పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
33 - మార్కండేయాశ్రమదర్శనమ్ - ముప్పదిమూడవ ఆధ్యాయము - మార్కండేయాశ్రమదర్శనము
పులస్త్య ఉవాచ
భీష్ముడనియె. మునీంద్రా ! శ్రీరాముడు మార్కండేయుని వలన నిట నెట్లు కొన్ని ముఖ్యవిషయాలు తెలుసు కొనినది. వారిద్దరు నెప్పుడెట్లు కలిసికొన్నారు ? మునీ ! మార్కండేయు డెవ్వని కుమారుడు ? ఆ మహాతపస్వి యెట్లు జన్మించెను ? రాముడక్కడి కెట్లు వేళ్ళెను ? ఎప్పుడు వెళ్ళేనన పులస్త్యుడిట్లనియె. మార్కండేయుని జననవృత్తాంత మిదే లేదు. పూర్వక ల్పమందు మృకండువను ముని ప్రసిద్దుడు. భృగుమహర్షి కుమారుడు. భార్యతో మహానుభావుడు తపస్సు చేనేను. కొండొక దినమందు వారికొక కొడుకు కలిగెను.
అయిదేండ్ల వయసులోనే యాపిల్లవాడు మంచిగుణశాలియై యొ ప్పెను. ఇంటిముంగిట దీఱుగుచు నతడు మంచి జ్ఞానిగా కనిపించెను. చిర కాలమునుండి యతడు జరుగ బోవు విషయము గుర్తింప నేర్చెను. తండ్రి నీ యాయుర్ధాయ మెంత ? లెక్కించి సరిగ తెల్పుమన నతడాజు మాసములు బ్రహ్మయిచ్చినది. నీవు శోకింపనేవలదు. నిజము నెప్పితి ననెను. ఆది విని బాలుని కుపనయనము సేయవలయునని కావించెను. కొడుకును గని తండ్రి, మహర్షులు వీరినందరికి నమస్కరింపుమని జెప్పెను. తండ్రిమాట విని వారికి మొక్కుట కానందభరితుడై సవర్ణుడా అవర్ణుడాతెలియక అన్ని వర్ణముల వారికి మ్రొక్కెను. ఆ పై నైదునెలల నిరువదిరోజులు గడిచినవి. అప్పుడు సప్తర్షులు దారిని వెళ్లుచు నటకు వచ్చిరి. పిల్ల వానికి కనబడిరి. అందజు మొక్క బడిరి. వారు ఆయుష్మాన్భవ పూర్ణాయుష్కుడవుగమ్ము యని దండము మేఖలగల యా చిన్న బిడ్డని దీవించిరి. వారిట్లని మరల క్షీణాయుష్కుడని యా బాలుని తలంచిరి.
వానికై దురోజులే యాయువని తెలిసి వారు భయపడి వానీంగొని బ్రహ్మదరి కేగి యటవిడిచి బ్రహ్మకు మొక్కిరి. వారికి బ్రహ్మయెవరో తెలియలేదు. ఈతడు మాత్రము బ్రహ్మకు నమస్కరించెను. ఆ ఋషుల సన్నిధి నాబాలుని చిరాయు వగుమని బ్రహ్మ దీవించెను. అంతట మునులు బ్రహ్మవాక్యము విని ప్రీతినొందిరి. వారీంగని బ్రహ్మయాశ్చర్యమంది మీరువచ్చిన పనియేమి ? యీ పిల్ల వాడెవరు ! నివేదింపుడనిన పొరు సర్వము నివేదించిరి. మృకండువు పు తుడు. ఆల్పాయుష్కుడు వీని దీర్ఘాయువులగావింపుము. దీనిని తండ్రి యీ మేఖలను కట్టి జందెమును దండ మునిచ్చి పంపినాడు. ఆబ్బాయీ ! భూతలమున చిఱుగు నేమనుజునీం జూతువేని వానికి నమస్కరింపుమని తం డియ నేను. ఆభీవాదనము సేయు స్వభావముగల యీతడు తీర్థయాత్ర సందర్భములో భూమియందిరుగుచు దే వయోగమున గనబడినాడు. పుత్రా ! దీర్గాయు ష్మంతుడగు మని దీవించితిమి. నీవాండ్రము మామాట యెట్లు సత్యమగున నిరి.
