పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
19 - పుష్కర తీర్థ మాహాత్మ్యమ్
పుష్కరతీర్థ ప్రశంసా
భీష్ముడిట్లనియె
పుష్కర క్షేత్రము యొక్క "నందానదియొక్క మాహాత్మ్యమును విన్నాను. ఋషులు పుష్కర క్షేత్రమును సేవించి అందరు ను పరమ సుందరులై నట్లు వింటిని. వారచ్చట తీర్గ విభాగ మెట్లు చేసిరో, అచ్చట యజ్ఞ పర్వతమందు విష్ణువు పాదవ్యాస మెట్లుచేసిరో, ఆచట పంచతీర్ధ కల్పనమెట్లు జరిగినదో, లెమనుగ్రహింప వినవలెనను కుతూహలముతో నున్నాడను. మహరు లేర్పరచిన తీర్థములందు శ్రీవిష్ణువు పాద మెట్లుంచెనో, తీవ్ర విషభరితులై న నాగులచట పంచ తీర్ధముల నెటైర్పరచిరి. అందు మొట్టమొదట పిండ ప్రదానవాపి పిండములను వేయుబావి నెవరు నిర్మించిరి ? గంగానది మొదట నుత్తరాభిముఖియై భూమియందవతరించినది. సరస్వతి బ్రహ్మాదులచేత త్రిపుష్కర మందు సరస్వతీ నదీ యాత్ర ఋషులెట్లు నిర్వహించిరి ? ఆ యా త్రిఫల మేమి తెలుపుమస పులస్త్యుడిట్లనియె.
నీవడిగిన ప్రశ్నథాగము చాల గొప్పది. ఏకాగ్రమనస్కుడ వై వినుము. హస్తములు, పాదములు, మనస్సు నియమించుకొని తీర్థ విశేషము విన్న చో విద్య, తపస్సు లభించును. ఆతడే తీర్థఫల మనుభవించును. చేయి చాపక నిత్య సంతుష్టుడై, అహంకారముగొనకయున్న యతడు తీర్థఫల మొందును. రాజేంద్ర ! కోపము నిగ్రహించి సత్యశీలుడై, ప్రతనిష్టుడై సర్వభూతములను తనవలె జూచునతడు తీర్థ ఫల మందును. ఋషుల పర మరహస్యమిది. జరిగిన కథ బ్రహ్మదేవుని సత్ర యాగమందు తీవ్ర తపస్సంపన్నులు ఋషులు జ్యేష వుష్కరమందు బ్రహ్మదేవుడొనరించిన సత్రయాగమున కొచ్చిరి. బ్రహ్మముఖదర్శనమైన కారణమున ఆనందభరితులై యజ్ఞోపవీతముల జేకొని తీర్థ విభాగముజేసి భక్తి పరులై నలుదెసలందు నమావేశ మైరి. ఆత్తటి పితామహుడు (బ్రహ్మ) ఆనంద భరితుడై జ్ఞానసంపన్నులగు మునికోటియుం గని ఇంతటినుంచి మీకు ధర్మాభివృద్ధి కాగలదు. ఇటకు వచ్చి ఈ తీర్థజలమందు స్నానము చేసినవానికి చక్కని రూపమేర్పడును. ఒక యోజనము పొడవు, అర యోజనము వెడల్పుగల ఈ తీర్థము ఋషికోటి ప్రవీర్తితము (ఋష లేర్పరిచినది). యాత్రా మాత్రమున రాజసూయా శ్వమేధయాగములు చేసిన ఫలము నందును. జ్యేషపుష్కర మందిట సరస్వతీ నది ప్రతిష్టింప బడినది. ఇటకు చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఋషులు, సిద్దులు, చారణులు యాత్రకు వత్తురు. పితృదేవతాతృ ప్తికిట నానాడు అభి షేకము సేయవలేను. గో మేధయాగ పుణ్యఫలము దానివలన కలుగును. దేవ, పితృదేవతల నీట తృపలంజేసిన పుణ్యుడు విష్ణులోకమందును. చంద్రునట్లు సౌందర్యవంతు డగును. బ్రహ్మలోక మంది పరమగతి నందును. మానవలోక మున విష్ణుతీర్ధమిది పుష్కరముల పేర ప్రసిద్ధము. మహాపాతక నాశము. పదికోట్ల పుణ్యతీర్థములతో సమానము. మూడుసంధ్యలందు నిచ్చట ఆదిత్యులు, వక్తువులు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, గంధర్వులు, ఆప్సరసలు నిట సన్నిహితులౌదురు. ఇచట తపస్సు చేసి దైత్యులు, బ్రహ్మాదిదేవతలు, మహాపుణ్య సంపన్నులై . బ్రహ్న నిరంతర మతీర్థ మున సన్నిధానమై యుండును. ఆచట నభి షేకము చేసి పితృదేవతల నర్చించునతడు ఆశ్వమేథమునకు పది రెట్లు పుణ్యమందును. ఇట నొక బ్రాహ్మణునకు భోజనము పెట్టిన మాత్రమున కోటిమంది దేవతలు పూజింపబడినట్లగుదురు. ఆ పుణ్యము చేసినతడిహపర ములం దానంద భరితుడగును.
అగస్త్య మహిమవర్ణనమ్
బ్రహ్మణాశ్రుత వధోపాయ నిరూపణమ్
దుంపలు, ఆకు కూరలు, పండ్లు మాత్రముచే బ్రాహ్మణులను తృప్తి పరచిన అశ్వమేధ ఫలమందును. బ్రహ్మ పుష్కరమను నీతీర్ణము చతుర్వర్ణములవారు సేవింపవలసినది. వైఖానసులు, సిద్ధులు సేవింపదగిన సరస్వతీ పుణ్యనది ఈ తీర్థమునుండియే మహాసముదమున కేగినది. ఆదిపరాహమూర్తి భగవంతుడిచట దేవతల పూజలందుకొనును. తక్కువ వర్ణములవారు కూడ ఈ బ్రహ్మతీర్థమును సేవించిన మరి హీనవర్ణమున పుట్టరు. కార్తికమాసమందు పుష్కర తీర్థము సేవించిన ఫలమక్షయమని విందుము. పుష్కర క్షేతము సాయం ప్రాతఃకాలము లందు చేతులు మొగిచి నమస్కరించిన మాత్రమున సర్వతీర్ధ సేవాఫలము కలుగును. ఆజన్మ కృత పాప క్షయమగును. ఇట్లు పలుకబడి దేవతలందరు బ్రహ్మ అనుజ్ఞ పొంది ఇంద్రుని వెంట సరస్వతీనది ఆవతలి యొడ్డుననున్న దధీచి ముని ఆశ్రమమున కెగిరి.
దధీచిముని ఆశ్రమ వర్ణనము
అచట సింహ శార్దూలాది మృగముల వలన భయము కలుగదు. వివిధ వృక్షలతా సుందరము. తుమ్మెదల ఝంకారము వినిపించును. ఏనుగులట సంచరించుచుండును. నెమళ్లు నృత్యములు సేయుచుండును. అట గుహలందు సింహ వ్యాఘాదుల నాదము వినిపించును. ఆది కేవలము స్వర్గతుల్యము. అయ్యా శమమునకు వచ్చి మహర్షులు సూర్యు నట్లు ప్రకాశించు చున్న దధీచి మహర్షిని శోభచే సాక్షాత్ విష్ణువట్లున్న మహర్షి ని దర్శించిరి. ఆయనకు ప్రణతులై మొక్కి బ్రహ్మ నెప్పినట్లెట్లు పరమును కోరుకొనిరి.
