పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

18 - అష్టాదశోఽధ్యాయః

 బ్రహ్మకృతయజ్ఞ వైభవమ్

భీష్ముడనియె : విప్రో తమా ! గాయత్రి యభి షేకము యజ్ఞ సదస్సు నందు జరిగినది విన్నాను. సావిత్రి విరోధము, వశా మిచ్చుట, రుద్రు డామేను స్తుతించుట, సాటి లేని బ్రహ్మను గూర్చి విని, నా మేను గగుర్పొడిచినది. అప్పుడు గాయత్రి అన్ని స్థానము లంచు విష్ణువుచే పొగడ బడినది. భగవంతుడు నారాయణు డామెను పర మోన్నత స్థాయి నునిచి భక్తి తో సుతించి పర్వత శిఖర మందుంచి తుష్టిని పుష్టిని సమకూర్చు మాట నిట్లు శ్రీమతి హీమతి ఈశ్వరియు దేవి ! నీవే యని పలికెనంటిరి విని ధన్యుడనైతిని. ఆ తరువాతి కథ యాసతిమ్ము. విని నా దేహము పరిశుద్ద మగును. ఆన పులస్త్యు డనియే.

 యజ్ఞ వైభవము

ఆ పై నే యజ్ఞము చేయు చున్న యజమాని బ్రహ్మ నేసిన యద్బుతము విను. కృతయుగము మొదట జరిగిన యీ యజ్ఞము నకు మరీచి మొదలు దక్ష ప్రజాపతి వరకు గల మహరు లా ప్రజాపతికి నమస్కరించిరి. ఆట విష్ణువు వెంట అప్సరసలు నాట్య మాడిరి. గంధర్వు లాకాశమున వీణా వేణు మృదంగాఒది పోద్యములతో విష్ణువునకు వంత వాడిరి. ఆ యా గంధర్వులు, తుంబురుడు మొదలు హంసుడు దాక పదునెనమండుగురు పేర్కొనబడినారు. ఆప్సరస లా ప్రభువు వెంట నడిరి. ధాత మొదలు పర్జన్యుని దాక పేర్కొన బడిన ద్వాదశాదిత్యులు తేజోమూర్తులుద్దీపించుచు సురేశ్వరులు పితామహునకు నమస్కార మొనరించిరి. మృగవాధుడు మొదలుగ రుద్రుని దాక గల ఏకాదశ రుద్రులు నట. సదస్యులైరి. ఆశ్వినులు వక్తువులు ఎనమండుగురు మరుత్తులేడుగురు. విశ్వదేవులు సాధ్యులు నాయన ముందు దోసిలి లోగి నిలిచిరి. తార్యుడు మొదలుగ గలవారు వినత కొడుకులు వైనతేయులు అట సమావేశ మైం. భగవంతుడు శ్రీమంతుడు నారాయణుడు స్వయముగ వచ్చి భక్త లోక ముతో మహర్షులతో వచ్చి లోక గురునితో నిట్లనియె.

  నారాయణకృత బ్రహ్మస్తుతిః

 నారాయణ కృత బ్రహ్మ స్తుతి

జగత్పతీ ! నీచే నిది యెల్ల విస్తృత మైనది. సృష్టింపబడినది. అందుచే నీవు లో కేశ ఆరుడ వైతివి. తమ్మిచూలీ ! నీకు నమస్కారము. ఇట నే జేయ వలసిన వని యానతిమ్ము. ఇట్లు దేవర్షులతో భగవంతుడు విష్ణుప్రభువు బ్రహ్మకు నమస్కరించి విన్నవించెను. బ్రహ్మయు తన తేజస్సుచే దేస అనే ల్ల భాసింప జేయుచు శ్రీవత్స చిహ్న రోమములం గప్పువడి బంగారు యజ్ఞ సూత్రముతో (జందెముతో) రాజిల్లుచు సర్వభూత భావితుడై దేవర్షి ప్రతినిధియై శ్రీమంతుడే స్వయంభువు శుచియైన రోమకళ తోడి విశాలవక్షస్సుతో సర్వ తేజోమయుడై న ప్రభువట్టి యజమాని స్థానమున తేజరిల్లుచు శాశ్వతుని నిన్నాశ్రయించి విప్రులు నియమ వంతులై ముముక్షువులై యోగ భావన గొని జన్మ మరణ విముక్తి నందు చున్నారు. పుణ్యశీలురకు పుణ్యక ర్ములకు దిక్కెవ్వడు ? యోగ సిద్దులు మహాత్ము లెవ్వని నుత్తమ లోక మని తెలియుదురు. ఎవ్వని టైశ్వర్య మేనిమిది అణిమాదినిద్దిరూపముల సర్వాశమ వాసులు బ్రహ్మ చారి మొదలగువారు తపస్సు అను పేర నాహారాది నియమములను పాటించి భరింపరాని తపస్సు చేసి సాధించు ఫల మేని రూపమందుదురు ? యోగులెల్లరు సర్వోత్తము లగు నాది శేషుడు మొదలగు వారిచే వేయి తలలు పడగలు) వేయి కన్నులు గలవాడు అనంతుడని స్తుతియింప బడును. స్వర్గము కోరి విప్రో త్తము లెవ్వని యజ్ఞ పురుషు డని యజింప బడును? ఎల్ల స్థానములకు గతి యైన సర్వోత్తముడొక్కడే । శ్రీమంతుడు కవియనబడును. ఏదేవుని వేత్త యజ్ఞ భాగ ప్రదాత, వృషము, అగ్ని, సూర్యుడు, చంద్రుడును, కన్నులు గల వానిని, ఆకాశమూర్తిగా గల వానిని, విన్న సర్వదేవతా న్పూర్తికి మూలమైన వావిని, ఋషి లోక మునకు స్రష్టమైన వానిని దేవేశ్వరుని యొక్క స్థితికి పితృదేవతలకు, హవ్యము నెల్ల యే దేవునిచే ఏర్పరుపబడినది ? ఆ దేవుని దేవో త్త మునికి ప్రణతుల మగుచున్నాము. త్రేతాగ్ని చే యజించి వర మేష్టిచే మున్ను సృష్టి కావింప బడినది. అట్లే మరల యజ్ఞము సృష్టింప బడినది. ఆని విష్ణువు స్తుతికిస్వస్తి పలికెను.

 బ్రహ్మణః యజ్ఞశాలాప్రవేశ

బ్రహ్మ యజ్ఞశాల ప్రవేశము

అట్లు జగత్తు స్థితి కారు డైన అనంతునిచే (విష్ణువు) అన్వాసింపబడి (ఆరాధింప బడి) భగవంతుడు బ్రహ్మదేవుడు వృద్దుడయ్యు బుడ్డిమంతుడు మనస్పున కందని వా డు యజ్ఞ వాటమున కేతెంచెను. ధన సంపన్నులు, ఋత్విజులతో నిండినది, సదస్యులచే రక్షణ యీయబడుచున్నది. సర్వ సమరుడు విష్ణువు విల్లు చేకొని ప్రధాన రక్షకుడుగా నట నిలిచెను. దైత్య దానవ రాజులు రాక్షస గుంపు లట వచ్చి నిలిచిరి.

 యజ్ఞప్రయోగ వైభవము

బ్రహ్మ తనను దా సత్వరము భావించి కొనెను. సనాతనుడు యజ్ఞ పురుషుడు యజ్ఞమును యథా స్వరూపముగ భావించి, భగవంతు డట ఋత్వి గ్వరణము కావించెను. యజ్ఞకర్మయందు విచక్షణజ్ఞానము గలవారు భృగ్వాదులు “బహ్వృచముఖ్యైశ్చ  అని పాఠాంతరము”. అప్పుడు ఋగ్వేదపారగులు చెప్పిన ప్రతి యక్షరము అని యర్ధము. ఋషులు సెప్పిన ప్రతి యక్షరము పుణ్య మాచరించిరి. సువిస్తారమైన యా కర్మ యం దందరు మునులు విని యానందించిరి. అట సంహితయే కాక పద ము నెఱింగినవారి యజ్ఞవిద్య (గౌతము) వేదవిద్య (అధ్యయనము) యొక్క ఘోషతో యజ్ఞకాల ప్రతిధ్వనులీనెను. యజ్ఞ సం స్తర మెఱిగిన వారు (శ్రా తులు) శిక్ష ప్రయోగ (యజ్ఞాంగము లాటింటిలో మొదటిది. శబ్దము, వ్యాకరణము నిర్వచనము, నిరుక్త ఛందస్సు జ్యోతిషము_కల్పము అను వేదాంగము లాలు తెలిసిన వారు పూర్వ మీమాంస విషయము) హేతువాక్యము ( తర్కము) తెలిసిన వారిచే నానా విధముల యథా విధి జరుపబడు నా యజ్ఞ మందు నియమవంతులు ప్రతనిష్టులు నై యజ్ఞశాల యందు జపములను హోమములును నిర్వహించు ద్విజముఖ్యుల నట నిల్పి బ్రహ్మ తిలకించెను. 

అట సురాసుర గురు ని, శ్రీమంతుని, ప్రభువు నుపాసించుచున్నవారు ప్రజాపతులు దశాదులు వశిష్టాది మహర్షులు మహ తత్వము పంచభూతాలు వరుసగా అంతరిక్షము, వాయుపు, తేజస్సు, జలము, ప్రకాశోదక ము, (ఆపస్సు) మహి, (భూమి పంచతన్మాత్రలు, వరుసగా శబ్దము, స్పర్శ, రూపము, రసము , గంధము, వాని వికార ము, ఆవికారము, మఱియుంగల కారణము మహత్తత్వము. ఋగాదులు నాల్గు వేదములు; ఆయు ర్వేదము, ధను ర్వేదము, గణితము, వేదాంగము లారింటిలో నిది జ్యోతిషము, గజశాస్త్రము, ఆర్థశాస్త్రము, ఇతిహాసము, పురాణము, నను అష్టాదశ  విద్యలు, సాంగోపాంగముగ, సాకారములై యలంక రించి కొని వచ్చి ప్రణవము తో ( ఓంకారముతో) గూడ మూర్తీ తనించియున్న చతుర్ముఖుని (నాలుగు వేదములు నాల్గు ముఖము లుగా రూపొందించినవానిని ఉపాసించుచుండెను.

తపస్సు క్రతువులు సంకల్పము ప్రాణము మొదలగు నవి పెక్కులు పితామహు నుపాసించు చుండెను. ధర్మము, ఆర్గము, కామము నను పురుషార్థములు ద్వేషము హర్షము కు కుడు, బృహస్పతి సంవర్తుడు బుధుడు శని రాహువు మొదలగు నన్ని గ్రహములు (మరుత్తులు) విశ్వకర్మ పితరులు. దివాక రుడు సూర్యుడు) సోముడు, చంద్రుడు ) బ్రహ్మ నారాధించు చుండిరి.

