పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

40 - అధ్యాయము

పులస్త్యుడు చెప్పెను. ఆటు పై శ్రేష్ఠమైన యోగి, మిక్కిలి కాంతి గల వాడు, సర్వలోక ముల సృజించువాడు, అన్ని వైపుల ముఖముండు బ్రహ్మను పెక్కు యోజనముల విస్తారము గలది, సర్వతేజోగుణములు, పార్థివగుణములుగల బంగారు పద్మమున సృజించెను. ఆ పద్మము సనాతనము, పృథివీరూపము గలది, ఉత్తమమైనది. నారాయణునుండి ఉద్భవించినది యని మహర్షులందురు. ఆ పద్మమే రసవంతమైన పృథివి అని చెప్పబడును. దివ్యపర్వతములే ఆ పద్మకేసరములు  హిమవంతము, నీల, మేరు, నిషధ, కైలాస, శృంగవంత, గంధమాదన, త్రిశిఖర, మందర, పింజర, వింధ్య, ఆస్తోచల పర్వతములు, ఆ పద్మముయొక్క కేసర ములు. ఇవే పుణ్య శీలురైన గణముల, సిద్దుల, మహాత్ముల ఆశయములు. అన్ని కోర్కెల తీర్చునవి. వీరిమధ్యనున్న ద్వీపము జంబూ ద్వీపమనబడును. ఎక్కడ యజ్ఞసంబంధి క్రియలు జరుగునో అదే జంబూ ద్వీపము. వానినుంచి ద్రవించు నీరు దివ్యామృతరసము వంటిది. ఎల్లెడెల రసవంతములైన దివ్యతీర్థ శతముల, ధారలు, వున్నవి.

భూమి పై ఎలైడలనున్న లెక్కలేని వివిధ పర్వతములు పద్మము యొక్క కేసర ములు. రాజా ! పద్మము యొక్క పెధ ఈనే లుగల ఆకులు, చేరవీలు లేనివి, పర్వతములు గలవియగు మేచ్చదేశ ములే. క్రిందివైపు పత్రములు దైత్యుల, అసురుల, నాగుల వాసములే. వాని మధ్య నున్నది రసాతలమనునది. మహాపాతకములు జేయు మానవులక్కడ మునిగెదరు. ఇక నలువైపుల నాలుగు సముద్రములు కూడా చెప్పబడినవి. ఇట్లు నారాయణుని కై పృథివి పుష్కరమున నుద్భవించినది. కనుక ఈ ప్రాదుర్భావమునూ పుష్కరమనే అందురు. కనుక పురాతనులై న పర మర్పులు య జమున యజ్ఞసంబంధి వేదదృష్టాం తముల చే యూపనయనము చేయుదురు. ఈ విధంగా భగవంతుడు విశ్వమును వ్యాపించి భూమిని ఎన్నుకొనెను. పర్వతముల, నదులను నిర్మించెను. ఆసమాన ప్రతిభగలవాడు, సూర్యునివంటి కాంతిగలవాడు, వరుణుడు, అమీతకాంతిగలవాడు ఆగు స్వయంభువుడు మహాసముద్రమున శయనించిన పద్మ నిధిని సృజించెను. తపము నాచరించుచున్న అతనికి విఘ్నముగా మధువను అసురుడు పుట్టెను. అతనితోడనే కైటభుడను అసురుడూ జన్మించెను.

వారిద్దరూ రజస్సు, తమస్సులనుండి జన్మించినవారు. తామస గుణముగలవారు.గొప్పబలము కలిగి ఏకార్ణవమైన జగత్తునంతా క్షోభ పెట్టసాగిరి. దివ్యమైన ఎర్రని బట్టలు ధరించినవారు, తెల్లనివి, ఉగ్రమైనవగు కోరలు గలవారు, కిరీట మకుటముచే జ్వలించువారు, కేయూరవలయములచే ఉజ్వలముగా నున్న వారు, పెద్దవి, గుండ్రముగానున్న ఎర్రని నేత్రములు గలవారు, విశాల వక్ష స్థలముగలవారు, మహా భుజూలు, మహాపర్వత సమానముఖముగలవారు, కదలు చున్న పర్వతములవలెనున్న వారు, కొ తమేఘమువలె శోభిల్లువారు, సూర్యునివలె జ్వలించు ముఖముగలవారు, వెడల్పగు కేయూరములు చేతికి ధరించి భీషణముగ నున్న వారు. అట్టి మధుకైటభులు తమ ఆడుగులచే భూమిని దద్దరిల్ల జేయుచు, నిద్రించిన విష్ణుమూర్తిని కంపించు నటు జేయుచుండిరి. పుష్కరమున ఎల్లడెల దిరుగుచూ వారు యోగిముఖ్యుడు. ప్రకాశమానుడగు బ్రహ్మ, నారాయణుని ఆజచే ప్రజలనందరిని సృజించుచుండగా చూచిరి. బ్రహ్మ దేవతలను విశ్వములను మానసపుత్రులను, ఋషులను, సృజించు చుండెను. అపుడు దుష్టులు, యుద్ధముచేయదలచినవారు, క్రోధముతోనున్న వారు, కోపముతో తిరుగు కన్నులు గలవారు అగు వారు బహ్మ తో నిరి. తెల్లని తలపాగాదాల్చి, నాలుగుభుజములు గలిగి పుష్కరముననున్న నీవెవరు? మమ్ములను లెకు, పేటక, స్పృహలేనటున్న నీవు మాతో యుద్ధము చేయుము. అర్ణవముననుండుటకు శక్తుడవుకాదు. ఇకడ నిన్ను నియోగించినది యెవరు? సృజించినదెవరు? రక్షించునదియెవరు ? అతని పేరేమి ?

