పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము
34 - బ్రహ్మాండదానమ్
పులస్త్య ఉవాచ
భీష్ముడనియె. ఎప్పుడు బ్రహ్మ సృష్టికర్త యజ్ఞ సామగ్రితో యజ్ఞారంభము చేసినది యానతిమ్ము. ఋత్విక్కుల పేరేమి? వారికిచ్చిన దక్షిణ యేమి? ఆ జరిగినదెల్ల ప్రశంసింపుము. ఎంతో కుతూహలము గల్గుచున్నది. యన పులస్త్యుడనియే. ఇంతమున్నే స్వాయంభువ ప్రజాపతులను స్వాయంభువ మనువు సృష్టి చేయుమని నెవ్పబడెను, బ్రహ్మ తాను పుష్కరమున కేగి యజ్ఞ సామాగ్రి సమకూర్చుకొని అగ్ని శాలలో గూర్చుండెను. గంధర్వులు పాడిరి. అప్సరసలాడిరి. బ్రహ్మ ఉద్దాత. హోత, ఆధ్వర్యుడు నల్వురు యజ్ఞ ప్రధాన నిర్వాహకులు ఒక్కొక్కరికి మతి ముగ్గురు వంతున పరివారము నేర్పరచెను. బ్రహ్మ చ్చం హోత ఆగ్నీధుడు అన్విక్షరీ సర్వవిద్యా బ్రహ్మ అను నీ నల్వురు ఉద్దాత, ప్రత్యుద్ధాత ప్రతిహర్త సుబ్రహ్మణ్యుడు నను నల్వురు. రెండవ పరివారము ఉద్ధాతది. హోత మైత్రావరుణుడు అచ్చావాకుండు గ్రావస్తువు నను నల్వురు హోత్రమును మూడవది. నాల్గవది ఆదృశ్యుడు ప్రతిష్టాత నష్ట ఉన్నత నను నలుగురు నాల్గవ వర్గము. వీరు మొత్తము పదునారుగురు ఋత్విజులు.
స్వయంభువు బ్రహ్మ మొత్తము మూడువందల యరువై యజ్ఞములను సృష్టించెను. ఇందే ఋత్విక్కులు, బ్రాహ్మణులు పేర్కొనబడిరి. ఒక రిందు త్రి సామాధ్వర్యుని సదస్యునిగ బ్రహ్మ ముగ నారదుని గౌతముని బ్రాహ్మణంచ్చంగ దేవగర్భుని హోతగ, దేవలుని అగ్నీధుడుగ, అంగిరసుని ఉద్దాతగ పులహుడు ఉద్దాతగ నారాయణుడు ప్రతిపా రగ ఆత్రి సుబ్రహ్మణ్యుడుగ నుండిరి, భృగువు హోత, మైత్రుడు వశిష్టుడు, అచ్చా వాకుడు క్రతువు, గ్రావుడు చ్చవనుడు, పులస్త్యు డధ్వర్యుడు, శిబి ప్రతిష్టాతగ, బృహస్పతి నేషశాంక పాయనుడు ఉన్నేత పుత్రపౌత్రులతో ధర్ముడు సదస్యుడయ్యెను. భరద్వాజులు మొదలు వేద శిరసుదాకా పదిమంది యధ్వర్యుడై త్యాదులు మార్కండుడు గండియు పుత్రపౌత్రులతో శిష్యులతో బంధువులతో నడి రేయింబవళ్ళు యజ్ఞకర్మ నిర్వర్తించు వారైరి. మన్వంతరము చివర యజ్ఞమున కవబృధ మైనది. బ్రహ్మకు దక్షిణ తూర్పు దిక్కు. హోతకు దక్షిణ దిశ అధ్వర్యునకు పడమటి దిశ, ఉద్గాతున కుత్తర దిశ దక్షిణ యీయబడెను. మొ త్తము మూడు లోక ములను దక్షిణగ వారికి బ్రహ్మ యిచ్చెను.
యజ్ఞ సిద్ధికి నూరు దేనువుల నీయవలసి యున్నది. అందు నలుబది యెనిమిది మొదటి స్థానమువారికి, ఇఱువదు నాల్గు గోవులను రెండవ స్థానము వారికి, మూడవ స్థానమందు పదునాలు, ఆగ్నీద్రాదులకు పదునాలు ఈ లెక్కలోనే గ్రామములు, దాసీలను అజావికము దక్షిణ యీయబడెను. సహస్ర సమారాధన సేయవలెను. అవబృథస్నా నము సేసి యజమానుడు తన సర్వస్వమును, సర్వ ధనమును ఈ యవలెనని స్వాయంభువు చెప్పినారు. ఆధ్యర్యులకు సదస్యులకు స్వేచ్ఛగా తన యిష్టానుసార మీయవలెను. అప్పుడు బ్రహ్మ విష్ణువుం బిలిచి యానందముతో నిట్లనియె.
ఓ వ్రత సంపన్నా! సావిత్రిని బ్రతిమాలి నీ నిటకు తీసికొనిరా ! ఆ శుభానన నీవు కనబడినచో కోపము చూపదు. స్నేహభరితములు , హేతుయు క్తములగు, మంచి మాటలే నీవేప్పుడు మధురముగా మాటలాడుదువు. నీ నాలుక యమృతముంజిందును. నీవన్న మాట సేయనివాడు ముల్లోకముల నొక్కడుం గనబడడు. గంధర్వులతో వెళ్ళి నా ప్రియసతిం దీని కొనీరా. తడవు నేయకు మాధవా వేళ్ళు వెంటనే. కల్యాణి లక్ష్మీదేవి సావిత్రి సదనమునకు నీ ముందు నడువవలెను. ఆమె దారిన నీవు జనుము. మా ఆవిడను బ్రతిమాలుము. దేవి నీకప్రియము దనకుదా నొక్క నిష్టపడదు. సుందరి యెపుడు నీ మోమునే చూచుచుండునని ఈలాంటి మధుర ఔషణము లన్నో వినిపించి మా ఆవిడ సంతోషభరితురాలగునట్లు చేయుము.
బ్రహ్మ యిట్లు పలుక విష్ణువు సావిత్రియున్న తావునకు సత్వరమేగెను. వత్ని తో గూడ వచ్చుచున్న విష్ణువుం జూచి తొందరతో లేచి నిలువబడ్డ సావిత్రి జూచి విష్ణువు నమస్కరించెను. దేవదేవేశి! బ్రహ్మపత్ని నీకిదే నమస్కారము. నీకు మొక్కి సర్వ ప్రజ పాపము నుండి విడివడును. పతివ్రత మహానుభావవు. బ్రహ్మ హృదయమందున్న దానవు. రేయింబవలు నిన్నే తలచి కొనుచు నీ ప్రసాదముం గోరుచున్నాడు. భృగుకుమారి యిదిగో యీ సాధ్వి లక్ష్మీ నడుగుము. అని యిటు పలికి శౌరి సావిత్రి రెండు పాదములను రెండు చేతులం బట్టి నమస్కరించెను.