గాయత్రీ దుర్గతరణి (దుర్గ) (రూపక భాష) ఏడు విధములైన వాణి  అక్షరము లన్ని నక్షత్రాలు, భాష్యములు, సర్వశాస్త్రముల దేహమూని (మూర్తీభవించి) క్షణములు, లవలు, మాసములు, సర్వక్రతువులు మహానుభావుని, దేవతలతో గూడ సేవించుచుండెను. మఱియు గల దేవి ప్రవరలు హీ మొదలు క్రియ దాక నృత్య గీత విశారద లందరు దివ్యాప్సరసలు, దేవమాతలు, విప్రచితి మొదలు క్రోధవిమోక్ష్మణుడు అను వాని దాక పేర్కొన బడిన దానవులు మత పెక్కు మంది బ్రహ్మ దేవు నుపాసించు చుండిరి. బ్రహ్మను గూర్చి వీరెల్ల రు గలిసి ఇట్లు మాట పల్కిరి.

 బ్రహ్మసదస్యానాంవచనమ్

 బ్రహ్మసదస్యుల సంభాషణము

            భగవంతుడా ! తమచే మేము త్రైలోక్యములు సృష్టింపబడి నాము గదా ! దేవతలకు ముల్లోక మీయబడినది. వారు పెద్ద సేయ బడి నారు. ( పెద్దపీట) వారి కిట్ల నీ జన్న మునమే మేమి సేయవలయును ? నీకేది యిష్టముసురవరుల పెధవు. ఆదితి కడుపున గల్గిన ఆంద రిచే దెబ్బ తిని ఆవ మానము పాలైన నా చిల్లి గవ్వలతో దైవతములతో నీ కేమి పని ? మాకు దేవతలతో సహా మాకందరకు ముత్తాతవు. నీ యజ్ఞము ముగిసి నంత తిఱిగి దేవతలతో సంపదను గూర్చి, తగవు కా గలదు. శంక వలదు . దానవులందరితో నిపుడు నిరీక్షించు చున్నాము.

పులస్త్యు డనియె :

 గర్వ మెక్కి పొరాడిన మాటలు విని పెద్ద పేరుగలవాడు జనార్ధన దేవు డింద్రునితో గలిసి శంభుని గూర్చి యిట్లనియె: రుద్రా ! దను పుంగవులు (ఎట్లో నిన్నుము సేయ వచ్చినారు. వాడు బ్రహ్మతో , సాలోచించి విఘ్నము కొఱకు యత్నింతురు. మనము మాత్రము యజ్ఞసమాప్తి దాక ఓరిమి పట్టవలెను. క్రతువు ముగింపున దేవతలు పోరాడ వచ్చు. ఇంద్రుని గెలుపు కొఱకు నీవు నేను గలిసి పోరాడక తప్పదు. ఇంద్రుని గెలుపు కొరకిట బ్రాహ్మణులు పరివేష్టలుగా మరు తులు కల్పింప బడిరి. దానవుల సౌమ్మది చేకొని యిట యజింతము. ఇట కేతెంచిన విప్రులకు దుఃఖాల పాలైన వారి తేది ఖర్చు సేయుద మిట దాస భావములో (నౌక కిలో) నిలుప బడినాము. కనుక ఇట్లు మాటాడుచున్న యావిష్ణుని గూర్చి బ్రహ్మ యిట్లనెను. ఈ దనుజులు కోపమెత్తి యున్నారు. మసలను బరిమార్పనుత్సహించుచున్నారు. రు దునితో దేవతలతో నోరిమి పట్ట వలయును. కృతయుగము చివర క్రతువు సమాప్తి యేసంత మీరూ నేనూ ఈ రాక్షసులు సంధి గాని పోరు గాని యొడంబడిక యప్పుడు సేసికో వలయు ననేను.

అంతట మట్టి ప్రభువు బ్రహ్మ స్వయంగా దానవులం గూర్చి యిట్లనెను. ఈ నా యీ యజ్ఞమందు దానవు లతో విరోధ మేట్లు నుం దగదు. మీ రెప్పుడు నా పనిలో మిత్ర భావముతో నే యున్నారు గదా యనెను. దానవులు పెత్తాతా ! నీ యాన యిది యెల్ల నే నెదము. దేవులు మా తమ్ములు వారి కేథయము లేదనిరి. వారిది విని బ్రహ్మ సంతుష్టుడయ్యెను.

 యజ్ఞరంభమ్

- యజ్ఞరంభము

ముహూర్త మాట నట్లుండ యజ్ఞవార్త విని యటకు ఋషికోటి వచ్చెను. కేశవుడు వారిని పూజించెను. పినాకపాణి (శివుడు) వారి కాసనములు వేసాను. బ్రహ్మ ( పేరణ వశిష్ట డర్ఘ్య మిచ్చెను. ఆపై పినాక పాణి (శివుడు) యేతెంచెను. వశిష్ఠ డర్ఘ్య మిచ్చెను. బ్రహ్మ పేరణ గోవును అర్ధమును పూజ నొసగి కుశల ప్రశ్న వేసి పుష్కర మందునికి యేర్పరచి కూర్చుండమనెను.

అంతట ఆ ఋషు లందరు జటాజనధారులై గంగానదిని దేవతల వలె ఆ ఉ తమ సరస్సును శోభింప జేసిరి. వారిలో కొందరు క్షవరము చేసుకొనినవారు, కొందరు కాషాయ వస్త్రధారులు కొందరు పొడవు మీసములు కలవారు, కొందరు. విశాలనేత్రులు, కొందరు చిన్న కనులు కలవారు, దీర్ఘశ రీరులు, లంబోదరులు కొందరు కేక రాములు, దీర్ఘకర్లులు, వికర్ణులు, కొందరు త్రుటిత కర్ణులు, కొందరు దీర్ఘ ఫాలులు, విఫాలులు, స్నాయువులతో చర్మములతో అవగుంఠనము కలవారు, కొందరి మునుల ఉదరము బయటికి వెడలి ఉన్నది. అన్ని దిక్కులా ప్రకాశించు చున్న ఆ సరస్సును చూచిన మునులుతీర్థము నందు ఆసక్తి తో ఆ సరస్సు తీరమున కూర్చొనిరి. ఆ మునులు కొందరు వాలఖిల్యులు, కొందరు ఆశ్మకుట్టులు, మరికొందరు దంతోలూఖలులు, కొందరు సంప్రలులు, కొందరు వాయుభక్షులు, జలాహారులు, పలాహారులు, నానా నియమములు, ప్రతములు కలవారు, భూమిపై పడుకొనువారు: వారు ఆ కొలనులో తమముఖమును చూచుకొని చక్కని రూపవంతులు, చక్కని కనులు కలవారుగామారి. ఈ కొలనులో ప్రతిబింబమును చూచుకొనినంతనే క్షణకాలములో ఇంతటి సౌందర్యము కలుగుటా ? అని ఆలోచించుచు , ఒకరినొకరు చూచుకొనుచు, ఈ తీర్థమున చూచుట వలన చక్కని ముఖము కలుగుట వలన ఈ సరస్సునకు “ముఖదర్శనము” అని పేరిడి, స్నానమాడి నియమముల:చరించు కొని వారు రూపవంతులైగి. దేవపుతులతో పోల్చదగినవారుగా సాటిలేని గుణరాశులుగా అయిరి. తమదేహ ఆత్మగుణములలో ఆ ప్రదేశమును శోభింప చేయు చుండిరి. ఆ తీర్థమును యజ్ఞోపవీత పరిమాణముగా విభాగము చేసిరి.

ఆ కొలను తీరమున అగ్నిహోత్రములను ఆరాధించుచు అనేక విధులను నిర్వర్తించిరి. ధ్యానము చేయు చు తపస్సుతో పాపములను నశింపచేసుకొనినవారై ఇక ఇంకొక తీర్థమునకు వెళ్ళజాలము, ఇది తీర్థరాజము, అని దీనికి జ్యేష్ఠ పుష్కరమని పేరు పెట్టిరి.

ఈ తీర్థ సమీపమున కొందరిని విరూపులను త్రివకులను గూనివారిని) చూచి ఆశ్చర్యమును చెందిరి. ఆ చోటికి వచ్చినవారు బ్రాహ్మణులకు వివిధ భాండములను దానము చేసి సరస్వతీతీర్గ ముగురించి విని స్నానము చేయుటకు వెళ్ళిరి.

సరస్వతీ తీర్థము సర్వ శ్రేష్టము, నానా పక్షులతో కూడియున్నది. బ్రాహ్మణో తములతో కలిసియున్నది. రేగి ఇంగుద , కాశ్మరి, జువ్వి, రాగి, విభీతక, పౌలోమ, మోదుగు, క ర , పీలు మొదలగు వృక్షములు కలది. వెలగ, గన్నేరు, మారేడు, మామిడి, పారిజాతములు, కదంబములు మొదలగు వృక్షములతో అన్ని ప్రాణుల మనసును రంజింప చేయునది. ఆ సరస్వతీ తీర మున వాయుభక్షులు, జలాహారులు, పత్రాహారులు, ఫలాహారులు, దంతోలూఖలులు, ఆశ్మకుట్టులు ఉత్తములగు మునులతో కూడి యున్నది. స్వాధ్యాయ ఘోషముతోనూ, అనేక మృగముల గుంపులు కలది, ధర్మాత్ములతో అహింసాకీలులతో శోభించునది. సుప్రభా, కాంచనా, ప్రాచీ, నందా, విశాలకా అను అయిదు ఉపనదులతో ఆ పుష్కరమున సరస్వతీ నది కలదు.

భూలోకమున నున్న బ్రహ్మ సదస్సులో విశాలమగు యజ్ఞవాటమున ద్విజాదుల స్వాగతములతో పుణ్యాహ ఘోష ములతో, దేవనియమములతో ఆ యజ్ఞవిధులలో దేవతలు వ్యగులై యుండగా, బ్రహ్మ దీక్షితుడుగా నుండగా సర్వకామనలను ప్రసాదించు యజ్ఞమును ఆచరించుచుండగా బ్రాహ్మణులు మనసులో తలచినంతనే ఆభిష్టములు నెరవేరు చుండెను, దేవగంధర్వులు గానము చేయు చుండిరి. అప్సరసలు నాట్యము చేయుచుండిరి. దివ్యవాద్యములను మోగించు చుండిరి. ఆ యజ్ఞ సంపత్తికి దేవతలు కూడా సంతసించిరి. ఆశ్చర్యమును చేందిరి. ఇక మానవుల గురించి ఏమి చెప్పవలయును ? బ్రహ్మ పుష్కరము నుండి యజ్ఞమును జరుపుచుండగా, ఋషులు సంతోషించి సరస్వతితో ఇట్లు పలికిరి.

ఓ రాజేంద్ర ! సుప్రభ అను పేరు గలదానిని సరస్వతీ నదిని ఆంతట ఆ ఋషులు సరస్వతి వేగవతిగా నుండుట చూచి బ్రహ్మను శోభింప చేయుచున్న యాగమును ప్రశంసించిరి. ఇట్లు పుష్కరములలో ఈ సరస్వతి ఉ తమ నది. బ్రహ్మ కొరకు ఉద్భవించినది. విజుల. సంతోషము కొరకు ఉద్భవించినది. . పుణ్యమునకు పుణ్యమును కలిగించునది. అయిదు ప్రవాహములు కలది సరస్వతి. ఈ సరస్వతి నదియే సుప్రభా నామముతో విలసిల్లు చున్నది. నానాస్వాధ్యాయపరులు శాంతులు ఆంద రూకలిసి సరస్వతిని స్మరించిరి.

