పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

17 - బహ్మయజ్ఞే శివస్య భిక్షోద్దేశేనాఽగమనమ్

భీష్ముడు విప్రో త్తమ ! అబ్రహ్మయజ్ఞ మందు వింత లేమి జరిగినవి ? రుద్రుడు విష్ణువునట నెట్లుండిరి ? గాయత్రి యజమాన పత్నిగా నుండెను గదా యామె యేమి సేసినది ? నిజము తెలిసిన తరువాత గాయత్రి పుట్టినింటివారు గొల లేమి సేసిరి ? వారితో బ్రాహ్మణు లేట్లు ప్రవర్తించింది వినవలెనని వేడుక గోన్నాడనానతిమ్మన పులస్త్యుడనియె. రాజా ! ఆ య జమందు జరిగిన యాశ్చర్యమెల్ల దేలి పెద విను. రుద్రుడు నింద్యరూపుడా బ్రాహ్మణులం దుండేను. విష్ణు వక్కడ ప్రధాను డగుట చే నాయన యేపని చేయలేదు. గొల్ల పిల్లకు ప్రమాదము జరుగునని తెలిసి గొల్లలు గోపికలందు బహ్మదటికి వచ్చిరి. ఆ పిల్ల నడుమునకు మౌంజి (ముంజీ గడ్డితో పేసిన) త్రాడు గట్టియుండుట చూచి తల్లి అయ్యో పిల్లా యని తండ్రి అయ్యో కూతురా యని, చుట్టాలు చెల్లాయి, స్నేహితురాండ్రు నెచ్చెలీయని వాపోవుచు ఎవడు నిన్నిటకు గొని వచ్చినారు ? ఈ మూడు పేటల ముంజి త్రాడు నీ నడుముకు బిగించినా రేవరు ? ఈకంబళి యేమి ? నీ పై కప్పిరి ? ఎఱ్ఱ తాటితో నీ జడ వేయ బడినది ? ఇదంతా ఎవరి పని ? యనుచు పలు రీతులు గొల్లలాడు పలుకులు విని యింద్రుడు వలదు వలదు. అట్ల నకుడని వారి ననునయించెను. ఆప్పుడింద్రు డిట్లనియె. మీ పిల్ల నీటకు దీసి కొనివచ్చినాము. యజ్ఞమునకు యజమానియగు బ్రహ్మకు పత్నిగా నువయోగ వర చినాము. బ్రహ్మ యీ మెను జేపట్టినాడు పేలకుడు మీరు. పుణ్యాత్ము రాలిపిల్ల, మంచి ఆదృష్టవంతురాలు, కుల మంతను సంతోష పెట్టునది. పుణ్యాత్మురాలే కానిచో  నీయజ్ఞ సదస్సున  కేలా  రాగలదు ? ఈ సంగతి తెలిసి నీవు చింతపడకు మని యా పిల్లతండ్రిని సముదాయించేను.  అపుడు విష్ణు విట్లనియె.

విష్ణు వనియె :

ఓ గొల్లా ! మంచి యాచార వంతుడా ! చింతింపకు. నీ కుమార్తె మహానుభావురాలు. బ్రహ్మను బొందినది. మహాయోగులు వేదాలు చదివిన  బ్రాహ్మణులు కూడ పొందలేని స్థాన మందు కొన్నది. నీవు ధన్యాత్ముడవు, ఆచారవంతుడవు. ధర్మపత్సలుడవు నని తెలిసియే మీ కన్యకను బ్రహ్మ దేవుని కిచ్చితిని. ఈమె నిన్ను దరింప జేయగలదు. వర మోత్తమ లోకాలకే గురువు నే నవతారమె తెదను ఆది నా కొక మాట. నందాదు అవతరించి నపుడేను వారి మధ్య నుందును. మీ పిల్ల లందఱు నాతో రమింతురు. అందు తప్పు లేదు. ద్వేషము గాదు మత్పరము గాదు. మానవులై నసు గొల్ల లపుడు భయపడరు. ఈ గోపికల కేదోషము కలుగదు. విష్ణువు పలుకు లాలించి గొల్ల లాయనకు మొక్కి యిట్లనిరి.

ఈలాగే మాకు వర మిచ్చినావు. ధర్మము సాధించుటకు మా కులమందు నీ వవతరింప వలసినదే. నీ దర్శన మాత్రమున మేము స్వర్గవాసుల మయ్యెదము. ఈ కన్య శోభన దేవత. తరతరాల లోకము ద్ధరింప గలదు. ప్రభూ నీ విచ్చిన వర మీట్లే యగు గాక ! య నిరి. విష్ణుదేవుడు తనంత గోల్లల నట్టనునయింప బ్రహ్మదేవుడు నేడమ చేయెత్తి యిది యింతే అని యామోదము సూపెను. గోపకన్య బంధువులందజలో సిగ్గుపడి నా సంగతి వీరికెవరు చెప్పిరి ? నన్నిక్కడకు వచ్చి కనుగొన్న వారంద ఱకు నమస్కరించుచు నేడమ చేయెత్తి గాయత్రి యిట్లు పలికెను ! అమ్మా నే నిటకు వచ్చి నాను. బ్రహ్మను గూర్చి వచ్చి నిలువబడినాను. అందజ కాది పురుషుడు జగత్పతి నాకు సాక్షాత్తు దేవుడు ప్రతిగా దొరికెను. నీపు గాని మా అయ్యగాని చుట్టాలు గాని నన్ను గూర్చి చింతించ వలసిన పనిలేదు. ఈ నెచ్చెలులు అక్క చెల్లెళ్లు తమ పిల్లలతో నంద అను కుశల మడిగినా నని తెల్పుడు. దేవతలతో గలిగి యున్నాను. అనినంత వారందఱు నేగిన తరువాత సుందరి యా సాధ్వి బ్రహ్మతో యజ్ఞవాటమున కేగెను.

బ్రాహ్మణులు ప్రార్ధింప బ్రహ్మ వారడిగిన వరము లన్నియు నిచ్చెను. గాయత్రీదేవి యాయన వారి కిచ్చిన వరము నామోదించెను. ఆమె వేల్పుల దగ్గరగా యజ్ఞమందామే కూర్చుండెను. నూలు దివ్య వర్ష ములాయజ్ఞము సాగెను.

