శ్రీనారాయణ ఉవాచ :
శ్రీనారాయణ మహర్షి ఇట్లు పలికెను :
ఆ తరువాత కంసుడు సభలో బంగారు సింహాసనమున కూర్చుండి యుండగా ఆకాశము నుండి సత్యమైన అశరీర వాక్కు ఇట్లు వినిపించే. “ఓ మూడుడా! ఏమి చేయుచున్నావు. నీ క్షేమము గూర్చి ఆలోచించుకొనుము. ఓ గెజా! నీకపాయము నిలిచియున్నది. భూమి మీద నీకు యముడు పుట్టినాడు. వసుదేవుడు నీకంతకుడైన తన కుమారుని సందుని కప్పగించి, అక్కడినుండి కన్యను దెచ్చి నీకిచ్చి ఎరుగనట్లున్నాడు. ఈ కన్య మాయయొక్క అంశతో పుట్టినది. వసుదేవుని పుత్రుడు స్వయముగా శ్రీహరియే. నిన్ను చంపువాడు గోకులములో నందుని యింట పెరుగుచున్నాడు. దేవకి ఏడవ గర్భము కూడ నందునింట పెరుగుచున్నది. దేవకి ఏడవ గర్భము చచ్చి జారిపడలేదు. బ్రతికియున్న ఆ పుత్రుని మాయ రోహిణీ గర్భములోనికి చేర్చి నీలిపినదట. ఆ గోకులములోనే మహాబలవంతుడైన బలదేవుడు శేషుని అంశతో పుట్టినాడు. నీకు యములైన ఆ యిద్దరు గోకులములో నందమందిరమున పెరుగుచున్నారు.
ఇట్టివాక్కును రాజు విని తలవంచుకొనీ హఠాత్తుగా వీచారమగ్నుడాయెను. దుఃఖముతో ఆహారమునే వదిలివేసెను. రాజనీతి, నెరిగిన అతడు తన ప్రాణములకంటె యిష్టురాలైన పూతనను పిలిపించి సభామధ్యమున ఇట్లు పలికెను.
కంస ఉవాచ :
కంసుడిట్లనెను;
బిడ్డా పూతనా! ఒక కార్యము కొరకు నీవు గోకులములోని నందునింటికి పొమ్ము. నీ స్తనములను విషముతో నింపి అక్కడి శిశువుకు పాలిమ్ము. నీవు మనస్పంత వేగముగా పోవుదానవు. మాయాశాస్త్రములో నేర్పు గలదానవు. ఓ యోగినీ! దూర్వాసుని - మహామంత్రమును పొంది అన్నిచోట్లకు పోగలదానవై యుంటివి. ఓ కీర్తిమంతురాలా! అన్ని రూపులు ధరించుటకు నీవు శక్తిగలదానవు. కావున మాయతో మనుష్య స్త్రీ రూపము దాల్చి త్వరగా పొమ్ము” అని కంసుడు పలికి సభలో నిలిచెను.
పూతన కంసునకు నమస్కరించి కోరిన విధముగా అంతట చరించగలదై స్వచ్ఛమైన బంగారము వంటి శరీరకాంతితో అనేక విధములైన అలంకారములు ధరించి ప్రయాణమొనర్చెను. వెండ్రుకల కొప్పు మీద మాలతీ పుష్పమాలిక ధరించీ, నుదుట కస్తూరి తిలకము పై ఎత్తిని సిందూరపు చుక్కబొట్టు పెట్టుకొని, కాలి అందెలు మొలనూలు మనోజ్ఞముగా మ్రోగుచుండగా, సామాన్యులకు చూడి శక్యము గాని నందుని భవనము చేత మనోహరముగా ప్రకాశించుచున్న గోష్ఠమును (గోకులము, రేపల్లె) ప్రవేశించెను. ఆ గోకులము దాట శక్యము గాని లోతైన అగడ్తలతో {కందకములు) చుట్టబడి యుండెను. విశ్వకర్మ ఆ పట్టణమును దివ్యశిలలతో నిర్మించెను. ఇంద్రనీలమణులు మరకతమణులు పద్మరాగమణులతో అలంకరింపబడి, గోపురముల మీద బంగారు కలశములు ప్రకాశించుచుండెను. ఆకాశమునంటునంత ఎత్తైన ప్రాకారములు, లోహకవాటము లమర్చిన నాలు ప్రాకార ద్వారములను రక్షించుచున్న ద్వారపాలకులతో మిక్కిలి అందముగా నున్న ఆ గోకులమును సుందరీగణములు చుట్టియుండిరి. ముత్యములు శ్రేష్ఠమైన మణులు రత్న పూర్ణములైన ధనరాసులు బంగారు పాత్ర సామగ్రి స్వర్ణ భాండములు నిండి, కోట్ల గోగణములతో గూడి, పోషింపబడు దాసజనమైన లక్షల గోపాలురతో, పనులతో, శ్రద్ధలో మునిగియున్న దాసీజనములతో నిండియున్న ఆ యాశ్రమమును (గోకులము) చిరునవ్వుతో చూచువారి మనస్సులు హరించుచున్న ఆ స్త్రీ (పూతన) ప్రవేశించెను.
