పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

31 - శివదూతీ చరితమ్

         భీష్ముడనియె. భగవంతుడా! బాష్కలిని గురించిన చరిత్ర మహాత్పర్యము. బ్రాహ్మణోత్తములు చెప్పగా మున్ను వింటిని. వైరోచనుని కుమారుడు బలి యిప్పుడును పాతాళ మందున్నాడు. పిశాచులు నాగ తీర్ధ మెట్లేర్పడెను? శివదూతి యిచట యేలా మంగళవతి నేయబడెను? పుష్కరతీర్థ మంతరిక్షమున కెవ్వడు గొనిపోయెను? బాష్కలి బంధితుండగుట, విష్ణువు భూమి నాక్రమించుటకు రెండవ కారణమది యెట్లేర్పడెను? జరిగినది జరిగినట్లు సరహస్యంబుగ నీ కథ నెప్పు. ఐశ్వర్యము కోరువారు పాపహరమైన కథ యిదీ వినవలసినదిగదా” యన పులస్త్యుడనియే.

          రాజా! ప్రశ్న భారమిది కుతూహలపడి యడుగుచున్నావు. జరిగిన కథ యిదె నే ప్పెద. విష్ణువడుగుల కొలతలో బాష్కలి బంధింపబడెను. నేనది సెప్పగా నీవు విన్నా వు. తిఱిగి వైవస్వత మన్వంతరము రాగా త్రైలోక్యము బలిచే నాక్రమింప బడెను. విష్ణువేకాకియై వెళ్ళి యజ్ఞమందు బలి బంధింపబడెను. తిఱిగి యా దేవదేవుడు భూమియందడుగులిడి యాక్రమించెను. వామనుని యవతారమప్పుడే జరిగినది. తిరిగి పొట్టివాడు పొడగరియే మూడడుగులు మెట్టెను. కురుకుమారా! ఈ వామన ప్రాదుర్భావము పూర్తిగ నీకు జెప్పితిని. అపుడు నాగులకు తీర్ధమేర్పడినది. ప్రతనిష్ణడవదీకూడ వినుము.

 నాగతీర్ణోత్పత్తి

కశ్యపుని జ్ఞాతులు అనంతుడు మొదలుగ కులికుని దాక గల నాగులు. వీరి పుట్టుకని జగ మెల్ల నిండుకొన్నదీ. వీండ్రు కుటిలులు, భయంకర చర్య చేయు వారు. తీక్షులు, విషపూరితులు. మందమతులనేని మానవులను గఱచి క్షణములో బూడి సేయుదురు. రాజా! వారిని చూచిన మాత్రాన మానవులకు నాశనమగును. రోజు రోజు పరమ దారుణము. మానవ నాళన మేర్పడును. ప్రజలెల్లరు తమ గండ మిది చూచే పరమేశ్వరుని బ్రహ్మను శరణోంది యిట్లనిరి.

సృష్టి కారణ! దేవేశ! పరమేశ్వర! మహానుభావులు నాగేంద్రుల కోరల వలన దీనదినగండము. మమ్మందునుండి రక్షింపుము. ఎంతో దీనులమయినాము. మనుజులు వశు పక్ష్యాదులెల్ల బూడిదగుచున్న ది. నీచే చేయబడిన సృష్టి పాములచే నశించు చున్నది. ఇది తెలిసికొని పితామహ! చేయదగునది చేయుము. అని వ్రజ గోలవెట్ట బ్రహ్మ యిట్లనియె.

       మీ యిండ్లకు మీరు దిగులు జడుపు విడిచి వెళ్ళుడన నందటు పరమ ప్రీతులై బ్రహ్మను పొగడి మరలిపోగా, బ్రహ్మ యా నాగులం బిలిచి, దురాత్ములచే దినదినము భూతములు నాశనమగుచున్నవి. పాముకాటువడి మనుమలు సరి గుఱములు పశువులు నశించుచున్న వి. నా వలన బుట్టిన జీవులను నాశనము చేయుచున్నారు గావున నింకొక పుట్టువున వై వసత్వమన్వంతరమున మీకు మహాదారుణమగు నా కోపముచే సర్వ నాశనము తప్పదు.

