పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
37 - అధ్యాయము
పులస్త్యుడు చెప్పెను. ఆ అద్భుతమగు మాటవిని రాముడు గౌరవముతో విస్మయముతో మరల ప్రశ్నించదొడగెను, “భగవాన్ ! వై దర్భకుడగు శ్వేతుడను రాజు ఘోరమైన తపస్సు చేసిన ఆ వనమెట్లేర్పడినది ? మృగములు లేనిది, శూన్యమైనది యగు ఆ వనమును ప్రవేశించి తపమెట్లు చేయగోరెను ? వంద యోజనముల వేడ ల్పైన ఆ వనము నిర్మా నుష్యమెట్లాయెను ? మీరందు ఎట్లు ప్రవేశించిరి? తెలుపుమని రాముడడుగగా అగస్త్యుడు ఇట్లు చెప్పెను. పూర్వము కృతయుగమున మనువను రాజు పాలకుడు, శాసకుడై వుండెను. అతని పు తుడే అమిత కాంతిగల ఇక్ష్వాకువు. ఆ పుత్రుని రాజ్యమున నిలిపి పృధివియందు రాజవంశీయులకు రాజువుగమ్మనేను, రామా ! ఆ ప్యుతుడు అట్లే యని తండ్రితో బలుకగా, సంతోషముతో ఇట్లనెను. “నీ పర మోదార కర్మచే నేను పితినొందితిని. ఇందు సంశయము లేదు. దండమును ప్రయో గించి ప్రజలను రక్షించుము. ఆకారణముగా దండమును ప్రయోగించరాదు, అపరాధము చేసినవారికి దండన విధించిన పాలకుడు స్వర్గమును పొందును. కనుక కుమారా! దండన విధించుటకు యత్నించుము. నీవిట్లు చేయగా పరమ ధర్మము కలుగగలదు.
అని మనువు పుత్రునికి పెక్కురీతుల సందేశ మునిచ్చి సంతోషముతో ఉ త్తమమగు బ్రహ్మ లోక మును చేరెను. నేనెట్లు పుత్రుల దరింపజేసెద నని ఇక్ష్వాకువు చింతలో మునిగి, ఆయా కర్మల పెక్కు ఆచరించి సుతుల నొందెను. దేవ సుతులవంటి తన పుత్రులచే పితృదేవతల సతడు సంతోషపరి చెను, వారందరిలో ఉత్తముడు. చిన్న వాడు. శూరుడు, చదివిన వాడు, గురువగు ఆతని పేరు “దండుడ”ని ఇక్ష్వాకువు పెట్టెను. ఆతని శరీరము పై భవిష్యత్తులో పడ బోవు దండమును, ఘోర దోషమును ముందే గ్రహించిన తండ్రి, ఆతనిని వింధ్య, నీల పర్వతముల మధ్యభాగమునకు రాజును చేసేను. ఆ అందమైన పర్వత పైభాగమునకు దండుడు రాజయ్యెను. అతను నివసించుటకు అందమైన పురం నిర్మించబడెను. దాని పేరు “మధుమత్” శూరుడగు దండుడు ఆ దేశ మునట్లు, పురోహితులతో కలిసి పాలించ సాగేను. ఆనందముతోనున్న ప్రజలు గల ఆ దేశ మును దండుడు, ఇంద్రుని స్వర్గము వలె పెక్కువర్షములు పాలించెను. ఎట్టి కష్టములు లేకుండెను.
ఒక నాడు ఆ రాజు అందమైన భార్గవుని ఆశ్రమమును చైత్రమాసమున ప్రవేశించి రూపవతియగు భార్గవ పుత్రిని జూచెను. ఆమె యపుడు వనప్రదేశ మున చరించుచునుం డేను. ఎత్తైనిది, చక్కనిడి, చంద్రముఖి , చక్కని శరీరావయవాలు గలది, బలిసిన ఎత్తయిన స్తనములు గలది, సన్నని నడుము గలది, ఏక వస్తయగు ఆ యువతి వనమున నొంటరిగా నుండుట జూచి దండుడు అధర్మముగా మన్మథబాధనొందెను. వెంటనే ఆ కన్యను చేరి ఇట్లనెను. “ఓ సుందరి ! నీవెవరిదానవు ? ఎక్కడినుండి వచ్చితివి ? మన్మథబాధను పొంది నేను నిన్నడుగుచుంటిని. నిన్ను చూచిన వెంటనే నా చిత్త మపహరింపబడినది. ఈ నీ ముఖము మునుల చిత్తమును గూడ హరింపజేయునంత అందముగ నున్నది. నిన్ను పొందని యెడల నేను మరణించెదనని తెలియుము. నా ప్రాణములు నీచే నపహరింపబడినవి. నన్ను బదికింపుము. సుందరీ ! నేను నీ భక్తుడను. దాసుడను. నన్ను సేవించుము' అని దండుడు కామముతో మదోన్మత్తుడై పలుకుచుండగా భార్గవుని పుత్రి వినయముగా రాజుతో నిట్లనెను రాజేంద్రా! నేను ఉత్తముడగు భార్గవుని పుత్రికను. ఆరజ యనుదానను. ఆశ్రమవాసులలో జ్యేష్ఠరాలను.