అనగా బ్రహ్మ ఇట్లనెను  అనంత శక్తిని గల విష్ణువు లోకమున ఈశ్వరుడనబడును. అతని నుండి జన్మించిన వానిగా నన్ను తెలుసుకొనుడు. అది విని మధుకైటభులు “ఓ మహామునీ! లోకమున మాకంటే పరమగునది లేదు. తమస్సు, రజస్సులచే మేము విశ్వమునంతా కప్పియున్నాము. ఆవే మేము ఋషుల దాటి వర్తించువారము. ధర్మమును, శీలమును కప్పి యుంచుచున్నాము. ప్రాణులను నశింపజేయువారము మేమే. దాట వీలు లేని మాచేత ప్రతి యుగమున ఈ లోకము కలియుచున్నది. మేమే అర్థము, కామము, యజ్ఞము, పరిగ్రహము. ఎక్కడ సుఖము, మదము, లక్ష్మి, కీర్తి వున్నదో, ఎవరెవరు దేనిని కోరెద రో అదంతా మేమే యని తెలియుము.” అనగా బ్రహ్మ ఇట్లనెను: “పూర్వము మేము మీరిద్దరూ కలిసియున్నది చూసి ఓడించితిమి. అట్టి ఆ సగుణుని సమాధానపరిచి నేను సత్వము నాశ్రయించి యున్నాను. ఎవరైతే యోగ యుక్తుడు, మడు, అక్షరుడు, సత్వమూర్తి, రజస్సును తమస్సును సృజించువాడు, విశ్వకారణుడు, సాత్విక మరియు ఇతర ప్రాణుల కారణము ఆగు వాసుదేవుడే మిమ్ము నశింపజేయును. తన మాయచే అపుడు బ్రహ్మ నారాయణునికి నిద్రించుచునే పొడవైన బాహువుల సృజించెను. ఆ బాహువులచే లాగబడు చూ మధు కైటభులు లావైన పనుల వలే చరించసాగిరి.

అపుడు వారు వెళ్ళి వాసుదేవుని, సమస్కరించి ఇట్లనిరి  “విశ్వ కారణముగా పురుషోత్తముడైన నిన్ను మేమేలు గుదుము. మాకు కూడా హేతువుగా బుద్ధి కారణుడై న నిన్ను తెలిసి, నీవు సత్యము, అమోమ దర్శనుడవు అని తెలిసికొంటిమి. కనుక దేవా! నిన్ను అన్ని వైపుల నుండి చక్కగా చూడగోరుచుంటిమి. ఆమోఘ దర్శనుడై న నీకు నమస్కారము.” అనగా విష్ణుమూర్తి వారితో ఇట్లు పలికెను. “అసుర సత్తములైన మీరు నాతో మాట్లాడుచుంటి రెందుకు? ఆయుషు తీరిన మీరు మరల జీవించ గోరుచుంటిరి.” అనగా వారు “దేవా! ఇంత వరకూ ఎవరూ మరణించని చోట మమ్ము వధించుము. మహా తపస్వి! మేము నీ పుత్రులుగా జన్మింప గోరుచుంటిమి.” అనగా విష్ణుమూర్తి “రాబోవు కలియుగమున మీరు పుత్రులవగలరు. సత్యమే చెప్పుచుంటిని.” అని వరమునిచ్చి, కాటుక వలె నున్న ఆ మహాసురులను రజస్సు తమ స్సుల నుండి జన్మించినవారినీ తన తొడల పై నుంచి నలిపివేసెను.