చంద్రవంశీయుడగు రాజు జన మేయుడు సర్పయాగమున నగ్ని జ్వాల మిమ్ము గాల్చివేయును. ఈలా పాడు బుద్దులగు మీ కందరకు నాశము కాగలదు, సర్పకులమెంత గల దంతయు నిట్లు శపింప వణకిపోయి బ్రాహ్మణజాతి నాగులు పాదముల పైబడి భగవంతుడా! మాది కుటిలజాతి. ఈ క్రూరత్వము, ఉల్బణత్వము దందరూకత్వము నీవు సంపాదించి పెట్టినవి. ఇపుడు శపింతు వెట్లు? అన బ్రహ్మ యిట్లనియె. వంకర బుద్దులు మీరు నాచే సృష్టించబడిన వాండ్రే యగుదురుగాక ఆయిన నేమి వ్యధపడక తెగ దిందురా? ఆన నాగులు , దేవేశా! ఒక హద్దేర్పరుపుము. మాకొక చోటు వేరువేర నేర్పరుపుముమి. మనుష్యులకు మాకు మధ్య ఒక సమయము నియమము సేయుము. నీ విచ్చిన శాపమును బట్టి జనమేయుడు సర్పయాగమున మాకు నాశనము గూర్చును. ఆన బ్రహ్మయనియె.

         జరత్కారుడను నొక బ్రహ్మవేత్త కలుగగలడు. వానికి జరతన్య నీయవలెను. వారికొక్క కొడుకు గలుగును. మీ వంశమును పవిత్రము సేయువాడతడు మీకు రక్ష యిచ్చును. ఆ విధముగా మీకు మానవునితో నొక సమయమేర్పడును. అందువలన ఏక మనస్కులై నా శాసన మాలింపుడు. సుతలము, వితలము, తలాతలమునను పాతాళములు మూడు లోకములను చక్ర ప్రకారముగ గృహము మీకిచ్చుచున్నాను. ఆటకు మీ రెగుడు. అటు బహువిధ భోగములనుభవించుచు ఏడు తరాలు తిరిగి తిరిగి వచ్చి సుఖముండుడు. ఆపై వైవస్వత మన్వంతరము మొదట కశ్యప వంశీయుడు పుట్టును. దేవతలందరి జ్ఞాతివాడు సుపర్ణుడు సర్వ భక్షకుడు. ఆప్పుడో సర్పజాతి చిత్రబాణునిచే దహింపబడును. మీ యందరికి నాళము గల్గును. క్రూరులు, పొగరుబోతులగు నాగులందరు నశింతురు. ఇది ఇంకోలాకాదు,

          కాలము వచ్చిన జంతువును, అపకారము సేయు మనుష్యుని మీరు తినుడు. గారడి మంత్రములు, నోషధులచే, తంత్రములచే బంధనములచే మీమ్మెదిరించు మనుజుల యెడ జడిసి దూరముగ నుండుడు. మఱి యిం కేమి మనసునందుంచు కొనకుడు. ఆలా కానీచో మీకు వినాశము తప్పదు. అని యిట్లు బ్రహ్మ పలుక నాగులందరు సుతలమను స్థానమునకు వెళ్ళిపోయిరి, రసాతల మందంతట వినోదించుచుండిరి. ఈ శావము వలన నను గ్రహము పొంది సంతోషముతో పొతాళమందుండిరి. కొంత కాలమైన తరువాత తితిగి ఆ నాగు లిట్లాలోచించిరి.

          పేరు ప్రతిష్టలు గలవాడు, భరతుడు, పాండవుల వంశము వాడు రాజగును. ఏదో దైవయోగమున మమ్ము నశింప జేయును. త్రిలోకనాథుడు, ఆందఱకు పితామహుడు, సృష్టికర్త, జగత్తుల మొక్కబడువాడు మాకెందులకు శాపమిచ్చెను? ఆయన గావ మణి మా కింకొక దిక్కులేదు. ఆయన వైరాజ భవనమందట నుండును. ఇపుడాయన పుష్కర క్షేత్రమందు యజ్ఞము సేయు చున్నాడు. అట జని ఆయనను ప్రసన్నం జేసికొందము. సంతుష్టుడై వరమీయగలడు .