సత్రయాగమును చేయుచున్న ఋషులు ధ్యానించిన వెంటనే భక్తి చే ప్రీతి చెందిన సరస్వతీ మహానది తూర్పుదిక్కును -ఆశ్రయించినది. ప్రాచీనహా అను పేరుతో ఋషులచే నమస్కరించ బడుచున్నది.

ఓ మహారాజా ! ఇది మరొక ఉపాఖ్యానము కలదు. ఆత్యాశ్చర్యకరము.. మంక ణకు డను విపుని చేతికి దర్భాగ్రముతో గాయమాయేను. గాయపడిన ఆతని చేతినుండి శాకరసము స్రవించినది. ఆ శాకరసమును చూచి బ్రాహ్మ ణుడు సంతోషముతో నృత్యము చేసెను. ఆతను నాట్యము గావించుట చూచి ఆతనీ తేజస్సుతో మోహించిన స్థావరజంగమా త్మక మగు జగత్తంతయూ నృత్యము గావించెను. అంతట ఇంద్రాది దేవతలు ఋషులు బ్రహ్మను ఈ బ్రాహ్మణుడు నృత్యము చేయకుండగా ఆపు మని కోరిరి. బ్రహ్మ రుద్రుని ఆదేశిం చేను. బ్రహ్మ ఆదేశమును పొందిన రుద్రుడు ఋషి వద్దకు వచ్చి ఓ మునీ ! నీ కెందుకు నృత్యమును చేయుచున్నావు. నీ నృత్యముతో జగత్తంతయూ నృత్యము చేయుచున్నది. అని పలికెను. అంతట ఆ ముని నృత్యమును జేయుచు ఇట్లు పలికెను. నా చేతి నుండి శాకరసము నవించు చుండుట తాము -చూచుట లేదా ! ఆ శోకరసమును చూచి నేను సంతోషముతో నృత్యము చేయుచున్నాను. అనీ అట్లు రాగ మోహితుడగు

మునిని చూచి రుద్రుడు ఇట్లు పలికెను.

నేను విస్మయము చెందుట లేదు. వేళ్ళు చున్నాను. నన్ను చూడుము. ఇట్లు మహాదేవుడు పలుకగా ఇత నెవరో నన్ను ని షేధించు చున్నాడు అని అంతలో శంకరుడు తన అంగళ్యగ్రముతో ఆంగుష్ఠమును కొట్టుకొనెను. అట్లు కొట్టబడిన అంగుష్ఠము నుండి మంచు పలె తెల్లని భస్మము బయలు వెడలెను. దానిని చూచిన ఆ ముని సిగ్గు చెంది ఆతని పాదములపై బడి. ఇట్లు పలికెను. రుద్రుని కంటె పరదైవమును నే నూహించజాలను. ఈ సకల చరాచర జగత్తునకు నీవే ఆధారము. ఈ జగత్తును నీవే సృజించితి వని పండితులు చెప్పుచున్నారు. ప్రళయకాలమున మరల ఈ జగ తంతయూ నీలోనే చేరును. నిన్ను దేవతలు కూడా తెలియజాలరనిన ఇక నేనెట్లు తెలియుదును ? బ్రహ్మాది దేవతలందరూ నీలోనే కనబడు చున్నారు. దేవత లందరిని నీవే సృజించితివి. వారితో అన్ని పనులను నీవే చేయించు చున్నావు. నీ అనుగ్రహము వల్లనే దేవతలు ఆన్ని భయములను తొలగించు కొనుచున్నారు. ఇట్లు శంకరుని స్తుతించి శంకరునికి నమస్కరించెను. నీ అనుగ్రహము తో నా తపస్సు క్షీణించ కుండు గాక అని పలికెను.

 ఆంతట మహాదేవుడు సంతోషమును చేంది ఇట్లు పలికెను. నా అనుగ్రహము వలన నీ తపస్సు వేయి రేట్లు వృద్ధి చెందును. నేనుకూడా ఎపుడూ ఇచ్చోటనే ఈ ప్రాచీవాహినీ నది తీరముననే నీ తోనే ఉందును. ఈ సరస్వతీ నది. . ఈ తేత్రమున విశేష ఫలప్రదము. ఈ సరస్వతీ నదీ  తర తీర మున తనువును చాలించిన వాడు ఇహ పర లోకములలో పొంత లేని దేదీ ఉండదు. ఈ నదీ ప్రాచీన తీరమున జపించినవారు మరల ఇక్కడ మరణించ జాలడు. ఈ సరస్వతీ నదితో స్నానమాడిన వాడు అశ్వమేధ ఫలమును పొందును. ఈ తీర్థ మున తిల తర్పణము గావించినవారు, నియమములను, ఉపవాస ములను జలాహారమును, పలాహారమును, వాయుభక్షణను గావించినవారు, భూమి పై పరుండువారు ఇతర నియమముల నాచరించు వారు శుద్ద దేహులై పర బ్రహ్మమును పొందెదరు. వారు గావించిన తిల తర్పణమును మేరుదాన సమఫలమును పొందెదరు.

ఈ తీర్థ మున శ్రాద్దమును గావించిన వారు 21 తరముల వరకు స్వర్గమును పొందెదరు. ఈ తీర్థము పితరులకు. శుభఫలప్రదము. ఒకే పిండముతో తృప్తి చెందేదరు. పుత్రుల చే తరింప చేయబడి బ్రహ్మలోకమునకు చేరెదరు. ఇక మరల. అన్నమును కోర రు. మోక్షమార్గమును చేరును. ఈ సరస్వతీ నదికి ప్రాచీనత్వము లభించిన విధమును చేప్పెదను. వినుము.

ఇంద్రాది దేవతలందరు నరస్వతీనదిలో నీవు సముద్రము నకు ప్రతీదీ తీరమున పొర వలయును. ఈ బడబాగ్నిని తీసుకొని సముద్రమున పడవేయుము. ఇట్లు చేసిన చో దేవతల భయము తొలగును. లేనిచో బడబాగ్ని తన తేజస్సుతో మమ్ములను దహించును. కావున ఈ భయము వలన మమ్ములను త్వరగా కాపాడుము. దేవతలకు తల్లివలె ఆభయము నొసంగుము.

ఇట్లు విష్ణువు పలుకగా సరన్వతీ నది నేను స్వతంత్రులను కాను. నా తండ్రిని ప్రార్ధించుడు. నేను కుమారిని. తండ్రి ఆజ్ఞను పాలించు వ్రతము కలదానను. తండ్రి ఆజ్ఞ లేనిచో ఒక డుగును కూడా వేయజాలను. కావున వేరే ఉపాయమును ఆలోచించుడు.

సరస్వతి అభిప్రాయమును గ్రహించిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి.

సరస్వతి తప్ప బడబాగ్ని -ఇతరులు కోనిపోజాలరు. నీ సుత దోషరహిత కావున గొని పోగలదు.

 అంతట బ్రహ్మ సరస్వతిని పిలిచి వడిలో కూర్చోబెట్టుకొని శిరస్సును మూస్కొని ప్రేమతో ఇట్లు పలికెను. దేవతలందరూ నన్నడుగుచున్నారు. నీవు సరస్వతితో బడబానలము ను సముద్రమున పడ వేయుమని తెలుపుము. అని అంత శ్రీ బ్రహ్మ వాక్యమును వినిన సరస్వతి జంట నేడజసిన లేడి వలె దీనమనస్కురాలై రోదించసాగేను. కన్నీటితో నిండిన ఆమె ముఖము నీటిబిందువులతో కూడిన వికసించిన తెల్ల తామర వలె శోభించు చుండెను. అట్లు సరస్వతిని చూచి బ్రహ్మాది దేవతలు ఆమె దుఃఖమునకు వశులైరి. శోక తప మైన ఆమె హృదయమును ఓదార్చి బ్రహ్మ ఏడవకు ! నీకు భయము లేదు. నీకు దేవతల ప్రభావము వలన గొప్ప గౌరవము లభించును. కావున బడబానలమును తీసికొని లవణ సముద్ర మధ్యమున, పడవేయుము.

ఇట్లు పలుకగా సరస్వతి కన్నీటితో నిండిన కనులు కలదై బ్రహ్మకు నమస్కరించి వెళ్లుచున్నాననెను. దేవతలు బ్రహ్మ ఆమెను భయపడవలదని పలికిరి. భయమును విడిచి సంతుష్టహృద యవై బయలుదేరుము అనిరి. సరస్వతి పయనించు సమయమున శంఖ దుందుభినాదములు, మంగళ నాదములతో ప్రపంచము నిండెను.

తెల్లని వస్త్రమును తెల్లని చందనమును ధరించి శరత్కాలమేమములవంటి వన్నె కలతారాహారములతో అలంక రించ బడి, సంపూర్ణ చంద్రవదనయై, పద్మపవిశాలాక్షితో, ఇంద్రుని కీర్తిని దశ దిశలా వ్యాపింప చేయుచు, అతని హృద యము నుండి బయలువెడలి . తన తేజస్సుతో జగత్తును ప్రకాశింప చేసెను.

ఆట్లు వెడలు చున్న సరస్వతిని వెన్నంటిన గంగానదిని నిన్ను నేను మరల చూడవలయును. ఎటు వెడలు చుంటివి. అని పలుకగా ప్రాచీన దిక్కునకు వచ్చినపుడు నన్ను చూచెదవు. దేవతలతో కలిసున్న నిన్ను ఉదఙ్ముఖురాల నే సేవించెదను. దుఃఖించ కుము. నేమ ఉద జ్ముఖి గా నుందును. నీవు ప్రాచీముఖముగా నుందువు. నీ తీరమున క్రతు శతములు , పుణ్యస్నానదానాదులు, శ్రాద్ధాదులు, తర్పణములు చేసిన చో అక్షయఫలము నొసంగును. ఇట్లు చేసినవారు ఋణత్రయ విముకు లగుదురు. మోక్షమార్గమును చేరెదరు. ఇచట విచారించవలసిన పనిలేదు. అంతటి గంగ ఆమెతో పునర్దర్శనమగు గాక. నీ గృహమునకు వెడలుము. అచట నన్ను తలచుము. అని పలికెను.

యమునానది గాయత్రి సావిత్రితో కలిసి తన చెలియగు సరస్వతిని పంపించిరి. అంతట సరస్వతి ఆ దేవత లను విడిచినదిగా ఉ శంకుని ఆశ్రమమును జేరినది. జువ్వి చెట్టు క్రింద ఆ శరీరమును వీడి దేవతలు చూచుచుండగా అవతరించినది. ఆ జువ్వి చెట్టు విష్ణుస్వరూపము. దేవత లందరి చేత నమస్కరింప బడునది. ఫలాకాంతులు దాహ్మణులు సేవించదగినది. మరొక చతుర్ముఖ బ్రహ్మవలే బహు శాఖలతో వ్యాపించ బడియున్నది. ఆ వృక్ష కోటర కుటీర ములో ప్రవే శించిన పనుల బ్రాహ్మణుల దేవతల వాక్కులు వినిపించుచుండును. పూయని వృక్ష ము కూడా పూచి నట్లుతోచును. ఉత్తమ సం పెంగ వలె కొమ్మలలో చేరిన చిలుకలతో సుగంధములగు మొగిలి చెట్లతో శోభించు - ఉత్తమ నది, కోకిలల మాలవలే. నురుగుతో పూచినట్లు శంకరునితో గంగవలే, జువ్విచెట్టుతో ఆ సరస్వతి శోభించెను. ఆ నీటిలోనున్న సరస్వతి జనార్ధనునితో ఇట్లు పలికెను. ఓ దేవా ! ఆ బడబాగ్నిని ఇమ్ము. తమ ఆజ్ఞను పాలించెదను. ఇట్లు సరస్వతి పలుకగా శ్రీ మహావిష్ణువు మరల ఇట్లు పలికెను. ఈ అగ్ని నిన్ను కాల్చును అని భయపడవలసిన పనిలేదు.

