పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

38 - అష్టత్రింశోధ్యాయః

భీష్ముడడిగెను 'విప్రర్షీ ! రాముడు కార్యకుబ్జమున వామనుని ఎట్లు స్థాపించెను? అతనెక్కడ లభించేనో విపులంగా నాకు చెప్పుము. అట్టి రాముని నామ కీర్తనము మధుర మైనది, చెవులకింపైనది. లోకములు అతనిని స్నేహముతో చూచును. ధర్మమును, చేసిన దానిని తెలిసినవాడు, బుద్ధిమంతుడు. నిశ్చల మనస్సుతో ధర్మముతో పృథి విని పాలించును. అతను పాలించు చుండగా చెట్లు కోరికలన్నింటినీ తీర్చునవే , రసములు గలిగి అన్ని సౌఖ్యములుండును. దున్నకనే భూమి పండును. మహాత్ములకు సపత్నులుండరు. దేవకార్యమును చేసిన రాముడు పుత్రామాత్యపరివారంతో రావణుని లీలగా నేలకూల్చెను. పూర్ణధర్మమున బుద్ధి ఏర్పడిన రాముని పూర్తి చరితమును విన గోరుచున్నాను.

పులస్త్యుడు చెప్పెను  కొంతకాలము తరువాత ధర్మపథమున నున్న రాము డేమి చేసెనో చెప్పెదను. సావధానముగా వినుము. రాముడు పరిపాలన చేయు చూ, విభీషణుని తలచుకొని లంక యందా రాక్షస రాజైట్లు రాజ్యము చేయుచున్నాడో తెలియ గోరెను. దేవతలపట్ల వ్యతిరేకత వినాశానికి చిహ్నము. సూర్యచంద్రులుండునంత వరకుండు రాజ్యమును నేనతనికి ఇచ్చితిని. అది నశింపకుండిన, నా కి రి శాశ్వతముగా, స్థిరముగా నుండును. తన వినాశము కోరకే రావణుడు తపస్సు నాచరించెను. దేవకార్యమున నేనా పాపిష్ఠుని సంహరించితిని. ఇక నేనిపుడు వెళ్ళి విభీషణుని చూడవలెను. అతను శాశ్వతముగా నుండునట్లు అతనికి సందేశము నివ్వవలెను.' అని అమిత తేజస్సుగల రాముడు ఆలోచించుచుండగా భరతుడక్కడకు వచ్చి రామునితో నిట్లనెను. “దేవా! నీవే మాలోచించుచుంటివి. రహస్యము కానిచో నాకు చెప్పుము. భూమి పై దేవకార్యముననా లేక స్వకార్యముననా నీవిట్లు ఆలోచించుట?” అని భరతుడు ఆలోచనలో మునిగి పలుకగా రాముడు అతనితో, “నీకు రహస్యమేమి? నీవూ, యశస్వియగు లక్ష్మణుడు నా బహిః ప్రాణములు కదా! నీకు తెలియగూడనిది లేదు. ఇది సత్యము. ఎవరి కొరకు రావణుని వధించితినో ఆ విభీషణుడెట్లుండెనో అని నా పెద్ద చింత? ఇక నేను విభీషణుడున్న లంకకు వెళ్ళేదను, అతనిని, లంకాపురిని చూచి రాక్షసరాజుకు చేయవలసిన దానిని చెప్పి, వసుధను ఇట్టి, వాన రేశ్వరుని సుగ్రీవుని చూచి, శత్రఘ్నరాజును, భ్రాతృ పత్రులను చూచి వచ్చెదనని రాముడనగా భరతుడు ఎదుట నిలిచి రామునితో ఇట్లనెను. “నేను కూడా మీతో వచ్చెదను. ఇలా చేయుము. లక్ష్మణుడిక్కడే వుండ నిమ్ము అని రాముడు భరతునితోనని లక్ష్మణునితో నిట్లనెను. “వీరుడా! పురమున నీవు రక్షణను మేము తిరిగి వచ్చునంతవరకు కల్పించవలెను” అని లక్ష్మణుని ఆజ్ఞాపించి పుష్పక విమానమును ధ్యానించి యానము నధిరోహించెను. అక్కడి నుండి పుష్పకము - గాంధారుల రాజ్యమును చేరుకొనెను. భరతుడు, రాముడు భరతుని పుత్రులను చూచి, అక్కడి విధానమును గమనించి, లక్ష్మణుని పుత్రులున్న తూర్పుదిక్కునకు చేరిరి, అచట ఆరు రాత్రులు నగరమున గడిపి విమానములో దక్షిణ దిక్కునకు చేరిరి. ఆక్కడ గంగాయమునల సం:యోగమున ప్రయాగయను ఋషులచే సేవింపబడు తీర్థమును చేరి, భరద్వాజుని సమీపించి, నమస్కరించి అత్రి ఆశ్రమమునకు చేరిరి. అక్కడ మునీంద్రులతో మాటలాడి జనస్థానమును చేరిరి.