దధీచి మహర్షి సంప్రీతి నొంది ఓ దేవతలారా ! మీ అభిమతము హిక మేమి కోరుడు. నా దేహము నైన విడిచి మీ కిచ్చెదను, అని యా వెంటనే శరీరము విడిచి ఎముక లను వారీ కర్పించెను. వా రానంద భరితులై బ్రహ్మ సన్నిధి కరిగి. ఇది విన్నవించిరి. చతుర్ముఖు డానందభరితుడై వానిచే పజ్రాయుధము నిర్మించి అది అస్రముగా దేవతల కిచ్చి ఈ మావృత్య రోదసీ .దివ్యాస్త్రముచే మహోగుడగు వృతాసురుని భస్మము చేయుమనియె. ఆవ్వల శత్రు పీడ వదలి సర్వ స్వర్గ సామ్రాజ్యము నీవేలుము. . బహ్మ పలుకులు విని ఇంద్రుడు ఆ వజ్రాయుధమును నియమముతో స్వీకరించెను.
ఇంద్రుడు వృత్రాసురునిపై దండయాత్ర సేయుట
ఇందు డా వజ్రాయుధముతో దేవతలచే పూజలందుకొని మింట నిలిచిన వృతాసురుని దరి కేగెను. కాలకేయులను నసురులు మహాశ రీరులు వానికంగరక్షకులుగా నట నిల్చిరి. పర్వత శిఖరము లట్లున్న ఆ దానవులతో యుద్ద మారంభ మయ్యెను. ఆది సర్వలోక భయంకరము. శరీరములు తెగి తలలు నేల బడి తాటిచెట్లట్లు కూలిన దానవులతో నా యుద్ధ భూమి భయంకరమై కనుపించెను. కాలేయులు బంగారు కవచములం బూని దావాగ్ని నల ముకొనిన వృక్షములట్లు దేపతల పై దూకిరి. ఆ వేగమున కోపలేక దేవతలు నలుదెసలకుం బరువె త్తిరి.
ఆట్లు బెదరి పారు దేవతలం గని సహసాక్షుడు వృత్రాసురుని ఉదేకము చూచి ఎంతో క్షోభించెను. వానిం జూచి విష్ణువు వాని బలము పెంపునకు తన తేజస్సును అతనియందు సంక్రమింప జేసెను. విష్ణువుచే నాప్యాయితు డైన ఇందునిం గని దేవగణము తేజసంపన్నులై బ్రహ్మర్షులు కూడ తేరుకొని యందరితో మరల యుద్ధ సన్నద్ధు డయ్యెను.
సురాధినాధుడు బలవంతు డగుట జూచి వృతాసురుడు పెద్ద పెట్టున నార్చెను. ఆ మార్పుచే దశ దికలు భూమి, ఆకాశము ప్రతిధ్వనించి ఇటట్టు లూగిపోయెను. ఆ ఘోర మైన అరుపు విని ఇండుడు . జడిసి ఇట్టటు ఽణికి వాని తల పై వజ్రాయుధమును విస్త రెను. ఇందాయుధముచే హతుడై పెద్ద పెట్టున నార్చి బంగారు కాసుల పేరు ధరించి నఆ దానవుడు విష్ణువుచేత నుండి జారిపడిన మందరపర్వతమట్లు నేల పై పడెను.
ఆ దైత్యుడు హతుడైనంతట జడిసి ఇంద్రుడు సరస్సు నందు ప్రవేశించుటకు పరుగెత్తెను. వజ్రాయుధము తనచేత నుండి విడువబడిన టైరుగునే కాని భయము వలన వృతాసురుడు పడిపోయినట్లు గుర్తింపలేకపోయేసు. అందరు దేపతలపుడానంద భరితులైరి. ఇంద్రు నానందపరచుచు స్తుతించిరి. మిగిలివున్న దైత్యులను వృతవధకు పరితప్తులగుచున్న వారిని మరియునుం గొట్టిరి. దేవతల దెబ్బతిని మహారాక్షసులు పారిపోయి పోయువేగమున సముదమునందు దాగిరి. సముద్రమందట్లు ప్రవేశించి తిమి తిమింగలాది భయంకరమై రత్న సమాకూలమైన ఆ సముద్రమందును కలసి ఇట్లు ఆలోచన చేసిరి. అచట కొందరు దేవతలనే కాదు ముల్లోకములను నాశనము చేయగలననీ ఆలోచించిరి. అవి దానవులకు నాశనశాలయోగమైనందున చాల దారుణమైన ఆలోచనలో పడిరి.
అసుర సమాలోచనమ్ అసుర ప్రవృత్తి
దానవుల జగత్ప్రళయ చింతనము
విద్య, తపస్సు కలవాండ్రను నాశము చేయుటయే ఇపుడు మన మొదటి కర్త వ్యము. లోక ములన్నియు తపస్సుచే ఉద్దరింపబడుచున్నవి. కావున తపోనాశనమునకే త్వరపడుడు. వసుంధర (భూమి) యందు, ఏ కొందరు ధర్మవేత్తలు తవ్నూలులు, జ్ఞానులు, కలరో వారి నాశనమే వేగముగా చేయవలసినది. వారు నశించిన జగమెల్ల నశించును. ఇట్లు అసురు లందరు బుద్ది తప్పి జగద్వినాళ నములందు వేడుక గొని ఉత్తరంగితమై రత్నమయ మైన వరుణుని నివాసమగు సముద్రము లందు చొచ్చి ఆ కాలకేయులైన రాక్షసులందరు ముల్లోకముల నాశనమునకు పూనుకొనిరి.
ఆరాత్రియెల్ల క్రోధోదిక్తులై వెడలి పుణ్యాశ్రమమున కేగి ఆ యాకుటీర మునందున్న మునులను తినివేసిరి. వసిష్టాశ్రమమంచు ఎనిమిది వందల ఎనభై మందిని చ్యవన మహర్షి ఆశ్రమమునకేగి కంద మూల ఫలాహారులగు ఋషులను నూరుమందిని మొ త్తము తెల్లవారునప్పటికే భక్షించిరి. ఆ పై పగటి వేళ కూడ భరద్వాజాశ్రమమున కేగి వ్రతనిష్టలు బ్రహ్మచారులు వాయువు నీరు మాత్రము భక్షించువారిని మునులను దినివేసిరి. మరల రాత్రి పరువె త్తి భుజబలముని అనేక ములగు మునిగణముల నణంచి, మనుజు లెవ్వరు నది తెలిసికొనరై టి.
స్వాధ్యాయము (వేదాధ్యయనము) వషట్కారము (హోమాదిక ము) వినరాదయ్యెను. యజ్ఞోత్సవ క్రియలు నష్టములయ్యెను. జగ మెల్ల నిరుణ్సాహమయ్యెను. ఇలా మానవులు కాలేయుల భయ పీడితులే క్షీణదశ నందీరి. ప్రాణము అర చేత బట్టుకొని పది దెసలకుం బారిరి. కొందరు గుహలం జొచ్చిరి. కొందరు చెల్లా చెద ,రైరి. మరికొందరు హడలె తమంత ప్రాణములను విడిచిరి. వారిలో కొందరట మంచి విలుకాండు, శూరులు, పరమ దర్పము గొని దానవుల వెదకుచు సంహరింప ప్రయత్నము జేసిరి. కాని సముద్రమందు దానవులను వెదకి కానలేక అశాంతిగొని తిరిగివచ్చి నాశనమునే పొందిరి, ఇట్లు జగన్నాక నమేర్పడి యజ్ఞోత్సవ క్రియాశూన్యమైనంతట ఇంద్రునితో కూడ నందరు సమావేశ మై ఆలోచనలో పడి నారాయణుని సాక్షాత్ విష్ణువు దరి కేగి దేవత లెల్లరు సమ్మధుసూదనునిం గూర్చి ఇట్లు చెప్పుకొనిరి.
