పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
15 - బ్రహ్మసఖా వర్ణనమ్
బ్రహ్మ సఖా వర్ణనము
భీష్ముడనియె : -
మునీంద్రా ! వారాణసి క్షేత్రమున కంపబడి చతుర్ముఖ బ్రహ్మ యేమి సే సేను? హరిహరులేమిగాంచిరి? బ్రహ్మ యజ్ఞమే క్షేత్రమందు జేసే నానతిమ్ము . అందు సదస్యులు ఋత్విజులెవరు? అర్చింపబడినదేవతలెవరు? విన ముచ్చటపడుచున్నా నానతిమ్మన పులస్త్యు డిట్లనియె:
శ్రీనివాసమను పుర మొకటి మేరుశిఖరమున నిర్మింపబడెను. అది వింతల కెల్ల వింతైనది. బహువృక్ష సంకులము. బంగారము మొదలగు పెక్కు గనులకు నిలయము. అచ్చమగు స్ఫటికముల గడునిర్మలము. కొండ వాగుల జలధారాశీకరముల జలవలంజిమ్మునది. పలుతీవల సొంపొలుకును. నెమళ్ళ కూతలను సింహగర్జనములను నేనుల ఘీంకారములను సంకులము గాలిందూగు తరువులచే తేరిన మడుగులును, కస్తూరి వాసనల జిమ్ము వనములచే పూలనేతావులం జిమ్ముపొదలందు రతిసలిపి విశ్రమించు తెరువరులు విద్యాధరులచే నతిసుందరము. కిన్నరుల మధురగీతముల ప్రతిధ్వనించు నా నగరమందు “వై రాజ” మను బ్రహ్మభవనమొకటి కలదు. అందన్ని యెడల నెన్నే ని చి తాతిచిత్ర శిల్పవిన్యాసములు దివ్యాంగనల సంగీతములు వీణా వేణుమృదంగాది బహు విధ మధురనాదములు పతిధ్వనించు కాంతిమతియను దీవ్యసభామందిరమందు గలదు. దేవతలకది యెంతేని హాయిగూర్చునది. రంగు రంగుల రత్నాలరాసుల కాంతుల విచిత్రితము. ఋషిసంఘములు మునిబృందములకు కొలువై నది. ద్విజుల సామగానములచే మార్మోయునది బ్రహ్మానందదాయియగు నా బ్రహ్మ సభయందు దేవేశుడు ధ్యాననిష్టుడై కూర్చుండెను.
జగన్ని ర్మాతయగుదేవదేవుని ధ్యానించు నా బ్రహ్మదేవుని కొకచక్కనిబుద్ది పుదైసు. ఏను యజము సేయవలయు సది భూతలమునం దేక్కడ ? పృథివియం దిట కాశీ క్షేత్రము మొదలుగా ప్రభాసమువరకు పేర్కొన బడిన తీర్థములెన్నో కలవు. నా యాజ్ఞచే రుద్రుడు నిర్మించిన ఎన్నో కలవు. కాశి ప్రయాగ తుగ నై మిశము శృంఖలము, కాంచి భద్ర దేవిక కురుక్షేత్రము సరస్వతి ప్రభాసము మొదలగు తీర్థములు. దేవాదిదేవుడ నేనై నట్లు తీర్ధముల కెల్ల మొదలైన యాదితీరమొకటి నే నిర్మించెద. విష్ణువు నాభికమలమునుండి గదా నేను పుట్టితిని. నా వలన పుట్టిన తీర్థమిదియును పుష్కరము (పద్మము) అను పేర వేదపాఠకులు పేర్కొనవలయును. ఇట్లాలోచించు నా ప్రజాపతి తలపుకలిగిన యాక్షణమే యాముందరి ప్రదేశములకేగి అటనొక దివ్యవనముం బ్రవేశించెను. ఆది నానాతరులతాకీర్ణము వన్నె వన్నెల పూవుల నింపౌలుకునది. పలువిధములైన పక్షుల కిలకిలారావముల సంకులము. ఎన్నో మృగములగుంపుల గూడినది. పూలబండ్లను సువాసనల సురలనేకా దసురులనేని వాసింపజేయు నావాసమది.
పుష్కరవనశృంగారవర్ణనము - పరమాద్భుతము
సువాసనలచే బంగారు రంగుచే రూపముచే ముక్కునకు, కన్ను లకు మనసున కింపుగూర్పు హలతో నాలుకకు రుచులునించు పండ్లతో బుద్ధిపూర్వకముగా గూర్చినట్లున్న యింపుగొలుపు ప్రదేశముల నెండు గడిని చెత్తను ఎండు పుల్లలను వాయుదేవుడు నింగికి నేలకు నలుదెసలకు విసరివేసి పరిశుభ్రము సేయుచుండును. పచ్చని తళుకులీనుచు పురుగుకొకని చినుగని చెట్లతో రకరకాలయాకులంబూవులం దావులు వైనలముకొన, గుండ్రనీ. బోదెల ఋత్విక్కులసందడిగొను శోత్రియకుటుంబమట్లు తీవపొదలతో సువాసనల నెంతో శోభించుచుండును. గై రికాది ధాతువు లట్లు రంగురంగులునించు ,చివుళ్లతో తమయుత్తమగుణసంపద నింపొదవు నుత్త మవంశ సంతానము తోడి మానవు అట్లావృత్తములై, గాలికి వైదూగు వై కొమ్మలతో నొండొకటి తాకుచున్నట్లు పరస్పరము మూర్కొని ముద్దులాడుచున్న గ్లిట చెట్లుతీవ లేంలేని ముచ్చటగొల్పుచుండెను.
అందొకట నాగవృక్షములు ప్రబచెట్లు పూలతో నల్లని కనుపాపలతో చంచలించు కన్నులతో నట్లు సొంపులు నించుచుండెను. నిండ నిండిన పూలతోడు చిగురు కొమ్మలం(గర్ణికారములు) రేల చెట్లు (జంటలు) దీరి దరియుచు విడువడుచు దంపతులట్ల శోభించుచుండెను. చక్కని పూలతో నూగులాటల వావిలిచెట్ల తోపులు పూజలందుకొన్న రూపుగొన్న వనదేవతలట్లు భాసించుచుండెను. ఒక్కొక్కచో మొల్లతీగలు పూలతో నగలతోవలై వెలుగులజిమ్ముచు చెట నలుదెసల చిన్ని బాబిల్లివోలేనుల్లసిలుచుండెను. మద్దిచెట్లేరుమద్దెలునిండపుష్పించి యచ్చమగు పట్టుబట్టలం గటుకొన్న పురుషులట్లుండెను. పూచిన తిని సెలుపూదీగలతో జుట్టుకొని తమయిల్లాండ్ర కౌగిలినున్న ప్రియులట్ల ప్రియము గొల్పుచుండెను. సాలములు, ఏపిచెట్లు, అశోకములు (హేమపుష్పములు) చిగురాకులతో పరస్ఫరము తాకక, చేతులం జేతులు తాకుచున్నట్టుండి చిర కాలమునకు కలిసికొన్న దంపతులట్లు సొంపు నింపుచుండెను. పండ్ల, పువ్వుల బరువున వ్రాలి పనసలు తెల్లతెగడలు పూలనుబండ్ల నొండొరులను సర్చించుకొనుచున్నట్లుండెను. గాలి వేగమునదూగుకొమ్మల విశాలబాహువులచే దగ్గరకు వచ్చిన జనమున ముచ్చటగొని(భక్తింగొని) చక్కనిపూలమాలల రహదారులనలంకరించి యెదురుసని స్వాగతమిచ్చుచున్నట్లుండెను. వసంతోత్సవమునందు ప్రజ లొండొరులు పంది ములు వేసికొని యెగిరి గిలిగింత లిడినట్లు పుష్పశోభల నిండుకొని గాలులందూగు పూలకొమ్మలలో, పూలమాలల తలచుట్టుకొన్నట్లు కొండగాలితూగుచెట్ల గాలికిం తూగు తీవెలతో ప్రియురాండ్రతో దూగు మానవులట్ల నృత్యము సేయ చున్న ట్లందము గొలుపుచుండెను. ఒక్కింతమహల వంగిన తీవలతో నావరింపబడి వృక్షముల శరత్కాలమున రంగురంగుచుక్కల నలముకొన్న యాకసమ ట్లా వనమెంతో శోభించెను. పూచినమాలతీలత వై వైని చెట్ల పై బుద్ధి పూర్వకముగ నెవరో వెట్టిన కిరీటములట్లుండెను. ఆకుపచ్చనివి బంగారురంగులవి పూచిన పండిన చెట్లు సాధువులు మహాత్ములు) వచ్చినపుడు , ఆప్యాయము. చూచునట్లు ఫూలపుప్పొడి కపిలవర్ణము (ఎఱుపు) పలుదేసల నలమి దీరి సేనలట్లుండెను. కడిమిపూవులకు జేకొట్టినట్లు తుమ్మెదలు ఝుంకారముల సేయుచుండెను. చెట్ల గుబురుల. మగకోకిల లాడుకోకిలతో నెగురుచు శిరీషములున్నట్లు చిలుకలుజంటలుగా నొకచో చిత్ర ముగా పూజలందుకొను విప్రులట్లుముచ్చటించు చుండెను. నెమళ్లు తోటివానింగూడి రంగురంగుల పింఛములలో గూయుచు గంతులు వేయుచు పక్షు లవ్వనమును నందనవనమున బ్లెంతో మనోహర మొనరించుచుండెను.
