పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

23 - వేశ్యావ్రత కథనం - వేశ్యావ్రత కథనం

భీష్ముడనియె - విపేంద్ర! వైష్ణవ ధర్మములు వాని ఫలమేమో దేల్పుమన పులస్త్యుడనియె. రథంతర కల్పమందు మందర పర్వతమందున్న పరమ శివుని బ్రహ్మ కొలది తపస్సు మాత్రముచే తలలుగని యైశ్వర్యము ఆరోగ్యము మోక్షము మానవులకు గల్లు నుపాయము తెల్పుమని యడిగెను. విశ్వాత్ముడు లోకజావనుడు శంకరుడు ఉమాపతి మనః ప్రీతిగ నిట్లు పలికెను.

ఈ రథంతర కల్పమున కిరువది యగు వారాహకల్పమందు వైవసృత మన్వంతరమున నిరువది యేడవ ద్వాపర ము చివర వాసుదేవుడు వసుదేవుని కుమారుడుగ కృష్ణుడుగ భూభారవతరణమున కవతరించును. ఆయన నివాసమున కపుడు ద్వారకా నగరమేర్పడును. ఇప్పుడది కుళ సలి. ఆ విష్ణు నివాసమునకు బ్రహ్మ యా ద్వారకా నిర్మాణము సేయును. విష్ణువు ద్వైపాయనుడు (వ్యాసుడు) రోహిణేయుడు (బలరాముడు) భూభారావతరణమునకు మూడు మూర్తుల నవతరించును.

ఒకప్పుడా ద్వారక యందు కొలువుదీరి కూర్చుండి భార్యలతో వృప్తి వంతులగు పండితులతో దక్షిణలు సమృద్ధిగ నిచ్చుచు యజ్ఞములు జరుగుచు కురువంశ రాజులతో దేవ గంధర్వలతో కూడ కైటభారి (విష్ణువు) ధర్మసంబంధమయిన కథలు జరుగుచుండ భీమ సేనునితో కొలువుదీరి నీవడిగిన ధర్మమునకు వేజు దృష్టితో వివరణము  సెప్పగలడు. అప్పుడు భీముడు కూడ యాయన నుడివిన ధర్మమును ఆచరణలో బెట్టును.

ఈ ధర్మమునకు పాండవ కుమారుడు. మహా బలుండగు భీముడు ప్రవర్తకుడగును. ఉదరమందు (జఠర మందు) వృకః =తీక్ష రూపుడైన యగ్ని గలవాడు గావున వృకోదరుడనబడును. ఆగ్నియు భీముడు యిద్దరు వరస్పరము మాట్లాడుకొందురు. భీముడు మితిమీరిన పదివేల యేనుగుల బలము గలవాడు. ధర్మనిష్టుడైనను నతడు తీవ్రాగ్ని సంపన్నుడు నుపవాసములు సేయలే డయ్యెను. అన్ని వ్రతముల కంటెనిదే యాతనికు త్ర మవ్రతమయ్యెను. జగద్గురువు వాసుదేవుడు విశ్వరూపుడు కృష్ణుడు మాత్రమే యీ యతిభు క్తి ఆ శేష యజ్ఞఫల మిచ్చునని, ఆ శేష పాప నాశకమని, అశేష దుష్ట సంహారమని, పవిత్రముల కెల్ల పవిత్రము, మంగళముల కెల్ల మంగళమని, కాబోవు వాని కన్నిటికి రాబోవునది ఆయిన వాటికన్నిటికినై న యుత్తమ ధర్మమని ద్వాపరము చివర పూర్ణావతారమూర్తి వాసుదేవుడే యీ మాట జెప్పగలడు..

