ్చటించుచుండుము అని రుదుడన విష్ణువాదరముతో నిట్లనియె.

శంకరా! ఇపుడు నొ ధర్మము నేను జెప్పను. దేవోత్తమ! నీవు నామహిమను దెల్పుము. కృతయుగమునందు పాపము క్షయింప నీవే మున్ను జెప్పితివి. దీనివలన పాపము నశించును. సందియములేదు. నీవును బవిత్రుడవగుదువు అనెను. భీష్ముడిట్లనియె.

ఏ వ్రతము చే మధురమైన మాట గల్లును మునీంద్రా! అలాగే జనసంపద, మతి (బుద్ది - జ్ఞానము) విద్యాకౌశలము దంపతులకు పొరపొచ్చెము లేకుండుట, బందుగులతో సాంగత్యము ఆయుర్బాగ్యము ఎట్లు గల్గునోయది మునీంద్ర నాకు దెల్పుమన పులస్త్వుడనియె. చక్కగ నడిగినావు రాజా! విను. సారస్వత వ్రతము పరమోత్తమము. దానిని వర్ణించుటవలన సరస్వతీదేవి సంతోషించును. భక్తుడి మహోత్తమ వ్రతమునెంతో స్తుతించును.

వ్రతము సేయునాడు ముందు సరస్వతీదేవి సవము చేసి యా పై నారంభింపవలెను. లేదా భానువారమున గ్రహతారాది బల మనుకూలముగ నున్న పుడు బ్రాహ్మణులకు పాయసముతో విందు సేయవలెను. స్వస్తి వాచనము సేయింపవలెను. బంగారముతో శుక్ల వస్త్రములిచ్చి భ క్తితో తెల్ల పూలతో గంధములతో గాయత్రి దేవిని బూజింపవలెను. ఆమ్మా! భగవంతుడు బ్రహ్మలోక పితా మహుడు నిన్ను విడివడకుండు నట్లుండి మాకు వర దాత్రి వగుము దేవీ! వేదశాస్త్రము ధర్మములు, నృత్య గీతాదికము, ఏమాత్రము నీతో విడివడకుండునట్లు దేవీ! మాకు వరదాత్రివగుము. ఆలా సర్వసిద్ధులు నాకు కలుగుగాక! లక్ష్మీ మేధ ధర పుష్టి గౌరి తుష్టి జయ మతి అను నీ యెనిమిది మూర్తులతో సరస్వతి నీవు నన్ను రక్షింపుము. అని వీణను కమలమును కమండలువును చేబట్టిన గాయత్రిని తెల్లని పూవు లక్షతలతో భ క్తితో చక్కగా సాయం ప్రాతఃకాలము మౌనవ్రతముతో పూజచేసి ప్రతి పక్షమందు పంచమి నాడు శోభనమైన గోవును నాలుగు మానికలు (ప్రస్థము) బియ్యము, - నేతిపాత్ర పాయసముతో పాలతో బంగారము గాయత్రి ప్రీతి నెందువులమనీ బ్రాహ్మణునికియవలెను. సంధ్యా సమయము మౌనవ్రతమూనవలెను. పదమూడు నెలలు రాత్రి భోజనము నేయరాదు. వ్రత సమాప్తియందు తెల్లని బియ్యము భోజనము పెట్టవలెను. దివ్యమైన చాందిని, గంధ చందనము, నూతన వస్త్రముల చాపు, దధ్యోదనము, పిండి వంటలు విందేయవలేను. అమీద నుపదేశ కుని గూడ భ క్తితో గంవస్త్ర మాల్యాదులతో పూజింపవలెను. ఈలా సారస్వతమను నీ వ్రతము సినతడు సరస్వతీ ప్రసాదమున బ్రహ్మలోక మందును శ్రీయైననూనీ ఫలమందును పదివేల కల్పములు బ్రహ్మలోకమున సుఖించును. ఇది విన్న వారు గూడ ముప్పదివేల సంవత్సరములు దేవలోకమున సుఖముగ వసింతురు.

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టి ఖండములోని ప్రతాధ్యాయమను ఇరువది రెండ - అధ్యాయము.