కపర్ది (జడ దారి) శంకరుడు భిక్ష కొఱకు యజ్ఞ వాటమున పెద్ద పుర్రె చేకొని యైదుపు ర్రెలు మేనగై నేసి వచ్చెను. ఋత్విక్కులు సదస్యులు (సభ్యులు) దూరమందు నిలిచిన యాయనం గని యేవగించుకొనిరి. వేద వాదులు నిందింప బ్రాహ్మణులు పొమ్మని లేవగోట్టోరీ. నీ విటకెటుల వచ్చితివి ? ఆన విని మ హేశ్వరుడు నవ్వి యిట్లనియె.

     బ్రాహ్మణోత్తములారా ! అందరికి సంతోషము కూర్చు నీ బ్రహ్మయజ్ఞమందు నేను దప్ప వెడల గొట్టబడిన వాడు లేడు. కానిండన వారు. భోజనము సేసి పొమ్మనిరి. సరే అలాగే వెళ్ళేదనని కూర్చుండి ముందా పుర్రె నుంచి వారు చక్రము తిఱ్ఱిగినట్టు తొలుగుతూ చేయు చున్న యా యజ్ఞ కర్మను జూచి కపొలములు నేల పై నుంచి పుష్కరము నకు స్నానము కొఱకు వెళ్ళేను. పో త్వరగా పొమ్మని వారస నింగి నిలిచి దేవతలను మోహ పెట్టి స్నానమునకు వెళ్లగా జై సదస్సులో నీ పుర్రె ఉండగా హోమ మెలాచేయుట ? పు రేతో ననాచారము లతో సరి ఆని (అనగా దానిని మించిన మైల మరి లేదన్నమాట) ఈ లా బ్రహ్మ యెపుడో ఆ న్నారు. సదస్సులలో నొకడు కపాలాన్ని విసరి పారేస్తా నని యెత్తి విసరివే నెను. అంతట మరి యొక కపాలము వచ్చిపడెను. అది విసరి వే నేను. ఈ రెండు మూడు ఇరవై ముప్పది యేబది నూరు వేయి పదివేలు అంతు లేకుండా కపాలాలు బ్రాహ్మ జో తముల కన్నీ కఫలాలే ఆపు డా జడదారి నా వేలు లందరు శరణు బోండిరి. పుష్కరారణ్యమున కేగి ఎంతో వేద మంత్రాలు జపించి యంద కేక మై స్తుతించిరి. ఆంతట నా యుబ్బులింగ డు తనకు దా సంతుష్టు డయ్యెను. ఆ పై భక్తిచే వ్రాలి మొక్కిన వారిం గని శివు డిట్లనియె.

       కపాలము లేకుండా పురోడాశము తయారు కాదు. నేను జెప్పినట్లు చేయుడు. స్విష్టకత్తులో భాగము నో కిండు. ఇట్లు చేసిన నా యాజయేల్ల జేసి నట్లగ ను. అన నట్లే మీ యానతి నిర్వహింతు మని శంభునితో విప్రు లనిరి. అప్పుడు పాలము చేత గోని యీశ్వరుడు భగవంతడు బ్రహ్మను గూర్చి యిట్లనియే : ఓ బ్రహ్మా ! నీ హృదయ మందున్న వర మిష్ట మైనది కోరు కొను మంతయు నీ కిత్తును.

బ్రహ్మ యిట్లనెను :

       ప్రభూ ! నీ కీయరానిదేదియు నాకు లేదు. నీ వరము నే దీసికొనను. నేను దీక్షితుడను. యజ్ఞ సదస్సులో నున్నాను. ఇక డ నెవ్వ రేది ప్రార్థించిన నన్ని కోరికల నే నిత్తును. యజ్ఞ సందర్భమున నిను నున్న పితా మహునిం గని సరే యని రుద్రు డాయన నిట్లు వర మడిగెను.

           ఆంతట మన్వంతర ము గడువగా శంభుదేవుడు తనకు దా నాయనకు యజ్ఞమ దకు పైదిగ బ్రహ్మస్థాన మేర్పఱచెను. దాన నీతడు నా వేదములందును పరినిష్ఠను ( అగ్రస్థాన మును) బొందెను. ఆ త్తజి నీశ్వరు డట నున్న నగరము చూచి యట బ్రాహ్మణులతో సంభాషింప గుతూహల పడి అదే పిచ్చివాని వేషముతో యజ్ఞసదస్సుక కేగెను. హోమము శేషించి యుండ గా బ్రహ్మ సదనముం బ్రవేశించెను. దేవతల విప్రుల కంట గనబడెను. ఆట కొంద డాయనం గని పరిహాసము చేసిరి. కొందఱు బెదరించిరి.

శివ ఉవాచ :

కొందఱు దుమ్మెత్తి పోసిరి. ఆ పిచ్చివానిని బలవంతులమని కొందఱు పొగ రేక్కి విరగ బడి పరిహసించుచు చేతులెత్తి ఆగు మాగు నుని పారలు బెడ్డలు వి సరి దుడ్డు క జ్ఞలం బాదిరి. కొందఱు వటువలు (బ్రహ్మచారులు) ఆయన జడలు బట్టి లాగుచు దరి కీడ్చి ఈ వ్రతచర్య నీ కెవ్వరు చూపిరి. ఇక్కడ నందగత్తె లెందరో యున్నారు. వారికోసము నీవు వచ్చినావు. పాపవృష్టి యేవడు గురువు నీకి భిక్షాచర్య చూపినాడు ? దీనితో వెళ్లి వాడట్లు మాట లాడుచు జనము మధ్య పరు వేడు చున్నాను. ఏమి యీ పేలాపన ? నా శిశ్నము బహ్మరూపము భగము విష్ణు పు. నేను వదలున దిది గోబీజము. వేడొక టైనచో లోక ము క్లేశము పాలగును. నేనీబిడ్డను (బ్రహ్మను) గన్నాను. నేను నీతని వలన బుట్టి నాను. మహాదేవుని కొఱకే సృష్టి చేయ బడినది. హిమాలయ మంను భార్య సృషి): బడినది. రుద్రుని కుమ యివ్వ బడినది. ఆమే యెవరి కూతురు ? చెప్పు. మీరు మూడు లు. మీ రెఱుగరు. మీకు భగవంతుడు తెలియ జెప్పవలె. శివుడు విష్ణువు బ్రహ్మహత్య నిమి త్త మైన ప్రాయశ్చిత్తము బ్రహ్మ చేసి కొన లేదు. బ్రహ్మ దేవుని నిందించు చున్ని వేల ఇప్పుడు మా కీవు చంపవలసిన వాడ వైతివి. ఆన యిట్ల ఓ బ్రాహ్మణులచే తిట్ట బడి  కోట్ట బడి నవ్వి వారందరిని గూర్చి శంకరు డిట్లనియె. ఓ 1 వి! పులారా ! నేను పిచ్చి వాడనని మతిపోయిన వాడనని యెఱుగ రా ! మీరందరు జాలి గలవారు. స్నేహభావమందున్న వారిని యిట్లు పలుకుచు బ్రహ్మ స్వరూపము ధరించి యున్న హరుని తెలియక మాయలో బడి పొరబడి యా బ్రాహ్మణోత్తము లా కపర్దిని (పిచ్చి వానివేషము లోనున్న వానిని) (జడ దారిని) చేతలతో బాది గుద్ది కాళ్ళతో దన్నిరీ. కఱ్ఱలతో గసికలతో గొట్టిరి. ఇట్లా బాధింపబడి కొవము గొని వారిని శపించే.

