మూ ॥ శ్రీనారాయణ ఉవాచ :
ఉద్ధవ ఉవాచ :
మాధవ్యువాచ –
మాలత్యువాచ :
అను!! నారాయణుడిట్లన్నాడు: ఓముని! ఉద్ధవుడు ఆశ్చర్యపడ్డాడు. చాలా భయపడ్డాడు కూడా. మృతురాలిగా ఉన్న ఆమెను 'చైతన్యవంతురాలిని చేయడానికి ఇట్లన్నాడు. (1) ఆమె భక్తిని చూచి భక్తుడు అని పిలివబడేతనను తుచ్ఛునిగా భావించాడు. భాగ్యవతియైన ఆ సతిని చూచి జగత్తంతా తుచ్ఛమని భావించాడు. (2) ఉద్ధవుడిట్లన్నాడు - ఓ కల్యాణి! మేలుకో. ఓ జగన్మాత! నీకు నమస్కారము. ఇప్పుడు ప్రాక్తనుడైన కృష్ణుని అంతా నీవే చూడగలవు. (3) నీవల్లనే ఈ విశ్వం పవిత్రమైంది. నీ పాదధూళితో ఈ భూమి పవిత్రమైంది. నీ ముఖము చాలా పవిత్రమైంది. గోపికలు పుణ్యవతులు. (4) లోకాలు నిన్ను కీర్తిస్తున్నాయి. సంగీతంతో మంగళస్తోత్రాలతో స్తుతిస్తున్నాయి. నీ కీర్తిని దేవతలు, సనకాదులు ఎల్లప్పుడు కీర్తిస్తున్నారు. (5) పాపాన్ని తొలగించే, పుణ్యాత్మురాలవు, తీర్థంవలె పూజనీయురాలవు, నిర్మలవు నీవే. హరిభక్తిని ఇచ్చే దానివి. భద్రమైన దానివి, విఘ్నాలనన్నీ తొలగించే దానివి (6) నీవే. రాధవు నీవే, కృష్ణుడవు నీవే, పరాప్రకృతివి పురుషుడవు నీవే, పురాణములందు, శ్రుతియందు రాధామాధవులకు భేదం లేదు. (7) మూర్ఛితురాలైన రాధికను చూచి, ఆ ఉద్దవుని వెనక్కినెట్టి, రాధకు ఎదురుగా నిలబడి మాధవి అనే గోపిక ఇట్లా అంది. (8) మాధవి వచనమిట్లా - చోరుడైన కృష్ణుని రూపమేమిటి,. ఉత్తమమైన వేషమేముంది. ఆతని సుఖమేమిటి, విభవమేమిటి, ఆతనికి గల గొప్ప గౌరవమేమి. (9) ఆతని పరాక్రమమేమి, ఎదిరించరాని శౌర్య ఐశ్వర్యము లేపాటివి. ఆతనికి సిద్దించినదేమి, ఆతని ప్రసిద్దమేమి ఆతనికి తుల్యమైనదేమి? ఉత్తమ గుణమేమి. (10) ఇక్కడికి ఎక్కడ నుండి వచ్చాడు. మళ్ళీ ఎక్కడికెళ్ళాడు. బాలకుడు, గోపవేషము, రాజకుమారుడైన పురుషుడు కాడు. (11) ఓ కల్యాణి! నందనందనుడై గోపాలుణ్ణి నీవేమని భావిస్తున్నావు. నిన్ను నీవు రక్షించుకో, ఆత్మకంటే తనకు తాను) ప్రియమైనది, పరమైనది ఏమున్నది (12) మాలతి ఇట్లా అంది - ఓ రాధ! నీకుధిక్, సిగ్గులేనిదానివి. నీజీవనం వృథా. జగత్తులో యువతుల, మంచికీర్తిని నాశనం చేస్తున్నావు. (13) తన కీర్తినాశనమౌతున్నదని స్పష్టంగా తెలిసినప్పుడు స్త్రీలు రహస్యంగా ఉంచాలి. ఓసఖి! ప్రయత్నించి, చూచేవాళ్ళకు తగ్గట్టుగా సంచరించు. మనస్సులో పతిభావాన్ని దాచుకొని, భావించు. (14) ఓ సురేశ్వరి! శత్రువులకు