పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

30 - విష్ణు పదోత్పత్తి

 విష్ణు పదో త్పత్తి

భీష్ముడనియె  విష్ణువు, సర్వసమర్థుడు. యజ్ఞపర్వతమున కేగి యట నడుగులానించెను. ఈ పదపద్దతి యెందుకు దేవదేవుడొనరించెను ? మహామునీ , స్వర్గలోక మందు వైకుంఠమందుగద యీ మహాత్ముడు విష్ణువుయొక నివాసము. ఆయన మానుషలోకమండేట్లడుగిడెను , దేవా ! బ్రాహ్మణోత్తమా ! ఎల్లప్పుడు భక్తులు మహాతపస్సుచే సతతము నారాధించినవారు దేవతలు, ఇంద్రాదులు, దేవలోకమందు గదా యుందురు. శ్రీ వరాహమూర్తి వసతి మహర్దోక మున గదా ! మహానృసింహ మూర్తి జనోలోకమునందున్నా రుగదా! త్రివిక్రముడు వామనమూర్తి యుండునది . తపోలోకమనబడినది కదా ! ఈ లోకము లన్నిటిని వదలి రూమిమీద బ్రహ్మ క్షేత్రమందిక్కడ పుష్కరమంధు" యజ్ఞపర్వతముపై నడుగులుంచబడినవి. బ్రహ్మ్య ! యాకథ విస్తరముగ నా కొనతిమ్ము. విన్నదాన సర్వపాపనాశమగుట నిశ్చయముగదా ఆన పులస్త్యుడిట్లనియె.

చక్కగ నడిగితివాలింపుము మనసుపెట్టి. "మున్ను విష్ణువు కృతయుగమందు దేవకార్యసిద్దికొఱకు" 'యజ్ఞపర్వత మునకు వచ్చి శీలపర్వతపుబొడ్డున పాదముంచెను. అది భూలోకముపకార మునకే. మిగుల బలవంతులైన - దానవులు ఇంద్రునితో నెల్ల దేవతలనోడించి స్వర్గమెల్ల వశము చేసికొనిరి. ముల్లోకములను లోబరచుకొనిరి. బలప త్తరులగుటచే నట దానవులు యజ్ఞభోక్త లైరి.

బాష్కలీ. దానవులేల నిట్లు మిగుల బలవంతులుగా చేయబడి5. చరాచర ము ముల్లోక మిట్టయినంత యముడు పరమథాధకు లోనయ్యెను. ఇంద్రుడు బ్రతుకు పై నాశనోల్పోయెను. ఆ బాష్కలయమునితో యుద్దమంద వధ్యుడయ్యెను. "బ్రహ్మవర ముక్త మాడిట్లయ్యెను. నేనిక దేవతలందరితో బ్రహ్మ లోక మునకేగి బ్రహ్మను శరణు సొచ్చెదనికవేరుగతిలేదని చింతించి సత్వరము పితామహుని శరణాందెను, జగత్కార్యము విన్నవించి ప్రాప్తించిన పరమ విపత్తును - నెప్పికొని ప్రభూ నీవిచ్చిన వరదానము చే బ్రాప్తించిన భయము దెలిపితిని. వెంటనే నీవు మాతండ్రివిగాన. శాంతికై చేయనగునది. నీవాలో చింపుము.

ఆ రాక్షసులు చూచుచుండ శ్రోతస్మార్తాదిక్రియలు జరుగుట లేదు. అందుచే- మాకు దినదినగండ మేర్పడినది. సామాన్య మానవుడు స్వార్థ ముకోరియే మాటలాడునట్లు ఉపకరింపని వనికి మేమిట్లు మాట్లాడుచున్నాము. ఎవడేవని కుపకారము నేయునో దానికి వేయి రెట్లు ఈతడు ప్రత్యుపకార ము నేయడేని వానికి చేసిన యుపకారము వ్యర్ధమనబడును. ఆ పాపకర్మునికి నరక వాసము తప్పదు. ప్రత్యుపకారము సేసినంతమాత్రముననది సాధుత్వము మంచితనముగాదు. స్వార్ధ మేకోరువాండ్రయెడ నీది వర్తించదు. "ఏవనితెచట స్థానముండవలసినదో దుఃఖకరము వానిక దిలేనిచో హృదయము నూరుముక లగును. గాని సంతృప్తి పొందదు. ఎటకై న పోయేదము. కష్టములో మునిగినమమ్ముద్ధరింపుము. ఉపాయము చెప్పినందువలన దీనికి తిరిగి తేజస్సు గలుగగలదు. జగత్తుపరిస్థితి నేచెప్పినట్లున్న దోలేదో చూడుము. స్వాధ్యాయ సములు లేవు. వషట్కారములు లేవు. (యజ్ఞములు హోమాలు లేవన్న మాట) మంగళోత్సవములిగిపోయినవి. వేదాధ్యయనముతో సంబంధమే వదలిపోయినది. వార్త వాణిజ్యాదులాగిపోయినవి. దండనీతి లేనేలేదు. ఊపిరిమాతముతో బ్రతుకు మిగిలినది. జగత్తు దుఃఖవక మైనది. కష్టదళ పాలై నది. ఇంతకాలము మేము శుష్కించిపోయినాము, అని ఘోషింప బ్రహ్మ యిట్లనియె.