ఓ ! శుభస్కరురాలా ! పశ్చిమ సముద్రమునకు బడబానలమును తీసికొనివెళ్లు చున్న నీవు జలమును పొందగలవు. అంతటి బడబానలమును బంగారు కలశ మున ఉంచి సరస్వతీ తీరమున సమర్పించెను. సరస్వతీ నది ఆ బడబానలమును తీసుకొని పశ్చిమాభిముఖముగా బయలుదేరి ఆంతర్గాన విద్యతో పుష్కరమును చేరెను.

స్వచ్ఛమైన సర స్సై యామర్యాదా పర్వతమందు రూపొందెను. సురలు సిద్దులు సేవించు పుష్కరారణ్యము నందు బ్రహ్మతో నట ఈ మహానది మునీశ్వరుల తపస్సిద్ది కొఱకే.

అచట నే కుండములందు బ్రహ్మ హోమములు నే నెనో యట్టి పాపనాశిని యామె పై బడెను. జగత్తుల కెల్ల నాయు వైన వాయు భగవానునిచే నా పుష్కరము నింపబడే నని చెప్పబడి:నది. పుష్కరమందున్న యా నది నెవ్వరు సత్కర్మ పరులు దర్శింతురు. దర్శనము సేయని వారు దుర్గతి పాలగుదురు. అట మనఃపూర్వకముగ స్నానము చేసి నతడు బ్రహ్మలోక మేగి బ్రహ్మతో ఆనందించును. ఇచ్చట చక్కని పెరుగు బ్రాహ్మణునకు విందిచ్చి నతడు అగ్ని లోక మేగి రమణీయ భోగము అనుభవించును.

ఇచ్చట చక్కని వస్త్రము భక్తితో శివునికి దానము సేసిన పది రెట్లు ఫలమందును. జ్యేష్ట కుండమున స్నానము చేసి శుద్దమనసుతో పితరులకు తర్పణము సేసి తమ వారిని నరకము నుండి యుద్దరించును. బ్రహ్మతీర్థ మిది పుణ్యము. సేవించిన పుణ్యుడు మరేమీ కోరడు. అని నారదు డనెను. జ్యేష్ట కుండమున నొక సారి స్నానము వలన సర్వ తీర్థ ఫల మందును. పలుమాట లేల ! క్షేత్రము తీర్షము శుభ గతి యీ మూడు నంది నతడు పరమ గతిని మోక్షమును పొందును. పుణ్యకాలమున పుణ్య క్షేత్రమున తీర్థమున హోమము చేసి విపునకు ధన మిచ్చిన అనంత సుఖ మందును.

కార్తిక మాస శుక్లపక్షమున వైశాఖమాసమున చంద్ర సూర్య గ్రహణములలో, కురుజాంగల క్షేత్రమున ఈ క్షేత్రము లలో, ము నీశ్వరులు చెప్పిన తీర్థము లన్నిటిలో ఈ "సరస్వతీ తీర్ధము పుణ్య తమ తీర్దము అని బ్రహ్మ చెప్పెను.. కార్తికమాస మున ఈ కుండమధ్యమున స్నానము చేసి దానము చేసినచో ఆశ్వమేధ ఫలమును పొందును.

ఏకాగ్రచిత్తముతో కనిష్టకుండములో స్నానము చేసి చక్కని బొమ్మను విప్రునికి దానము చేసినవారు అగ్నిలోక మును చేరును.  తరముల వరకు అచట ను పోఫలమును పొందును. కావున అన్ని విధములా ప్రయత్నించి పుష్కర మును చేరవలయును. పుష్కరారణ్యమును చేరిన ప్రాచీసరస్వతీ నది స్మృతి మతి ప్రజ్ఞా, మేధా, బుద్ధి దయా అను ఆరు మారు పేర్లనుపొందినది. అప్పటి నుండి ఈ సరస్వతి ప్రాచీ అయినది. పుష్కరారణ్యమున కల సరస్వతీ జలమును తీరమున నుండి చూచిన వారు అశ్వమేధ ఫలమును పొందెదరు. ఆ నదిలోనికి దిగి స్నానమాచరించిన వారు బ్రహ్మకు అనుచరులు కాగలరు. ఆ నదీ తీర మున శారాదులతోనే నా పితృదేవతలను అర్చించిన వారు బహు భోగముల నంద గలరు. యధావిధిగా కౌద్ద మాచరించిన చో నరకములోని పితృదేపతలు స్వర్గమును చేరెదరు. సరస్వతీ నదిలో స్నానమాడ తిల దర్భ మిశితమగు జలమును తర్పణముగా విడిచినచో పితృదేవతలు తృప్తి చెందెదరు.

 అన్ని తీర్థములలోనికి ఉత్తమతీర్థము సరస్వతీ తీర్ధ మే. అన్ని తీర్థములలో ఇదియే ఆది తీర్ధము. ధర్మమునకు మోక్షమునకు ఇదియే క్రీడాభూమిగా పేర్కొనబడినది. ధర్మార్థ కామ మోక్ష పురుషార్ధములను ఇచ్చునది. తమపాపములను తొలగించుకొనుటకు ఈ తీర్థమున ప్రవేశించినవారు సులభముగా గోదాన ఫలమును పొందును. సువర్ణ దాస సమఫలమును పొందును. తర్పణము చేయుట వలన, పిండదానము వలన నర క ములో నున్న పితరులు స్వర్గమును చేరెదరు. పుష్కరములోని సరస్వతీ జలమును త్రాగిన వారు బ్రహ్మ రుద్ర వందితలోకములను చేరగలరు. పుష్కరారణ్యములోని సరస్వతీ తీర్థము స్వర్ధమార్ధ ప్రబోధక ము.  పుణ్యమును చేసుకొనిన పాగితే అది లభించును. ధర్మతత్వములు తెలిసిన మునులచే సేవించబడునది. కావున అన్ని చోట్ల సరస్వతి పరమపావనమైనది. పుష్కరమున ఈ నది పావనములలోకెల్లా పావనమైనది. సరస్వతీ నది అందరికి సులభముగా నున్నది. కాని కురు క్షేత్రమున ప్రభాసమున పుష్కర మున మాత్రమున దుర్లభము.  ఆన్ని తీర్థములలోనికి ఒరస్వతీ తీర్థము ప్రవర ముగా పేర్కొనబడినది. ధర్మ ఆర్థ కామ మోక్ష పురుషార్ధ చతుష్టయ సాధకము. ప్రాచీన సరస్వతీ తీరమును పొందియు ఇతర తీర్థమును అభిలషించువారు చేతిలోని అమృతమును వీడి విషమును కోరువారగుదురు.

 ప్రయాగమున జ్యేష్ఠ భాగమున ఇది జ్యేష్ఠము. మధ్యమున మధ్యభాగము. ప్రదక్షిణ మార్గమున కనిష్టమునకు, వెళ్ళవలయును. ఈమూడుచోట్ల స్నానము గావించవలయును. ప్రదక్షిణము నాచరించవలయును. ఈ ప్రదేశములో తిల సమన్విత తర్పణజలమును పితరులకు విడిచినవారికి పితృదేవతలు ప్రసన్నులై అమితఫలమును ఇత్తురు. ప్రతినిత్యము శ్రద్ధాభక్తులతో ఈ నదిలో స్నానమాడువారు బ్రహ్మను సాక్షాత్కరించుకోగలరు. బ్రహ్మలోకమును అభిలషించువారు అనులోమ విలోము మార్గములలో సమాస వ్యాస మార్గ ములలో ప్రతినిత్యము పుష్కరమున స్నానమాడవలయును. పుష్కరములు మూడు. శృంగములు శుభ్రములు , మూడు ప్రస్రవణములుగా నుండును. ఇదియే ప్రసిద్ధి. దీనికి కారణము మాత్రము తెలియదు. ఇచ్చట కనిష్ట భాగము, మధ్యమ భాగము, జ్యేష్ఠ భాగము శృంగ మను పేరుతో, గత ప్రస్రవణ నామములతో పిలువబడు. చుండును. ధర్మార్థకామమోక్షములను పొందనివారు ఈ తీర్థమున దేహత్యాగమును గావించినచో మోక్షమునందగలరు. శ్రద్ధాభక్తులతో ఈ తీరమున స్నానమాడి బ్రాహ్మణోత్తమునకు మంత్రపూతగోవును దానము గావించినచో మోగలోకమును చేరును. ఇంకేమి చెప్పవలయును. రాత్రిపూట అభిలషించువానికి ఆర్త మునిచ్చిననూ అనంతఫలము నొసంగును. ఈ సరస్వతీతీరమున తిలదానము సర్వోత్తమముగా ప్రశంసించెదరు. కృష్ణచతుర్దశి స్నానము విశేష ఫలప్రద ము. అట్లు స్నానము చేసి పిండితో కాని గుడముతో తాని పితృదేవతలకు పిండప్రదానము గావించిన చో పితృలోకమును చేరును.

ఈ సరస్వతీనది పుష్కరారణ్యమును చేరి అంతర్ధానము చెంది పశ్చిమాభిముఖముగా పయనమాయెను.. పుష్కరారణ్యమునకు అతిసమీపమున ఖర్జూరవనమును చేరెను. ఆ వనము ఫలపుష్పశోభితము. మునులకు మనోరమము అన్ని ఋతువుల పుష్పములతో శోభిల్లునది. సిద్దచారణ సేవితము. ఆట్టి వనమున కొంతకాలముండి “నందా" అను పేరుతో మూడులోకములలో ప్రసిద్ధిగాంచెను. మీనములు, మొసళ్లు, సొర చేపలతో కూడినది స్వచ్చజలముతో నిండియుండు నదిగా నుండును.

సూత మహర్షి పలికెను.