బ్రహ్మవేత్తలలో శ్రేష్టుడగు బ్రహ్మ కమలమున నిలిచి, చేతులు పైకెత్తి, గొప్ప తేజస్సు గలిగి ఘోర తపస్సు నాచరించును. తన తేజస్సుచే జ్వలించుచున్న ట్లుండెను. ఆ కాంతిచే చీకటిని పారదోలు చూ కిరణములతో సూర్యుని వలె ప్రకాశించెను. అపుడు అవ్యయుడగు నారాయణుడు వేరొక రూపమును ధరించి వచ్చెను. బ్రహ్మ శ్రేష్టుడగు కపిలుడును సాంఖ్యాచార్యుడూ వచ్చెను. బ్రహ్మ వారిని పూజించెను. వర మరియు అవరముల వి శేషము తెలిసినవారు అమిత తేజస్వి యగు బ్రహ్మతో నిట్లనిరి. “విశాల జగత్తు యొక్క సరియగు స్థితికై వేదము నీకు వ్యక్తమగును.” అది విని సర్వభూత గ్రామముల నడుపు బ్రహ్మ ముల్లో కముల సృజించెను. ముందు భూః అను తన పుతు నొకని పుట్టించెను బ్రహ్మ మానసపుత్రుడగు ఆతను, పుట్టగానే బ్రహ్మ ఎదుట నిలచి, “నీకు సాహాయ్యమేమి చేయగలము? తెలుపుమ”నెను.

అపుడు బ్రహ్మ ‘ఈ కపిలుడను బ్రాహ్మణుడు. సొరాయణుడు నీ కేమి చేప్పెదరో నీవు దానిని ఆచరించుమ’ నెను. అంత ఆ మానసపుత్రుడు వారితో ‘నేను మీకు సేవకుడను ఏమి చేయవలేనో చెప్పిన వినెద నని చేతులు జోడించి పలికెను. ఆపుడు విష్ణుమూర్తి సత్యమైనది, నాశములేనిది. పద్దెనిమిది విధాలుగా నున్న ఆమృతమైనదగు పరమపదమును స్మరించుమనెను. ఆది విని యతడు ఉత్తర దిక్కుకు వెళ్ళేను. వెళ్ళి జ్ఞానముతో బ్రహ్మ ఆయెను. అపుడు సృష్టికర్త భువః అను రెండవ వానిని సృజించగా ఆతనూ ‘ఏమి చేయవలేనో చెప్పుమనెను. పితామహుని ఆజ్ఞచే బ్రహ్మను చేరిన ఆతను బ్రాహ్మణుని అమృతరసము ననుభవించెను. అటు పై వర మపదము నొంది వారి చెంత చేరెను. అతను కూడా వెళ్ళగా ప్రభువు మూడవవానిగా మోక్ష ప్రవృత్తియందు సమర్థుడగు సువః అను వానిని సృజించెను. అతనూ ఆ ధర్మమును పొంది వారి గతినే పొందెను. ఇట్లు అతని ముగ్గురు పుత్రులూ గతినొందిరి. నారాయణుడు, కపిలుడను యతీశ్వరుడు వారిని గ్రహించి గొప్ప గతినొందిరి. ఏ కాలమున వారు వెళ్ళిరో ఆ కాలముననే బ్రహ్మ మరల ఘోర తపము నాశ్రయించెను.

ఆపుడు బ్రహ్మ తా నొక్కడే తపమాచరించుటకు శక్తి లేని వాడై తన శరీర సగ భాగము నుండి శుభలక్షణములు గల భార్యను వుత్పన్నము జేసెను. పితామహుడు తన వంటి పుత్రులను కూడా సృజించెను. వారు విశ్వమున ప్రజాపతులు, లోకములు వాని నుండే బయల్వెడలినవి. మొదట ధర్మమను వాడిని మహాత్ముడిని . అతను సృజించెను. దక్ష ప్రజాపతి, మరీచి, ఆత్రీ, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ట ప్రజావతి, గౌతముడు, భృగువు, అంగిరసుడు, అను ప్రజాపతులు. తమ కార్యములచే మహర్షులని తెలియదగువారు కలిగిరి. మహర్షుల వంశములు పదమూడు గుణము రారంభము గలవి. ఆదితి, దితి, దను, కాల, ఆనాయు, సింహిక, ఖస, ప్రాచీ, క్రోధ, సురస, వినత, కద్రువ అను పన్నెండుగురు కన్యలు దుని పుత్రికలు. ఆట్లే ఇరువది యేడు నక్షత్రములూ దకుని పుత్రికలు. మరీచి తపస్సుచే కశ్యపుని పుత్రునిగా నిర్మించినాడు. ఆ కశ్యపునికి దక్షుడు వన్నెండుగురు కన్యలను, చంద్రునికి ఇరువదియేడు నక్షత్రములనిచ్చి వివాహము చేసెను. పూర్వము లక్ష్మీ, సరస్వతి, సంధ్య, విశ్వక, దేవియను ఐదుగురు కన్యలను బ్రహ్మ సృజించి సుర శేషుడగు ధర్మునికి ఇచ్చెను.

