పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

6 - దక్షాత్రాక్ సంకల్ప దర్శన స్పర్శనాది జన్యా సృష్టిః

భీష్ముడనియె. “దేవదానవగంధర్వనాగరస్సులసృష్టిని విస్తరించి యథావిధి నానతిమ్ము.” అనవిని పులస్త్యుం. డిట్లనియె. “సంకల్పముచే దృష్టిచే తాకుటచే పూర్వుల నృష్టి జరిగినట్లు చెప్పబడుచున్నది. దక్షుని తర్వాత ప్రాచేతసుని యనంతరమైనసృష్టి మిధుననిమిత్తము. బ్రహ్మ తొలుత దేవర్షి గణములను సృజించెను. కాని యడి పెరగలేదు. అప్పుడు దక్షుడు తన వేలకొలదిపుత్రులను సంకల్పాదులచే గనిన వారిని పిల్లలం గనుడని యాదేశించెను. నారదుడా దక్షపుత్రులను హర్యశ్వులను వారిందనదరి కేతెంచిన వారింగని ఋషీశ్వరులారా! భావము ప్రమాణము క్రిందు మీదు లెల్లదేలిన యీ మీద సృష్టిని పెంపుచేయుడనియె. వారది విని నలుదెసలకు వెళ్ళిపోయిరి. సముద్రమునుండి నదులు వెనుదిటిగి రాన టైంతవరకును వారు తిరిగి రారైరి. హర్యక్షులట్లు పోగా దక్ష ప్రజాపతి వారిణియను నామె యందు వేయిమంది పుత్రులం గనియె. శబలాళ్వులను పేర వారు వారు సృష్టిగావింప నుద్యమించిరి. నారద మహర్షి మరల వారితో ముందటివలె భూమిప్రమాణము సమగ్రముగ తెలిసికొని వచ్చి ఆమీద సృష్టిని గావింపుడని వలెను. వారును నన్నల దారి ననుసరించిపోయి తిరిగిరారైరి. అప్పటినుండి తమ్ము డన్నదారి వెదుకకుండుట యేర్పడినది. ఒకవేళ నతడన్నజాడ నరయబోయెనేని దుఃఖము నందును. కావున నావని జేయరాదు.

వారు నటువోగా ప్రజాపతి వీరిణియం దాడుబిడ్డల తరువదిమండిం గనెను. అందు వధిమందిని ధర్మునికి వదమువ్వురను కశ్యపునికి ఇరువదియేడుగురను సోమునికి (చంద్రునికి) అరిష్టనేమికి ముప్వురను భృగకుమారి కిద్దరిని కృశాశ్వున కిద్దరిని అంగిరసుని కిద్దరిని నొసంగెను. దేవమాతలగువారి పేరులను వారి సంతాన విస్తరమును మొదటి నుండి యాలింపుము.

అరుంధతి, వసువు, జామీ, లంబ, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య. విశ్వ అను పదిమంది ధర్ముని థార్యలు. వారి కొడుకులు విశ్వేదేవులు విశ్వకుమారులు. సాధ్యకొడుకులు సాధ్యులు. మరుత్వతి కుమారులు మరుత్వంతులు. వసునంతతి వస్తువులు, భానువు పిల్లలు భానవులు. ముహూర్తములు ముహూర్త కొడుకులు. లంబ కొడుకులు ఘోషులు. జామి కూతురు నాగవీధి. అరుంధతి యందు భూతలమందలి వారు గల్గిరి. సంకల్పకు సంకల్పులు కల్గితి. వసు సంతానము జ్యోతిష్మంతులు. వీరు నలుదేనల వ్యాపించిరి.

అష్టవసువుల పేర్లు ఆపుడు ధ్రువుడు సోముడు ధరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు. ఆవుని కొడుకులు నల్గురు. శ్రాంతుడు వేశండుడు అవిశ్రాంతుడు బభ్రువు. వీర యజ్ఞరక్షాధికారులు.