 అంతట భీష్ముడు  ఇట్లు పలికెను. ఇంకా నది ఏయే రూపములతో  పేర్లతో విలసిల్లు చున్నది. ఈ సరస్వతీ నదికి:” నందా” అను పేరు ఏట్లు వచ్చి సది ? ఎవరు పెట్టిరి ? ఈ విషయమును తెలిసికోవలయునని నాకు చాలా కుతూహ లముగా నున్నది. - గాన తెలుపవలయును. ఇట్లు అడుగగా పులస్త్య మహర్షి భీష్మునకు "నందా" పేరు కలిగిస విధానమును తెలియజే నేను క్షత్రియ వ్రతము. నాచరించు ప్రభంజనుడను మహారాజుండెను. అతను ఈ ఖరూర వనమున వేటాడి నానా మృగము లను చంపుటకు తలపడెను. నభంజనుడు ఒక పూల పొదలో లేడిని చూచేను.  తీక్షణమైన బాణముతో ఆ లేడిని కాబైను . ఆ లేడి బొపాణియేన- రాజాను చూచి ఓ మూర్ఖుడా ! నీవు ఇంతటి నీచమైన పని ఏమి చేసితివి ?  తల వంచుకొని . నా పుతునికి స్తనము నిచ్చుచున్నాను. ఎటు నుండి థయము. లేని నన్ను బాణముతో కొట్టితివి. పాలు లేదా నీరు త్రాగుచున్న దానిని, పంతానమును కాపాడుచున్న దానిని సంభోగములో పాల్గొనుచున్న మృగమును చంపరాదని మొదట  వినియుంటిని సౌ సంతానమునకు పాలిచ్చుచున్న నన్ను చంపితివి. నిర్దోషురాలను, వనమును చేరిన సన్ను వజ్రాయుధము వంటి బాణముతో కొట్టితివి. కావున దుర్బుద్ధివైన నీవు కూడా మాంసాహారివిగా గమ్ము. బహుకంటకాకీర్ణమగు ఈ అరణ్యమున వ్యాఘ్రరూప మును పొందుము. మృగ మిచ్చిన శాపమును విని ఆ రాజు కలత చెంది చేతులు జోడించి ఇట్లు వలికెను. నీవు నీ సంతానము నకు స్తన్యము నిచ్చుటను నేను చూడ లేదు. నేను తెలియక చంపితిని. ప్రసన్ను రాలవు కమ్ము నేను వ్యాసరూపమును వీడి మానుషత్వమును ఎపుడు పొందెదను. ఈ శాప విమోక్షమును నాకు తెలియబరచుము.

ఇట్లు రాజు పలుక గా ఆ లేడి ఇట్లు చెప్పెను. ఓ రాజా ! (నూరు సంవత్సరము) తరువాత నీ సమీపమున కొచ్చిన నందా అను - గోవుతో జమగు సంవాదముతో నీ శాపము తొలగును. ఇట్లు లేడి పలికిన వెంటనే ఆ రాజు వ్యాఘ్ర రూపమును పొందెను.  నఖదంషాయుధములు గలదై అతిభయంకర మగ , వా మముగా మారెను. ఆ ఆరణ్యమున ఈ వ్యాసము చతుష్పాన్మృగముల ద్విపాత్రులను చంపుచుండెను. ఇట్లు నూరు సంవత్సరములు గడిచేను.. మృగమారిన ములను భక్షించుచున్న తనను తాను నిందించుకొనుచుండెదు. నేనెపుడు మనుష్యత్వమును పొందేడను. ఇట్లు వళుత్వమును. మృగత్వమును లభింపచేయు, కుత్సితకార్యమును ఇక చేయజాలను. మాంసము మీది ఆశ తో మృగమును చంపుటవలన మానవులకు భయమును కలిగించునది ఆపదలకు నిలయమగు వ్యాఘ్రత్వమును పొందితిని.  మానవులతో , మృగములు కలిసుండుట దుఃఖప్రదము. సత్కులమున జన్మించిననూ పాపరహితుడ నైన నేను పాపబుద్ధితో పాపినైతిని. ఇట్టి వ్యాఘ్రరూపమును పొందితిని. ఇదంతయూ కాలకృతమే. కావున నాకు సుకృతము లేదు. ఒక హింస మాత్రమే నిందించదగినది. నావద్ద ఉన్నది. ఆ హింసతో దుఃఖమే కాని రావమోక్షము కలుగదు. నాకు శాపమోక్ష మెట్లు కలుగును. లేడి మాట ఎట్లు నిజ మగును. ఇట్లు ఆలోచించుచుండెను.

ఇట్లు నూరు వత్సరములు - గడువగా ఆ వనమునకు - తృణజలముల కొరకు ఆవుల మంద వచ్చెను. ఆ వనమంతయూ ఆవుల కో డైల నెమరువేయు ధ్వనితో నిండెను. చెట్లనీడలో బలిసిన గోపాలురతో కళకళలాడుచుండెను. రాత్రిపూట ఆ వసమంతయూ వేణునాదముతో శుభప్రదముగా గడుచుచుండెను. ఇట్లు ఖర్జూర వనములో ఆవులమంద నివ సించుచుండగా ఆ మందలోని “నందా” అను ఒక ఆవు హంసవంటి తెల్లని వర్ణము కలది కుండెడు పొలనిచ్చునది ఆవుల మందలో ముఖ్యమైనది, చక్కని అవయవస్థానము కలది, పొడవైన మెడ కలది, సన్నని చర్మము కలది నల్లని కంఠ వర్ణము కలది, శుభగ్రీవఘంటలు . కలది మధురధ్వనీ కలదీ, ఆ నంద మందకు ముందులో నిర్భయముగా సంచరించు చుండెను. ఒంటిగా ఏపుగా గడ్డి ఉన్న ప్రాంతమున సంచరించు చుండెను. యధేషముగా సంచరించుచు తృణ భక్షణము. గావించుచుండెను. ఆ నదీతీరమున రోహితమనుపర్వతము. కలదు. - బాలా గుహలు సానువులు శిఖరములు మృగములు కలది. ఆ పర్వతమునకు ఈశాన్య ప్రాంతమున ఘోరము తృణకులము సంకటము విషమచుర్గము భయంకరము, రోమ హర్షణము (శరీరమును గగుర్పొడుచునది) మృగసింహములతో కూడినది, చాలా క్రూర మృగములతో కూడినది. తీగలు , పొదలతో, నిండినది! నక్కల కూతలు కలది.

ఈ భయంకరారణ్యములోనే భయంకరము కామరూపి, రక్త పతాంగము కలది, ఘోర దంష్ట్రనఖాయుధము ఆగు పెద్దపులి కలదు.

 ఆవుల మందవెంట నందుడను ధర్మాత్ముడు గోపాలకుల గోవుల పాఠమును . ఆచరించువాడు కొనలు తేగని గడ్డితో (అనగా ఆపుడే కొత్తగా మొలచినవి, ఇతర పశువులు భుజించనివి) గోవుల మందను కాపాడు వాడు. ఆతని మంద నుండి దారి తప్పిన నందా ధేనువు గడ్డిని పొందగోరి తిరుగుచు వ్యా! మము ముందుకు చేరినది. ఆ ఆవు మీదికి వ్యాఖాము పరుగెత్తుచు నిలు నిలు మని పలికెను. స్వయముగా చేరిన నీవు ఈ రోజు నా ఆహారముగా విధి ఏర్పరిచెను. అని పలికెను పెద్దపులి వలికిన నిష్ఠురము శరీరమును గగుర్పొడుచు మాటను వినిన నందాధేనువు చంద్రుని వంటి కాంతి కలిగి తెల్లని -రూపు కలిగి బాల్యమున నున్న తన వత్సను (దూడను) తలచు కొని పేమతో బొంగురుపోయిన గొంతుతో పుత్రశోక ముతో తల్లడిల్లుచు పుత్రవాత్సల్యము కల 'నంద' జాలీగా ఏడ్చుచు పుత్రుని చూడగల ఆశ కరువై నడై యుండెను.

అట్లు ఏడ్చుచు ఆరుచు చున్న ‘నంద' ధేనువును చూచిన వ్యామము ఇట్లు పలికెను. ఓ ధేనువా ! ఎందు కేడ్చుచున్నావు ? దైవవశమున సులభముగా లభించితివి. ఆప్రయత్నముగా నాకాహారమైతివి. నీవు నవ్వుచున్న నూ ఏడ్చుచున్న నూ నీ జీవితము ముగియుచున్నది. లోకమున బ్రహ్మ ఏర్పరచినదానినే భుజింతురు. అందులో నీవు స్వయ ముగా వచ్చితివి. నీకీరోజే మృత్యువు విధించబడినది. వృధాగా ఎందుకు దుఃఖింతువు ? అయినా నీవెందుకేడ్చుచున్నావు అని అడిగేను. నాకు నీ విషయమును తెలియవలయునని కుతూహలమున్నది.

వ్యామ వచనము విని “నంద” ఇట్లు పలికెను. ఓ ప్రభూ నన్ను క్షమించుము. ఓ కామరూపీ ! నీకు నమస్కారము. నిన్ను చేరిన తరువాత ఈ లోకమున రక్షణ లేదు. బ్రతుకుకొరకు విచారించుటలేదు. నేనెలాగూ మరణించవలసినదే . పుట్టినవానికి మరణము తప్పదు. చనిపోయినవానికి పుట్టుక తప్పదు. కావున తప్పించుకోజాలని

దానిగురించి నేను విచారించజాలను, పరతంత్రులై నవారు దేవతలు కూడా తప్పక మరణించవలసినదే. కావున నాబ్రతుకునుగూర్చి నేను దుఃఖించుట లేదు.

కాని స్నేహముతో మాత్రమే దుఃఖించు చున్నాను.. నా హృదయమున ఒక దుఃఖము కలదు. దానిని నీవు వినవలయును. నాకు యౌవనము రాగానే నేను ప్రసవించితిని. మొదట కలిగిన పుత్రుడు నాకు చాలా ఇష్టుడు. నా పుత్రుడు, పాలు త్రాగువాడు మాత్రమే. ఇంకా గడ్డిని వాసన చూచుటలేదు. ఆ పుత్రుడు గోవకులమున కట్టియవేజడియున్నాడు. ఆకలితో నాకొరకై ఎదురుచూచుచుండును. అతనెట్లు బ్రతుకునని నేను చింతించుచున్నాను. పుత్ర స్నేహవర వళ నైన నేను సొ పు తునికి పాలియ్య కోరుచున్నాను. నా పుత్రునికి పాలిచ్చి శిరస్సు మూర్కొని స్నేహితుల కప్పగించి పాతాపితములను బోధించి మరల రాగలను. ఆపుడు నీవు యధేచ్చగా భుజింపుము. ఇట్లు నందా వచనములను విని వ్యా మము మర ఇట్లు పలికెను.