కోరిన రూపమును ధరించునది, బ్రహ్మ పత్నీ, రూపార్థవతియగు సురభి - ఒక్కమారుగా వుదయించి బ్రహ్మను చేరినది. అపుడామెను లోక పూజితుడగు బ్రహ్మ మైథునము కోరి చేరెను. లోకముల సృజించు హేతువు దేలిసిన బ్రహ్మ ధర్మలక్ష్మణు లైన పదకొండుగురు పు! తులను, రక్త సంధ్య గల ఆకాశము వంటివారిని, తీక్ష తేజము గల వారిని పుట్టించెను. వారు రోదించుచూ, పారి పితామహుని జొచ్చిరి. రోదించుటచే, పారుటచే వాగు రుద్రులను పేరు గాంచిరి. నిర్ హృతి, సంధ్య, అయోనిజ, మృగ వ్యాధుడు, కపర్తి , మహా విశ్వేశ్వరుడు, అహిర్ బుధ్న్యుడు. భగవాన్, కపాలి, పింగళుడు, సేనాని అని వారి పేర్లు. ఆ సురభి నుండే గోవులు, సురులు, ఆజ, హంస మరియు శ్రేష్టమైన ఓషధులు బయల్వెడలినవి. భవుడు, ప్రభవుడు, కృశాశ్వుడు, సువహుడు, ఆరుణుడు, వరుణుడు, విశ్వామిత్రుడు, చలధ్రువుడు, హవిష్మంతుడు, తనూజుడు, విధానుడు, ఆభిమలుడు, వత్సరుడు, భూతి, సుపర్వుడు, వాసవునితో సహ దేవిచే సృజింపబడిరి.

మొదట ధరుడిని, రెండవ వానిగా అవ్యయుడగు ధ్రువుని, మూడవ వానిగా విశ్వావసుని, నాల్గవ వానిగా సోముని తరువాత తగినవానిగా ఆయువుని, తరువాత యముని, ఏడవ వానిగా వాయువుని, ఎనిమిదవ వానిగా నిర్ హృతిని సుర యందు ధర్ముడు జనింప చే నెను. విశ్వయందు ధర్మునికి విశ్వేదేవతలు పుట్టిరని తెలియును. దక్షుడు, పుష్కరుడు, తముడు, చాక్షుషుడు, ఆత్రి, భద్రుడు, మహోరగుడు, విశ్వాంతకవసువు, బాలుడు, నికుంభుడు, రురుదుడు, అతిసిద్దేజస్వి అను విశ్వేదేవతలను దేవమాత జనింపజే నెను. మరుత్వతి మరుద్దేవతలను జనింపజే నేను. అగ్నియను చతువు, రవి యను జ్యోతి, సావిత్రి, మిత్ర, అమరుడు,శరవృష్టి, సుకరుడు, విరజుడు, రాజు, విశ్వాయువు, సుమతి, ఆశ్వగుడు, చిత్రరశ్మి, నిషధుడు, బృహంతుడు, సనాభిగుడు ఆను పుత్రులను మరుత్వతి కనెను. ఇక అదితి కశ్యపుని ద్వారా వన్నెండుగురు ఆదిత్యులను కనెను.

ఇంద్రుడు, విష్ణువు, భగుడు, త్వష్ట, వరుణుడు, ఆంకముడు, ఆర్యముడు, పూష, మిత్రుడు, వరదుడు, ధాత, పర్జన్యుడు, ఆనువారు దేవతా శ్రేష్టులగు ద్వాదశాదిత్యులు. ఆదిత్యునికి సరస్వతి యందు ఇద్దరు శ్రేష్టులగు పుత్రులు జనించిరి. వారు తపస్సులో, గుణములో శ్రేష్ఠులు. స్వర్గమున అతి ప్రియులు దనువు దానవులను, దితి దైత్యులను పుట్టించెను. కాలకాల కేయులను, ఆసురులను, రాక్షసులను జనింపజేయగా అనాయువు వ్యాధులను జనింపజేసెను. సింహిక గ్రహముల తల్లి , ముని గంధర్వుల తల్లి, ప్రాచి అప్సరసల తల్లి. క్రోద అన్ని భూతములను, పిశాచములను, యక్ష గణములను, రాక్షసులను జనింపజేసెను. చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళు) జీవులు, గోవులు వీనిని సురభి జనింప జే నెను. మాయయందు విష్ణువు, పురాణపురుషుడు, మహర్షులచే స్తుతింప బడి నవాడు చెప్పబడెను. ఈ ఆగ్రమగు పురాణమును వినువాడు, పర్వదినములందు పఠించు వాడు, రాగము తొలిగి పుణ్యలోకము నొందును. పరమున స్వర్గఫలముల నొందును. కళ్ళచే, మనస్సుచే, వాక్కుచే, కర్మచే నాలుగు విధాలుగా కృష్ణుని ప్రసన్ను ని జేసికొనినవానిని కృష్ణుడనుగ్రహించును.