వృక్షదేవతానాం బ్రహ్మణా సమాగమః - సంభాషణమ్
బ్రహ్మ దేవునితో వృక్షదేవతల సమాగమము - సంభాషణము
బ్రహ్మ యా వృక్షదేవతా పంక్తుల నెల్ల పవిత్రము సేయుట కల్లన చల్లనిచూపుల నద్ధములో నట్లు జూచెను. ఆదయ సేసిన బ్రహ్మదేవుని వనదేవత లెల్ల దర్శించి భక్తితో విన్న వించి పూలజల్లులను గురి పించిరి. పితామహుడాతరువుల పూజలను గైకొని వరముకోరుడు. మంగళమగుగాక ! యన వారంద రే మాత మభ్యంతరము గొనక, చేతులు మొగిచి మొక్కి, శరణాగత వత్సల ! భగవంతుడ ! ఎల్లపు డిచటనే వన మున మాకు దగ్గరగుము. ఇదియే మా పరమాభిలాష. నీ కిదేనమస్కారము. నిండుమనసున తీర్థముల సన్నిధి సేసిన నిది యే పర మోత్త మవర మగును. అన బ్రహ్మయిట్లనియె.
ఇది పరమపవిత్రపుణ్య క్షేత్రము గాగలదు. ఇటి నీతరురాజములు పుష్పఫలసమృద్ధములై నిత్యయౌవ్వన ములై కామగములై (స్వేచ్ఛాసం చారులై కామరూపములై మానవులకు తపఃఫలసిద్దిరూపములై వెలుగొందున వై సంపత్సమృద్ధములగుగాక. యని భక్త వరదుడు బ్రహ్మ యిటు వనదేవతల వృక్షదేవతల ననుగ్రహించెను.
బ్రహ్మణా పుష్కర క్షేపణమ్
- బ్రహ్మ పుష్కరమును విసరుడు -
బ్రహ్మదేవుడట వేయేండ్లుండి యాపుణ్యభూమి పై పుష్కరమును (పద్మమును) విసరేను. దాన భూమి పాతాళము కంపించెను. సాగరములు వివశములై కెరటములుబికి చెలియలికట్ట దాటినవి. పిడుగువడి దెబ్బతిన్నట్లు పెద్దపులులు మొదలగు మృగము లడ గారినవి. పర్వతశిఖరములు విరిగి పడెను. దేవసిద్ధవిమాన ములు గంధర్వనగరములు ఒల్లచెదరై నేలగూలేను. ఆకసమునుండి కపోతమేఘములు (పావురముల రంగు గలవి) కారుమబ్బులు కుంభవృష్టిగ లాకసమునుండి సుడిదిరుగుచు నీటిధారలం గురిసినవి. నింగిగల నక్షత్రాదులవెలుగుల గొందుపరచుచు తీవ్రములగు మెఱుపుల నించినవి. ఆ పెనుసవ్వడిం జగము మూగ గ్రుడ్డి చెవిటియు నయ్యెను.
చరాచరత్రైలోక్యమెల్ల వ్యాకుల మయ్యెను. సురాసురులశ రీరములు, మనస్సులు వశముదప్పి ఏమిది యీ సడిలేమని బెదరి బెదరి కారణము తెలియరైరి. ఎట్లో ధైర్యముతెచ్చికొని యందరు బ్రహ్మకై వెదకు లాడిరి. కాని యాయన గానరైరి. భూమి యెందులకు కంపించెను. ఇదియేదో కాబోవు నుత్పాతమును సూచించు దుర్నిమిత మని జోబించుచుండ వారిదరికి విష్ణు వేగెను. ఆయనకు వ్రాలి మొక్కి దేవతలు; స్వామీ ! యీ మహోత్పాత సూచనల లక్షణమేమి సెలవిమ్మిది కల్పాంతమా.
సముద్రములు హద్దు మీరినవి. దిగ్గజములు నాల్గు నూగులాడినవి. ఆచలములు (పర్వతములు) చలించినవి. సముద్రజలముచే భూమండలమెల్ల గ్రమ్ముకొన్నది. పనిలేకుండ నింత సడి యూరక కలుగదు. ఈవీన్న చప్పుడింతమున్నెన్నడు కాలేదు. కాబోదు. రుద్రు డుద్యమించి ముల్లోకమాకుల మొనరించెను. ఇది లోకములకు దేవతలకు శుభమా ? అశుభమా ? స్వామీ ! ఎఱుగుదువేని మా కేటిగింపుమన విష్ణువెంతో ఆనుభావింపబడి యిట్లనియె.
భయపడకుడు. అందు వినుడు. నిశ్చయముగ నిట కారణమెటిరి. జరిగినది చెప్పుచున్నాను. బ్రహ్మ పద్మమును జేకొని యీ భూమియందు పుణ్యస్థానమున యజ్ఞము సేయ నిలిచేను. పర్వతము వై నెక్కుచుండ పరమశోభనమైన యీవనమందు కమల మాయనచేయిజారిధరణింబడియెను. దానిదీ మహాధ్వని. మీరంద రదరిపోయినారు. అక్కడ తరబృందము చే పూలపరిమళముచే నభినందింపబడి మృగములు, పక్షులతో నెల్ల జీవుల ననుగ్రహించుట కట నివాసము కోరెను. అది పుష్కరమను పేర బ్రహ్మ క్షేత్రము, విష్ణు క్షేత్రముగ నుండెను. నాతోగూడ తామట కేగి బ్రహ్మను సంతోషింపజేయనగును. ఆట మీచే బ్రహ్మ యారాధింపబడి భగవంతుడు మహావరముల నీయగలడు. అని పలికి విష్ణుపు దేవతలతో దానవులతో బ్రహ్మయున్న యావనము చాయకు జనెను.
వాయు దేవేన దేవానాం బ్రహ్మదర్శనవిధానవర్ణనమ్
విష్ణువు దేవదానవులతో బ్రహ్మయున్న యవ్వనము వైప్రదేశమునకు వచ్చెను. అందరును మిగుల హర్షించుచు, నట కోకిలల పలుకులం బలుకరింపబడి పూలరాసులనెంతేని చెలువొందు నా బ్రహ్మ వనముం బ్రవేశించిరి.
- బ్రహ్మవనసౌందర్యము -
నందనవన మట్లు దేవతలావనమందడుగిడగానే పద్మినీమనోహరము సర్వపుష్పోహోభితము నే యలరెను. బ్రహ్మదేవు డిటనున్నాడని దేవత లింద్రునితో గూడ నలుదెసల వెదకులాడిరి కాని యద్బుతమా వనము తుదిగానరైరి. వారికట వాయుభగవాను డెదురుపడెను. అతడు వారింగని, బ్రహ్మను మీరు తపస్పులేకుండ గానలేరనియె. దానికి వేల్పులు ఖిన్ను లై మటిమటి యట కొండచరియల నలుదెసల లోయల వెదకి వేదకి వాయువన్న మాట నెదనిల్పి యెంతో శ్రమించిరి. మరల వాయువు వారింగని దర్శనోపాయములు మూడురకములు శ్రద్ధతోడి జ్ఞానము, తపస్సు, యోగము అని చెప్పబడినవి. దేవుడు సకలుడు నిష్కలుడును. అనగా రూపము గలవాడు. రూపములేని వాడు. యోగులా రెండు విధముల భగవంతుని దర్శింతురు. తపశ్శాలురు సకలుని (సరూపుని) జ్ఞానులు పరమ పురుష నిష్కలుని (నీరూపుని) గాంతురు. విజ్ఞాన ముదయించినను శ్రద్ధ కొలవడినచో గానలేరు. పరమ భక్తితో మట్టుకు యోగులు వేగముగ బ్రహ్మను దర్శింతురు. ప్రధానపురుషుడీశ్వరుడియన నిర్వికారుడు ఈశ్వరుడు కర్మముచే మనసుచే మాటచే శుద్దులైన వారికి దర్శనీయుడగును. పితామహుడు బ్రహ్మా రాధన తత్పరులు మీరు. మంగళమగుగావున మీకు ! బ్రాహ్మీదీక్షనందిన భక్తులకు ద్విజులకు నెల్ల వేళల నేను గనిపించి తీరవలెనని యాయనే యనుకొనుచుండును. అని వాయువన్న పలుకు విని, ఇది హితమైనదని గమనించి, బ్రహ్మపై మనసువడి, యా పై బృహస్పతిని గని యిట్లనిరి ప్రజ్ఞాన విబుధుడవు జ్ఞాన విజ్ఞానములు రెండిటం బండితుడవు. మాకు బ్రాహ్మీదీ నొనరింపుమనిరి. వెంటనే కోరి వేదోక్త విధానమున గురువు వారివి దీక్షింప జే సేను.