ఆనుకొని నాగులందరు యజ్ఞ పర్వతమున కేగి కొండగోడ దగ్గర నిల్చిరి. ఆ నాగు లలసిన వారిం జూచి చల్లని జలధార లందఱికి హాయి గూర్చుచు నుత్తర ముఖముగా గురిసినవి. అందువలన భూముల యందట నాగర్ల మేర్పడెను. దానిని నాగకుండమని, నాగ నదియని కొందరనిరి. ఆన్ని తీర్థములలో పుణ్యమైనది. సర్ప విషనాశనము. శ్రావణ పంచమి నాడట మునుగుదురు. (స్నానము చేయుదురు) వారి కులమందు పాములెన్నడు కరువవు. అచట పితరులకు శ్రాద్ధము పెట్టువారికి బ్రహ్మ పర మోత్తమ స్థానమిచ్చును. నాగులు భయపడుట తెలిసి బ్రహ్మ యంత మున్నన్న మాట తితిగి వారికి వినిపించెను. పంచమి తిథి పరమ ధన్యము. సర్వ పాప హరము. శుభము. ఈనాడే నాగపంచమియందే నాగపూజ చేయవలెను. ఈనాడు ఉప్పు, కారము తినక పాలతో పాములను స్నానము సేయించినతనికా నాగములు మిత్రములగును. ఆన భీష్ముడనియె. శివదూతి యెట్లు పుట్టెను? ఎవరామెను బ్రవేశ పెట్టిరి? ఆది సో కానతిమ్ము అన పులస్త్యుడ నియె.

  శివదూతీ చరిత్రము

శివయను నామె తపస్సు చేయ తలంచి నీలగిరి కేతెంచెను. ఆమె రుద్రుని జటయందు బుట్టిన యొకళ కి రాజా! ఆమె చిరకాలము తపస్సు చేసి యెల్ల జగత్తు మ్రింగివే నెదనని వ్రతము పూనెను. ఇట్లుద్దేశించి, పంచాగ్ని మధ్యమందు సాధన చేసేను. ఆమే ఈ యు తమ తపస్సు చేయుచుండగా రుడవనునొక్క దైత్యేంద్రుడు బ్రహ్మవలన వరమందెను. మహా తేజస్వియై సముద్ర మందు ధన, సమృద్ధమైన రత్న పీఠమందు సర్వదేవ భయంకరుడై వసించుచుండెను. శ్రీమంతుడై రెండవ నముచి యన్నట్లు కోటానుకోట్ల సురలచే నర్చింపబడుచు చిరకాలమున కతడు లోకపాలుర పురమేగెను.

సైన్యముతో దేవతల గెలువగోరి కోరి వైరము తెచ్చికొనెను. ఆమ్మహాసురుడట సముద్రము పైకి లేచుచున్నంత నట నీరు పెంగి పర్వతముల చర్యలను ముంచేత్తాను. లోనున్న నాగములు, మొసళ్ళు చిత్ర విచిత్ర కవచములతోడి అసుర సంఘము భయంకర బలము చక్కని యోధులతోడి బలము పెద్దది చలించిపోయి సముద్రము నుండి వెడలెను. అట నేనుగులు దైత్యభటులు ముటలతోడి రథముల పై సర్వ సమృద్ధులై చేపలకు తమ యాకారములచే నందరు నొకలాగుననున్నట్లు కన బడుచు వెడలిరి. బంగారు సూత్రములు గట్టిన గుజ్జుములు రాహేతమను చేపలవలె నీటిలోనున్న వెల్ల ఆ చేపలతోనే కోట్లు లక్షల కొలది పైకి వచ్చినవి. ఆలా సూర్యరథ సమాన వేగముగలవి చక్రములతో, దంతములతో వెదుళ్ళతో యంత్రములపై చట్రము లోతున పతాక ము లెగురుచుండ రథములు తరలి పెద్ద సడి యొనర్చినవి. ఆయ్యసురుని వెంబడించ దానవవరులు యోధులు తెడ్లు చేబూని న మ్మహో దధిని దాటగోరి మంచి యస్త్రములం జేపట్టి ప్రతి యుద్దమండు జయముగొన్న వారాయుధములం బట్టి ఆసురానుచర భటవర్గ మద్బుతముగ నెగ నెను.

ఆయుద్దములందు వేల్పులు మిక్కిలి భయపడి పారిపోవుచుండ నసురులులందరిం దరిమికొట్టిరి. దేవగణము హడలెత్తి పారి దేవియున్న నీలగిరింజేరిరి. ఆమే రౌద్రి తపోనిష్టనున్నది. ధన్యశాంభవి ఉత్తమ కి సంహారకారిణి కాలరాత్రి నా నెఱుగనె నది. తెలివిదప్పిన దేవతలం జూచి యాశ్చర్యపడి విప్పారిన కనుదామరలంగని, మీ వెనుక నించు లేనిభయము. వచ్చినట్లు గానను శక్రాదులందరు నెందులకు బారిపోవుచున్నా రనిన దేవత లిట్లనిరి! భీమపరాక్రము డిడుగో వీడు రురువు వచ్చు చున్నాడు. వీని వెంట చతురంగబలము చుట్టువారినది. అందుచే దీనులమై దేవి నిను శరణుసొచ్చినాము.