రాజా! శుక్రుడు నా తండ్రి. నీవతని శిష్యుడవు గదా! ధర్మముగానైతే నేను నీకు సోదరినయ్యెదను. ఈ విధమైన మాటలను నీవు పలుక రాదు. నీవే నన్ను ఇతర దుష్టులనుండి రక్షించవలెను. నా తండ్రి క్రోధము గలవాడు, రౌద్రముతో నిన్ను భస్మముగా చేయును. లేదా, రాజధర్మము చే బలమునుపయోగించి అసంబంధమును కూర్చదలచిన, ధర్మదృష్టితో నీవు నా తండ్రిని వేడి నన్ను పొందుము. లేనిచో, నీకు ఘోరమగు దుఃఖము కలుగగలదు. నా తండ్రి కోపించినచో ముల్లోకములనూ దహింపజేయ గలడు' అని ఆ కన్యయనగా దండుడు విని మదోన్మత్తుడై తలవంచి ఇట్లనెను 'సుందరీ! కా మోన్మత్తుడై న నా పై ప్రసన్నతను చూపించుము. నీచే నడ్డగింపబడిన నా ప్రాణములు పోవుచున్నవి. నిన్ను పొందిన వేనుక, నాకు వైరమేగానిమ్ము, వధనేగానిమ్ము. భీరూ! నేను నీ భక్తుడిని. నన్ను పొందుము. నీయందు నా కమిత భక్తి' అని ఆ కన్యను బలముగా బాహువులలో బంధించెను. ఒక చేతిలో గట్టిగా పట్టి, వేరొక చేతితో ఆ కన్యను వివస్త్రను చేసి అంగమునంగముతో, ముఖమును ముఖముతో కలిపి, బెదిరిపోయిన ఆ కన్యను రమించుట కారంభించెను.
మహా ఘోరమైన ఆ అనర్థాన్ని దారుణంగా చేసిన దండుడు మదపుటేనుగు వలే త్వరగా తన నగరమునకు వెళ్ళెను. దీనురాలైన అరజ తండ్రి రాకకై ఎదురుచూస్తూ ఆశ్రమమునకు కొద్దిదూరంలో ఏడ్చుచూ నుండెను. ఒక ముహూర్తములోనే దేవర్షి నీటిని దాకి, శిష్యులు కూడి వున్న తన ఆశ్రమమునకు ఆకలిగొని మరలివచ్చెను. ఆశ్రమమునకు దాపున ధూళిధూసరిత మై, మేఘముల మాటున దేబ్బతినియున్న వెన్నెలవలె నున్న ఆర జను చూచెను. ఆకలిగొన్న ఆ ముని కోపించి ముల్లోకముల దహింప జేయునట్లు శిష్యులతో నిట్లనెను మూర్ఖుడగు ఈ దండుని విపరీతమును ప్రతీకారముగా జ్వలించు ఆగ్ని శిఖవలే ఘోరమగు విప తిని చూడుడు. అనుచరులతో కలిసి దండుడు నాశనమును పొందును. దండుడు ఇపుడు జ్వలించుచున్న - అగ్ని యొక్క జ్వాలను తాకినాడు. ఇట్టి ఘోర మైన పాపము నాచరించిన దండుడు ధూళివర్షమును పొందును. సభ్యుల బలముతో పాపకర్మల నాచరించు చేడు రాజు దేశ ము తో సహా నాశ మును పొందును. ఈ దుర్బుద్ధిగల రాజు పాలించుచున్న ప్రదేశమును పూర్తిగా వంద యోజనములు అంతటా ఇంద్రుడు ధూళివర్ష మును గురిపించి కంపించుజేయు గాక!