నందుని గృహమున ప్రవేశించుచున్న ఆమెను చూచి గోపికలు కృష్ణుని దర్శించుటకై వచ్చిన లక్ష్మీదేవియో పార్వతియో అనుకొనిరి. .. గోపాలకులు గోపికలు నమస్కరించి కుశల ప్రశ్నలడిగిరి. పాదములు కడుగుకొనుటకు నీళ్లిచ్చి సింహాసనముపై కూర్చుండబెట్టిరి. చిరునవ్వుతో ఆ సాధ్వి గోపాలకుల యొక్క నందబాలుని యొక్క కుశలమును ప్రశ్నించీ వారిచ్చిన పాద్యము స్వీకరించి కూర్చుండెను.
ఓ ఈశ్వరీ! నీవెవ్వరు? నివాసమెక్కడ? నీ పేరేమి? ఇప్పుడిక్కడకు నీకేమీ పని మీద వచ్చితివి?” అని గోపికలందరామెను ప్రశ్నించగా వారి మాటలు విని ఆమె మనోహరముగా నిట్లు పలికెను. “నేను మధురా నివాసినిని. నా పేరును గోపికయే. నేను బ్రాహ్మణ స్త్రీని. “లోకులోకరికొకరు చెప్పుకోనుచుండగా, ముసలి వయస్సులో నందునకొక గొప్ప పుత్రుడు జన్మించెను” అను మంగళ సూచకమైన ఒక తత్త్వమును వింటిని. దానిని విని ఆ బాలుని చూచి ఇష్టమైన ఆశీస్పులిచ్చుటకు వచ్చితిని. ఆ పుత్రునిటుయెమ్ము, వానిని చూచి ఆశీర్వదించి వెళ్లుదును” అనెను.
ఆ బ్రాహ్మణ స్త్రీ మాటలు విని యశోదాదేవి సంతోషముతో కొడుకు సామెముందు నమస్కరింపజేసి (బోర్లవేసి) ఆమె ఒడిలోనికి అందించెను. ఆ సాధ్వీ బాలుని తన యొడిలో చేర్చుకొని మరల మరల ముద్దులు పెట్టుకొనెను. కుదురుగా కూర్చుండి ఆ పుణ్యవతి శ్రీకృష్ణుని నోటికి చన్ను అందించెను. “ఏమీ అద్భుతము. ఈ బాలుడెంత సుందరుడమ్మా గోపమ్మా, ఈ పసివాడు గుణములను బట్టి నారాయణునితో సమానుడు” అని పల్కెను.
ఓ నారదా! శ్రీకృష్ణుడామె వక్ష స్థలమున నిలచి విషము గల స్తనమును త్రాగి నవ్వను. ఆమె ప్రాణములతో బాటు ఆ విషపు పాలను అమృతము వలె త్రాగెను. ఆ సాధ్వి బోలకుని విడిచిపెట్టి ప్రాణములు విడిచి పడిపోయేను. మాయారూపము తొలగి వికారమైన ఆకారము ముఖము గలదై నోరు తెరచెను.
