పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

1 - సృష్టిఖండః - మంగళాచరణమ్ : పురాణావతారికా

స్వచ్ఛమైనది చంద్రునివలెదెల్లనిడి చల్లనిదియు నేనుగులు మొకళ్లు చేయు సంక్షోభముచే నులుగులు గమ్మునది బ్రహ్మానుసంధానమందు పరమనిష్ఠకొని ప్రతనియమాచరణపరులై న విప్రవర్యులచే సేవింపబడునది స్నానపానాదుల కువయోగపడునదన్న మాట) ఓంకారముచే నలంకరింపబడువాడు ఆకారము, ఉకారము, మకారము (ఆర్ధతన్మాత్ర) రూపమైన త్రిమూర్తుల స్వరూపమయిన త్రిలోకగురువగు (బ్రహ్మచే (పరమాత్మచే దృష్టిపూరితము కటాక్ష మాత్రప్రసారముచే బవిత్రము సర్వపుణ్య ఫలానుభవ సమృద్ధిచే మనోహరమును. ఆశుభముల హరించునదియు నగు పుష్కరతీర్ధపవిత్రోదకము మిమ్ములను బవిత్రులను గావించుగాక ! ఇది యీ వద్మపురాణ ప్రారంభ మంగళ శ్లోకము. ఈ పుష్కర సరసీర్థప్రభావము (బ్రహ్మవురాణమందు విపులముగ వర్ణింపబడినది. ఇది హిమాలయము నందున్నది.

ఏకాంతమం దాసీను డై యున్న ఉగ్రశ్రవుడను పేరుగల సూతునితో వ్యాసశిష్యుడు బుద్ధిమంతుడునగు లోమహర్షణుడిట్లనియె. నాయన ! ఋషులయాశమముల కేగి నావలన సంగహముగ విన్న ధర్మములను వా రడుగ విపులముగ జెప్పుము. కుమార ; వేదవ్యాసభగవానుని వలన నేను విన్న పురాణము లన్నిటిని నీకు జెప్పితిని. వానిని మునులకు విస్తరముగ వచనము సేయుము, పయాగ మతమందు వ్యాసభగపోనులు - స్వయముగ ధర్మరతులు మునులడుగ నీవురాణముల నుపదేశించెను. సర్వలోకహితముగోరి చక్కనినాభి గలిగి దివ్యరూపమై సత్యపథమందు దీటుగు శుభకరమైన విక్రమము గల్గి యీ చక్రము, విష్ణునిచే ప్రవర్తింపబడినది. ఏలాటి యలసటగొనక దీని వెంట నేగుడు. దాన మీ యభీష్టమును పొందగలరు. ఈ ధర్మచక్రము వోవుచుండ దీనినేమి (చుట్టునున్న వట్టా) ఎక్కడ నూడిపడునో ఆ ప్రదేశ మతి పుణ్యము అని లోమహర్షణముని సెప్పి యదృశ్యుడయ్యెను. గంగలో బొడమిన సుడివలె పరిభ్రమించు నా ధర్మచక్రము (నేమి) అంచు విడివడినచోట నైమిశారణ్యమునందు (నేమికి సంబంధించిన ప్రదేశమగుటచే నిది నే మిళమను పేరందినది) ఋషులున్నారు, ఆట కేగి వారికి మనవి చేయుము. ధర్మసందేహములను వారి నడుగుము. అన నుగ్రశ్రవుడు - (సూతుడు). జ్ఞానులయిన యా మునివరుల సన్నిధికేరి పాదములు పట్టుకొని చేతులు జోడించి సాష్టాంగనమస్కారము నేషియా మేధావి వారినానందభరితులను. జేసెను. సత్యయాగ దీక్షితులగు, నమ్మునులు, సభాసదులతో వచ్చి యమ్మహానుభావుని పూజించిట్లనిరి.