ఓ విప్రులారా ! ఇప్పుడు పిచ్చి వానిపై నా పై జాలి లేని మీరు వేద దూరులై మీదికి జడలూవి వ్రత భ్రష్టులు పర దారల వేశ్యల వలచి జూద మాడుచు తల్లి దండ్రులను ఎదలి పరాన్న భుక్కులై భయంకరమైన బిచ్చమెత్తు కొని తినుచు నాది చుస్న దేదియు లేక ధర్మశూన్యులై బ్రతుకుదురు గాక. నన్ను సంతుష్టుని జేసి నపుడే వాండకు ధనము కొడుకులు, దాస దాసీ జములు, మేకలు, గొఱ్ఱెలు, ఉత్తమ కుల స్త్రీ లు గలుగు గాక. ఈ పిచ్చి వాని పై దయ గొన్న వారి కే యీ ధనాది సంపద గల్గు గాక ! ఇట్లు శాపము పరమునుం గూడ యిచ్చి స్వామి దర్గాక ముందే ను. ఆయన వెళ్లి ఇంతట నా ప్రభువు శంకరుడని తెలిసి కొని పూని యేంత వెదకిన నాయనను గాన రైరి. ఆపుడు నియమ మూ ని పుష్కరా రణ్యమున కేగి జేష్ట సరస్సున స్నానము సేసి శతరుద్రీయము జపించిరి. జపము తుద నా దేవు డ శ రీర వాక్కున ఇట్లు పలికేను.

ఏ ననృత మెన్న డాడ లేదు. నా వాం డ యెడ నది యెట్లు నే నెదను. కోపము నిగ్రహించు కొన్నాను. మీ కిక షేమమే సేసెదను, శాంతులు దాంతులై (ఇంద్రియ నిగ్రహము కలవారే) నా యెడ స్థిర భక్తి గోని ద్విజు లెవ్వరు పూజింతురో వారికి వేదము ధనము సంతతి యెదలెడదు. నిత్యాగ్ని హోత్రులై విష్ణువు నెడ భక్తి గలిగి తేజోరాశిని సూర్యుని బ్రహ్మ నెవ్వరు పూజింతురో, యేరి మనస్సు సమస్థితినుండునో వారి క శుభము గలుగదు. అని పలికి యాత డూర కుండెను. దేవ దేవ వలన ననుగ్రహము తో నట్లు వర మంది యందరు కూడి బ్రహ్మ సన్నిధి కేతెంచిరి. బ్రహ్మను కలిసి కొని మంత్ర జపములు సేసి యాయనను సంతోష పరచుచు ముందు నిలిచిరి. బ్రహ్మ సంతుష్టుడై నా వలన వరము కోరుడన శ్రీ బ్రహ్మ సంతుష్టుడైనదే చాలు నని కొందరు వేదములం గోరెద మనిరి. కాదని కొందరు శంకింపక ధనముతో బనేమి? అగ్నిహోత్ర ములు వేదములు పెక్కు రకములయిన శాస్త్రములు సాంతానిక ములై న లోకములు గావలెననిరి. ఇట్లు వాగుచున్న యా బ్రాహ్మణులలో కోవ మావేశీంచెను. ఎవరు మీరు ఇక్క డుతము లేవరు? మేమే శ్రేష్టల మని కొందరు కాదు కాదని కొందరు వాదులాడు చున్న విప్రుల వంక చూచి కోపముతో బ్రహ్మ యిట్లనియె.

మీరు మూడు భాగములుగా నీ సభలోన వెలుపల నున్నారు. గావున మీ కిక యొక టే మొదలు గాగలది యొకే కూటమి యేర్పడు గాక.

కౌశికి యను సిది రెండవది గణమను నది మూడ వది కాగలదు. మూడుగా కూర్పబడిన యి స్థాన మంతయు మీదే కాగలదు. ఇప్పు డిట నుదాసీను లై తల సులే) యుండిరో వా రు దాసీను లగుదురు గాక. ఆయుధమ లూని యొర లో కత్తి కట్టుకొని పోరాడ గోరి యిట నిలిచినవారు లో కులను పేర ప్రజ యిట బాహ్యముగ నుందుదురు గాక. ఎవ్వరికిం దెలియని ఈ రహస్య స్థానము విష్ణువు తప్పక పాలించును. నే నిచ్చినదిది చిర కాల ముండును. ఎన్నడుం చెడదు. అని పలికి బహ్మ యజ్ఞ సమాప్తి కెదురు చూచెను.

కోప తాపములతో నున్న బ్రాహ్మణు లందరుం గలిసి యా పై నతిధికి భోజనము  వేట్టుచు వేదాభ్యాస మంద పేక్ష గొనిరి. ఆ క్షేత్ర ముత్తమము. బ్రహ్మ పుష్కర మను పేరం దినది.

 పుష్కర క్షేత్ర ప్రశంస

అట క్షేత్ర వాసు లందరు ద్విజులు శాంతులు. వారికి బ్రహ్మ లోక మందని దేది యుండదు. కోకాముఖము కురు క్షేత్రము, నై మిషము, ఋషిసంగమము, వారణాసి, ప్రభా సము, బదరికాశ్రమము , రుద్ర కోటి, మి, తవనము నీ యెల్ల తీర్థ ము లందు పం!డ్రెండేండ్లకు గలుగు సిద్ధ పుషర మందు బ్రహ్మచర్యము మనఃపూర్వక మాచరించినచో నాలు మాసములలో సిద్ధించును. సందియము లేదు. తీర్థముల కెల్ల నుత్తమము. క్షేత్రముల కెల్ల నుత్త మమిది. బ్రహ్మ యేడ భక్తులగు వారెల్లరు పూజించునది.

