మూ॥ నారద ఉవాచ :
శ్రీభగవానువాచ :
మహాదేవ ఉవాచ :
నారదుడిట్లా - ఓ విభు! గణేశపూజ తరువాత రాధస్తోత్రం తరువాత ఏమి, రహస్యము జరిగింది. దానిని నాకు వివరించండి. (1) అనగా భగవానుడిట్లా - గణేశపూజ కొరకై తీర్దమందు వచ్చిన దేవతలు, మునులు, యోగీంద్రులు వటమూలమందు ఉంటుండగా (2) వా(వ)సుదేవుడు, దేవకి మిక్కిలి ఆదరపూర్వకంగా శంభువును, బ్రహ్మను, అనంతుని, ముని పుంగవులను (3) అడిగినారు. భవాబ్దిని దాటుట మాకు ఉత్తమగతి కావాలి, ఓమహాభాగులార! దీనులమైన మాకు దీనబాంధవులైన మీరు త్వరగా చెప్పండి. భవాబ్దిని దాటటానికి ఆపడవ యందు మీరు నావికులు. (4) తీర్థమనగా నీటితో నిండి ఉండటం కాదు, మట్టి, శిల ఇవి ఉన్నంతనే దేవతలుకారు (దేవుళ్ళు) యజ్ఞరూపములైన పుణ్యములు, వ్రతములు, ఉపవాసములు (5) తపస్సులు, రకరకాల దానాలు, విప్రుల దేవతల అర్చనలు ఇవన్నీ చాలా కాలానికి, పవిత్రులను చేస్తాయి. వైష్ణవులు దర్శనంతోనే పవిత్రుల చేస్తారు. (6) విష్ణుభక్తులైన సజ్జనులైన పవిత్రులైన వారి పాదపద్మముల ధూళియొక్క స్పర్శతగిలినంతనే భూమి వెంటనే పవిత్రురాలౌతుంది. (7) తీర్థములు పవిత్రమౌతాయి, సముద్రములు, పర్వతములు కూడా పవిత్రమౌతాయి. దేవతలు, పాతకములనే కర్రలకు అగ్నివంటి వాటి దర్శనాన్ని కోరుకుంటారు. (8) అజ్ఞాని దానిని తెలుసుకోలేడు. జ్ఞానం కలవాడితో కూడితేనే, జ్ఞానం లభిస్తుంది. మిక్కిలి రుచికరమైన రూపము పాలు పెరుగు రసం వంటిది. (9) నేను కృష్ణుని తండ్రిని చాలా కాలం నుండి కలసి ఉన్నాము. అట్లాగే దేవకీమాత జ్ఞానులకు గురువునకు గురువు. (10) వాసుదేవుని మాటవిని నవ్వి శంకరుడు స్వయంగా, నాలుగు వేదములకు జనకుడు గురువు ఆతడిట్లన్నాడు. (11) మహాదేవుడిట్లా - జ్ఞానులు దగ్గరలోనే ఉంటే అనాదరమునకు కారణమౌతుంది. సిద్దికొరకు, ఇతర తీర్థములు గంగా జలంతో పవిత్రమౌతాయి. (12) వాసుదేవుని యొక్క తండ్రి ఇతడు. వసుదేవుడు ఈతడు పండితుడే జ్ఞానియైన కశ్యపుని అంశ ఇతడు. వాసు తండ్రికి. తనకు అదే అంశ. (13) మనల్ని జ్ఞానమడుగుతున్నాడు కృష్ణున్ని తెలుసుకోకుండ, పుత్రుడనే బుద్దితో అడుగుతున్నాడు. ఓహో దుర్గ! మహామాయ జ్ఞానులను మోహింపచేసేది (14) విష్ణుమాయను ఆరాధించటము కష్టము. జగత్తులకు కూడా సాధ్యముకానిది మేము, వేదములకు జనకుడైనవాడు మోహింపబడ్డాము ఎల్లప్పుడూను. (15) ఆతని మాయతో, మోహింపబడి బ్రహ్మ కృష్ణుని పరీక్షిస్తాడు. బ్రతికినంతకాలం తపస్సుతో ఆతని పాదాంభోజములను ధ్యానిస్తాడు, మరి (16) పదిలక్షల ఎనిమిది వందల ఇంద్రులు గడిచిపోతే బ్రహ్మ పోతే మాధవునకు ఒక నిమిషము (రెప్పపాటు) (17) పారిజాతం కారణంగా దేవునకు, ఇంద్రునకు యుద్ధమైంది. పారిజాత వృక్షాన్నిచ్చి నేను ఇంద్రుని రక్షించాను.