సర్వజగద్వంద్యుడు జగన్మాతనిట్లు తాకి నమస్కరించెను. ఆ దేవి పాదముల ముడుచుకొని తన చేత హరి చేతులం బట్టుకొని అచ్యుతా! నేను అన్ని విధాల శాంత నై యున్నాను. ఈ లక్ష్మి నాయన్నా ఎల్లప్పుడు నీ హృదయమందు నివసించును. నిన్నొదలి మరి యెందెన్న డు పేక్ష గొనదు. నీ పత్ని యీమె. యు త్తమ వ్రత సంపన్న భృగుపత్ని కుదయించినది. దేవదానవుల వనికచే పాలసముద్రమున నుదయించినది. భగవంతుడు హరియే అవతరించునట నీ మె యవతరించును. దేవత్వమందీమె దేవశరీరిణి. మానుషత్వమందు మానుషి, నీ తోడ నయను వర్తించును. దాంపత్య వ్రతశీలిని యెల్లప్పుడు. నేవీపుడు చేయవలసినదేమో ప్రభూ! తెలుపుమన విష్ణుడనియె.
విష్ణు రువాచ
యజ్ఞము ముగియు చున్నది. నీ సన్నిధికంప బడితిని. సావిత్రిం ద్వరగ తీసికొని రమ్ము, త్వరగా వెళ్ళు, దేవత అందరితో కూడిన బ్రహ్మ ను చేరుము. లక్ష్మియనియె. వేగముగ లేమిపుడు. నీ బ్రహ్మదరి కేగుటకు సావిత్రీ నీవు లేకుండా నేను వెళ్ళను. నీ పాదములు తాకి చెప్పుచున్నాను. అని యామెను చేయివేసి నిలువబెట్టెను.
పట్టుకొని లేపి నిలువ పెట్టి సావిత్రి యాలస్యము చేయుచున్న దని తెలిసి బ్రహ్మ దగ్గరనున్న శంకరుని కిట్లనియె. ఈ పార్వతితో నీవు ముందేగుము. గౌరి నీ ముందు వెళ్ళవలెను. తరువాత నీవు వెళ్ళుము శంకరా! ఆమె వచ్చు నట్లు తెలియజెప్పి శీఘ్రముగా వచ్చునట్లు చేయుము. అని పలుక పార్వతీ పరమేశ్వరులు పుణ్యదంపతులటకేగి బ్రహ్మ ప్రియ వల్లభ నిట్లనిరి.
చాలా పెద్దవని నీ వట కావింపవలసి యున్నది. సాధ్వీ! గిరికన్య నీగౌరి నడుగుము. విశాలాక్షి నీలక్ష్మిని, ఇంద్రాణిని శచీదేవి నడుగుము. ఎవరియందు నీ విశ్వాసమో వారి నడుగుము. దేవీ! నమస్కారమన దేవదేవునికామె దీవనలిచ్చెను. నీ సగము మేన గౌరి యెప్పుడు నుండును గావుత! త్రైలోక్య సుందరుడవే సుందరిచే సదా శోభిల్లుచుందువు. శత్రుసంహారా! నీచే జగమెల్ల సుఖథాగియై యున్నది. అని యీ పలుకు సావిత్రిం జేకొని గౌరి యెడమ చేయి లక్ష్మి కుడిచేయి చేకొన నామెకు శంకరుడభివాదము సేసి యిట్లనియె.
గౌర్యువాచ
రా రమ్ము మహానుభావురాల! నీ భర్త వున్న తావునకు రమ్ము! స్త్రీలకు భర్తయే పరమగతి. పెద్ద ఆగ్రహమందను రాగము గొని దనుట మంచిది. ఎవ్వరి ననుమాన పరువరాదు. మేము ప్రార్ధించుచున్నా మట కానందముతో జనుమన గౌరి యిట్లనియె. నీకెంతేని గూర్చు దానము. నీవును స్వయముగా వినుచున్నావు. నీ కుడి చేత లక్ష్మి లగ్నమై యున్నది. నేను నీ యెడమచేయి చేవట్టితిని. నీ స్వామి యున్న చోటికి రారమ్ము అన లక్ష్మీ పార్వతులిద్దరి మధ్య నిలిచి సావిత్రి బయలుదేరెను. విష్ణు రుద్రులు ముందు నడచిరి. ఇంద్రాది దేవతలు గంధర్వు అప్సరసలు చరాచరము త్రైలోక్యము నటు ముందుకు సాగిరి. బ్రహ్మ ప్రియ సావిత్రి దేవి యటకుం వచ్చెను.
సుముఖి నట వచ్చిన సర్వలోక పితామహుడు గాయత్రితో గూడ సావిత్రిం జూచి యిట్లనియె, ఈ దేవి గాయత్రి నీ నెప్పిన పని చక్కబెట్టును. నేను నీ వశుడను నే జేయవలసిన దానతిమ్మని బ్రహ్మ వినయముగ పలుక సిగ్గున మోము వంచుకొని యించు కేని పలుకదయ్యెను. బ్రహ్మ ప్రేరణ గాయత్రి యామె పాదములపై బడి అపరాధము సేసితి క్షమింపు దేవికి నమస్కారము నీకు అనేను. సావిత్రి యాదరముతో మెడవట్టి కౌగలించుకొని యేదో బాధతో నున్నట్లున్న గాయత్రిదేవిని సాంత్వన పరిచి (మంచి మాటలాడి) ఈయన మావారు గౌరవింపవలసినవారు. ఆయన మాట చేయవలసినదే స్త్రీలకు ప్రాణేశ్వరుడు గదా భగవంతుడు. బ్రహ్మ సృష్టి సమయమున మున్న న్నారు. స్త్రీలకు వేరు యజ్ఞము లేదు. వ్రతము లేదు. ఉపవాసము లేదు. స్వామి యేమన్న నది కాదనక చేయవలెను. భర్తను నిందించినను, తోబుట్టువును నిందించినను (ఆడ పడచును) పరిపాదము చేసినా ప్రలాపము (హద్దు మీరి మాటలాడినను) సామె నరక మున కేగును. భర్త జీవించియుండగానుప పాస వ్రతము చేసిన శ్రీ భర్త యాయుర్ధాయమును హరించును. నరకమున కేగును. ఇది తెలిసి సాధ్వి! నీవు భర్త కప్రియము సేయరాదు. ఎప్పుడు నీవీయన కుడివైపున నిలువరాదు. ఎల్ల పనుల నే నీయన కుడి వైపున నిలుచును. సాధ్వి నీ వెడమవైపున నుండుము. నారదుడు పుష్కరుడు యిరువంకల నుందురు. ఇంక బ్రహ్మ స్థానములు ఆయతనములు (గృహములు) వేరే యున్నవి. సృష్టియగు చున్నంత కాలము శోభిల్లుచున్నవి పొందెదవు. నీవు నేనును నట నుండవలసినదే. సందియము లేదు. పుష్కరమందు బ్రహ్మ యెడమవైపు నీ వుండుము. నా యిచ్చిన ఈ యువ దేశముచే నాతో గూడ సుఖముగ నుండుము.
అపుడు గాయత్రి యిట్లనియె. నీ నిర్దేశ మిట్లు నే నెదను. నీ యాజ్ఞ సేయవలసినదే. నీవు నా ప్రాణ సఖివి. నేనో చెల్లెలను నన్నె పుడు రక్షింప దగుదువు. పుష్కరమందు దేవదేవుడు బ్రహ్మ స్నానము చేసి యెల్ల వేల్పులకు పరములిచ్చెను. దేవతల ప్రభువుగా శకుని, జ్యోతిస్సు లకు దివాకరుని, నక్షత్రములకు సోముని (చంద్రుని), రసములకు వరుణుని, ప్రజాపతులకు దక్షుని, నదులకు సాగరుని, ధనాధ్యక్షునిగ కుబేరుని, రాక్షనులకు భూతములకు సర్వ గణములకు పినాకిని (శివుని), మానవులకు మనువును , పనులకు గరుడుని, ఋమలకు వశిష్ఠుని, గృహములకు ప్రభాకరుని ఈ మొదలుగ వారి వారికి ప్రభుత్వమొసగి విష్ణువును, శంకరుని గూర్చి యాద రముతో బ్రహ్మ యిట్లనియె.