ముంచుకొచ్చిన చావును తెలియకున్నావు. పుత్రునితో ఏమి చేయుదువు ? నన్ను చూచి అన్ని ప్రాణులు భయ పడును. మృతి చెందును. నీవు మాత్రము వాత్సల్యముతో “పుత్ర ! పుత్ర ! " అని పలుకు చున్నాను. కాలము దాపు రించిన వానిని పుత్రులు, తపస్సు, దానము తల్లి, తండ్రి, గురువు కాపాడజాలరు. నీవు వృషభముల అంథారావములతో కూడినది, దివ్యము, బాలవత్సవిభూషితము, దేవలోకమునకు భూషణ మైనది స్వర్గతుల్యమైనది, ఎల్లప్పుడూ సంతోషముతో నున్నది, సర్వదేవతలతో పూజింపబడినది, పవిత్రములకు పవిత్రము, మంగళములకు మంగళము, అన్ని తీర్థములకు తీర్థ భూతము, ధన్యములన్నింటిలో ధన్యము సమ స్తగుణసంపన్నము, ఈశ్వర నివాసము, అన్ని తీర్ధములలో భూమి స్వర్గముగా పేరెన్నికగన్నది గోపికల పెరుగు చిలుకు ధ్వనితో, బాలవత్సలధ్వనితో, గోవుల హంకారధ్వనితో దారిద్ర్యము పొర దోలబడును. తల్లులను కోరిన లేగదూడల హుంకార వమును చేయుచుండును. బాహుయుద్దమును అభ్యసించి శ్రమించు గోపాలకూరులతో పాలించబడునది, ప్రకరముగా గీతనృత్యములతో ఆస్ఫోటిత నాదములతో ఆనందించబడునది అంతటా ఇటునటు తిరుగుచున్న లేగ దూడలతో ఆసందించబడునది కదులుచున్న పద్మము లతో నున్న సరస్సు వలే శోభించుచుండును. అట్టి శ్రీనికేతనము సౌమ్యము, హృష్ణ పుష్ట సాయుతము గోలోకమును బోలు ఆ వనమునకు వెళ్ళి మరల ఎట్లు రాగలవు. నాలోని పంచభూతములు నీ రక్తముతో తృప్తి ని పొందుగాక. నేను మాటలతో పంచభూతములను తృప్తి పరచ జాలను.

నంద పలికెను 

ఓ మృగేంద్రా ! మొదటిసంతానముకల నామాట వినుము. పుత్రుని స్నేహితులను, బాలులను, గోపాలకులను చూచి, గోపీజనమును సంప్రదించి, తల్లిని ఓదార్చి, ఒట్టు పెట్టుకొనుచున్నాను. తప్పక రాగలను. నమ్మినచో నన్ను విడువుము. నేను మరల రానేని బ్రహ్మహత్యాపాపమును మాతాపితరులవధ వలన పాపమును పొందెదను. వేటగాండ్లకు, ప్లేచ్చులకు, విషము నిచ్చువారికి కలుగు పాపము నాకు కలుగును. నేను మరల రానిచో ఆవులకు విఘ్నములను కలిగించు వారికి, నిద్రించువానిని దండించువారికి కలుగు పాపము నాకు కలుగు గాత. ఒకసా  దానము చేసిన కన్యను మరియొక నికి దానము చేయువాడికి కలుగు పాపము నేను మరల రానిచో నాకు కలుగు గాత.  థారమును మోయటకు తగని వృషభములను విషమ మార్గ ములో మోయించువారికి, కథను చెప్పుచున్నపుడు విఘ్నములను కలిగించువారికి కలుగు పాపము నేను - మరల రానిచో నాకు కలుగు గావుత. ఇంటికి వచ్చిన మిత్రునికి భోజనము పెట్టకుండా పంపినవారికి కలుగు పాపము, నాకు కలుగు గావుత. ఇట్టి శపథములను చేయుచున్నాను. నేను మరల వచ్చెదను. అంతట పెద్దపులి నమ్మకమును పొంది ఇట్లు పలికెను.

వ్యాఘ్రము పలికెను.

ఓ ధేనువా ! నీ శపథములతో మాకు నీపైన నమ్మకము కలిగినది. ఒక వేళ  వెళ్లి నేను . "ఈ మూర్జుని వంచించితిని అని కూడా భావించ వచ్చును. ఇచట ఇట్టి విషయమున ఒట్టు పెట్టుకొనిననూ పాపము లేదని కొందరందురు కామినీల యందు, వివాహము లందు, గోవులను విడిపించుట యందు, ప్రాణాపాయము కలుగునపుడు ఎదుటివారి శపథము లను సమ్మరాదు అని. ఈ లోక మున కొందరు నాస్తి కులు, పండితులమని భావించు మూర్ఖులు చక్రమునధిరోహించిన వాని వలే నీ మనసును" భ్రమింపచేతురు. కుతర్కములతో, హేతువులతో, వృత్తాంతములతో అజ్ఞానము సవరించిన చి తము కలిగినవారు అవిశారదులు శాస్త్రములనే మోహింపచేయుదురు. కొందరు సుకుమార మతులు, అబద్ద ములను కూడా నిజములుగా చూ పెదరు. చితకర్మ విశారదులు సమస్థలమును ఎత్తు పల్లములు కలదానినిగా కూడా చూ పెదరు. తన కార్యమును సాధించుకొనిన జనులు ఉపకరించినవారిని స్మరించరు. దూడ, లేదా శిశువు పాలు అయిపోగానే తల్లిని విడుచును. ఉపకార మునకు ప్రత్యుపకారమును చేసినవారిని నేను చూడలేదు. కార్యము నెర వేరిన తరువాత అందరికీ బుద్ధి మారును. ఋషులు, దేవతలు, రాక్షసులు, మానవులు - తన పనిని నెరవేర్చుకొనుటకు ఎన్నో శపథములను చేసిరి. మేము వాటిని విశ్వసించము. దేవ ఆగ్ని గురు సన్నిధిలో శపించు వారికి వై వస్వత రాజు (యముడు సగము ధర్మమును హరించును. ప్రయాణములతో నేను ఈ వ్యామమును మోసగించితిని ఆను తలంపు నీకు రాకుండు గాక. అన్నిటిని నీవే చెప్పితివి కావున నీకు నచ్చిన దానిని ఆచరించుము.

నంద పలికెను.

నీవు చెప్పినది సత్యమే. నిన్ను  ఎవరు  వంచించగలరు  ( ఇతరులను - మోసగించువారు : తమను తామే మోసగించుకొనువారు కాగలరు.

వ్యాఘ్రము పలికెను.

ధేనుకా ! పుత్రవాత్సల్యము కల నీవు నీ పుత్రుని చూడుము. నీవు పుత్రునికి పాలు త్రాపి శిరస్సును మూర్కొని తల్లిని సోదరుని స్నేహితులను, స్వజనులను బంధువులను చూచి సత్యమును ముందుంచుకొని త్వరగా రమ్ము. 

ఇట్లు సత్యవాదిని యగు ధేనువు వ్యామము ముందు క్రపథము చేసి, వ్యామము అనుమతించక పుత్రవాత్సల్యము కలదై వెడలెను,  కన్నీధు నిండిన మోము కలదై - దీనురాలై వణుకుతున్నట్టె. దుఖభారముతో,అంగారవముతో శోకసాగర, ములో మునిగినదై, సరస్సులో మొసలి కాలునుపట్టిన యేనుగు వలె తనను తాను కాపాడు కొనజాలనిదై మాటిమాటికి విలపించు చున్న దై నదీతీరమున నున్న గోకులమును చేరెను. ఆరచుచున్న తన చూడవద్దకు పరుగెత్తాను.

కన్నీటితో చూచు చున్న ఆ వత్సమును సమీపించినది. ఆ వత్సము కూడా తల్లిని చేరి అనుమానముతో తల్లిని అడుగుచున్నది.

 తల్లీ ! నీలో ఆరోగ్యమును ధైర్యమును చూచుట లేదు. ఉద్వేగము థయము నీలో కనిపించు చున్నది.

నంద పలుకు

ఓ పుత్రా ! పాలు త్రాగుము. నీవు అడిగిన దానికి కారణమును నేనిపుడు చెప్పజాలను. కావున తనివి తీరా పాలు త్రాగుము. నీకు ఇక మాతృదర్శనము దుర్లభము. ఈ ఒక్కరోజే నాపాలు త్రాగగలవు. రేపు ఎవరి పాలు త్రాగ గలవు. నిన్ను విడిచి నేను వేళ్ళవలయును. ఇటకు శపథము చేసి వచ్చితిని. ఆకలితో వాడిపోయిన పెద్దపులికి నా జీవితమును ఆర్పించ వలయును.

ఇట్లు నందమాటలను వినిన వత్సము ఇట్లు పలికెను. వత్సము పలికెను.

నీవ వెళ్ళదలచిన ప్రదేశమునకు నేను వెళ్ళేదను. నీతో కలిసి నేను మరణించుట ఉత్తమము. నీవు లేనినేను ఒంటరిగా ఆర్తురాలనే మరణించ వలసినదే. నీతోపాటు నన్ను కూడా అడవిలో పెద్దపులి చంపినచో మాతృభక్తులకు లభించు. లోకము - సాకు లభించగలదు. కావున నేను తప్పక నీతో- రాగలను. ' లేదా నీ ఏక్కడే - ఉండుము. నీ శపథములునాకుండనీ ! తల్లి లేని బ్రతుకు నిషయోజనము. దిక్కులేని నాకు అడవిలో ఎవరు- దిక్కుకోగలరు. . పాలు త్రాగి ఇతుకునిష్పయోజనము, దిక్కులేని నాకు అడవిలో ఎవరు దిక్కుకాగలరు ? పాలుత్రాగిబ్రతుకు బాలులకు తల్లితో సాటియగుబంధువు లేడు. తల్లివంటి రక్షకులు, తల్లివంటి దిక్కు ఇంకొకటి లేదు. తల్లివంటి స్నేహము, తల్లి వంటి ముఖములభించదు. ఇహ పరములలో తల్లివంటి దైవము లభించదు. ప్రజాపతి ఇట్టి పరమ ధర్మమును ఏర్పరచెను. పుత్రవంతులు ఉత్తమ గతిని పొందెదరు.

నంద పలికెను.

నాకే మృత్యువు విధించబడినది. నీవు రావలదు. ఒకరికి విధించబడిన మృత్యువుతో ఇంకొకరు మరణించరు. ఇది తల్లి చివరి సందేశమును ఆచరించుము. నేను చెప్పిన దానిని విని చక్కగా ఆచరించుము. జలములో స్థలములో సంచరించుచు పొరబడకుము. పొరబాటు వలననే అన్ని ప్రాణులు నశించును. తృణ భక్షణమున లోభమును చూపకుము. విషమ ప్రదేశములోని తృణమునకై ఆశ చూపకుము ఇహపరములలో లోభము వలననే నాళము సంభవించును. లోభ మోహితులు సముద్రమున అరణ్యమున ప్రవేశింతురు. పండితులు కూడా లోభము వలన చేయ రాని దానిని అత్యుగ్ర కార్య మును కూడా ఆచరింతురు. ప్రాణులకు లోభము, పొరబాటు, తొందరపాటు వలన నాశము సంభవించును. కావున లోభమునుచూపకుము. పొరబాటును నమ్మరాదు. అన్ని విధముల ప్రయత్నములతో శరీరమును కాపాడు కొనవలయును. అన్ని మృగములనుండి, మ్లేచ్చుల నుండి చోరాది సంకటముల నుండి కాపాడు కొనవలయును. ఒక చోట నివసించుచున్ననూ పాప జాతులైన మృగముల విపరీత భావములు తెలియ జాలవు. గోర్లు గలవాటిని, నదులను కొమ్ముల గలవాటిని ఆయుధధారులను స్త్రీలను సేవకులను నమ్మరాదు. నమ్మదగని వారిని నమ్మరాదు. నమ్మినవారిని కూడా ఎక్కువగా నమ్మరాదు. నమ్మిక వలన భయము కలుగును. మూలచ్చేద మేర్పడును. భయము కలవాడు బలిష్టమైన తన దేహమును కూడా సమ్మరాదు. పొరబాటు వలన నిదురించిన వానిని మదించిన వానిని రహస్యముగా చెప్పుచుందురు. ఎపుడు ప్రయత్నముతో అంతటా గంధమును చూడవలయును. గోవులు గంధముతో, రాజులు చారులతో చూచెదరు.