 అపుడు రాముడనెను  పూర్వము దురాత్ముడగు రావణుడక్కడే సీత నపహరించెను. మా తండ్రికి స్నేహితుడైన జటాయువను గద్దను చంపి రావణుడు సీత నపహరించెను. కుబుద్ధియగు కబంధునితో మాకు గొప్ప యుద్ధము జరిగెను. సీత ఇక రావణుని ఇంట వుండినది. అటు తరువాత ఋష్యమూక మను గిరి శ్రేష్టము పై సుగ్రీవుడను వానరుని కలిసి, పంపాసరమునకు చేరి శబరి అను తాపసిని కలిసితిమి. పంపాసరస్సుకు వెళ్ళుమని జీవితము పై నిరాళ నొందిన యతనితో అనెను. లక్ష్మణుడు కించవద్దని ఈమెను గూర్చి పలికెను. ఆజ్ఞను పాలించు భృత్యుడను నేనుండగా సీతను నీవు పోందగలవు. ఇచ్చోటనే నేను పన్నెండు నెలలను నూరు సంవత్సరములవలే గడిపితిని. సుగ్రీవుని కొరకు నేను ఈ ప్రదేశ ముననే వాలిని జంపితిని. ఇదిగో, ఈ నగరమే ‘కిష్కింధ' యని వాలి పాలించినది. ఈ నగరముననే ధర్మాత్ముడగు వానరుడు 'సు గ్రీవుడు' ఇతర వానరులతో కలిసి నూరు సంవత్సరాలుగా వుంటున్నాడు, వానరులతో కలసి సుగ్రీవుడు సభకు వెళ్ళియుండినంతలో భరతుడు, రాముడు ఆ పుర మును ప్రవేశించిరి.

సుగ్రీవుడు వారిద్దరినీ జూచి, నమస్కరించి “మీరెక్కడికి బయలుదేరితిరి? ఏ పని చేయబోవు చున్నారు?" అని ఆసనము పై కూర్చుండ బెట్టి ఆర్ఘ్యమును, తాను స్వయముగా నిచ్చెను. ధర్మిషుడగు రాముడట్లు సుగ్రీవుని సభలో నుండగా, అంగదుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, గజుడు, గవాకుడు, గవయుడు, పనసుడు, పురోహితుడు, దైవజ్ఞుడగు దధివక్షకుడు మంత్రులు, శతబలి, మైందుడు, ద్వివిదుడు, గంగమాదనుడు, వీర బాహువు, సుబాహువు, వీర సేనుడు, వినాయకుడు, సూర్యాథుడగు కుముదుడు, సేనాపతియగు సుషేణుడు, ఋషభుడు, శూరుడగు గవాఖ్యుడు, ధూత్రుడను ఎలుగుబంట్ల రాజు వారి వారి సైన్యములతో వచ్చిరి. రుమ, తార మిగిలిన అంతఃపుర స్త్రీలు, అంగదుని జనము, ఇతర పరిచారికలు అమితానందమును పొంది “బాగు బాగు" యని పలికిరి. సుగ్రీవునితో ఇతర వానరులు, వానర స్త్రీలు రాముని చూచి, నమస్కరించి గద్దద స్వరముతో ఇట్లనిరి. “దేవా! రావణుని జంపి నీవు తెచ్చుకొనిన దేవి సీత ఎక్కడ? శివుని, నీ తండ్రి ఎదుట అగ్ని శుద్ధిని గావించి నగరానికి తీసుకొని వెళ్ళిన సీత నీతో కలిసి కనబడుట లేదు. రామా! సీత లేకుండా నీవు శోభించుటలేదు.

