పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
4 - సముద్రమథనప్రస్తావే దుర్వాసస ఇంద్రాయ శాపదానమ్ !
భీష్ముడనియె. లక్ష్మి పాలనముదమందు బుట్టెనని విన్నాను. ఆమె భృగువునకు ఖ్యాతియనుభార్యయందు జనించెనని నీవెట్లు పలికితివి? దక్షకన్య పరమకల్యాణి మే నేలవిడిచెను? ఆమె మేనయందేట్లు జనించెను. హైమవతిని (హిమవంతుని కూతురును) దేవదేవుడెందులకు భార్యనుగ జేసికొనెను? ఈశ్వరునికి దక్షునితో వైరమేమి? తెల్పుము. అన పులస్త్యుం డిట్లనియె.
పులస్త్య ఉవాచ !
రాజా! ఇది వినుము. శ్రీదేవి అవతారము బ్రహ్మవలన విన్నాను. అత్రి కుమారుడు దుర్వాసుడు భూమి నంతట నంచరించి, ఒక విద్యాధర శ్రీ చేతనున్న సువాసన నించుచున్న " పూలమాలంగని “నా జటాజూటమున ధరింతు నీది నాకిమ్మనీ" యడిగెను. ఆమె సంతోషముతో దాని నాతనికిచ్చెను. అది చేకొని చిర కాలము దాని సొంపుగొని వెళ్లిసంతోషముతో నిట్లనుకొనెను. “ఈ విద్యాధరకన్య వీవోన్నతపయోధర. శోభగుల్కు నగలతో సౌభాగ్యముతో నాకు గనిపించినది. అప్పటి నుండి నా మనసు సంక్షోభమందున్నది. నేనా కామప్రవృత్తి లేనివాడను. నా యందము ప్రదర్శించుచు నేనింకోక యెడ కేగెదనుగాక” అని భూమి యంతట దిరుగాడెను. ' అవ్వల మూడులోకములకధిపతి శచీపతి యైరావతమెక్కి యింపుగుల్కుచు వచ్చుచున్న నాతని జూచి గండుతుమ్మెదలు ముసరుచున్న తనతలమీడియాలను వెచ్చివాని యట్టాయింద్రునివైపు వినరేను, అది చేకొని దేవవతి ఏనుగుతల వైకి విసరగా నామాల కైలాసమందున్న గంగవలె శోభించేను.
ఏనుగ్లోవాసనగ్రహించి - మదముచే కన్ను గానక తొండమెత్తి యందుకొని - యామాలను నేలను వైచికొట్టెను. అంతట కోపమెచ్బి యమునిపుంగవుడు దేవేంద్రునింగని ఓ దుష్టుడ! ఐశ్వర్యముచే మదమెక్కి మిక్కిలి మొద్దువారితివి. లక్ష్మికి స్థానమైనది నేనిచ్చినది యీ మాలను నీ వభినందింపవై తివి. ఇందువలన నో మూర్ఖుడ ! నీ తిభువన సామ్రాజ్యసంపద నష్టమగునుగాక! అందువలన నీ పాలనలోని యీ ముల్లోకములుగూడ లక్ష్మీహీనము. లగును. ఎవడు కోపించిన చరాచర ప్రపంచము. హడలిపోవునో అట్టి నన్ను మిక్కిలి పొగరెక్కి యవమానించితివి. అన విని దేవేంద్రుడు ఐరావతమునుండి సత్వరమడిగి పరమపుణ్యుని దుర్వాసుని బ్రతిమాలుకొనెను. అడుగుల వ్రాలి యిందు డెంత , వేడికొనినను నేను క్షమింపను, వలుమాటలేలయని యవ్విపుడు వెళ్ళిపోయెను, దేవరాజును నైరావతమెక్కి యమరావతి కరిగెను. నాటినుండి యింద్రునితో బాటు భువనత్రయము సిరిదరిగి వెలవెలబోయెను, యజ్ఞములు సాగుటలేదు . అవసులు, తపస్సులు సేయరు. దానములు లేవు. ధర్మములు లేవు. జగత్తు నష్టప్రాయమయ్యెను.