 సావిత్రీ బ్రహ్మ సంవాదము

ఇక సావిత్రితో బ్రహ్మ కేర్పడిన వాదము పెద్ద దది నెప్పెద. సావిత్రి వెళ్ళగా నామెతో నెల్ల దేవతా స్త్రీలు వచ్చిరి. భృగు నుహర్షికి ఖ్యాతియందు జ న్మించిక ( భార్గవి) విష్ణుపత్ని లక్ష్మి పిలువ బడి యటకు తొందరగ వచ్చెను. మదిర మహాను భావురాలు. ఆణినది. విభూతు లిచ్చు యోగనిద. కమలాలయ  శ్రీదేవి విభూతి మొదలు పేర్కొనబడిన శుభ కుబేర ప్రియ దాక దేవ సుందర కన్యలు దానవస్త్రీలు వసు సత్నులు సప్త రుల భార్యలు ఋషిపత్నులు, రాక్షసులు  పితృకన్యలు లోక పూతలు వచ్చిరి. ఆడపడుచులతో సావిత్రి యట కేగ నిచ్చగించెను. ఆదితి మొదలుగ దక్ష కన్యలం ద రగుదెంచిగి. వారితో సాధ్వి బ్రహ్మాణి (సరస్వతి) కమలాలయ (లక్ష్మి) ఒకామె మోదకము (లడు) ఒకతె పండ్లతో నిండిన శూర్పము ( చేట) చేకొని బ్రహ్మదరి కెగిరి.

కందులు ఆనుములు మరి యితర ధాన్యములు చేకొని దాని న్ముపండ్లు మాడిపంములు బొబ్బర్లు కౌసుంబిక ములు (కందువులు) జీలకర్ర ఖర్జూరము పెసలు మొదలగునవి మంచి కొబ్బరికాయలు తీసికొని యొక తె వచ్చెను. ఇంకొక తె  ద్రాక్ష రస పాతము పిండి వంగి లు కర్పూరము నేరేడుపండ్లు అక్రోటములు= ఆక్రోటు అనుపండు ఉసిరికిపండ్లు నిమ్మపండు కొని యింకొకతె  మారేడుపండు ఆటుకులు దూదివత్తులు కుంకుమ పువ్వు రంగు వస్త్రములు, ఇవి మొదలుగా మటి సామగ్రి చేటల నింపుకొని, యందరు పుణ్య స్త్రీ లు పేరంటాండు సావిత్రితో తొందరగా వచ్చిరి.

ఆట వచ్చిన సావిత్రిని జూచి యిందుడు బెదరి ముఖము వంచి కూర్చుండెను, బ్రహ్మ యీమె నన్నే మనునో యను కొనెను. విష్ణువు, రుద్రుడు, మఱి యి తర బ్రాహ్మణ వర్గము సిగ్గు వడిరి. సభ్యులడలి పోయిరి. దేవతలు గూడ బెదరి. దేవతల కొడుకులు పౌ తులు మేనల్లుడు మేనమామలు అన్నదమ్ములు ఋభవు లను పేరి దేవతలు, దేవతలకు గూడ దేవతలు (ఋకవులసగా దేవతలలో నొక రకము వారు) సావిత్రి యే మనునో యని తెల్ల వోయిరి. బ్రహ్మ ప్రక్క నిలిచి గొల్లపిల్ల మౌసము పట్టె. యట సందరి పూట లాలించుచు సధ్వర్యుడు పిలిచినను నా సుందరి రాదయ్యెను.

ఇంద్రుడు తీసికొని వచ్చినాడు. విష్ణు వామె నిచ్చినాడు. రుద్రుడౌసన్నాడు. తండ్రి స్వయముగా నామెనూ  బ్రహ్మ కిచ్చినాడు. ఆమె యజ మందెలా యుండును ! యజ్ఞ సమాప్తి యెట్లోను? అని వా రా లోచించు చుండ యట లక్ష్మి. బ్రవేశించేను. బ్రహ్మ సదస్యులతో దేవతలతో వేదపారగు లయిన బ్రాహ్మణులతో జుట్టుకొని యున్నాడు. లేడికొమ్ము కొని మేఖలతో గొల్లపడుచు విశాలాక్షి పతివ్రత భర్త సూర్యప్రభ వలే నా (సభను) ప్రకాశింప జేయుచు నట నున్నది. ఋత్విజులు సగ్ని ని యాశ్రయించు కొనియున్నారు.

వేదపారగులు బ్రాహ్మణు లగ్ను లందు హోమములు చేయు చున్నారు. పత్నీశాలలో గోపి లేడికొమ్ము చేతగొని మౌంజీ మేఖల నడుమున జుట్టుకొని పట్టు జీర గట్టుకొని పర మపదమును ధ్యానించుచు పతివ్రత పతియే ప్రాణముగా గలది. రూపవతి “విశాలాక్షి” సూర్యుని వంటి ప్రథతో నట సదస్సు నుద్దీపింప జేయుచు ప్రధానముగా నట ప్రవేశింప జేయబడెను. అపుడు ఋత్విక్కులు ఇట తమ తమ చరువులందు పశుభాగము సందుకొనువారై యగ్ని నాశ్రయించు కొనియున్నారు. యజ్ఞ భాగము కోరి దేవతలపు డాలస్యమగుట గని యజ్ఞము కాలహీనము చేయగూడదు. చేసినచో ఫలమీయ దనుచుండిరి.

    రెఁడు భాగముల పాలతో గూడి నధ్వర్యునిచే కాచబడిన పురోడాశముతో నా బ్రాహ్మణులాహూతులై భక్ష్యము  (పురోడాశలో) సిద్దమ నేయబడగా సావిత్రీ దేవి చూచి రోషము గొని యా సదస్సులో మౌనము వట్టి కూర్చున్న బ్రహ్మను గూర్చి యిట్లనియె.

