పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

14 -  కర్ణార్జున యోర్జన్మ వృత్తాంత కథనమ్ వైర కారణమ్

కర్ణార్జనుల జన్మ వృత్తాంతము

అర్జునుడు పురుషతయమునకు వుతుడయి జనియించెను. కర్ణుడు కన్యకు బుట్టి సూతుని కొడుకనిపించు కొన్నాడు, ఆ కథయేమి? వారిద్దరికి బద్ధవైరముగదా ! ఎందుచేత ? వినవేడుకయైనది తెల్పుమన పులస్త్యుండనియె.

బ్రహ్మ తన తల తెగినపుడు కోపమువచ్చి నుదుట జెమట పట్టినది. ఆ చుక్క చేకొని నేలపై విసిరికొట్టెను. అందుండి కుండలములూని విల్లు నమ్ముల పొదియుం జేకొని సహస్రకవచములూని తను కింకరుడనుచు నొక డావిర్భవిం చెను. బహ్మ వానితో నిడుగో యీ రదుడు దుర్బుద్ధీం వీనిం జంపుమనెను. అదివిని వాడారుదునివెంట పరువెత్తెను. అమ్మహోగ్రుని గని రుద్రుడు పారి విష్ణు నామమునకుం జనేను. జగతభూ ! వీడు నన్ను జంపకుండ రక్షింపు రక్షింపుమని మొరపెట్టుకొనెను. విష్ణువు హంకారమొనరించి వానిని వారించి. యెవ్వరికి గానరాకుండ యోగీశ్వరుండు గావున త్రిలోచనునికిమాతము కనిపించి యాతనిని చేర్చినంత: నతడు విష్ణువునకు నమస్కరింప హరి నీవు నా పౌతు. డవు నీకేమి కావలెననెను. శివుడు నారాయణుని భిక్ష పెట్టుమని కపాలము చూపి పార్థించెనుః అది చూచి, నారాయణ డింతకంటె యోగ్యుడు పాతుడెవడు గలడని తన కుడిచేయి యిచ్చెను. చంద్రశేఖరుడా చేతిన్ని శూలముచే ఖండించేను. ఆ స్వామి భుజము నుండి రక్తము ధారగా వెలువడెను. బంగారు ధారయో  యన్నట్లు అగ్నిజ్వాలయట్లా ర క్రధార యా ఆడి భిక్షువు చేతనున్న కపాలమునందు సూటిగా నొకాశమంది. ఆ ధార పొడవేబడి వది యోజనము విరివియుం గలదై వచ్చి యా కపాలమునం బడెను. వేయి దివ్యవర్షములది యట్లే నడుచుండెను. ఇంతకాలమా భిక్షుకుడా భినే యారగించెను. ఆవైని హరి నీ పాత్ర నిండేనా ? అని హరండు సజల జలద గంభీరమైన యా మాట విని యా పురౌను వేలు ముంచి దాకి కపాలమున జూపులు మూడు జొనిపి కపాలము నిండినదనెను.

హరి వచన మాలించి యతడు సూచుచుండ నీశ్వరుడు తన వేలందు జొనిపి వేయి దివ్యసంవత్సరము లా రక్తము గనుచు మథించెను. అందుండి నురుగులు బుడగలు వెలువడినవి. ఆవైని-కిరీటము పెట్టుకొని చేత విల్లుని వీపున నమ్ములపొదియుంగొని యగ్ని వలె దీపించు నొకడా కపాలమందు గనబడెను. భగవంతుడు వానిం జూచి వీడెవ్వడని శంకరునడుగ నతడిట్లనియె. ఈయనయందు నరనారాయణులిద్దరు దేవ కార్యముం జక్కబెట్టను లోకములలో వాలింపను బసిద్దులె యవతరింతురు. ఇతడు నరుడు నారాయణుడవగు నీ మిత్రుడు ఆనుర సంహారమందు నీకు దోడుగాగలడు. జ్ఞానపరిశోధన చేయు ముని సర్వవిజయుండు నగును. తేజోయుతమైన బ్రహ్మము యొక్క శిరస్సిది. బహ్మయొక్కయు నీ చేతినుండి కారిన రక్తముయొక్కయు నో దృష్టియొక్కయు తేజస్సులు మూడునుం గలిసి యేర్పడిన యీ మూర్తి శతువుల గెలువగలదు. ఇంద్రునకు దేవతలకుం గూడ జంపవళము గానీవాడకు నితడు భయంకరుడు కాగలడని శంభుడన హరి యాశ్చర్యపడెను.