ఇట్లు జగత్రయ మత్యంతని శ్ర్మీకమయి సత్తువ గోల్పడ దైత్యదానవులు దేవతల పై దండయాత్ర సాగించిరి. ఇందాదు లోడిపోయి ఆగ్ని పురస్పరముగ బహ్మను శరణండిరి. . పూసగుచ్చినట్లంతయుండెల్ప విని యవ్విది. వేల్పులతో పాలకడలియొడ్డునకేగి వావుదేవు నుద్దేశించి విష! లెమ్ము లెమ్ము దేవతలకు పాతము సేయుము. నీవుదప్ప నెల్లదేవతలము . దానవుల" కోడిపోయినాము. అనవినీ పురుషోత్తముడు వెలవెలపోయిన సురలఁగని మీకుమరల తేజస్సు పెంపొందింతును. మీరు దైత్యులతో జతగూడి సకలౌషధులను క్షీరసముద్రమందుంచి మందరగిరిం గవ్వము సేసి వానుని తరితాడు గావించి నేను నహాయుడుగా అమృతముకొఱకు మధింపుడు. కార్యావసరముగ మంచిగ మీరు నీవనిలో నమానఫలభోక్తలు గండని లాలించెను. ఆట్లుతచ్చినంత నందమృతము పుట్టును, దానిం దాని మీరు బలలురు నమరులునగుదురు. సుదద్వేషుల కమృతము దక్కకుండ క్లేశమే. మిగులునట్లు నేనంతయుం జేసెద నన సురవెల్లరు నసురులతో సంధిచేసికొని యమృతముకొఱకు యత్నము -సేసిరి,
దేవతలు దైత్యులును ఓషధులనెల్ల శరత్కాలమేమమట్లు తెల్లగనున్న పాలకడలిలోనికి వినతి మందరాడిం గొని మధింప నారంభించిరి. మొదట రాసుకితలనున్న దేవతలను తోకకుమారి 'మొదట తోకను పట్టు కొన్న రాక్షసులను దలవైపున బట్టుడని హరినీయోగించెను. పాములకు విషము తలనుండునుగావున వాసుకి ఫణామండ లము రాపిడిగొన్న కొలది విషజ్వాలలు ఊగినంత నామంటలకు దైత్యులు నిస్తేజస్కులైరి. తోకచైపుననున్న దేవత లావైపున కమ్మిన మేఘములచే జల్లనిగాలిచే నాప్యాయతులైరి. క్షీరాబ్దిమధ్యమందు బహ్మయు శివుడును విష్ణువు వృష్ణమందుండిరి. ఆయన మందరగిరిని పద్మమునట్లు - రెండుబాహువులచేబట్టి. వాసుకి రూపమైనతాటింజుట్టి దేవదానవులనడుమ నిల్చి. సముదములోపల కూర్మరూపియునై మఱియొక తేజస్సుతో (రూపముతో దేవతలకు బుజ్జికూర్పుచునుండెను.అట్లుతుపబడుచున్న పాలసముదంనుండి హవిర్హానియు సురపూజితయునైన సురభి కామధేనువు) మొదట యావిర్భవించెను, దేవదానవులానందభరితులైరి. మావిర్ధాని= మావిస్పునుంచుపాత్ర (స్థితి)
అందరును మనస్సులు చెదరి చూపులు . లజ్జీనిలిపి యిదేమని' సిద్దులు ఆలోచించుచుండ మత్తుచే దిరుగుడు వడుచూపులతో వారుణియను వొకానొక శక్తి యావిర్భవించెను. అడుగడుగున తూలుచు వొంటివలువతో జుట్టు విరబోసికొని కనులెరుపుంగొన నేను ఐలమునిచ్చు దేవతను. వారుణియను దానను. దానవులారా! నన్ను గైకొనుడు'' అని పలి కెను. దేవత లామె యకుటియని వదలివేసిరి. దైత్యులామెను గ్రహింపగనే యామె