నీవు లేక జానకి, సాధ్వి ఎక్కడుండగలదు? నీకు వేరొక భార్య వున్నదని నే నెరుగను. భార్యలేక నీవు శోభించుట లేదు. మీరిద్దరు క్రౌంచ దంపతులవలె, చక్రవాక జంటవలె నుండిరి” అని చంద్రునివంటి అందమైన ముఖముగల తార అనగా వాగ్విదుడగు రాముడోమెతో నిట్లనెను. “విశాలాక్షీ! కాలము దాట శక్యముగానిది. చరాచర జగత్తంతా కాలము చేతనే నిర్మింపబడినది” అనగా ఆ స్త్రీలు రాముని విడిచిరి. సుగ్రీవుడు రాముని ఎదుట నిలిచి ఇట్లనెను.

పాలకులగు మీరే కార్యము చేత ఇక్కడకరుదెంచిరి? త్వరగా తెలియ జేయుడు. చేయవలసిన కాలము కదా! అనగా రామునిచే ప్రేరేపించబడిన భరతుడు రాముడు లంక కు వెళ్ళదలచుటను గూర్చి సుగ్రీవునికి చెప్పేను. అపుడు సుగ్రీవుడు వారితో సహా విభీషణుని చూచుటకు తానుకూడా వచ్చెదనని చెప్పెను. రాముడందుకంరించగా వారు ముగ్గురూ పుష్పక విమానమునెక్కిరి. విమానమపుడు సముద్రముయొక్క ఆవలి తీరమును చేరెను. అప్పుడు రాముడు భరతునితో ఇచ్చోటనే రాక్షసరాజు విభీషణుడు జీవితము కే తన నలుగురు మంత్రులతో నన్ను జేరెను. అపుడు లక్ష్మణుడతని లంకరాజ్యమున అభి షేకించెను. ఈ సముద్ర తీరమున నేను మూడు దినములు వుంటిని.

దర్శనమిచ్చిన, నా జ్ఞాతి కార్యమగుననగా ఇతను (సముద్రుడు) దర్శనమివ్వలేదు. అందుచే కోపించి నేను నాలుగవ దినమున వేగంగా విల్లునక్కు పెట్టి బాణమును చేబూనితిని. ఆట్టి నన్ను జూచి శరణు వేడుచూ, భయమునొంది లక్ష్మణునాశ్ర యించెను. అపుడు అతనిని క్షమించమని సుగ్రీవుడు నన్న నునయించెను. అపుడు నేనెక్కుబెట్టిన శరమును ఎడారిదేళ మున్ విడిచితిని. ఆపుడు వినయ శాలియగు సముద్రరాజు  సేతుబంధము చేసి లంకకు వెళ్ళుమని నాతో అనెను. అపుడు నేను సముద్రము పై ఈ నేతువును నిర్మించితిని. వానర శ్రేష్ఠులచే మూడు రోజులలో సేతువు కట్టబడెను, మొదటిరోజు పధ్నాలుగు యోజనముల సేతువును నిర్మించి, రెండవరోజు ముప్పదియారు యోజనముల నేతువును, మూడవరోజు యాభై యోజనములచే నేతు నిర్మాణమును పూర్తి చేసిరి. ఇదిగో ఇదే లంక . బంగారు ప్రాకారముల తోరణము కలది. వానర శ్రేష్ఠులు గొప్ప అవరోధమును కల్పించిరి. చైత్ర శుద్ధ చతుర్దశినాడు ఇరువదినాలుగు దినములు గొప్ప యుద్ధము జరుగగా ఆందు రావణుడు మరణించేను. ఇక్కడే నీలుడు ప్రహస్తుని, హనుమంతుడు ధూ మాకుని, సుగ్రీవుడు మహోదర, అతికాయులను, లక్ష్మణుడు కుంభకర్ణుని, ఇంద్రజిత్తుని వధించిరి.