కపాలమందున్న యా వురుషుడు. శిరమునందంజలిచేసి హరిహరులను స్తుతించి యేమి సేయుదు నానతిం డనెను. శ్రీహరి యతనితో నిన్ను బ్రహ్మ తన తేజస్సుచే నిన్ను సృజించినాడు. నీవు వీనిం జంపుమని వలికి బద్ధాంజలి యయియున్న యా నరుని రెండుచేతులుం బట్టుకొని కపాలమునుండి మీడికిలేపి వెండియు నిట్లనియె: నేను నీకెరింగించిన పురుష డిడుగో యీతడే. విష్ణుని హుంకారముచే మోహనిద్రలో, బడెను. ఇతని నీవు వేగమ. మేల్కొలుపుమని శివు డంతర్థాన మొందెను. నారాయణుని కట్టెదుట ఒంటరిగాడైన నరుని యెడమకాలి తన్నుడిని.యా కపాలము నుండి మీది తెగ సెను. ఆ స్వేదజునకు రక్తజునకును నయ్యెడం టెను జగడమయ్యె.

వారి ధనుష్టంకారిముల భూతలమెల్ల బ్రతిధ్వనించెను. రక్తజుండా స్వేదజని కవచమును బద్దలు సేసెను, అయ్విరపురకు నాపోరు రెండు డివ్య సంవత్సరములు జరిగెను. వాసుదేవుడా యిద్దరింగనీ యాలోచించి బహ్మసదన మున కేగి తొటువడుచు రక్తజునిచే నిపుడు స్వేదజుడు గూలినాడని తెలిపెను. బహ్మ వ్యాకులుడై మధుసూదనునిం గని యీ జన్మమందీ నావాడు నరుడు. సుఖముగ జీవించుగాక! యనియే. ఆన హరి సంతుష్టుడై యట్లే యగునని యా యిద్దరు పోరు యుద్ధభూమికింజని వారి పోరాది యిట్లనియె.

ఇంకొక జన్మమందు కలి ద్వాపరయుగ సంధిలో జరుగు మహాద్దమున మీ కొండొరులకు యుద్ధ మేర్పడును. అప్పుడు మిమ్ముని నేన సమావేశ పరతును. అతి గహేశ్వరుని (నూర్యుని) సురేశ్వరుని (ఇందుని) బిలిచి విష్ణువు ; భాస్కరా ! స్వేదజుడు వీడు. ద్వావరము చివర వీని నీయంశమున దేవతల కార్యసిద్ధికె యవతరింపజేయుము. యదు కులమున మహాబలశాలి యనువాడు జనించును. అతనికి (కుంతి) పృథయను కూతురు పరమసుందరి పుట్టును. దుర్వాసు డామెకు వరమునిచ్చి మంతనమూహము నుపదేశించును. ఈ మంతముచే భక్తితో. నీవే వేల్పును ఆహ్వానింతు వాదేవుని యనుగ్రహముచే పుతుడొకడు నీ కుదయించును. రజస్వలయై అమెయు నిన్ను ధ్యానించుచు నిలిచి సేవింపగలదు. ఆమె గర్భమునండీతడు కానీనుడుగ (కన్యకుబుట్టినవాడుగ) నుదయించును. దేవకార్యసిద్ధికీపని జరుగగలదు. తేజోరాశి నూర్యభగవాను. డట్ల యగుగాక. నేను కానీనునిం గొడుకుం గర్ణుడనువాని గనియెద. విపు లారాధించు విష్ణువు ననుగ్ర హమువలన నెవ్వరికి దానము సేయవలనుగానిదుండదో యట్టి కథావసంపన్ను నిం గుమారుని నేను నీమాటంబట్టి కనియెద నని భాస్కరుండు ననియె.