స్థావర జంగమ ప్రాణులేవి గలవో, వాటన్నింటి నాళమీ ధూళివర్షము చే సంభవించును. ఏడు దినములలో దండుని పాలనలో గల ప్రదేశమంతయూ, వనమూ ఆశ్రమముతో గూడ అకస్మాత్తుగా ధూళి వర్షములో బడును అని కోపముతో బలికి ఆశ్రమములో నివసించువారిని జనపదము వడ్డ నివసించుమని చెప్పెను. శుక్రుడట్లు చెప్పగా ఆశ్రమవాసులు ఆ ప్రదేశమునకు బయట నివసించ సాగిరి. వారికట్లు చెప్పి శుక్రుడు ఆర జతో నిట్ల నేను దుర్బుద్ధిగల ఆరజా! నీవు ఈ ఆశ్రమముననే నివసించుము. ఇది యోజన పర్యంతమున్న అందమైన ఆశ్రమ ప్రదేశము. ఇక్కడ నీవు దోషములేనిదానవే నూరు సంవత్సరములు వసించుము అనగా ఆ ఆదేశమును గ్రహించి ఆర జ దుఃఖముతో అక్కడే నుండెను. శుకుడు ఆదేశమును వదిలి వేరొక చోటిని చేరెను. ఆ బ్రహ్మవాది చెప్పినట్లు ఏడు దినములలో ఆ ప్రదేశమంతా భస్మమువలే నా యెను. వింధ్య శైల పదేళము ఆ విధంగా దండునివలన శుక్రునిచే శపింపబడి ఆరణ్యమై, అప్పటినుండి దండకారణ్యమని పిలువబడు చున్నది. రామా! నీవడిగిన దానినంతా నీకు తెలియ జేసితిని.
వీరా! సంధ్య నుపాసించుటకు కాలము దాటుచున్నది. ఈ మహర్షులు పూర్ణకుంభములతో నుండిరి. నర శ్రేష్టా! వారు సూర్యుని పూజించుచుండిరి. బ్రహ్మాదులచే చేయ బడిన స్తుతులతో ఋషులు పూజించగా రవి అస్తమించెను. రామా! నీటిని గ్రహించుము. అని ఋషి పలుకగా రాముడు సంధ్య నుపాసించుటకు ఆ పుణ్యమైన సరస్సును సమీపించెను. ఆ వనప్రదేశము రమ్యముగా చెట్లతో శోభించుచుండెను. పుణ్యనది, పర్వతము గల అక్కడ వందలకొలది కోకిలలు, పక్షులు వుండి వాని రవములు వినిపించుచుండెను. అనేక మృగములు, సింహ, వ్యాఘములునూ వున్న ఆ వనమున గద్ద, గుడ్లగూబ అనేక సంవత్సరాలు వసించు చుండెను. ఒకనాడు, పాపనిశ్చయుడగు గద్ద, గుడ్లగూబకు చెందిన భవనాన్ని స్వంతం చేసుకోదలిచి కలహమును కల్పించేను. రాజీవలోచనుడై న రాముడే లోకమంతటికీ రాజు. అతనినే చేరి భవన మెవరిదో తెలిసికొందమని ఆ గద్ద, గుడ్లగూబ కోపముతో అసహనముతో రాముని వద్దకు వచ్చినవి. వరస్పర ద్వేషము గల అవి రెండూ రాముని పాదముల తాకిన తరువాత, గద్ద రాముని చూచి అతనితో నిట్లనెను.