మిత్రులకు జాతిలేదు. కార్య వంశం వల్ల శత్రువౌతాడు. కర్మవల్లనే మిత్రుడౌతాడు. (15) ప్రాజ్ఞుడు తన పనిని సాధించుకోవాలి. కార్యాన్ని ధ్వంసపరచుకున్నవాడు మూర్ఖుడు. ఓ రాధ! ఎవడు ఎవడికి ఇష్టమైనవాడు. ఎవడు ఎవడికి అప్రియమైనవాడు. (16) సజ్జనులు ఎప్పుడూ పనిని సమయమెరిగి ఆచరిస్తారు. శత్రువు తొలుత ధనాన్ని అపహరిస్తాడు. ఆపైన ప్రాణాన్ని హరిస్తాడు. (17) కటువుగా మాట్లాడుతాడు, దుఃఖం కల్గిస్తాడు శత్రులక్షణాలను విను. నిన్ను నీ కులం నుండి బహిష్కరించి (పచేసి) నిన్ను దుఃఖ సముద్రంలో ముంచి (18) నీ చేతనను, ప్రాణాన్ని తీసుకొని, దారుణుడు నిష్టురుడు వెళ్ళిపోయాడు. ఓమూఢురాల! ఏమి స్మరిస్తున్నావు. దారుణమైన శోకాన్ని విడిచి పెట్టు. (19) నిన్ను నీవు ప్రయత్నపూర్వకంగా రక్షించుకో. తనకంటే ప్రియమైనది, ఇంకొకటి ఏమున్నది (ఏది లేదు).
మూ॥ పద్మావత్యువాచ :
చంద్రముఖ్యువాచ :
శశికలోవాచ –
అను!! పద్మావతి ఇట్లా అంది : యమునానది సమీపంలో నీవంతా చెప్పావు. అరసునకు రతి దూరమౌతుంది. ఓ ప్రియ! అట్టి రతిక్రీలకు సుఖకరంకాదు. మెరుపు తీగ వెలుగు, నీటి పై రాత, ఖలులకు ప్రీతి (21) లేదు. అనేక శాస్త్రములందు (శాస్త్రములతిక్రమిస్తే) నీతిలేదు. ఖలులందు విశ్వాసము లేదు. నీవు యమునా నది ఒడ్డున హరిముఖాన్ని చూచి (22) నవ్వుతో క్రీగంటితో దాన్ని దాచావు. మళ్ళీ మళ్ళీ చూచి, చైతన్యం కోల్పోయావు నీవు. (23) ఇంటిని విడిచి, గురువుల (పెద్దల) భయంలేకుండ, శుభమైన సఖుల మాటలు వినక ఎప్పుడూ కృష్ణున్ని ధ్యానించావు. ఆహారము, జీవనము లేదు. (24) కృష్ణుడు మధరలో నీవు, ఇక్కడ అరటి వనంలో. నీవు ఒకవేళ ప్రాణాలు వదిలితే, ఆతడిప్పుడు ఇక్కడ ఆవిర్భవించడు. నిన్ను నీవు రక్షించుకుంటే ఓ సుందరి! భవిష్యత్కాలంలో ఆతనిని చూడగలవు. (25) చంద్రముఖి ఇట్లా అన్నది - పూర్వజన్మననుసరించే శుభం జరిగేది. సుఖము, ఐశ్వర్యములభించేది కూడా. (26) ఇప్పుడు కలిగే దుఃఖము, శోకము, విపత్తు, సంపత్తు అన్ని పూర్వకర్మననుసరించే. భారతపుణ్యభూమిలో జన్మకు అందరికి ఈప్సితస్థానం లభించటానికి కారణం పూర్వకర్మనే '(27) తపస్సుతో ప్రకృతికి పరుడైన,సుందరుడైన హరిని పతిగా పొందవచ్చును. అట్లాగే ఇప్పుడు, ఓవిప్రుడ! కామబాణంతో శరీరం కాలిపోతోంది. (28) ఈమెకు చంద్రుడు, మధువు, చైత్రమాసము, వసంత రుతువు శత్రువులెట్లైనారు. ఆ మన్మథుడు శంకరునితో