ఇక్కడే నేను రాక్షస శ్రేష్టుడైన రావణుని వధించితి. ఇక్కడే లోక పితామహుడగు బ్రహ్మ సంభాషించవచ్చెను. పార్వతితో శూలపాణి, వృషధ్వజుడగు శివుడు, ఇంద్రునితో దేవగణాలు, గంధర్వ కిన్న రాదులు వచ్చిరి. స్వర్గమునుండి నా తండ్రి మహారాజగు దశరథుడు వచ్చెను. అప్సరసలు, విద్యాధరులు అతని చుట్టియుండిరి. వారందరి సమక్షంలో సీతయొక్క శుద్దిని కోరగా ఆమె అగ్ని ని ప్రవేశించి శుద్ధినొందెను. లంకాధీశులు, సురులు దానిని చూచిరి. నా తండ్రి ఆదేశము పై నేనామెను గ్రహించితిని. అపుడు అయోధ్యకు వేళ్ళు నాయనా యని నా తండ్రి సాకు చెప్పెను. “రామా! నీవు లేని స్వర్గము కూడా నాకు ఎక్కువ కాదు. నీవు నేను తరించునట్లు చేసితివి. నీచే నేను ఇంద్రుని సలోకమును పొందితిని' అని దశరథుడు లక్ష్మణునితో, 'నాయనా! నీవు పుణ్యము నార్జించితివి. సోదరునితో కూడి దివ్య లోకములను పొందెదవు' అనెను. సీతను పిలిచి 'అమ్మా! నీవు భకీర్తపై కోపము గొనరాదు. నీ భర్తకు ఉత్తమ కీర్తి లభించును' అనెనని రాముడు చెప్పుచుండగా పుష్పకమ చటికి చేరెను. అక్కడున్న రాక్షస శ్రేష్టులు చారులు విభీషణుని చేరి 'రాముడు సుగ్రీవునితో వచ్చే 'నని చెప్పిరి. అది విని విభీషణుడు వారు కోరిన ధనము మొదలైన వానితో ఆ చారులను పూజించేను.

ఆ పుర మునలంకరించి, బయల్వెడలి మంత్రులతో రాముని జూడవచ్చి, మేరువు పై సూర్యునివలె విమానములో వెలుగొందుతున్న రాముని చూచి, సాష్టాండదండ ప్రణామము చేసి నమస్కరించి ఇట్లనెను  దేవా! ఈనాడు నా జన్మ సఫలమైనది. అన్ని కోరికలు లీడేరినవి. జగద్వంద్యములు, అనీంద్యములగు మీ చరణములను చూచితినీ. ఇంద్రాది దేవతలకు నేను పూజ్యుడిగ చేయబడితిని. ఇంద్రునికంటెనూ శ్రేష్ఠుడనేనని తలంతును. అన్ని రత్నములతో అలరాడుచున్న రావణుని గృహములో రాము డాసీనుడు కాగా విభీషణు డర్ఘ్యమిచ్చి చేతులు జోడించి సుగ్రీవ, భరతులతో నిట్ల నెను  'ఇట కేతెంచిన రామునకు నేనివ్వగలది నావద్ద లేదు. ముల్లోకములకు కంటకుడైన రావణుడను శత్రువును దునుమాడి నాకిచ్చినదీ పుర ము, ఈ నగరము, ఈ నా పత్నులు, ఈ పుత్రులు, నేను కూడా మీకు దానమివ్వబడితిమి. నీకంతా అక్షయమగుగాత!' అనేను. అటుపిమ్మట లంక యందలి జనులందరూ రాముని జూచుటకు కుతూహలముతో వచ్చి, “మాకు రాముని జూపింపుమ'ని విభీషణుని అడిగిరి. అపుడతను రామునికి తెలియ జేయగా, రాముని ఆదేశం పై భరతుడు, సుగ్రీవుడు ఆ జనులు తెచ్చిన బహుకృతులను గ్రహించిరి. ఈ విధంగా, ఆ రాక్ష సేంద్రు నింట రాముడు మూడు దినములు గడి పెను.

ఆది విని విభీషణుడు ‘అమ్మా! నీ విట్లు చేయుము. కొత్త వస్త్రమును, గంధముతో పాత్రను, పెరుగును, అక్షితలు, తేనెతో, దూర్వాతో తీసుకొని అర్ఘ్యముతో రాజపుత్రుని దర్శించుము. సరమ మరియు ఇతర దేవకన్యలు నీముందు నడువగా రాముని చెంతకు నడువుము. నీముందే నేను నడిచెదను' అని రాముడున్న చోటికి వెళ్ళేను. రాముని చూడవచ్చిన దానవులనందరినీ తొలగించి వేసి ఆ సభయందు ఆలంకృతమైయున్న తన ఎదుట నిలిచిన రామునితో నిట్ల నేను.