రాజు రాజ్యమును (కోల్పోయిన) పొందును. నిర్ధనుడు ధనమును, క్షిణాయువు ఆయుస్సును, పుత్రకాముడు సంతతిని, యజ్ఞారులు వారి కోరికలను, తపస్సులను పొందెదరు. దేని దేనిని కోలునా దానిని లో కేశ్వరుని నుండి పొండును. అన్నింటిని వదిలి ఈ పుష్కర ప్రాదుర్భావమును చదువు వారికి అశుభము కలుగదు. మహారాజా! వ్యాస శ్రుతి, నిదర్శనముచే మహాత్ముడగు విష్ణు మూర్తి ప్రాదుర్భావమగు ఈ పుష్కరమను దానిని చెప్పితిని. విషత్వమును, కృతయుగమున హరిత్వమును, దేవతలయందు వైకుంఠునిగా నుండుటను, మానవులలో కృష్ణుడనుటను వినుము. హితుడగు ఈశ్వరుని కర్మల గతి ఇది గంభీర మైనది . రాజా! ఇపుడు గతమును, భవిష్యత్తును యథాతథముగా వినుము. ఈ నారాయణుడను ప్రభువు ఆవ్యక్తుడై ననూ వ్యక్తలింగములయం దుండు వాడు, అనంతాత్ముడు, కారణము, నాళ కారకుడు కూడా, నారాయణుడే మునుపు హరిగా ఆయ్యెను. బ్రహ్మ, పొయువు, సోముడు, ధర్ముడు, ఇంద్రుడు, బృహస్పతి, అదితి పుత్రుడుగా అజుడగు హరి జన్మించును. ఇతనే ఇంద్రుని తమ్మునిగా విష్ణువని ప్రసిద్దుడగును. అతనిని ప్రసన్ను ని చేసుకొనుటయే ఆదితి పుత్రుడగుటకు కారణము. దైత్య దానవ రాక్షసుల వధ కై అదితి పుత్రు డాయెను. పూర్వ కల్పమున సురులను, బ్రహ్మను, ప్రజాపతులను మానస పుత్రులుగా సృజించెను. ఆ మహాత్ముల నుండి పరం బ్రహ్మ సనాతనమైన దేర్పడెను.

ఇది ఆశ్చర్యమును కలిగించు విష్ణు కర్మల కీర్తనము లోకముల యందు కీర్తించబడదగిన వానిని నేను కీర్తించగ వినుము. భీష్మా! వృత్ర వధకాగా, కృతయుగము నడుచుచుండగా ముల్లోకములలో ప్రసిద్ధమైన తారకామయ యుద్దముకలిగెను. సంగ్రామమందు జయింప శక్యముగాని ఘోరమైన దానవులు దేవాసురుల నందరినీ యక్ష, సర్ప, రాక్షసులతో కలిపి, వధించుచుండిరి. అపుడు దేవాదులు విముఖులై, చేదింపబడిన ఆయుధములతో సొలసి, రక్షకుడగు నారాయణుని మనసుచే చేరిరి. ఇంతలో, ఆరిపోవు మిణుగురు కాంతిగలిగిన మేఘములు సూర్య చంద్ర గ్రహణములతో ఆకాశ తలమును కప్పివేయుచూ, ప్రచండ మైన మెరుపు తీగలతో, భయంకర ధ్వనినిచేయుచూ, పరస్పరము వేగముగా కొట్టుకొనుచూ ఏడు వాయువులు వీచినవి. వెలుగుచున్న జలములు, వజ్ర, ఆగ్ని వాయువులతో కూడి, ఘోర ధ్వని చేయుచూ, ఉత్పాతములతో ఆకాశమును దహించుచున్నట్లుండెను. వేల కొద్ది ఉల్కలు నేల రాలినవి. ఆకాశమున చరించునవి నేల కూలినవి. దేవ విమానములు నేలను దకి మరల రివ్వున ఎగియు చుండినవి. నాలుగు యుగముల ఆంతమున లోకములకు ఎట్టి భయము కలుగునో అట్లు ఆ ఉత్పాత లక్షణమున రూపము గలవి కూడా రూపము లేనివాయెను. దానిచే అంతటా చీకటి అలుముకొని ఏది తెలియకపోయెను. దగ దీళలు చీకటితో దట్టముగా కప్పబడి ప్రకాశించలేదు.