ఆ పూతన ఆత్మ తన స్థూల దేహము వదిలి (పాంచభౌతికము) సూక్ష్మదేహమున (దేవశరీరమున) ప్రవేశించెను. వెంటనే రత్ననిర్మితమును సుందరులైన విష్ణుపార్షదులు చుట్టి ఉన్నదియు ఒక లక్ష వింజామరతో ఒక లక్ష అద్దములతో శోభించుచు అగ్నివలె ప్రకాశించెడి సన్న వస్త్రములతో అలంకరింపబడినదియు, చిత్రవిచిత్రములైన రత్న కలశములతో కూడినదియు, రత్నముల తేజస్సు మండలాకారముగా వ్యాపించినదియు నూరు చక్రములు గలదియు నగు సుందరమైన రథమునెక్కెను. ఆ పార్షదులామెను రథము ఫై ఎక్కించుకొని ఉత్తమమైన గోలోకమునకు వెళ్లిరి. ఆ అద్భుత సంఘటనను గోపికలు, అన్ని లోకముల వారు చూచి మిక్కిలి విస్మయము పొందిరి. కంసుడిదియంతయు విని ఆశ్చర్యపడెను.
అప్పుడు యశోద కుమారుని జూచి ఒడిలోనికి తీసుకొని పాలిచ్చెను. శిశువునకు బ్రాహ్మణునితో మంత్ర జలము చెల్లించి రక్ష గట్టించెను. నందుడు పూతన శరీరమున కగ్ని సంస్కారము జరిపించెను. ఆ శరీరము కొలుచు సుగంధ ద్రవ్యముల పరిమళము రాగా ఆనందించెను).
నారద ఉవాచ:
నారదుడు పలికెను :
రాక్షసి రూపము ధరించిన ఆమె ఎవరు? ఏ పుణ్యముతో ఆ పుణ్యాత్మురాలు శ్రీహరిని (శిశురూపుని దర్శించి గోలోకమునకు వెళ్ళెను?
శ్రీనారాయణ ఉవాచ :
నారాయణ ముని పలికెను :
బలి చక్రవర్తి యజ్ఞములో మనోహరమైన పోమనుని రూపమును చూచిన బలికూతురు రత్నమాల ఆ స్వామిని పుత్రప్రేమతో చూచెను. మనస్సులో “నా పుత్రుని వంటి ఈతడు (శ్రీహరి) నా స్తనమును త్రాగినచో ఇతనిని నా వక్షస్థలమున చేర్చుకొందును గదా" అని కోరుకొనెను. శ్రీహరి ఆమె కోరికను తెలుసుకొని మరియొక జన్మలో ఆమె స్తనమును గ్రోలెను. దయానిధియు, కోరికలు తీర్చువాడగు స్వామి ఆమెకు మాతృగతి నిచ్చెను.
నారదా! రాక్షసియైన పూతన భక్తితో కృష్ణునకు విషము గల స్తనమునిచ్చి మాతృయోగము పొందెను. మనము శ్రీహరిని విడిచి ఇంకెవ్వరినీ భజింతుము. ఓ బ్రాహ్మణా! ఈ ప్రకారము శ్రీ కృష్ణ గుణ కీర్తనము నీకు చెప్పితిని. అడుగడుగున (పదము పదమున) మిక్కిలి మధురమును శ్రేష్ఠమునైన ఈ చరిత్రమును నీకు చెప్పుదును.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో పూతన మోక్ష ప్రాప్తియను పదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 10 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Summoned by the guards, the wicked King Kaṃsa rushed into the prison cell and rudely snatched the newborn baby girl from Devakī's arms, intending to dash her against the stone floor to defy the prophecy. However, the infant slipped effortlessly from his grasp, rose swiftly into the sky, and transformed into the glorious eight-armed Goddess Durgā holding divine weapons, flashing with blinding radiance. Before vanishing into the higher heavens, Yogamāyā warned Kaṃsa that his ultimate slayer had already been born safely elsewhere and was growing up to destroy his wicked empire, leaving the trembling monarch paralyzed with terror.