ప్రభూ ! నీవు మమ్ము సృష్టించినవాడవు. రక్షకుడవు భరించువాడవు. చైతన్య మున్నదీ లేనిది, ఈ జగమెల్ల నీ చేతన సృష్టింపబడినది.. ఓ కమలలోచనా ! నీచే నీ భూమి వరాహ రూపమున పైకెత్తబడినది. మొదటి రై త్యుడు మహా వీర్యుడు హిరణ్యకశిపుడు నారశింహ రూపు డేన నీచే సంహరింప బడినాడు. సర్వభూతములకు నవధ్యుడైన బలి వామనమూర్తి వగు నీచే నడగాగినాడు. జండుడను నసురుడు యజక్షోథ చేసినాడు. నీ తోడ్పాటున నమరులచే కూల్పబడినాడు ఇటైన్నో లేక్కింపరాని పనులు నీవు నిర్వర్తించినావు. హడలిపోవు మాకు గతి నీవే. దేవదేవేశ్వరా ! మా కొఱకే కాదు లోక క్షేమము కొపకము సేయుచున్నాము. తమ అనుగ్రహముననే భూమ్యాది చతుర్లోకములు బ్రతుకుచున్నవి. స్వస్థముగా నున్నవి. మనుజులుగాని, దివిజులుగాని పితృదేవతలుగాని హవ్య కవ్యములచే నీ అనుగ్రహమున వర్తించుచున్నారు.
లోక ములన్నియు నిన్నాశ్రయించి ఽక రినొకరనుసరించి నీ ప్రభావము వలన ఎట్టి ఉదేగము లేకుండా నీ రక్షణలో నున్నవి. ఇప్పుడు సర్వలోకములకు పెద్ద భయ మేర్పడినది. చూచితివి కదా అర్దరాత్రి బ్రాహ్మణులను వీరి " నెవరు కూల్చిరో, ఎరుగ లేకున్నాము. బ్రాహ్మణులు క్షీణించినంతట భూమియెల్ల క్షయించును. జగత్పతివి నీ ప్రసాదమున బ్రాహ్మణులు నాక మొందరాదు. నీ రక్షణము వారి కవసరము. అన విష్ణునాళ మొందరాదు. నీ రక్ష :ము వారిక వసరము. ఆన విష్ణు విట్లనియె. ఓ దేవతలారా ! ఈ ప్రజాక్ష యమునకు కారణము నాకు తెలిసినదే. క్షోభింపక మీరు ఆలింపుడు. కాల కేయులను రాక్షసులు పరమదారుణముతో వృతాసురు డింద్రునిచే కూలుట చూచి తమ జీవితములు రక్షించుకొనుటకు వరుణాలయ ము (సముద్రము) ను జొచ్చిరి. తిమి తిమింగాలాది ఘోర జీవ సంకులమగు జలధిం బ్రవేశించి రాత్రివేళల లోక నాశముకోరి ఇట మునులను జంపుచున్నారు.
సముద్రములో దాగినారుగదా వాండ్లను చంపవలను పడరు. కావున సముద్ర మింకిపోవు నాలోచన నేయుడనిన విష్ణువ చన మాలించి బ్రహ్మదరి కేగి యగస్త్యాశ్రమమున కేగిరి.
దేవతలచే బ్రహ్మ యట్లు. ఋషులచే నుపాసింప్ బడుచున్న దివ్యతేజస్విని వరుణిని కుమారుని (మైత్రావరుణిని అట దేవతలు చూచిరి. కర్మానుష్టానము చే జాగరూకుడై యున్న యా మహాత్ముని సన్నిధి కేగి యిట్లనిరి. మున్ను నహుషునిచే దపించిన లోకములకు నీవు దికై తివి. లోకకంటకుడయినవాడు లోక క్షేమము కొలకు దేవైశ్వర్యము నుండి ( ఇంద్ర వదవి నుండి త్రష్టుడైనవాడు - క్రోధముచే సూర్యునడ్డు కొనుటకు పైకెగసిన వింధ్యపర్వతము. నీమాట జవ దాటక యాగిపోయినది. లోక మేల్ల చీకటులుగమ్మ మృత్యు బాధనిని ప్రజలు నిన్నే కరణంబని బ్రతికినారు. హడలిపోవు మాకు నిత్యము తమరే గతి. కావున వరదుడ వని నిన్ను వర మడిగికొనుచున్నా మనిరి.
భీష్మ డనియె. వింధ్యము కోప వశమై యెందుల కెగసినది మునీశ్వర ! వినవలలు నది విస్తర ముగ విన దలతునన పులస్త్యు డనియః.
పర్వతరాజు మేరు పర్వతము బంగారు కొండను భానుడుదయా సమయముల ప్రదక్షిణము దిరుగు చుండును. అతనింగని వింధ్య పర్వతము మేరువునకు ప్రదక్షిణము సేసినట్లు నా మేను జేయు మన సూర్యుడు, నామే నే కోరి యీ కొండకు ప్రదక్షిణము సేయుట లేదు. సృష్టికర్త నిర్మించిన దారి యిది నా కీయబడెను ఆన విని వింధ్యాది పరమ తపస్వి చట్టన సూర్య చందుల దారి నడ్డుకొన నేంచి మీది కెదిగేను. ఆంతట దేవతలందరు నింద్రునితో వచ్చి పైకెగురు వింధ్యుని వారించిరి. ఆవ్వల నాశ్రమమందున్న అగస్త్యుని తపోధర్మ నిష్టాగరిష్ఠన తపోఅద్భుత తేజస్వి నందరు గలిసి వచ్చిన పని తెలిపిరి.
శైల రాజేంద్రుడు కినుకగొని సూర్య చంద్రులయు, " నక్కతములయు, సంచార, మడ్డుకొనుచున్నాడు. "వాని నొపుము. శ క్తిమంతు డింక లేడన విని వివుడు వింధ్యు దరి కే ఆదరముతో నెదురు వడిన యతనిం గని. తామిచ్చిన దారి కావలె నని కోరుచున్నా పర్వతేంద్ర ఽక పనిమీద దక్షిణ దిశ కేగవలసి యున్నాను. నేను వచ్చుదాక నీ కిట్లు పాటింపు మేను మాలిన మీద నీ యిష్టము వచ్చినట్లడుగు మనెను. పులస్త్యుడు. ఇప్పుడు కలండ వారుణి దక్షిణ దిశనుండి తిరిగి రాలేదు. వింధ్యగిరి యగస్త్య ప్రభావముచే పైకెదుగ కుండుటిది తెలిపితిని.
రాజా! రులచే కాలేయులు ఆగ దనిసి సంహరింపబడిరి.
వేల్పుల పలుకాలించి మైత్రావరుణి ఎందులకు వచ్చితిరి. నా వలన మీరేమివరము కోరుదు రన వారు వింతైన దొక్కటే వరము కోరెదము. సముద్రమును దాగుము. ఇదే మా కోరిక. ఇదియైన మీదట దేవ ద్వేషలును కాలేయులను వాండ్ర. సమూలము. మట్టు పెట్టెద మనిరి. ముని త్రిదశల పలు కాలించి, యట్లే యని లోక ముల సుఖము గూర్చు తమకోరిక నిర్వర్తించెద మనిరి.
అగస్త్యేన సముద్రస్యాపోశనమ్
సముద్రవంట సేని వారుణి (అగస్త్యుడు) దేవరులం గని, లోక క్షేమమునకు వరుణాలయమును, ద్రాగు చున్నాను. తాము సేయవలసిన యనుష్టానము త్వరగ చేయుడు. ఆని కోపము గొని యెల్ల లోకము చూచుచుండ. సముద్రమును ద్రావి వేసెను. ఆది చూచి యింద్రాది దేవతలు వింత పడిరి. వినుతించి.. మునిని బూజించిరి.. నీవు మా - రక్షకుడవు, లోక విధాతవు. లోక భావనుడవు. నీ ప్రసాదమున జగత్తు పెంపొంద గలదు. అని వేల్పులచే పూజింపబడి . దివ్య పుష్పములు , పై జిమ్మ బడి గంధర్వులు వాద్యములు వాయింప మహార్ణవమును నిర్జలము గావించెను. సురు లది చూచి పరమానంద భరితులైరి. దేవతలాయు కములు సేకొని దానవులం గొట్టిరి. దేవతల యా వేగము నసురులోర్వ లేరైరి. అటు వధింపబడుచు నార్చుచు మునులు మును సేసిన తపస్సుచే దగ్గులై నేల గూలిరి. బంగారుకాసుల పేరులు కుండలములు భుజకీర్తులు ధరించిన దానవులు నేలగూలి పూచిన కింశుక ము లడైంతో సొంపు గొనిరి. చావగా మిగిలిన కొందరు కాలేయులు భూదేవిం జీల్చికొని పాతాళమున జేరిరి. అది చూచి త్రిదకులు ముప్పదికోట్లు దేవత లిట్లు స్తుతించిరి. .