నీ వరమిచ్చుట చే భాష్కలి పొగరెక్కినట్లు నేనెఱుగుదును. మీకు జయింపనలవికాదు. విష్ణువునకే సాధ్యము. అని బ్రహ్మ తత్వమయమైన భావమునవుడు నిరోధించి కూర్చుండెను. సమాధియందు నిలిచి ధ్యానించినంతకొలది సమయము లోనే చతుర్భుజుడు. విష్ణువు అందరు చూచుచుండ ఆటకు దయచే నేను. మఱి యిట్లు పలికెను.

ఓ బ్రహ్మా ! ఈ సమాధినుండి మరలుము. ఎందుకొఱకు ధ్యానము చేసితివో ఆ నేనిదే వచ్చితినన బ్రహ్మ యనియె. మహాప్రసాదమిది స్వామి యనుగ్రహమునాకు జగత్ర్పభూ ! ఇంకెవనికిది లభించును ? నాపుట్టువే జగ నిమిత్తముగా తమచే నిర్మింపబడినది. ఈ లోకము నీతత్వమును ఇట్టి నీ నిమి. తమైన దే. ఇందు విరతలేదు. తమ రే జగద్రక్షణ సేయ వలయును. రుద్రుడు సంహరించును.ఈలాయున్న యీ జగత్తునందిపుడు మహాత్ము డింద్రుని రాజ్యమును బాష్కలి హరించి నాడు. కేశవ నీ సేవకునికి మంత్రమిచ్చి సహాయము సేయుడు ఆన వాసుదేవు డిట్లనియె.

నీ వర దానమున వాడిప్పుడు అవధ్యుడు. బంధించి వానిని బుద్ధిచే తెలివి చే) నిపుడు సాధింపవలెను. నేను దానవ నాశ నమున కేనిపుడు వామనుడనయ్యెదను. నావెంట నీ యిం దుడు బాష్కలి యింటి కేగుగాక ! అచటి కేగి యటలాడుకొనుచు నితడు నాకొఱకు యీ వామనునికి (ఈ పొట్టిదానికి) రాజా ! మూడడుగుల భూమి యిమ్మని బాష్కలినితడు యాచించుగాక. నన్ను శరణందింతివిగాన నీకే నీయాచన నే నెదను. ఇంద్రుడు చెప్పగానే దానవేంద్రుడు తనప్రాణమైన యిచ్చును. దానవుని వలన దానము పట్టి పితామహ ! వానిని భార్యతో పాతాళనివాసిగా ప్రయత్నపూర్వకముగా నొనరించి నేను వానిం జంపుకొఱకు పరాహరూపము గొని సన్నద్ధుడయ్యెదను. సందేహము లేదు. ఇంద్రా ! నీవు త్వరగా నటకు వెళ్ళుము అని విష్ణువిట్లుముగించి యంతర్ధానమందెను.

ఆ పైని కొండొక కాలమునకు సర్వజగదాధారుడు విష్ణువదితి గర్బమయినంత ననేక ఘోర నిమి త్తములు కనిపించినవి. ఆపుడు శుభ నిమి త్తముగూడ గొప్పదిటు కనిపించెను. మాలతీ, కుసుమము సువాసనలు వెల్లడ చిమ్ముకొనెను.

సర్వభూతానుగ్రహమూర్తి విష్ణువు కార్యసాధనకనుకూలమైనకాలమునంది సుర గణ హితము కొఱకు స్వచ్ఛమైన విప్పారిన జుట్టుతో, చంద్రుని, శంఖమువంటి యచ్చమైన కాంతితో నదితికి తనయత్వమందేను. 'ఆలా  "విష్ణువతరించగా దేవాసురసిద్ధ సుమముల ముఖములు రెప్పపాటుగొనక ప్రసన్నములయ్యెను. ఏమాత్రము ధూళిలేక నల్లనవీచు వాయువులతో విష్ణుజన్మదినమది యెంతో శోభనమయ్యెను. ప్రసవించుదాక ఆదితికూడ గర్బధారమున నడుమువంగి నడచుచు నల్లన మెల్లని నడక నింపుగొలుచుచును అలసిన భేదమునుపొందు భావమును( తెలుపుని)బూనీ మిగులు రువై న గర్భమును మోయుచుండెను.