మద్యమయినది. మణికొంత చిలుకగా దేవతల భాగ్యమై పారిజాతము జనించి నందనవన మలంకరించెను. మఱియు రూపౌదర్యాది గుణనంపద్యుతమై అరువణికోట్ల యప్పరోగణ మావిర్భవించెను. వారందరు పుణ్యజీవులు దేవదానవులచేత గౌరవింపబడిరి. పుణ్యాత్ములందరు నమానముగా ననుభవింపదగినవారు. ప్రీతికల్పించు చలువలరేడు (చంద్రుడు)పుట్టెను. నాజడలలో భూషణము గావలెనని యాచంద్రుని శంకరుడు కోరెను. బ్రహ్మ అందులకనుమతించెను. అవ్వల భయంకరమైన కాలకూట విషము పుట్టెను. దానిచేత దేవతలు రాక్షసులు నుడికిపోయిరి. పరమశివుడుదానగైకొని దావేను. ఆ దాగిన విషము కడుపులోనికి టోకుండ కుత్తుకంబట్టి యుండుటచేత నమ్మ హేశ్వరుడు నీలకంఠుడయ్యెను. మిగిలిన యా గరళమును నాగులు లావిరి
- ధన్వంతర్యాద్యవతారములు -
అవ్వల అమృతపూర్ణకుంభముం జేకొని తెల్లని వస్త్రములందాల్చి ధన్వంతరి యాపర్బవించెను. ఆవైద్య రాజుం దర్శించి వారందఱు న్వర్థచిత్తులైరి. అటు పై నుచ్చైశ్రవ మను గుఱ్ఱము - ఐరావత మను నేనుగుం జనించినవి. అంత వికసించిన తామరపూవుగద్దెపై గూర్చుండి మహాద్భుత ప్రభతో బద్మముజేతదాల్చిపాల్కడలినుండి శ్రీదేవి అవతరించెను. మహర్ప లానందభరితులై నాతల్లిని శ్రీ సూక్తముతో స్తుతించిరి. ఆమేముందు విశ్వావసు ప్రముఖులైన గంధర్వులు.. పాడిరి. ఘృతాచి ప్రముఖులైన యప్పరస లాడిరి. గంగాది నదు అమెస్నానార్ధము మేతెంచిరి. దిగ్గజములు కుంభస్థలముల స్వర్ణకుంభమున : స్వచ్ఛజలములంగొని సర్వలోకేశ్వరియైన. యా దేవిని స్నానమాడించినవి. క్షీరసాగరుడు స్వయముగ వాడని వద్మమాల నా దేవికి గానవెట్టెను. విశ్వకర్మ యా మంగళ దేవత యంగములను మంగళాభరణముల నలంకరించెను. సుస్నా తయే దివ్యమాలలు దాల్చి దివ్యాభరణభూషితయైన యా కన్యకం గని యిందాడి దేవతలు, విద్యాధరులు. పన్నగులు, దానవులు మహాదైత్యులు గుహ్యకులు ఎవరికి వారు 'మాకు మాకని యభిలషించిరి. అంతట బహ్మ “వాసుదేవ! నేనొసంగెద నీకెను నీవే స్వీకరింపుము, నేను దేవతలను దానవులను వారించితిని. నీవీమె యెడ జూపిన వలపునకు నేను సంతుష్టుడనైతిని, దేవీ! నీవు విష్ణువును బొందుము. నేనొసంగిన స్వామిం గైకొని యనంతకాల మానందింపుము" అని నుతట నెల్ల దేవతలు చూచుచుండ నా లోకమాత హరి వక్ష స్థల మ్మ లంకరించెను. మఱియు నా దేవుని గని “నన్నెన్నడూ విడువవలదు. నీ యాజ్ఞ నొనరింతును, సర్వజగ ద్వల్లభుడైన నీ వక్షోభాగమున వసించెద" ననయ. అవ్వల దేవతలు విష్ణు వక్ష స్థలము నందు లక్ష్మి వేసిన పూలమాలం గని యమితానంద భరితులైరి.