ఆడవిని బ్రహ్మ ఈ భూమి (పుష్కరము) ఋత వాక్యమువలన సత్యము=పరమార్ద సత్యవచనమువలన సర్వ విధాలనభయమై యున్నది, ఆయుర్దాయమున నీ పిల్లవాడు మార్కండేయుడు నాతో సమానుడగును. కల్పము మొదట చివర కూడ నుండునని నాయభిప్రాయము అని బ్రహ్మ య నియె. ఈరీతి నమ్మునులు బ్రహ్మలోకమందు బ్రహ్మవలన కార్య సాధన చేసి బాలుని తిఱిగి భూమి కంపిరి. బ్రాహ్మణులు తీర్థయాత్రకు, మార్కండేయుడు తన యింటికి నేగిరి. ఆ విప్రులందరు వెళ్లి నతర్వాత బాలుడు తండ్రితో నిట్లనియె. బ్రహ్మ వాదులగు మునులు నన్ను బ్రహ్మలోక మునకుం గొంపోయిరి. దీర్ఘాయు ష్మంతుంగావించిరి. వరములిచ్చి పంపిరి.
ఇంకొకటిది వారు నాకు జేసినది, నీకు చింతకల్గించునది కల్పముముందు కల్పాంతమువరకు దండి నేనుందును. లోకకర్త యొక్క ప్రసాదము వలన తపస్సుచేయుటకు పుష్కరమున కేగెదను. నేనట దేవదేవుని బ్రహ్మ నుపాసింతును. సర్వాభీష్టసిద్ధిని గూర్చువాడు సర్వశత్రుభంజనుడు సర్వసౌఖ్యప్రదాతను ఇంద్రాదులకు పరమదైవము సర్వలోక పితామహుని బ్రహ్మనుపాసింతునన మార్కండేయునిమాటవిని మృకండుముని పర మహర్షమందెను. ఒక్క క్షణము మాత్రము నిట్టూర్పు పుచ్చెను. మంచిమనసుతో ధైర్యమూని యిట్లనియెను.
నాజన్మ మిపుడు సఫలమైనది. బతుకు మిక్కిలి చక్కని బ్రతుకైనది. సర్వజగత్స పితామహుని దర్శన మేనని నా బిడకు నీకు. వంశోద్ధార కుడవగు పుత్రుడవు నీతోడి కుటుంబినె తిని. నీవు వెళ్లి పుష్కరమందున్న దేవేశుని బితామహుని దర్శింపుము. జగన్నాథుడు కనబడిన అపమృత్యువుపాలుండదు. మానవుల కక్షయసౌఖ్యము ఐశ ఆర్యము తపసు సిద్ధించును. శుభములయిన మూడు శృంగములు మూడతి ప్రసవణములు (వాగులు) మూడు పుష్కరములు సరస్పులు అన్ని యిటనుండుటకు కారణమైయుగము. కనీయాంస (చివరిది) మధ్యమము మూడవది జ్యేష్ఠము వుష్కరమున శృంగము అను పేర శుభములగు ప్రసవణములు మూడు, ఇట త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రుడు నను త్రిమూర్తులు నిత్య సన్నిహితులు. మహారాజా ! పరమపుణ్యుడుగా పుష్కరమందలి తీర్థము (జలము) విరజము (దుమ్ముధూళిలేనిది) విమలము నని ముల్లోకముల ! ప్రసిద్ధి గన్నది. బ్రహ్మలోకమునకు రాచ బాట పుష్కరమును ధన్యులు దర్శింతురు. ఎవడు నూరేండు చివరిదాక నట నగ్ని హోత్రోపాసన చేసి నన్ను ఒక కార్తికమాసము వసించినను రెండు సమానములే. నేనంచేయుటకు, శకి లేదు. చేసిసాధించలేనెతి. తండ్రీ ! నీచేత నప్రయత్నముగ సర్వము హరించు మృత్యువు గేలువబడినది. అచట. కనబడు నాడేవేశుడు బ్రహ్మలోక పితామహుడు, నీకు భూతలమున నీతోదీటగు మర్త్యుడుండబోడు. ఐదేండ్ల బిడ్డవై పుట్టిననీచే నేను సంతోషింపబడినాను. నాపరముచే నీవు చిరంజీవులకుదాహరణమౌదువు. సంచయములేదు. ఆలానా ఆశీర్వచనము నీకు. ఈ నీకందరు దీవనలు పలుకుదురు. కోరిన లోకముల కేగుము. ఈలా అనుగ్రహమందిన మృకండు కుమారునిచే మార్కండేయా శ్రమము అను పేరనోక యాశ్రమమీపుష్కరమందు స్థాపింపబడెను. ఇట స్నానము చేసి శుచియై వాజపేయ ఫలమందును. సర్వపాపములుపోయి విశుద్దమనస్కుడై నరుడు చిరాయుష్మంతుడగును.