ధ్రువుని కొడుకు కాలుడు. సారీఖుని కొడుకు సుపర్చుడు. ధర్ముని కొడుకులు ద్రవిణుడు హవ్యవాహుడు కల్పాంతస్థుడు ప్రాణుడు రమణుడు శిశిరుడు మనోహరుడు ధవుడు శివుడు అనుచారు. వాయుకుమారులు. శివుడు మనోజువుడను కుమారునింగనెను. అతని జాడ యేరివిని దెలియదు. అగ్ని కుమారుడు అగ్ని యొక్క గుణములు కలవారు. అందు శాఖుడు, విశాఖుడు బ్రహ్మయొక్క నిగమములందు (వేదములందు) వినవత్తురు కృత్తికలు (అగ్ని దైవత్యములు నక్షత్రములు) వారి కొడుకు కార్తికేయుడు (కుమారస్వామి అగ్ని కుమారుడగు విశాఖుడీయనయే. ప్రత్యూషుని కొడుకులుముని, దేవలుడును. ప్రభాసుని కుమారుడు విశ్వకర్మ. ఆయన దేవశిల్పి, ప్రజాపతి. ప్రాసాదములను (దేవాలయములు, చక్రవర్తులభవనములను భవనములు, ఉద్యానములు ప్రతిమలు. (విగ్రహములు) నగలు, తటాకములు (చెరువులు) ఆరామములు (తోటలు, దొడ్డు సూతులు వంటి వాని నిర్మాణమం దీవిశ్వకర్మ దేవతకి వడ్రంగి

 ఏకాదశ రుద్రులు  1) ఆజై కపాత్తు 2) పార్భుధ్యుడు 3) విరూపాక్షుడు 4) రైవతుడు 5) హరుడు 6). బహంరురూపుడు 7) త్ర్యంబకుడు 8) సురేశ్వరుడు 9) సామిత్రుడు (వైవశ్వతుడు) 10) జలసంతుడు 11) వినాల 12) ఆపరాజితుడు అమరాఠ: గణేశ్వగలనియు వీరినందుడు. త్రికాలధారలగు బ్రహ్మమానస పుత్రులులే ఫ్రీరికెనుబది నాల్గుకోట్ల మండి పుత్రులు గల్గిరి. వారు సర్వదిశల నావరించి జగద్రవణ సేయుచుందురు, నీ పుత్ర పౌత్రులు సురభి. (కామధేనుపు) గర్భమందుదయించినవారెందధో యున్నారు.

కశ్యపవంశము

కశ్యపుని భార్యలు ఉతి అదితి దమవు అరిష్ట సురన సురభి వినత తామా క్రోడవ ఖనమునియును వారి కొడుకులు తుషితలను దేవతలు. వారు దానుషమన్వంతరము వారు

వైవస్వతమన్వంతరమున అదితి సంతానము (ఆదిత్యులు) వండెడుగురు వారు. ఇంద్రుడు ధాత భగుడు త్వష్ణ మిత్రుడు వరుణుడు ఆర్యముడు వివస్వంతుడు నవిత పూష అంశుమంతుడు విష్ణువు. వీరందరు నహస్ర కిరణులు వేలకొలది కిరణములు గలవారు. కశ్యపునికి దితియందు దైత్యులు కృశాశ్వాఋషికుమారులు దేవప్రహరణులుగల్గిరి. ఈ దేవగణములు ప్రతిమన్వంతరము. ప్రతికల్పమందు పుట్టుదురు లీనమగుదురు.

కశ్యపుని వలన దితి యిద్దరం గనెనని విన్నాము. వారు హిరణ్యకశిపుడు హిరణ్యాతుడును. హిరణ్య కశిపునికి నల్గురు గల్గిరి. ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు ఆహ్లాదుడుననువారు. ప్రహ్లాదపుత్రులు ఆయష్మంతుడు శిబి బాష్కలి విరోచనుడు ననువారు. విరోచనుడు ఐలింగనెను. బలి కొడుకులు నూర్గురు. అందు బాణుడు జ్యేష్ఠుడు. ధృతరాష్ట్రాదులు కారు. తొంబది తొమ్మిది మంది.

బాణుడు వేయిచేతులు గలవాడు. నర్వాతకుశలుడు. అతని తపస్సునకు సంతోషపడి శివుడు శూల పాణియై తత్పురమున రతయిచ్పుచు వసించును. ఇతడు శివుని ప్రార్థించి మహాకాలుడయ్యెను.

హిరణ్యాక్షుని కొడు కంధకుడు. భూతసంతావనుడు. మహానాగుడును. హిరణ్యాకు కొడుకులు వీరి మునుమలు మునుమనుమలు డెబ్బదియేడుకోట్లమంది బలశాలురు మహాకాయులు నానారూపులు తేజస్సంపన్నులు. దనువనునామె కశ్యపుని వలన నూర్గురం గనెను. వారు వరదర్పితులు. విప్రచిత్తి యందు ప్రథానుడు, శకునియను వాడు వదునాలు తలలవాడు. (శంకుశిరోధరుడు) శంకువు వంటి మెడగలవాడు. ఆయోముఖుడు మొదలు వామనుడు సువర్వుడుదాక వారి పేర్లు సులభముగా నిందుగలవు.