సూత ! నీ వెక్కడ నుండి యెందుల కెవరియాన నీటకు వచ్చితివి ? దేవవర్బస్వి ! నీవది చెప్పుమన సూతుడు; వ్యాన శిష్యుడగు లోమహర్షణునిచే మునులకు శుశ్రూష చేసి వారడిగినదెల్ల చెప్పుమని యాదేశింవబడినాను. భగవంతులు మీరిపు డేనేమికథ చెప్పవలేనో సెలవిండు. పురాణమా? ఇతిహాసమా? లేక - వైక్కు తెలుగులయిన ధర్మముల నా ? మీరేమి వినవలతురన నా మధురభాషణము వారాలించిరి. అవ్వల వారికి పురోణము వినవలయునను కోరిక గల్గెను. మిగుల విశ్వాసముతో వచ్చిన విద్వాంసుని లోమహర్షణ కుమారునింగని యా సతయాగమున కులపతి సర్వశాస్త్రవిశారదుడు మేధావి విజ్ఞానారణ్యకమున 'ఆరణ్యకమను వేదాంత భాగమందు గురువు నైన శౌనకుడు సూతుని భావముంగైకొని ధర్మముల నాలింపగోరి యతని కిట్లనియె..

సూతా ! ఓ బుద్ధిశాలి ! బహ్మవేత్తల డగేసరుడైన వ్యాసభగవానుని నీ వీతిహాస పురాణముల కొకు లెస్సగా నుపాసించితివి. పురాణ విషయ నిష్టమైన యాయన శుభప్రదమైన బుద్ధిని నీవు పిడికికొంటివి, దూడ కుడిచిన కొలది ఆవు పాలు చేపును. ఆ విధముగ నీవు వ్యాసభగవానుల నుపాసించి ఇతిహాస పురాణ భావమాధుర్యమును సమృద్ధిగ గహించితివన్న మాట. ఈ విముఖ్యులుపురాణము నాలింప గుతూహలపడుచున్నారు. నీ వడి వినిపింప నర్హుడవు, వీరందరు మహాత్ములు, నానా గోతములవారు దయచేసినారు. ఈ బహ్మవాదులు తమ తమ కభిరుచి గల యాయా యంశములు నీవల్ల విందురుగాక! ఇది సంపూర్ణమైన దీర్ఘ నత యాగము. ఇందా పురాణ వచనము నీవు గావింపుము. ఏలాంటి పదార్ధము మొట్టమొదట రూపొందినది ? ఆందు బహ్మ యెట్లు పుట్టెను ? ఆ పుట్టిన వానివలన సృష్టి యెట్లయ్యే నదీ తెలుపుము. అన సూతుండు వారికి శుభపదముగ సూక్ష్మముగ న్యాయసమ్మతముగ నీట్లు బదులు పలి కెను.

            ప్రీతుడనైతిని తామిక్కడ జేసిన హాబోధన వలన (వేరణ వలన) అనుగహితుడనైతిని.

(అనుగ్రహ పాతుడనైతినన్నమాట) సర్వధర్మనిష్టులు పురాణవేత్తలునైన మహానుభావులవలన నెట్లు వింటిని, "అది మిక్కిలి పసిద్ధమైన కథ యదెల్ల మీకు జేపుచున్నాను. ఈ చెప్పుట సత్పురుషులు సూతుని సనాతనమైన ధర్మమని కను గొన్నారు. దేవర్షి రాజవంశములు మహాతేజస్వులగువారు చేసిన స్తుతులను ధారణ సేయవలయును.  అవి ఇతిహాస పురాణములందు గనిపించును.