విష్ణువునకు బెడమొగము పెట్టినవారై విపత్తి మొదలగు రాక్షసులు లక్ష్మిచే విడువబడినందున మిక్కిలి యాందోళన ముదిరి. ఆవ్వల ధన్వంతరి చేతనున్న అమ్చతమును పాపబుద్దులే లాగికొనిరి. అప్పుడు విష్ణువు మాయంగొని శ్రీ రూపముం దాల్చి జగన్మోహినీ రూపమూని) దానవులంగని 'అమృత కమండలువును నాకిండు. మీకు - లోబడి నేను మీ యింట నుండేద"నన హౌరా తిలోక సుందరింగివి యామె. శరీరము నర్తించి లోభవతులై యమృతము నామెకిచ్చి ముందు నిల్పి చూచుచుండిరి. ఆమె యడి గోహించి దేవతల కిచ్చెను. ఇందాసుర గణము దానిం దావిరి.
రాక్షసు లాయుధములంగొని దేవతలపై నెత్తిరి. ఆమృతపానము చేసి బలవంతులైన వేల్పుల చేతిలో రాక్షస నేన యోడి పోయేను.- చావునకు గురియై తప్పించుకొని వాండ్రు పాతాళమునకుం బోయిరి. నలుదెసలకు దారిపోయిరి. అమరలుప్పొంగి శంఖ చక్ర గదాధారికి మొక్కి, ముందటియట్ల స్వర్గమున కేగిరి. అది మొదలు దానవులు స్త్రీలోలు, లైరి. కృష్ణునిచే ను పేక్షితులై పాతాళమునకుం జనిరి. అవ్వల నూర్యుడు ప్రసన్న కాంతితో దన దారిం జనెను. అగ్ని మిక్కిలి తేజస్పుచే (బకాళించెను. అన్ని భూతములకు ధర్మ మందు బుద్ధి గలిగెను. ముల్లోకములు విష్ణు వరిపాలన మందు లక్ష్మీ సంపన్నములయ్యె. అంతట బ్రహ్మ వేల్పులతో నేను మీ రక్షణకు విష్ణుని నియోగించితిని. ఉమాపతియును మీకు యోగ క్షేమములు చేయును. వారుభయులు మీ కుపాస్యులు. వర ప్రదాతలు నయ్యెదరు. అని పలికి చతుర్ముఖుడు నత్యలోకమేగెను. ఇంద్రుడు స్వర్గమునకు, శంకరుడు కైలాసము నేగిరి. అవ్వల దేవరాజు భువనత్రయ పరిపాలనము నేనెను. మహాలక్ష్మి యిట్లవతరించినది. ఈ సనాతనమూర్తి మతి భృగువునకు ఖ్యాతి యందు జనించినది. భార్గవి యేనది) ఆమెతోబాటు భృగుమహర్షిచేత మున్నొక నగరము గూడ తన పేర నర్మదాతీరమందావిర్బవింపజేయబడినది. దానిని బహ్మగూడ యనుమోడించెను. తన తండ్రి కా పురమును కుంచికతో (తాళము చెవితో) గూడ సమర్పించి దేవలోకమున కేతెంచి మల యాపురమును దానమిమ్మని , యాచించెను. కానీ యాతడు లోభముచే నీయడయ్యెను. ఆంతట లక్ష్మి విష్ణునితో నిట్లనియె.