కాళి నల్లని మేఘమునే ముసుగుగా చేసుకొని రూపము దాల్చి వచ్చెను. నల్ల ని చీకటి సూర్యకాంతిని కమ్మివేయగా ఆకాశము ప్రకాశించలేదు. అట్టి దట్టమైన నల్లని మేఘములు గల ఆకాశమును చేతులతో కప్పివేసి నల్లని శరీరముగల విష్ణువు తన శరీరమును చూపిం చెను. ఆ శరీరము మేఘము. కాటుకల వలె నల్లగ నుండెను. తేజస్సు చే, శరీరముచే నల్లని వర్వతమువలె నుండెను. మేరియుచున్న పీతాంబర ములదాల్చి, మేలిమి బంగారు భూషణముల తొడిగి, పొగ వంటి, చీకటి వంటి శరీరముతో యుగాంతమున ఎగిసిన ఆగ్ని వలె వచ్చినతను విష్ణువు, ఆతని భుజములు గుండ్రంగా, బలముగా నుండెను. తలపై కిరీట ముండెను. బంగారు ఆయుధములతో ప్రకాశించుచుండెను. సూర్య చంద్రుల కిరణములచే మరియుచు పైకి లేచిన గిరి శిఖరమువలె నుండెను. నంద కుని ఆనందింపజేసిన చేతులను, కౌస్తుభముచే మరియు వక్షస్థలమును గలిగి, శ క్తిచే విచిత్ర ఫలములచే ఒప్పారు వాడు, శంఖ చక్ర గదలను ధరించువాడు శ్రీ విష్ణువు. అతను క్షమాశీలుడు, శ్రీవత్స శార్జములను చేత ధరించినాడు. దేవతలకు ఉదారముగా ఫలమునిచ్చువాడు, స్వర స్త్రీలకమిత ఇష్టుడు. అన్ని లోకములయందు అందరికి మనోహరుడు. మాయయను విశాల విటపము గలవాడు. మేఘ సమూహ సమాన కాంతి గలవాడు. విద్య, అహంకార, మానములు గలిగి మహా భూతముల కారకుడగు వాడు. విచిత్ర వత్రములు, గ్రహనక్షత్ర పుష్పములు, దైత్యలోకమున గొప్ప కొమ్మను గలిగి మానవలోక మున ప్రకాశించువాడుగా నుండెను.

సముద్రము వంటి ధ్వని గలిగి, రసాతల తలమును ఆశ్రయముగా గలిగి, నాగేంద్ర పాశ ములచే విస్తరించి, పనుల, జంతువుల గలిగిన వాడు, అన్ని లోకములకు పెద్ద చెట్టువంటివాడు, అవ్య క్తమగు ఆనందమను జలమును, వ్యక్తమగు అహంకారమను నురుగును కలవాడు, మహాభూతములే హస్తములుగా (కెరటాలుగా) గ్రహ నక్షత్రములే బుడగలుగా గలిగి విమాన వాహనములచే వ్యాపించినవాడు, మేఘముల యాడంబరము చే కల్లోలితమైన వాడు. జంతుగణములచే, మత్స్యగణములచే కూడుకున్న వాడు. శైలములు, శంఖములు గలవాడు. తెగుణ్య విషయములే సుడులుగా గలవాడు , ఆన్ని లోకములను తనయందు దాచుకునేవాడు. గొప్ప వృక్షములు, లతలు గలవాడు, సర్పములచే విడువబడిన నాచు (శైవలము) గలవాడు. ద్వాదశాదిత్యులకు మహాద్వీపము, ఏకాదశ రుద్రులకు పట్టణము, అష్టవసువులకు పర్వతము, ముల్లోకములను నీటికి సముద్రము ఈ నారాయణుడు. సంధ్యా కాలమను వేడికి నీరు, పూర్తి అగ్ని చే ప్రకాశించువాడితను. దైత్య యక్ష గణముల సమూహము, రాక్షస గణములతో, జలచరాలతో కూడుకున్న వాడు. పితామహుని గొప్పశక్తి, స్వర్గ స్త్రీల రత్నములలో కూడినవాడు. తేజస్సు, కాంతి, కీర్తి, లక్ష్మి మొదలగు వానిచే, నది చే కూడిన వాడు. కాలము, యోగము, మహావరము, ప్రళయమను వాని యుత్పత్తిచే వేగము నొందిన వాడు. సత్సంయోగమను గొప్ప తీరము, నారాయణుడను మహా సముద్రము, దేవరాజు, వరముల నిచ్చువాడు, భక్తప్రియుడు, అనుగ్రహించు దేవుడు, ప్రశాంతత నొనగూర్చువాడు ఆగు నారాయణుడు.