అవ్వల నీంద్రుని గనియు నంపిణతితో హరి ఓ నహసాక్షి ! ఇడుగో నా రక్తమునుండి యావిర్భవించినా డీతడు. నా యనుగ్రహమున - దీనిని స్వాంశముచే ధ్వావరాంతమున నవనివై నీవవతరింపజేయవలయును. పాండురాజు పృథను మాద్రిని భార్యలుగా పరిగ్రహించిన యతడరణ్యమున కేగును. ఆక్కడ నొక లేడి యతనికి శాపమిచ్చును. దానిచే వైరాగ్య ముదయించి యాతడు శతశృంగ పర్వతమునకేగి తన చేత్రమందు (కళతమందు) పుత్రులం గందునని భార్యతో ననును. ఆసమయమున నామె యది యభిలషింపక నేనెట్లును మానవమాత్రుని పుత్రుని గోరను. దేవతల యనుగ్రహము వలననే నేను కొడుకులం గోరెద ననును. అట్లానే నిన్ను బ్రార్థింప నీవు కుంతీకి నరనిం కుమారునిగ ననుగ్రహింపుము. ఓ శచీవతీ ! నా మాటగా నీ విట్లు సేయుము. నావినీ దేవేశుండు దుఃఖితుడై ఈ మన్వంతరమున నిరువది నాల్గవ యుగము గడువ నీవు రఘుకులమందు దశరధుని యింట రామ రూపమున రావణవధకు దేవతల శాంతి కొరకు నవతరించీ, సీతాదేవి కొరకడవిం దిరుగుచు సూర్యుని కొడుకు సుగ్రీవ హితవుకోరి నా కొడుకును వాలి యను వానర ప్రభువు జంపితివి. ఈ దుఃఖము నన్ను వేధించుచున్నది. అందువలన నేను నీవన్నట్లు నరుని కుమారునిగా నేను గైకొనననీయే.

 దేవేంద్రుడు కొడుకు గుంతీయందు గైకొననని యొండొక కారణమును బలుక హరి భూభారము డిగువ ప్రభూ! నేను భూలోకమందు సూర్యపుత్రుని నాశనమునకు నీ కొడుకు జయముకొరకును నవతరింతును. మీవానికి సారథ్యముగూడ సేయుదును. కురుకుల నాళము గావింతును. సావిని యింద్రు డానందమొందెను. సరుని గుమారునిగ గ్రహించెద. నీ మాట నిజమగుంగాక యని వరమిచ్చీ హరీయును సంతుష్టుడయ్యె:

ఇంద్రునంపి హరి బ్రహ్మంగని నీవీ ముల్లోకములం సృష్టించినవాడవు. కార్యమేదేని  జక్కబెట్ట నేను నీకు నహాయుడను. తాను నృజించి పెంచినదానిని స్వయముగ నాళ మొనరించుట. నా మతముగాదు. ఇట్టి యనహ్యమైన వని జేయుట శంకరుని జంప నుద్యుక్తుడై నవాని యెడ కోవము నుండి యీ పురుషుడు సృష్టించబడినాడు. నీవు నీ పాపమునకు బాయశ్చిత్తము చేసికొనుము. అగ్నిత్రయమును గ్రహించి యగ్నిహోత్రమును ఆహరింపుము. పుణ్యతీర్థమున పుణ్య ప్రదేశమందడవిలో" నీ పత్నితో గూడి నా మాట స్వీకరించి యజ్ఞము సేయుము. నీవు ప్రభువవుగావున నర్వదేవత లాదిత్యులు రుద్రులునుంగూడ నీ యాజ నొనరింతురు. గార్హపత్యాగ్ని యొకటి దక్షిణాగ్ని రెండవది ' ఆవహనీయము తృతీయాగ్ని ఈ ముర్వురను మూడు కుండలములందేర్పరుపుము. గుండ్రనిదానం దాత్మ నర్ఛింపుము. విల్లువోలె నుండు కుండమున నన్ను చతుష్కోణముగా నుండుదాన హరు నర్పింపుము. ఋగ్యజుస్సామ మంత్రములచే నీ యర్చన నేయుము. తవముచే (నగ్ని) యావిర్భవింపజేసి పరమాభివృద్ధినండి వేయి దివ్యవర్షము అగ్నిహోత్రముకంటె మించినది వవిత్రకార్యమిక లేదు. ద్విజులగ్నిహోత్రము చక్కగా నొనరించి పరిశుద్ధులగుదురు. ఈ యగ్నులు దేవలోకమునకు మార్గములుగా బ్రాహ్మణములచే నిర్మింపబడినవి. ఉత్తమ గృహస్థు బాహ్మణు డొక్క యగ్ని నెల్లయెడ ధరించవలెను. అగ్ని లేకుండ ద్విజుడు గార్హస్యమును బొందడు. అసవిని భీష్ముండిట్లనియె.

స్వామీ ! ఈ కపాలమందు ధనుర్ధారియై పుట్టిన నరు డీతడు మాధవుని వలన జనించెననిలేక తన కర్మముం బట్టి తానుదయించెనా ? లేక రుద్రుని వలనా ? లేక తన బుద్ధి ననుసరించి తాన కలిగెన్గా ? పారణ్యగర్భ డీయన యండ జుడు. ఆయన యైదవ ముఖ మద్భుత మేట్లు మీడికి లేచినది ? నత్త్వమందు రజస్సుగనబడదు.. రజస్సునందు నత్త్వ గుణ మెయ్యెడం గొనరాదు. అట్టిచో బ్రహ్మ సత్వగుణస్థితి నున్నవా డెట్లుదేకమండినాడు? మూడుడై హరుని జంపుమని నరుంబంపినాడన పులస్త్యుండనియె.

 మహేశ్వరుడు హరుడ నీ యిద్దరే నత్పధమందున్నవారు. ఆయనది కానిదేదియు నా మహాత్ములకు దెలియనిది లేదు. బ్రహ్మ యొక్క యైదవ ముఖము మీడికుండెను. గావున బ్రహ్మ రజోగుణపూరితుడై మూడుడయ్యెను. అందు వలన నితడు నేను నా తేజస్సుచేత జేసినదే యీ నృష్టియని యనుకొనెను. నాకంటే నింకొకడు దేవుడు సృష్టికర్త లేడు. దేవతలు గంధర్వులు పశుపక్షి మృగములతో నలముకొన్న దెల్ల నా సృష్టియే యని యా విరించి యైదు మొగములు గలవా డయ్యెను. అందు ప్రాజ్ముఖము. ఋగ్వేద ప్రవర్తకము. రెండవది యజుర్వేద ప్రవర్తకము. మూడవడి సామవేదమునకు నాల్గవది అధర్వణవేదమునకు, వేదాంగోపాంగములు ఇతిహాసము నరహస్యములు నసంగ్రహములు నగు వేదములను యెదవ ముఖముచే నధ్యయనము చేసెను. ఆయన యత్యద్భుతమైన యెదవ ముఖము వర్చస్సు లెవ్వని నింకొకని లెక్క నేయవు. ఆందరనట్టె చిమ్మివేయును. దరిజేరుటకుగానీ చూచుటకుగాని యెదురుగా నేగుటకుగాని శక్తులుగాక హడలిపోయి యందరు మహాప్రభువైన యా పద్మగర్పని దమ్ముదామ బెండువడినట్లనుకొని యడగారి తేజమెల్లగోల్పడి, వీని తేజస్పుచే నిస్తేజస్కులైతిమని శంభుని శరణోదుదమనుకొని దేవతలేగి నమస్కారము సర్వ ! నర్వేశ్వర ! మహేశ్వర నమస్కా రము నమస్కారము. నర్వజగతతిష్ఠ నీవు. విష్ణువుతో నీవు జగద్ధేతువవు అని దేవర్షి పితృదానవులచే స్తుతింపబడు వాడై చాటున యుడి మీ యిష్టముం గోరుకొనుడు దేవతలార! యనియె.