కాల్చబడ్డాడు. (29) రాహువు చంద్రుణ్ణి తింటాడు. మళ్ళీకక్కుతాడు, వసంతుడు మిత్రుని మరణ శోకంతో ప్రాణాలు వదిలి అడవికి వెళ్ళాడు. (30) సుధాసింధువు చంద్రుడు నాకిప్పుడు విషసింధువు. మంచి వేషము నాకు మండుతున్న అగ్నిలాగుంది. చందనము ఆ అగ్నిలో వేసేనేతి ఆహుతిలాగున్నది. (31) మంచివాసన గల గాలి ఎప్పుడూ నా శరీరాన్ని కాలుస్తోంది. నా సఖి ఆహారాన్ని విడిచి పెట్టింది. ఉచ్చ్వాస నిశ్వాసాల మీద జీవిస్తోంది. (నిశ్వాసాన్ని బట్టి బతికిందని గ్రహించాలి) (32) ఓ కురునందన! నీ ముఖంతో కృష్ణుని ప్రశంసించు. ఆతని నామాన్ని స్మరిస్తే, ఆతని గుణాలు వింటే, ఆతని శుభవార్త వింటే త్వరగా చైతన్యం వస్తుంది. (33) శశికళ ఇట్లా అంది - ఓ మాధవి, నావాడైన ఈశ్వరుని కృష్ణుని నీవెరుగుదువా. (34) బ్రహ్మాది దేవతలు, నాలుగు వేదాలు ఎవరిని, పొగడుతాయో, సురలకు ఈప్సితమైన ఆతని పాదపద్మములను ఏ సజ్జనులు నిరంతరం ధ్యానిస్తారో (35) పద్మ సరస్వతి, దుర్గ, అనంతుడు, మహేశ్వరుడు, సిద్ధులు, ఇంద్రుడు, మునులు, మనువు ఎవనిని గుర్తెరుగరో (36) అట్టి సర్వాత్మునకు రూపమెక్కడిది. నిర్గుణునకు గుణాలెక్కడివి. సత్యమునకు తగిన దేదున్నదో అదే ఈతడు అని నిజంగా చెప్పారు. (37) పృథివీ భారాన్ని తగ్గించడానికి, మనోహర రూపాన్ని ధరిస్తాడు. సుఖకరమైనది, ఆహ్లాదాన్ని కల్గించేది, రమ్యమైనది. భక్తులను అనుగ్రహించే కొరకైనరూపము (38) ఎంత నిర్వచించరాని రూపమో, జనులకు మనోహరమైనది. కోటి మన్మథులంత లావణ్యం కలవాడు లీలయే ఆతని స్థానం, శుభమునకు ఆశ్రయభూతుడు. (39) ఎవని పాదపద్మములందు మధురమైన మధువువలె గంగా జలమున్నదో, దేనిని భక్తితో పరుడు సర్వేశుడు శంకరుడు తన తల పై ధరిస్తున్నాడో (అంతగొప్పవాడు).
సుశీలోవాచ :
రత్నమాలోవాచ :
పారిజాతోవాచ :
మాధవ్యువాచ –
వైరాగి శంకరుడు తీర్థకీర్తి యొక్క కీర్తనను ఎప్పుడూ చేస్తాడు. క్షణకాలం నాట్యం చేస్తాడు. భక్తితో తన ఐదు ముఖాలతో గానం చేస్తాడు. (41) ఆహారము సొమ్ములు, వస్త్రము అన్ని వదిలి దిగంబరుడై, శుభ్రమైన, సునిర్మలమైన బ్రహ్మజ్యోతిః స్వరూపమును ధ్యానిస్తాడు. (42) బ్రహ్మతపస్సుతో, సేవతో, జీవనం గడుపుతాడు. శేషుడు, సనత్కుమారుడు, సిద్ధసంఘములు యోగం వల్ల తెలుసుకుంటారు. (43) సుశీల ఇట్లా అన్నది - ఆతని నూర్లనూర్లకోరికలు చిలుకుటకు యోగ్యము కావు. చంద్రుడు అశ్విని కుమారుడు వీరు రూపంలో దేనితో గుణిస్తారో