వాసుదేవుడనియె :. అష్టమి, చతుర్దశ ద్వాదశులందు వాటి యితర దీనములందు నక్షత్రములందు నీవు ఉపవాసము సేయలేవేని భీమా! పాప నాళ ని యిది. మాఘ శుక్ల దశమినాడు మాత్రము ను పవాసముండి విష్ణుపదమందుము. నేతితో తలంటుకొని తిలలతో స్నానము చేయవలెను. “నమో నారాయణాయ" అని విష్ణువు నర్చింపవలెను. కృష్ణాయ యని పాదము - కృష్ణాత్మనే నమః ఆని శిరస్సు- వైకుంఠాయ యని కంఠమును. శ్రీవత్సధారిణే వక్షః స్థలము. శంఖినే గదినే చక్రిణే వర దాయ అని శంఖ చక్ర గదారులు నారాయణుని పూజించి ఆవాహనాది క్రమమున దామోదరాయ యని ఉదరమును వంచ జనాయ " ఆనికటిని (నడుముని) సౌభాగ్యనాధాయ యని ఊరువులు (తొడలు ), భూతధారిణే అని మోకాళ్ళు, నమో నీలాయ యని పిక్కలు, విశ్వభుజేయని పాదములు నమో దేవ్యై నమః శాంత్యై నమో లకై్మ్య నమః పుష్యై నమో ధృత్యై నమో నమః నమో విహంగ నాధాయ నమః నమః వాయు వేగాయ పశ్మిణే నమో విషప్ర మధనాయ యని గరుడుని గూడ పూజింపవలెను.

ఈలా గోవిందుని, ఉమాపతిని. వినాయకుని గంధ మాల్య ధూప దీపాదులతో భ క్తితో బూజింపవలెను. ఆపు పాలతో కృసరము, పాయసము నేతితో గూడ డుజించి యటనుంచి మరొక చోటికి వెళ్ళి మద్దిపుల్లగాని బదిర గాని పూని దంతకాష్ఠముతో తూర్పుగా దంత ధావనము చేసికొనవలెను, సాయం సంధ్య వార్చి తూర్పుగానో ఉత్తరముగానో నిలిచి నమో నారాయణాయ్వం శరణం గతః అని పలికి ఏకాదశినాడు ఉపవసించి కేళ వుని బూజించి యా రాత్రి యంతయు శేష శాయి సన్నిధి నీలిచి బ్రాహ్మణోత్తములతో గూడి నేతితో విశ్వ దహనుని యందు హోష ములు సేసి, ద్వాదశినాడు క్షీర భోజనము సేయుదును. అది నిర్విఘ్న మగు గాక యని రాత్రి వట్టి నేలపై ఇతిహాస కథాదులు విని పరుండవలెను.

ప్రభాతమందు (తెల్లవారగనే) నది కేగి స్నానము చేసి సంధ్య వార్చి యథావిధి పితృ తర్పణము నేని శేషతల్ప wయిని విష్ణువు నుపాసించి యింటి వాకిట భ క్తి మండపము నేర్పరచవలెను. నాల్లు మూరల మేర వేదిక యేర్పరచి యట తోరణ మేర్పరచి మధ్య మినుములతోడి మినుపగింజంత ఛిద్రము గల కలశమునందు నీరు నింపి నిలుపవలేను. అటు క్రింద కృష్ణాజినము పై కూర్చుండి యా రంధ్రము ద్వారా ధారను తన పై నభి షేకించుకొనవలెను.

నమృద్ధియైన జలధారలకు ఫల సమృద్ధి గలుగునని వేద వేత్తలెఱుగుదురు. కావున కురుశేషl యీలా కలశ ధారల నభి షేకము చేసికొనవలెను.

దక్షిణమున అర్ధ చంద్రాకారమున, పశ్చిమమున వర్తులాకారములో, ఉత్తరమున రావి ఆకు ఆకారములో, వేదికను చేయవలెను. విష్ణు భక్తుడగు ద్విజుడు మధ్య పద్మాకారమున చేయవలెను. కోణమున గానీ, దక్షిణాన గానీ చేయరాదు. విష్ణుతత్పరుడై ఆ నీటి ధార ను తల పై ధరించవలెను. రెండవ వేదిక దేవుని కై ఏర్పరచి, దాని మధ్య పద్మమున పురుషోత్తముని నిలుపవలెను. కుండము ను ఒక చేతి లోతున చేసి దానికి మూడు వలయాల నేర్చరచవలేను.