జరిగిన జరుగనున్న యోగానుసారము నారాయణుడు గర్భవాసమున జొచ్చియున్నంత, కొండల పైనున్న నెమలి పురులు రాలుచుండ, నలుదెసలనోత్తి డిలేని దారులందు జనము సంచరించుచుండ, నాకాశ ము ధూళిగ్రమ్మక మిగుల స్వచ్చముగ నున్న క తన చీక టులెల్ల తొలగ, విష్ణువు గర్భమునందున్న తజి నదితి బుద్ది దోహభరితమయ్యెను. భీష్మరాజేంద్ర ! వేల్పులతల్లి కపుడు కలిగిన తలంపది వినుము. త్రివిష్టపమును నడుగులు వేసికొనుచునే దాటుదునా. బాష్కలిని వానిని పొతాళ వాసి నొనరింతునా! ధనము లావణ్యమును నేనింద్రునకే యిచ్చియున్నాను. దానవుల వినాశ మునకేనోక్కడను సమర్గుడను బాణములను చక్ర ముసుడులంజైమ్మదునుగద నేన్నో త్రిప్పులంద్రిప్పుదును, విబుధుల, దేవలోకవాసులుగ ను, దానవుల పొగ వాసు లను కాలముపయోగింపనొనరింతును. అది నేను ప్రతనిష్టతో నియమముతో జేయవలసినది.  వాణి హఠాత్తుగ వెడలి ముఖమున నిల్చినది.

మున్నెన్నడు చూడనిది విననిది యిపుడూహింపబడుచున్నది. దనుజముఖుని కోపముగొని . బంధించెనిదె చూడుము. మున్ను కశ్యపునికి ధనము, లావణ్యము నీయబడినవి. "ఇతడుత్సాహము తొలగేనా?" వాయువు లాకులములై నవి. నాచూపు చెదురుచున్నట్లున్నది. ఈరూపమెన్నడు నేననుకొనలేదు. ఏదో ఆవేళ మున నేందుచేతనో ఆదరానీమాటలాడుచుంటిని. అదితి 'యు టైంతో విమర్శలోబడి 'హృదయమందిట్లు విమర్శించుకొనెను. "వేయి దివ్య సంవత్సరములదితి యీశ్వరుని దనగర్భ మందు మే నెను. ఆపై భూతవామనః=భూతములనెల్ల సుందరుడు వామనుడు పొట్టివాడు వామనావతార మూర్తి జన్మించెను పుట్టగానే దానవులకన్నులు హరింపబడెను. దేవదేవుడు జనార్దనుడాయన పుట్టినంతనే నదులు తేరుకున్నది. వాయువు : సువాసనలతో వీచేను. కశ్యపుడు నా తేజశ్శాలి యాబిడ్డ తనివి నెందెను. త్రిలోక మురం దందరిమనస్సు లుత్సాహభరితము లయ్యెను.

ఆతడు పుట్టగానే రాజా ! స్వర్గ మందు దేవదుందుభులు మ్రోగెను. ఆత్యానందముచే ముల్లోక ముస... మోహము దుఃఖములు నశిం చెను. గంధర్వగణము భర్త లతో భావముతో స్వరసంపదతోపాడిరి, సురాంగనలు ఆప్సరసస్పమూహము భావముతో నేగసి (అనురక్తి తో) నాడిరి. విద్యాధర సిద్ద సంఘములుప్పొంగుచు విమానముల పై విహరించిరి. సత్యము (నిజము) అనృతము_అబడ్డ మునైన కార్యముల నిర్ణయము సేసి రంగస్థలమున చూపించుచుండిరి. రాగరహితులై పాటపాడిరి. దేని

యందు ననురాగము లేనివారై విరాగులై మాటిమాటికి దుఃఖము సుఖముచే వివశులై రాగాలాపన సేసిరి.

స్వర్గమందుండియు వారు ధర్మార్జితమైన స్వర్గము నిక్కడనుండి యేగుదురని దుఃఖము విడిచి నిర్మలమైన జీవ లోక మునందు చీక టిలెల్ల దొలగి నిర్వృతిని పరమానందానుభవమును పొందగోరి యటనుండి స్వర్గమున కేగగలరని పాడుచుండ

రాడుచుండిరి.

ఆట కొందరు హర్షించుచు భగవంతుడా అవనియండు జయింపుజయింపుమని జయజయధ్వానములు సేయుచుం డిరి. కొందరిట్లు వ్రాలి నమస్కరించుచు మనసుని చెదరకుండ వంతపాడుచుండిరి. కొందరు పెక్కుపుట్టువులతోగూడిన జరా మరణముల విచ్ఛేదముకొఱకని ధ్యాననిమగ్నులగుచుండిరి, ఈలా జగమెల్ల మెల్ల యెడల నానందభరితమై యుండెను.  