వాటికతీతుడు. (44) అసంఖ్యాకమైన విశ్వములలో, బ్రహ్మ విష్ణుశివాదులు, మునులు, మనువులు, సిద్ధులు, భక్తులు, సజ్జనులు ఎప్పుడూ ఉంటారు. (45) వారు నిర్గుణుడైన ఆత్మయొక్క పాదద్వయమును ధ్యానిస్తారు. ఆతనిని వేదములు స్తుతించలేకపోయాయి. ఈశుడు, సరస్వతి స్తుతించలేకపోయారు. (46) జడీభూతమైంది, భయపడింది. స్తోత్రంతో క్షమాపణ వేడాలి.వేయి తలలవాడు స్తుతించటంలో ఎప్పుడూ వణుకుతుంటాడు. (47) వేదముల జనకుడు బ్రహ్మ ఈశ్వరుడు ఆతనిని స్తుతిస్తారు. అట్టి సత్యము నిత్యము ఐన ఈశుణ్ణి మాధవి నిందిస్తోంది. (48) సభ అపవిత్రమైంది. గోపికల జీవనము వృథా. వారిలో పుణ్యాత్మురాలు రాధ. ఆతనిని రాత్రింబగళ్లు ధ్యానిస్తోంది. (49) ఆతని నామస్మరణతో కోటి జన్మలలో చేసిన పాపము, పాపభయము, శోకము, నశిస్తుంది, ఓసఖి! భయం లేదు. (50) రత్నమాల ఇట్లా అంది - హరి, ఎడమ చేతితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అంతకంటే ఆతని కీర్తి శౌర్యము ఏం కావాలి జగజ్జనకుడాయన (51) వేలకొలది పర్వతాలను ఛేదించగల ఇంద్రుడు, లీలామాత్రంలో అలాంటి వాటిని లక్షను చంపగల సమర్థుడు హరి. (52) ఆతని అంశకలతో ఈశ్వరుడు విష్ణువు సూకరంగా జన్మించాడు. భూమిని, అవలీలగా తనకోర చివరతో ఎత్తాడు కదా (53) ఈ భూమిమీద వేలకొలది పర్వతాలెక్కడున్నాయి. అసంఖ్యాకులైన దైత్యులు, వీరులు, శూరులు ఎక్కడున్నారు. (54) అంతమాత్రం చేతనే ఆతని శౌర్యపౌరుషములు సరిపోలేదు. కీర్తి, ప్రశంసకాదు. ఓ సఖి! సర్వాత్మతో, ఆత్మతో ఈప్రశంస సరిపోదు. (55) పారిజాతం ఇట్లా అన్నది - ఏడు ద్వీపాలు గలది ఈ భూమి. పర్వతాలు, వనములు, సముద్రాలు కలది. బంగారు భూమి కలది. అన్నిటికి ఆధారమైనది, మనోహరమైనది (56) ఓ ప్రియ! బ్రహ్మలోకము వరకు రకరకాలుగా ఏడు స్వర్గాలున్నాయి. విచిత్రములైన సుందరములైన పాతాళ లోకములు ఏడున్నాయి. (57) ఈమాత్రపు పరిమితి గల విశ్వాన్ని బ్రహ్మాండాన్ని బ్రహ్మ చేశాడు. మహావిష్ణువు యొక్క రోమకూపంలో ఇది అణువులాగా ఉన్నది (58) ఆతనికెన్ని రోమములో అన్ని విశ్వములున్నాయి. పరమాత్ముమైన కృష్ణునకు ఆతడు పదహారవ అంశము. (59) ఆతనికెంత యశము, శౌర్యము, అనుపమమైన మహిమ గోపకన్యదానిని స్మరించింది. మాధవికి ఏం తెలుసు, అని (60) మాధవి ఇట్లా అన్నది - నేను చెప్పినదానిని తెలుసుకోకుండ గోపికలు మూఢులై మాట్లాడుతున్నారు. నేనుచెప్పినశుభమైన నా మాటను ఉద్దవ! విను.