: దేవానామగ స్త్యస్తుతిః :
నీ యనుగ్రహముచే మహానుభావా! లోకములెంతో సుఖ మొండినవి. నీ తేజస్సుచే కాలేయులు చందవిక్రములు గూలీరి. ఇంకిన సముద్రమును నింపుము. నీ త్రావిన జలమదే వదలుమన భగవానుడు నా తోయము జీర్ణమై పోయె గదా మరి యింకొకటి ఆలోచింపుడు. తాము నిండింప యత్నింప డన విని వింత వడి దిగులువడి రందరు అసురలనుజ గొని యొండొరులం దెలియ బలికిగోని చని. ప్రజలు విప్రులందరు వచ్చిన దారింజనిరి. దేవతలు విష్ణువుతో వెంబడించి బ్రహ్మదరి కేగి సముద్ర ముం బూరించుట. కొండొరులు మంతనము సేసి యంజలి సేసి బ్రహ్మకు విన్నవించి కొనిరి. ఆదేశ సమావేశ ముం జూచి బ్రహ్మ విబుధులారా! మీరు యధేష్ణముగ వెళ్లుడు. చాలాకాలమునకి సముద్రము (ప్రకృతిని). స్వస్థితిని బొందును తన జ్ఞాతులను కారణము సేసికొని భగీరథుడు మహారాజు గంగా ప్రవాహముతో దిరిగి - నిండించును. ఇట్లు వేల్పులు ఋషులు, బ్రహ్మచే నంపబడిరి. బ్రహ్మదేవుడు సంతుష్టుడై ఋషిసత్తము న గస్త్యుని గూర్చి యిట్లనియె.
నీచే దేవకార్యము. దానవ నాశనము జరిగినది. దేవతలు గట్టెక్కింప బడిరి. సంతోషించితిని. ఇష్టమైన వర మేదో యడుగుకొను మిత్తును. ఆనన గస్త్యుడు వ్రాలి మొక్క దేవా! ఇటనుండి ఈ పని చేసితిని. అన్ని యాశ్రమముల కన్న ఈ నా యాశ్రమము మిన్నయ గును. నీవో నన్న నై తీరును. ఇది సందియములేదు. ఆని మునిపలుక బ్రహ్మ, పుష్కర యాత్ర చేసి కొని యిట వచ్చిన ఈ కుండములందు సేసిన స్నానము దేవ, పితృ, దేవ, తర్పణము దేవ తార్చకము సర్వమశయ మగును. కొంచెమే, గొప్పగనో, ధనముచే వాని జంతిక లప్పాలు' ద్విజ ముఖ్యుల కిచ్చివలయు నిటవారి కవయ స్వర్గ నివాస మగును.
ఇట శ్రాద్ధమున పితరులు ప్రళయమందాక సంతృప్తులౌదురు. కందమూల ఫలాదులచేతనేని మునిని సంతృప్తి పరచినతడు సపరి సాన మందికొని శాశ్వతముగ నమ్మోదించును. యా యజ్ఞపర్వత మెక్కి యు తరాభిముఖియై పుష్కరాంశము జాలువారిన దేవనదిని గంగను దర్శించి, అట నభి షేకము చేసి దేవ పితృదేవతల నర్చించి యొక విప్రుని కేని భోజనమును పెట్టిన అశ్వమేధ ఫలమందు కోటి మందికి సంతర్పణ చేసినట్లగును. మునీంద్రా! ఇట నిచ్చిన యన్నపానము అక్షయములు.
అతను కోరిన ప్రతి కోరిక తీరును. ఇచట స్నానమాడినంత మాత్రాన నీచ జాతిలో పుట్టజాలరు. అన్ని స్థానము లలో ఉత్తమ స్థానము, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థ ముగా నే నిచ్చుట వలన కాగలదు. ఇచట స్నానము మాత్రము వలన స్త్రీకి కాని, పురుషునికి కాని పుట్టినప్పటినుండి చేసిన పాపములన్నియు తొలగును. చతుర్ముఖ బ్రహ్మ ఇట్లు చెప్పి అగ స మహర్షికి చెప్పి వెళ్ళెను. తమ ఆశ్రమమున అగస్త్య మహర్షి వచ్చుటవలన దీనిని అగస్త్యాశ్రమ మని అందురు. ఇది అగస్త్యా శ్ర మోత్పత్తి. నీకు చెప్పబడినది. ఇక ఇపుడు సప్తర్షి ఆశ్రమమును చెప్పెదను..
అత్రి, వసిష్ఠుడు, పులస్త్యుడు పులహుడు, క్రతువు ఆంగిరా, గౌతమ, సుమతీ, సుముఖుడు, విశ్వామిత్రుడు స్థూల శిగా, సంవర్తుడు, ప్రతర్దనుడు, రైభ్యుడు, బృహస్పతి, చ్యవనుడు, కశ్యపుడు భృగువు, దుర్వాసుడు, జమదగ్ని, మార్కం డేయుడు, గాలవుడు, శుకుడు, భరద్వాజుడు, యవక్రీతుడు, స్థూలాక్షుడు, సకలాక్షుడు, కణ్వుడు మేధాతిధి,. నారదుడు, పర్వ తుడు, స్వగంధి, చ్యవన మహర్చి, తృణాంబువు, శబలుడు, ధౌమ్యుడు, శతానందుడు, కృతవణుడు, పరశు రాముడు, అష్టకుడు, కృష్ణద్వైపాయనుడు మోదలగువారు పుత్రులతో, శిష్యులతో కలిసి వీరంతా పుష్కర మును చేరి సప్తర్షి ఆశ్రమమున నియమాన్వి తులై , దయాయుతులైరి. వీరందరికి అనృఢంస్యము (ఆశ్రయించిన వారిని కాపాడుట) జయము, ధైర్యము, తపస్సు, సత్యము, క్షమ, ఆర్జవము, దయా, దానము, జపము అందరిలో ప్రతిష్టించబడినవి. ఇచట చేసిన కర్మయే పరమున ఆనుభవించబడును. ఈ విషయమును తెలిసిన మునులు పరమార్థ పరాయణులైరి.