బ్రహ్మ పరమేశ్వరులు విష్ణుని జేరి జగత్ క్షేమముకొఱకు నీయన ఈశ్వరుడే యైనను మీ ప్రయోజనము కొఱకు బుట్టినాడు. ఈయనయె పరమేశ్వరుడు. ఈయన బ్రహ్మ విష్ణువు డతడే మహేశ్వరుడును. ఇతడు వేదములు. స్వర్గమితడే సంశయము లేదు. స్థావర జంగమ మీజగత్తెల్ల విష్ణువు చే వ్యాప్తమైయున్నది. ఒక ఆడేయాయన వేరుగ బ్రహ్మయని విశ్రుతు డయ్యెను. (వేదములందు వినబడెను.) నిజమైన ఒక రంగు స్పటిక మణి నాయాతావుల పెక్కురంగుల దైనట్లు స్వయంభవుడగు విష్ణువునకు గుణవశమున నాయారూపానువర్తనము జరుగుచుండును. గార్హపత్యాగ్ని వేరే పేరంది నట్లు భగవంతుడి యన బ్రహ్మాదులందాయా పేరులందుచుండును. అన్ని విధముల వామనుడు దేవుడు దేవకార్యము సేయగలడు. అని యిట్లు విమర్శించుచు ర్దూ దేవతలవెంట నింద్రునితో బాష్కలి నివాసమునకు విష్ణువు వెళ్ళెను.

బాష్కలిపుర వర్ణనము

దూర మందుండియే ఆ పుర ముంజూచెను. దేవతలకు లేదా విమానములకు వేళ శక్యముగానివి, సర్వరత్నశోభితములు తెల్లని చక్కని భవనములతో, జక గా విడమర్చిన రాచబాటలతో, కాటుక కొండలట్లు నిత్యము విడమర్చి నిలిపిన వేల్పుల యేనుగుల జాతిలోబుట్టిన వందలకొలది యేనుగులతో రాజిల్లు చున్నది. మాంసమెత్తుగ లేనివి, చిన్న చెవులు, పొడవైన మెడలు కన్ను లతో, మనస్సుతో సమానవేగము గలవియునగు గుఱ్ఱములతో నాన గరము శోభించుచున్నది. తామరపూవు బొడ్డువంటి (పసుపుపచ్చనివి) రంగు, పున్నమచందురునివంటి మోములు గలవారు, పై యెత్తున మాటలాడు నెఱజాణలు వేలకొలది వేశ్యలట నున్నారు. బాష్కలి అపుర మున నునికిగొనని పుణ్యములేదు. విద్య, శిల్పము. కళయు నేదిలేదు. వందలకొలది యుద్యాన ముల యొత్తి డిగొన్నది. ఎల్లవుడు కొలువులుదీరిన సమాజోత్సవములతో చావన్నది లేని దైత్య చేష్టలతో సమర్ద ముగొన్నది. ఎటు జూచిన వీణావేణు మృదంగ నినాదముతో ప్రతిధ్వనించునది. నిత్యానంద భరితులై య నేక రత్న శోభితులై మేరువు నందమరుల ట్లసురులట నాటలాడుచు గనిపింతురు. ఆట దనువృద్దులు బ్రహ్మ ఘోష (వేద ఘోష) యెంతో యట జరుపుచుందురు.

ఆగ్నుల నిరంతరాజ్యధూమము విగురువాయుపులచే భాపమెల్లవోయి సువాసనలనించు దనుజులతో నలముకొన్న యాపురమందు బాష్కలి ముల్లోకములు వళము సేసికొని దానవులతో సుఖముగ నుండును.

సచరాచర లోక్యమును బాలించుచుండును. అతడు ధర్మజుడు, కృతజ్ఞుడు, సత్యవాది, జితేంద్రియుడు. పూర్వ దేవతలకు (దేవద్వేషులగు దానవులకు) చూడ ముచ్చటైన వాడును న్యాయాన్యాయ విచక్షణుడై బ్రహ్మణ్యుడై దీనులపాలిటి దిక్కై దయా చూపు గలవాడై , వేద ప్రభు మంత్రోత్సాహ శక్తులు గలవాడై సంధి విగ్రహారిషాఢుణ్య ఉత్సాహము గలవాడై చిరునవ్వు ముందుగా మాటలాడువాడై విలసిల్లెను.

వేదవేదాంగ రహస్యము లెఱుగును. యజ్ఞము లొనరించెను. తపశ్శాలి. గౌరవింపదగు వారిని గౌరవించును. పూజింప దగువారిని పూజించును. శుద్ధాంతః కరణుడు, సుముఖుడు. అన్నీ తెలిసినవాడు. అనాదృష్యుడు, సుభగః = చూడముచ్చటైన వాడు. ధన ధాన్య సమృద్ధుడు, బహు దాత. ధర్మార్థ కామములు మూడు ఎప్పుడూ పురుషార్ధములను సాధించువాడు ముల్లోకమున నుత్తమ పురుమడు. ఎప్పుడునూ తన రాజధానియందుండేవాడు. దేవదానవుల దర్పము నణచువాడు. అతడిట్లు ముల్లోకమున బ్రజలనెల్ల పాలించెను. ఈలా స్వచ్చమైన గుణసంపద గల యాతనిం జూచి బుద్ధి నిలుకడ గలవాడనీ యూహించి మహాత్ముడింద్రు డా దానవేశ్వరుని సూర్యుడట్లుప్రతాపశీలిని త్రైలోక్యము బాలింపగలవాడని ఆశ్చర్యమందెను. రాజా! ఆ దానవేంద్రుడు తన పురమునకు వచ్చిన దేవేంద్రుని గని యాశ్చర్య మందెను.