ఉద్ధవ ఉవాచ-
అను ॥ స్వేచ్చగా విష్ణువు సగుణుడౌతాడు, అట్లాగే నిర్గుణుడౌతాడు. భూభారాన్ని తగ్గించడానికి విభువు శిశువై గోపవేషంలో ఉన్నాడు. (62) వేదములు, పురాణములు, సిద్దులు, సజ్జనులు, బ్రహ్మ, ఈశ, శేషులు భక్తులు ఎల్లప్పుడు ఆ ఈశ్వరుని గురించి తెలుసుకోలేరు. (63) అట్టిది గోపకన్యకను మూఢురాలను స్మరించతగిన ఆతనిని ఏం తెలుసుకుంటాడు. ఐనా ఓవత్స!సత్యమైన నామాటను వినండి. ఆ క్షణంలో! (64) ఆ అనిర్వచనీయ రూపము యశస్సు, శౌర్యము, బలము, వీర్యము, వేషము, సిద్ధి, హరి ఇతర గుణాలు ఏం చెప్పను. (65) స్వేచ్ఛామయుడైన ఆతనికి సగుణునకు ఇప్పుడు ఆవిశేషణము అనిర్వచనీయంగా ఉంది. (66) నిర్గుణుడైన, శరీరహీనుడైన, స్వఆత్మగల విష్ణువునకు పేరేమిటి, దానిరూపమేమిటి. (67) మహామూఢురాలు నన్ను నిందిస్తోంది. నామాటను తెలుసుకోలేదు. సత్యమూర్తి ప్రకృతికి పరుడు ఐన ఆతనిని ఈ మూడురాలు ఏం తెలుసుకుంటుంది. (68) జ్యోతిః స్వరూపుడు, పరముడు, పరమాత్మ, ఈశ్వరుడు, భక్తులను అనుగ్రహించే కొరకు రూపమెత్తిన ఆతనిని ఆ అనిర్వచనీయుని ఏం తెలుసుకుంటుంది. (69) పరురాలు, ముల్లోకములకు జనని, ఆపద్మ ఆతని పాదపద్మములను భయముతో (కలిగి) దాసిలా ఎప్పుడూ భయంగా సేవిస్తోంది. (70) విష్ణుమాయ ప్రకృతి. సనాతనమైనది మూలరూపమైనది బ్రహ్మ స్వరూపము, పరమమైనది, భయంతో దక్షిణ పార్శ్వం నుండి సేవిస్తోంది. (71) సరస్వతిజడీభూతురాలు, ఆపరమేశ్వరి, భయపడింది. వేదములే స్తుతించలేకపోయాయి. ఆపరమేశ్వరుని ఏమి స్తుతిస్తారు. (72) ఆ, వారల మాటలను ఉద్ధవుడు విని భక్తి విహ్వలుడై, సర్వాంగములు పులకాంకితములు కాగా రోదించాడు, పడిపోయాడు. (73) మూర్ఛను పొంది, భక్తితో ఆ పరమేశ్వరుని ధ్యానించి, ఆతడు తనను తుచ్ఛునిగా భావించాడు. భక్తితో గోపికతో అన్నాడాతడు. (74) ఉద్ధవుని వచనమిట్లా - ద్వీపములలో జంబూద్వీపము మనోహరమైనది, ధన్యమైనది, కీర్తికరమైనది. అందులో భారత వర్షము పుణ్యప్రదమైనది. అట్లాగే శుభాన్నిచ్చేది. (75) వణిజులకు పుణ్యం వల్ల లభించేది. వాణిజ్యమునకు స్థలము, కోరినదానిని ఇచ్చేది. ఇక్కడ పుణ్యాన్ని ఆచరిస్తే ఇతరత్రా శుభఫలాన్ని అనుభవిస్తాడు. (76) భారతవర్షము ధన్యమైనది. పుణ్యమునిచ్చేది, శుభము నిచ్చేది, శ్రేష్ఠమైనది గోపీపాదాబ్జముల ధూళితో పవిత్రమైనది.పరమ నిర్మలమైనది. (77) అంతకన్న గోపిక ధన్యమైనది. భారతదేశమందు స్త్రీలలో మాన్యురాలు. పుణ్యమునిచ్చే రాధపాదములను రోజు చూచువారు ధన్యులు. (78) బ్రహ్మ అరవైవేల సంవత్సరాలు రాధికా పాదపద్మముల రేణువును పొందే కొరకు తపస్సు చేశాడు. (79) రాధగోలోకవాసిని, పరురాలు, కృష్ణునకు ప్రాణములకన్న అధికురాలు. శ్రీరాముని శాపం వల్ల ఇప్పుడు వృషభానుని కూతురైంది. (80) కృష్ణుని భక్తులెవరున్నారో దేవతలు, బ్రహ్మాదులు, వారు రాధ, గోపికల పదహారవ కళకు సరిరారు. (81) యోగీంద్రుడు, మహేశ్వరుడు కృష్ణభక్తిని ఎరిగినవాడు, రాధ, గోపికలు గోపాలురు గోలోకవాసులు ఎరుగుదురు.