ఈ స పర్షి ఆశ్రమమున నా స్త్రీకులు, చోరులు, ఇంద్రియ నిగ్రహము లేనివారు, నృశంసులు, లోభులు కృతఘ్నులు, దురభిమానులు వెళ్ళజోలరు. సత్యవంతులు, తేజోవంతులు, శూరులు, దయావంతులు క్షమాపరులు, యజ్వులు, యజ్ఞశీలులు, నిష్కాములు, ఉపద్రవర హితులు, మమకారరహితులు, అహంకారరహితులు ఇచటకి వచ్చెదరు. ఈ ఆశ్రమములో మహాను భావులకు రోగము, జరామృత్యువులు సంభవించవు. ఈ ఆశ్రమమున మూఢులు, వీషయలంపటులు ప్రవేశించజాలరు. కొమలోభ మదద్రోహ, క్రోధ మోహములు ఇచటివారికి సంక్రమించవు మానావమానములను సమానముగా భావించువారు, శీతోష్ణాది ద్వంద్వ ముల ప్రభావము పడనివారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, ధ్యానయోగపరులు మాత్రమే ఈ ఆశ్రమమునకు రాగలరు. పైన చెప్పబడిన ఆక్రమము లలో బ్రాహ్మణాగ్రేసరులు. పుణ్యకార్యములను చేయువారు ఉత్తమ లోకములను చేరుదురు. త్రికరణ శుద్ధిగా భూత హింసను ఆచరించని వారు అనృశంస్యములో ఉత్తములు సజ్జనులు ఎప్పుడూ ప్రియమునే (ఆచరించువారు) మాట లాడువారు నిత్యాగ్నిహోత్రులు నిత్య అతిథి పూజకులు నిత్య స్వాధ్యాయ పరులు నిత్యస్నానపరాయణులు పర స్త్రీలను తల్లివలె, చెల్లివలె కూతురువలే చూచువారు విషయాసక్తి లేనివారు, నిందించిన నూ. కోపించనివారు, హింసించ బడియూ హింసించనీవారు, సుఖ దుఃఖములను సమముగా చూచువారు, సత్పురుషులు, మహాత్ములు ఇంద్రియ నిగ్రహము కలవారు, పూర్వము ఈ భూమి పై సంచరించువారు, ఈ ఆశ్రమమును చూడగలరు. సమాధిలో ధ్యాన మును చేయుచు సనాతన బ్రహ్మలోక మును చేరెదరు.
ఽకప్పుడు గొప్ప ఆనావృష్టి సంభవించినది. లోక మంత యూ ఆకలితో పీడించబడినది. జీవితమే కషభూయిష్ట మైనది. అన్నము దొరకని లోకమున శరీరమును రక్షించుకొనగోరి చనిపోయిన కుమారుని తీసుకొని పోయి వండుకొనసాగిరి. ఇట్లు కష్టపడుచున్న పాతపరులైన ఋషులను సేవించుటకువచ్చిన రాజు వారిని చూచి విషాదారు డై ఇట్లు పలికెను.
రాజు పలికేను.
బ్రాహ్మణులకు దానము స్వీకరించుట వృత్తి గా కలపారు. కావున ముని శేమలారా నానుండి స్వీకరించుడు. నుంచి గ్రామములను ధాన్యములను రసములను రత్న ములను బంగారమును గోవులను ధేనువులను తీసుకొనుడు. మాంసమును వండకుడు.
ఋషులు పలికిరి
ఓ మహారాజా ! దానము స్వీకరించుట మహా ఘోరము. మద్యమును సేవించుట విషము వంటిది. ఈ విషయము తెలిసిన మమ్ములను ఎందుకు లోభింపచేయుచున్నావు. పదిమంది కటిక వానితో సమానము మండలాధిపతి. పదిమంది మండ లాధిపతులతో సమానము ధ్వజాధిపతి. పదిమంది ధ్వజాధిపతులతో ససూనము వేశ్య. పదిమంది వేశ్యలతో సమానము రాజు. పదివేల కటక వారిని పోషించువాడు చక్రవర్తి. (శాండికుడు) అతనితో సమానుడైన రాజునుండి దానము స్వీకరించుట పరమ ఘోరము. లోభమోహితుడె రాజునుండి దానము స్వీకరించువాడు అమిశాది ఘోర నరక ములందు బాధలను అనుభవించును. కావున వెళ్ళుము. నీకు "క్షేమమగు గాక. ఇతరులకు దానము చేయుము అని పలికి వార వనములకు వెళ్ళిరి. తరువాత రోజు ఆజ్ఞ వలన మంత్రులు ఆచటివెళ్ళి బంగారమును లోపల పొదిగిన మేడిపండ్లను ఆచట వెదజల్లిరి. - ఆహారమును - వెతుకుచు అచటికి వచ్చిన ఋమలు ఆ మేడిపండ్లను స్వీకరించిరి. అంతట మేడిపండ్లు పెద్దగా ఉండుట చూచిన అత్రిమహర్షి" తీసుకొనరాదు అనెను. అత్రిరువాచ
అత్రిమహర్షి పలికెను
మనము జ్ఞానము లేనివారము కాము. మందబుద్దులమూ కాదు. ఇవి బంగారము పొదిగినవని తెలసితిమి. జ్ఞానులము కావున త్వరలో మేల్కొంటిమి. ఈ ధనమును ఇక్కడనే ఉంచవలయును. దీనిని గ్రహించినచో అభివృద్ధి కుంటుపడును, కావున మనకు ఉ తమలోకముల కోరిక వున్న చో వీటిని గ్రహించ రాదు. నూరురెట్లు బంగారముతో చేయబడిన ఆభరణమును వేయి రేట్లతో కూడినదానిని యితరులనుండి స్వీకరించినచో పాపిష్టిగతిని పొందును. ఈ భూమండలమున కల సమ స్త వీహలు గోధుమలు, బంగారము, పశువులు, స్త్రీ లు ఽక్కనికికూడా తృప్తి ని కలిగించజాలవని తెలిసి శాంతించవలయును.
వసిష్ఠ మహరి పలికెను
తపస్సంచయ ధనసంచ యములలో తపస్సంచయమే విశిష్టము. ఆన్ని రాశులను త్యాగము చేసినవారికి ఉపద్రవ ములు నశించును. కూడ బెట్టినవాడు ఏ ఉపద్రవములు లేకుండా ఎక్కడా కానరాడు. చెడువారినుండి దానము గ్రహించని వారికి సంతోషము బ్రహ్మతేజస్సు వృద్ధి చెందును. ఆకించసత్వమును (ఏమీలేకుండుటను) రాజ్యమును త్రాచులో వేసి తూచినచో రాజ్యముకంటే ఆకించ నత్వమే అధిక ము.
కశ్యప మహర్షి పలికెను
ఆర్గమును పోగుచేయటయే బ్రాహ్మణునకు గొప్ప ఆనర్ధము. ధనముతో ఐశ్వర్యముతో మూడుడైన బ్రాహ్మణుడు శ్రేయస్సునుండి ! భ్రష్టుడగును. ధనసంపదలు మోహమును కలిగించును. మోహము వలన నరకము. సంప్రాప్తించును. కావున శ్రేయస్సును కోరువారు అనర్గమును కలిగించు ఆర్గమును దూరముగా వీడవలయును. ధర్మము కొరకు ఆర్గము కాశించువాడు ఆశను విడుచుట వలననే మేలును పొందును. . బురదనుతొక్కి కాలుకడుగుటకంటే , బురదకు దూరముగా నుండుటయే మేలుక దా ? ఆర్థము చేత సాధించు ధర్మము నశించునదిగా పేర్కొనబడినది. ఇతరుల కొరకు త్యాగము చేసినవారు అక్షయమగు ముక్తికి సూచికలు.
భరద్వాజ మహర్షి పలికెను
శరీరము వృద్దాప్యముతో జీర్ణించువానికి కేశములు జీర్ణములగును. (నేర యును) జీర్ణించువానికి దంతములు రాలిపోవును. ఎంత జీర్ణించుచున్ననూ ధనము పై ఆళ బ్రతుకు పై ఆశ మాత్రము జీర్ణము కాదు. చెవులు కన్నులు జీర్ణించును కాని ఆకరు ఏ ఉపద్రవము లేదు. కుట్టువాడు దారమును సూదితో వస్త్రములో చేర్చి చిరుగును పూరించునట్లు అట్లే సంసార మను దారమును ఆశ అను సూదితో చేర్చును. రురుమృగశరీర ము పెరుగు చున్నపుడు కొమ్ము పెరుగునట్లు ఆశ పెరుగును. . అంతు చీక నిది తీరము కనపడనిది , ఆశ అనేక దుఃఖములకు ఆలవాలము. అధర్మమునకు ఆధిక ముగా నుండునది కావున ఆశను విడువ వలయును.