శ్రీరామ నిర్మిత పుష్కర తీర్థ ప్రశంస
పులస్త్యుడనియె: శ్రీరామునిచే నిర్మింపబడిన పుష్కర తీర్థముంగూర్చి నీకేఱింగించెద. రాముడు చిత్రకూటమునుండి సీతతో లక్ష్మ ణునితో నత్రిమహర్షి యాశ్రమమున కేగి యమ్మునీంద్రునడిగెను. మహాముని ! పుణ్యతీర్ధములు క్షేత్రము లేవి యెక్కడనున్నవి. ఎటకేగి మానవుడు బంధువులతో నెడబాటునందడు ? ఆ విశేషములు ఆనతిమ్ము, మీరు ప్రతనిష్ఠులు, భగవంతులు. ఈ ఆరణ్యవాసముచే దశరధ చక్ర షెర్రి మరణముచే భరతునితోడి యెడబాటుచే నేను దపించుచున్నానుగదా ! ఆన యమ్మహ్వరి చాల సేవు ధ్యానము సేసి యిట్లనెను.
వీరా ! రఘువంశ పర్థన! చక్కగ నడిగితివి మాతండ్రి యేర్పరచినది పుష్కర తీర్థము ప్రసిద్దము. మర్యాదా పర్వతము యజ్ఞపర్వతమునన రెండుపర్వతములు ప్రసిద్ధ ములు వానిమధ్య జేష్ఠ-మధ్య- కనిష్టకములుమూడున్నవి. ఆటకేగి దశరధుని పిండ ప్రదానము సేసి తర్పణము సేయుము. ఇవి చాల యుత్త మతీర్థ క్షేత్రములు. ఆ వాపి చక్కని అవియోగ అని పేరొందినది. అది సేవించిన బంధువియోగము కలుగదన్నమాట. ఆందు పిండప్రదానము చేసినచో పితరులు భూత పళయము దాక మోక్షమందుదురు. ఇది బ్రహ్మవచనము. ఆట కేగుము. ఇంక పలుమారు లటకురమ్ము. ఆన రాముడు నటకు జనవలెనని సంకల్పించెను.
ఋక్ష పర్వతము విదిశానగరముదాటి చర్మణ్వతీ నదిని దాటి యజ్ఞ పర్వతము సేరెను. వేగముగ నదియుం దాటి మధ్య పుష్కరమునందు నిలిచెను. అందు పితరులకు దేవతలకు తర్పణము చేసెను. స్నానమైన తరువాత మార్కండ మహర్షి శిష్యులతో నట వచ్చెను. బుద్ధిశాలి రాముని చే జూడబడెను. ఆయన కెదురుగా జని ఆదరముతో సాష్టాంగ ప్రణతుడై ప్రభూ! అవియోగవాపి (నూయి) యే దిశ నున్నదని యడిగెను, నేను దశరథ పుత్రుడను రాముడని పేరుగన్నాడను. అత్రి మహర్షి, సౌభాగ్యవాసిని దర్శించ వచ్చితిని. ఆ చోటు ఆ నూతులను భగవంతుడ వీవు నాకు దెల్పుము, ఆన మార్కండేయ ముని యిట్లనియె.