సనత్కుమార ఉవాచ :
అను ॥ జ్ఞానము మాటలకే పరిమితమైందికాదు, తత్వమనగా విషయాత్మకమైనది మాత్రమే కాదు. ఆ అజ్ఞానం వల్ల సాధింపతగినవానికి ఎప్పుడూ నేను ఏకొంచము సాధింపబడను. (19) ప్రాణుల ఆత్మలజ్ఞానము మాకు జ్ఞానమున్నది (తెలుగు). అతనికన్న పైన, ఆతనితో సముడు లేదు. మంచి చెడులను కృష్ణున్నే అడుగు. (20) బ్రహ్మయొక్క నాలుగు యామముల కాలము కల్పమంటారు అని కల్పమెరిగిన వారు చెప్పారు. మార్కండేయుడు ఏడు కల్పముల అంతము వరకు జీవించేవాడు, మహాముని (21) తొంబది. ఎనిమిది ఇంద్రులు పడిపోయిన తరువాత ఆముని పడిపోతాడు. ఆ పిదప తపః ఫలము వలన ఆముని హరిదాస్యాన్ని పొందాడు. (22) ప్రళయంలో బ్రహ్మపడిపోతే లోమశుడు పడిపోతాడు. దిక్పాలులకు, గ్రహణములకు, చిరజీవులకు అదే ఆయువు. (23) ఇతర దేవతలకు, ఊర్ధ్వరేతస్కులైన మునులకు, రుద్రులకు అదే ఆయువు. మృత్యుంజయుడనైన నాకు తప్ప (24) ప్రలయంలో విధిపడిపోతాడు, శివలోకంలో శివుడనైన నేను పడిపోతాను. బ్రహ్మఫాలము నుండి పుట్టినవాడు శంభువు. అందరికి ఆది. సృష్టిలో మాటాడినవాడు (25) కృష్ణుని ఎడమభాగమునుండి రాధ పుట్టింది. అట్లాగే దుర్గ, లక్ష్మి, సావిత్రి, సరస్వతి పుట్టారు. (26) అదితిపుత్రుడైన ఆదిత్యుడు శరీర సమూహములతో పన్నెండు విధాలు. అట్లాగే మహేంద్రుడు కాయవ్యూహములతో (శరీర సమూహములతో) పదునాలు రకాలు. (27) అట్లాగే వసువులు ఎనిమిది మంది, ఆ రుద్రులు పదకొండు మంది. మనువుపడిపోతే చంద్రుడు పడిపోతాడు. కనిపించకుండాపోతాడు. (28) అందరికి ప్రళయకాలమందు చావు వస్తుంది. ప్రళయంలో బ్రహ్మాండము నీరు (ఉప్పొంగి) పోతూ కప్పబడి కన్పిస్తుంది. (29) బ్రహ్మను (ఆతని) తన లోకము, తనను, శక్తులతో కూడా నాకు చూపాడు. అందరికి మూలరూపుడు, సర్వేశుడు, కృష్ణుడే .(30) యజ్ఞమునకు ఈశుడు, యజ్ఞమునకు కారణము ఐన పుత్రుని రాజసూయమందు సేవించు. శాస్త్ర ప్రకారము దక్షిణనిచ్చి భవసాగరాన్ని దాటు, ఓయాదవ! (31) నిర్వాణముక్తి (నాశనము) నీకులేదు. విషయాసక్తుడవు నీవు కశ్యపుడవు. నీకు దాస్యము లేదు. పంచబడిన ధనము ధాస్యము లేదు. అదితి,దేవకి వారు అట్లాగే. (32) భోగబీజమైన స్వర్గానికి వెళ్ళు, నీ స్థానము అమరాలయము. శివుని మాటను విని, ప్రయత్నపూర్వకముగా మంచి ముహూర్తమందు (33) అక్కడ సంభారములు కూర్చుకొని, ఆతడు రాజసూయం చేశాడు, వసుదేవుని హవ్యమును దేవతలు సాక్షాత్తుగా స్వీకరించారు. (34) అక్కడ యజ్ఞేశుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. ఈ యజ్ఞము దక్షిణ కూడా. పూర్ణాహుతి ఇచ్చిన వసుదేవునితో ఆతడిట్లన్నాడు. ముని! వాసుదేవుని ఆజ్ఞతో భగవాన్ సనత్కుమారుడన్నాడు. (35) సనత్కుమారుడిట్లా - ఓ తండ్రి! త్వరగా లక్ష్మీపతికి సర్వస్వాన్ని (అంతా) దక్షిణగా ఇవ్వు. ఈకర్మనుసార్థకం చేయ్యి. వేదోక్తమైన మాటను విను. ఎంతవరకైతే బ్రాహ్మణునకు దక్షిణ ఇవ్వరో.