గౌతమ మహర్షి పలికెను
సంతృప్తి పొందు వాడు తమనుకొన్న దానికంటే అధిక ఫలమును పొందును. లోభి ఇంద్రియ చాపల్యముతో కష్టములలో మునుగును. సంతోషము నిండిన మనసుకలవానికి అంతటా సంపదలే. పాదరక్షలు గలవానికి భూమియంతయు చర్మముతో కప్పబడినట్లే కదా ! సంతోషామృతముతో తృప్తి పొంది శాంతచిత్తులగువారికి కలుగు సుఖము ధనలోభములో పలుదిక్కులకు పరుగిడువారికి ఎట్లు లభించును. అసంతోషము పరమదుఃఖము. సంతోషము పరమ సుఖము. కావున సుఖమును కోరువారు ఎప్పుడూ సంతోషముతో నుండవలయును.
విశ్వామిత్ర మహర్షి పలికెను.
కోరికలను కోరువారి కోరిక నెరవేరినచో మరొక కోరిక బాణమువలె తాకును. కోరికలు అనుభవించుటతో శాంతించవు. అగ్నిహోత్రము నెయ్యితో చల్లారదుగదా! ఇంకా వృద్ధి చెందును. మోహముతో కోరికలను కోరువారు సుఖమును పొందజాలరు. కపింజల పక్షి డేగ గూడు కల చెట్టు నీడను చేరినట్లగును. నాలుగు సముద్రములు వరివేష్టించియున్న భూమండలమును అనుభవించు చక్రవర్తి కన్న రాయిని బంగారమును సమానముగా భావించువాడే కృతార్థుడు.
జమదగ్ని మహర్షి పలికెను.
దానమును స్వీకరించ గలిగినను దానమును పరిగ్రహించని వాడు దానముల నిచ్చువారి లోకములను పొందును. రాజు నుండి ధనమును గోరువారు మహర్షులచే చింతించదగిన వారగుదురు. దానమును గ్రహించగలుగు వాడై నసు దానమునందు ఆస క్తిలేని వాడు నరకమున యాతనాభయమును చూడజాలడు. దానమును పరిగ్రహించుట వలన బ్రాహ్మణుల తేజస్సు క్షీణించును.దానమును స్వీకరించగల వారై నను స్వీకరించనిచో దానము చేయువారికి లభించు లోకములు, స్వీకరించని వారికి లభించును.
ఆరుంధతీ పలికెను.
నీటిలోని లామర తూటి దారము తామర నాళములో చేరి ఉండునో దేహమున గల ఆశగూడ ఆద్యంతములు లేనిదై పెరుగు చుండును. దుర్బుద్ధి గలవారు వదల లేనిది. జీర్ణించినను తరగనిది ప్రాణములను అంతముచేయు రోగమగు ఆశను వదలిన వాడే సుఖమును పొందగలడు.
చాండాలుడు పలికెను.
ఈ మహానుభావుడు ఉగ్రభయము వలన భయపడుచున్నాడు. బలవంతుని నుండి దుర్బలుడు భయపడునట్లు భయపడుచున్నాను.
వరుసఖుడు పలికెను.
ధర్మపరాయణులైన పండితులు ఆచరించు దానిని తన పాతమును కోరువారు ఆచరించవలయును. ఇట్లు పలికి బంగారము పొదగిన మేడిపండ్లను విడిచి దృఢ వ్రత ముగల ఋషులు మరియొక చోటికి వెళ్ళిరి. ఆట్లు తిరుగుచున్న ఋషులు మధ్యమ పుష్కరమును చేరిరి. అచ్చట శునక మిత్రుని పరివ్రాజక రూపుని చూచిరి. అతనిలో కలిసి వనమధ్యమునకు వెడలి పద్మములతో నిండిన ఉత్తమ జలాశయమును (సరస్సును చూచిరి. ఉత్తమ గతిని ఆలోచించుచు ఆ సర స్థిరమున కూర్చుండిరి. శునస్సఖుడు ఆకలిగొన్న ఋషులందరితో ఇట్లు పలికెను. మీ ఆకలి బాధ ఎంత తీవ్రమయినదో వివరించుడు. అంతట ఆ ఋషులు శునస్సఖుని గూర్చి యిట్లు పలికిరి.
ఋషులు వలికిరి.
ళ క్లి, ఖడ్ల గదలతో చక్రముతోమర బాణములతో బాధించిన వేదనకన్న ఆకలివలన కలుగు వేదన అధికము. శ్వాస, కుమ, క్షయ, ఆస్జిలి, జ్వర, ఆపస్మార, శూల వ్యాధులతో కలుగు బాధ ఆకలి బాధకంటే ఎక్కువ గాదు. బంగారు ఆభరణములు అంగద, కేయూర, కిరీట కుండలాదులతో అలంకరించుకొన్నను ఆకలిగొన్న వానికి సంతోషము కలుగదు. భూమిలోని నీరును సూర్యకాంతి (గ్రహించును) ఆకర్షించినట్లు శరీరములోని నరములు జఠరాగ్నితో శుష్కించి పోవును. ఆకలితో పీడింపబడిన వాడు వినజాలడు. వాసన చూడజాలడు. చూడజాలడు. దహించబడుచు క్షీణించును. ఆకలిగొన్న వాడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులను ఊర్ధ్వ, అధో భాగములను తెలియజాలడు. అట్లే మూగ, చెవిటి, కుంటి, ఉన్మాది, బై రవత్వము, అమర్యాద భావములు ఆకలితో పెరుగును. ఆకలితో పీడించబడిన వాడు తల్లిని, తండ్రిని, హితులను, భార్యను, కూతురును, సోదరులను, స్వజనులను కూడ విడచును. ఆకలిగొన్న వాడు తల్లి దండ్రులను, దైవమును, గురువును పూజించజాలడు. ఆకలిగొన్న వారు వచ్చిన ఋషులను గూడ తెలియజాలరు. ఆహారము లేనివాని స్థితి యిది కావున శ్రద్దతో అన్నము పెట్ట వలయును. అట్లు పెట్టిన వాడు బ్రహ్మ యగును. బ్రహ్మతో కలిసి ఆనందించును. బ్రాహ్మణునికి ప్రతిరోజు సంస్కరించబడిన అన్నమును పెట్టవలయును. శ్రాద్ధమున అన్న దాన విధిని చదివినవారు, అమావాస్యనాడు ఏకాగ్ర చిత్తముతో భూతోపఘాత సంపూర్ణమున శ్రాద్ధమున వినిపించినచో వారి పితృ దేవతలు సంతోషించెదరు. దేవద్విజ సమీపమున అన్నదానమును గావించినవారు విముక్తిని పొందెదరు. మేల్కొని యున్న నూ, ప్రమత్తుడై యున్న నూ, సందర్బ వశమున వచ్చిన వాడై ననూ, భ క్తిలేని వాడైననూ అన్నదానమును వినినచో పాపముల నుండి విముక్తి పొందును. అన్నదానము చేయు విప్రులు సుఖము కలవారు. ధర్మ భాగమును పొందుతారు. యమనియమ దమములు కలవారగుదురు. బ్రాహ్మణులకు వి శేషించి దమమే సనాతన ధర్మము. దమమే తేజమును వృద్ధి పొందించును. దమమే పవిత్రము. దమమే ఉత్తమము. దమము వలననే పాపరహితుడు తేజస్వి యగును. ఈ లోక మున కల నియమములు ధర్మములు సర్వయజ్ఞ ఫలములకన్నా దమము విశిష్టము. దమము వలననే తపోయజ్ఞ దానములు ప్రవర్తించును. దమము లేనివాడు అరణ్యములో నుండుట, దమము కలవాడు ఆశ్రమములో నుండుట వ్యర్ధము. దమము కలవాడు ఉన్న ప్రదేశమే ఆరణ్యము. మహాశ్రమము.