ఇందు స్వర్భానువు కూతురు సుప్రభ. పులోముని కూతురు శచీదేవి. మయుని కూతురు ఉవదానవి. కుహువు కుమారి మండోదరి. వృషపర్వుని కూతుండు సుందరియైన శర్మిష్ఠ చండయును. వైశ్వానరుని కూతుండ్రు ప్రలో కాలికయును. వీరు మారీచుని భార్యలు. బహుసంతానవతులు. బహుబలాడ్యులు. వారిసంతతి అరువడివేలమంది పౌలోములు కాలఖంజులు ననువారు మారీచునికి గల్గినారు. వారు మానవుల కవధ్యులు, హిరణ్య పురమందు వసించిరి. చతుర్ముఖుని వలన వరములం బడసినారు, విజయునిచే నిహతులైనారు.

విప్రచిత్తి సింహిక యందు తొమ్మండుంగనేను. పారణ్యకశిపునికిపాండ్రు మేనల్లుడు పదుముగ్గురు, వారు కంసుని మొదలు కల్పవీర్యుని దాక.

సంహ్లాదుని వంశంలో నివాతకవచులు దేవగంధర్వాదులకవధ్యులు జనించిరి. వారిని బలరామునా శ్రయమున నర్జునుడు హతమార్బెను. తామ మారీచుని వలన నయిదుగురు కూతుండ్రంగనెను. శుకి శ్వేన భాసి సుగృధ్ర గృద్ధీక శుచి అనువారు వారు. శుచి శుకములను ఉలూకములను గనెను. (ఉలూక= గుడ్లగూబ) శ్యేన (డేగ) ఖాన్ కురరులను గృధ్ధి గృధ్రములను (గ్రద్ధలను) పావురములను పశులంగనెను. శుచి హంసలు సారస = చక్ర వాకములు, కారడవ= బెగ్గురుపములను గనెను. వారందరు తామ్రసంతానము.

ఇక  వీనతనంతతి నాలింపుము

వినత సంతానము

గరుడుడు (పక్షిరాజు). ఆరుణుడును వకులకు రాజీ. వినత కూతురు సౌదామిని (మెలుపు) ఈమె తమన= చీకటియందు, విక్రుత=ప్రసిద్ధ అనగా నీటిని చెండాడునదన్న మాట. సంపాతి జటాయువు అరుణుని కొడుకులు, సంపాతి కొడుకు బభ్రువు, చాలా వేగరి మిక్కిలి ప్రసిద్దుడు. జటాయువు కొడుకులు కర్ణికారిశతనామి యనువారు. వీరి వుత్ర పౌత్ర పరంపర అనంఖ్యాకమైనది,

సురసయందు సువర్ణునికి (గరడునికి) వేయిమండి పుట్టిరి. కదుపు సహస్రశిరస్కులను సమాన సంఖ్యాకుల గనెను. ఆ కద్రువు సంతానములో నితవది  యాకలుగురు ప్రధానులమడు. వాడు కర్కోటక శంఖుడు ఐరావతుడు కంజలుడు నన్నువారు. వీరి దుస్తుమలు మునిమనుమలు. ధనంజయుడు మొదలగ పతంజలి ప్రముఖులెందరో ఉదయించిరి. ఈ పరంపర అనంతము.

జనమేజయమందిరమందు మున్ను రక్షోగణము నాశనమైనది. విషపుకోరలుగల భీమునివలన శ్రయించినది. కాళ్యవుని వలన మహమ్ కోరలుగల జంతువులను నక్కలను కాకులం గనెను. సురభి గేదేలను గోను సుందరం కాశ్యపునివలన గనెను, ముని యనునామె ముని గణమును అవరోగణమును కిన్నరగంధర్వాదులను బేక్కురను గనెను. ఇర గడ్డిచెట్లు తీగెలు పొదలనుం గనెను.

ఖనయనునామె యతులు రాసులను కోట్లకొలదిగా గనెను. ఈ కశ్యవదాయాదులు (జ్ఞాతులు) వందలు - వేలుగా నున్నారు. ఇది స్వారోచిషమన్వంతర-నృష్టి. కర్మ ఓ భీష్మా! అటు పైన నలుబది తొమ్మండుగురు మడత్తులను దితి, కశ్యవుని వలన గన్నది. వారందరు నమరవల్లభులు, దేవప్రభువులు.

 ఇది సృష్టి ఖండమందు సృష్టికథనమను ఆఱవ అధ్యాయము.