తామిద్దరు పృథ్వీ యందన్ని తీర్థములందును పూజనీయులు. తామిర్వురు లేని తీర్థమెందును పుణ్యత్వమునందదు. లింగము గాని ప్రతిమ గాని యెట కనిపించినను మానవులు లుపహారములతో నన్ను పురస్కరించి పూజ సేయుదురో వారికి రోగ భయ మెట్లుండును? ఏ రాష్ట్రములందు మీకు ఉత్సవములు పూజలు మొదలైనవన్ని జరుగునో నట్టి ఫలమాలింపుము.
త్రిమూర్తి పూజా ప్రభావము
వ్యాధులు, మనోవ్యాధులు, ఇబ్బందులు, ఆకలి భయాలు, ఇష్ట (బంధు) వియోగము, ఆనిష్ట (శత్రు) సంయోగము, కంటి జబ్బు, నరాల జబ్బు, పిత్త, శూల భగందరాది వ్యాధులు, ఆభిచారము (చేతబడి), భయము, ఆపస్మారము (మూర్చ) విషూచి, ఇవన్నీ పోయి సర్వ విధాల ఆరోగ్యము, దీర్ఘాయువు, ప్రజాధన సమృద్ది కల్గును. ఆకాల మృత్యువుండదు. గోవులు సమృద్ధిగ పాలిచ్చును. వృక్షములు సకాలమున ఫలించును. ఉత్పాత భయమణు మాత్రము నుండదు. ఇది విని యా పై బ్రహ్మను స్తుతింప భూనెను.
విష్ణుకృత బ్రహ్మాస్తుతి
రుద్రకృత బ్రహ్మాస్తుతి
అపుడు సంతోషించిన బ్రహ్మ శివుని ఇష్టమొచ్చినది కోరుకోనిన, తీర్చెదననెను. అప్పుడు శివుడు నీవు ప్రసన్నుడ వైనచో, నీ స్థాన మేమిటో, ద్విజులు ఎక్కడెక్కడ నిన్ను చూతు తెలుపుము. భూమి పై నీ స్థానము ఏ పేరుతో విలసిల్లుతున్నది. భక్తిగల నాకది తెలుపుము. అనగా బ్రహ్మ ఇట్లు చెప్పెను .
బ్రహ్మా క్షేత్ర ప్రశంస
(158 వ శ్లోకము వరకు సూట ఎనిమిది స్థానములు - వానియందు బ్రహ్మ పేర్లు),
మూడు సంధ్యలలో నా సాన్నిధ్యమున నున్న వాడు దివ్యమగు స్థానమును పొంది శాశ్వతముగా ఆనందించును. మనో వాక్కాయముల దుష్కృతము నిస్సందేహముగా నశించును. ఈ స్థానములన్నింటికి వెళ్ళి నన్ను దర్శించువాడు మోక్షమును పొంది నేనున్న స్థానమును పొందును. పుష్పోపహారములచే, ధూపముచే, బ్రాహ్మణ తర్పణచే, స్థిర ధ్యానముచే పరమేశ్వరుని పొందదగును. ఆ పుణ్యఫలమత్యుత్తమమైనది. చివర మోక్షమును కూడా పొందుదురు. బ్రహ్మలోకమును పొంది ఆచట నుండును. మరల సృష్టి జరగగా వైరాజుల రాజగును. తెలిసిగానీ, తెలియకగానీ ఈ లోకమున చేసిన బ్రహ్మహత్య మున్నగు పాపములు గూడా తక్షణమే నశించును. ఈ లోకమున దరిద్రుడుగానీ, రాజ్యమును కోల్పోయినవాడు గానీ ఈ సానములకు వెళ్ళి నన్ను దర్శించినచో, పూజోవ హారము చేసి, పితృతర్పణమును, స్నానమును, పిండోపదానమును చేసినచో దుఃఖము తొలగిన వాడగును. నిస్సందేహముగా ఏకఛత్రాధిపతి యగును. పుష్కరయాత్ర చేసినవానికి రాజ్యము, సౌభాగ్యము, ధనధాన్యాదులు, ఉత్తమ స్త్రీలు లభింతురు. ఈ యాత్రా విధమును చేసినవాడు, చేయించినవాడు వినిననాడు కూడా పాపములన్నింటి నుండి విముక్తుడగును. పొందకూడని స్త్రీలను పొందిన వాడు, పెక్కు సంవత్సరములు బ్రహ్మక్రియ చేయనివాడు ఒక్కమారు ఈ యాత్రను చేసి వేద సంస్కారమును పొంద వచ్చు.
శంకరా! ఎక్కువ చెప్పి ఏమి ఫలము? పొందడానికి కష్టమైనది పొందవచ్చు. పాపమును నశింప జేసికొనవచ్చు. ఇది అన్ని యజ్ఞముల, తీర్థముల ఫలము నిచ్చును. వేదములన్నింటి సమా ప్రిని చేసిన వానిగా, ఈ పుష్కరమున సంధ్యనుపాసించి సావిత్రీ జపము చేసి, తన పత్ని యిచ్చిన పుష్కర జలముతో తర్పణమిచ్చు వానిని భావించవచ్చు, మంచి పాత్రలో (రాగిగానీ, మట్టిది గానీ) పుష్కరజలమును తెచ్చి సాయంకాలమున సంధ్యనుపాసించి, ప్రాణాయామముతో సమాధి స్థితియందిచ్చిన దాని పుణ్యమును చెప్పెద వినుము.
అతను వన్నెండు సంవత్సరాలు సంధ్యనుపాసించి నట్లగును. స్నానమాడిన అశ్వమేధ ఫలమును, దానమును చేసిన అంతకు పదింతలు ఫలమును పొందును ఉపవసించిన అనంతపుణ్యము లభించును. సావిత్రి యెదుట దంపతులకు భోజనమిచ్చిన నాకు భోజనము పెట్టినట్లే. సందేహము లేదు. కేశవునికి భోజనము పెట్టినట్టే. ఆతను వరములనిచ్చును. పెళ్ళికాని కన్యలకు భోజనము పెట్టిన వారి కులమున వంధ్య జన్మించదు. కన్యగానే తల్లియగు శ్రీ, భర్తకు ప్రియముకాని శ్రీ జన్మించదు. కావున సావిత్రి ఎదుట భోజనము పెట్టవలెను.
ఇహ పర ఫలములను కోరువారు పుల్లనిది, ఉప్పేనది దానమివ్వరాదు. స్త్రీలు భుజించరాదు. అన్ని రసములు గల ఐదు రకాల భక్ష్యమును నేతితో, ఆవుముతో, క్షీరముతో నివ్వవలెను, అట్లే పెరుగు, పాలతో కూడిన శిఖరిణిని త్రాగవలెను. ఇది పురుషులకు ఆహ్లాదమునిచ్చును. స్త్రీలకెక్కువ ఇష్టము. జ్వరము, సంతాపము, దుఃఖము, వియోగము వారి కేర్పడదు. వారు తన కులమున ఇరువది యొక్క తరములను తరింప జేయును. బంధువులతో, దాసదాసీలతో విలసిల్లును. ఇక్కడ పూరికను దానమిచ్చు స్త్రీ పుత్రపౌత్రులతో చిరకాలము వర్దిల్లును.