మా తండ్రి నన్నవమాలించినాడు... నా సగరమును. కొన్నాడు. నీ వాతని నుండి గైకొని నాకిమ్ము, అన చక్రధారి చని భృగు మహర్షిని దయతో- నీపరచును. తాతము.తాళము. చెవితోగూడ మీ కూతురన కిమ్మని బ్రతి మాలెను. ఆయన కుపితుడై యీయను, ఇడి లక్ష్మీపురము గాదు నాదే. నేను నిర్మించికొన్నది. స్వామీ యేమైన
నీయను నిర్బంధించడు మన హరి వెండియు నెల్లవిధముల నీవిద్దాని వదలుకోనుము: నేను జెప్పుచున్నాను గట్టిన నమ్మహర్షి కోపముంగొని.. పొరువతే. శాలి నీ భార్య యెడ వతపాతమున్న నన్ను బాధించుచున్నాను. కావున మూనవ లోకమున పడి జన్మములు. విషయ, లేవమండుదువుగాక యమి: శతప్పిను... విష్ణువును ధాతనికి సంతానమువలని యానంద మీవనురచించవమి ప్రతిషమిచ్చెను. ఇట్లు శపించి హరి బ్రాహ్మలోకమేగెను.
- బ్రహ్మకత విష్ణుస్తుతిః -
అట్లేగి హరి బహ్మంగని స్వామీ! నీ కొడు కి భృగుమహర్షి వరముకోరి మనుష్యలోకమునందు బదిజన్మము లెత్తుదుపు. వలుదుఃఖములను గుడుతువు. నీ బలము పౌరుషము తుగ భార్యావియోగమందెదవని శపించినాడు. దేవలోకముంబాని యే నిప్పుడపోయి సముదమున బరుండెదను. దేవకార్యముల నేనిక జక్కబెట్టనన లోక గురువగు చతుర్ముఖుడు విష్ణువు ప్రసన్ను డగుట కిట్లు స్తుతించెను.
- బ్రహ్మ విష్ణువును స్తుతించుట -
ఈ జగత్తును నీవు సృజించితివి. నీ నాభినుండి కమల ముదయించినది. అందు నేను బుట్టితిని, నీకె వళుడను. నీపు నర్వజగదోశ కుడవు. నీవు తిలోకములను విడిచిపోవలదు. ఇది నాకీయవలసిన వరము. నీవు స్వతంత్రుడవు. నీవు వడిచిన్నములు లోకమునకుపకారముచేయ నీకు ఈవమీయగలవాడెవ్వడు? ఈ థ, గుడెవ్వడు? నిన్ను శపింప వాని కిట్లు శక్యమగును. విప్రులను గౌరవింపుము.. వారు నీ మూర్తులు." ఈశ్వర! యోగనిదగోని పాల్కడలియందీవు శయనింపుము మాధవా! వనివచ్చినవుడు - మ నిన్ను మేల్కోల్పెద. ఈ యింద్రుడు. నీచే బెంచబడినాడు. నీయంళ చేతనే శతునంహారము మొదలగు సర్వకార్యములు చక్కబెట్టగలవాడు. భువనత్రయముం భావించుచు నితడు నీయాజ్ఞను నిర్వహించును. అని యిట్లు స్తుతింపబడి విష్ణువు విధాతంగని యిట్లనియి.
విష్ణు వటునవ బితామహుండు జగత్ స ష్టి సేయనారంభించెను. ఆతనింగని నారదుడిట్లనియే. పురుష సూక్త మంత్రార్ధస్తుతి, పురుషుడనబడు పరమాత్మ సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు - నహస్రపాదుడు, అతడు భూమినెల్లనంటి వ్యాపించి మీద పదియంగుళములు మిగిలియున్నాడు. లోగడనైనది కానున్నది యెల్ల నీవు, కావున నీవలన నీ విశ్వము పుట్టినది, పుట్టనున్నది, నీ వలన నీసర్వదేవతోద్దేశ్యముగ జేయబడు సర్వహంతమైన యజ్ఞము వృషదాజ్యము పశువు నను రెండువిధములయిన హుతమెల్ల నీవలన నైటయు, ఋక్కులు అవ్వల సామములు నీనుండియే పొడమినవి. నీవలన యజ్ఞము లావిర్భవించినవి. గుఱ్ఱములు నేనుగులు పుట్టినవి. గోవులు నీనుండి రూపొందినవి. గొడ్డలు" లేళ్ల నీవలన జనించినవి. నీమోమునుండి బ్రాహ్మణులు పుట్టిరి. బాహువులనుండి - క్షత్రియులు జన్మించిరి. వైశ్యులు నీ తొడలనుండి హద్రులు నీ పాదములనుండి గల్గిరి. కన్నులనుండి సూర్యుడు చెవి నుండి యనిలుడు మనసు నుండి చంద్రుడు ప్రాణము (ఊపిరి) అంతశ్శషిరమునుండి లోపలి రంధ్రం నుండి) ముఖము నుండి ఆగ్ని బొడ్డునుండి గగనము శిరస్పు నుండి - ద్యులోకము, ప్రవర్తించెను." శ్రోతాము నుండి డిక్కులు పాదములనుండి భూమి నీనుండి యిదెల్ల రూపొందినది. - చిన్న విత్తునందు . పెద్దమట్టిచెట్టు ఉన్నట్లు తీయమైననీయందే , ఈ విశాలవిశ్వమున్నది.