యుద్ద దుర్మదులు దానవులు పురమునకు వచ్చిన యింద్రుని జూచి బాష్కలి దరి కేగి వింతయని ప్రభూ! నీ పురికి యింద్రుడు ఒంటరిగా బ్రాహ్మణోత్తముడగు వామనునితో వచ్చినాడు. ఇప్పుడు మేమేమి యాచరించవలెను? సార్వభౌమా! ఆనతిమ్మ అనిరి.

బాషలియనియె. మీరు పురమందు గుంపుగూడి నిలువుడు. దేవరాజనిట ప్రవేశ పెట్టుడు. ఆయన పూజింపవలసిన వాడు గదా నాక నెను. ఇంతలో వామనుడు నా యింద్రుడును నట కేతించిరి. దనునాథుడు ప్రేమతో వారిం దిలవెంచెను గూడ! దానవేశ్వరుడు, సర్వకార్య దురంధరుడు తనను ధన్యునిగా దంచికొని సాష్టాంగ ప్రణామ మొనర్చి యిట్లు పల్కెను.

         ఇప్పుడు ముల్లోకములందు నాతో సాటియైన పరమ ధన్యుడు లేడు. సర్వైశ్వర్య సంపన్నుడనై యింటి కరుదెంచిన యిందుని దర్శించుచున్నాను. యాచకుడై కోరి యితడు నన్నడుగుకొననున్నాడు. ఇంటికి వచ్చిన యతనికి ప్రాణాలైన నీయగలను నిక్కము, భార్యలను. పుత్రులను, ఇల్లు మున్నుగ ముల్లోకముల చెప్పవలసిన దేమున్నది? యేదై న నిత్తును. అని యెదురు వచ్చి, యాదరమునం దన తొడ పై నుంచికొని కౌగలించుకొని ఆనందించి తన యింటం బ్రవేశింప జేసికొనెను.

 ఆయన క ర్ఘ్య పాద్యాదులచే స్వాగతము పలికి పూనిక మైపూజ చేసి, ఇప్పుడు నా జన్మ సఫలమైనది. అన్ని మనో రథములు తీరిన వి. ఇంద్రా! నీయంత నా యింటికి వచ్చిన నిన్ను జూచుచున్నాను. దేవరాజ! నీవలన దను ముఖ్యులకెల్లరం పేరు ప్రతిష్టలం గన్న వాడను గావింపబడినాను. నా యింటికి దయ నేయుము. నా పరమావధి పుణ్యమిది. ఆగ్ని షోమాది యజ్ఞములు చక్కగ జేసినం గల్గు ఫలము నీ దర్శసమైనంత నే పొందెదను. భూమి గోవులను ఋత్విక్కుల దానము చేసిన ఫలమిపుడు గల్గినది. రాజసూయ మొనరించిన సుకృత మొద వినది. వాసవా! నీ దర్శనము కొలది మా తమగు తపస్సుచే లభించునది గాదు. నే నింట నిపుడు చేయవలసినది నీ కిష్టమైన పని యది యానతిమ్ము. తాము హృదయమందు వేరొక యాలోచన నేమాత్రము సేయదగదు. ఆది యెంత వలనుగాని పనియైనను నే జే నెద ననుగ్రహింపుము. శత్రు సంహారకా! పుణ్యుడను నేను నీ దర్శనము వలన పుణ్యా త్ముడనైతిని. ఉత్తమ దాసులచే మొక్కదగిన నీ పాదములిడే నేను మొక్కుచున్నాను. వచ్చిన పని యేదది యెల్ల ప్రభూ! నానతిమ్ము. నీ వచ్చిన కారణమది యత్యద్భుత మనుకొందును. అన ఇంద్రుడనియె.

 ఎఱుగుదును నేను దనుజ ముఖ్యుల కెల్ల ముఖ్యుడవని నిన్నే నేటిగి యున్నాను. అసురవర! నీవు కనబడుట యిది పెద్ద వింతగా తోచుటలేదు. అడిగిన వారి కిచ్చునది కల్పవృక్షము మతి యింకొకటి లేదు. ప్రభలో సూర్యుడట్లున్నావు. లోతులో సాగరుడట్టివాడవు. (నీ గుండె చాల లోతై నది) ఓరిమలో భూమిని, సంపదలో నారాయణుని సాటివాడవు. ఇదుగో యీ వామనుడు బ్రాహ్మణుడు. కశ్యపుని రథ వంశమున బుట్టినాడు. ఈ గుఱిపారుడడుగును మూడడుగుల భూమి యితనికిమ్ము. నేనేమో యజ్ఞము సేయుదును. నా యగ్ని దానమునకది కావలెను.