శష్కులమును (దానమిచ్చువాని కులము, శిఖరిణి దానమిచ్చు యువతుల కులము వర్దిల్లును. మోదకములు గౌరీ దేవతల ప్రశ సమైన ఆహారమని ప్రజాపతి చెప్పెను. వేయిమందికి భోజనము పెట్టు సాధ్వి పుత్రులతో, ధన ధాన్యముతో ప్రతి జన్మయందు సౌభాగ్యము నొందును. మధురమైన అప్పములు; ద్రాక్షారసము, బెల్లపు ముక్కలు, శరత్కాలధ్యానముతో స్త్రీలు త్రాగవలెను. యోగ్య పేయ పదార్థముల నిప్పించవలెను
ప్రతి పూజ్య విధానముతో రవికలతో బంగారమును ఇవ్వవలెను. కుంకుమతో, పూలతో నలంకరించుకుని చెప్పులను దానమిచ్చి చేతిలో కొబ్బరికాయతో పూజించవలెను. కంటికి కాటుక, తల పై సిందూరము, మంచి పళ్ళు, కోరినవి పాత్రలతో చేతికి దానమిచ్చి నమస్కరించి విడువవలెను.
తరువాత బంధువులతో కలిసి భుజించవలెను. తీర్థమున ఈ విధంగా చేయుటకు వీలులేనివారు 'దేవా! ఇంటికి వెళ్ళి దానమిత్తును. ప్రసన్నుడవు గమ్ము' అని ఇంటికి వచ్చి పితృదేవతలకు కూడా విధి పూర్వకముగా పిండ ప్రదానముతో శ్రాద్ధము నాచరించవలేను. అట్టివాని పితృదేవతలు బ్రహ్మయొక్క పగలు ఎంతకాలమో అంతకాలము తృప్తిని పొందుదురు. తీర్థమునకంటే తన ఇంట చేసిన ఎనిమిదింతల పుణ్యము పొందును. నీచులు మాత్రము, ద్విజాతులు చేయు శ్రాద్ధమును తెలియ జాలరు. ఏకాంతమున ఇంట గుప్తముగా పితరులకు శ్రాద్ధము చేయుట తగినది. నీచదృష్టిచే హత మైన శ్రాద్ధము పితరులను చేరదు .
కనుక, ఏ విధంగానై నా శ్రాద్దమును గు ప్రముగా చేయుట తగినది. దీనిచే పితరులు తృప్తి నొందెదరు. అని పూర్వము బ్రహ్మ చేప్పేను. గౌరి థ కిచే అధికముగా చేయబడునది ! శేషము. రాజసియను తెలియందగు నిది జనులకు కీర్తి నిచ్చును. తన సాతము కోరువాడు ఎల్లప్పుడూ గుప్తదానము చేయవలెను. జనులచే నివ్వబడు పక్వాన్నము కనబడును. అట్టిది ఎప్పుడూ సంతోషము నిచ్చుట కనరాదు. ఇంటిలో ఒక విప్రునికి భోజనము పెట్టిన వివకోటికి భోజనము పెట్టినట్లే. సందేహము లేదు. ఈ పురాణ వచనము సత్యము. ఎప్పుడై ననూ తీర్థమున బ్రాహ్మణుని పరీక్షించరాదు అన్న మును గోరి వచ్చిన వానికి భోజన మివ్వవలెనని మనువనేను. సత్తువు (సత్తుపిండి) తో పిండదానమును, లేదా యావలతో, పాయసముతో చేయవలెను. పిణ్యాకముతో (రొట్టె) ఇంగుదముతో చేయవచ్చు. భ క్తితో నరులు నువ్వులతో ఇవ్వవచ్చును.
ధ్యానావాహనములు విడిచి శ్రాద్ధమాచరించవచ్చు. గద్దలు, కాకులు దృష్టితో దానిని హరించలేవు. పితరులకు తృప్తి నిచ్చు ఇది తైర్దక ద్దము. తప్పక చేయవలెను. భకే ప్రధానము. భ క్తిచే పితరులు సంతోషింతురు. కోరిన కోరికల నిమురు. పుత్ర పౌత్ర ధన ధాన్యముల కోరిన దానిని భక్తితో ఆరాధించిన, బ్రహ్మ ఇచ్చును. తగిన కాలమున లేదా ఆకాలమునగానీ తీర్థమందు నరులు కొద్దమిడవలెను. స్నానమును, పితృతర్పణమును, పిండదానమును పితరుల కివ్వవలెను.
అక్కడికి వచ్చిన తమ గోత్రము వానిని పితరులు మిక్కిలి ఆశ తో తర్పణము కోరి చూచుచుందురు. ఆలస్యము చేయ రాదు . అడ్డంకినీ చేయరాదు. అట్టి వారి సంతతి ఎప్పటికీ అవిచ్చిన్న ముగా నుండును. శ్రాద్దమును, కోరు పితరులు ఎప్పటికీ సంతతి భేదమును చేయరు. అందుకే పూర్వము బ్రహ్మ శ్రాద్ధము గుణోత్తర మనెను. దీనిని పితృపరాయణులై న జనులు సదా ఆచరించవలెను. తీర్థమునగానీ, క్షేత్రమున గానీ, సంక్రమణ కాలమున, గ్రహణకాలమున విషువమున, అయనమున, జన్మ నక్షత్రము పీడింపబడిన సమయాన శ్రాద్ధ మాచరించవచ్చు. ఇవి శ్రాద్ధకాలములని స్వయంభువనెను. శ్రాద్దమిడిన వారికి దేహమున పుట్టిన పీడ కలుగదు. పుత్రకృత మైనదీ కలుగదు. గ్రహచోర నృపాదులు నుండి పీడ కలుగదు.. పాపము నశించి పరమున శుభగతి పొందుననుటలో సందేహము లేదు. ప్రజాపతి వాక్కువలె ఇది నిజము.
కృతయుగమున పుష్కరములు, త్రేతాయుగమున నై మిషము, ద్వాపరమున కురు క్షేత్రము, కలియుగమున గంగను జనులు ఆశ్రయించవలెను. పుష్కరమున వాసము, తపస్సు దుష్కరము. వేరొక చోట చేసిన పాపము తీర్ధమున తక్కువగును. కానీ తీర్ధమున చేసిన పాపము వేరొక చోట యెక్కడా తొలగిపోదు. చేతులు జోడించి పొద్దున, సాయంత్రము పుష్కరముల స్మరించు వాడు అన్ని తీర్ధములను తాకినట్లే. పుష్కరములను పొద్దున, సాయంత్రము తాకువాడు అన్ని క్రతువులను పోంది, బ్రహ్మ లోకమును చేరును. పుష్కరమున పన్నెండేండ్లు, పన్నెండు నెలలు లేదా ఒక నెల లేదా పది హేను రోజులుండువాడు పరమ గతిని పొందును. అన్ని లోకములకు పైనున్న బ్రహ్మలోకమునకు పైనుండు పుష్కరమును గోరువాడు, పుష్కరములను సేవించవలెను. అనులోమ, విలోమములచే, వ్యస్త సమస్తములచే పుష్కరమున స్నానమాడు వాడు. కోటియొక్క ఫలమందును. అన్ని తీర్థములలో విధివత్తు చేయు కార్యముల ఫలమును, పుష్కరమును చూచినంతనే పొందుదురు. భూమి పై ఆసంఖ్యాక తీర్థములు పుష్కరమువద్ద నుండును. పర్వతములు సముద్రములున్నంత వరకు పుష్కరమున మరణించినవారికి బ్రహ్మలోకముండును. ఒక్కమారు పుష్కరమున స్నానమాడి, జన్మాంతరములలో చేసిన పాపముల నశింపజేసికొనవచ్చును. అన్ని పాపముల నశింపజేయు క్షేత్రమిది.