 సావిత్ర్యువాచ

 సావిత్ర్యా శాపదానం

ఇదేమి దేవా ! చేయరాని పని చేయదగునా ? నన్ను విడిచి రామమున నీ పాపము సేసితివి. నా పాదధూళి లేని సరికాని యిది యిట తలగా (ఆగస్థానీయగా) జేయబడినది. ఈ యజ్ఞ సదస్సునందు సమా వేశ మై యున్స్ జన మేల్ల భూతముల కీశ్వరులై న వారియాజ్ఞ నిషమేని యొనరింపుము. అందము పై నాసవడి లేక నింద్య మీ పని తాము సేసినారు. స్వామీ ! నీ పాడు పనిచేసి కొడుకులలో మనుమలలో పది మందిలో తమకు సిగ్గు లేదా ? ఇది తమ వశమున జేసితివనుకొందును. దేవతలకు సీవు తాతవు. ఋషులకు ముత్తాతవు. నీ మేను జూచుకొన్న నీకు సిగ్గేట్లు కలుగా లేదు. నలుగురిలో నీ నవ్వు పని చేసితిని. నేనా ఆపకారము చేయబడినాను ప్రభూ ! ఇదే నిశ్చయమైనచో నుండుము ! దేవా ! నీ కిదే నమస్కారము . పులస్త్యు డనియె. ఇట్లని కినుక గొని బ్రహ్మను శపింప లేచేను.

నే జేసిన తపస్పుస్న చో నే గొలిచిన గురువు యున్న చో ఎల బ్రహ్మ సమూహము లందు వివిధ స్థానములందు ఎల్ల విపుల మనము లేప్పుడు నీకు పూజ సేయనే మేయరు గాక ! ఒక్క కార్తిక పూజ సాంవత్సరిక ము (సంవత్సర మున కొక సారి) మాత్రము చేయుదురు.

బ్రహ్మ నిట్లని దగ్గర నున్న యిందుని గూర్చి ఓ ఓ ఇంద్ర ! నీ చే నీ గొల్లగి బ్రహ్మద రికి గోని రా బడినది. ఈ పాడు పని చేసితివి. కావున దీని ఫల మనుభవింతును. సముద్ర ము నడుమ నీ వున్న పుడు శత్రువులచే బంధించి కొని పో బడి పరమ నీ చదశ పాలగుదువు. వట్టి దరిద్రుడవు. దుర్బలుడవై శత్రువుల నగర మం దుండి తొందర లో ఘోర పరాభవము పొంది వెంటనే విడువ బడు దువు.

దేవి యింద్రు నటు శపించి విష్ణువు గూర్చి యొక మాట యనెను. భృగు మహర్షి మాటం బట్టి మర్త్య లోక మందు నీకు బుటు వైనపుడు భార్యా వియోగ దుఃఖ మప్పుడే నీ వనుభవింతువు. నీ శత్రువుచే నీ పెండ్ల మదహరింప బడి సముద్ర మవలీ యొడ్డున నుండును. అట్లు కొని పోబడిన యా మేను నీ వేణుగవు. శోకము చే తెలివి దెబ్బతిన తమ్మునితో గూడ కిష్టము సాలై యావద గోనీ యేడువు. యదుకుల మందు కృష్ణుడను పేర బుట్టి పశువులకుదాసుడవై చిర కాలముతిరిగెదవు. అని శపించెను.

ఆ పై రుద్ర ని గూర్చి కోపించి దారువన మందు నీ వున్నపుడు ఋషులు క్రోధులై హరా ! నిన్ను శపింతురు. ఓరోరి !  కాపాలిక ! ముద్రా ! మా ఆడు వాఁడను హరింప గోరి న పుకు పొగరెక్కిన నీ యీ లింగము నేల పాలగును. మగ తనమువోయి నీవు ముని శాపమున పీడ నొందెదవు. గంగాద్వార మందున్న మీ యావిడ ఆప్పుడు నిన్నో దార్ప గలదు. ఆగ్నీ ! నీవు సర్వ భక్షకుడవు. ధఠ్మనిత్యుడు భృగువు శాపమున సర్వ భక్షకుడవై తివి. కాల్ప బడిన నిన్నే  నెట్లు కాలును ? జాతవేద ! నీ నుండి వేదములు పుటినవి. నిన్నా రుద్రుడు రేతస్సుచే ముంచెత్తును. ఆ మేధ్యము లందు నీ నాలుక మఱి ప్రజ్వలింప గలదు.

సావిత్రి బ్రాహ్మణులను, ఋత్విక్కులను నిట్లు శపించెను. మీరు చేయి చాచుట కే యగ్ని హోత్రము. తీరి కూర్చుండి . అడవుల నివాసము. తీరాలు తేలాల సేవ కేవలము నాసకు లోనయి సేయుదురు. పరాన్న ములందు మీకు తృప్తి . స్వగృహ మందతృప్తియే. యజింప పనికి రాని దానిని యజింప జేయుట, సచుని వలన నీచమైన దానములు పట్టుట. ధనార్ల నము  వ్యయము కూడ, వట్టి వృధ. ప్రేతలది సేయుదురు. (ప్రేతకర్మ నిమితము). ఇట్టింద్రాదుల శపించి బ్రహ్మను. బ్రాహ్మణులను గూడ అందఱిని శపించెను.

ఆ పై నామె జేష్ట పుష్కరము చేరి యట నుండెను. అప్పుడు పతి, వత లక్ష్మిని, యింద్ర పన్నినీ శచిని, యట నున్న అణులం గ్చూ ఈ సదస్సు నంది నుండ ను, ఈ ధ్వని వినబడని చోట నుం దు సని యె. ఆంతట నా యువతులు . తమ తమ యిండ్లకుం జనిరి. సావిత్రి కోపించి వారల శపింప నుద్యమించెను.

షావిత్య్రువాచ :

నన్నెందులకు విడిచి పోయి రందులకు దేవతాస్త్రీలకు గూడ శాపమిత్తునని, లక్ష్మి నిలు ని నొక్క చోటుండదు. ఆ నీచురాలు చపలచిత్తురాలు, మూర్ఖులందేయుండును. మ్లేచ్చులు, పొగరుబోతులు, శాపగ్రస్తులైన  దురాత్ముల నేడ నీరునికి యగునని శపించెను. ఆ పై నింద్రాణినీ శచీదేవిం గూర్చి యిట్లనియె.