ఆ నిమి త్తముననే ప్రభూ! నేను యాచింపవలసి వచ్చినది. వాషలీ! నా ముల్లోకములు నీవు పరాక్రమించి కాజేసితివి. నిర్వ్యాపారిని నిర్ధనుడనైతి.

తమను ఇతరునికొఱకు నేనడుగుకొనుచున్నాను. నా యాచకత్వమున గూడ యితని కేది యుచితమది నేయుము. కాశ్యప వంశమున వంశ వర్గ నుడవై పుట్టితివి. దితి గర్భమందుదయించితివి. తండ్రి త్రైలోక్య వూజితుడు. ఈలాటి వాడవని తెలిసి నే నిన్నడుగుచున్నాను. ఆగ్ని శాలకై మరుగుజ్జునకు వామనునకు మూడడుగులిమ్ము. ఆపై నీవు నిన్నందరికి వరమాశ్రయముగా చూడగలవు. నీపై భారముంచి బ్రహ్మ సుఖముగా నుండును.

 ధ్యానధారణ ఆలోచించుచు బ్రహ్మ విష్ణువు పెక్కు యుద్ధములచే భేదమంది నతడు జగత్తును గూర్చిన ఆలోచనను వదలి క్షీరాబ్ది ద్వీపమందు సుఖముగా నిద్రపోవును. పెక్కు బలవంతులు సాయుధులు రాక్షసులే సహాయము లేకయే యింద్రా! నీచే కూల్చబడినారు. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, సనాతనులు ధర్మము నీ బాహుబల మాధారముగా స్వర్గమందు సుఖముగ నున్నారు. నీవు నూరు యు తువులు యజ్ఞములు సేసి ఉత్తమ దక్షిణలిచ్చి సమాప్తి చేసితివి.

పాకశాసనా! నీచే వృతాసురుడు నముచియు సంహరింపబడిరి. నీ యాజ్ఞ సాలించి సర్వసమర్దుడగు విష్ణువుచే పారణ్య కశిపుని తమ్ముడు హిరణ్యాక్షుడు మడి నెను. హిరణ్య కశిపుడు పిక్కరి పై నానించి చంపబడెను. ఐరావణుని తలపై కూర్చుని వజ్రము చేబూని సమరభూమి నిన్ను చూచి దానవులెల్ల నశింతురు. వేయవవంతుననే న నీ కేలాగునను సాటిగాను. ఈలాటి వాడవు దేవేంద్రా! నాతోని నీకు లెక్కయేమి? నన్ను ధరించుటకే యీ నీవిటు వచ్చినావు. దేవరాజ! ఈ భూమి నాదని యెందులకన్నాను? ఈ భార్యలు, కొడుకులు, గోవులు నింకను గల ధనము త్రైలోక్య రాజ్యమెల్ల విప్రునికియబడు గాక! బాష్కలీ యింద్రుని కిచ్చిన రాజ్యము నేను తిరిగి తీసికొన్నా నన్న అపకీర్తి నాకు నా పూర్వులకు కలుగకుండుగాక! ఇంకెవడేని యాచకుడు నాకు ప్రాప్తించినచో నతడు నాకు యెల్లప్పుడు నెంతేని ప్రేమపాత్రుడే. వి శేషించి ప్రస్తుతము తమరు నట్లే. విచారింపకుము,

         ఆ వామనునికి మూడడుగుల నేల బ్రాహ్మణుడని నీవు ప్రార్థింపగా నిచ్చితివి. ఇది యెంతో సిగ్గుచేటు ప్రభూ! ఈయన కుత్తమ గ్రామములిత్తును. నీకు స్వర్గమిత్తును. ఏనుగుల, గుఱ్ఱముల, ధనమును చూచిన మాత్రాన ముదుసలియని యువకుడగు నట్టి ఉద్విగ్న చూచకములు (విరిసిన చనుమొనలు గల యువతులను నీ వామనునికి ప్రతిగ్రహముగా సమర్పించెదను. దేవేంద్రా! నన్ననుగ్రహింపుమనెను.