బాగున్నది రాఘవా! భద్రమగుత నీకు. పుణ్యము సేసినావు. తీర్థయాత్రా నిమిత్తముగ నిపుడిటకు వచ్చితివి. రారమ్ము వేళ్ళి అవియోగదాత్రి వాపిని దర్శింపుము. బంధు వియోగము జరుగును యిక్కడనే. ఈ పాపి బ్రతికియున్న ఐని కై కాకయు గతించిన వాని కాముష్మికము నిన్చునది. లక్ష్మణునన్న రాముడు మునిమాట విని దశరథ రాజును దలచికొనెను. భరతుని శత్రుఘ్నుని మతి యింకను గల పౌరులను తలచుకొనెను. ఇట్లు తలచుకొనుచుండగనే సంధ్యవేళ యయ్యెను. సాయం సంధ్యోపాసన చేసి మునులతో, రాముడా రాత్రి తమ్మునితో, ధర్మపత్నితో నిదుర పోయెను. వేకువ తుద కల చివర తల్లితో దండ్రితో మటి యందరితో నయోధ్య యందుండెను. వివాహము మంగళము జరుగుచుండెను, పెక్కుమంది బంధువులతో గూడ పత్నితో ఋషులతో చుట్టువారు కొని లక్ష్మణునితో యున్నట్లు కనబడెను.
ప్రభాతవేళ నిదియేల్ల మునులకు వర్ణించి చెప్పెను. ఋషులు గూడ ఔనౌనది నిజము రఘునాధ! చనిపోయిన వ్యక్తి దర్శనమైనపుడు శ్రాద్ధమవశ్య మాచరింపవలెనని స్మృతులన్న వి. పితరులు వృద్ధిని కోరుదురు. ఆలాగే అన్నము కాంక్షింతురు. భక్తి గలవానికి కలలో దర్శనమిత్తురు. రాఘవా! పదునాల్గేండ్లు నీకు తమ్ము లతో భరతునితో, తండ్రితో వియోగముండదు. దశరథ రాజునకు శ్రాద్ధ మొనరింపుము. ఇదుగో వీరు ఋషులు నీ భక్తులు. క్షణము గావించి వచ్చిరి. (భోక్తలుగా దయచేసిరన్న మాట). నేను జమదగ్ని, భారద్వాజుడు, లోముడు, దేవరాతుడు. శమీకుడు, వీరార్యుడు, బ్రాహ్మణులు నీ పెట్టు శ్రాద్దమందు వచ్చినారు. సంభావములను సమకూర్చుకొనుము. ప్రధానమయినది గారకాయల పిండి. రేగుపండ్లు, ఉసిరికాయలు, మారేడు పండ్లు బాగా పండినవి దుంపలు పెద్దవి చిన్నవి, మృగ మాంసము, ధాన్యము రకరకాలు. ప్రతనిష్ఠుడవు శ్రాద్ధ దానము చే విఫులకు తృప్తి సమ కూర్చుము. పుర్కరారణ్య మేగి యాచారముతో ఆహార నియమముతో మీ పితరులను తరింప జేయుము. ఇట్లు చేసినవాడశ్వమేధ ఫలమందును. మేము స్నానార్దము జ్యేష్ఠ పుష్కరమున వెళ్ళెదము, అని పలికి వారందఱు నటు జనరి.
రాముడ మేధ్యము = పవిత్రమృగమును తెమ్మని లక్ష్మణునితో జెప్పెను. శుద్ధములగు కన్నులు గల శశకము. కృష్ణ శాకము తేనే జంబీరములు (దానిమ్మ పండ్లు) ముఖ్యములయిన దుంపలు రక రకాలు పండిన వెలగ పండ్లు యింక నుం గల పండ్లు తెమ్ము లక్ష్మణా వేగముగ జరుగవలెనన లక్ష్మణుడట్లు యంతయుం గావించెను. రేగిపండ్లు గగారకాయలు మొదలగు శాకములు మూలముల నన్ని యు పెద్ద ప్రోగు పెట్టెను.