దేవ దానవులకు నీవే ప్రధానమని మా అభిప్రాయము. బహస్పతి కంటె, శుక్రుడి కల టే గొప్పవాడివి. భూతల ములలో తత్వవేత్తవు - మానవ రూపున ఇంద్రుడవు - సూర్యుని వలె తేరిపారజూడ వీలులేనివాడవు - హిమవంతుని వలె ఎత్తైన వాడవు - సముద్రము వలె లోతైన వాడవు - యముని వలే లోక పాలుడవు - ఓర్పున భూమితో సమానుడవు - వేగమున వాయువుతో సమానము - అన్ని గుణాలు గల నీవు గురువువు - విష్ణు రూపము గలవాడవు - జయింప వీలులేనివాడవు, జయించు వాడవు, ఆన్ని అస్త్రముల విధిని తెలిసినవాడవు. దేవేళా! నా విజ్ఞప్తిని వినుము . నా రెక్కల బలముతో పూర్వము నివాసము నేర్పరుచుకొంటిని - ఈ గుడ్లగూబ నీ సమీపముననే దానిని దొంగిలించకోరుచున్నది. ఇట్టిది దీని దురాచారము. ఇది నీ ఆజ్ఞను మీరుచున్నది. రామా! ప్రాణాంతకమగు దండమును విధించుము. అని గద్ద అనగా గుడ్లగూబ యిట్లనెను. రామా! నా వినతిని శ్రద్ధగా వినుము. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు వీని నుండి రాజు జన్మించును. కొంత మాత్రమే మానుషము. నీవు నారాయణ పరాయణుడవు - అంతా నీవే . బాగుగా ఆలోచించిన సొమత్వము చెప్పబడును. నీవు తమస్సును నివారించుట చేత తాపముల నుండి రక్షించుచున్నావు.
దోమలను దండించుచూ, పాపులకు భయమును కలిగించుచూ, దాతవు, ప్రహర్తవు, గో ప్రవగు నీవు మాకు ఇంద్రుడవు - ప్రాణులన్నింటిలో చేర వీలులేని నీవు తేజస్సులో నలుని వంటి వానివి - పాపముల నన్నింటిని కాల్చుటచే నీవు సూర్యుడవు -నీవు కుబేరునితో సరి - లేదా అంతకంటే అధికము - ఒనస్సు ననుసరించు నీ పత్ని లక్ష్మీదేవి - కుబేరుని కోశముచే నీవు కుబేరునివి - చరా చరములగు భూతములందు సముడవు - రామా! శత్రు మిత్రులయందు నీ దృష్టి సమముగా ప్రసరించును - వ్యవహార విధి క్రమముతో, ధర్మముతో శాసనమును నిత్యము చేయుచున్న నీకు ఎవరి పై కోపమొచ్చిన వారికి మృత్యువని చెప్ప బడును. అందుచేత నీవు యముడనీ కీర్తి నొందితివి. ఈ మానుష భావము నీవు దయ , కృపగల వాడివని చూపుటకు . అనాథుడు, దుర్భలుడు అయిన వానికి రాజే బలము. చూడలేనివానికి రాజే చూపు, అజ్ఞానికి రాజే జ్ఞానము. రాజా! నీవే మా ప్రభువు - వినుము. మేము పక్షులము కదా! మా ప్రభువగు వక్ష్మీంద్రుడు మీచే వినియోగించబడువాడు . మీ సన్నిధిలో మేము అనాథులము కాము.
ప్రభూ! పూర్వము నీవే నాలుగు విధాల ప్రాణులను సృజించితివి. నా ఇంట ప్రవేశించిన గద్ద నన్ను బాధించుచున్నది. నీవు మానవుల శాసకుడవు గదా! అనగా రాముడు స్వయముగా తన మంత్రులను పిలిపించెను. విష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్ర వర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు, మహాబలుడను వీరు రామునికి, దశరథునికి కూడా మంత్రులు. వారంతా నీతి కలవారు, అన్ని శాస్త్రములు తెలిసినవారు, శాంతి గలవారు, మంచి వంశమున జన్మించినవారు, నయమును, మంత్రమును తెలిసిన వారు. వారిని పిలిచి, రాముడు పుష్పకము నుండి దిగి గద్ద, గుడ్లగూబలతో ఇట్లనెను . “నీవా ఇంట ఎన్ని సంవత్సరాలుగా వున్నావు? తెలుసుకొనగోరుచున్నాను. నిజమును చెప్పు'మనగా గద్ద రామునితో ఈ సుమతి, అనేక బాహువులుగల మనుషులచే పెంపు చేయబడిన నాటినుండి నా నివాసమ'ని అనెను. గుడ్లగూబ రామునితో 'భూమి చెట్లతో శోభించిన నాటి నుండి నా గృహమని' అనగా రాముడు సభ్యులతో ఇట్లనెను . “పండితులు, అనుభవజ్ఞులు లేని సభ, సభ కాదు. ధర్మమును చెప్పని వృద్దులు వృద్ధులు గారు, సత్యము లేని ధర్మము ధర్మము గాదు. మోసము నాశ్రయించిన సత్యము సత్యము గాదు.