యజ్ఞప్రయోగవర్ణనమ్
బృహస్పతి దేవతలకు బ్రహ్మదీక్షనిచ్చుట
వినీత వేషులై (ఆడంబరములు తగ్గించుకొని) సురలు గురువునకు వ్రాలిమొక్కి అంతేవాసులైరి. శిష్యులైరి, బ్రహ్మప్రసాద మందిరి. పౌష్కరము (పద్మ సంబంధమైన జ్ఞానము వారికుపదేశింప బడెను. ఆపైని బృహస్పతి (ప్రతిభావంతుడు) ఆధ్వర్యు! శ్రేష్ఠుడు యజ్ఞమొనరించెను. తూడుతోగూడ పద్మమును పద్మదీక్షా ప్రయోగానుసారము ప్రతిష్టించి వారియిచ్చచే బ్రేరితుడై వివేకులగువారికి వేదోక్త విధానమును దెలిసిన వాడుగావున వింతగొనక త్యాగబుద్ధితో ననుగ్రహించి యమరులకు దీక్షనిచ్చెను. అందఱకు నొకే యగ్నిని సంస్కరించి వేదము సెప్పిన ఆంగిరసము (బృహస్పతి దేవతగాగలది) మంత్రము నుపదేశించెను. తిసుపర్ణము త్రిమధువు పవిత్రము సేయు పావమాని యను మంత్రముల జపవిధినెల్ల నుదారబుద్ధితో శిక్షణ యిచ్చేను. ఆపోహిష్ణామయోభువః అను మంత్రముతో బాహ్యస్నాన మది పాపహరము దుష్టశమనము పుష్టిని సంపదను బెంపొందించును, సర్వసిద్ధినిచ్చునది కీర్తి నిచ్చునది కలిపాపముల హరించునది. సర్వ విధముల దానితోబాహ్యస్నానము సేయవలయును. దేవతులట్లు దీక్షితులై మౌనవ్రతమూని ఇంద్రియములనదుపునంబెట్టుకొని నిగ్రహముకొని యందు కమండలువుల సేకొని కచ్చలదాక రుద్రాక్షమాలలు వేలాడ దండములు సేకొని నారచీరలం గట్టుకొని జడలచేశోభిలుచు స్నానము ఆచారము ఆసనమునందు ముచ్చటగొని ప్రయత్నపూర్వకముగ ధ్యానము ధారణము మొదలైన అష్టాంగయోగములగొని బ్రహ్మయందు మనస్సులంగించి, యాహారనియమమూని చూచుట మాటాడుట కలియుట తలచుట మొదలయి పనులెల్లమాని నిలిచిరి. ఇట్లందరు వ్రతమూ త్రికాలమున్నా నము సేయుచు పరమభక్తి తో పరమనిష్ఠతో జాలకాలము సేసిన ధ్యానముచేతనే జ్ఞానముదయించిన మనస్సులుగలవారైరి. అటి బ్రహ్మ జ్ఞానమనునగ్ని చేదగ్గమై స్థూలశరీర మెడలి సూక్ష్మశరీరము మన స్సెప్పుడు శుద్ధమైనదో ఆవెంటనేభగవంతు డందల కేట్టయెదుట సాక్షాత్కరించెను. ఆయన తేజస్సుచే ఆప్యాయతులై భ్రాంతచేతస్కులై రి. (కంగారు పడిరి.) ఆ వైనిధైర్యము తెచ్చికొని యానందభరితులై యిష్టదేవుని యధావిధి షడంగ వేదయోగమున దదేక మనస్కులై శిరములం దోసిలొగ్గి ధరణికిందలలు వాంచి యాసృష్టికర్తను స్థితికర్తను ఈశ్వరునిటు స్తుతించిరి.
దేవానాంబ్రహ్మస్తుతిః
దేవతలు సేసిన బ్రహ్మస్తుతి
అని యిట్లు దేవతలు స్తుతింప బ్రహ్మ విద్వరిష్ణుడు బ్రహ్మ నన్ను దలచుకొనిరి మీకు సౌదర్శనమమోఘము బిడ్డలారా ! మీ కోరికల దెలుపుడు. వరములయిన (శేష్ఠములయిన) వరములిత్తును. అని భగవంతుడు ముచ్చటింప వేల్పులు ముచ్చటగొని యిట్లనిరి. తండ్రీ ! ఇది యొక్కటియ వరము మహావర ము చాలును. నీవు కమలము నది విసరినంతఁ బెద్దసడియయ్యెను. ఆ చప్పుడునకు పుడమి కంపించినది. లోకములాకులములే నవి. ఇది యూరక జరిగినది కాదెందుల కీ మాత్రమున నింత జరిగినది కారణ మానతిమ్ము అనిరి.
పుష్కర తీర్ధసంభవః
భూమి యెందులకు కంపించినది. లోకము లెందులకు వ్యాకులమందింపబడినవి ఊరక యిటు జరిగెనను కొనను. ఇచట కారణము సెలవిండన బ్రహ్మయనియె. మీ మేలుకోటికీ దేవతల రక్షించుటకు నే నీ పద్మ మిటనుంచితిని. ఇట కారణమాలింపుము. వజ్రనాభుడను నసురుడు పిల్లల ప్రాణములుతీయువాడు. ఆయుధము లను విడిచి తపోనిష్టులైయున్న మీరాక నెఱిగి సన్నద్దుడే. యిందుడు మొదలుగ నెల్లదేవతలను మిమ్ము జంపగోరి వచ్చెను. కమలమును విసరి వానిం జంపవలేనని నిర్ణయించితిని. రాజ్యసంపదచే మదమెక్కిన వాని నేనటీ తామరపూవు వైవై చి వానిం గూల్చితిని.
- బ్రహ్మకృతపుష్కరక్షేత్రప్రశంస -
ఈలోకమందున్న నాభక్తులు వేదపండితులు బ్రాహ్మణులు దుర్గతిపాలుగారాదు. తిరిగి వారు సద్దతినందుదురు, నేను సురాసుర నర నాగుల కెల్ల భూతముల కెల్లరకు సముడను. మీ మేమముకోట కీ పాపాత్ముని గూల్చితిని. ఈ పద్మమును దర్శనము సేయుటవలన నీ పాపాత్ముడును పుణ్యాత్ములలోక మందెను. ఇచ్చట నేను పద్మమును విసరిన కతన నిది భూమియం దీ తీర్థము పుష్కరము (పద్మము) అనుప్రసిద్దినందును. ఇది పావనము (పవిత్రము) యేల్ల జంతువులకు పుణ్యప్రదమని వర్ణింపబడును. భక్తి నిగోరు భక్తులయెడ ననుగ్రహముచే నిది నిర్మింప బడినది. ఈవనమందు వృక్షములు ప్రార్ధింప నిట వచ్చిన నాతోగూడ తపస్వులగు తమ కపూర్వజ్ఞానము ననుగ్రహింప మహాకాలుఁడు (శంకరు) డిటకు వచ్చియున్నాడు.
- బ్రహ్మ గుప్తవ్రతప్రశంస -
దేవతలు మీరు స్వార్ధము పరార్ధము గూడ హృదయమందుంచి కొనుడు. నానారూపములు ధరించి యిట మీరు దర్శనము నిండు. జ్ఞానిని విప్రుని ద్వేషించి నరుడు పాపమున బాధనొందును. కోటిజన్మలకై న యా పాపమునుండి ముక్తి పొందడు. వేద వేదాంగ పారగుని విప్రుని జంపరాదు నిందింపరాదు. అట్టివాని నొక్కని జంపిన కోటిమందిని జంపినట్లగును. వేదాంత పండితుని కొక్కనికి శ్రద్ధతో విందు సేసిన కోటిమంది విప్రులకు భోజనము పెట్టినట్లగును. ఇందు సందియము లేదు. యతులకు పాత్రనిండ బిక్ష వేట్టినతడు సర్వపాపముక్తుడగును. అతడు దుర్గతిపాలుగాడు. పితామహుడను దేవతల కేను బెద్దను ప్రియుడనై నట్లు. జ్ఞాని నిర్మముడు (నాదియని లేనివాడు) చేయిసాచని యతడు నిత్యపూజ్యుడు. సంసారబంధము విడివడుటకు “బ్రహ్మగుప్తము” అను వ్రత మిది. నేను విప్రులకు పునర్జన్మరాకుండుటకు రచించితిని.
బహుపాపములు- తత్పలితములు
అగ్ని హోత మారంభించి యింద్రియనిగ్రహములేక విడిచినవాడు యమకింకరులుగొనిపోవ గౌరవనరక మున కేగును. లోకయాత్రయే ముఖ్యముగా నీచమైన పని సేసినవాడు సరాగి శృంగారి స్త్రీధనప్రియుడు ఏకభోజి (ఎవరికింబైటక తానే పిండివంటల మెక్కువాడు) వ్యవసాయము వర్తకము సేయువాడు వేదముచదువనివాడు వేదము నిందించువాడు పరభార్యను బొందువాడు ఇంక నెన్నో పాడుపనుల పొడువడినవాడు=వానితోమాటలాడినవాడును. ఉత్తమ వ్రతదూషకుడు నరకమున కేగును. అసంతుష్టుని (సంతోషింపనివానిని) భేదబుద్ధిని దుర్బుద్ధిని పాపిని దాకగూడదు. తాకేనా స్నానము సేసి శుద్దుడగును. అని పలికి బ్రహ్మ దేవతలతోగూడ నట క్షేత్ర మేర్పఱచెను. అదియెల్ల నీకు జెప్పెదను.