         దేవతల యీ వాక్యమాలించి యామె పెద్ద పెట్టున నవ్వెను. ఆమె నవుచుండగా మొగమునుండి సుందరాంగన లేందరో వేలువడిరి. అందరు పాశములంకుళము లూనిరి. అందరు నిండుగుబ్బలువారు. అందరు కలధరలు భయకారిణులు. కోరలంకుశ ములం వెఱపుగొలుపు మొగములవారు కిరీటముల బెట్టుకొన్నారు. అందరు పెదవులగొఱకువారు. అమంగళములై న పూర్కారముల సడిచే చరాచరమును హడలెత్తించుచున్నారు. కొందరు తెల్లనిచీర రంగురంగుల చీర, కొందరు నీలాంబరము గట్టు కొన్నారు. రకముం దైవ కడు నుబలాటపడువారు నానా రూపములతో నానా వేషములు నానా శరీరములూనినారు. వారితో నిట్లు చుట్టువారుకొని దేవతల భయంకని యా దేవి; జడియకుడు దేవతలారా భద్రమగు మీకు. దానవుడేమనో! చతురంగ నేనతో రురువు వచ్చినాడ నేను.

 దేవతల జూడ వెదకుచు దేవతల ముందు వడు దేవిచే సమాకులమైన నేరం జూచి నిలునిలుమని యర్చచు దైత్యు లటు వచ్చిరి. ఆ దేవీ సంఘమునకు నసురులకు మహా భయంకర మైన యుద్ద మారంభముగాగ బాణములం దేహములు తెగి నేలపై నలుకులాడుచు, రోషమున దండములం దెబ్బదిని పాములట్లు ప్రాకులాడుచు శ క్తిచే బగిలిన గుండెలు, గద చే గుండైన తొమ్ములు, కుఠారములచే పగిలి నడినెత్తులుతో, రోళ్ళచే వ్రేలిన తలలు, త్రిశూలాగ్రములచే ను కువడిన మెడలు, కత్తుల చే నరక బడిన అశ్వరథ మాతంగ వదాతి సైన్యము, అంతయు రణమునం రురువు తప్ప సర్వము గూలెను. బలమటు గూలుటగని రురుడు. మాయను జేకొనెను. దానం దేవతలు మోహవశులైరి. దేవి తామసీమాయ చే దేవి సర్వ మంధకారబంధురమయ్యేను. అంతట దేవి మహాశ క్తిచే నా దైత్యుం గొటైను. ఆ దెబ్బ తినగానే దైత్యుని తమస్సు చీకటిపోయేను. మాయ యిటుపోవ దానవుడు వేగమ పాతాళముంజొచ్చెను. అచట గూడ వర మేశ్వరీదేవి పరివారములతో గూడ కోవమెత్తి వానిముందభిముఖియై నిలిచెను. హడలి యెదుటపడిన దానవేంద్రుని రురుని,

         తల పై గోటితో గిల్లి, వేగమ చర్మము చేకొని పాతాలమునుండి తిఱిగి పుష్కరమును నటవర్వతమున వ్రాలెను. "పెక్కు రూపముల భాసించు పెద్ద కన్యా సైన్యములచే దేవతలచే, రురువు చర్మముండము ధరించిన దేవి, తిలకింపబడి పరమేశ్వరి తన తవస్తానమున బ్రవేశించెను. అంతట మహానుభావలు దేవి సముదాయముం జుట్టువారుకొని నిలిచిరి.

ఆకలిగొని యాందోళనపడక యా మెను ఆకలిగొంటిమి దేవీ! మాకు భోజనము పెట్టుమని యడిగికొనిరి. వారికి భోజనమేమి పెట్టవలెనో తెలియనట్టును చాలా ఆలోచించినది. అపుడు మహాదేవుని రుద్రుని, పశుపతిని, విభుని ధ్యానించెను. పరమాత్మ త్రిలోచనుడట ధ్యానమునుండి లేచి నిలువబడెను. ఆ దేవింగూర్చి దేవీ! మహా మాయా నీ మనసునందున్న దేమినీ చేయవలసినది? తెల్పుమన శివదూతి యిట్లనియె.