సూర్యాశ్వరథముతో కూడి, గరుడధ్వజము గలిగి, సూర్య చంద్రుల బింబముచే చేయబడిన నక్షత్రముల వలయముల మధ్య, అనంత కిరణముల గలవానిని, చూడవీలుకాని మీరు కూబరమున, నక్షత్రములే చిత్ర కుసుమములుగా గల చోట గ్రహ నక్షత్రములతో నున్న ఆకాశమున దివ్యలోకమయ రథమున నారాయణుని సూర్యాశ్వ రథముతో కూడుకున్న వానిగా ఇంద్రాది దేవతలు చూచి అంజలిబద్దులే జయమని పలికి శరణమిచ్చువాడిని శరణు వేడిరి. వారి మాటలు విని పరమ దేవతయగు విష్ణువు రాక్షసులను మహాయుద్ధమున నశింపజేయ దలిచెను. ఉత్తమ శరీరమును దాల్చి విష్ణ వాకాశమున నిల్చి, దేవతలందరినీ ఉద్దేశించి ప్రతిజ్ఞా పూర్వకముగా నిట్లనెను. “మరుద్గణములారా! శాంతి నొందుడు. మీకు భద్రమగుగాక! భయపడరాదు! నాచేత దానవులు జయింపబడినారనే తెలియుడు. ముల్లోకములు గ్రహింపబడుగాక!” అనగా సత్యసంధుడగు విష్ణువు పలికిన వాక్యము చే సంతోషించి దేవతలు ఉత్తమ అమృతమును ద్రావినట్లు పరమ ప్రీతి నొందిరి. అంతట చీకటి తొలగినది. మేఘములు నశించినవి. మంగళకర వాయువులు వీచినవి. దిక్కులన్ని తెల్లనైనవి. నక్షత్రములు శుద్దముగా మారి చంద్రుని చుట్టు తిరిగినవి. గ్రహములు యుద్దమును చేయలేదు. సముద్రములు కూడా ప్రసన్న మైనవి.

మార్గములు ధూళి లేనివాయెను. అట్లే స్వర్గాది ముల్లోకములు నిర్మలమాయెను. నదులు వా సవముగా ప్రవహించెను. సముద్రము క్షోభించలేదు. నరుల ఆంతరాత్మయందు ఇంద్రియములు శుభములాయేను. మహర్షులు శోకము తొలగి వేదములను గట్టిగా చదివిరి. యజ్ఞములయందు ఆగ్ని శుభమగు హవిస్సు చే గ్రహించెను. లోకములు ప్రవర్తించు ధర్మముతో సంతోషించినవి. సత్యమగు ప్రతిజ్ఞగల విష్ణువు శత్రువుల నశింప జే నెద ననుటను, ఆభయమిచ్చుటను విని దైత్యులు, దానవులు, యుద్ధము చేయుటకు, విజయము సాధించుటకు గొప్ప ప్రయత్నము చేసిరి. మయుడు గొప్ప బంగారు రథమును అధిరోహించేను, ఆది పన్నెండు వందల మూరల మధ్య నిడివి గలిగి నశించనిది. నాలుగు చక్రాలతో విశాలమైనది. అనేక మహాయుధాలు గలిగినది. చిరుగంటల ధ్వని గలిగి పక్షి సంఘాలతో విరాజిల్లునది. దివ్యాస్త్ర శస్త్రములతో ఆంద మైన మేమమువలే నినదించునది. చక్కని ఇరుసు, ముందు భాగము కలిగి ఆకాశ మువలె నున్నది. గద, పరిఘలు కలిగి మూర్తీభవించిన సముద్రమువలె నున్నది. బంగారు కేయూర వలయములు గలిగి చంద్రమండలపంటి కాడి గలది. పతాకములు ధ్వజములు గలిగి సూర్యునితోని మందర పర్వతమువలె నున్నది. గజేంద్రుని శరీరమును, కొన్ని చోట్ల కేసరము వంటి కాంతి గలిగి వేయి నక్షత్రాలతో, చక్కని ధారలతో నినదించు చుండెను. ఆకాశ మున వెళ్ళగలుగు రథమది దివ్యమైనది.