పుష్కరక్షేత్రనిర్మాణము
చంద్రనది కుత్తరము సరస్వతి తూర్పు నందనవనము ముందు ప్రదేశ మంతయు పుష్కర క్షేత్రమది. యావత్కల్పముండునది. సృష్టికర్త బ్రహ్మయిది యజ్ఞవేదికం గావించెను. ఇది త్రైలోక్యపావనము జేష్ఠము ప్రథమ మిదియని తెలియనగును. బ్రహ్మదేవతాకమని ప్రఖ్యాతిగన్నది. ఇటమధ్యమతీర్థము వైష్ణవము. విష్ణుదేవతాకము. కనిష్ఠము రుద్రదైవత్వమునుగా బ్రహ్మ యేర్పఱచెను. మొదటి దీ పుష్కర క్షేత్రము వేదములందు గుహ్యముగ (రహస్యముగ) పేర్కొనబడినది. ఇటనరణ్యముగూడ పుష్కరము. ఇట ప్రభువు తానుగా బ్రహ్మ, బ్రాహ్మణుల భూమింజరించు నెల్లర ననుగ్రహింప సన్నిహితుడై యుండును. బంగారువజ్రముదాకగలభూమి యజ్ఞవేదిక కంకితమైనది. రత్నములచే రంగురంగుల విచిత్రము మెట్టిమను సర్వశోభనమట నిర్మింపబడినది. లోకములతాత భగవంతుడువిధాతయట క్రీడించును. విష్ణువు రుద్రుడు వసువు. అశ్వినీదేవతలు సప్త మరుత్తులు మహేంద్రునితో దేవతలు నటరమింతురు. ఇది నిజము లోకానుగ్రహకారణము నీకు దెల్పితిని. సంహితాను క్రమముగా (సంహిత పదము క్రమమువరుసలో) యథావిధి మంత్రములతో నిట వేదపఠనము గురుశుశ్రూషా సకులై యిట వేదముల పఠించు విప్రులందరు బ్రహ్మ సామీప్యమందాయనచేదలపబడి యిట నుందురు.
భీష్ముడనియె. భగవంతుడా ! బ్రహ్మలోకముగోరి యీ పుష్కరారణ్యమందు క్షేత్రమందు వసించు నరులు స్త్రీలు. నాలుగువర్ణములాశ్రమముల వారెట్లు వసింపవలెనేమి సేయవలె నదియెల్ల నానతిమ్మన పులస్త్యుం డిట్లనియె.
నేసెప్పిన యందరు స్వధర్మమాచారముందప్పక డంబము మోహము విడిచి త్రికరణశుద్ధిగ బ్రహ్మయెడ భకులె యింద్రియ నిగ్రహముగొని అసూయలేక నీచులు గాక సర్వభూత హితముగోరి యీ క్షేత్ర సేవ సేయవలెను. అనవిని భీష్ముండు ఏకర్మమొనరించి యిట బ్రహ్మ భక్తు డనిపించుకొనును? బ్రహ్మభక్తు లేలాటివారిని స్మృతులు పేర్కొన్న వానతిమ్మన పులస్త్యుడనియే.
త్రివిధభ క్తిస్వరూపవర్ణనమ్
-త్రివిధభక్తిస్వరూపవర్ణనము -
మనస్సు మాట శరీరము ఆనుత్రికరణములచే నేర్పడుభ క్తి మూడు విధములు. ఆది లౌకికి వై దికి ఆధ్యాత్మికి అని మటి మూడురకములు ధ్యానము ధారణము చక్క నెగి వేదార్దము జ్ఞప్తి గొని బ్రహ్మకు ప్రీతి గూర్చు భ క్తి యిది మానసి యనబడును.
మంత్రములు వేదములనమస్కారములతో అగ్నిహోత్రము శ్రాద్ధము మొదలయినవాని భావించి యావశ్వ కములై న యాయాదేవతాజపములు నేచేయునది వాచికీభక్తి.
వ్రతోపవాసాదినియమములచే చిత్తము నింద్రియముల నిరోధించి కృచ్ఛచాంద్రాయణ సొంతపనములచే బ్రహ్మకృచ్చోపవాసములు మజీ యాయాశుభ వ్రతములచే చేయునది కాయికీభక్తి యీ మూడును ద్విజులు సేయ వలసినవి. ఆవుపాలు పెరుగు నేయి రత్నదీపము కుశోదకము గంధములు పూలమాలలు శాస్త్రము సెప్పిన రకరకాల ధాతువులు నేయి గగ్గులు నల్లఅగరు మొదలయిన పరిమళములచే బంగారురత్నాల రంగురంగులనగలచే భక్ష్య భోజ్యలేహ్యపానీయములను నాలుర కాలపిండివంటలచే పితామహునుద్దేశించు చేయుభక్తి లౌకికము. వేదమంత్ర హవిరోదులచే చేయుభక్తి వైదికము. అమావాస్య పూర్ణిమనాడు చేయనగు నగ్ని హోత్రాదికము ప్రశస్తమైన దక్షిణ దానము పురోడాశముచరుక్రియ (హోమాదికము) ఇష్టి ధృతి మొదలైనవి. సోమపానము సేసినవారు (సోమయాజులు) సేయు సర్వయజ్జీ యకర్మఋగ్యజుస్సామ మంత్ర జపములు సంతాపాఠనము సేసి బ్రహ్మనుద్దేశించి సేయుభక్తి వైదిక మనబడును.
(పంచభూతాదిదేవతలు) అగ్ని భూమి వాయువు ఆకాశము జలము సూర్యచంద్రులను నుద్దేశించి సేయు బ్రహ్మదేవత్వమయిన కర్మ మదెల్ల వై దికీభక్తి.
ఆధ్యాత్మికీభక్తి బ్రహ్మనుద్దేశించిచేయునది రెండురకములు. సుఖియను యోగభక్తి యింకొకటి. వానిం గూర్చిన విభాగమాలింపుము. ప్రధానము మొదలగునవి చేతనములు భోగ్యములు. నిలువదినాల్లుతత్వములు. పురుషుడిఱువదియైదవతత్వము. అతడాకర్మకు కర్త భోక్త. ఆత్మ నిత్యుడు అవ్యయుడు అధిష్ణాత ప్రయోజకుడు. అవ్యక్తుడు నిత్యుడు పురుషుడు సత్యుడు కారణము పితామహుడు. ఇక సృష్టి తత్వసర్గము భావసర్గము భూత సర్గము నని తత్త్వానుసారము గుణస్వరూపమైన ప్రధానమును లెక్కించవలెను. సాధర్మ్యమానమైన ఐశ్వర్యము (అణిమాదివిభూతులు) విధర్మియైనప్రధానము. ఇదియెల్ల పురుషుని కారణత్వము బ్రహ్మత్వము కామ్యత్వమని చెప్పబడును. ప్రధానముయొక్క ప్రయోజ్యత్వము వైధర్మ్యమనబడును. తత్త్వములయందు వేరు వేరుతత్త్వముల కర్మకారణము ప్రయోజనము విభాజ్యము ఐశ్వర్యము తత్త్వసంఖ్య వేదార్థముల జక్కగ విమర్శించి ప్రాజ్ఞులు నిశ్చయించిరి. ఈతత్త్వములకతీతము బ్రహ్మము (సచ్చిదానందాత్మకము) అని విని (శ్రుతులచే) తెలిసికొన్నారు పూర్వులు. అది సాంఖ్యభక్తి . యోగమువలన బ్రహ్మ యెడ భక్తుల కేర్పడు భక్తి యోభక్తి యిక వినుము.
నిత్యము ప్రాణాయామమొనర్చి ధ్యానమున నిలిచి జితేంద్రియుడై హృదయమందు నిత్యము ప్రజాపతిని (బ్రహ్మను) ధ్యానించుచు హృదయమందు ధారణ సేయవలెను. హృదయపద్మమందు కర్ణిక పై (నడిబొడ్డుపై) కూర్చుండిన ఎఱ్ఱనివస్త్రము ధరించినవానిని చక్కని కన్నులుగలవానిని నలుముఖముల వెలుగునించు ముఖముగల వానినిగ నడుముదాక వేలాడు బ్రహ్మసూత్రము (జందెము) గలవానిగ నాల్గుముఖములు నాల్గుచేతులుగలవానిగ వరము అభయము నిచ్చు ముద్రలు రెండు రెండు చేతులగలవావిని ధ్యానించు యోగసిద్దమైన రూనసిసిద్ది యిది బ్రహ్మథ క్తి యిది భక్తుల కెల్ల వైదిది దేవునందొనరించు నాతడు బ్రహ్మ భక్తుడనబడును.