విభీషణుడ నేను  “దేవా! నా విజ్ఞాపనను వినుము. రావణుని, కుంభకర్ణుని, నన్ను కూడా కన్న ఈ తల్లి నీ పాదముల చూడ గోరుచున్నది. దయతో ఆమెకు నీవు దర్శనమివ్వవలెను. అనగా రాముడు 'రాక్షసరాజా! తల్లిని చూడగోరి నేను నేను ఆమె వద్దకు వెళ్ళేదను. తప్పుకొనుము' అని ప్రతిజ్ఞ చేసి, ఆసన ము పై నుండి లేచి తల పై చేతులు ఉంచుకొని ఆమెకు నమస్కరించెను. 'అమ్మా! నేను నీకు నమస్కారము చేయు చుంటిని. ధర్మము ప్రకారము నీవు నా తల్లి వి. నీ గొప్ప తపస్సు చే, వి వీధ పుణ్యముచే నాకు తల్లివి. అమ్మా! నీ ఈ చరణములను మానవుడు చూచినచో పరిపూర్ణుడగును. నీ పాదము జూసి ప్రీతి నొందితిని. నాకు కౌసల్య యెట్లో నీవునూ అట్లే అనగా కేక సి 'చిరంజీవ! సుఖముగా నుండుము. విష్ణువు మానవరూపాన్ని ధరిస్తాడని నా భర్త చెప్పాడు. దేవతల హితానికై రఘు కులమున విష్ణువు రాముడిగ నవతరించెను. రావణుని నాశ నాకి, విభీషణునికి ఐశ్వర్యము నిచ్చుట కవతరించెను. వాలి వధ, సేతుబంధములను దశరథపుత్రుడు చేయును. నా భర్త పలుకులను స్మరించి నిన్నె జిగితిని. సీత లక్ష్మి, నీవు విష్ణుదేవుడవు. ఈ వానరులు దేవతలు. నాయనా! నా ఇంటికి ఇక నేను వెళ్ళేదను. నీవు స్థిరమైన కీర్తిని పొందుము.”

అటుపిమ్మట సరమ ఇట్లనెను  'ఇక్కడే అశోకవనములలో సీతను సంవత్సరమంతా సేవించాను. నీ ! ప్రియ భార్య సుఖముగా నున్నదా? సీతాదేవి పాదాలను నిత్యమూ స్మరించుచుంటాను. ఎప్పుడా దేవిని చూచెద నాయని రాత్రింబవళ్ళు తలుచు చుంటిని. దేవదేవుడగు నీవా మేనెందులకిక్కడి తీసికొనిరాలేదు? నీ భార్యలేని నీవు ఒంటరిగా శోభించుట లేదు. నీవు, సీత కలిసి యున్న ప్పుడే శోభింతురు' అని సరమ పలుకుచుండగా, ఈమె ఎవరని భరతుడడిగెను. అప్పుడతని భావ మెఱిగిన రాముడు వెంటనే ఇట్లనెను: “ఈమె విభీషణుని భార్య, సరమ అని పేరు. సీతకు చాలా ఇష్టమైన సఖి. కాలముచే జరిగినదంతా చూడుము. ఏమీ చేయునో తెలియదు' అని సరమతో నీవు నీ భర్త ఇంటికి వెళ్ళి పాలించుము. భాగ్యహీనుని గతి విడిచినట్లు సీత నన్ను విడిచి వెళ్ళి పోయినది. ఆమె లేక నేను ఆనందము నొందుటలేదు. దిక్కులన్నీ శూన్యముగా నున్న వి' అని సీతప్రియసఖియగు సర మను సాగనం పెను. కేకసి వెళ్ళిపోగా, రాముడు విభీషణునితో నిట్లనెను :

 ‘దేవతలకు ప్రియమగుదాని నాచరింపుము. వారిపట్ల అపరాధము చేయకుము. రాజరాజుని ఆజ్ఞ ననుసరించి ప్రవర్తించుము. ఎప్పుడై నా లంకకు మానవుడెవరైనా వచ్చినచో రాక్షసులు వానిని వధించరాదు. నావలెనే చూడవలెను.' అనగా విభీషణుడు 'రాజా! నీ ఆజ్ఞ ప్రకారమే ప్రవర్తించేదను' అనేను. అపుడు వాయువు రామునితో “పూర్వము బలిని బంధించిన వైష్ణవ మూర్తి ఇక్కడనే యున్నది. దీనిని కన్యకుబ్జమున ప్రతిష్టించుము.' అనగా రాముడతని భావము నెఱిగెను. విభీషణుడపుడు రత్నము లన్నీటితో వామనుని అలంకరించి తెచ్చి, రామునకర్పించి ఇట్లనెను - 'ఇంద్రజిత్తు ఇంద్రుని జయించినపుడు ఈ వామను డిక్కడకు తేబడెను. దేవా! ఈ దేవదేవుని కొనిపోయి ప్రతిష్టించుము.' అనగా సరేనని రాముడు పుష్పకము నధిరోహించెను. అసంఖ్యాక మైన రత్నాలు, ధనముతో వామనుని తీసుకొని భరత సుగ్రీవులు రాముని వెంట విమానమెక్కిరి. ఆకాశములో వెళ్ళు చుండగానే రాముడు విభీషణుని 'ఇక వుండు' మనెను. అపుడు విభీషణుడు “నీ ఆజ్ఞను పాలించెదను. ఈ సేతువు ద్వారా భూమి పైని మానవులందరూ అడ్డంకి నేర్పరిచేదరు. నీ ఆజ్ఞకు భంగముండును. నాకు నియమమేమిటో చెప్పుము. నేనేమి చేయవలెను?” అనెను.