ఏ సభ్యులు సభకు వెళ్ళి మాటలాడక కూర్చుందురో, అవసరాన్ని బట్టి మాటలాడరో వారందరూ అసత్యమును మాటలాడువారే. కామము చే గానీ, క్రోధముచే గానీ, భయముచే గానీ విన్నది చెప్పనివాని పై వేయి వరుణ పాశములు పడును. సంవత్సరమున కొక్క పొకము మాత్రము వీడును. కనుక సత్యము తెలిసినవాడు త్వరగా సత్యమునే చెప్పవలెను. అని రాముడనగా మంత్రులు రామునితో నిట్లనిరి. గుడ్లగూబలు చెప్పునది సత్యముగ తోచుచున్నది, గద్ద చెప్పినది గాదు. ఈ విషయములో నీవే ప్రమాణము - రాజే పరమ గతి కదా! రాజే ప్రజలందరికీ మూలము - రాజే సనాతన ధర్మము - ఎవరిని రాజు శాసించునో వారు దుర్గతిని పొందరు. వారు యమునిచే విడువబడుదురు. అని మంత్రులనగా విని రాముడిట్లు పలికెను.
‘పురాణమైనది, మునుపు చెప్పబడిన దానిని మీకు చెప్పెదను. సూర్య, చంద్ర, నక్షత్రములతో దివి, పర్వతములతో వృక్షములతో భూమి, చరాచరముతో ముల్లోకములు జలమున మునిగియుండెను. మొత్తం ఒకటిగా నుండెను. ఆకాశ మొకటే నుండినది. భూమి, లక్ష్మితో విష్ణువు జఠరమును ప్రవేశించెను. గొప్ప తేజస్వి యగు విష్ణువు లక్ష్మినట్లు నిగ్రహించి నీటి మధ్య ప్రవేశించి, ఎన్నో వేల సంవత్సరములు నిద్రించేను. నిద్రించిన విష్ణువు జఠరమును బ్రహ్మ ప్రవేశించెను. పెక్కు గ్రోతస్సులు గల దానిగా దానిని తెలిసి, మహా యోగియగు బ్రహ్మ దానిని ప్రవేశించగా, విష్ణువు నాభి నుండి బంగారు వన్నె లీను వద్మము బయల్వె డలెను. బ్రహ్మ యోగియై బయటకు వచ్చి, సృష్టి చేయదలచి, పృథ్వీ, వాయు, వర్వత, వృక్షములను, ప్రజలను, సరీసృపములను, జరాయుజాండజాలను అన్నింటిని సృజించెను. అతని శరీరము నుండే మధు కైటభులుద్బవించిరి. వరమును పొంది మహా బల సంపన్నులైరి. అక్కడ బ్రహ్మను జూచి క్రోధముతో బ్రహ్మను తినివేయుదమనీ వెంటబడిరి. విడివిడిగా బయల్వెడలుచున్న సత్వ ముల జూచి బ్రహ్మ చే స్తుతింపబడిన విష్ణువు వారిని సంహరించెను. అటు పై వారి మేదస్సుతో, భూమి స్థిరముగా నుండుటకై వర్ధిల్ల జే నేను. మేదోగంధము వలన భూమి కవ్పటి నుండి 'మేదినీ' అని పేరు వచ్చెను.
కనుక గద్ద చెప్పిన సత్యము-పాప కర్ముడై ఈ గద్ద ఇతరుల నివాసమును స్వంతము చేయదలచినందున దండనకు అర్లు డు.అనగా ఆకాశ వాణి నింగినుండి ఇట్లనెను. 'రామా! తపోబలముతో ముందే దహింపబడిన ఈ గద్దను వధించకు. పూర్వము గౌతమ ఋషి చే దహించబడిన రాజు బ్రహ్మదత్తుడను వాడు గద్దగా అవతరించెను. శూరుడు, సత్యవ్రతుడు, శుచియైన రాజు గౌతముని గృహమునకు వచ్చి భోజనము పెట్టుమని కోరెను. నూరు సంవత్సరముల పైన భుజించెను ఆ బ్రహ్మదత్తునికి గౌతముడు స్వయముగా ఆర్యము, పాద్యమును ఇచ్చేను. తానే భోజనమునకు కొనివచ్చెను. అతని గృహమును ప్రవేశించి, ఆహారము గ్రహించు నవుడు, పూర్ణ స్తని యగు స్త్రీని జూచి చేతితో స్పృశించెను. అపుడు కోపించిన ముని దారుణమైన వము నిచ్చెను. మూర్ఖుడవైన రాజా! నీవు గద్దవు కమ్ము అని. అది విని రాజు మునితో “మహానుభావా! శాపము తొలగునట్లు దయ చూపుము. అని వేడుకొనెను. దయగలవాడై న ముని ఆది విని “రాజా! ఇక్ష్వాకుకులమున రాముడను కీ ర్తిగల మహానుభావుడు జన్మించగలడు. అతను చూచినపుడు నీవు పాపము తోలగి రాజువవగలవు అనగానే రాముడు గద్ద వంక జూచెను. అది రాజుగా మారిపోయెను.