‘రాజా ఇప్పుడు నేను నీకు పంచపాతకముల నశింప చేయు దానిని దేవదేవుని యజనము చెప్పెదను. ఇది ఐశ్వర్యము నొసగును. ఈ జన్మలో దారిద్ర్యముచే, వ్యాధుల చే పీడింపబడువాడు, పుత్రులు లేనివాడు కూడా దీనిచే వెంటనే సంపదను, ఆయుష్టును, పుత్రులను బడయును. మండలమున లోకపాలురతో బ్రహ్మను చేసి వీధి పూర్వకముగా, విశేషముగా కార్తీక శుద్ధ పూర్ణిమనాడు పూజించవలెను. ముఖ్యముగా పూర్ణి మయందు శ్రేష్ఠము. సంక్రమణమునాడు, లేదా సూర్యచంద్ర గ్రహణములనాడిది చేయవలెను.
గురు పూజా ప్రభావము
గురువుచే పూజింపబడిన దేవుని చూచినవాడికి వెంటనే సంతోషము కలుగును. పాపము నశించును. అతను దేవతలకుకూడా పూజ్యుడగును. గురువు, భక్తులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను జాతి కౌచక్రియలు మొదలగువానిచే సంవత్సరము పరీక్షించవలెను. తగినవాడిగా తెలుసుకొని నిశ్చయించుకొనవలెను. శిష్యులు కూడా భక్తితో పరమేశ్వరుని ధ్యానించుచూ విష్ణువు నందు భక్తి యెట్లో గురువునందూ అట్లే భక్తిని చూపవలెను. సంవత్సరము పూర్తికాగా గురువును ప్రసన్ను ని చేసికొనవలెను
"భగవాన్! మీ అనుగ్రహముచే పర బ్రహ్మోపాసనము ద్వారా, విరించ్యారాధనము ద్వారా, సహస్రశీరజపముచేత, మణల బ్రహ్మణము చేత, ధ్యానము చేత సంసారసాగరమును దాటుట జరుగును. ఇక ఉపదేశమును ఇమ్ము. విశేషముగా వైదిక లక్ష్మిని కోరుచుంటిమి అని ఆభ్యర్థించగా గురువు అపుడు చెప్పెను. బ్రహ్మను, విష్ణువును యథావిధి ఆర్చించి, కార్తీక చతుర్ధశిన బ్రాహ్మీముహూర్తాన మేల్కొని బద్ధపద్మాసనముననుండి, సహస్రారమున తెల్లని బట్టలు, తెల్లని పూదండను, గంధానులేపనమును ధరించిన గురువును ధ్యానించవలెను. బయట వెడలి నదియందు నిత్యమట్లు ఆలసించక చేయవలెను. పళ్ళు తోముకొనుటకు క్షీర వృక్షము పుల్లను గురువు ఇప్పించగా దానిని వీరు సముద్రమును చేరు నది వద్దకు వెళ్ళి లేదా వేరొక చెఱువువంటి పోనివద్ద నమల వలెను. పర మేష్టి మంత్రముతో మంత్రించ బడిన దానిని నమలవలెను. “ఆపోహిష్ణా అను మంత్రముతో ఏడుమార్లు అభిమంత్రించి, దేవస్యత్వా అను మంత్రమును జపించి “యుంజాన” అని చేతనుంచుకొనవలెను. ఇరవాల్యా అనుదానిచే కడిగి, బ్రహ్మోదనా అను మంత్రము చే నమిలి దూరముగా విసిరి, దానివై వు చూచి వేళ్ళవలేను.
ఎదురుగా గానీ, తూర్పు వైపున గానీ, దిజ్మూలలుగానీ ఆది పడినదో గమనించవలెను. ఆ వళ్ళపుల్ల తనకు ఎదురుగా ముఖముచేసి వడిన దేవలాబట్టి, మంత్రసిద్ధి కలుగును. వేరొకవైపు తల తిప్పినట్లున్న దేవతలందరూ పరాజ్ముఖులగుదురు. ఉత్తరము వైపు పడిన సిద్ది సందేహాస్పదము. దక్షిణముఖమైన ఆతని గురువుకు మృత్యువే. ఆశుభమును గాంచిన, దేవదేవుని సన్నిధిన నిద్రించి వచ్చిన కలలను గురువుకు విన్న వించవలేను. ఆవుడు వాని శుభాశుభములను గురువు నిర్ణయించును. పౌర్ణమినాడు స్నానము చేసి దేవాలయమునకు వెళ్ళవలెను. గురువిక మరల మండలము నేర్పరచవలెను. వివిధ చిహ్నములుగల భూమి పై పదహారు "రేకులతో లేదా తొమ్మిది లేదా ఎనిమిది పత్రములతో పద్మమును లిఖించి చూపవలెను. తెల్లని బట్టతో నేత్ర బంధము కట్టవలెను. వర్ణక్రమము ననుసరించి శిష్యుల ప్రవేశ పెట్టవలెను. ఆ వర్ణములచే మండలమును తొమ్మిది నామములతో చేసి ఇంద్రాణీతో ఇంద్రుని తూర్పున పూజింపవలెను. అట్లే లోకపాలురతో అగ్ని ని పూజించవలెను.
దక్షిణమున యముని, నైరృతిన నిరృతుని, పడమర దిక్కున వరుణుని, వాయవ్యమున వాయువుని, ఉత్తరమున కుబేరుని, ఈశాన్యమున రుద్రుని స్థాపించవలెను. తూర్పున కమండలును, దక్షిముణన స్రుక్ ను, పశ్చిమమున హంసను, ఉత్తరమున సునమును, ఆగ్నే యమున బ్రుసిని, (ముని ఆసనమును) నైరృతిన పాదుకలను, వాయవ్యమున యోగపట్టమును, ఈశాన్యమున గలంతీకమును చిన్న పాత్ర) ఇవ్వవలెను. తూర్పున విష్ణువు, దక్షిణమున శివుడు, పడమరన సూర్యుని, ఉత్తరమున ఋషులను, మధ్యన స్వయముగ బ్రహ్మను పూజించవలెను. దక్షిణమున సావిత్రి, ఉత్తరాన గాయత్రి, తూర్పున ఋగ్వేదము, దక్షిణాన యజుర్వేదమును, పడమటి దిక్కున సామవేదమును, ఉత్తరాన ఆధర్వణవేదమును ఉంచవలెను. తూర్పు మొదలగు దిక్కులందు ఇతిహాసపురాణములను, ఛందస్సును, జ్యోతిషమును, ధర్మశాస్త్రములు మొదలగువానిని యుంచవలెను. తూర్పువై పున్న దళమున బలమును, దక్షిణాన ప్రద్యుమ్ను ని, పశ్చిమాన అనిరుద్ధుని, ఉత్తరాన వాసు దేవుని పూజించవలెను.