ముహూర్తకాలం ఇవ్వకపోతే ఆదక్షిణ రెట్టింపు ఔతుంది. రోజుగడిస్తే అది నాల్గింతలౌతుంది. (38) మూడు రాత్రులు గడిస్తే ఆరింతలౌతుంది. పది హేను రోజులు గడిస్తే నూరురెట్లు అధికమౌతుంది. మాసంగడి స్తే దానికి నాల్గింత లౌతుంది. (39) ఆరునెలలకెక్కువైనా తక్కువైనా వేయిరెట్లోతుంది. సంవత్సరానికి లక్ష రెట్లు ఔతుంది. ఓ యాదవ! ఇట్లా బ్రహ్మచెప్పాడు. కర్మచేసినవాడు పురోహితుడు వీరిద్దరు నరకానికి పోతారు. (40) వసుదేవుడామాటవిని, ఆతడు తన సర్వస్వాన్ని వదిలాడు. వాసుదేవుని ఆజ్ఞతో అధికారాన్ని ఆనందంగా వదిలాడు. (41) చాలా ఉత్తమమైన పదికోట్ల అమూల్యరత్నములను, గర్గునకు అందరికంటే ముందుగా స్వయంగా లక్ష్మీపతి తండ్రి ఇచ్చాడు. (42) శ్రేష్ఠమణులను నూరుకోట్లను దానికి నాల్గింతల బంగారాన్ని, అట్లాగే మాణిక్యములు, ముత్యములు, వజ్రములను (43) వెండి, పగడము మంచి బంగారు పాత్రలను ఉన్నవన్నీ ఇచ్చాడు. తన స్త్రీల తనభార్యల అమూల్యరత్నభూషణములను, (44) లక్ష తెల్లని చామరములను, లక్ష రత్నముల అద్దాలను. కామధేను సమూహాన్నంతా, నూరుకోట్ల ఏనుగులను, ఇచ్చాడు. (45) గజశ్రేష్ఠములను నూరుకోట్లు, వానికి నాల్గింతల గుఱ్ఱములను, యాదవుల ధనాన్ని, రాజానుమతితో రాజుధనాన్ని ఇచ్చాడు. (46) నూరు లక్షల గ్రామాలను ధాన్యముగల, పండిన చెట్లుగలవానినిచ్చాడు. లక్షధాన్యపర్వతములను. అట్లాగే శాల్యన్నముల లక్షను ఇచ్చాడు. (47) పాయసము, పిండివంటలు, మధురమైన అన్నము అమృతతుల్యమైనవి ఇచ్చాడు. స్వస్తికాకారముగల అందమైన నువ్వుల లడ్డూలను ఇచ్చాడు. (48) పెరుగు, తేనె, పాలు, బెల్లము, హవిస్సు వీటికాలువలు నూర్లకొలది ఇచ్చి ఆతడు పరిహారం చేశాడు. (49) కర్పూరముతో కూడినతాంబూలము, చాలా చల్లని వాసనగల నీరు, మంచి వాసన గల చందనము, పారిజాత పూలమాలను (50) రమ్యమైన ఆసనములను, వహ్నితో శుద్ధమైన వస్త్రములను, రత్నములతో నిర్మించిన పడకలను, పూలు, పండ్లు (51) ఇవన్నీ ఆనందిం (వికసిం)చిన ముఖము చూపులతో బ్రాహ్మణులకిచ్చాడు. శుభమైన బ్రాహ్మణ ముఖముల ద్వారా దేవతలను భుజింప చేశాడు. (52) ఆరాత్రి దేవతలు, మునులు తమతమ స్త్రీలతో రమించారు. శ్రీకృష్ణుని అనుమతితో తెల్లవారగానే అంతా వెళ్ళిపోయారు. (53) కృష్ణుడు పాలించే ద్వారకకు యాదవులంతా వెళ్ళారు. రుక్మిణి దర్శనంతో, అమూల్యరత్నములతో నిండిన ద్వారకకు వెళ్ళారు. (54) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ మందు ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు నూట ఇరువది ఐదవ అధ్యాయము.
Summary of chapter 125 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Culminating the grand narrative of the entire Brahma Vaivarta Purāṇa, Śrī Sūta Gosvāmī offered his final prayers of supreme love and prostrate obeisances to Lord Śrī Kṛshṇa and Goddess Śrī Rādhā. He glorified the eternal realm of Goloka Vṛndāvana where the divine couple eternally resides in boundless joy, inviting every searching soul to take shelter at their lotus feet. With this ecstatic adoration, the Śrī Kṛshṇa Janma Khaṇḍa and the entire Brahma Vaivarta Purāṇa reach their glorious, transcendent completion.