జానకి వండి రామునికి నివేదించెను గూడ. రాముడు యోగవాపియందు స్నానము చేసి యా మునుల కెదురుసూచుచు మధ్యాహ్న ము దాదేను. సూర్యుడి కుతకాలము రాగానే, రాముడును మంత్రము సేసిన (పిలిచిన) ఋషులందరు వచ్చిరి.
ఆ వచ్చిన మునులంజూచి వై దేహి జనకుని కూతురు రాముని సన్నిధిని వదలి సిగ్గుపడి వేఱొకచో నీలిచెను. ఆశ్చర్యమున కన్నులు విప్పార వణకుచు నిట్లనుకొనెను. బ్రాహ్మణు లేటుగరు. శ్రాద్ధ సమయానికి వచ్చినారు. స్మృతులు నొప్పినట్లు రాముని చే విప్రులు భోజన మువెట్టబడిరి. శాస్త్రోక్త మటి వైదిక క్రియలన్ని జరుపబడినవి. పురాణే క్రమగు విధానము వైశ్వదేవి పూర్వ కముగ పితృసమర్చన నిర్వర్తింపబడినది. విప్రులు భోజనము చేసిన తర్వాత పిండములు క్రమముగా నొసగి దక్షిణలు యథాశక్తి నిచ్చి వారిని సాగనంపగా నా విప్రో త్తములు జన రాముడు జానకింగని యిట్లనియె.
సుభ్రు! ఇట దయసేసిన మునులంగని యెందులకు లేచి వెళ్ళితివి? అదెల్ల నీవున్నదున్నట్లు కారణము సెప్పు. వెంటనే పరోపకారణమున జరిగియుండునదియు నాయెడ దాచ రాదు. నా యొక్కయు లక్ష్మణుని యొక్కయు ప్రాణములతో శపథము సేసి చెప్పుచున్నాను. శుచిస్మితా, అని భర్తయన సీత సిగ్గుపడి తలవంచికొని నిలిచెను. కంటనీరు గ్రుక్కుకొనుచు నామె రాఘవుం గూర్చి యిట్లనెను.
నాథ! నేనిట చూచిన వింత యేలాటిదో విను. నీవు తలచుకొనుచున్న రాజేంద్రుడు (దశరథుడు) ఇప్పుడిటకు వచ్చెను. సర్వాభరణ భూషితుడు సరిగా నాయనలా యున్న అమరి ముగ్గురు బ్రాహ్మణుల దేహములంగూడిన పితరులను నేను జూచి సిగ్గువడి నీదరినుండి వెడలి చాలైతిని. నీవు బ్రాహ్మణులకు వడ్డించితివిగదా! శ్రాద్దము యథావిధి జరుపబడినది. నారచీరలు కట్టుకొని లేడితో లు గప్పుకొని యెట్లు రాజుముందు తిరుగు చుండగలనా? శత్రువీర సంహార! నిజమిది సెప్పితిని. పట్టుచీర లేమో కైకేయి కాజేసినది.
అది మొదలుగ నేను నారచీరలు గట్టుకొని ఆడవిపాలై తెలిసియు నీకు దుఃఖము గలుగగూడదని కొందే మేని యిది నెప్పను. ఓ పరమతపస్వి! నేను మా అమ్మను నాన్న ను తలచికొనుటలేదు. ఈ వనవాసానికి సమా పి ఎప్పుడు కాగలదో! ఇదే ఎల్లపుడు మణిమటి యూరక దలచుకొనుటలోనే రోజులు వెళ్ళుచున్నవి స్వామీ! నీ పాదములు తోడుగా జెప్పుచున్నాను. నా చేతితో నేనీలాటి భోజనము రోజున కెట్లు పెట్టుదును? దాసులకు దాసుడైనవాడు (నౌకరులకందటికంటే నౌకరు) కూడ యెన్నడు తినని యీ లాటిది యీయనకు పెట్టుటకేలా నేనుత్సహింతును? ఆ రాజుచేనింత సర్వాలంకారసమలంకృతవైవింజామర చేకొని యా త్రిభువునకు వీచుచు జూడబడిన నేనిపుడు చెమటచే దడిసిన మేనితో నేదురువడి యెట్లు ప్రభువులజూతును? అడవిలో క్లేశముల వళ మై యేడ్చుచు నేమాత్రము కినియక పిల్లను నన్ను జూచిన ప్రభువునకు శోకము గల్గునని నేను జూడు వీడితిని. రామచంద్రా! నా ప్రాణసముడవు నీవు, నీ దగ్గర గోప్యమిట లేనే లేదు. నిజమిది, ప్రమాణము చేసి నీ పాదములం దాకుచున్నాను అని జానకి పలికెను.