పుష్కర క్షేత్రవాసుల వృత్తిని (వ్యవహారము) రాజేంద్ర ! యిక విను స్మృతులందు జెప్పబడినది. విష్ణువు మొదలగు దేవతల సమావేశ మందు విప్రులకిది బ్రహ్మకర్మముగా మున్ను సన్నిధిలో విస్తరముగ జెప్పబడినది. మమకారము అహం కారము (నాదినేననుభావము) లేనివారు నిస్సంగులు ఎందుకంటువడనివారు, చేయిచాచనివారు బంధు వర్గ మందేనితమి గొననివారు మంటి వెళ్ళరాయి బంగార మొకటిగా గనువారు అనేక నిత్యకర్మాచరణముచే భూతముల కభయము గూర్చువారు నిత్యము ప్రాణాయామపరులు పరమాత్మ ధ్యానతత్పరులు యాజులు (యజించువారు) సదాశుచులు యతిధర్మపరులు సాంఖ్యయోగ విధానమెరిగినవారు ధర్మజులు సందియములవెల్ల తెగినవారు యధావిధియాజించువారు వారు క్షేత్రవాసులు విప్రులు.
పుష్కరారణ్యమందు దేహముచాలించినవారి ఫలమాలింపుము. వారు మరణించి మరణము నిచ్చు జన్మము మరల పొందరు. పునరావర్తనము విడిచి బ్రాహ్మీవిద్య నూతగొని క్షేత్రవాసి సుఖముండును. ప్రపంచమందితరా శ్రమపోసులకు పునరావృత్తి కలుగును. గృహస్థధర్మమాశ్రయించి నిత్యము సత్కర్మ నిరతుడై యధావిధి యజములందునిమంత్రితుడై హోమములు సేయునతడు సర్వదుఃఖము వెడలి యధికఫలమందును. ఇతని కెల్ల లోకములందు సంచార మడ్డుపడదు. దివ్వేశ్వర్యయోగముచే సర్వసాధనసామగ్రితో బాలసూర్యప్రకాశ మైన తేజోనిధానమైన విమానము వై సహస్రసుందరీ సమావృతుడై యేయడ్డులేక స్వేచ్ఛాసంచారియై చరించును. గురు శుశ్రూషచే వేదాధ్యయనము సేయుచు జితేంద్రియుడై నిత్యసత్యవతియై స్వధర్మముం దప్పక సర్వకామ సమృద్ధము సర్వకామముల కాలంబమునై రెండవ సూర్యునట్లున్న విమానముననే యడ్డులేక సర్వైశ్వర్యసంపన్నుల గుహ్యకులను పేరి వారు పరమసమ్మతులు బ్రహ్మగణములు అప్రమేయైశ్వర్య సంపన్నులు దేవతలచేగూడ పూజలందుకొనువారు నైన వారితో సమమైన యెశ్వర్యముతోగూడి వారితో సామ్యమందును. దేవదానవమానవులందడ్డులేని యాయుధములంగొని వందలు వేలు కోట్ల సంవత్సరములు సర్వైశ్వర్య సంపన్నుడై విష్ణులోకమున విహరించును. పరమవిభూతితో నిట్లుండి, తన కృత్యమున విష్ణులోకమునుండి జారి న్వర్గ స్థానములందు జనించును.
పుష్కరారణ్యమందు బ్రహ్మచారిప్రవర్తనము
పుష్కరారణ్యమందు బ్రహ్మచర్యాశ్రమస్థుడై వేదాభ్యాసము సేయుచు నొక వేళ మరణించిన, నతడు తన తేజమున దివ్యవిమానమెక్కి పూర్ణచంద్రునట్టి కాంతితో చంద్రునట్టి రూపముతో రుద్రలోకమంది గుహ్యకులతో గూడ యానందించును. మహైశ్వర్యమందును, సర్వజగత్ర్పభువగును. వేలఁముగములు రుద్రలోకమందు సర్వ భోగములనుభవించి యటనుంచి జారి నిత్యసంతోషియై యుత మసుఖమనుభవించి యుత్తమ బ్రాహ్మణగృహమందు పుటును. మనుజులలోగూడ నతడు ధర్మాత్ముడు సుందరుడు మంచివకయునౌను. వానప్రస్థధర్మమూని గామో పాధిగొనక సర్వలోకముల నిరాఘాటము సంచరించును. ఎండుటాకులు పండ్లు పూలమాలలు తామరపూలు భుజించుచు కపోతము అశ్మకుట్టము దంతాలూఖవికము నను జీవనోపాయమున నారచీరపట్టలుదాల్చి జడలూని తిషవణస్నాయుజ (మూడు వేళల స్నా సముచేయువాడై ఏదోషము లేక గండమూని కృచ్చవతమూ, స్వపచు డయ్యును చండాలుడయ్యు వర్షర్తువున నీటిలో పరుండి పంచతపమూని స్వచ్చమగు నౌకాశమున, పురుగులు ముళ్లు రాళ్పున్న నేలపరుండి తగుచోటవీరాసనమందుండిందజ కెడ పడి చృఢవ్రతియే అగ విమూలికలందినుచు నెల్లభూతముల కథయమిచ్చుచు ఎప్పుడును ధర్మవుకూడ బెట్టుకొనగోర్కికొని కోపముసుగెలిచి యింద్రియములనదిమి బ్రహ్మభక్తుడై మునీయే పుష్కర క్షేత్రమందు సర్వసంగపరిత్యాగియై కోరిక లేడలి ఆత్మారాముడై (ఆత్మానుసంధానము సేయుచు) వసించును. కపోతవ్రతము: పావురమువలె గూడ బెట్టు కొనకుండుట. అశ్మకుట్టుడు, అపక్వపదార్థముల పిండిచేసికొని తినువాడు. దీంతోలూఖులికుడు: దంతము తేటూలుగావాడుకొనువాడు. (ఈమూడు వానప్రస్థుని లక్షణములు)
పుష్కర క్షేత్రవాసియుత్తమగతి
భీష్మాచార్య ! ఆలింపుము. బాలసూర్యప్రకాశము వేదికలు స్తంబముల శోభనము నై నవిమానము కామగ మెక్కి ఒహ్న భకుడు తేజోమూరి యే రేండవచంద్రునట్లాకాసమందు దీపించుచు విష్ణులోక మేగును. ఆటనుండి దిగి రుద్రలోక మేగును. అటనుండిగూడ జారి మర్త్యలోకమున బుట్టి సర్వభోగములనుభవించి మజమానవులందు జనించుచు రాజుగాని రాజకుమారుడుగానియే ధనవంతుడై చక్కనివాడై కీర్తి మంతుడై భక్తి భరితుడౌను. నాల్గువర్ణ ములవారెవరైన క్షేత్రవాసు లీఫలమందుదురు. ఇట మరణించినవారు నిదేయుత్త మగతినందుదురు. ఇక్కడ శరీర మగ్ని కాహుతి సేసిన వేదాధ్యయనసంపన్నుడు బ్రహ్మలోకమున కేగును. శాశ్వతవిభవమందు విహరించును. ఇట మరణించినవారు హంసలతోడి విమానము వై తిరిగి బ్రహ్మలోక మున రమింతురు. అటనుండివచ్చి బ్రాహ్మణ కులమందు జన్మించి సర్వభోగానుభవమందును.. దేవదేవుడు బ్రహ్మ యొక్క శ్రీపాదముపొంది పరమానంద మండును.
భీష్ముడనియే: పద్మతీర్థ మందుపవాసాదులు తపోనియమములులేకుండనే స్త్రీలు మొదలుగ నందరు నేగతికి బోవుదురనియానతిమ్మన పులస్త్యుడనియే. పుష్కరమందు చనిపోయినవారుబ్రహ్మలోకమున కేగుదురు. కలియుగ మందింతకంటె సులభోపాయము లేదు. ఇట బ్రహ్మ దేవుని దర్శనమాత్రమున సర్వఫలము సిద్ధించును. ఇక్కడ మూడు వేళలం దిన్న వాడుగూడ వాయు భక్తునితో సముడగును. మహాసముద్రములాటి జలాశయముమరొకటిలేనట్లు పుష్కరముతో సమతీర్థమింక లేదు. ఈ క్షేత్రమందున్న ఇంద్రాదిదేవతలతోబాటు గజానన కుమారాదులు సూర్యునిదాక గలవారు శివదూతి మేమంక రీకన్యమొదలగువార్టనున్నారు. జ్యేష్ఠపుష్కరమందేపనిలేకూరకున్న మాత్రన సర్వ కామసిద్ధినందును. కృతయుగమందు బండ్రెండేండ్లు తేతాయుగమందొక్కసంవత్సరము ద్వాపరమున నొక్కనేల యొనరించిన పుణ్యఫలమొక్కరాత్రివలన నీ పుష్కరారణ్యమందున్న మాత్రనకలుగును. బ్రహ్మ చారి మొదలుగ నన్ని యాశ్రమముల వారిటనున్న మాత్రన నిహపరములందు రాణింతురు. ఈపుణ్యభూమి చతుష్పదము(నాల్గు మెట్లుగల) యొక నిచ్చెన బ్రహ్మచేప్రతిష్టింపబడినది. దీని యాధారముగొని నతడు బ్రహ్మలోకమందు సుఖమందును.