అప్పుడు దేవతలనిరి. దేవా ! ప్రత్యక్ష దర్శన మనుగ్రహించి యాభై మాయిష్టముం దయసేయుము. మాపై దయత్రూపి వరముంగూడ దయసేయుము. మా మహావీర్యము తేజస్సు ఓజస్ను పరాక్రమ ధేధిగలదో యదెల్ల యెదవ ముఖము తేజస్సుచే బ్రాహ్మచే గపువడినది. మా అన్ని వెలుగులు నశించిపోయినవి. నీ యనుగ్రహముచే తిరిగి యవి ముందటియట్ల నుండునట్లు చేయుము. అనవిని ప్రసన్నముఖడే వేల్పులచే మరిమరి మొక్కబడి రజోగుణాహంకారముచే మొద్దువారిన బుడ్డితోనున్న బ్రహ్మయున్న తావునకు జనియె. దేవదేవునాతని చుట్టురే గమ్ముకొని స్తుతించుచు దేవతలు నటు వనిరి. అట్లే తెరిచి. ఈదువి రజోగుణామృతుండగుట బ్రహ్మ గుర్తింపడయ్యే.

నహస్రకోటి సూర్య ప్రకాశమున ఆగమ్మును రంజింపజేయుచు విశ్వాత్మ విశ్వకర్త విశ్వముం భావించు నా బ్రహ్మ యట గానవచ్చెను. అట గూర్బున్న పితామహుని - యా దేవమండలముం దరిని రుద్రుడు ఆహా! నీ ముఖము మిగుల తేజస్సుచే దీపించుచున్నడని చంద్రశేఖరుం డట్టహాపము నేనెను. (విరుగబడి నవ్వేను). ఎడమ చోటనవేలి కొన చోట నాతని యొదవ తలను గోళ్ళతో నరటిదూటనట్లు తెంఛను, తెగిన తల యవ్వల శివుని చేతిలో గ్రహమండలము నడుము రెండవ చంద్రుడా యన్నట్లుండెము. మహేశ్వరుడా కపాలముం జేతం బైకెత్తి తలనున్న సూర్యునితో కైలాన వర్వతమట్లు వర్తనము సేసెను. తల తెగగానే, యావండమొంది. దేవతలానందభరితులై (జటాజూట్టుని) వృషభధ్వజుని యా దేవదేవుని స్తుతించిరి.

దేవతలు సేసిన రుద్ర స్తవము

ఇట్లు వేల్పులు నుతింవ వారిని వారి గృహమ్ముల కనిచి భగవాను డానందనలతో నక్కడనే యుండెను. బహ్మ యభిపాయ మెరింగి మహావీరుడగు నర్జునుని జన్మవృత్తాంతమెరిగి శాంతికొరకు. బహ్మ శిరస్సు త్రుంచి చేదోయి శిరమునం గేలించి యా విధాత కెరగి నిరుక్త మంత రహస్యములచేత ఋగ్యజుస్సామ సూక్తులచేత నా బ్రహ్మదేవుని స్తుతించెను.

రుద్ర కృత బ్రహ్మ స్తపశి

      రుద్రకృత బ్రహ్మ  స్తవము

ఆన నాలించి బ్రహ్మ యిట్లనియె.