నీమగ డింద్రుడు బ్రహ్మ హత్యకు జిక్కి యేడ్చు చుండగా నహుషుడు రాజ్య మపహరింప నీను జూచి యిట్లడుగు కొన గలడు. నేను ఇంద్రుడను. ఈ నీచురాలు నా దరికి రాదేమి ? నేను శచిని బొంద నేని యందరు దేవతల సంహరింతునని ఆనినంత నీ వపుడు దూరమై దుఃఖించి నాశాపమున గర్వ మెక్కిన నీవు బృహస్పతి యింట దల దాచు కొందువని శపించెను. ఆపై దేవ భార్య లందఱిని సంతాన నిమితమైన ప్రీతి మీ కుండదు. గొడ్రాళ్ళ పేర రేయింబవలు వగలువడుచు దూషిత లౌదురని శపించెను. ఇట్లు గౌరీ దేవియు సావిత్రిచే శపింప బడి యేడ్చుచుండ చూచి విష్ణువుచే విశాలాక్షి ! ఏడువకుమమ్మ ! రా ! యిటురా. కల్యాణి ! దీక్ష సేకొనుము. బ్రహ్మాణి= సరస్వతి నీ సళం బ్రవేశించి దీక్ష గైకొనుము. నీపాదములకు ప్రణమిల్లెద ననెను. విష్ణువు మాట విని నీ మాట నే జేయను. ఆక్కడకు నే బోను. ఆ ధ్వని కూడ వినను. అని యటనుండి కొండెక్కి నిలిచెను. విష్ణు వాదేవి ముందు నిలువ బడి చేతులు మొగిచి వ్రాలి మొక్కి పరమ భక్తి నిట్లు స్తుతించెను.

 విష్ణు కృత సరస్వతీ స్తుతి

 దేవీక్షేత్ర తీర్థప్రశంసా

నీ వంతట నన్ని భూతములందున్నావు. అంతట నద్భుతవయి దర్శింప దగి యున్నావు. ఉన్నది లేని దేది కల దది యెల్ల నీవు లేనిది లేదు. అయినను స్థితి నంద గోరువారి యే స్థానము లందు కనబడుదువు. తలచినదగు దువు. అణిమాది విభూతులు కోరు వా రెట్లు సేవింపవలయు నది నీ ముందు వచింతును.

 ఫలశ్రుతి

 క్షేత్రతీర్థ సేవా ఫలశ్రుతి

ఈ క్షేత్ర తీర్థముల జపించి నతడు విన్న తడు సర్వ పాప విముక్తు డగును. ఇట స్నానము సేసి ఆకల్పముబ్రహ్మ పుర మందుండును. ఆష్టోత్తరశతనామములు బ్రహ్మ సన్నిధిని పుష్కర క్షేత్రమందు పూర్ణిమ నాడు పఠించి విని బహుపుత్రవంతు డగును. గోదాన సమయ మందు శ్రాద్ధ దాన మందును ప్రతిదినము దేవతార్చనమందు గాని విన్న చో బ్రహ్మ సాయుజ్య మందును. ఇట్లు స్తుతింప బడి సావిత్రి విష్ణువుతో నాయనా చక్కగా నన్ను స్తుతించితివి. నీ వజయ్యుడ నౌదువు . కృష్ణావతార మున నీవు పత్నులతో తలిదండ్రుల య దెంతో వల్ల కుడ నౌదువు. వెళ్ళి బ్రహ్మ యజ్ఞమును సమాప్తి నందింపుము. కురుక్షేత్రమందు ప్రయాగ యందు నన్న దాయిని నె భర్త సమీపమందుండి నీ వన్నది నేనేదను అని పలుక విని విష్ణు బ్రహ్మ దగ్గజ కేగెను. సావిత్రియు నేగె. నంత గాయత్రి యిట్లనియె.

గాయత్రియనియె

భర్త సన్నిధి నేను సంతోషించి యో ఋషులారాః వరమీయ నుద్యమించి పలుకు పలుకులు వినుడు. భక్తి తో బ్రహ్మను బూజించు వారికి ధన ధాస్త్ర వ స సమృద్ధి సుఖము నింటిలో పుత్ర పౌత్రాదిక మెడ వడక కలుగును. ఆదేల్ల యనుభవించి మోక్షమందురు.

పులస్త్యు డనియె :

విధి విధానముగ బ్రహ్మను ప్రతిష్ఠించినచో సర్వ యజ్ఞ తవ స్త్రీర్ధ స్వాధ్యాయ ఫల మొక దిగుణిత మగును. పౌర్ణమాని నుపవాస ముండి పాడ్యమి నాడు బ్రహ్మార్చన చేసి బ్రహ్మ సాలోక్య మందును. బ్రహ్మను విష్ణువును ఋత్విక్కు లతో చర్చించి కార్తిక పూర్ణిమా సావిత్రితో బ్రహ్మ నర్చించి రథ యాత్ర మంగళ వాద్యములతో నేయింపవలెను. రథము మీద శాండిలేయునీ బూజింప నగును. రాత్రి జాగరణము నేన । జొహ్మణులచే పుణ్యాహవాచనము సేయించి భోజనము పెట్టి, బ్రాహ్మణులచే వేద స్వస్తి చెప్పించి రథము నగర మంతయు త్రిప్ప వలెను. ఋగ్యజుస్సామాధర్వణ మంత్ర పఠనములతో ప్రదక్షిణముగ త్రిప్ప వలెను. శూద్రులు రథము లాగ వచ్చును. కాని పై కెక్క రాదు. రథము నడపువాడు ఎక్క వచ్చును.

బ్రహ్మకు కుడి వైపు గాయత్రి దేవికి ముందు తామర పూవు నుంచ వలెను. ఇదంత యైన తర్వాత రథమును సిరాజన మిచ్చి యథాస్థానము నిలుప వలెను. ఈ రథ యాత్ర చేయించిన చూచిన లాగిన పుణ్యాత్ముడు బ్రహ్మ స్థాన మందును. గంథ పుష్పము లతో నూతన వస్త్రములతో పాడ్యమి నాడు ఆత్మను (దనను) పూజించు కొన్న తడు ను బ్రహ్మ పద మందును. ఈ కార్తికామావాస్య మహా పుణ్యతిథి బాలేయి యనబడును. బలి రాజ్యారంభ మిందే జరిగినది. బ్రహ్మకు మిక్కిలి ప్రియము. బ్రహ్మను తనను నర్చించి నతడు విష్ణు సాలోక్య మందును.

మహాబాహువులు గల భీష్మా చౌర్యా ! చైత్ర శుద్ద ప్రతివత్తు (పాడ్యమి) 12 మాసముల ప్రతిపత్తులలోకెల్ల శ్రేష్ట మయినది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కుక్క మాంసము తిను (శ్వపచుని) చండాలుని ముట్టుకొని మానవుడు స్నానము జేయ వలెను. రాజా ! ఆట్లు ముట్టుకొని స్నానము జేసిన వానికి సమ స్తపాపపరిహార మగును.