తూర్పున వామదేవుని, దక్షిణాన సద్యోజాతుని, పశ్చిమాన ఈశానుని, ఉత్తరాన తత్పురుషుని స్థాపించి పూజించ వలెను. అంతటా ఆ ఘోరుని పూజించవలెను. మండలమున ఇది పూజ - తూర్పున భాస్కరుని, దక్షిణాన దివాకరుని, పడమటి దిక్కున ప్రభాకరుని, ఉత్తరాన గ్రహరాజుని, విధివత్తు పూజింపవలె. దిగ్మండలాన విధిపూర్వకముగా ఎనిమిది కుండలనుంచ వలెను. మధ్య బ్రహ్మమను తొమ్మిదవ కలశము నుంచవలెను ముక్తికోరువాడు బ్రహ్మ మటముతో, సంపదగోరువాడు విష్ణు కలశముతో, రాజ్యము గోరువాడు ఇంద్ర కలశముతో, ద్రవ్య ప్రతాపాల గోరువాడు ఆగ్నేయ కలశముతో, మృత్యుంజయమును గోరువాడు దక్షిణ కలశముతో స్నానము చేయించవలెను.
నైరృతము దుష్ట నాశనానికి సమర్గము. పావనాశనానికి వారుణము, శరీరారోగ్యమునకు వాయవ్యము, ద్రవ్యలాభానికి ఉత్తరముది, జ్ఞాన ప్రాప్తికి ఈశాన కలశము శ్రేష్టము. ఇవి లోకపాల మటములు. ఒక్కొక్క కలశముతో స్నానము చేసిన నరుడు అన్ని దోషముల నుండి తొలగిపోవును. బ్రహ్మతో సమానమగును. లేదా, అన్ని దిక్కులలో యథా సంఖ్య లోకపాలుర పూజించి తన పేరుతో కలశములతో పూజించి, పరీక్షించిన శిష్యులను తరువాత కంటికి గంతలతో ప్రవేశ పెట్టవలేను. ఆగ్నేయీ ధారణతో దహింపజేసి, వాయువుతో కంపింపజేసి, సోమమునిచ్చి ప్రతిజ్ఞల వినిపింపవలెను. బ్రాహ్మణుల, దేవతల, బ్రహ్మ, విష్ణు మహేశుల, ఇంద్రాది లోకపాలుర, గ్రహముల, గురువును, పూర్వదీక్షిత మునీంద్రుని నిందించరాదు. అని ప్రతిజ్ఞను వినిపించి, తరువాత హోమమును చేయవలెను. ‘ఓం నమో భగవతే బ్రహ్మణే సర్వరూపిణే హుం ఫట్ స్వాహా' అని షోడశాక్షరితో, జ్వలించు అగ్నిలో హోమము చేయవలెను.
గర్భదానాద్యావాతు లన్నింటినీ ఇప్పించవలేను. దేవదేవుని ఎదుట మూడు వ్యాహృతులచే నట్లు ఇప్పించి, చివర దీక్షితుడు గురుదక్షిణ నివ్వవలెను. ప్రాజ్ఞుడు గురువుకు ఏనుగులు, గుర్రములు, బండ్లు, బంగారము, ధాన్యాది నివ్వవచ్చును. బంగారు సహితంగా రెండుగా నివ్వవలెను. ఇట్లిచ్చిన గొప్ప పుణ్యమేర్పడును. అది చెప్పుటకు వందల యేండ్ల ననూ చెప్పనలవి కాదు. దీక్షితుడట పద్మపురాణమును వినినిచో, వేద ములు, మంత్రములు, సంగ్రహములతో కూడా జపించినవే యగును. విశేషముగా పుష్కరమున, తీర్థమున, ప్రయాగమున, సింధుసాగరాన, దేవప్రదమున, కురు క్షేత్రమున, వారణాసియందు గానీ, గ్రహణాన, విషవమున జపించువారికి ఏ ఫలమో దానికి నూరు రెట్లు పుష్కరమున బ్రహ్మను చూచిన కలుగును. కోరిన కోరికలను పొందును. విధివత్ పూజించి వినినచో దేవతలు కూడా తపించి 'మాకు ఎప్పుడు భారతవర్షమున జన్మ కలుగును? మేమెప్పుడు దీక్షితులమై, వద్మ పురాణమును వినేదము?' అని ధ్యానించుచూ అనుకొందురు కూడా. ఓషోడశాత్మ యగు పాద్మమును హృదయమున నుంచుకొని పరమ స్థానమును (పునరావృత్తి లేనిదానిని) పొందెద మెపుడు?' అనుకొందురు. కార్తీకమున బ్రహ్మ యజ్ఞమునేపుడు చూచెదమను కొందురు. రాజా! నీకీ విధిని చెప్పితిని. దేవ గంధర్వ యక్షకులకూ దుర్లభమిది.
దీని నిట్లు వాస్తవముగా తెలిసినవాడు, విన్న వాడు, చూచినవాడు ఆందరూ ముక్తులవుతారని ప్రతి చెప్పుచున్నది. ఇక పై అతి రహస్యమగు దానిని చెప్పేదను. దీనిచే సంపద, ధైర్యము, సంతోషము, పుష్టి కలిగి- గ్రహములన్నియు శుభములగును. ఆదివారము హస్త నక్షత్రమున ఏడింటిని పూర్తిగా విడిచి, బ్రాహ్మణ భోజనము గావించవలెను. సూర్యుని బంగారముతో చేయించి ఎర్రని బట్టలో చుట్టి, గొడుగు, పాదుకలు, పాదరక్షలు కూడా రాగిపాత్రలో నుంచి దానమివ్వాలి. నేతితో స్నానము చేయించి విజుడు, సర్వాంగ పూర్ణుడగు బ్రాహ్మణుని కివ్వవలెను. ఇలా చేసిన ఆరోగ్యము కలుగును. ద్రవ్య సంపద కూడా ప్రాప్తించునని పురాణక్రియ. మానవులకు శాంతినీ, పుష్టినీ ఇచ్చును. అట్లే, సోమవారము, చిత్రా నక్షత్రములందు రాత్రి భోజనము మాత్రమే చేయుచూ ఎనిమిది సోమ వారములను గడపవలెను. శ క్తికొలది బ్రాహ్మణులకు ఒక్కొక్క దినము భోజనము పెట్టవలయు. తొమ్మిదవ నాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి కొత్త బట్టల జత నివ్వవలెను. కంచు పాత్రలో పాలను, అందు చంద్రుని వెట్టి దానమివ్వ వలెను. అట్లే పొదుకాదులను అంగారకునికై గూడా రాత్రి భోజనము చేయుచు ఎనిమిది దీనములు గడిపి, బంగారముతో అంగారకుని చేయించి రాగిపాత్రలో యోగ్యుడగు బ్రాహ్మణునికి దానమివ్వవలెను.