శిలవృత్తములు కలవానికి, ఇంద్రియ నిగ్రహము కలవానికి, ఆర్ణవము కలవానికి ఆశ్రమములతో ఏమి ప్రయోజనము. విషయము లందు ఆసక్తి కలవానికి అడవిలో కూడా దోషములు సంభవించును. ఇంటిలో నున్ననూ ఇంద్రియ నిగ్రహము తపమే. సత్కార్యమునందు ప్రవర్తించుచు రాగాభిలాష లేనివానికి గృహమే తపోవనము. సత్కర్మల వలన, ధర్మముల వలన జీవితమును సాగించువారికి, ఎల్లప్పుడూ సంతోషముతో గృహస్థాశ్రమమున ప్రవర్తించువారికి, ఇంద్రియ నిగ్రహము కలవారికి, అతిధి ప్రియులకు నియమముతో నుండువారికి గృహములో కూడా ధర్మమే ప్రవర్తించును. శబ్ద శాస్త్ర నిష్ణాతుడై నంత మాత్రమున, వర్ణ సంగతిలో ప్రీతుడై న వానికి, భోజన వస్త్రాభరణములందు ప్రీతి కలవానికి, లోక వ్యవహారములందు ఆసక్తి కలవానికి మోక్షము లభించదు. ఏకాంతమునందు ఉండు స్వభావము కలవానికి, దృడవ్రతునికి, ఇంద్రియ వ్యామోహమును తొలగించుకొనిన వానికి ఆధ్యాత్మ యోగమునందు ప్రీతి కలవానికి, అహింసా ధర్మము నవలంభించు వానికి మోక్షము తప్పక లభించును. ఆంతరింద్రియ నిగ్రహము కలవాడు సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. మనసు నిలకడగా ఉన్న వాడు సర్వభూతములందు సమముగా
ప్రవర్తించును. రథముతో, అశ్వములతో, యేనుగులతో సుఖముగా పయనించ జాలడు. వినయశీలుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు సుఖముగా పరలోక మార్గమున వెళ్ళగలడు.
ఇంద్రియ నిగ్రహము లేని ఆత్మచేయు ఆప్రకారమును పట్టుకొనిన సింహము, కోపింపచేసిన సర్పము, పగబట్టిన శత్రువు కూడా చేయజాలడు. నిగ్రహము నిగ్రహము, కాజాలదు. మనస్తే యమమనబడును, మనసును నియమించిన వాడే యముడన బడును. యముడు, యముడు ఆని లోకము వృధాగా యముని చూచి కలత చెందును. మనసుని నిగ్రహించిన వానిని యముడేమి చేయగలడు? రాక్షసుల నుండి భూతముల" నుండి నీగ్రహములేని వారి నుండియే ఎప్పుడూ భయము కలుగుచుండును. వారిని ‘తొలగించుటకే దండము సృష్టించబడినది. దండమే ప్రాణులను రక్షించుచుండును-దండమే ప్రజలను పోలించును. సౌపొత్ములను దురయమగు దండమే వారించును. సుందరుడు, యువకుడు, లోహితాక్షుడు, సర్వ ప్రాణులకు భయమును కలిగించు వాడు దండుడే. దండుడే మనుష్యులను శాసించువాడు. దండునిలోనే ధర్మము ప్రతిష్టించబడి యున్నది. అన్ని ఆశ్రమములలో దమమే (ఇంద్రియ నిగ్రహమే) ఉత్తమ ప్రతము. దాంతుని (ఇంద్రియ నిగ్రహము కలవానిని) గుర్తించుటకు కావలసిన చిహ్న ములను చెప్పెదను. దీనత్వము లేకపోవుట, కాఠిన్యము లేకపోవుట, సంతోషము, క్రమశిక్షణ అసూయ లేకపోవుట, గురువును పూజించుట భూతదయ, ఆలోభత్వము ఈ ఎనిమిదిటితోనే దమము అని శాంతబుద్ధులగు ఋషులు చెప్పియున్నారు. ధర్మము మోక్షము స్వర్గము దయ పై ఆధారపడియుండును. అవమానముతో కోపించక సన్మానమున సంతోషించక, సుఖ దుఃఖములందు సమతను కలిగి ధీరుడుగా నుండువాడు శాంతుడనబడును. శాంతుడు. సుఖముగా నిద్రించును. సుఖముగా మేల్కొనును. శాంతున కే శ్రేయస్సు కలుగును. అవమానించువాడు నశించును, అవమానించబడినవాడు అతని పాపమును ధ్యానించరాదు. తమ ధర్మమును చూచుకొని పరధర్మమును నిందించరాదు. మొదట తనను చక్కగా తెలుపవలయును. పరులను దోషములను చూపి ఆక్షేపించరాదు. మంత్రములతో క్రియలతో జాతితో హీనుడై ననూ ఆంగ వైకల్యమును వస్త్రము కప్పిపుచ్చునట్లు దమము అన్నిటిని కప్పిపుచ్చును. దమము తెలియని వారి ఆధ్యయనము వ్యర్ధము. శాస్త్రమునకు మూలము దమమే. దమమే సనాతన ధర్మము. బంగారము దమమును త్రాచులో నుంచి తూచినచో దమాధిక్యమును తెలిసినవాడు ధృతిమంతుడగును. ద్రవ్యమోహితుడు కాజాలడు. అన్ని వ్రతములలోనికి దమమే ఉత్తమ వ్రతము. వేదాంగములను వేద తత్వమును తెలిసిన బ్రాహ్మణుడై నను దమహీనుడై నచో పూజ్యత్వమును పొందజాలడు.
దమహీనుని వేదములు పవిత్రము చేయజాలవు. వేదాంగములతో అధ్యయనము చేసిననూ వ్యర్థము. దమములేని సాంఖ్యము యోగము కులము జన్మము తీర్థాభిషేకములు నిరర్థకములు.
యోగము తెలిసినవాడు అవమానమును పొందినపుడు అమృతమును పొందినట్లు తృప్తిని చెందవలయును. సమ్మానమును పొంది విషమువలె జుగుప్సను పొందవలయును. అవమానము వలన తపస్సు వృద్ధి చెందును. సమ్మానమువలన తపస్సు క్షీణించును. గౌరవమును పూజను పొందిన బ్రాహ్మణుడు పాడి ఆవువలె వేళ్ళును. గడ్డితో జలముతో ఆవు సంతృప్తి చెందినట్లు జపముతో హోమముతో బ్రాహ్మణుడు సంతోషించును.