నా చెలికాడు నారాయణుడతడు నన్ను బవిత్రుని జేయగలడు.  నీకు భక్తి యుదయించి  నన్ను  స్తుతింప దలపు గల్గినది. తల తెగిన నీ వీ కపాలముం జేకొని సోమసిద్ధాంతమును (జ్యోతిశ్శాస్త్రమును) రచించి శోట్లకొలది విపుల నుద్ధరింతువు. బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త వతము నీవు నేయవలెను. మరియేమియు లేదు. బహ్మఘాతుకులు పాపులు. విరుద్ద కర్మపరులు వైతానికులు (వితానాగ్ని (విద్యుత్తును) సేవింతురు. వారితో మాటలాడరాదు. ఆ దుష్టులు పావనివృత్తికి నూర్యునివంక జూడవలయును. ఆ పాపుల మేను దాకిన నచేల స్నానము సేయవలెను. నీవు బ్రహ్మ ఘాతుకుడై తివి శుద్ధికై వతమాచరింపుము. అది నేసినవీర బెక్కు వరములం బడయుడువు. . అని పలికి రుద్రుండు ననియె. బహ్మ యాయన రుద్రుడని గుర్తింపడయ్యె ఆవ్వల లడ్మినమేతుని వరదుని ధ్యానించెను.అయన సాక్షాత్క రింప సాష్టాంగ వణతుడై శంఖ చక్ర గదాధరుం దామోదరు నిట్లు స్తుతించెను.

రుద్ర కృత విష్ణు స్తవః

రుద్ర కృత విష్ణు స్తవము

అని కొనియాడ చకము చేబూని గరుడు నెక్కి భాస్కరుడట్లా గిరి నుద్దీపింపజేయుచు నా గిరీశం చూవులం దరి నెను. నీపాలిదర మేను వరమీయ వచ్చితి వరమడుగుమన రదవరండిట్లనియె.

సురేశ్వర! నాకు వెంటనే శుద్ధి కావలయు. మదీయ పాపహర హరిని నీకంటె నిరకొక వరమున ష్టమగు పదార్థమును గానము బ్రహ్మహత్యావళడనై న మేనిదై నల్లవడిపోయినది. ఇందు శవగంధము ఇనువ నగలు నేర్పడినవి. నాకిట్టి పాడురూవు లేకుండ పోవుటెట్లు ! మహాదేవ ! ఏమిసేయుదు ? నెద్దాన నాకు దొలుత్తటి శరీరము నీయనుగ హమున నేర్పడగల దది అచ్యుతా ! ఆనతిమ్ము, నావిని విష్ణువిట్లనియె.

నావిని విష్ణు విట్లనియె.

బ్రహ్మహత్య మహోగ్రమైనది.

 మనసులోనైన దలవరానది పోవుటకు బ్రహ్మ సేవన ప్రాయశ్చిత్త మినది , సేసికొనుము. ఒడలెల్ల  తికాలము భస్మము పూసికొనుట జుట్టున చేవుల చేతులు దేముకలు గట్టు మము. ఇట్లు సేసిన నేకష్టముం గలుగదు. అని భగవంతుడు సందేశమిచ్చి లడ్నీతో విష్ణువంతర్థానమొందెను.

అటుపై శివుడు కప్లాలముం బట్టుకొని భూమియెల్ల దిరుగాడుచు హిమవంతము మొదలు మహేంద్ర వర్వతము దాక యిందు పేర్కొనిన తీర్థ క్షేత్రములెల్ల దిరిగియు రక్షణ పొందలేడయ్యె. ఎప్పుడు తన చేతిలోని వరెం జూచుచు సిగ్గుపడుచు చేతులూరళ దులుపుకొనును వినరుచు తిరుగాడుచుండెను. ఎంతదులిపిన నా కపాలము క్రిందబడడయ్యె. అవు డేదేని వతము సేయవలెనను బుద్ది వొడమెను. నే జేసిన ప్రాయశ్చిత్తమును మున్ముందు ద్విజులు ననుష్ఠింపగలరు. అని యనుకొనుచు వరమేశ్వరుడట్లనే తిరుగుచుండెను. తుదకువచ్చి వుష్కరారణ్యముం బ్రవేశించెను.