అంతట రాముడు విభీషణుని మాట విని ధనుస్సును చేతబూనీ సేతువును రెండుగా చీల్చెను. ముందు మూడు భాగాలు చేసి మధ్య వదీ యోజనము లుండునట్లు, మరల యోజన మొక్కటిగా మూడు ముక్కలుగా చేసెను. అటు తరువాత వేళావనమునకు చేరి విష్ణుపూజను గావించి, రామేశ్వరుడను దేవదేవునికి అభిషేకము చేసి వామనుని గ్రహించి, సముద్రమునకు దక్షిణవైపు నుండి త్వరగా వెళ్ళిపోయెను. అపుడు ఆకాశము నుండి మేఘ గంభీర ధ్వనితో ఇట్లు వాక్కు వెలువడెను. రుద్రుడా వాక్కు ద్వారా ఇట్లనెను. “రామా! నీకు శుభమగుగాక! నేనిక్కడనే వుంటిని. ఈ జగతు, భూమియుండునంత వరకు నేను తీర్థము ఇక్కడే నిలుచును.' ఆ అమృతమయ వాక్కును విని రాముడు ఇట్లు స్తుతించెను. దేవదేవునకు, భక్తులకభయమిచ్చు దానికి, గౌరీకాంతునకు, దక్షయజ్ఞ వినాళ కునికి నమస్కారము. భవునకు, రుద్రునకు, శర్వునకు, వరదునకు, పశుపతికి, ఉగ్రునకు, కపర్దికి, మహాదేవునకు, భీమునకు, త్ర్యంబకునకు, దిక్పతికి, ఈశానునికి, భగఘ్న నికి, అంధకారికి, నీలగ్రీవునికి, ఘోరునికి, వేధకు, వేధచే స్తుతింపబడిన వానికి, కుమార శత్రుహంతకు, కుమార జనకునికి నమస్కారము.

విలోహితునికి, దూమునికి, శివునకు, క్రథునికి, నీలశిఖండునికి, శూలికి, దైత్యనాశ కునికి, ఉగ్రునికి, త్రినేత్రునికి, హిరణ్యవ సురేత స్కునికి, అనింద్యునికి, అంబిక భర్తకు, సర్వదేవతలచే స్తుతింపబడిన వానికి, అభిగమ్యునకు, కొమ్యునకు, సద్యో జాతనకు, వృషధ్వజునకు, ముండునకు. జటికి, బ్రహ్మ చారికి, తప్యమానునికి, తప్యునికి, బ్రహ్మణ్యునికి, జయునకు, విశ్వాత్మకు, విశ్వసృజునికి, విశ్వమావరించి వుండువానికి, దివ్యునికి, ప్రపన్నా రిహరునికి, భక్తులయెడ దయగల వానికి, విశ్వతేజ మనోగతునకు నమస్కారములు.' అని రాముడు స్తుతించెను. అపుడు భక్తి నముడైన రామునితో హరుడిట్లనేనని పులస్త్యుడు చెప్పెను. రాముని చూచి హరుడు, 'రామా! నీకు శుభమగుగాక! నీ మనసునందున్న దానిని తెలియజేయుము. మానవ యోనియందు గూఢముగానున్న నారాయణుడివే నీవు. అవతరించిన నీవు దేవకార్యమును నెరవేర్చితివి. ఇపుడిక నీ దేశమునకు వెళ్ళుము. చేయవలసిన దానిని చేసితివి. సేతువు అను గొప్ప తీర్థమును నిర్మించితివి. మానవులిక్కడకు వచ్చి సముద్రమున దీనిని చూచెదరు. మహాపాతకములు గలవారి పాపము తొలగిపోవును. బ్రహ్మహత్య మొదలగు పాపములు, కష్టములు దీనిని చూచినంతనే నశించి పోవును. ఇందు ఆలోచించ వనిలేదు.