జనించినది. విత్తునుండి మొలక, యందుండి కొమ్మలు - జేమ్మలుగ మఱిచెట్టు విస్తరించినట్లు నీయంది జగ తెల్ల విస్తరించినది. వై వట్టలు ఆకుల కంటె వేరుగ నరటిచెట్టెట్లు గనబడదో నీయందున్న విశ్వము నీకంటె వేజంగ గనబడదు. నీయందే హోదిని యనుశ క్తి యున్నది. నిర్గుణుడైన నీయందడిలేదు. హోదము (చలువ) తాపము = వేడిమి మిశ్రా= ఈ రెండిటి కలయికయునైన శక్తిత్రయము నీయందున్నదియు లేనిదియు గూడ వేరై యొక్క దై సర్వమునైయున్న నీకు నమస్కారము. వ్యక్తము ప్రధానము పురుషుడు విరాట్టు నమ్రాట్టు అంతయు నీవే. అంతట నంతయు నీవే సర్వుడపు సర్వస్వరూపుడవు నీవు. సర్వము నీనుండి పుట్టినది. నర్వమైన నీకు నమస్కారము. నీవు సర్వాత్ముడవు. సర్వేశుడవు. సర్వభూతస్థుడవు. కావున నీకేమి తెల్పెదనుకి హృదయమందున్న దేల్ల నీవేఱుంగుదువు. నామనోరథమేదో యది నీవలన ఫలించినది. నీవు గనబడినావు.గావున నేను జేసిన తపస్సు సుశోభన మైనది. నఫలమైనది. అన హరి యిట్లనియె. .
నీ జేసినతపస్సు ఫలమే నీకు నాదర్శనము. అది వ్యర్థముగాదు అభీష్టవరమడుగుము. నేను గనిపించినయెడ సర్వము సుసంపన్నమగును. సర్వభూతపతీ! నీవందరి హృదయమున నున్నావు. నాకేమి యిష్టమో నీకు దేలియనీదా? నీవే సృష్టి చేసితివి నేను జూచితిని. నీచేసిన దేవతలను దానవులను జూచి నాకు ముచ్చట గల్గినది.
ఇట్లు నారదుని స్తుతివిని బ్రహ్మసంతుష్టుడే నా యనుగహముచే నీవు ఋషులకెల్ల నుత్తముడవు గాగలవు. కలహప్రియుడవగుదుపు. ముల్లోకములందు నీ సచారి .మవతిహతము. జందెముతోబాటు యోగవట్టము గొడుగు వీణ నీ కలంకారములగును. హరిహరేందుల సన్నిధిని రాజులేలు నాయాద్వీపములందు జరించుచు ప్రీతినందెదవు. నీవు వర్ణములకు కౌనకుడవయ్యేదవు. స్వర్గమందు దేవతల నేవలందుచు నీయిచ్చవచ్చినట్లుండుము.
ఇది వద్మపురాణమున సృష్టిఖండమున లక్ష్మీపాదుర్భావాదివర్ణనమను 4వ అధ్యాయము.