నానాతరులతాయుతము నానామృగరవసంకులము చెట్లుతీగల పువ్వుల పరిమళించునది వాయువులు వీచుచుండ బుద్ధిపూర్వకముగ నెవరో యుంచినట్లున్న పూలనుండిచిమ్ముసువాసనలతో పండ్లతో నతిసుందర మీదు వొచ్చి భ కితోడి నాఆరాధన - మందికొని అరవిందగర్భుడు (బ్రహ్మ) వరమును బసాదించునది. బ్రహ్మ ప్రసాదముననే యీ పుష్కరమును గురించిన కోరిక సిద్ధించినది. పాపమునడంచి దుష్టమును వారించి పుషిని సంపదను బలమును బెంపొందించునది దివ్య క్షేత్రము లభించినది యని ధ్యానము సేయుచున్న మహా  రుద్రుని కెదుట భక్తి ప్రీతుడై పద్మజుడు సాక్షాత్కరించి వ్రాలిన రుద్రునిపై కెత్తి గురువుగా మతి యిట్లనియె. దివ్యమైన వతోపచారమున నా దర్శనము కావలెననీ నీచేనెంతో ఆరాధింపబడినాను. వ్రతనిషులు మానవులు దేవతలు నన్ను జూచెదరు. వారి కోరికతో పరమప్రవర మైన వరము నే నిత్తును. సర్వకామములు చక్కగ సిద్దించుటకు నంతరాత్మ సంతుష్టిగ త్రికరణశుద్ధిగ వ్రతమాచరించితివి. వర మేమి నీ కిత్తునది తెలుపుమన.

రుద్రు డిట్లనీయే :

 భగవంతుడా ! ఇదే మహావరము దోలును. జగద్వంద్య ! జగత్కర్తా ! నాకు గనబడితివి. నమస్కారము. బహుపుణ్యము యజ్ఞములచే బహుకాలము సంపాదించుకొన్నది ప్రాణములొడ్డి చేసిన తపస్సుచే నీవు గననౌదువు. దేవేశా ! ఈ కపాలము నా చేతినుండి జారిపడదు. ప్రభూ ! అందరు ఋషుల కసహ్యమై తలవంపు గూర్చుచున్నది. నీ ప్రసాదముచే కాపాలికమను వ్రత మాచరించితిని. ఈ మహావ్రతము సిద్ధించేనా ? శరణందితి నానతిమ్ము, పుణ్యసలమునందేక్కడ దీనిని విసరివైతునది పలుకుము. ఆత్మభావనులగు ఋషులకు పవిత్రుడయ్యెదను అని రుద్రుడన

బ్రహ్మ యిట్లనీయే :

భగవంతుని స్థాన మవిముక్త మనునది పురాతన మున్నది. కపాలమోచనమునకు నీకిదీ తీరముగాగలదు. నేను నీవు విషువు నిట నుంచుదము. ఇట నీ దర్శనమైనంత పరిశుద్దులై నాధవనమందిట సర్వభోగములనుభవింతురు, దేవతల కెంతో ప్రియమైన వరుణ - ఆసి యమ నదీమతలు లిటనున్నవి. ఆ నదుల నడుమ బ్రహ్మహత్య యెన్నడుర జొరబడదు. ఇక్కడ పోయినవారేలాటి భయములకం హంగాయాస్తు గ్వర్గమున కేగుదురు. ఐదుక్రోసుల కొలతను నేనీ చేత్రమును నీ కిచ్చితిని. ఈ క్షేత్రముమధ్యనుండి గంగ సముద్రమున కేగును. అప్పుడక్కడ పుణ్యమేన మొక పుర మేర్పడును. పుణ్యనదిగంగ ఉత్తరముగను సరస్వతి తూర్పునకు జాహ్నవి ఉత్తరముగను రెండామడలిట ప్రవర్తించును. దేవతలింద్రాదులందరు అటకు వచ్చి నాతో నుందురు. అక్కడ నీ కపాలము విడువుము.