యుద్ధమును చేయదలచి మయుడు సూర్యుడు మేరువు నధిరోహించినట్లు ఆ రథమును అధిరోహించెను. ఇక తారుడను దానవుడు క్రోక విస్తారము గలిగి పూర్వము చెప్పిన రథమువంటి రథము నెక్కెను. ఆ రథము పర్వతము వంటి కాడి గలిగి, నల్లని కాటుక గుట్టవలె నుండి, కాడికి ఇనుము, రత్నముల సమూహము కట్టబడి యుండెను . చీకటిని చీల్చు కిరణములతో గర్జించు మేఘమువలె నుండి లోహజాలముతో కూడిన కిటికీలు గలిగి యుండెను. ఇనుప ఆయుధములు, పరిఘలు, విసరగలుగు ముద్దరములు నిండి యుండెను. విసరు ఆయుధములు, బంధించు పాశములతో కంటక ములు లేకుండ యుండెను. తోమరము, పరశ్వథము మున్నగునవి యుండెను. ద్వేషించువారికొరకు ఎగిసి దూకుటచే రెండవ మందరమువలె నుండెను. వెయ్యి గిట్టలు గల ఆ రథమును తారుడధిరోహించెను. విరోచనుడు కూడా కోపించి చేతిలో గదను దాల్చి నైన్యము ముందు నిలిచి వెలుగుచున్న శిఖరముతో నున్న పర్వతమువలె నుండెను. హయగ్రీవుడను దానవుడు వెయ్యి గుర్రాలు గల దానవ వ్యూహమును చుట్టు నిలిచెను. విప్రచితి యొక్క పుత్రుడు శ్వేతుడను వాడు తెల్లని కుండలముల ధరించి శత్రు సైన్యమును మర్ధించువాడై రధమును నడిపెను. చాలా విశాలమై, వెయ్యి మూరల వెడల్పుగల ధనుస్సును మీటుచూ యుద్దము యొక్క ముందు భాగమున వృక్షముతో పర్వతమువలె నిలిచేను. ఖరుడనువాడు కోపము చే కళ్ళనుండి నీటిని గక్కుతూ, పళ్ళు, పెదవులు, కళ్ళు అద రుచుండగా యుద్ధము చేయగోరేను. త్వష్ట పద్దెనిమిది గుర్రాలను పూన్చిన రథమునెక్కి దివ్య వ్యూహముతో యుద్ధమున నిలిచెను.

బలిపుత్రుడు, శ్రేష్ఠుడు, గొప్ప ఆయుధములు గలవాడు అగు ఆర్బిడనువాడు భూమిని కంపింపజేయుచు యుద్ధమును గోరి నిలిచెను. కిశోరుడు సంతోషముతో ప్రేరేపించబడిన సింహమువలె, గ్రహముల మధ్య సూర్యునివలే, దైత్యుల మధ్య నిలిచెను. లంబుడను వాడు నీలమేఘము వంటి కాంతితో, వేలాడు భూషణములతో దైత్య ప్యూహమున నుండి మంచుతో నున్న సూర్యునివలె నుండెను. ఇక హంసుడు భూ ప్రకాశమును గలిగి, దంతములు, పెదవులు, కళ్ళు ఆయుధముగా క్రూరమహాగ్రహముగా దైత్యుల మధ్య నిలిచియుండెను, ఇతరులు గుర్రాల పై, మదగజాల పై నుండిరి. మరి కొందరు సింహాల పై, పులుల పై, వరాహముల పై భల్లూకముల పై నుండిరి. మరి కొందరు ఒ0 టెలను, గాడిదలను, మేఘములను ఏక్కిరి. భీషణముగా వికృతమగు ముఖములు గల మరికొందరు పదాతులై యుద్ధమును కోరి ఒంటి కాలి పై గెంతిరి. గాలిలో ఎగిరి నర్తించిరి. ఆరుచుచూ, దర్పముతో నున్న పులుల వలె దానవ వీరులు కోలాహలము చేసిరి. వారు గదలను, పరిమలను, శిలలను , ముద్దరములను చేతదాల్చి, పరిమలవంటి బాహువులతో దేవతలను బెదిరించ సాగిరి. అనేక విధములైన ఆయుధములతో, శతఘ్నులతో ముద్గరములతో క్రీడించిరి. ఆట్టి ఆయుధములు దాల్చిన వారితో మేఘములతో వలె ఆకాశము అంతటా కప్పబడెను.

ఈ విధంగా ఆ దానవ సైన్యము అన్ని జీవుల మదముచే ఉత్కటమై ఉదయించిన మేఘముల సైన్యమువలె దేవతల ఎదుట నిలిచెను. ఆ దైత్య సైన్యము వేలకొలది సైనికులచే వాయువు, అగ్ని, శైలము గల మేమ జలమువలె నుండి యుద్ధముచేయ కోరికతో ఉన్మ తమైనట్లు భాసించెను. కురునందనా! దైత్య నైన్యము యొక్క విస్తారమును వింటివి. ఇక సురుల వైష్ణవ సైన్యము యొక్క విస్తారమును వినుము.

ఇది శ్రీ పద్మ పురాణమున మొదటి సృష్టి ఖండమున దైత్య సేన వర్ణనమను నలుబదియవ ఆధ్యాయము.