దాని ముఖము యోనిద్వార మువలె నుండునట్లు చేసి బ్రాహ్మణులతో యవలు. నేయి, నుప్వులు విష్ణుదేవతకొరకు మంత్రములతో ఆగ్ని లో వేల్చవలెను. వైష్ణవయాగమును చక్కగా చేయవలెను. కుండము యందు నేతిధారను, పాలధారను. నీటిధారను ఆర్పించవలేను. నిష్పావమున సగముండునట్లు నేతిని ధార గాపోయవలెను (నిష్పావమనగా ధాన్యమును తూర్పు బట్టుట) స్వేచ్ఛగా పాలధార, నీటిధార ఆవిచ్ఛిన్నముగా పడునట్లు పదమూడుసార్లు జల కుంభముతో వేయవలెను. భక్ష్యభోజ్య ములనిచ్చి శుద్ధవ స్త్రముల ధరించిన విప్రుల పూజించవలెను. ఐదురత్నములతో గూడిన రాగిపాత్రలతో, ఉత్తర ముఖము చేసిన నలుగురు బహ్వృచులతో హోమమును చేయవలెను. యజుర్వేదపరాయణుల చేత రుద్ర జాప్యము, నలుగురు. సామవేద బ్రాహ్మ ణులచేత విష్ణుసంబంధి సామములను చదివింపజేయవలెను. ఇట్లు పన్నెండుగురు బ్రాహ్మణులను వస్త్ర మాల్యాదులేపనాలచేత, బంగారుదారములుగల అంగుళీయకాలచేత, శయ్యావస్త్రాల చేత, విత్తశాత్యమును విడిచి పూజింపవలెను.

ఈ విధంగానే గీతమంగళ ధ్వనులచేత రాత్రిని గడిపి ఉపాధ్యాయునికి ద్విగుణముగా ఇదంతా ఇచ్చి పూజింపవలెను. ఆటుపై పొద్దుననేలేచి బంగారు కొమ్ముతోడుగులతో పద మూడు ఆవులను, పాలనిచ్చు వానిని, పాలుపితుకు కంచుపాత్రతో సహా ఇవ్వవలెను. ఆ ఆవుల గిట్టలకు వెండితోడుగులుండవలెను. దానికి గంధమునలిమి, దూడలతో దానమివ్వవలెను. ఆటు పై బ్రాహ్మణులకు భక్ష్యభోజ్యముల నిచ్చి, నానావిధఛత్రములతో తృప్తి ని కలిగించవలెను.

పులుపు, ఉప్పులేని భోజనమును స్వీకరించి పుత్రభార్యసహితుడై ఎనిమిది అడుగులు వెంటనడవవలెను. క్లేశముల నశింపజేయు కేశవుడు ప్రీతిందు గాత" యని గురువు - ఆజ్ఞతో కడవలను, గోవులను, కయ్యలను, వస్త్రములను వారీ వారి ఇళ్ళకు చేర్చవలెను. ఎక్కువ కయ్యలు దొరక నిచో, ఆన్ని ఉపస్కర ములు గలిగి చక్కగా నున్న ఒక శయ్య ని నా దానమివ్వవలెను. కురు శేషా ! విపులకీర్తిని కోరినవాడు దినమంతా ఇతిహాస పురాణములను -వినుచూ వినిపింపజేయుచు గడపవలేను. కనుక ఓ భీమా ! నీవు మాత్సర్యమును విడిచి సత్వమునుపొంది స్నేహమువల్ల నేజెప్పిన ఈ రహస్య వ్రతమునాచరింపుము. నీచే చేయబడు ఈ వ్రతము నీ పేరనే ప్రసిద్దమగును.

అట్టి ఈ భీమద్వాదశివ్రతము పాపములన్నింటిని హరించునది. శుభమగునది కళ్యాణిని అను పేర వాసి కెక్కినది. ఈ వరాహకల్పమున మొదటగా చేయువాడవు నీవే గమ్ము. ఈ వ్రతస్మరణము, కీర నముచేత ఇంద్రుని పొకమంతా నశించెను. అటు పై అప్సరసలలో శ్రేష్ఠురాలగుదానిని, ఇతర జన్మలలో వేశ్యగా చేయబడినదానిని చూచి, వైశ్యకులమున బుట్టినదై ననూ పురుహూతపత్ని యగు పులోమజ జన్మించెను. ఇప్పుడు నా ప్రియురాలగు సత్యభామ ఆ పులోమజకు పరిచారిక. పర్వము మంగళము జరిగెను. ఇట్టి బ్రాహ్మణ పుత్రి వేదవతియాయెను.