        ఆది (మానసదుఃఖము) వ్యాధులు (శరీర దుఃఖములు) గలుగవు. గాన ఓ నరశార్దూలా ! చండాలుని ముట్టుకొని స్నానము జేసినచో అది దివ్య నీరాజనము. శుభప్రదము, సర్వరోగ వినాళ కరమై యున్నది. ఆ రోజున గోమహిష్యాదు లేమున్న ను కరణము దున్నుట) చేయించవలెను. మరియు సమ స్త నూతనవ సములతో బాహ్య భాగమున తోరణములను అలంకరించ వలెను. కురు కులోద్భవా ! ఆ రోజున బ్రాహ్మణ భోజనము జేయించ వలెను. పూర్వము మూడు ప్రతివత్తులు ప్రసిద్ధములైన విగా జెప్పబడినవి. అవి యేవనగా చైత్ర, ఆశ్వయుజ, కార్తిక , శుద్ద ప్రతిపత్తులు. రాజా ! ఈ మూడు తిథులయందు స్నాన, దానాదులు నూరు రెట్లు ఫలము గలుగ జేయును. ఈ మూడిటిలో కార్తీక శుద్ధ ప్రతిపత్తును బలి చక్రవర్తి రాజ్యము జేసిన తిధిగా వామనమూర్తి వర మున్నందున “బలి ప్రతిపత్తు” అని యందురు. ఈ తిధి యందు చేయు స్నాన, దానాదులు శతగుణము లగును. పశువులకు హితకరమై యున్నది.

బ్రహ్మదేవా ! సావిత్రీ దేవి యిచ్చిన శావముచే బ్రాహ్మణులు నీకు పూజ జేయరు. నా వచనమును విని అర్చనము జేసినచో ఇహమందు భోగభాగ్యము అనుభవించి పరమున మోక్షము బొందుదురు. ఇది తెలిసికొని నీవు సంతుష్టుడవై కోరిన వరముల నిచ్చెదవు గాక. దేవేంద్రా ! నీకు వర మిచ్చెదను. నీవు యుద్దమందు శత్రువుచే జయింప బడి కారాగార మందున్న సమయమున బ్రహ్మ దేవుడు శతృ గృహమునకు వచ్చి నిన్ను విడిపించు గాక. తరువాత ముల్లోకములందు నిష్కంటక మగు మహారాజ్యము ననుభవించెదవు గాక. విష్ణుదేవా ! భూలోకమున నీవు ఆవతరించి నపుడు నీ సోదరసపాత ముగా భార్యాపహరణాది దుఃఖము ననుభవించవలసి యుండును. అట్లయినను, శత్రు నంహారము జేసి దేవతల సమక్షంలో మరల నీ భార్యను నీవు బొందుదువు గాక. ఆమేను గ్రహించి పదకొండు వేల సంవత్సరములు రాజ్యము జేసి వైకుంఠము నకు బోయెదవు గాక. లోకమందు ప్రఖ్యాతిని బొందెదవు గాక. జనులు నిన్ను ప్రేమించుదురు గాక. ఆ జనులందరికి  “సాంతానిక ” నామకములయిన లోకములు గలుగు గాక. దేవా ! లోకమందలి మానవులు రామ రూపుడవయిన నీ చేత తరించెదరు గాత.

తరువాత గాయత్రీ దేవి రుద్రుని జూచి యిట్లనెను. శంకరా ! నీకు లింగపతనమయినను యేమానవులు లింగపూజ చేయుదురో అట్టి పుణ్యకర్మలు జేసినవారు పవిత్రులై స్వర్గలోకమునకు బోవుదురు. లింగార్చన జేసిన వారికి అగ్నిహోత్రపూజ, క్రతువుయందు హోమములు జేసివారికి లభించని యుత్తమగతులు గలుగును. గంగాతీరమందు ప్రాతఃకాలమున బిల్వపత్రములతో లింగపూజ జేసినవారు రుద్రలోక ప్రాప్తి గలవారగుదురు. శంకరభక్తుడయినవాడు పావను డవుతాడు. రుద్రా ! పరమ పావనుడవు. నీవు ప్రీతిని బొందినచో సమ స్తదేవతలు తృప్తి ని బొందుదురు. దేవతలు నీ ముఖముతో హవిస్సులను భుజించుచున్నారు. ఇట్లు వేదోక్తవచనముగాన సందియబడ నక్కర లేదు. తరువాత గాయత్రీ దేవి బ్రాహ్మణులగురించి యిట్లు బలికేను.

బ్రాహ్మణులారా ! మానవులు మిమ్ములను సర్వతీర్థ క్షేత్రములందు తృప్తిబొందించినచో వై రాజాఖ్యపదములను బొందుదురు గాత ! మానవులు బ్రాహ్మణులను శ్రాద్ధకర్మలయందు తృప్తిగా వించినచో దేవతల కెల్ల దేవతలగుదురు. దేవతలు బ్రాహ్మణ శ్రేష్టలయినవారి ముఖములందు యివ్వబడిన హవ్యములను భుజించుదురు. పితామహులు కవ్యములను భుజించుదురు. ముల్లోకములను ధరించు శక్తి గలవారగుదురు గాక. ఒక  ప్రాణాయామముతో పవి తులగుచు న్నారు. ద్విజోత్తములారా! పుష్కర క్షేత్రమందు విశేషముగా స్నానము జేసి వేదమాతయగు నన్ను జపించిన యడల ప్రతిగ్రహమువలన వచ్చిన దోషములను పొందకుందురు గాక. పుష్కర క్షేత్రమందు అన్న దానము వలన సర్వ దేవతాతృప్తి గలుగును. ఒక బ్రాహ్మణుని భుజింప జేసిన యడల కోటిగుణితఫలము గలుగును. ద్విజులారా ! మానవులు మీ హస్తములందు ధనము సమర్పించినచో బ్రహ్మహత్యాది సమ స్తదురితములు నశించును. మూడుసార్లు నా గాయత్రీ మంత్రమును జపించినచో బ్రహ్మహత్యా సమానపాపములు పరిహారమగును.