గురు సేవావిధానవర్ణనము
గురునెడ గురుపుత్రుడు సుఖముగబ్రతుకగోరువాడు ధర్మార్థనిపుణుడీం కేపనిలేక వసింపవలయును. అధ్యయనము సేయవలెను. వారి చేబిలువబడి దక్షిణయిచ్చి గురువునండచేరవలెను. వారుపరున్న తర్వాత పరుండవలెను. ముందుమేల్కొనవలెను. గురునింట పనులన్ని చక్కబెట్టనగును. చేయవలసినదంత సేసివచ్చి గురులపజ నిలువ వలెను. సేవకుడు సర్వము సేసినవాడు అన్ని పనులనేర్పరి శుచి సమర్థుడు గుణశాలియై యటు పై తమకిష్టమేదని యడుగవలెను. ఇంద్రియనిగ్రహమొంది. ఏతొందరపాటుగొనక గురుని వైచూపునిలిపినిలువవలెను. గురువు భోజనము సేయకుండ భుజింపరాదు. మంచినీళ్లు త్రాగకుండ త్రావరాదు. నిలువబడియుండ కూర్చుండరాదు. చేతులెత్తి గురువుకుడిపాదము కుడిచేత నెడమపాద మెడమచేత మృదువుగతాకవలెను. గురునకు తన పేరు సెప్పికొని వంగి, మొక్కవలెను. భగవన్ (స్వామీ) ఇది నే సేద నిదినేజేయలేదు అని యెల్ల విన్న వించి ధనమును గురునకు నివేదించి సేవించి చేయవలసినదెల్ల సేసి తెలియజేయవలెను. పరిమళములను పలురుచులనేవి సేవింపరాదో వానిని గురునుండి తిరిగిగై కొని సేవింపవలెను. గురుభుక్త శేషమారగింపవలెనన్న మాట. ఇది ధర్మశాస్త్రముల సిద్ధాంతము. ఏకొన్ని బ్రహ్మచారీధర్మములు విస్త రించిచెప్పబడినవో వానినన్ని టీనాచరించి యనురాగపాత్రుడై శిష్యుడు గురుననుగ్రహింపజేసికొనవలెను. ఆలా గురువు ప్రీతి యధాశ క్తి సేకరించుకొని, శిష్యుడు పవిత్రములగు నాయాగార్హ స్థ్యాడ్యా క్రమములందు మెలగవలెను. భిక్షాన్నము దిని క్రిందపరుండి గురుముఖమున వేదార్థములను అధ్యయనము-సేసి యోగముచే తనంతతాను వేదవతోపయోగమంది ద్రవ్యమందు . నాల్గవవంతు గురుదక్షిణయిచ్చి యధావిధి సమావర్తనము సేయవలెను. వివాహాదులకు కనుజ్ఞనొంది యధావిధి సమావర్తనము సేయవలెను. ఇడి బ్రహ్మచర్యాశ్రమముయొక్క పరమావధివిధానము.
గృహస్థధర్మవర్ణనమ్
గృహస్థధర్మవర్ణనము
గృహస్థవృత్తులు నాలు మునులేర్పరిచిరి, కుసూలవృత్తి: (1) దాటెడుధాన్యము. 2) కుంభీధాన్య- కడవెడు ధాన్యము (3) అశ్వస్తని- రేపటికింటనేమియులేని (4) కాపోతి పావురములప్పటికప్పుడు తినుటకుంచుకొనుట. వానికి వేది పరమ శేష్టము పుణ్యలోకములను జయించునది ధర్మతా వృత్తి ఇందొకవృత్తి షట్కర్మప్రవర్త కము. కర్మలయప్రవర్తక మింకొకటి. రెండుకర్మముల ప్రవర్తకము నాల్గవవృత్తి . దానిచే ద్విజుడు బ్రహ్మనిష్ఠుడగును. గృహమేధివ్రతముకంటే నింకొక మహాతీర్థము సెప్పబడ లేదు. గృహస్థుతనకై అన్న మువండుకోరాదు. వృధాగా పశువును జంపరాదు. ప్రాణీగాని ఆప్రాణిగాని వస్తువు సంస్కరించుటవలన మంత్రముచే గ్రహించుట కల్ల. యజ్ఞమున కర్హమగును.
గృహస్తుపగలేన్నడు నిద్రవోరాదు. రాత్రి తొలిజామున చివర నిద్రవోరాదు. భోజనములకు నడుమ మరలభు జింపరాదు. అనృతమాడరాదు. ఈతనియింట బ్రాహ్మణుడు పూజింపబడక భోజనము సేయక ఒక్కడుండ గూడదు. అలా హవ్యమందుకొనుదేవతలు కవ్యమందుకొను పితృదేవతలు గృహస్థునక తిధులు పూజ్యులని . స్మృతులన్నవి. వేదవిద్యావతస్నాతులు శ్రోత్రియులు, వేదపారగులు సర్వకర్మ పరులు ఇంద్రియనిగ్రహము గలవారు క్రియాశీలురు తపస్వులునగువాని రర్చించుటకు, హహ్యము కవ్యమునకు నర్హులు. నశించుస్వభావముకలవిషయములవెంటబడు వానికి (విషయలోలునికి) స్వధర్మముదప్పిన వానికి ఆగ్ని హోత్రమువిడిచినవానికి గురువును మోసగించువానికి అబద్ధాలకోరునకు కవ్యములందధికారములేదు. పితృదేవతానిమిత్తమై యిచ్చు పదార్థ మునధికార ము లేదు. అన్ని భూతములకు నీకవ్యమందు భాగమున్నది. అందుచే గృహమేధి అపక్వపదార్థములచేగూడ కవ్యమీయవలెను. ఎప్పుడు విఘసాశి-అమృతభోజనుడు కావలెను. అమృతమనగా యజ్ఞశేషము. అది అమృతమే.
ఉత్తమబ్రాహ్మణలక్షణాని
ద్విజభుక్తశేషము విఘసము. దేవతాసిద్ధి బాహ్యము. తనయాహార మేకోరువాడు దాంతుఁడు. బహిరింద్రియముల నిగ్రహించినవాడు సహనశీలుడు బహుసమర్ధుడు ఋత్విక్కులు పురోహితులు గురువులు మేనమామ అతిధులతో గూడియుండు వృద్దులు బాలురు వైద్యులు జ్ఞాతులు సంబంధులు బంధువులు తల్లి దండ్రి అల్లుడు అన్న దములు కొడుకు భార్య కూతురులతో దాసవర్గముతో (నౌకరులు) తగవుపడరాదు. వీరితో వివాదపడ నివాడు సర్వపాప విముక్తుడగును. వారే వైచేయిగానున్న వాడు సర్వలోకముల గెలుచును. సందియము లేదు. అతిధి సర్వలో కేశుడు. ఋత్విక్కు వేదముల కాశ్రయుడు ప్రభువు. తల్లి అప్సరసలసమూహము, జ్ఞాతులు విశ్వేదేవులు (వైశ్వదేవికులు) సంబంధిబాంధవులు. చిక్కులందు తల్లి మేనమామలు భూమియందు, వృద్ధులు బాలురు ఆతురులు (బాధలలో నున్న వారు) ఆకాశమందు బుట్టినవారు పురోహితుడు ఋషిలోకప్రభువు. ఆశ్రితులు సాధ్యలో కాధిపతులు వైద్యు డశ్వలోకాధిపతి (అశ్వినీదేవతల లోకాధిపతి భ్రాత వసులోకపతి భార్య చంద్రలో కేశ్వరి. భార్య పుత్రుడు తనశరీర మే అగ్నులు ఇల్లులేనివాడు ఊరిలో బిచ్చమెత్తుకొనవలెను. మునిహృదయముతో (ఏలాటివి క్షేపములకులోనుగాక) రేపటిమాటయేమనుకోక లభించినదితిని యాహారనియమమూని ఒకసారి అన్నము దినవలెను. చేతకపాలము (పుర్రె) చేట్టు మొదలు చినుగుపాత ఒంటరితనము సర్వభూతములయెడ ను పేక్ష యిది భిక్షులక్షణము బిచ్చగానిలక్షణము.