 దేవా! నీవు భగమందు వాగరూపమున నుందువు. ఈ దేవీవరమును కోరి నిన్ను భక్షింతురు. వీరికి తినుట కేదేని కొంచే మొసగుము. మహా బలసంపన్నులు వీరు నన్ను శూలముగా వాడు కొందురు. ఆలా కాకపోయిన వీరాకలిగొని నన్ను నుం దినివేయు దురు. ఈ నా స్థితి గమనించి త్వరగ వీరికి భక్ష్యమును సమకూర్చు మన రుద్రుడిట్లనియె.

         శివదూతి! యుగాంతరమందు జరిగిన కథ చెప్పెదను. నేను గంగాద్వారమందు దక్షయజ్ఞ ధ్వంసము చేసితిని. అక్కడ యజ్ఞ పురుషుడు లేడియో వేగముగ పారిపోయేను. నేను బాణముచే గొట్టగా ర కముగారి తడి నేను. అపుడేను అజగంధుడ నైతిని. దేవతలపుడా పేరు నాకు పెట్టిరి. నీవే య జగంధుడ వీవేయని యింకొక భోజనము పెట్టెదను. ఇక నీ వినుమీ దేవులకు భక్ష్యమింకోటి తగినది. చెప్పబోవునది పెట్టెదను. కాలరాత్రి ప్రభగల దానవు. గర్భవతియైన శ్రీ యింకొక ఆ చీర కట్టుకొన్నా తాకినా వి శేషించి పురుషునిది, ఆ గర్భకుడు బిడ్డడి భూతలమున నింకొకని భాగమగును. బలత్కారముగ నా శిశివును నేడాది యీడు వాని లాగుకొని వందలు సంవత్సరము లానందముతో నుందురు. మఱి యితర దేవులు పూజింపబడక పురిటితో చిద్రమును చేకొని దేవేశీ! అలా పుట్టిన వానిని కాజేసి యట నివసింతురు. ఇంటి చేత్రమందు, చెఱువులో ఉద్యానములందు మతి యితర స్థలములందేడ్చుచు నితర స్త్రీల శరీరములందు వసించుచు తృప్తిపడుచుందురు.

ఇది విని శివదూతి, ప్రజలకు నీవిచ్చు పీడ యిది అసహ్యము సిగ్గుచేటు. శంకరా! వారికి లాటి భక్య మొసగుట తగదు శంకరా' యన రుద్రుడిట్లనియె. అవంతి యందు నేను కుమారస్వామిని పెంచునపుడు శుభకర్మ పుట్టు వెంట్రుకలు చూడాకర్మ జరిపినపుడు తల్లులు వచ్చి అపూర్వ భక్ష్యములు తయారు చేసిరి. పిండివంటలు దేవలోకము నుండి దేవతలు గుంపులుగా యా తల్లుల వంటలారగింప ఆ మాతృవర్గ మింట మునువటి యట్ల బ్రహ్మాది దేవతలు వచ్చిరి. గంధర్వులు, అప్సరసలు, యకులు, గుహ్యకులు, మేరువు మొదలుగ పర్వతములు, గంగాది నదులు, అందరు నాగులు, ఏనుగులు, సిద్ధులు, పక్షులు, అసురులు, డాకినులు, భేతాళురు, నైరృతులు, గృహిణులు వచ్చిరి. ఏమి సెప్పుదును? ఇట నీ బ్రహ్మ చేత సృష్టింపబడినది ఆకాశమందున్నదది. సర్వము భోజనము (కోరినడి) స్వేచ్ఛాన్న మట వడ్డింపబడినది, అన శివదూతి యిట్లనియె.

          ఈ ప్రశలకు పెట్టిన భోజనము స్వర్గమందు దుర్లభము. నూనె గలది బెల్లము తోడిది. మనసున కిం ఫైనది. చక్కగా వక్వమైనది. పరమేశ్వరా! ఎన్నడు నింకొకడు తిననిది. ఇది అపూర్వము . దేవదేవుడు శంకరు డోక్కపూటనే భోజనము సేయువాడు. అప్పుడా దేవతా స్త్రీలతో పార్వతిదేవి సన్నిధి, భక్ష్యము కొఱకు మహేశ్వరుడిట్లనియె.