ఘోర మగు ఆరణ్యములో ఒంటరిగా నుండరాదు. ఒకే ధర్మమును ఆలోచించవలయును. అందరికి మరణము తప్పదు కావున ఉద్వేగమును పొందరాదు. ఒక బాటసారి చెట్టు నీడను చేరి విశ్రాంతి తీసుకొని వెళ్లునట్లు ప్రాణాల సమాగమము

కూడా అని భావించ వలయును. ఈ జగత్తు అనిత్యము కావున ఒంటిగా ఏమి ఆలోచించెదవు ? ఎట్లు ఆలోచించెదవు. కావున నీవు దుఃఖమును విడిచి నా మాటను పాటించుము.

శిరస్సును ఆఘాణము చేసి, తలను నాకి గోప్పగా శోకించుచు, కన్నీరుతో వ్యాకులమైన కనులు కల దై బరువుగా వేడిగా ఆడ నాగువలె నిట్టూర్చుచు పుత్రుడులేని జగత్తును శూన్యముగా తలచుచున్నట్లుండెను. పెద్ద బురదలో మునిగినదానివలే నిలుచుచు బాధపడుచు, పుతుని గురించి విలపించుచు నందిని పుత్రునితో ఇట్లు పలికెను.

పుతునితోసాటివచ్చు స్నేహము, పుతసమసుఖము, పుతసమమగుపితి, పుతసమగతి లేదు. అపుతులు లేనివానికి జగత్తే శూన్యము. పులులు లేనివారింటితో సుఖము లేదు. వుతునితో ఉత్తమలోక ము లభించును. పులులు లేనివారు నరక మును చేరుదురు. చందనము చల్లదని లోకము చెప్పును. కాని పుత్రునిగిలి చందనముకంటె చల్లనిది. ఇట్లు పుత్రుని గుణములనుచెప్పి మాటిమాటికి పుత్రునిచూచుచు తనతల్లిని, స్నేహితులను గోపికలను శలవుకోరుచున్నది. మంద కుముందుగా సంచరించుచున్న నన్ను పెద్దపులి ఆక్ర మించినది. ఏన్నోశపథములనుచేసి పెద్దపులినుండి విడువబడితిని. పుత్రుని తల్లిని స్నేహితులను గోకులమును చూచుటకు వచ్చితిని. మాటతప్పరాదు కావున వెళ్ళేదను. ఓ తల్లీ ! నో దుష్ప్రవర్తనను ఆపరాధము లన్నింటిని క్షమించుము. ఇతను నీబిడకొడుకు బాలుడు. ఇంక నూఏమిచే ప్పెదను. ఓ వీపులా ! చంపకా ! తల్లీ ! థ దో ! సురభి ! మానిని ! 'వసుధారా ప్రియా ! నందా ! మహానందా ఘట సవా ! తెలిసో తెలియకో నేను మాటలాడిన 'అ పియములను చేసిన ఆపరాధములను క్షమించుడు. అందరూ సుగుణవంతు లే. అందరూ లోకమాతలే. అందరూ అన్ని ఇచ్చువారే. వాపు తుని రక్షించుడు. రక్షకులు లేనివాడు, వికలుడు దీనుడు, మాతృశోక ములో సంతప్తుడు ఆగు నాపు తుని కాపాడుడు ! నా సోదరీమణులూ ! ' కాపాడుడు, అనాధుని నిర్భలుని పుత్రునివలె పాలిం చుడు. మహానుభావులారా ! క్షమించుడు. సత్యమును ఆశ్రయించి వెళ్లుచున్నాను. నా స్నేహితులు నాగురించి ఎట్టిచింత చేయరాదు. పుట్టినవానికి ముందున్నది మరణమే.

ఇట్లు పలికిన నందావచనములను విని తల్లి, స్నేహితులు దుఃఖించుచు అమిత విషాదము నుపొంది ఇట్లు పలికిరి, ఇది చాలా ఆశ్చర్యకరము నమ్మశక్యము కానిది. వ్యా! ఘమునకు ఇచ్చినమాటను పాటించదలచిన నీవు సత్యవాదినివి. శపథములతో, సత్యవాక్యములతో మహాభయమును తప్పించుకొని తొలగించుకొనవలయునుకాని మరల వెళ్ళరాదు, నందా నీవు వెళ్ళరాదు. నీవు. ఆధర్మము నాచరించుచున్నావు. బాలుడగు పుత్రుని విడిచి సత్యలోభముతో వెళ్లుచున్నావు. బ్రహ్మ వాదులగు ఋషులు ఇట్లు చెప్పిరి. ప్రాణాపాయము సంభవించినపుడు - శపథములు చేయుట పాపముకాదు. అబద్దము చెప్పిన నూ ప్రాణుల ప్రాణములను రక్షించినచో ఆది సత్యమే అగును. ప్రాణములను హరించు సత్యము అసత్యమగును. స్త్రీల విషయ ముస, వివాహవిషయమున గోవులను విడిపించుటలో బ్రాహ్మణులకు ఆపద కలిగినపుడు శపథములు చేసిన పాతకమంటదు.

నంద పలికెను.

ఇతరుల ప్రాణములను కాపాడుటకు ఆబద్దము చెప్పెదనుకొని నా స్వార్ధము కొరకు, నా ప్రాణముల కొరకు, ఆబద్దమును చెప్పజాలను. గర్భమున ఒక డే చేరును. చావునందు భరణమునందు సుఖదుఃఖానుభవములందు ఒక డే ఉండును. కావున నేను సత్యమునే పలుకుదును. లోకములు సత్యములోనే నిలుచును. ధర్మము సత్యములోనే నిలుచును. సత్యవాక్యముతోనే సముద్రము చెలియలికట్టను దాటుటలేదు. బలిచక్రవర్తి విష్ణువునకు భూదానమునుగావించి పాతాళము. నాశ్రయించెను. . కపటముతో బంధించబడిననూ బలిచక్రవర్తి సత్యమును వీడలేదు. నూరుశృంగములుకల వింధ్యపర్వత రాజము పెరుగుచు సత్యవాక్యము పై నిలిచి ప్రతిజ్ఞను తప్పుటలేదు. స్వర్గ ఆపవర్గ నరక ములు సత్యవాక్యమునందే నిలిచి యున్నవి. తనమాటను తప్పినవాడు తన జీవితములో అన్నింటిని తప్పినవాడగును. ఒక విధముగానున్న తనను ఇంకొక విధముగా చూపినవాడు ఆత్మాపహారియగు చోరుడగును. ఆతను చేయనిపాపమంటూ ఏదీ ఉండడు. నన్ను నేను మోసగించుని నరకమును చేరెదను. ఆట్టినాకు యమధర్మరాజు సగము ధర్మమును లోపింపచేయును. లోతుతెలియని పరిశుద్ధ జలముకల సత్యతీర్థములో క్షమాహదము లో స్నానము చేసినవాడు పాపములను తొలగించుకొని పర మపదమును చేరును. వేయి ఆశ్వమేధయాగములను సత్యమును త్రాచులోనూ చినచో అశ్వమేధసహస్రముకంటె సత్యమే విశిష్టమగును. సత్యము సాధు ఫలము . పరమశాస్త్రము. ఏ కేశ ములూ ఉండవు. సాధుజనులవద్ద ఉండును. సత్పురుషులకు మూలధనము. సర్వాశ్రమ ఫల ము. సత్యమును ఆశ్రయించియే స్వర్గ మును చేరును. అట్టి సత్యమును ఎట్లు విడుతురు. కావున జనులు పరస్పరము సత్యమునే చెప్పుదురు.

స్నేహితులు పలికిరి.

నందా నీవు దేవదానవులందరి చేత సనుసరించదగినదానను. నీవు సత్యబలముతో వదలరాని ప్రాణములను విడుచుచున్నావు. నీవు ధర్మదుర ంధర రాలవుగా నున్నావు. కావున మే మేమి చెప్పగలము ? నీవుచేయు ఈత్యాగముతో నీకు మూడులోకములలో పొంద రానిదేదీ ఉండదు. నీవుచేయు ఈత్యాగమువలన నీకు పు తవియోగము సంభవించదనే మా భావన. మంచిమనసుకల స్త్రీకి ఆపదలు కలుగవు. గోపీజనమును చూచి, గోకులమును ప్రదక్షిణముగావించి దేవతలను వృక్షములను అనుమతి అడిగి బయలుదేరేను. భూమిని, అన్ని నీ, వాయువును, వరుణుని, చంద్రుని దశ దిక్పాలకులను, వృక్షములను; నక్షత్రములను, గ్రహములు " అందరిని నాపుత్రుని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఇట్లు పలికి. మాటిమాటికి నమస్కరించి ఈవనము నాశ్రయించిన సీదులు- వన దేవతలందరూ వనమున తృణభక్షణమును , చేయుచున్న- నా పుత్రుని రక్షించుగాత. చంపకాశోక పున్నాగ సరళ ఆర్జున కింశుక వృక్షములారా ! మిగతా అన్ని వృక్షరాజములారా ! నా సందేశమును వినుడు. నాపుత్రుని ఒంటరిని, విషమారణ్యమున తిరుగుచున్న వానిని మీసొంతపు తునిలా నాబాలుని ప్రీతితో కాపాడుడు. నా పుత్రుడు తలిదండ్రులు లేనివాడు అనాధ దీనమనస్కుడు. ఈ ప్రదేశమున తిరుగుచున్న వాని దుఃఖముతో ఆక్రోశించుచున్న వానిని, ఈ మహావనమున మహాదుఃఖము కప్పివేసినవానిని, ఆకలిదప్పులతో అలమటించు వానిని, శూన్యమున ఒంటరిగాఉండి జగత్తును శూన్యముగా చూచుచున్నవానిని జాలిగొలుపుచు తృణభక్షణకై సంచరించువానిని మీరంతా కాపాడవలయును , ఇట్లు పుత్ర వాత్సల్యముతో నంద ప్రీతితో అందరిని ప్రార్ధించి శోకాగ్ని తో తలపించబడుచు పుత్రదర్శనమును పోగొట్టుకొనినదై, ఎడబాసిన చక్రవాక పక్షవలె, చెట్టునుండి జారిన తీగవలె గుడ్డి దానివలె అడుగడుగున తడబడుతూ వ్యాఘమున్న ప్రదేశమునకు వెళ్ళేను. ఆ వ్యాఘము తీక్షదంష్ట్రములు కలిగి ప్రతాపము తొణికిసలాడు ముఖముక లదై భయము కలిగించుచున్నంతలో నందాపుత్రుడు బాలుడు తోక పై కెత్తుకొని అతి వేగమతో తనముందుకువచ్చి వ్యాఘముముందు నిలబదెను.

వచ్చిన పుత్రుని ఎదురుగా ఉన్న మృత్యురూపమైన పెద్దపులినిచూచి ఆ నందాధేనువు ఇట్లు పలికెను.