నక్షత్రానుసారము ఏడు రాత్రులు గడిపి, ఎనిమిదవనాడు బంగారు ఖేటముల దానమివ్వవలె. అగ్ని కార్యమూ చేయ వలె. ఇట్లు చేసిన కలుగు ఫలమును చేప్పెదను. వినుము. ప్రతికూల, క్రూర, గ్రహములనుకూలములగును. రోగములు తొలగును. దేవతలు సంతోషించేదరు. నాగులు విరోధము వహించరు. పితడులు తృప్తి నొందెదరు. దుస్స్వప్నములు నశించును. విన్న వారికి, చదివిన వారికి కూడా ఇది ఫలము. అంగారక, శని, సూర్య, కేతువులు రాహువుతో సహా తలపై కూర్చున్న నూ, దీనిచే సౌమ్యులై సౌభాగ్యము నీతురు. భక్తితో దీనినాచరించువానికి, గ్రహములన్ని అనుకూలమై అనుగ్రహించును. శాంతి నిచ్చును. శనైశ్చరుని రాహు కేతువులతో లోహపాత్రలందు యుంచి బ్రాహ్మణులకు దానమివ్వవలెను. వారికి గ్రహ ప్రీతికై నల్లని బట్టల నివ్వవలెను. వ్రతం చివర గ్రహాలన్నింటినీ బంగారముతో చేయించి శాంతి కోరువాడు విప్రులకు దానమివ్వాలి. భోజనము పెట్టాలి. తక్కువలో ఎక్కువ ఫలము నొసంగును. శంకరుని నుండి జ్ఞానము, సూర్యుని నుండి ఆరోగ్యము, అగ్ని నుండి ధనము, విష్ణువునుండి మోక్షము,బహ్మ నుండి బ్రాహ్మ్యమును కోరవలెను
అనగా భీష్ముడిట్లడిగెను. ‘మీరు చెప్పిన వానిని అల్పాయుస్సు పొందుటచే కష్టము. దాన స్వలాయాసముతో పొంద దగు ఫలమును చెప్పుము’ అనెను. అంత పులస్త్యుడు ఇట్లు చెప్పెను శ్వేతుడను గొప్పరాజు వసిష్ఠుని ఇదే ప్రశ్న నడిగేను. ఒక పర్యాయము ఆకలితో పీడింపబడి శ్వేతుడు ప్రశ్నించెను. చెప్పెద వినుము. ఇలావృతమను దేశమునకు శ్వేతుడను మహాబలుడగు రాజు వుండెడివాడు. అతను ద్వీపములతో, పట్టణములతో నున్న భూమినంతా జయించెను. అతని పురోహితుడు బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు. ఆ రాజు ఒకప్పుడు వసిష్ఠుని ఇట్లడిగెను. 'భగవాన్ వేయి అశ్వమేధ యాగముల జేయ నుత్సహించుచుంటిని. బ్రాహ్మణు లకు బంగారము వెండి, రత్నములను దానమివ్వ దలిచితిని. కానీ అన్న మును దానమివ్వను. బంగారమిచ్చిన ఏదైనా ఇచ్చినట్లగును. అన్న మిచ్చిన నేమి ఫలము? బ్రాహ్మణులకు ర క వస్త్రములను, ఆలంకారాలను, గ్రామాలను, నగరాల నిచ్చితిని.’ శ్వేతుడు అన్న మును గానీ, నీటినిగానీ ఎప్పుడూ దానమిచ్చి యుండలేదు.
అటుపై అతను అశ్వమేధ యాగములనేకము చేసి పొందిన పుణ్యముచే స్వర్గమునకు వెళ్ళెను. చాలా కాలము తపమాచరించి బ్రహ్మసాలోక్యమును పొందెను. అక్కడ ఆప్సరసలు నర్తించుచుండగా సిద్దస్త్రీలు గానము చేయుచుండిరి. అక్కడ తుంబురు, నారదుడు ఇద్దరూ గానము చేసిరి, మునులు వేదోక్త మంత్రములతో స్తుతించిరి. ఇంతటి వైభవముగల రాజుకి ఆకలిదప్పులచే పీడకలిగినది. ఆ పేడతో ఆ రాజు స్వర్గాన్ని విడిచి ఋక్ష పర్వతమును చేరెను. తన శరీరము దహింపబడ్డ వనములో తన శరీరపు ఎముకలను నాకుచూ నుండి. మరల విమానమెక్కి స్వర్గమునకు వచ్చుచుండెను చాలా కాలము గడవగా వసిష్టుడు తన ఎముకలను తానే నాకుచున్న శ్వేతుని చూచెను. ఎముకలను నాకుటను గూర్చి యడుగగా, శ్వేతుడు ఆ మునితో ఇట్లనెను. ‘భగవాన్! పూర్వము నేను ఆన్నదానము చేసియుండ లేదు. కనుక నన్నట్లు ఆకలి బాధించుచున్నది.' అనగా వసిష్ఠుడు 'రాజా! నేనేమి చేయగలను? ఇవ్వని వస్తువు ఎప్పటికీ చేరదు. రత్నములు, బంగారము దానమిచ్చుటచే నరుడు భోగవంతుడగును. అన్న మిచ్చిన కామములన్నీ పెచ్చరిల్లును. అట్టి అన్న మును నీవు తక్కువయని తలచి దానమివ్వలేదు. 'అనగా శ్వేతుడు ‘దానమివ్వని వానికి సంభృతి ఎట్లుకలుగునో అనుగ్రహింపుము' అని ప్రార్థించగా వసిష్ఠుడిట్లనెను రాజా! ఓ కే కారణము గలదు. చెప్పెద వినుము. పూర్వము వినీతాశ్వుడను రాజుండెను. అతను అశ్వమేధ యాగమును చేసి, చివర బ్రాహ్మణులకు వారు కోరిన గోవులను, ఆశ్వము - లను దానమిచ్చెను. .
అతడునూ నీ వలెనే తక్కువయని యెంచి అన్న దానము చేయలేదు. కాలక్రమేణ గంగాతీరమున మరణించి నీవలెనే స్వర్గము చేరెను. నీవలెనే ఆకలిచే పిడి తుడై ఉటకు వచ్చెను. భూలోకమున గంగాతీరమున నీలపర్వతముపై సూర్యకాంతిగల విమానము పై నుండి తన దేహమును, పురోహితుని జూచి అడగగా ఆకలికి కారణము చెప్పి, తిలధేనువు, మృతదేనువు, జలధేనువు,రసధేనువును దానమిచ్చిన ఆకలి దప్పికలు తొలగిపోవును. సూర్యచంద్రులు వున్నంతవరకు స్వర్గమున ఆనందించగలవని పురో హితుడు చెప్పెను. అపుడా రాజు ఇట్లడిగెను. 'తిలధేను విధిని చెప్పిన అట్లే చేసి దానమిచ్చెదను' అపుడు పురోహితుడు బదు -లిచ్చెను. తిలధేనువు విధానమును వినుము. పదహారు ఆడక ములది గోవు, నాలుగింటిని దూడను చేసి, చెఱుకుగడలతో పాదములు, పూలతో దంతములు చేయవలెను. నాసిక గంధముతో, నాలుక బెల్లముతో, తోకవద్ద గ్రక్కుతో చేయవలెను. ఘంటాభరణములతో, అలంకరించిన ధేనువును చేసి కొమ్ములను బంగారముతో చేసి, గిట్టలను వెండితో, పొదుగును కంచుతో చేసి బ్రాహ్మణునికి మంత్ర పూర్వకముగా దానమివ్వవలె.