భీష్మ ! ఆలింపుము. మంగళమగు గాక నీకు. ప్రాపంచికదృషిగొని దీక్షాపూర్వకముగ నందుండి నివృతి మార్గ ముంబట్టి (వానప్రస్థధర్మమవలంబించి) పుణ్యతీర్థ క్షేత్రములందు వసించువారికి దృడప్రజాసంపన్నులకు సత్యము శుచిత్వము ఓర్పుగలవారికి ఆయుర్దాయములో మూడవభాగము వానప్రస్థాశ్రమ స్వీకారమున కర్హమైనది. (సుతవిన్యన పత్నీ కస్త యాం వానుగతోపిసన్ =ధర్మపత్నిని పుత్రుల కప్పగించికానీ లేక యామెవేంటనిడుకొనిగాని గృహస్తు చనమున కేగవలెనని శాస్త్రము సెప్పినది) అదే తృతీయాశ్రమమను పేరందినది. అపుడాతడు ఆవే యగ్నులను గృహస్థుగా పరిచరించిన యగ్ను లనే ఆదేవతలనే పరిచరింపవలెను, (సేవింపవలెమ) ఆహారము ఆహార నియమము విష్ణుభక్తి గొని అగ్నిహోత్రమాత్రములయిన యజ్ఞాంగము లాచరింపవలెను. దున్న కుండ పండిన పంట ధాన్యము యవలు నీవార్గము (నెవరి) విఘసముగ-దేవతలకు హవిస్సుగా) గ్రీష్మఋతువునందు పంచయజ్ఞము లందు నివేదింపవలెను. పంచయజ్ఞములు బ్రహయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము భూతయజ్ఞము మనుష్య యజ్ఞము. ఈ చెప్పిన నాల్గువృత్తులు వానప్రస్థాశ్రమమందు గూడ సేయవలెనని స్మృతులు సెప్పినవి. వానప్రస్థు అప్పటికప్పుడు చేకూర్చుకొన్నదే తిందురు. కొందఱు నెలకు కొందఱు సంవత్సరము కొంద జు పండ్రెండేండ్లుదాక సమకూర్చుకొన్నది తిందురు. ఇదికూడ అతిథిపూజకొఱకు యజ్ఞతంత్రముకొఱకే చేయుదురు. తమకొఱకుగాదు. వర్షర్తువులో ఆరుబైట హేమంతములో నీటను గ్రీష్మమందు పంచాగ్ని మధ్యమున పంచాగ్నులు) నాలుదిక్కులందు నాలు-ముందు సూర్యుడు. మొత్త మివి పంచాగ్నులు) వసింతురు. శరదృతువులో అమృతభోజను లగుదురు. (అమృతము= దేవతలకు అతిధులకు నివేదింపగా మిగిలినది) ఆయాచితము=అడుగుకొనకుండ లభించినది కూడ అమృతమే. నేల వైనే కూర్చుందురు దొర్లుదురు. మెగాళ్ళమీదనే కూర్చుందురు. బట్టపరచుకొని నేలమీదనే కూర్చుందురు. కొందరు దంతోలూ ఖలులు దంత ములే రోలుగా గలవారు) నమిలి తినగలిగినదే తిందురు. అశ్మకుట్టులు. సన్ని కలులోను లులోనోదంచినది తినువారు. శుక్లపక్షమందుతాగిన యవాగు: గంజినితావుదురు. కృష్ణపక్ష ములో తనంతదొరికినదితిందురు. గట్టి వ్రతమూనికొందరు దుంపలు పండ్లు నీరుమాత్రమేతావుదురు. మొత్త ముమీద వైఖానస = వానప్రస్థమందు చేయువతములరీతిలెన్నో గలవు. వైఖానసులు = వైష్ణవులు విష్ణుభక్తులనియు నరము గలదు. ఇంతవరకిది తృతీయాశ్రమ (వానప్రస్థ) లక్షణము.
సన్న్యాసాశ్రమవర్ణనమ్
ఇక తురీయము (చతుర్థము) సన్న్యాసమను ఆశ్రమ లక్షణములు
నాల్గవది షోపనిషదమైనధర్మము. కేవలము జ్ఞానవిషయము. సన్న్యాసము - సర్వసాధారణము.
సన్న్యా సాశ్రమ వైభవవర్ణనము
కృతయుగమందే యీ చతుర్గాశ్రమమును సర్వార్థదర్శనులు విప్రులు స్వీకరించిరి. వారు అగస్త్యులు మొదలు అకృతవ్రణులుదాకా పేర్కొనబడినారు. వీరందరు కర్మయోగమందు విద్వాంసులు స్వర్గమున కేగిరి. వీరు ప్రత్యక్షధర్ములు. అనగా ధర్మము - ధర్మఫల మైన స్వర్గాదులు దేవతలు అందు ప్రత్యక్షమయినవారు. అంటే యాయావరులను గణమందురు. బియ్యము మొదలై నవానిని ముష్టి యెత్తి కొని జీవింతురు. వారికి స్థిర నివాసము లేదు. ఇందుల కుదాహరణము జరత్కారుడనుముని.
ఉగ్రతపస్వులు ధర్మసూక్ష్మమును బ్రత్యక్షముగ జూచినవారునగు ఋషులు యాయవరగణమువారు స్వర్గమునకు వచ్చిరి. వచ్చి సురేశ్వరుని (ఇంద్రుని) అర్చించి వనమునకుం జనిరి. అట మాయను దొలగించికొని బ్రహ్మనుపాసించుటకు వనమునాశ్రయించిరి. వానప్రస్థులైరన్న మాట. వారు నక్షత్రరూపమునగాక ఆదృశ్యు లె ఎవరికి నోర్వరానివారై జోతిర్మండలమున జ్యోతిర్గణముగా అంతర్దృష్టులకు కనిపించుచుందురు.
ముదిమిచే జిక్కి వ్యాధిపీడితులై కొందఱు ఋషులు వానప్రస్థాశ్రమమునుండి మిగిలియున్న చతుర్ధాశ్రమము నొందిరి.
సన్న్యా సాశ్రమస్వీకారవిధివర్ణనము
సద్యస్కారీ = అప్పటికప్పుడేది ప్రస్తుతమో అదే యా యుపాసనయందు సర్వవేదసంపన్నము సదక్షిణముగ యజకలాపమంత యథావిధి నిర్వహించి, మంచిమనస్సుతో (మనశ్శుద్ధినొంది) ఆత్మయాజి తనయందతాను యజించుకొని ఆత్మారాముడై (తనయందతాన విహరించుచు) లననుదానయాశ్రయించి తనయంద అగ్నిని ఆధానించి (ఉంచి) ఎల్లపరిగ్రహములను త్యజించి సద్యస్కుడై అప్పటి కేది ప్రస్తుత మో అదేచేయు ఝలోకమందయెల్లపుడు యజములను ఇష్టిని యజింపవలెను. ఎల్లపుడు యజ్ఞములాచరించినవారికే ఆత్మయజ్ఞము ప్రవర్తించును. ఆత్మయం దాత్మచేత్రేతాగ్నులను క్షణములో జక్కగ యజింపవలెను. ఆలాటి జ్ఞాని యె వనిచేత నేదిలభించు నదే ఏవగించక తినవలెను. వానప్రస్థాశ్రమరతుడు జుట్టు రోమములు గోళ్ల నాలాగే ఉంచవలెను. ఈలా కర్మానుష్ఠానముచే నప్పటికప్పుడు పవిత్రుడై యొకదానివెంట నొకటి యాశ్రమము స్వీకరించిన యతడు సర్వభూతముల కభయమిచ్చిన ద్విజుడు ప్రవ్రజనము సేయ లేను.సన్న్యాసాశ్రమస్వీకారము సేయవలెనన్న మాట.
క్రమప్రాప్త చతురాశ్రమ వైభవవర్ణనము
ఈలా క్రమముగ బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములను నిర్వహించి తురీయాశ్రమియైనతడు తేజోమయ లోకమంతు లేకుండ యనుభవించును. మంచిలము నడవడిగలిగి కల్మషము వెడలి నత డిహమందు పరమందేదియు కోరడు. రోషము మోహము నుండవు. పేచీపూచీలుండవు. ఆత్మచింతన సేయుచు దట స్టుడైయుండును. ఇంద్రి యములదుపులోనున్న ను నూరేగించుచున్నను వ్యథయుండడు. ఇది నాశాస్త్రము. ఇందు నేను బండితుడనను నదుండదు. ఆత్మనిష్ఠ యేడ తొట్రుపాటుండదు. ఆత్మయాజియగు . నాతనికి సంశయము లెడలి ధర్మపరుడై యింద్రియములదుపులోనున్న యాతనికి స్వేచ్ఛాసంచార మేర్పడును.
సన్న్యా సాశ్రమప్రశంస
ఈ పైనీ నెంతేని శ్రేష్ఠము గుణసంపన్న మాశ్రమములు మూ డిన్నింటి పైది నాల్గవయాశ్రమము పరమ పరాయణము. నాల్గవయాశ్రమముగూర్చి ప్రశంస నాలింపుము. ఈగృహస్థవానప్రస్థానములద్వారా సంస్కారమంది యా వైని యాత్మకొ కై న తత్త్వము నొక్కమనసునవినుము.
భిక్షులక్షణవర్ణనము
మూడువర్గాశ్రమముల గుర్తులుగ శ్రేణీస్థానములందు (రెండుపిరుదులునడుమ) కాషాయముగట్టుకొని ఆ "మీదిస్థాన ముత్త మపారివ్రాజ్యము సన్న్యాసము కూర్పవలేను. ఆలాటిభావముతో సన్న్యసించి వర్తించుటనువినుము, ధర్మముకొఱకు సహాయముగొనక వర్తించవలెను. ఊరకచూచు చొక్కడై వర్తించు నతడు దేనిని విడువ డంటువడడు. దిగులుపడడు. అగ్నులు విడిచి యిల్లువాకిలివిడిచి భిక్షకోటుకు గ్రామమున కేగవలెను. భావముగొని (అంత్య - కరణశుద్ధిగ] ముని రేపటిమాటేమనకుండ యుండవలెను. కొలదిగా తిని యాతినునదై న నియమమనుసరింజ : తినవలెను. భిక్షారము కపాలము, ఉనికికి చెట్ల మొదళ్లు మేనికి చినుగుపాతయుంగొని తోడు లేకుండ యుండ - వలెను. ఆన్ని భూతములయెడ ఉపేక్ష (తటస్థభావము) ఇది భిక్షులక్షణము.
