మూII శ్రీనారాయణ ఉవాచ :
దూత ఉవాచ:
పార్వత్యువాచ :
శ్రీనారాయణుడిట్లా – ఇక కృష్ణుడు భగవంతుడు, ఉద్ధవుడు బలరాములతో కలసి, శుభమైన కాలాన్ని చూచి మంత్రిని దూతగా పంపాడు. (1) శివుడు, గణపతి, దుర్గతిని నశింపచేసే దుర్గ, కార్తికేయుడు, భద్రకాళి, ఉగ్రచండ, కోటరి ఉన్న చోటికి దూతను పంపాడు. (2) దూతవచ్చి గణేశుని, శివుని, పార్వతిని,పూజ్యులైన మానవులను నమస్కరించి తగిన విధంగా పలికాడు. (3) దూత ఇట్లా - ఓ మహేశ్వర! యుద్ధముకొరకు కృష్ణుడు బాణుని పిలుస్తున్నాడు. లేదా అనిరుద్ధుడు, ఉష, వీరిద్దరిని ఇచ్చి శరణమైనా పొందాలి. (4) యుద్దంలోకి ఆహ్వానింపబడినవాడు, ఎవడైనా భయపడిపారిపోరాదు. పైన, ఏడు తరాల పితరులతో కలసి నరకానికి వెళ్తాడు. (5) సభమధ్యలో తగిన విధంగా మాట్లాడిన దూతమాటలను విని, శంకరుని ఎదుట పార్వతిదేవిస్వయంగా ఇట్లా అంది. (6) పార్వతి వచనమిట్లా - ఓ బాణుడ! మహాభాగ! కన్యను తీసుకొని వెళ్ళు, చెప్పు. నీకున్నదంతా అరణంగా ఇచ్చి శ్రీకృష్ణుని శరణువేడు (7) అందరికి ఈశ్వరుడు, బీజస్వరూపుడు. అన్ని సంపదలను ఇచ్చేవాడు. కోరతగినవాడు, శ్రేష్ఠుడు, కృఫాలుడు, భక్తవత్సలుడు ఆతనిని శరణువేడు. (8) పార్వతి మాటను విని, ఆదేవశ్రేష్ఠులు అతనితో అన్నారు. ప్రశంసించారు. ఎల్లప్పుడు, ధన్యుడ! ధన్యుడ, అని సభామధ్యలో అన్నారు. (9) కోపావిష్టుడై, ఆ అసురుడు బాణుడు త్వరగా లేచాడు. యుద్ధసన్నద్ధుడై, ధనుస్సుచేత ధరించి, శంకరునకు నమస్కరించి వెళ్ళాడు. (10) అందరూ వద్దంటున్నా వణికిపోతూ (కోపంతో) కళ్ళు ఎర్రబడగా, దైత్యుల సైన్యముతో మూడుకోట్ల మందితో, ఆమహాబలుడు (11) వెళ్ళాడు. కుంభాండుడు, కూపకర్ణుడు, నికుంభుడు, కుంభుడు, సేనాపతి ఈశ్వరుడు, ఈ సైనికులంతా వెళ్ళారు. (ఆయుధధారులు) (12) ఉన్మత్త భైరవుడు, సంహారభైరవుడు, అసితాంగుడు భైరవుడు, రురుభైరవుడు, (13) మహాభైరవుడు, కాలభైరవుడు, ప్రచండభైరవుడు, క్రోధభైరవుడు, (14) వీరంతా శక్తులతో కూడా ఆసాన్నాహికులు వెళ్ళారు (కవచధారులు). భగవాన్ కలాగ్నిరుద్రుడు రుద్రులతో కలిసి, కవచము ధరించి వెళ్ళాడు. (15) ఉగ్రచండ, ప్రచండ, చండిక, చండినాయిక, చండేశ్వరి, చాముండ, చండి, చండకపాలిక (16) ఈ ఎనిమిది మంది నాయికలు అంతా తలకు రక్షణమును(ఖర్పరం తలపుర్రె) ధరించి వెళ్ళారు. శోణిత నగరగ్రామదేవత, కోటరి (పేరు) రత్నముల పల్లకిలో వెళ్లింది. (17) ఆమె వికసించిన ముఖం గలదై ఖడ్గము తలకు రక్షణ కవచము ధరించి వెళ్ళింది. చంద్రాణి, వైష్ణవి, (శాంత), బ్రహ్మాణీ, (బ్రహ్మవాదిని) (18) కౌమారి, నారసింహి, వారాహి, (వికటాకృతి), మాహేశ్వరి, (మహామాయా), భైరవి, (భీమరూపిణి), (19) ఎనిమిది మంది శక్తులు అందరు రథముల పై కూర్చొని, ఆనందంగా వెళ్ళారు. భద్రకాళి, వజ్రములతో చేసిన యానం పై కూర్చొని వెళ్ళింది. (20)