రామా! గంగానదీ తీరమున వామనుని ప్రతిష్టించి నీవు వేళ్ళుము. భూమి పై ఎనిమిది భాగములుగా చేసి శ్వేత ద్వీపమును నీ దేశ మును చేరుము. అనగా అతనికి నమస్కరించి రాముడు పుష్కర తీర్తమును చేరెను. అక్కడ చేరిన విమానము పైకి వెళ్ళదాయెను. 'ఆలంబనము లేకుండా ఆకాశమున ఎందుకీ విమానము నిలిచినది. కారణమేమిటో చూడుము' అని సుగ్రీవునితో చెవ్పగా అతను భూతలము పై దిగి సురసిద్ద గణములచే కూడుకున్న బ్రహ్మను చూచెను. బ్రహ్మచుట్టూ బ్రహ్మర్పులు, చతుర్వేదములు వుండెను. అంత సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళి 'ఇక్కడ దేవగణములతో బ్రహ్మ యున్నందువల్ల పుష్పకము దాటలేక పోవు చున్నది.' అనగా రాముడు బంగారు పుష్పకము నుండి దిగి గాయత్రితో నున్న బ్రహ్మకు ఆష్టాంగ నమస్కారము చేసి, ఐదు ఆంగములు భూమిని తాకగా దేవదేవుడగు విరించిని స్తుతించెను.

దేవార్చిలుడైన ప్రజాపతికి, సృష్టికర్తకు నా నమస్కారము. దేవనాథుని, లోకనాథుని, ప్రజానాథుని, జగత్పతిని, సురాసుర నమస్కృతుడిని, ముందుండిన, ఇప్పుడున్న , ఇక ముందుండ బోవు వానికి ప్రభువైన వానిని, హరిపింగళ లోచనుని నమస్కరించుచున్నాను. బాలుడవై కూడా నీవు వృద్ద రూపమును ధరించియున్నావు. మృగచర్మాంబరము నాసనముగా గలవాడవు. దేవతల రక్షకుడవు, ముల్లోకములకు ప్రభువవు. హిరణ్యగర్భుడవు, వద్మగర్భుడవు, వేదగరుడవు, స్మృతి ప్రదాతవు, మహా సిద్దుడవు, మహాపద్మము, దండము, మేఖలము గలవాడవు. కొలుడవు, కాలరూపివి. నీలగ్రీవుడవు, ఉత్తమ జ్ఞానివి, వేదకర్తవు, అర్భకుడవు, శాశ్వతుడవు, పరపతివి, దర్భపాణివి, హంస కేతువు, కరవు, హరవు, హరుడవు, హరివి, జటలు, శిఖ, ముండ, దండము, లగుడము గల కీర్తిమంతుడవు, భూతేశ్వరుడివి సురాధ్యక్షుడివి, సర్వాత్మవు, సర్వభావనుడవు, సర్వ గమనుడివి, సర్వ హారివి, స్రష్టవు, గురువువు, అవ్యయుడివి, కమండలుధారివి, దేవుడివి స్రుక్ స్రువము మున్నగు వానిని ధరించువాడవు. హవనము చేయదగిన వాడవు. పూజ్యుడవు, ఓంకారమువు, జ్యేష్ట సామగుడవు, మృత్యువు, ఆమృత్యువూ నీవే పారియాత్రుడవు, సువ్రతుడవు, బ్రహ్మచారివి, వ్రతధరుడవు, గుహవాసి వి, సుపంక జునివి, ఆమగుడివి, దర్శనీయుడివి, బాలసూర్యునివంటి వానివి, కుడి ఎడమల పత్నులచే సేవింపబడిన వానివి. భిక్షువు, భిక్షురూపివి, త్రిజటీ, లబ్ది నిశ్చయుడవు, చిత్తవృత్తిక రుడవు. కాముడవు, మధువు, మధు కరము నీవే!