         బహు రకాల వంటకములతో నేను భోజనము తయారు చేసితివి. అదంతయు నై పోయినది. ఇంక నిట నేదియు కనబడదు. తాము వచ్చినారికి నేనేమి పెట్టవలె? ఏదైన నపూర్వ రుచి మీకు నేను పెట్టవలెను. ఎవ్వరు మటి మీకు నే వడ్డించెదను.

మీరు నా నాలిక్రింద గుండ్రని వండ్ల వంటివి వ్రేలాడు నా వృషణములను మీరు తినుడు. దీనిచే చాలా తృప్తికల్గును. అప్పుడా దేవి సముదాయము దా మహప్రసాదమును బడని సదాశివునికి వ్రాలి నమస్కరించి నిలువబడిరి. వారిని గూర్చి శివుడిట్లనియే.

          ఏ మానవులు (వినోదమునకు) వెక్కిరింతలు లేక, శుభాచారములు చక్కగా జరుపుదురో వారికా యజ్ఞము, ధనము, పశుసంపద, దారా పుత్రాదులు, ఇండ్లు, వాకిండ్లు కోరినవి సర్వసమృద్ధములు నేనిచ్చినవి కలుగగలవు. హాస్యమునకై యిచ్చిన వాండ్రు దరిద్రులగుదురు. తెలిసిన వారందుచే నిందహాస్యము నెన్నడు చేయరాదు. మీరందరు మాతృదేవతలుగా లోకమందు ప్రసిద్ధి గనుడు. సెనగలు, పూరీలు, వృషణములతో గూడ అప్పాలను ఉపాహారము గావింతురు. బంధువులతో స్వజనముతో వారి వంశము చెడదు. కలకాలము వంశాభివృద్ధి గల్గును. పుత్రుడు లేనివాడు పుత్రుని, ధనము కోరువాడు ధనమును బొందును. అందగాడు, సౌభాగ్యవంతుడు, భాగ్యవంతుడు, సర్వశాస్త్ర విశారదుడునై యతడు రాజించును. హంసలతోడి యానమున (విమానమున) బ్రహ్మ లోకమున రాజిల్లును. శివదూతీ! ఈలా నా దేవభామినులకు పిండివంటలు పెట్టితిని. నేనేదో సిగ్గుగూర్చునది పెట్టితినని నీవంటివి. ఇదే వినుము.

ఆపై పర మేష్టి రుద్రుడిటు జయజయ ధ్వానములు సేసి స్తుతింప సంతోషించి పరాశక్తి దేవేశ! నీ మనసునందున్నదది వరము కోరుమన రుద్రుడ నియే. ఈ స్తోత్రముచే దేవి! ఫలశ్రుతి నిన్నెవ్వరు సంతోష పెట్టుదురో వారికి నీ వంతటం దికై యుండి వరము లిమ్ము. ఎవ్వడి కొండనెక్కి భ క్తితో నిన్ను పూజించునో నతడు పుత్ర పౌత్ర పశు సంపద నందుగావుత! ఈ నా ముఖమునకు వచ్చిన స్తవమును భక్తితో విన్న వాడు సర్వపాప ముక్తుడై పరమ ము క్లినందు గావుత! రాజ్యము పోయిన వాడు నవమినాడు శుచియై నియమముతో ఆష్టమినాడు, చతుర్దశినాడు, నుపవాసము సేసి యిది విన్న , యత డొక్కడు వత్సరములు సర్వపాపములు విడి పరమ మోక్షమందును. పుష్కర తీర్థ జలమందు స్నానము సేసి యిది పఠించినతడు నీ ఫలమెల్ల పొంది బ్రహ్మలోకమున రాజిల్లును. రాజా! ఈ స్తుతి వ్రాయబడి యే యింట నుండునో, నా యింట ఘోరమగు ఆగ్ని భయము, చోరాది భయము నుండవు. పుస్తకమందున్న యీ స్తుతిని పూజించు పండితుడతడు సర్వ యజ్ఞములు చేసినట్లే. చరాచరమీ జగత్తు సేవించినట్లే. బహు పుత్ర ధన ధాన్య పరస్త్రీ సమృద్దులం గనును. రత్నములు, గజములత్వములు, భృత్యులు నవ్వారికి వెంటనే కల్గును గూడ. ఈ స్తోత్రమే యింట నందు బాటునందుండు నక్కడ నిట్లే తప్పక కల్గును.

ఇది శివదూతీ చరితమను ముప్పది యొకట - అధ్యాయము.