నూరుసార్లు గాయత్రీమంత్రము చేత పూర్వము జేసిన పదిజన్మల పాపము నశించును. ఆఱువేలగాయత్రి మంత్ర జపము జేసిన సమ స్ర కిల్బిషములు నిశించును . విశేషించి త్రిమాత్రయుక్త ప్రణపముతో సువరోం అంతమగు శిరస్సుతో జపించినయడల నా ఆనుగ్రహముచే నందరు పవిత్రులగుదురు. సందేహము లేదు. నేను అష్టాక్షరస్థితురాలను. జగత్తు నంతయు వ్యాపించి యున్నాను. నేను సమస్త వేదములకు తల్లిని. సర్వపదములకు అలంకరింపబడినదానిని. ద్విజస తము లారా ! నన్ను భక్తి తో జపించి సిద్ధిని పొందగలరు. ఈ నా మం తము మీ యందరికి అన్ని మంత్రములకన్న ముఖ్యమై నదిగా కాగలదు. ఒక  నాగాయత్రీ మంత్రము మాత్రమే జపించు నాతడు బ్రాహ్మణులందరిలో శ్రేష్ఠుడగుచున్నాడు. నాలుగువేదములు చదివినను, సర్వభక్షకుడైనను, సర్వవిక్రయి అయినను, గాయత్రీ మంత్రజపముచే ధన్యుడగుచున్నాడు. సావితీదేవి శాపమిచ్చినను నా మంత్రజపముజేసినవారికి సావిత్రీ దేవి శాపము ఫలించదు. గాయ, శ్రీమంత్రానుష్టానపరులు జేసిన దాన హోమాదులు సర్వము అక్షయములగుచున్న వి. త్రికాలములందు హోమములు చేయు అగ్నిహోత్ర వరులగు ద్విజులు యిరువదియొక్క శతముల వారితో సహా స్వర్గ లోకమున కేగుదురు. గాయత్రి ఈ విధముగా ఇంద్ర, విష్ణు, రుద్ర బ్రహ్మ, అగ్ని, బ్రాహ్మణులకు ఆ పుష్కర క్షేత్రమందు ఉత్తమ వరముల నిచ్చి బ్రహ్మదేవుని సమీపమునకు బోయెను.

లక్ష్మి మొదలుగా గల ఆందరు శాపకారణమును తెలిసికొనిరి. బ్రహ్మదేవునికి ప్రియురాలయిన గాయత్రి దేవి వారందరికి వరముల నిచ్చెను. గాయత్రి దేవి లక్ష్మీ దేవికి యిట్లు వరమిచ్చెను. లక్ష్మీ నీవు న్యాయార్జిత ధనములతో అందరిని సంతోషింప చేసెదవు గాక. లక్ష్మీకటాక్షము గలవారందరు పుణ్యాత్ములు. నీ క టానములేనివారు దుఃఖముల పాలగు దురు. నీ కటాక్ష మున్నవారలకు, జాతి, కులము, శీలము, ధర్మము ప్రకాశించును. ఓ ! వరాననా ! సభలో రాజుల చేత గౌరవింప బడుదురు. ద్విజోత్తములు, అట్టి వారి నుంచి యాచన గూడ చేయుదురు. అట్టివారిని సుజనులుగా భావింతురు. ఆట్టి ధనవంతులను, తల్లి, తండ్రి , గురువని దలంతురు. నీవు లేనిచో జీవించ లేమందురు. నీ చూపు మాయందు ప్రసరిం చినచో మేము ధన్యులమగుదుము. మా మనస్సులు అత్యంతము ప్రనన్నముగా నుండును. సత్యముగా జెప్పుచున్నాము. సజ్జనులు ఈ వాక్యములు జనములకు ప్రీతిదాయక ముగావింతురు. లక్ష్మి ! నీ కటాక్షమున్న చో ఎట్టివారలయినను గొప్పవార అగుదురు గాత ! శచీదేవీ! నహుష మహారాజు, యింద్రపదవిని బొంది నిన్ను పత్ని వి గమ్మని ఆర్దించును. ఆ పాపాత్ముడు అగ స్య వచనముచే నీ దృష్టి సోకి సర్పత్వమును బొందును. పిమ్మట అగస్త్యుల వారిని మునీశ్వరా రక్షించమని శరణు బొందును. అప్పుడు భగవానుడైన అగస్త్యమహర్షి ఆ రాజుమాటకు కరుణగలవాడై ఇట్లు బలికెను. ఓ నహుష  మహారాజ్ నీ వంశమందు కులోద్ధారకు డగు నొకడు జన్మించును. ఆతడు సర్పరూపుడవయిన నిను శాపమునుంచి విముక్తిని బొందించ గలడు. అప్పుడు సర్పరూపము విడిచి స్వర్గమునకు బోగలవు. శచీదేవీ ! ఇట్లు నహుషునికి శాపవిమోచనము చేయును. సులోచనా ! తరువాత నా వర దానప్రభావముచేత నీభర్త తో ఆశ్వమేధయాగము చేసి తిరిగి స్వర్గ లోక ప్రాప్తి యగుగాత. పులస్త్యుడనియె

ఇట్లు వరములనిచ్చిన తదుపరి సమస్త దేవపత్నులకు సంతాన హీనులైనను దుఃఖము గలుగకుండునట్లు వరమిచ్చెను. గాయత్రి శారదాదేవిని గూడ వర దానము చే సంతుష్టపరి చెను. బ్రహ్మ దేవునికి ప్రియురాలై న గాయత్రీ దేవి యజ్ఞ సమాప్తి ని కోరుచుండెను. రుద్రుడు వరదురాలైన వేదమాత గాయత్రినిజూచి నమస్కరించి ఈ విధముగా స్తుతించెను.

రుద్రకృత గాయత్రీ స్తుతిః

 రుద్రకృత గాయత్రీస్తుతి

ఈస్తోత్రము పారాయణార్హము. ఉపదేశమునకు అర్హమయినది గాన ఈ అధ్యాయాంతము వరకు వున్న శ్లోకార్థము అనువదించుట యుక్త ము గాదనితోచి వదిలివేయబడినది. ఆసక్తి గలవారు యోగ్యులైన పండితులచే తెలిసికొన గోరుచున్నాను. అర్థము తెలియకపోయినను గాయత్రీస్తోత్రము పారాయణము జేసికొనవచ్చును.

ఇట్లు శ్రీపద్మపురాణమున సావిత్రీ వివాదమునందు గాయత్రీ వరప్రదానము గాయత్రి స్తోత్రము అను పదునేడవ అధ్యాయము.