రాఘవుడది విని యెప్పుడు ప్రియమే పలుకు యా ప్రియురాలిని తన ఒడిచేర్చి యాదరముతో గాఢముగ కౌగలించి కొనెను. ఆపయి రామలక్ష్మణులు భోజనము చేసిరి. తర్వాత జానకి భుజించేను.
పడమటి దెసగా నొక క్రోశమరిగి జ్యేష్ట పుష్కరముదాక పూర్వ బాగమున రాఘవుడున్నంత సేపు దేవదూత మాట నాలించెను. ఓ రాఘవా! భద్రమగుగాక నీకు ఈ తీర్థ మెంతో దుర్లభము. ఓ వీరా! ఇచ్చోట నీవున్నావు. ఇట పుణ్యాత్ముని గావించుకొనుము. దేవకార్యము నీవు చక్కబెట్టవలెను. దేవక్రతువులు నీచే జంపబడవలసియున్నారు. దేవదూత మాటవిని హర్షించి లక్ష్మణునితో నిట్లనియె. సుమిత్రా కుమారా! దేవదేవుడగు బ్రహ్మ యనుగ్రహపాత్రుడ నైతిని.
ఇటనొక యాశ్రమమేర్పరచుకొని యొక్క నెల కాయశోధనము (శరీరము శుద్ధి) యగుటకు వ్రతమాచరింప గోరెదను. మంచి దాలాగే కానిమ్మని లక్ష్మణుడనగా వ్రతమిది పూర్తి సేసి యాపుష్కరమందు పిండదానాదీ దానములచే శ్రాద్ధము లచే పితామహ ప్రపితామహాదులను యధావిధి తర్పింపజే నెను. కనక, సుప్రభ, నంద, ప్రాచీ, సరస్వతియను నేదు ప్రోతస్సులు పుష్కరమందు పితరులకు సంతుష్టాగూర్చువానింగూర్చి ప్రతిదినము సేయు పితృ దేవతల పూజను మాతృవరముతో మొదలిడి జరిపి యపుడు రాముడు లక్ష్మణునిగూర్చి యొక మాట పల్కెను.
రమ్ము లక్ష్మణా! శీఘ్రము నీవు పుష్కర జలము తెమ్ము. కాళ్ళు గడిగికొని చాప పై పరుండుము. వేకువ గడచిన మీద దక్షిణదిశకు వేళ్ళుదమనెను. లక్ష్మణుడు యది విని సీతమ్మ యాజలము గొని వచ్చుత! అన్నయ్యా! ఎప్పుడూ నీకు దాసత్వము (నౌకరీ) చేయు చున్నాను. ఈ మేయో మీ గుల పుష్టిగానున్నది. ఓపికగా నున్నది. నాకంది. ఇపుడు నీవీ భార్యతో ఏమి సేయుదువు? తెల్సు. శరీరపుష్టిగొని నీ వెంతేని గూర్చు నీ మే పోయినవాని కేమి చేసినట్లు? ఎల్లకాలమీ మేను పుష్టిగా నుండునట్లు రక్షించుచున్నావు. ఈ మెయో నిత్యము తానానందించుచు చక్కగ పుష్టిగొని నన్నెపుడు శ్రమ పెట్టుచున్నది. నీవునూ నన్నే శ్రమ పెట్టుచున్నావు. నీ కొఱకు నేనెప్పుడు నాకలి దప్పికల నేర్చుకొను చున్నాను. సందియము లేదు. ఇక పరలోకమందునా? ఆది వినుము. గనిపించదు. భార్య, పు తుడు యేదిగాని చచ్చిన వాని వెంట వెళ్ళు దొక్కటి గనిపించదు. జ్ఞానులన్న మాట యిది. నీ తండ్రి, కైకేయి ప్రియము కోరి నిష్కంటకమయిన రాజ్యము విడిచి నిన్న డవిలో పడవేసి చనిపోయినాడు. ఆ కై కేయి ధనము అందరు చుట్టాలు ఇక్కడే యున్నారు. మహారాజు దశరథు డొక్కడే గతిం బొందినాడు. నీతో గూడ సీత పచ్చునని నేననుకొందును. నిజమిది. ఈమెతో నీ విపుడేమి సేయుదువు రామా! తెల్పుమ నెను. మున్నెన్నడు వినని యీ లక్ష్మణుని పలుకాలించి మనస్సు చెడిపోయి రాఘవుడట్లే మనస్సు కలతచెంది తెల్లపోయి నిలిచెను. సీతయునంతే.