కృష్ణాజినమున నున్న ధేనువును వస్త్రములతో కప్పి తాడుతో గట్టి, మంత్రపవిత్రమైన దానిని దానమివ్వవలె. వెంటనే నాకు అన్నము, అన్ని రసములు కలుగుగాక! తిలధేనూ! నా కోరికలన్నీ తీర్చుము. దేవీ! నేను నిన్ను భక్తితో కుటుంబము కై గ్రహించుచుంటిని. కోరికల దీర్చుము' అని దానమిచ్చిన, తిలధేనువు అన్ని కోరికలను నిస్సందేహముగ దీర్చును. అట్లే కడవలతో జలధేనువును దానమిచ్చిన గూడ కోరికలు దీరును. పూర్ల నియమములతో దానమిచ్చిన నూరు ధేనువులు స్వర్గమున సావిత్రి వలె కోరికలన్నింటినీ దీర్చును. మృతధేనువు కాంతి నిచ్చును. కార్తీక మాసమున దానమిచ్చిన రసధేనువు గతినిచ్చును. విస్తారమైన దీనిని క్లుప్తముగా నీకు చెప్పితిని. దీని ఫలమపారమని బ్రహ్మ చెప్పెను.
ఆకలిదప్పులచే బాధపడువాడు కార్తీకమున సర్వాలంకృతమైన బ్రహ్మాండమును దానమివ్వవలెను. ఓ రాజా! వెండితో, సూర్య చంద్రులను రత్నములతో చేసి కార్తీకముననే" ద్వాదశినాడు లేదా వంచదశినాడు పురోహితుడగు గురువుకి భ క్తిలో దానమివ్వవలెను. దీనిచే బ్రహ్మాండమున నున్న ప్రాణులన్నింటినీ ఇచ్చినట్లే. క్లుప్తముగా నీకు చెప్పితిని. శేషమగు దక్షిణములతో, యజ్ఞములను చేసి, సమా పము చేయు వానికి కలుగు ఫలము బ్రహ్మాండమును దానమిచ్చు వానికి కలుగును. సకలం బ్రహ్మాండమును దానమిచ్చు వాడు జపము, హవనము, దానము, ఆధ్యయనములన్నీ చేసినట్లే.
అనగా రాజు ఇట్లనెను: ‘భగవాన్! బ్రహ్మాండదానవిధి నాచరించి మోక్షము నొందును కదా! దాని కాలము, దేశము, తీరమునంతా చెప్పుము. దేనిచే నేను ఫలము నొంది, కుత్సిత భావమునుండి విముక్తి నొందెదను? తెలియజేయుము' అనగా వసిష్టుడు చెప్పెను. ఇది విని రాజా, పురోహితుడు అన్ని ధాతువులతో బంగారముతో బ్రహ్మాండమును చేయించేను. దాని మధ్యన బ్రహ్మ పద్మరాగములతో అలంకరింపబడెను. సావిత్రి, గాయత్రి, నారదాదులు చుట్టియుండిరి. బంగారు విగ్రహములలో ఇంద్రాదులు ముందుండవలెను. లక్ష్మితో వరాహరూపియైన భగవంతుని జేసి ఆభరణముగా నీలమును, మరకతమును చేయవలెను. గోమేధములచే కాంతిని కల్పించవలెను. ముత్యములతో ఇంద్రునికి, వజ్రములతో సూర్యునికి కాంతిని కల్పించవలేను. గ్రహములన్నింటికి బంగారము నివ్వవలెను. బంగారము కంటే ఏడు రెట్లు వెండి, దానికి ఏడు రెట్లు రాగి, దానికి ఏడురెట్లు కంచు దానికి ఏడు రెట్లు సీసమును, ఈ విధంగా చేయవలెను. సీసముకంటె ఏడు రెట్లు లోహమును చేయవలెను. ఏడు సముద్రాలు ఏడు కులపర్వతాలు ఈ ఏడు సంఖ్యలలో నుండునట్లు నిపుణులు జేసిరి. వెండితో చెట్లు మున్నగు వానిని చేయాలి. వీటన్నిటినీ విధివత్ తీర్థమున దానమివ్వాలి.
కురు క్షేత్రము, గయ, ప్రయాగ, అమర కంటకము, ద్వారవతీ, ప్రభాసము, గంగాద్వారము, పుష్కరము మున్నగు తీర్ధములందు సూర్య, చంద్ర గ్రహణ సమయాన, లేక ఉత్తర దక్షిణాయనములలో, వ్యతీపాతమున, విశేషముగా విషువత్తున దాన మివ్వవలేను, విచారణ చేయరాదు. అందమైన, గుణవంతుడగు శాలాగ్ని హోత్రుని భార్యతోసహా భూషణములతో పూజించి, పురో హితుని ముఖ్యునిగా చేసి, ఇరవై నాలుగు గుణాలుగల విప్రుల నీతరులను వేలికి ఉంగరాలను, చెవులకు ఆభరణాలిచ్చి పూజించ వలెను. అటు పై వారి ఎదుట నిలిచి సాష్టాంగ ప్రణామము చేసి, పురోహితునికి చేతులు జోడించి ఎదుట నిలిచి బ్రాహ్మణులగు మీరు పితిని అనుగ్రహించుడు మీ సుముఖతచే నే పవిత్రుడనే తిని. మీరు ప్రీతి చెందిన బ్రహ్మ ప్రీతి నొందును. బ్రహ్మాండ దానముతో విష్ణువు ప్రీతిచెందుగాత! శివుడు, ఇంద్రుడు కూడా ప్రీతినొందుగాక!' అని స్తుతించి రాజు గురువుకు యథావిధి బ్రహ్మాండమును దానమచ్చి తక్షణమే కోరికలు దీరి స్వర్గమునకు వెళ్ళెను. గురువు విభజించిన బ్రహ్మాండమున ఇతరులకూ నిచ్చెను. బ్రహ్మాండ దానమున, భూదానమును దానము గ్రహించువాడు ఒక్కడే వుండరాదు. ఆట్లు గ్రహించిన బ్రహ్మహత్యా పాతకము నొందును. ఆందరికీ ప్రత్యక్షముగా పేరు పలికి దానమివ్వవలే. దానిని చూచిన వారునూ పవితులగుదురు. చూచినంతనే ముక్తులగుదురు. భీమ ద్వాదశియని పిలువబడు దాన బంగారును, జలము, కృష్ణాజినమును చేసి చూడవలె. చూచినందున చేసినంత ఫలమందును.
ప్రయత్నము లేకనే కరృసలోకమును పొందును. గోవులను ఎల్లప్పుడూ ఈ మంత్రముతో పూజించవలెను: 'నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయోభ్య ఏవ చ, నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః' అను మంత్రము యొక్క స్మరణముచే గోదాన ఫలమును పొందును. కనుక రాజేంద్రా! నీవు కూడా ఉత్తమ తీర్థమైన పుష్కరమున, విశేషంగా కా ర్ధికమున గోదానము చేసిన, ఫలము నొందుదువు. స్త్రీకిగానీ పురుషునికిగానీ మిగిలిన ఏ కొద్ది పాపమైనా పుష్కరమున స్నానము చేసినంత మాత్రాన స రిగా నశించును. సముద్రము వరకు భూమి పై నున్న తీర్థములన్నీ పుష్కరమున నున్నవి. విశేషంగా కార్తీక మాసమున' అని చేప్పెను.
ఇది శ్రీ పాద్మ పురాణమున మొదటి సృష్టి ఖండమున బ్రహ్మాండ దానమను ముప్పది నాలుగ - అధ్యాయము.