ఉత్తమబ్రాహ్మ ణల క్షణము
నూతిలోజొచ్చిన నీళ్ళట్లు, ఎవనియందాడిపోసినమాటలు జొచ్చి యాయన్న వానినితిజీగిపోవునో అతడు కైవల్యాశ్రమమందుండును. అనగా నిందకు - ప్రతినిందచేయకుండుట యుత్త మలక్షణమన్న మాట. అవాచ్యుని= పేరైన చెప్పగూడని ఆపాత్రుని కన్నెత్తి చూడరాదు. వాని పేలాపన లేప్పుడు వినరాదు. బ్రాహ్మణునికిది యేమాత్రముపనికిరాదు. బ్రాహ్మణుని కేది యనుకూలమో అదే మాట్లాడవలెను. ఒక వేళ నిందింపవలసివచ్చినను ఎవరేనివారి నిందించుచున్నను తనకుదా వేద్యము సేసి కౌని ముదుతినినట్లు మాటాడక నూరకగూర్చుండవలెను. ఎలపుడు నెవ్వనియునికిచే నాకాశ మట్లు నిండుకొనియుండు నెవడులేకున్న శూన్యమగునో యాతనిం బ్రాహ్మణు డని తెలియుదురు. ఏదో చలికి వైగప్పుకొనువాడు ఏదో ఆకలికి దినువాడు ఎక్కడనోపండుకొనువాడునైన వానిని ! జాహ్మణుడనీ దేవతలెఱుంగుదురు. పామునకట్లు జనమునకు, నరకమునకట్లు జనమున, బికారికట్లు స్త్రీలకు, హడలిపోవువానిని దేవతలు బ్రాహ్మణుడని గుర్తింతురు. పొగడినంబొంగడు తేగడినంగ్రుంగడు. అన్ని భూతములకు నభయమిచ్చువాడు బ్రాహ్మణుడని దేవతలు గుర్తింతురు. చావును మెచ్చడు. బ్రతుకును మెచ్చడు. కూలివాడునిర్దే శము=కూలి కట్లు కాలమున కెదురుచూచును. మనసు దెబ్బతిననివాడు ఇంద్రియముల నదుపులో బెట్టుకొన్న పోడు బుద్ధి (తెలివి తప్పనివాడు సర్వపాపవిముక్తుడై యామీదస్వర్గమున కేగును. ఏ భూతములవలన భయ పడనివాడు ఎల్లభూతములకభయమిచ్చువాడు దేహబంధము నుండి ముక్తుడగును. (విదేహముక్తి నందును అట్టివానికి దేనను భయముండదు. . ఏనుగడుగులో పదాతుల (నడచువారి] యడుగులన్నియు నిమిడినట్లు అన్ని జ్ఞానములు జ్ఞానియందు లీనములగును. ఈలాగే ధర్మము అర్థము ననుపురుషార్థములు ఒక్కఅహింసయందు రాణించును. నిత్యము హింసచేయుపొడు చచ్చినవానితో లెక్కగును. అందువలన ఆపి ంసకుడు మంచిదైర్యము నింద్రియ నిగ్రహముకలవాడునై సర్వభూతశరణ్యుడై పర మోత మగతినందును. ఈలాటి ప్రనముచే దృప్తి నొందువానికి నిర్భయునకు జ్ఞానికి చావన్న దొక పెద్ద విషయము గాదు. అతడమృతత్వమందితీరును. అన్ని సంగములు (అంటులు) వదల్చుకొని యచ్చమగు నాకాశ మట్లున్న ముని శాంతుడై యున్న యాతనిని బ్రాహ్మణుడని దేవతలు గుర్తింతురు.
బ్రాహ్మణధర్మసూక్ష్మములు
సర్వభూతములు సుఖముగ క్రీడించును. సర్వదుఃఖములు వానంతట గల్గుచుండును. వానికి జన్మ (పుట్టుక] నిమిత్త మైన భేదము తప్పదు. అందులకు శ్రద్ధతో విధివిహిత కర్మములు సేయవలసినదే. సర్వభూతముల కథయమిచ్చుటయను దక్షిణతో జేసినదానము సర్వదానముల వైది. ఎవడు ముందు . తీక్షమును (కోపోద్రిక్త మును) శరీరమును మొదట హోమము సేయునో యతడు ప్రజలనుండి యంతులేని యభయముం . బొందును. వైకెత్తి నూటిలో నెవడు హవిస్సును (ఆన్నా దులను) వైశ్వానరాగ్నిలో హోమము సేయునో యతడనంత ప్రతిష్ఠనందును. వైశ్వానరాగ్నిని (జఠరాగ్నిని ఆకలిచ్చును) బొందునదే యీయెల్లసృష్టియును ప్రాదేశ : మాత్రమైన హృదయమునుండి వెడలు ప్రాణమునందు ఆత్మయాజి హోమము సేయును. అతడాత్మరూపమగు అగ్నిహోత్రమునందు సర్వముహోమము జేసిన ప్లేయగును. త్రివృతము త్రిసుపర్ణను అను రెండుమంత్రములు పరాయతము ఉదకశాంతి లోవాడేమంత్రములు. ఆబ్దిక మంత్రములో బ్రహ్మ మేతుమే అని త్రిసుపర్ణం బ్రాహ్మణాయతదద్యాత్ అని ఉన్నది. ఇందు మొదటిమంత్రము వీరహత్య (అగ్ని హోత్రములుమానివేసిన మహాపాపమును) రెండవది బ్రహ్మహత్యను (బ్రాహ్మణుని చంపిన మహాపాపమును) హరించును. ఈరహస్యమును తెలిసికొని యెవరు . ఈమంత్రములయొక్క పరమార్థమైన భగవంతుని తెలిసికొందురో వారుసర్వసమర్థులైన దేవతలై సర్వభూతముల యందు పరమోన్నతస్థాయిలో లేజరిల్లుదురు.
భూమినంటడు. దివమున (ఆకాశ మునందు) హిరణ్మయుడగు పురుషుడు, జ్యోతిర్మండలములన్ని టిమీదనుండి యూహకందడు నిత్యము ప్రదక్షిణము తిరుగు కేవలము వేద విహిత విజ్ఞానముచే దెలియదగినవాడై తేజరిల్లు కిరణ ములతో దిరుగుచు వెనుదిరుగుచు ఆు అంచులు ఆఋతువులు) ద్వాదశారములు (ద్వాదశ + అరలు (పం రెండు మాసములు తిపర్వ=మూడుపర్వలు గల యేవనికాలచక్రము (కాలరూపచక్రము) ఈ విశ్వమును రక్షించుచున్నదో గుహయందుంచబడినది అనగా వేదముయొక్కపరమనిగూఢ రహస్యము వేదములారింటి కల్పములో నొకకల్పముచే దెలియదగియున్నది.
ఆ హిరణ్మయపురుషునియొక్క ప్రసాదమే యీ జగత్తెల్ల (జాయతే గచ్ఛతీతి జగత్ . పుట్టును గీటును కావున (నిది జగత్త ని నిర్వచనము) ఆయన శరీరము (శీర్యత ఇతి శ రీరమ్ నశించునది). ఆతత్త్వము సర్వలోకముల నధిగమించియున్నది. ఆ ఏకైక పురుషునందు (తత్త్వమునందు దేవతలనందట నెవ్వడీలోకమందు సంతరించును (హవిరాదులచే దృప్తి పరచు] అతడిక్కడనే నిత్యము స్తుడగును. ఆతడు తేజోమయుడై నిత్యుడై పురాణపురుషు డె అర్ధభయమునుండి విడివడును. ఇంద్రియార్థములయిన విషయములు వానిని వేధింపవన్న మాట. ఆతని కెన్నడు భూతములు - వెలువవు. ఆతడు భూతములకు వెణువడు. ఎవరిచే నిందింపబడడు. ఎవరిని నిందింపడు. అసహ్యించుకొనబడడు. విప్రుడత డాత్మయందు పరమాత్మను దర్శించును. - మోహము నడచి కల్మషములుడిగి ఇహ పరములం ద పేక్ష లేక రోషముగొనక మంటి వెళ్ళ బంగార మొక్కటిగనే శోకముడిగి సంధివిగ్రహములు పేచీ పూచీలు పొగడిక తేగడికలు ప్రియము నప్రియమగునవిలే; ఉదాసీనుడై భిక్షు వై సంచరించును.
ఇది శ్రీ పద్మపురాణమందు సృష్టిఖండమున పుష్కర క్షేత్రవాసమాహాత్మ్యమను పదునైదవయధ్యాయము.