లక్ష్మణుడనినదెల్ల జానకి సేనేను. పుష్కరేక్షణులు (తామర పూవువంటి కన్నులు గలవారు) రామలక్ష్మణులు స్నానము చేసి భోజనము చేసి రాత్రి గడిపి ప్రయాణమైరి. సుమిత్ర కుమార ! రా! లే, - దక్షిణ దిశ గా వెళ్ళుదమన, కమలనయనా! నీవీ మెతో వెళ్ళు నేనంకొక అడవికిబోను. అయోధ్యకును వెళ్ళను. పదునాలుగేండ్లు నీ యడవిలోనే వసింతును. నన్ను విడిచి నీ వయోధ్యకు వెళ్ళవేని యీ దారినే నాతో నీవు రావలెను. అన్నాళ్ళు నేను బ్రతికి యుంటినా తండ్రి పురమునకు తిరిగి వెళ్ళేదను. ఇది తపస్సుగా భావింతును. నాతో నీవేమి చేసెదవు? తిరిగి భార్యతో దిరిగి వచ్చిన నిన్ను కమలలోచనుం జూచెదను. తండ్రి తాతల రాజ్య మయోధ్య యందున్న ది. శత్రుఘ్న భరతులిద్దరు నీ యాజ్ఞ నొనరించువారున్నారు. నీ ప్రకూలుడను. నేనా విశేషించి వనవాసమందు పగలు రాత్రి పనిచేయజాలను. సుఖముగా నీవేగుము. ఇట్లు పలుకు లక్ష్మణుని గూర్చి రఘుకుమారు డిట్లనియె.
నాతో గూడ యయోధ్యనుండి వెడలి యెట్లు వచ్చితివి? నిన్ను విడిచి స్వర్గమం దేని యెన్నడు నుండను. శూరాగ్రేసర నీ కేది గతియో నాకు నదే కాగలదు. నన్ననుగ్రహింపుము. నన్ను గూడ కొని యేగుము. సగము దారిలోన నీవేట్లుందువు? అన లక్ష్మణుడు నేనింక వనమునకు తిఱిగి పోననేను. అట్లు నిలిచినట్లు చూచి లక్ష్మణుని గూర్చి రాముడ నేను. లక్ష్మణా నా వెంట రమ్ము, ఒంటరిగ నడవి కేగుచున్నాను. నాతో నీవు నడువు రెండవది సీతయే అని రాముడు లక్ష్మణునితో ననెను. రాముని మాట గ్రహించి లక్ష్మణుడు లేచెను. మర్యాదా పర్వతమునుంజేరి అజగంధుడను దేవేశుని పినాకిని శివుని దర్శించి సాష్టాంగ ప్రణామములు నేసి పార్వతీ ప్రియుని శంకరుని రాముడు నీలిని మనస్సు నిలిపి మేను గగుర్పాటు చేంద చేతులు మొగించి స్తుతించెను. రజస్తమో గుణముల విదశించి కేవల సాత్విక భావమూని వరమశివుని లోకకారణు సర్వ దేవాధీశునిగ తెలిసికొనెను.