          అపుడు పురోహితుడు శుక్రాచార్యుడు దానవేంద్రునితో నిట్లనెను. దానవేశ్వర! నీవు రాజువు. అప్లైశ్వర్య సంపన్నుడవు ఐశ్వర్యము లెనిమిది ధనము, ధాన్యము, బంధువు, నౌకరు, దాసి, వస్త్రము, వాహనము, కొడుకు ననునవి. ఎవని కేది " నీయవలెనని - ఉచితానుచితము లేన్నడు నెఱుగవు. మంత్రులతో బాగుగ నాలోచించి యుక్తాయుక్తములను పరీక్షించియు ఇంద్రాది దేవతలం గెలిచి త్రైలోక్య రాజ్యముం భోందిన నీవు వీని మాటకు పర్యవసానముగ బంధము పాలౌదువు. ఈ పొట్టివా డెవరో తెలుసునా? పురాణ పురుషుడు విష్ణువే. వీనికి నీ వీయకూడదు. నీ తండ్రి స్వయముగ వీనిచేత జంపబడెను. ఇంద్రాదుల జంపినవాడు యిపుడు వచ్చినవాడు మాతృ హంతకుడు, బంధు ఘాతకుడు, వంశో చ్ఛేదకుడు దంతమునై నాడు ముందుకాగల వాడు వచ్చినాడు. మాయతో బ్రాహ్మణ రూపమున గుజ్జు రూపమును ప్రదర్శించినాడు. ఎందులకిట నెక్కువ మాటలాడుట. ఈగ కాలంతైన మాత్రమేని భూమి దీనికీయరాదు. వెంటనే వినాశ మటనెదవు, నిజము, నిజము నే విన్నాను.

ఈలా గురుడు వలుక బాష్కలి వెండియు నిట్లు వలికెను. గురూ! ధర్మముకోరి నీ ప్రతిజ్ఞ సర్వము సేసితిని. ఇతడు భగవంతుడు విష్ణువే యగునా నాతో సాటియగు మహా ధన్యుడు మరిలేడు. గురూ! నా వలన దానముపట్టి దేవతలనలరించునేని యీ దేవుని చే నేనెంతేని ధన్యత్వమందింపబడిన వాడౌదును. ధ్యాన నిష్టులు, యోగులు ధ్యానించియు దర్శనమందలేరా విప్రుడే యతడిప్పుడు - నాచే గనబడెను గదా! కుశోదక పాణితోయే నెవ్వరు దానము లెత్తురో వారు భగవంతుడు, పరమాత్మ విష్ణువు ప్రీతి చెందుగాక " యని వలికికదా యిచ్చి మోక్షమందుదురు, ము క్తినందుదురు. ఇట నీ పని చేయుటలో నాకు వికల్పము (మార్పు) వచ్చినది. తమచే నుపదేశింపపడితిని. బాలుడనుగా విన్నా ను. గూఢ శత్రువైన నింటికి వచ్చిన నీయరానిది కొంచము లేదు. ఇదే నే నాలోచించి గురుదేవా! నా ప్రాణములైన వామనుని కిత్తును. శక్రునికి స్వర్గము నిత్తును. ఎవరికి పీడగూర్పని దానమిట సేయపడుచున్నది. పీడ (బాధ) గూర్పెడు దానమది సమలము అళుద్దము అనబడును. ఇది విని గురువట సిగ్గునం దలంచికొని నిలిచెను.

బాష్కలి చెప్పెను . మీరు కోరిన భూమినంతయు నేను దానమివ్వ వలెను. మూడడుగుల నేలను మాత్రమిచ్చుట నాకు సిగ్గును కలిగించును. అనగా ఇంద్రుడు, 'దానవేంద్రా! నీవన్నది నిజమే! ఈ ద్విజుడు మూడడుగుల నేలను కోరుట నే చేసినదే. ఇంత మాత్రముననే ఇతడు ఆర్తి. ఇతని కొరకు నేను దనుపుత్రుడివైన నిన్ను యాచించితిని. ఈ వరము నిమ్ము అనెను అపుడు బాష్కలి, 'దేవరాజా! వామనుడికి మూడడుగుల నేల నిచ్చుచుంటి చూడుము. నీవు చాలా కాలము సుఖముగా నుండుము' అని పలికి బాష్కలి వామనునికి మూడడుగుల నేలను నీటితో 'నాకు హరి స్వయముగా ప్రసన్నుడగు గాక!' అనీ దానమిచ్చినంత తన వామన రూపమును విడిచి హరి దేవతల పాతమును గోరి లోక ములన్నింటిని ఆక్రమించెను. యజ్ఞ పర్వతమును చేరి పైకి వెళ్ళ సోగేను.

విష్ణువు ఎడమకాలు దానవుని నివాసమున నుండెను. మొట్ట మొదట పాదమును జగత్పతి సూర్యునియందుంచెను. రెండవ అడుగును ధృవుని యందుంచి మూడవ అడుగుచే బ్రహ్మాండమును తాకగా బొటన వేలి తాకిడికి బ్రహ్మాండము బ్రద్దలై నీరు పుష్కలంగా స్రవించినది. బ్రహ్మలోకము మొదలుగా లోకము లన్నింటినీ ముంచి వేసినది. ధృవస్థానమును, నూర్యలోకమును యజ్ఞ వర్వతమును ముంచివేసి ఆ ధార పుష్కరమును ప్రవేశించి విష్ణు పదములను తడి పెను. దానిచే వైష్ణవ పదములేర్పడెను. ఆ ఆశ్రమమునకు వెళ్ళీ బావియందు స్నానమాడినవాడు దర్శనము చేతనే అశ్వమేధ ఫలము నొందును. ఇరువది యొక్క గుణములు గలిగి వైకుంఠమున నివసించును. మూడు వందల కల్పములు అన్ని భోగముల ననుభ వించి, చివర సార్వభౌముడగు రాజుగా జన్మించును.