వానప్రస్థుడివి, వనగతునివి. ఆశ్రమి, పూజితుడివి, జగత్తును ధరించువాడవు, సృజించువాడవు, పురాణపురుషుడివి, ధర్మాధ్యక్షుడివి, విరూపాక్షునీవి, మూడు ధర్మములు నీవే. భూతస్రష్టవు నీవే . మూడు వేదములు నీవే, బహురూపివి. కోటి సూర్యుని కాంతి గలవాడవు. మోహకుడవు, వంధకుడవు, విశేషంగా (దానవులకు) దేవదేవుడివి, పద్మ చిహ్నము గలవాడివి, ముక్కంటివి, పద్మ జటల వాని వి. హరిశ్మశువులు గలవాడవు, ధనుర్ధారివి, భీముడవు. ధర్మపరాక్రముడివి' అని ఈ విధంగా రాముడు స్తుతించగా, నమస్కరించుచున్న రాముని చేతిని పట్టుకొని బ్రహ్మ, “నీవు మానవ దేహములో భూమిపై అవతరించిన విష్ణువువే. దేవకార్యమునంలో ఆచరించితివి గంగానది యొక్క కుడివైపున తీరము పై వామనుని నిలిపి ఆయోధ్యకు వెళ్ళుము' - అని వీడ్కోలు పలుకగా రాముడు బ్రహ్మకు నమస్కరించి పుష్పకమునెక్కి మధురాపురిని చేరెను. అక్కడ శత్రువుల దునుమాడు శత్రఘ్న నీ చూచి, రాముడు, భరతుడు, సుగ్రీవుడు సంతోషించిరి. సోదరులు, ఇంద్రో పేంద్రులవలె వచ్చుట చూచి శత్రుఘ్నుడు శిరసువంచి నమస్కరించి, ఐదు అంగములు నేలకు తగులునట్లు ప్రణామము చేసెను. రాముడు సోదరుని పైకి లేపి, ఒడిలోకి తీసుకొనెను.

అటు పిమ్మట, భరతుడు సుగ్రీవుడూ అట్లే చేసిరి. కూర్చున్న శత్రుఘ్నుడు రామునికై ఆర్ఘ్యమును త్వరగా తెచ్చెను. అష్టాంగములతో రాజ్యమును రామునికి నివేదించెను. రాముడు వచ్చెనని తెలిసి మధుర ప్రజలు, బ్రాహ్మణ భూయిష్టముగా (ప్రజలు) చూడపచ్చిరి. వారందరితో మాట్లాడి రాముడు ఐదు దినములక్కడ గడిపి వేళ్ళదలి చేను. శత్రుఘ్నుడు రామునికై గుర్రములను, ఏనుగులను, మంచి బంగారమును బహుమానముగ తెచ్చెను, అప్పుడు రాముడు సంతోషించి 'దీనినంతా నేనే నీకిచ్చుచుంటిని. మధుర పాలకులుగా నీ పుత్రుల నిద్దరను అభి షేకించుము' అని, మధ్యందిన సూర్యుడిని చూచి గంగాతీరమును చేరి వామనుని ప్రతిష్టించి బాహ్మణులను, భాషా పాలకులనుద్దేశించి ఇట్లనెను. 'ఇది నేను నెలకొల్పిన ధర్మ సేతువు. ఐశ్వర్యమును పెంపొందించునది. మీ కాలమున మీరు పాలించదగినది. లోపము చేయరాదు. చేతులు జాచి నే జేయు ప్రార్ధనను ఆలించి, పాలకులారా, షేమమేదో దానిని చేయుడు. ఆలసింపక నిత్యపూజ చేయుడు'. అని అతనికి గ్రామములను, లంకనుండి తెచ్చిన ధనమును ఇచ్చి, సుగ్రీవుని కిష్కింధకు పంపి పుష్పకము పై అయోధ్యకు వచ్చి ఆ విమానముతో కుబేరుడున్న చోటనే వుండుము. మరల రాసవసరం లేదు అనెను. కృతకృత్యుడగు రాముడు అట్లు కర్తవ్యమును పాలించెను.

అని చెప్పి పులస్త్యుడిట్లనెను. 'భీష్మా! నీకు ఇట్లు నేను రాముని కథను, వామన ప్రాదుర్భావమును చేప్పితిని. ఇంక నూ ఏమి వినగోరితివి. నీకు కౌతుక మున్న దానినెల్లా చెప్పెదను. కోరినదానినెల్ల తెలియజేసెదను’ ఆనెను.

ఇది శ్రీ పద్మపురాణమున మొదటి సృష్టిఖండమున వామన ప్రతిష్ఠయను ముప్పది యెనిమిద - అధ్యాయము.