ఎదుటి వారి మంచిని చూచి ఆక్రోశించువారి ఆక్రోశముతో సాటివచ్చు మంచిమిత్రుడు మరియొకడు లేడు. ఆక్రోశించు వాడు మన పాపమును తీసుకొని తన పుణ్యమునిచ్చును. ఇట్లు ఆక్రోశించువారిని చూచి మరల ఆక్రోశించరాదు. తన కోపమును మరల్చుకొనవలయును. తనను తాను నిగ్రహించుకొనువాడు అమృతాభిషేకమును చేసుకొనును. కపాలి వ్రతము, వృక్షమూలము, కుచేల వ్రతము, అసహాయత, అనభిలాష బ్రహ్మచర్యము ఉత్తమగతిని పొందించును. కామక్రోధములను గెల్చినవానికి ఆరణ్యముతో పనియేమిటి? ఆధ్యాసముతో శాస్త్రము శీలముతో కులము ధరించబడును. గుణములతో మంత్రములు సత్వముతో క్రోధము ధరించ బడును. కలిగిన కోపమును తనలో నిగ్రహించుకొనువాడు శాంతముతో జపించినచో పొనబోలు వీరుడు మరియొకడుండడు. కలిగిన కోపమును నిగ్రహించుకొనువాడు పరమో త్తముడు. అతను ఈ సంసారమున కష్టములను పొందడు. ఇది పరమ రహస్యము. బ్రహ్మ రహస్యము, వేదరాశి. ఇట్లు నేను నీకు ధర్మ నియమమును తెలిపితిని. యజ్ఞము చేయు వారి లోకములు వేరు, తపస్వి లోకములు వేరు దమము కలవారి లోకము వేరు. దమము కలవారు పరమ పూజితులు. క్షమావంతుల దోష మొకటి. రెండవది లేదు. క్షమ కల వారిని ఆశ క్తులుగా భావించెదరు. దీనిని దోషముగా భావించరాదు. క్షమ ప్రజ్ఞావంతులకు బలము. శమమును తెలిసినవాడు ఇష్టా పరములను మించును. కోపము కలవాడు చేయు జపము - హోమము పూజ పగిలినకుండ లోని నీరువలె క్షీణించును. ఈ దమాధ్యాయమును ఆధ్యయనము చేయువాడు ధర్మనావనెక్కి దుర్గములను తరించగలడు. ఈ దమాధ్యాయమును ఎపుడూ వినిపించు బ్రాహ్మణుడు బ్రహ్మలోకమును పొంది ఆటనుండి దిగిరాడు. ఈ ధర్మసర్వస్వమును చక్కగా వినవలయును. విని ధరించ వలయును. తనకు వ్యతిరేకమగు పనులను ఇతరులకు ఆచరించరాదు. పరస్త్రీలను తల్లివలే వర ద్రవ్యములను మట్టి పెడ్డవలె అన్ని ప్రాణులను తనవలె చూచువాడే చూచువాడు. వైశ్వదేవయాగము పరార్థ జీవనము లోహములలో బంగారమువలె జీవన సర్వస్వము. సర్వభూత హితమును ఆచరించువాడు అమృతత్వమును పొందును. ఇట్లు ఆ ఋషులు శునస్సఖునికి ధర్మసర్వస్వమును తెలిపి ఆ సర సీరమున విశ్రమించిరి.
పద్మములు ఉత్పలము విపుల జలములు కల ఆ సరస్సును చూచుచు దానిలోనికిదిగి తామర తూళ్ళను తీసుకొని తీరమున నుంచి జలతర్పణమును గావించిరి. తరువాత ఆ జలమునుండి పైకివచ్చి పరస్పరము సమావేశమై ఈ బీసములను చూడ తొలక ఇట్లు వలికిరి.
ఋషులు పలికిరి.
ఆకలితో అలమటించు పాపకర్ములమైన మా తామర తూండ్లను ఆహారమును కోరు ఏ పాపి ఆవహరించెను. వారు ఽకరినొకరు అనుమానించుకొనుచు అడుగుచుండిరి. నమ్మకమును కలిగించుటకై వారు శపథమును చేసిరి.
కశ్యప మహర్షి పలికెను.
తామరతూండ్లను దొంగిలించినవాడు ఆంతట అన్నిటిని హరించుగాత. న్యాస లోపమును చేయుగాత. దొంగ సాక్ష్యమును చెప్పుగాత. దంథముతో ధర్మమును ఆచరించుగాత. రాజును సేవించుగాత. మధువును మాంసమును సేవించుగాత. ఎపుడూ అబద్దమాడుగాత. విషయములను సేవించుగాత. శుల్కమును తీసుకొని కన్యాదానము చేయుగాక.
వసిష్ఠ మహర్షి పలి కెను.
ఋతుకాలమును తప్పి శ్రీ సంగమము చేయు గాత. పగలు నిద్రించుగాత. తామరతూండ్లను దొంగిలించినవారు వరస్పరము ఆతిధ్యమును పొందుదురుగాత. ఽ కేబావి ఉన్న గ్రామములో బ్రాహ్మణుడు శూద్రుడు నివసించుగాత. ఆట్టి వారు పొందు లోకములను పొందుగావుత.
భరద్వాజ మహర్షి పలికెను.
బిసములను దొంగిలించినవారు అందరిలో నికృష్టుడగుగాత. సమృద్ధితో అహంకరించుగాత. మాత్సర్యము లోభత్వము కలుగుగాక. ఎపుడూ వదురుబోతు ఇతరులచే కొట్టబడి మరల కొట్టుగావుత. రసములను అమ్ముగావుత.
గౌతమ మహర్షి పలికెను.
బిసములను దొంగిలించినవారు అతిధి వచ్చినపుడు పాక భేదమును చేయుగాత. శూద్రన్న మును భుజింతుగాత. చేసిన దానమును చెప్పుకొనుగావుత. పర భార్యలయందు రమించుగాత. ఒంటరిగా మృష్టాన్నమును భుజించుగాత.
విశ్వామిత్ర మహర్షి పలికెను.
బిసముల దొంగిలించినవాడు ఎపుడూ కామ పరతంత్రుడగుగాత. పగలు శ్రీ సంగమును చేయుగావుత. నిత్యపాతకి అగుగాక. పరుల పై నిందలను మోపగాత. పరదారలను రమించుగాత. పర నిందార తుడగుగాత. తల్లిదండ్రులను అవమానించుగాత. తల్లియందు ఇతర బుద్ధి కలవాడగుగాత. ఎపుడూ ఇతరుల వంటను ఇతరుల భార్యలను భజించుగాత. వేదములనమ్ము గావుత.
జమదగ్ని మహర్షి పలికెను.
బిస నైన్యమును చేయువాడు ప్రతి జన్మలోనూ ఇతరులకు సేవకుడుగా పుట్టనీ. సర్వధర్మ క్రియాహీనుడగుగాత.
శునస్సఖుడు పలికెను.
బిసములను దొంగిలించినవాడు న్యాయముగా వేదాధ్యయనము చేయుగాత. గృహస్థాశ్రమమున అతిథులయందు ప్రీతి కలిగి ఉండుగాత. ఎల్లప్పుడూ సత్యమునే పలుకు గాత. యధావిధిగా అగ్నిని పూజించుగాత. యజ్ఞమును చేయుగాత. బ్రహ్మ లోకమును పొందుగాత..
ఋషులు పలికిరి.
నీవు చేసిన శపథములు బ్రాహ్మణులకు ఇష్టములే. కావున మా అందరి బిసములను నీవే దొంగిలించితివి.
శునస్సఖుడు పలికెను.
ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ బిసములను నేనే దాచి ఉంచితిని. మీనుండి ధర్మములను తెలియగోరి ఇట్లు చేసితిని నన్ను ఇంద్రునిగా తెలియుడు. మీరు లోభమును విడుచుటవలన అక్షయలోకములను గెలిచితిరి. కావున విమానమును అధిరోహించుడు. స్వర్గమునకు వెళ్ళెదము. అంతట ఆ ఋషులు అతనిని ఇంద్రునిగా తెలిసి వాక్యవిశారదులు ఇట్లు పలికిరి. ఇంటికి వచ్చిన మానవుడు మధ్యమపుష్కరమున ప్రవేశించి మూడు దినములు ఉపవసించినవాడు తప్పక ఫలమును పొందవలయును. వానప్రస్తులాచరించు ద్వాదశ వార్షిక దీక్షా సమఫలమును పొందుగాత. ఇచటికి చేరినవాడు దుర్గతిని పొందజాలడు. తనవారితో కలిసి ఆనందించును.
బ్రహ్మలోకమును చేరి బ్రహ్మ మానమున ఽక దినము నివసించుగాత.
పులస్త్య మహర్షి వలికెను.
ఇట్లు ప్రీతి చెందిన ఋషులు. ఇంద్రునితో కలిసి స్వర్గమునకు వెళ్ళిరి. ఇట్లు పలువిధములుగా లోభింపచేసిననూ లోభమును చెందనందున స్వర్గమును చేరిరి. ఈ ఋషుల చరితమును ప్రతి దినము వినినవారు అన్ని పాపములు తొలగి స్వర్గలోకమున సుఖింతురు.
ఇది శ్రీ వద్మ పురాణమున సృష్టిఖండమున సప్తర్షి సంవాదమను పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది.