ఈ కల్యాణితిథియందే ఈ మండలమునకు వచ్చి సహస్రధారలతో స్నానము చేసి తేజమయుడగు భేటపతియాయెను.

దేవేంద్రుడు మొదలైన దేవతలు, అసురులు దీనినే ఆచరించారు. ముఖమున కోట్లకొలది నాలుక లున్ననూ దీని ఫలమును చెప్పుటకు శక్యము కాదు.

యాదవేంద్రసుతుడు కలిదోషముల హరించు దీనిని చెప్పును. ఈ లోక మున ఈ వ్రతమునాచరించువాని పితృ దేవతలను నరక మునుండి ఉద్దరించుటకు ఇది సమర్ద మైనది. పరోపకారమున కై దీనిని వినువాడు, చెప్పువాడు, భక్తి తో చదువువాడు విష్ణుభక్తుడై ఇంద్రునికి కూడా పూజ్యుడగును.

మాఘశుద్ద ద్వాదశి పూర్వము కల్యాణినీ యని వాసికెక్కినది. ఇది ఆనమభీమద్వాదశి యని అనంతపుణ్యము నిచ్చునదియై పాండుసుతునిచే చేయబడును.

బ్రహ్మ పలికెను  భగవాన్ ! పురాణములందు వర్ణాశ్రమముయొక్క ఉద్భషమును, ధర్మశాస్త్రాంగ విస్తర ముతో సదాచారమును వింటినీ. ఇక పుణ్య శ్రీ ల సమాచారమును వా స్తవముగా తెలుసుకొనగోరుచున్నాను" అన ఈశ్వరు డనెను. బ్రహ్మదేవా ! ఆదే పుర ములో వాసుదేవుని స్త్రీలు పదహారువేలమంది జన్మించ గలరు. వసంత సమయములో కోకిలలు, తుమ్మెదలు, గుంపుగానుండ, పుష్పములతో నిండిన ఉపవనములో, వికసించిన కల్హారములుగల సరస్పుతీరమున యదుకులములో జన్మించిన విశ్వాత్ముడగు శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా వత్నులతో అలంకరింపబడి ఆనందించును.

సమీపమార్గమున వెళ్ళుచున్న సాంబుడను పేరుగలవాడు, జాంబవతీ పుత్రుడు అన్ని ఆభరణములచే నలంక రింప బడి సాక్షాత్తు మన్మథుడిగా నుండెను. అంత, మన్మథబాణములచే తపించిన ఆ సుందర స్త్రీలు అతనిని కోరిక తో చూచిరి. మన్మథుడు వారి మనస్సులో ప్రబుద్ధుడగుట జూచి సర్వజ్ఞుడగు జనార్దనుడు ధ్యానచక్షువుతో తెలిసి, దస్యులు మిమ్ము హరింతురని అనును.

అపరోక్షము కనుక దీర్ఘ ముగా ఆలోచించి జనార్ధనుని ప్రసన్ను ని చేసుకొనగా ఇట్లనును, శాపముచే తపించుచున్న వారు ప్రార్ధించగా భవిష్యత్తులో శుభమును కలుగజేయుదానిని ఉపదేశించును. మీకు దాల్బ్యఋషి ఏవ్రతమునుపదేశించునో అదే కల్యాణకారకము. అని పలికి వారిని విడిచి ఈశ్వరుడంతర్థానమందెను. చాలకాలము గడిచిన పిదప భారమునవతరించుట (రాక్ష సవథ) జరిగి, మౌసలము జరిగినతరువాత, శ్రీకృష్ణుడు స్వర్గ మును చేరగా. యదుకులము. శూన్యమయి, దొంగలు ఆర్జునుని పరాజితుని చేసిన వేలకొలదిగా దొశ భోగ్యులగు కృషపత్నులు హరింపబడి, దుర్గతికి వగచుచూనుండ, యోగాత్ముడగు దాల్యుడను గొప్ప తపస్సంపన్నుడు రాగలడు. అపుడు వారు అర్హముతో పూజించి మరల మరల నమస్కరించి, కన్నీళ్ళతో మిగుల వగ చెదరు. అనుభవించిన వివిధభోగములను, శ్రీకృష్ణుని, నగర ములను, గొప్ప భవనములను, ద్వార వాసులను, బాలుర ను స్మరించుచూ మిగుల దుఃఖము నొంది ముని యెదుట నిలిచి ఇట్లు ప్రశ్నించెదరు.