అను II భద్రకాళి, ఎర్రని రంగు గలది, మూడు కన్నులు గలది, నాలుక చాచి భయంకరంగా ఉంది. శూలము, శక్తి, గద, వీటిని చేత ధరించింది. ఖడ్గము, తలకు రక్షణ ధరించింది. (21) వృషభము పై కూర్చొని మహేశ్వరుడు, శూలము హస్తమందు దరించి వెళ్ళాడు. స్కందుడునెమలి వాహనం పై చేతిలో శస్త్రము ధనుస్సు ధరించివెళ్ళాడు. (22) ఈరకంగా పార్వతి, గణపతి తప్ప అంతా వెళ్ళారు. వీరితో కూడిన మహాదేవుని, భద్రకాలికను చూచి (23) చక్రపాణి, సమయానికి తగిన సంభాషణ చేశాడు. బాణుడు పార్వతీశ్వరునికి నమస్కరించి శంఖధ్వనిని చేసి, (24) దివ్యాస్త్రముతో ఎక్కు పెట్టిన ధనుస్సును ధరించాడు. వచ్చిన బాణాన్ని చూచి, పరవీరులను సంహరించే సాత్యకి (25) వారు అందరు వారిస్తున్నా సన్నద్ధుడై, ఆనందంగా ముందుకెళ్ళాడు. ఓ నారద! అంజనం అనే బాణున్ని బాణుడు వదిలాడు. (26) అది వ్యర్థముకాదు. గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యునిలా వెలుగుతోంది, చాలా తీక్షమైనది. ఆ అస్త్రాన్ని చూచి సాత్యకి సాక్షాత్తుగా ఆతడు కొద్దిగా తలవంచాడు. (27) అన్నింటిని తగులబెడుతూ, చాలా దారుణంగా అది ఆకాశ మధ్యానికి వెళ్ళింది. బాణుడు ఆగ్నేయాస్త్రం వదలగా సాత్యకి వారుణాస్త్రం వదిలాడు. (28) తాటిచెట్టంత మండుతున్న దానిని అది చల్లార్చింది. వాయుబాణాన్ని బాణుడు వదిలాడు. అది భయంకరంగా చాలా ఘోరంగా ఉంది. (29) పర్వతాస్త్రంతో అవలీలగా సాత్యకి దాన్ని ఛేదించాడు. బాణుడు యుద్ధరంగంలో నారాయణాస్త్రాన్ని వదిలాడు. (30) అర్జునుని మాటతో సాత్యకి కర్రవలె భూమి పై పడిపోయాడు. శస్త్రము లెరిగినవారిలో శ్రేష్టుడు బాణుడు. మహేశ్వరాస్త్రం వదిలాడు. (31) సాత్యకి, అవలీలగా వైష్ణవాస్త్రంతో ఛేదించాడు. బాణుడు యుద్ధభూమిలో బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. (32) సాత్యకి ఆ బ్రహ్మాస్త్రం వల్ల క్షణకాలము చైతన్యం కోల్పోయాడు. రణవిశారదుడైన బాణుడు, నాగాస్త్రాన్ని వదిలాడు. (33) సాత్యకి గరుడాస్త్రంతో క్షణంలో దాన్ని నశింపచేశాడు. చాలా భయంకరమైన వ్యర్థముకాని శంకరుని శూలమును తీసుకున్నాడు. (34) సాత్యకి దుర్గను స్తుతించాడు. అది కంఠంలో మాల ఐంది. బాణుడు ధనుస్సుతో పాశుపత బాణాన్ని తీసుకున్నాడు. (35) బాణముతో కూడిన ఆ బాణుని పై సాత్యకి జృంభకాస్త్రం వేశాడు. బాణుడు ఆవలింత తీస్తుండగా చూచి, కార్తికేయుడు మహాబలుడు (36) అర్ధచంద్ర బాణాన్ని వదిలాడు. మన్మథుడు దానిని అవలీలగా ఛేదించాడు. స్కందుడు గదను వేశాడు. అది ఉదయపు సూర్యుని వలే వెలుగుతోంది. (37) కాముడు వైష్ణవాస్త్రంతో దానిని నశింపచేశాడు. వేగంగా స్కందుడు నారాయణాస్త్రం వేశాడు. (38) కృష్ణుని హెచ్చరికతో ప్రద్యమ్నుడు భూమి పై కర్రవలె పడిపోయాడు. ప్రళయాగ్నితో సమానమైన కాంతిగల శక్తిని స్కందుడు వేశాడు. (39) దానిని నారాయణాస్త్రంతో కాముడునశింపచేశాడు. యుద్ధరంగంలో కార్తికేయుడు బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. (40)
జ్వర ఉవాచ :