గద్దగా వుండుటను వదిలి దివ్యగంధములు అలుముకొని దివ్య రూపము గల రాజు వలే వెంటనే మారెను. రాముని జూచి రామా! ధర్మజ్ఞా! నీ అనుగ్రహము చే నేను ఘోర నరక ము నుండి ముక్తుడనైతిని. నీవు పుణ్యము చేసితివి. నేనీ గద్దరూపును విడిచితిని అని ఆ గద్ద పలికిన రాముడు గుడ్లగూబతో 'కౌశికా! ధర్మజ్ఞా! నీ ఇంట నీవు ప్రవేశింపుము. నేను సంధ్య నుపాసించి ముని వున్న చోటికి వెళ్ళేదను,ఆని, నీటిని ఆచమనం చేసి సంధ్య నుపాసించి అగస్త్యముని ఆశ్రమమునకు వెళ్ళెను. అక్కడ ఆగస్త్యుడు భోజనమునకై మంచి ఫల మూలములు, రసవంతములై న శాకములు తెచ్చెను. అమృతమువలే నున్న అన్న మును రాముడారగించి, ప్రీతితో రాత్రిని అక్కడ గడి పెను. ప్రొద్దుననే లేచి, నిత్యకృత్యముల గావించి వెళ్ళివచ్చెదనని అగస్త్యునికి చెప్పుటకు వెళ్ళేను. అగస్త్యునికి నమస్కరించి రాముడు 'బ్రహ్మవేతా! నేను వెళ్ళివచ్చెదను. అనుజ్ఞ నిమ్ము . నేను ధన్యుడను, అనుగృహీతుడ నై నాను. నా భాగ్యము చేమీ దర్శనము గలిగి, పవితుడ నై నాను అని రాముడు పలుకగా ప్రీతి నొందిన అగస్త్యుడు నీరు నిండిన కళ్ళతో రాముని చూచి ఇట్లనెను.
‘రామా! శుభాక్షరములు గల నీ వాక్యమద్బుతముగా నున్నది. నీవు పలికినది అన్ని ప్రాణులను పావన మొనర్చునది. రామా! ఒకక్షణమైననూ నిన్ను మైత్రితో చూచువారు పవిత్రులగుదురు. స్వర్గవాసులు వారిని అన్ని సూక్తములతో స్మరింతురు నిన్ను ఘోర చక్షువులతో చూచినవారు బ్రహ్మ దండముచే మరణించి వెంటనే నరకమునకు వెళ్ళుదురు. రామా! నీ ఏవిధంగా అన్ని ప్రాణులకు పావనుడవు. నీ గూర్చి చెప్పు ఈ లోకములు సిద్ధిని పొందును. నీవారిని చేర వెళ్ళుము. నీకు ప్రయాణము నిర్విఘ్న మగుగాక! భయము లేనివాడవై వెళ్ళుము. నీ రాజ్యమును ధర్మముతో పాలించుము. నీవు జగత్తులను గతివి అని ఆ ముని యనగా చేతులు జోడించి రాముడు ఋషి శ్రేష్ఠుడగు అగస్త్యునికి అభివాదనము చేసి, తపస్సు చే నధికులయిన మునులకు నమస్కరించి, శాంతాత్ముడగు రాముడు పుష్పకము నధిరోహించెను. అతను వెళ్లుచుండగా మునిగణములు ఇంద్రుని దేవతలు పూజించునట్లు ఆశీర్వా దముచే పూజించిరి. దినము సగము గడువగా రాముడు అయోధ్యను చేరి పుష్పకమును పద్మ కక్షయందు దింపి, దానిని వదిలి వేరొక గది గుండా వెళ్ళుచూ ద్వారపాలకులను ఇట్లు ఆజ్ఞాపించెను. 'త్వరగా వెళ్ళి భరత లక్ష్మణులకు నా రాక తెలిపి వారినిక్కడికి కొనిరండు.