భగవాన్ ! దస్యులు మమ్ములనందరిని బలవంతముగా ననుభవించిరి. మా స్వధర్మమును చేజార్చుకొనిన మాకు మీరే శరణము. విజ్ఞుడగు కేశవునిచే నీవాదేశింపబడితివి. ఈశ్వరుని సంయోగము పొంది యూ మేము వేశ్యల మెట్లయి తిమి. వేశ్యలకు కూడా నిలిచిన ధర్మమును మాకు తెలుపుము, అనిన దాల్యుడు ఇట్లు చెప్పెను.

దాల్బ్యుడు చెప్పెను  పూర్వము మానస సరస్సున మీరు జల క్రీడావిహార ములో గర్వించియుండగా అతిథిగా నారదుడక ్కడికి వచ్చెను. అపుడు అగ్ని పుత్రిక లు, అప్సరసలగు నీరు యోగవే తయగు నారదునికి నమస్కరించక నే, అవమానించుచూ ఇట్లడిగిరి. “నారాయణుడు మాకు భర్త యెట్లగునో ఉపదేశింపుము" అట్టి పర పదానము శాపముగాకూడా ఆయేను.

అపుడు నారదుడు వారితో చైత్రవైశాఖమాసములలో శుక్ల పక్ష ద్వాదశినాడు బంగారముతో కూడిన శయ్యలను రెంటిని దానమిచ్చినచో వేరేజన్మలో మీకు నారాయణుడు భర్త కాగలడు. కానీ, నాకు ప్రణామము జేయక రూపసౌభాగ్య మత్సరముతో మీరడిగినారు కనుక త్వరలో వియోగము కలుగును. చోరులచే ఎత్తుకొనిపోబడి మీరు వేశ్యలయ్యెదరు.

ఈ విధంగా నారదుని, విష్ణుదేవుని శాపముచేత కామమోహితులైన మీరంతా వేశ్యలయితిరి. ఇక నేనిపుడు చెప్పబోవుదానిని వినుడు. పూర్వము దైవాసురయుద్దములో వందలకొలదిగా దానవులు, అసురులు, దేవతలచేత చాపగా, దానవులు, అసురులు వివాహమాడిన ఎత్తుకొనివచ్చిన స్త్రీలను దేవేంద్రుడిట్లనెను. మీరు రాజకులములో, దేవకులములో భక్తి కలిగి. వేశ్యాధర్మముతో చరించుడు. రాజునుండి లేదా ప్రభువునుండి మీమీ జీవిక ను పొందుడు. మీశ కి కొద్ది అందరికీ సౌభాగ్యమగును. శుల్కమునిచ్చి మీ గృహాలకు వచ్చు వారిని మీరెల్లప్పుడూ కపటము లేకుండా ప్రీతితో సేవించవలెమ.

         దేవతల లేదా రాజుల పుణ్యదినము వచ్చిన గో, భూ, హిరణ్య ధాన్యముల యథాశక్తి దానమివ్వవలెను. నేను ఉపదేశించు వ్రతమునాచరింపుము. సంసారమును దాటుటకిదిచాలని వేదవిదులందురు. ఆదివారము హస్త, పుష్యమి, పునర్వసు నక్షత్రాలలో ఏదై నావచ్చినపుడు నారి అన్ని ఔషధులతో స్నానము చక్కగా చేసిన హరీసన్నిధిని చేరును. మన్మథుని నామకీర సముతో పుండరీకాక్షుని పూజింపవలెను. మరి తములు. నామములు 117వ శాకము వరకున్న వి) మన్మథరూపమున నున్న గోవిందుని గంధమాల్యములతో, ధూపముతో, నైవేద్యముతో పూజింపవలెను. అటు పై ధర్మజుడు, వేదవేత్తయగు బ్రాహ్మణుని ఆహ్వానించి గంధ పుష్పాదులతో పూజింపవలెను. “మాధవః ప్రీయతామ్" అని ఘృతపాత్రముతో బియ్యము నతనికి దానమివ్వవలెను. ఆతనికి ఇష్టమగు ఆహారమును సమర్పించి రతికొరకీతను కామదేవుడే యని మనసులో భావించవలెను. అతనికిష్టమైనదానిని ఆ స్త్రీ ఆచరించవలెను.