అను II కాముడు బ్రహ్మాస్త్రంతో దానిని చల్లార్చాడు. కోపంతో కార్తికుడు దివ్యమైన పాశుపతాన్ని తీసుకున్నాడు. (41) మదనుడు, నిద్రా స్త్రంతో ఆతనిని నిద్రపోయేట్టు చేశాడు. కార్తికుడు నిద్రించటం చూసి, బాణుడు ఆవలిస్తుండటం చూసి (42) భద్రకాలిక కోపంతో కాముని ఆతని రథంతో పాటు తీసుకెళ్ళింది. బాణుని, స్కందుని ఆజగత్తునుకన్నతల్లితన ఒడిలో పెట్టుకున్నది. (43) యుద్దం నుండి పార్వతి ఉన్నచోటికి వెళ్ళిపోయింది. కార్తికుని లేపింది. బాణుడు స్వస్థుడయ్యేట్టు చేసింది. (44) రథంతోపాటు కాముడు త్వరగా, మక్కు రంధ్రము ద్వారా బయటికి వచ్చి, భయపడి యుద్ధభూమికి వెళ్ళాడు. (45) రథముతో పాటు కాముని చూచి యాదవులంతా నవ్వారు. అక్కడున్న శైవులంతా భయంతో వ్యాకులులైనారు. వారికంఠాలు ఎండిపోయాయి. (46) తిరిగి బాణుడు కోపంతో క్రుద్దుడై రథాన్నెక్కి, భగవాన్ కార్తికేయుడు, యుద్ధానికి తిరిగి వచ్చారు. (47) బాణుడు ఐదు బాణాలను యుద్దరంగంలో వేశాడు. మహాబలుడైన బలరాముడు అర్ధచంద్ర బాణంతో వాటిని ఛేదించాడు. (48) నాగలితో బలరాముడు బాణుని రథాన్ని విరిచాడు. రోకలితో అవలీలగా సూతుని, అశ్వములను చంపాడు. (49) ఛేదించుటకు ఉద్యమిస్తున్న బలరాముని మహాబలుడైన కాలాగ్నిరుద్రుడు, భగవానుడు అవలీలగా వారించాడు. (50) కోపంతో బలరాముడు కాలాగ్ని రుద్రుని రథాన్ని విరిచాడు. యుద్ధరంగంలో నాగలితో సూతుని అశ్వములను చంపాడు. (51) కోపంతో కాలిగ్ని రుద్రుడు అధికమైన జ్వరాన్ని వదిలాడు. యాదవులంతా జ్వరంతో బాధపడసాగారు, హరితప్ప. (52) దానిని చూచి భగవాన్ కృష్ణుడు వైష్ణవమైన జ్వరాన్ని వదిలాడు. యుద్ధంలో మహేశ్వర సంబంధమైన జ్వరాన్ని చంపటానికి వైష్ణవ జ్వరాన్ని వదిలాడు. (53) రెండుజ్వరములకు యుద్ధము ముహూర్తకాలము, అతిదారుణంగా జరిగింది. వైష్ణవ జ్వరం నియ్కీంతమై (రాగా) అది (శివ జ్వరం) యుద్ధరంగంలో పడిపోయింది. కాని నిశ్చేష్టమైంది. తిరిగి మాధవుని స్తుతించింది. (54) జ్వరమీట్లా అంది ఓజగన్నాథ! ప్రాణములను రక్షించు, భక్తులను అనుగ్రహించే కొరకై రూపుదాల్చినవాడ! నీవు ఆత్మ, పూర్ణపురుషుడవు, అంతటా నీవు సమంగా ఉంటావు. (55) జ్వరం మాటను విని తన జ్వరాన్ని ఉపసంహరించాడు. మాహేశ్వరుని, జ్వరము భయపడి, యుద్ధం నుండే వెళ్ళిపోయింది. (56) బాణుడు తిరిగి వచ్చి వేయి బాణాలు మంత్రపూతంగా ప్రళయాగ్నిశిఖలవంటి వాటిని వదిలాడు. (57) ఫాల్గుణుడు, అవలీలగా తన బాణజాలంతో వాటిని వారించాడు. బాణుడు, గ్రీష్మకాలమందలి సూర్యునితో సమానమైన కాంతిగల శక్తిని వదిలాడు. (58) మహాబలుడు సవ్యసాచి దానిని అవలీలగా ఛేదించాడు. ఆతడు (బాణుడు) నూరుసూర్యులతో సమాన కాంతిగల పాశుపతమును తీసుకొని వేశాడు. (59) అది మిక్కిలి ఘోరమైనది. విశ్వసంహారమునకు కారణమైనది. దానిని చూచి చక్రపాణి దారుణమైన చక్రాన్ని వదిలాడు. (60)