పుణ్యాత్ముడగు రాముని పలుకులు విని ద్వార పాలకులు భరత లక్ష్మణుల వద్దకు వెళ్ళి వారిని గొనివచ్చి రామునికి తెలియ జేసిరి. రాముని అదేశ ముపై వారిని లోన ప్రవేశ పెట్టిరి. ప్రియ సోదరులను జూచి రాముడు, కౌగలించుకొని వారితో నిట్లనెను . గొప్పదగు బ్రాహ్మణ కార్యమును నేను యథాతథముగా నాచరించితిని. ధర్మమే హేతువుగా గల దానిని మరల చేయ దలచితిని. మీ ఇద్దరితోగూడి ఉత్తమ క్రతువగు రాజసూయమును యజించదలిచితిని. దానియందు ధర్మము శాశ్వతముగ నుండును. పూర్వము పుష్కరమున నుండి సృష్టికర్తయగు బ్రహ్మ మూడు వందల ఆరువది యజ్ఞముల చే నెను. ధర్మవేత్త యగు సోముడు ధర్మముగా యజించి, రాజసూయముతో లోక ము లన్నింటిలో గొప్ప కీర్తిని పొందెను. శత్రువుల దునుమాడు మిత్రుడు రాజసూ యమును చేసి ముహూర్త కాలములో శుద్దుడై వరుణత్వము నొందెను. కనుక, మీరు బాగుగా ఆలోచించి, ఈ వని యందు మీ ఆలోచనను తెలియ జేయుడు.
అనగా భరతుడు ఇట్లనెను : ‘మహాబాహూ! నీవే వరమధర్మము. నీయందే వసుంధరయంత ప్రతిష్టితమైయున్నది. కీర్తికూడా. రాజులందరూ నిన్ను దేవతలు ప్రజాపతిని చూచునట్లు చూతురు. మేమునూ నిన్న ట్లే భావింతుము. రాజా! ప్రజలు నిన్ను తండ్రివలె జూతురు. ప్రాణులకు భూమి పై నీవే గతి వి. అట్టి నీవు ఇట్టి యజ్ఞమును చేయరాదు. దానిచే ప్రాణులన్నింటి నా మేర్పడును. రాజ శ్రేష్టా! పూర్వము సోముడు, నక్షత్రాలకు తారకమయమైన యుద్ధము జరిగెనట. అందు సోముడు కామముతో బృహస్పతి భార్యయగు తారను హరిం చెనట. దేవదానవుల నశింపజేయు గొప్ప యుద్ధము జరుగగా, వరుణ క్రతువున ఘోర సంగ్రామమై, మత్స్యములు , కచ్ఛపములు మొదలైన జలచరములన్నీ నశించెను. హరిశ్చంద్రుని రాజసూయ క్రతువు చివర గొప్ప యద్దము అన్ని లోకముల నశింపజే నెనట. భూమి పైన ప్రాణులు పశుపక్ష్యాదులు, దివ్యులగు రాజులు రాజసూయమున నాళ ము నొందిరట. నీవా నాళమును గూర్చి ఆలోచించి, ప్రాణుల హితమును మనసులో తలిచి సౌమ్యమగు పూర్ణధర్మమునాచరింపుము . అని భరతుడనగా రాముడు భరతునితో 'ధర్మవత్సలా! నీవు పలికిన ఈ ధర్మపూరితమైన మాటలలో నేను ప్రీతినొందితిని. నా బుద్ధి రాజసూయమునుండి మరలినది. సంపూర్ణ ధర్మమునే నేనాచరించెదను. కన్యాకుబ్దమున వామనుని స్థాపించెదను. భగీరథుని నుండి గంగ స్వర్గమును చేరినట్లు నా కీర్తి స్వర్గమును చేరగలదు - అని ఆదరముతో ననెను.
ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టి ఖండమున యజ్ఞనివారణము అను ముప్పదియేడ - అధ్యాయము.