సూతునికి  వేదములం దధి కారము లేదు. వేనునికుమారుడు పృథుచక్రవర్తి యజ్ఞము - సేయుచుండ మాగధుడు సూతుడును నా నరపతిని స్తుతించిరి. సంతుష్టుడై యా మహాత్ముడు వారికి వరమిచ్చెను. నూతునికి సూతమను దేశమును మాగధునికి మగధ దేశము నీయబడినవి. ఆ యజ్ఞమందు సుత్యాహస్సునం దీతడు పుట్టి  సూతుడను పేరందేను, ఇంద్రదేవతాకమయిన యాగము నడచుచుండ బృహస్పతి గ్రహము గొనినంత నా హవిస్సుశిష్యునిచే తారుమారు చేయబడెను. అట్లు క్రిండిడి పైకి వైది క్రిందికి హవిర్ధారలు నేతి ధారలు) దారుమారయినందున వర్ణ సాంకర్యమేర్పడెను. . శత్రియుని వలన బ్రాహ్మణ స్త్రీకి బుట్టిన వానికి క్షత్రియునితో సమాన ధర్మమేర్పడుటవలన వారు వైధర్ములుగా జెప్పబడిరి. . (విలోమ సంబంధమునుబట్టి), క్షత్రియధర్మానుసారియగు నూతునికీ ధర్మము మధ్యమము. అందుచే నాకు పురాణములందధికారము బ్రాహ్మణులచే నీయబడినది. కావున యీ యవనియందు ఋషులు పూజించు పురాణమును నేను బ్రవచనము సేయుదును.

పితృదేవతలకు మనస్సంకల్పమాత్రమున నొక కన్యక గలెను మానసిక పత్రి). ఆమె యింద్రుని డొందినది. పితరులామెను శీలభంగము గల్గిన దానింగా థావించినంత చేవ గర్భమున పుట్టెను, అగ్ని పుట్టుకకు కారణమైన ఆరణివలే (జమ్మి కర్రతో జేసిన అగ్ని మంథన పాత్ర అరణి) నామె యొక ఉత్తమజన్మునికి నిమిత్త మయ్యెను. ఆమెయందు బరాశర మహర్షికి మహానుభావుడగు ఋషి యుదయించెను. అట్టి భగవంతునికి సత్యునకు వేధసునికి (బహ్మకు) పురాణపురుషునికి బ్రహ్మవాక్యముల ననువర్తించు వానికి (వేదోక్త విధి విధానమును దప్పని వానికన్న మాట) మానుష వేషధారికి వేదవళంపితునికి విష్ణువునకు పుట్టినంతనే వేదము సర్వస్వముగ నుపస్థితము (స్ఫురించినది)అయ్యెను.  ఏ మహానుభావుడు వేద సముద్రములను బుజ్జియను కవ్వముచే మధింవ మహా భారతమను చంద్రబింబ ముదయించెనో; భారతము భానుడు. విష్ణువునను నీ మూడును లేనిచో నజ్ఞాన గాంధకార బంధురమగు నీ జగత్తు యొక్క యవస్థ యెట్లుండెడిదో కదా! అట్టి దానికి గర్త యైన కృష్ణద్వైపాయనుడైన వ్యాసుని సాక్షాన్నారాయణుడని గ్రహింపుము. పుండరీకాక్షుని కంటె (విష్ణువుకంటె) ను యెవడు మహాభారత కర్త కాగలడు ? అట్టి బ్రహ్మవాది వలన నేను బురాణమును , విన్నాడను. ఆయన నర్వజ్ఞుడు, సర్వలోకములకు వెలుగునిచ్చు తెజపుంజన్వరూపుదు