వేయి చేతులను, ఉల్బణమైన పాశుపతమును ఛేదించింది. రణమధ్యంలో బాణుడు కదలని సింహమువలె పడిపోయాడు. (61) పాశుపతశస్త్రము పశుపతికరానికి చేరింది. అదిలోకంలో వ్యర్థముకానిది, దారుణమైనది. లోకంలో ప్రళయాగ్ని శిఖవంటిదది. (62) బాణుని రక్తసమూహంతో పెద్దనదము ఏర్పడింది. బాణుడు నిశ్చేష్టుడైపడ్డాడు, బాధపడ్డాడు. చైతన్యం కోల్పోయాడు. (63) భగవాన్! మహాదేవుడు, జగద్గురువు అక్కడికి వచ్చాడు. వచ్చి బాణుని తనవక్షఃస్థలమందుంచుకొని మోహంతో దుఃఖించాడు. (64) శివుని కన్నీళ్ళుపడగానే సరోవరము ఏర్పడింది. కరుణాసాగరుడు ప్రభువు చేతనునిగా చేశాడు. (65) జనార్దనుడున్నచోటికి బాణుని తీసుకొని వెళ్ళాడు. పద్మఅర్చించిన పాదపద్మములందు బాణుని సమర్పించాడు. (66) చంద్రశేఖరుడు, జగన్నాథుని, భక్తులకు ప్రభువును స్తుతించాడు. బలి స్తుతించిన దానితో, వేదోక్తమైన దానితోను స్తుతించాడు. (67) ధీమంతుడైన బాణునకు హరిమృత్యుంజయ జ్ఞానము నిచ్చాడు. శరీరమందు పద్మములవంటి కరములనిచ్చాడు. అతనిని ఆజరునిగా అమరునిగా చేశాడు. (68) బాణుడు, బలిచేసిన స్తోత్రముతో, భక్తితో స్తుతించాడు. రత్నభూషణములతో అలంకరింపబడిన కోరతగిన కన్యను తెచ్చి (69) ఆ దేవసభయందు హరికి భక్తితో ఇచ్చాడు. ఐదు లక్షల గజేంద్రములను, వానికి నాల్గింతల అశ్వములను (70) రత్నభూషణములతో అలంకరింపబడిన దాసీలను వేయిమందిని, అన్నిటిని ఇచ్చే, దూడలతో కూడినవేయి కామధేనువులను (71) మాణిక్యములు, ముత్యములు, రత్నములు వీటిని నూరు లక్షలు, మణీంద్రములు, వజ్రములు నూరు లక్షలు మనోహరమైనవి (72) నీరు, వంటకు కావలసిన పాత్రలు బంగారముతో చేసినవి వేలకొలది ఇవన్నీ ఆతనికి భక్తితో తనతలను వంచి వినముగా ఇచ్చాడు. (73) కోరతగిన సూక్ష్మ వస్త్రములను. వహ్నితో శుద్దమైన వస్త్రములను బాణుడు, తన భక్తితో శంకరుని ఆజ్ఞతో అన్ని ఇచ్చాడు. (74) ఓ నారద! తాంబూలముల, చూర్ణములతో నిండిన పాత్రలను వేలు, భక్తితో, రకరకాలైనవి శ్రేష్టమైనవి ఇచ్చాడు. (75) హరిపాదపద్మమందు కన్యను సమర్పించాడు. తన భక్తితో గట్టిగా ఏడ్చాడు. ఆతడు పరిహారం చేశాడు. (76) కృష్ణుడు ఆతనికి వేదోక్తమైన మంచిమాటను, వరమును ఇచ్చాడు. శంకరుని అనుమతితో ద్వారకా నగరానికి వెళ్ళాడు. (77) వెళ్ళి కొత్తగా వివాహమైన మహాత్ముడైన బాణుని ఆ కూతురును రుక్మిణికిచ్చాడు త్వరగా దేవకికి హరి స్వయంగా ఇచ్చాడు. (78) ప్రయత్నంగా గొప్ప ఉత్సవాన్ని మంగళకార్యాన్ని చేయించాడు. బ్రాహ్మణులను భుజింపచేశాడు. బ్రాహ్మణులకు ధనమిచ్చాడు. (79)
అని శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమనునది నూట ఇరువదవ అధ్యాయము.
Summary of chapter 120 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Providing practical instructions for spiritual study, this chapter outlines the sacred procedures for reading, reciting, transcribing, and preserving the manuscript of the Brahma Vaivarta Purāṇa. The text instructs devotees to maintain physical and mental purity, establish a sanctified altar, worship the sacred manuscript with flowers and incense, and honor the spiritual teacher before commencing the recitation.