శ్రీరాముడు చేసిన శంకరస్తుతి
రుద్ర ఉవాచ-
ఇట్లు స్తుతించు రామునికి శూలపాణి వృషభద్వజుడు పరమ శివుడానందించ రుద్రుడిట్లనియె. రామభద్రా! సంతో షించితిని. భద్రమగుగాక నీకు. స్వచ్ఛమైన కులమున బుట్టితివి. నీవును సర్వ జగద్వంద్యుడవు మానుష రూపమూనిన భగవంతుడవు. అనాథ నాధుడవు. దిక్కు అయిన నీచే దేవతలు కలకాలము సుఖులయి యున్నారు. పదునాల్గోండు జరిగిన తర్వాత నిన్ను చిరకాలము సేవింతురు. ఈ భూమినున్న మానవులయోధ్యకు తిరిగి వచ్చి దర్శించు నదృష్టవంతులు సుఖమందుదురు. వారికి స్వర్గమందు నివాస మక్షయము. దేవకార్యమది చాలా పెద్దది నిర్వర్తించి తిరిగి పురమునకు రమ్ము అనిరి. రాముడునటు పర మేశ్వరుని మ్రొక్కి వెంటనే బయలు దేరెను.
ఇంద్రమార్గయైన (తూర్పుగా ప్రవహించు) నదినిజేరి జటాజూటమును బిగించికొని, లక్ష్మణుని ఈ నా ధనుస్సును నా కందిమ్మ నెను. లక్ష్మణుడు విని సీతతో నిట్లనియె. దేవీ! నేను కారణము లేకుండ విడువబడితిని? నా తప్పు నే నెఱుగను. మహా వీరుడు కుపితుడై నాడు. నాకిక బ్రతుకుతో బనిలేదు. ఛీఛీ కులము చెడబుట్టిన వాడను. మహాత్ముని మనసు చెఱచితి. నేనేలోకమున కేగుదునో? రెండు చేతుల మొగము గప్పుకొని కన్నీట కంఠము డగ్గుత్తికవడ నిట్లనియె.
త్రికరణములచేత (శరీరము, మనస్సు, మాటచేత) రామునియెడ నపరాధము సేసి యెఱుగను. దేవీ! నీ పాదములంటి ప్రమాణము సేయుచున్నా నన సీతాదేవి రామునింగని తమ్ముని విడిచినట్లేనా? పిల్లవాడు లక్ష్మీవర్తనుడు లక్ష్మణునియెడ వైషమ్యము విడువుడన రాఘవుడు సీతంగని నేను లక్ష్మణునీ విడువను. ఎన్నడుగాని కలలోగాని. లక్ష్మణుని మతము విన్నాను. ఇదేదో తము యొక్క చర్య. ఈ క్షేత్రమందు జనులందరును స్వార్థపరులు. ఒకరి సంగతి నొకరు చూడరు. తమ శాంతమును మజతురు, తండ్రిమాట కొడుకులు వినరు. కొడుకుల మాట తండ్రులు వినరు. శిష్యులు గురువు మాట గురువులు శిష్యల మాట వినిపించికొనరు. ప్రీతి అనేది కేవలము డబ్బుతో ప్రయోజనముతో ముడివడియున్నది. ఎవ్వడు నెవ్వనికి స్నేహితుడు లేడు. ఆని యిలా అనుచు దేవా మహానదిం జేరి తమ్ము నీతో సీతతో రాముడు చక్రాభి షేకము సేసి పితృదేవతలకు, దేవతలకు తర్పణములు సేసి సూర్యుని మటిమటి పలుసారులు దర్శించి యభిషేకము ముగించి సీతతో, లక్ష్మణునితో గిరిరాజ కన్యతో కుమారునితో గూడ యభిషేకము నిర్వర్తించిన భగవంతుడు పర మేశ్వరుడట్లు విరాజిల్లెను.
ఇది శ్రీరాముని మార్కండేయాశ్రమదర్శనమను ముప్పది మూడ - అధ్యాయము.