బహ్మ అన్ని శాస్త్రములకు ముందు పురాణమును స్మరించెను. (శాసించునది శాస్త్రము. అనగా వేదము. కాపుననే దానిని ప్రభుసమ్మితమని విజ్ఞులన్నారు) బహ్మ యొక్క సృష్టి సంకల్పమందు స్పురించినది పురాణమన్న మాట. అందుచే నది సర్వజ్ఞానము సమకూర్చుటయందుత్త మము. ధర్మార్థకామములను తివర్గమునకు సాధనము. పవితము, శతకోటి శ్లోక సంఖ్యాకము. లోకములు నిశ్శేషము లయినప్పుడు ప్రళయమందన్న మాట) విష్ణువు అశ్వరూపుడైన బహ్మ యొక్క యాజ్ఞవలన, ఆంగములను (వేదాంగములను) నాల్గు వేదములను పురాణమును, న్యాయశాస్త్రమును సోమకాసురు డదియెల్ల దొంగిలించి తన వశముచేసికొన్నదానిని మత్స్యావతారమెత్తి కల్పాదియం దేకార్ణవమైన తనందుండి గొనివచ్చెను. ఉదకములందుండియే యా పభువీ వేదముల నువదేశించెను. చతుర్ముఖుడు వానిని విని మునులకుం జెప్పెను. అన్ని శాస్త్రముల వత్తియు పురాణముల నుండియే యయ్యెను. కాలక్రమమున పురాణ గహణశక్తి లేకపోవుట చూచి, విష్ణువు వ్యాసరూపుడైన బ్రహ్మ యుగయుగమందు (ద్వాపరమున) నవతరించి నాల్గు లక్షల శ్లోకములలో అష్టాదశాత్మకముగా భూలోకమున వెల్లడించెను. శతకోటి పరిమితమైన మూలపురాణ మివ్పటికిని దేవలోకములందున్నది. అదే నం చేపించి నాల్గు లక్షలుగా నీభూమిపై నుంచబడినది. .

దానిలో నివుడు పరమపుణ్యమైన వద్మమను వేరను మహాపురాణమును జెప్పబోవుచున్నాను. ఇం దైదు ఖండములు ఏబడియైదువేల శ్లోకములును గలవు. సృష్టి ఖండము - భూమి ఖండము స్వర్గ ఖండము పాతాల ఖండము. ఉత్తరఖండము. ననునవేదు కమముగా నున్న వి మహాపద్మమొకటి సర్వన ష్టిమయమదే. విష్ణునాభి కమలమను వేరంటోడమెను. ఆ వృత్తాంతమెల్ల యీ పురాణమందుండుటంబట్టి పురాణము పాదము అని పేర్కొనబడినది,

ఈ పురాణము వుణ్యవసాదము. విష్ణుమాహాత్మ్య విస్తరము. దీనిని దేవదేవుడు హరి బహ్మకు మునుపదేశించెను. బహ్మ యిదంతయు . మరీచికి చెప్పెను. ‘ విష్ణునాభివద్మము - నర్వభూతాశయమైనట్లే ' యిదీయును సర్వభూత చరితాళయమైనందున పాద్మమనబడుచున్నది. ఇది ఖండాత్మకమనియు పర్వాత్మకమనియు, గూడ జేర్కొనబడినది.. పర్వవిభాగానుసారము, పౌష్కరపర్వము, ఇందే  విరాట్పురుషావిర్భావము. వర్ణింపబడినది. 2వడి. తీర్థపర్వము. ఇందు నర్వగహములను గూర్చి తెలుపబడినది. శివ పర్వము భూరిదక్షిణములయిన యజ్ఞములు చేసిన రాజులచరిత్ర. 4వ పర్వము, రాజవంశాను చరిత్రము 6వ పర్వము మోక్షతత్త్వము (నర్వతత్త్వము)పుష్కర పర్వమందు బహ్మ చేసిన తొమ్మిది విధములయిన - సృష్టి 1) దేవర్షిపితృపముఖ సృష్టివిశేషము 2వ పర్వములో " ద్వీపములు నత్త సాగరముల సృష్టి తీ). (పర్వత) ఈదసృష్టి - దక్షశాపవృత్తాంతము 4వ పర్వములోరాజుల " పుట్టుక - వారి వంశ చరిత 5వ పర్వములో మోక్ష శాస్త్ర సంకీర్తనము - ఇదంతయు. నీ పురాణమునం జెప్పెద. ఈ పురాణము వవితము కీర్తి కరము పితృదేవతల కెంతేని యిష్టము. ఇది విష్ణుదేవ ప్రీతికరము. మహాపాపాత్ములకు గూడ నిడి సేవింపదగినది.

ఇది పద్మపురాణమున సృష్టిఖండమునందు మంగళాచరణము - పురాణావతారికయను మొదటి అధ్యాయము.