నవ్వుచూ భాషించుచున్న ఆ శ్రీ సర్వభావముల తనను ఆర్పించుకొనవలెను. ఇట్లు. ఆదిత్యవారమున దీనినంతయు చక్కగా నాచరించవలెను. పద మూడునెలలు బియ్యము దానమిచ్చి పద మూడోనెలరాగా ఆ శ్రీ బ్రాహ్మణునికి అన్ని సౌకర్యములతో నున్న శయ్యను దాన మివ్వవలెను. ఆశ య్య తలగడ, వస్త్రములు మొదలగు వానితో నుండవలెను. దీపము, పాదుకలు, గొడుగు: ఆసనము మొదలగునవి యుండవలెను. బ్రాహ్మణుని ఆతని భార్యతోసహా బంగారు ఆభరణములతో నలంకరించి అతనికి దానమివ్వవలెను. రతీదేవితో కామ దేవుని గుడకుంథమును కలిగివుండునట్లు చేయవలెను.

పాలిచ్చుధేనువును మంత్రముతో దానమివ్వవలేను. కౌమదేవునికి, విష్ణువుకు మధ్య భేదమును చూడను. ఓ విప్ర నాకు ఎల్లప్పుడూ ఇష్టసిద్ధియగు గాక ! అనగా బ్రాహ్మణోత్తముడు ఆ బంగారు దేవ ప్రతిమను దానము గొనవలెను. “కోదాత్కా మోదాత్" అను వైదిక మంత్రమును చదవవలెను. అటు పై బ్రాహ్మణునికి ప్రదక్షిణము చేసి వీడ్కోలుపలుకవలెను. శయ్య, ఆసనము మొదలగువానిని బ్రాహ్మణుని ఇంటికి పంపవలెను. అటు పై రతి కోరికతో ఇంటికి వచ్చినవాడెల్లా గౌరవింపదగినవాడు. అగును. ఇట్లు పద మూడుమాసాలు బ్రాహ్మణుని తృప్తి పరచి మందిరమునకు పంపవలెను. తనకునూ గర్భసూత, రాజకము వంటి విఘ్నములు దైవవశాత్తుగానీ, మనుష్య పేరణచేగానీ, గ్రహణ మువలన గానీ జరిగినచో, యథాశక్తి సమర్పించవలెను, ఇది మీకు తెలిపితిని.

వేశ్వలకిది స్వధర్మము. దేవా ! నీవలెనే మేము శయ్యను విడువము. శ య్య శూన్యమవకుండునట్లు చూడుము. అని గీతవాద్యాలతో దేవ దేవుని పూజింపవలెను. వేశ్యాధర్మమును పూర్తిగా మీకు చెప్పితిని. పూర్వము పురుహూతుడు దానవ శ్రీలకు చెప్పినదానిని నేను మీకు చెప్పితిని. మీకిది సరియైనది. అన్ని పాపముల బోనాడి ఆనంతఫలముల నిచ్చునది. దుశ్చర మైనది. కల్యాణినులకు చెప్పబడినది. దీనినాచరించిన శ్రీ విష్ణులోక మునొందును. దేవగణములచే పూజనోంది. ఆ సి వీమలోకమున ఆనందమొందునని ఆతను చెప్పెను. వ్రతము నాచరించువారు తన స్థానము నొందెదరు.

ఇది పాద్మపురాణమున మొదటిసృష్టిఖండములో వేశ్యావ్రతకథనమను ఇరవై మూడ - అధ్యాయము.