ఓ మృగరాజమా ! సత్యధర్మవ్రతమున నిలిచిన నేను వచ్చితిని. ఇక ఇపుడు నా రూంసముతో యధేచ్చగా తృప్తిని పొందుము. ప్రాణులను తృప్తి పరచుము. నా రక్త మును త్రాగుము. నా మృత్యువు తరువాతనే ఈ బాలకుని భక్షింపుము.

వ్యాఘ్రము పలికెను.

ఓ సత్యవాదినీ ! శుభప్రచురాలా ! ధేనువా ! నీకు స్వాగతము. సత్యవంతులకు ఎక్కడా ఆశుభము జరుగదు. నీవు ముందు తప్పక తిరిగి వత్తునని చెప్పితివి. నీవు వెళ్లి మళ్ళి వచ్చేదవా అని సందేహము కలిగినది. నీ సత్యవ్రతమును పరీక్షించుటకే నిన్ను పంపితిని. లేనిచో నన్ను చేరినవారు బ్రతికి తిరిగి వెళ్ళు టెట్లు  . సత్యాన్వేషణలో. నాకు కుతూహలము కలిగినది. నీ ఈ  సత్యవ్రతముతో నాచే విడువబడితివి. ఇపుడు నీవు నాకు సొదరివి. నీ పుత్రుడు నాకు మేనల్లుడు, పాప కర్ముడనైన నాకు చక్కని ఉపదేశ మును చేసితివి. లోక ములన్నియూ సత్యమున ప్రతిష్టించ బడినది.. ధర్మము సత్యముననే ప్రతిష్టించబడినది. నత్యముతో గోవు ప్రియహవ్యమగు క్షీరమునిచ్చు చున్నది. సీ పౌలతో బతుకు గోపాలుడు ధన్యుడు . నీవు భక్షించు తృణాదులుకల ఆ ప్రదేశములు ధన్యములు. నీపాలను త్రాగువారు ధన్యులు కృతార్డులు ఎంతో 'సుకృతమును చేసియున్నారు. జన్మ ఫలమును పొందినవారు.

ఇట్లు వ్యాఘ్రరాజము విశ్వాసమునుపొంది పరమాశ్చర్యమును పొందెను. దేవతలు సత్యమును ప్రదర్శించిరి అని నా సమ్మక ము. గోవులకు సత్యమిష్టమని తెలిసి నేను బ్రతుణాలనుకొనుటలేదు. . నన్ను పాపమునుండి తొలగించు సుకృతమును చేయగోరుచున్నాను. నేను కొన్ని వందల వేల ప్రాణులను రక్షించితిని. ఇట్లు గోసత్యమును చూచిన తరువాత నేను పొందులోక మేది ? నేను పాపిని, దురాచార వరుడను, నృశికుడను, జీవహింసను చేయువాడను. ఇంతటి , సదారుణ కర్మలనాచరించి ఏగతిని పొందెదను. పుణ్యతీర్ధములకు వెళ్లి పాపప్రక్షాళన గావించుకొనెదను. పర్వతము నధిరోహించి కిందికి దూకెదను. నిప్పులో బడెదను. ఓ ధేనువా ! నా పాపశుద్దీకి చేయవలసిన తపమును సంగ్రహముగా తెలుపుము. వివరించుటకు సమయము లేదు.

దేనువు పలికెను

కృతయుగమున తపమును త్రేతాయుగమున జ్ఞానమును ద్వాపరయుగమున య జమును కలియుగమున దానమును ఆచరించవలయును. అన్ని దానములలో ప్రాణులకు అభయ దానమే మిన్న. చరాచర ప్రాణులకు ఆభయమిచ్చువాడు ఆన్ని భయములనుండి విడివడి పరబ్రహ్మను పొందును.. అహింసతోసాటివచ్చుదానము లేదు. అహింసతో సాటిపచ్చు తపము లేదు . ఏనుగు పాదములలో అన్ని పాదములు కలియునట్లు అన్ని ధర్మములు ఆహింసలో అంతర్భవించును.

 యోగవృక్షపుధాయ తాపత్రయమును నశింప చేయునది. ఈ వృక్షమునకు ధర్మము జ్ఞానము పుష్పములు. స్వర మోక్షవులు ఫలములు. దుఃఖ్య తయముతో తపించువారికి యోగవృక్ష ఛాయయే ఉపశాంతిని కలిగించును. యోగవృక్ష చ్చాయతో ఆనందమును పొందినవాడు మరల దుఃఖములతో బాధింపబడడు, ఇట్లు పరమో త్తమ శ్రేయస్సును సంగ్రహముగ నీకు వివరించితిని. ఇది యంతయు నీకు తెలిసినదే. ఊరికే నన్నడుగుచున్నావు.

వ్యాఘ్రము పలికెను ;

నేను పూర్వము లేడిచే శపించబడి వ్యాఘ్రరూపమును పొందితిని. ఆప్పటినుండి ప్రాణివధ చేయుటవలన అన్నిటిని మరచితిని. నీ సహవాస ఉపదేశ మువలస మరల అంతయు జ్ఞప్తికి వచ్చినది. నీవుకూడ ఈ సత్య వ్రతముతో ఉత్తమగతిని పొందెదవు. కాని యిప్పుడు నా మనసులోనున్న ఒక ప్రశ్నను నిన్ను అడుగుచున్నాను. ఈ విషయమును ఆలోచించుచున్న నాకు నూరు వర్షములు గడచినవి. అదృష్టవశ మున నీతో కలయిక వలన ధర్మసంస్థానము సన్మార్గ ప్రతిష్టాపనము జరిగినది.. ఆజానినైన నాకు నీ పేరు తెలుపుము.

నంద పలికెను :

 నా ప్రభువైన నందుడు నాకు నంద అని పేరిడేను. ఇప్పుడు నన్ను భుజించేదనవి పలికి ఎందుకూర కుంటివి ? నంద ఆది వినగానే ప్రభంజన మహారాజు శాపవిముక్తుడాయెను. మరల నృపత్వమును బలరూపములను పొందెను. ఇంతలో ధర్ముడు సత్యవాదిని అగు నందాదేనువును తెలిసి చూచుటకు ఆచటికి వచ్చెను. నందతో ఇట్లు పలికెను. నేను ధర్ముడను. " నీ సత్య వ్రతమును విని నిన్ను చూచుటకు యిటకు వచ్చితిని. ఓ నంద నీకు మేలు కలుగును. నీకు నచ్చిన వరమును కోరుకొమ్ము. ఇట్లు పలుకగా నంద ధేనువు ధర్ముని ఇట్లు వరమడిగెను. నీ అను గ్రహము వలన పుత్రునితో కలిసి ఉత్తమ లోకమును పొందెదను. కాని ఈ ప్రదేశము శుభదాయకమగు పుణ్యతీర్ణము కావలయును. మునులకు ధర్మ పదము కావలెను. ఈ సరస్వతీ నది నా పేరుతో నందినదిగా పేర్కొనవలెను. తాము వరమిచ్చుటవలన ఈ ప్రార్థన చేయిచుంటిని.

ఇతి శ్రీపాద్మేపురాణే ప్రథమే సృష్టిఖండే నందాప్రాచీమాహాత్మ్యే అష్టాదశోఽధ్యాయః. పుల స్త్య మహర్షి పలికెను !

ఆ క్షణములోనే నందాధేనువు సత్యవ్రతులు చేరు లోకమును చేరేను.  ప్రభంజన మహారాజు కూడ తాను. మొదట సంపాదించిన రాజ్యమును పొందెను. నందాధేనువు నందా పేరును పొందిన సరస్వతీనదిని పొంది స్వరమును చేరుటవలన ఈ నదిని నం దానదిగ వ్యవహరించుచున్నారు. తరువాత సరస్వతీ నది ఖర్జూర వనమునుండి బయలుదేరి . భూమిని పవిత్రము. చేయుచు తడుపుచు దక్షిణదిశగ ప్రవహింపసాగేను. ఈ ప్రాంతమునకు వచ్చిన మానవులు నందా నామమును సంకీర్తన చేసినచో । బతుకున సుఖమును మరణమున స్వర్గమును పొందును. పుణ్యకర్మలు ఆచరించినవారు నందాతీరమున దేహమును విడిచిన చో. విద్యాధరరాజులే సకల సుఖములను పొందెదరు. సరస్వతీనదీ స్నానమువలన నదీజలపానమువలన నూనవులకు స్వరము లభించుమ. అష్టమి తిధినాడు, నందానదిలో ఏకాగ్రచిత్తముతో స్నానమాడువారు మరణించిన పిదప స్వర్గ మును పొందెదరు. సరస్వతీనది శ్రీ లకు ఎల్లప్పుడు సౌభాగ్యప్రదాయిని.. తృతీయతిధినాడు ఉపవసించిన సౌభాగ్యవతి సరస్వతీ నదిని దర్శించిన సకలపాపములనుండి విముక్తురాలగును. సరస్వతీనదీజలమును తాకిన వారు మునీశ్వరులగుదురు. సరస్వతీ నదీ తీర మున రజత దానమును చేసిన వారు రూపవంతులు అగుదురు. బ్రహ్మపుత్రి యగు ఈ సరస్వతి పర మపవిత్రురాలు. పవితజలము కలది. నందానామముతో ప్రసిద్ధిగాంచి దక్షిణశాఖముఖముగా ప్రవహించినది. ఆటనుండి కొంత దూర మువెడలి పశాన్ముఖి ఆయెను. అప్పటినుండి సరస్వతీ నది అందరికి కనపడసాగెను. పవిత్రమైన సరస్వతీ నదీ తీర ములు పుణ్యతీర్ధములు. దేవాలయము వెలసి సిద్దులచే మునులచే సేవింపబడు చున్నవి. ఆ తీర్థములలో క్షేత్రములలో సరస్వతియే ధర్మ హేతువు. ఈ నదిలో స్నానము చేయుటవలన జలపానము వలన బంగారమును దానము చేయుటవలన ఉత్తమఫలితము లభించును. బంగారు భూమివలె తనంత భోగమును పొందెదరు. ఈ నదిలో స్నానమాడి దానము గావించినచో అక్షయఫలమును పొందెదరు. మునీం దులు ఈ నదీతీరమున ధాన్యమును ధనమును దానము చేయుట ప్రశ సమనిరి. ఈ నదీతీరమున చేసిన దానము ధర్మ హేతువుగ చెప్ప బడినది. ఈ నదీ తీరమున ప్రయత్నముతో సావధానముతో ప్రాయోపవేశమును చేసిన పురుషుడుకాని శ్రీకాని సకల తీర్థసాయుజ్య మును పొంది ;అహ్మలోకమున యధేన్షఫలమును పొందును. కర్మపరిపాకమువలన ఈ నదీసమీపమున మరణించిన " సావర జంగమములు సకలపాప ములను బో నాడి యజ్ఞఫలమును పొందెదరు. ఈ సరస్వతీ మహానది సాధర్మఫల పదం జన్మజరాది దుఃఖములలో పీడించబడు మానవులకు అన్ని విధములుగా పుణ్యఫలమును ప్రసాదించునది కావున మానవులు ఈ సరస్వతీ నదిని ప్రయత్నించి భక్తిశ్రద్ధలతో సేవించవలయును.

ఇది శ్రీపాద్మ పురాణమున మొదటిదగు సృష్టిఖండమున నందాప్రాచీ మాహాత్మ్యమున పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.