 భీష్మా! ఆ జలధార విష్ణువు ఆంగుష్ఠము చివరి నుండి బయల్వెడలినది. కనుక ఆ వైష్ణవీ నది విష్ణుపాద సముద్భవయని అందురు. ఈ కారణము చేత గంగ విప్లవది మైనది. దాని చే చరాచరమగు ముల్లోకములన్నీ నిండినవి. బొటన వేలు తాకుటచే బ్రహ్మండం బద్దలుకాగా బయల్వెడలిన శుభమగు జలము దేవనదియే విష్ణువది - యనబడినది. ఆ దేవనదిచే బ్రహ్మాండమంతా నిండినది. అందరినీ అనుగ్రహించ గోరి వామనుడు డాషలిని మూడడుగులనూ పూర్తిచేయమని అడిగెను. బాష్కలి సమాధానము లేక తలదించి నిల్చుండెను. అతను మౌనముగా నుండుట జూచి పురోహితుడు ఇట్లనెను. “దానశక్తి స్వాభావిక మైనది. సృజించుటకు మేము తగిన వారము కాము. వృధ్వి ఎంత వున్నదో ఆదంతా నీకు బాష్కలి దానమిచ్చేను. అనగా బాష్కలి కూడా విష్ణువుతో ఇట్లనెను.

భూమి ఎంత గలదో, ఎంత పరిమాణము గలదిగా పూర్వము నీవు సృజించితివో, దానిని నేను దాచలేదు, భూమి యే మో అల్పముగా నున్నది. నీవే మో దీర్ఘముగా నుంటివి. సృష్టి చేయుటకు నేనళ క్రుడను. దేవా! నీ ఇచ్ఛాశక్తియే ఎల్లప్పుడూ సమర్గమైనది' అనగా విష్ణువు నిరుత్తరుడై బాష్కలి సత్యవాదియని తలచి అనేను. దానవరాజా! నీ ఏ కోరిక పూర్తి చేయవలెనో తెలువుము. నా చేతిలో నున్న నీరు నీవు దానమిచ్చినదే. దానిచే నీవు వరము నొందుటకు యోగ్యుడవై నావు. వరములకు పాత్రుడ వైతివి, నీవు కోరిన దానినిచ్చెదను. కోరుము ' అనగా బాష్కలి దేవదేవుడగు జనార్ధనుని ఇట్లు వేడుకొనెను. 'దేవేశా! నీ పట్ల భ క్తి నిమ్ము. నీ చేతిలో మరణము కలుగుగాక! దానిచే నేను తపస్వి జనులు కూడా పొందలేని నీ శ్వేతద్వీపమును చేరగలను' బాష్కలి ఆట్లు ఆడుగగా, విష్ణువు 'వేరొక యుగము వరకు వేచియుండుము. వరాహరూపమున నేను భూతలమును ప్రవేశించునపుడు నిన్ను సంహరించేదను. అపుడు నీవు నా వద్దకు వచ్చెదవు. అనెను.

         అపుడు బాష్కలి వామనుని ఎదుటి నుండి వైదొలగగా వామనుడు ఆన్నీ లోకముల నాక్రమించెను. దేవతల సత్యభాషణమును అపుడు అసురులు విడిచివేసిరి. విష్ణువు ముల్లోకముల హరించి కనిపించకుండా పోయెను. భాషలి పాతాళమును జేరి సుఖముగా నుండెను. విజ్ఞుడగు ఇంద్రుడు ముల్లోకముల పాలంచసాగెను. ఇది తె వి క్రమమనునది, జగద్గురువగు వామనుని ప్రాదుర్భావము. గంగాసంభవముతో కలిసి పావములన్నింటినీ నశింపజేయును. .

ఓ రాజా! ఈ విధంగా నేను నీకు విష్ణుపదముల ఉత్పత్తిని చేప్పితిని. దీనిని వినిన నరుడు లోకమున అన్ని పాపములనుండి ముక్తుడగును. విష్ణుపదత్రయమును చూచిన దుఃస్వప్నము, దుశ్చింత, కష్టము, పాపములు వెంటనే నాశనమును పొందును. పాపిష్టులగు జంతువులను యుగక్రమమున చూచి విష్ణువు తన పదదర్శనమున సూక్ష్మతను జూపించెను. ఏ మానవుడు మౌనముతో అవి ఆరోహణము నుండగా త్రిపుష్కరీ యాత్రను జేయునో అతడు అశ్వమేధ ఫల మొందును. అన్ని పాపములనుండి ముక్తుడై విష్ణుపురమును జేరును.

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టిఖండమందు ముప్పదియ - అధ్యాయము .