అటకేగి పిండదానముచే పితరులను శ్రాద్ధమందు బ్రీతినందజేయువా రక్షయ పుణ్యలోకము స్వర్గ మందుదురు. వారాణసియందు మహాతీర్థమందు స్నానముచేసిన యతడు సప్తజన్మల పాపమునుండి ముక్తి నందును. ఇటకు యాత్ర సేనను జాలును. అది సర్వతీర్ణోత్తమము. నీకు మొక్కి ఇట ప్రాణము విడిచిన వారు రుదత్వమంది నీతో సమ్మోదింతురు. ఇట మనఃపూర్వకముగ నిచ్చిన దానము మహత్పలనిధానమగును. అది నీ ప్రభావమే. ఇట తమ శరీరము తాము చీల్చుకొని సంస్కరించుకొను  వారెప్పుడు రుద్రలోకమం దానందింతురు. (ఆత్మహత్యాదోషమచటలేదన్నమాట). ఒచ్చునోరములేని సాధువైన వయస్సులో నున్న యందమైన గోసుతము నిట (ఆబోతును) అచ్చోసి వదలినయతడు పరమపద మందును. పితరులతో గూడ మోక్షమందును. ఇందు సందేహములేదు. పలుమాటలేల? అక్కడ మానవులు ధర్మోద్దేశముతో నే పని చేసినను నది యంతులేని ఫలమిచ్చును. ఆ తీర్థ మవనీలో స్వర్గమునకు అపవర్గమునకు (మోక్షమును) గూడ కారణమని ఋషి సమ్మతము. స్నానము జపము హోమము దానము ననంత ఫలదము. భక్తితో రుద్రపరాయణులై వారాణసీ తీర్థమున కేగి యట పంచత్వమునందినభక్తులు పితృదేవతలు, పితామహులు, (తాతలు). వసువులు, రుద్రులు, ప్రపితామహులు (ముత్తాతలు) ఆదిత్యులు నౌదురని వేదమువలన వినికి. ఇట పిండదానవిధి మూడు విధములని నే జెప్పితిని. ఇటకు యాత్రవచ్చిన మనుజుపుతులు, పిండ దానము శ్రద్ధతో చేసి తీరవలెను. సుపుత్రులు వారే పితరులకు సుఖమిచ్చినవారు. దర్శనమాత్రమున ముక్తినిచ్చు తీర్థమునునే నీకు దెల్పితిని. అచట స్పా సముచేసిన జన్మబంధమునుండి ముక్తినందును. రుద్రా ! అచ్చట యథాసుఖముగా బ్రహ్మహత్యనుండి నీవు ముకుడ వే భార్యతో నేనిచ్చిన యీ యవిము కక్షీరమందు సుఖమందుము. అన శివుడు నీ మాటంబట్టి పృధివిలో నన్ని తీర్థములండు విష్ణువుతో నీతో నేనుందును. నేనుకోరువరమిది. నేను దేవుడుగా మహాదేవ ! నీతో నెల్లప్పుడారాధ్యుడనగుదును. సంతుష్టాంతరంగుడనై యీ వరమిచ్చుచున్నాను. విషువునకును కోరిన వరములిత్తును. దేవతలకు మునుల కందరకాత్మభావనులకు నిచ్చువాడను నేనే. ఇంకొక రెట్లునుం గాకూడదన బ్రహ్మ - రుద్రా ! నీయన్న శుభవచనము నేనిట్లేచే సేదను. నారాయణుడును నీ వన్నట్లు సేయును. సందియము లేదు అని రుద్రుని గూర్చి పలికి వెళ్ళి వారాణసియందు దివ్యతీర్థము నేర్పరచెను.

ఇది సృష్టి ఖండమునందు బ్రహ్మహత్యా నాశమను పదునాల్గవయధ్యాయము.