కలావత్యువాచ –
సనత్కుమార ఉవాచ :
అను!! సనత్కుమారుడు కొంచము, బ్రహ్మ కూడా కొంత తెలుసుకుంటారు. సిద్దులు భక్తులు కూడా కొద్దిగానే తెలుసుకుంటారు.గోకులానికి వచ్చిన నేను ధన్యుణ్ణి. కృతకృత్యుణ్ణి. గురువుల నుండి గోపికల నుండి నిశ్చలమైన హరిభక్తిని పొందుతాను. మధురకు వెళ్ళను. తీర్థము వలె కీర్తింపబడే ఆతని కీర్తనను వింటాను. జన్మ జన్మలలో గోపికలకు కింకరుడినౌతాను. (85) గోపికలను మించిన పరుడైన భక్తుడు లేడు, పరమాత్మయైన హరికి. గోపికలు పొందినంత భక్తిని అంతటి భక్తిని ఇతరులు పొందలేదు. (86) కలావతి ఇట్లా అంది - పితరుల మానసకన్య కళావతిమేన ధన్యమైనది. మేము ముగ్గురము అక్కాచెల్లెళ్ళము భూమి పై తిరుగుతున్నాము. (87) జనకుని పత్ని సీతకు తల్లి. పతివ్రత ఆమె ధన్యురాలు. రాధ అయోనిసంభవ. నేను కూడా అయోని సంభవమే. (88) రాధ శ్రీ రాముని శాపంవల్ల భూమి పై వృషభానుని కూతురుగా జన్మించింది. సనత్కుమారుడుని శాపం వల్ల మేమే భూమి పై కొచ్చాము. (89) పాలసముద్రమందు రమ్యము, మనోహరమైనది శ్వేతద్వీపము. మేము ముగ్గురము సొదరీమణులము. భక్తితో విష్ణువును చూడటానికి వెళ్ళాము. (90)మేము లేచి నిల్చోవటం వగైరా చేయలేదు. కోపంతో మమ్ముల శపించాడు. సనత్కుమారుడు భగవంతుడు. యోగీంద్రుల గురువునకు గురువు. (91) సనత్కుమారుడిట్లన్నాడు: ఓమూఢురాండ్రులారా భూమి పైననే ఉండండి. తిరిగి స్వర్గానికి వెళ్ళకండి. అహంకార కారణంగా మనుష్య ప్రాణులకు ప్రేమపాత్రులు కండి. (92) ఆద్విజుడు తరువాత ఆనందపడి ప్రత్యేకమైన వరమిచ్చాడు. విష్ణ్వంశమైన పర్వతరాజైన హిమవంతుని భార్యగా ఔతుంది. (93) నీ పెద్ద బిడ్డ పార్వతిఔతుంది. యోగియైన జనకునకు ప్రియురాలౌతుంది (ఇష్టు). (94) ఆతని కన్యగా మహాలక్ష్మి సీతగా ఔతుంది. వైశ్య శ్రేష్టుడైన యోగి వృషభానునికూతురౌతుంది. (95) దుర్వాసుని శిష్యుడైన వానికి చివరదైన కలావతి, సాధ్వి ద్వాపరాంతమందు గోకులమందు ప్రియురాలౌతుంది. (96) గోలోకమందుండే దేవి రాధ, శ్రీరాముడనుగోపుని శాపంవల్ల కలావతి కూతురౌతుంది, అనుమానం లేదు. (97) ఈశుడు, బ్రహ్మ ఈశశేషుల భారాన్ని తగ్గించేకొరకు భూమి పైకి వస్తాడు. పుణ్యక్షేత్రమైన భారతానికి వస్తాడు. (98) కౌతుకంతో కళావతి వృషభానుడు కన్యతో కూడి జీవన్ముక్తుడై గోలోకానికి వెళ్తాడు, అనుమానం లేదు. (99) సీతధన్యురాలు సీతతో స్వామి వైకుంఠానికి వెళ్తాడు. మేనక యోగిని సిద్ధురాలు పార్వతి యొక్క వరునితో కూడి (100) కల్పాంతమందు విష్ణులోకమందు లక్ష్మి వలె చిరకాలము ఆనందిస్తుంది. ఆపదలేకుండా ఎవని మహిమ ఎక్కడ కన్పిస్తుంది. (101) కర్మవల్ల దుఃఖం తొలగిపోతే, దుర్లభమైన సుఖము కల్గుతుంది. ఇదివరలో పితరుల కన్యలు సర్వభోగముల విలాసాన్ని పొందారు.
తులస్యువాచ –
కాలికోవాచ –
ఉద్దవ ఉవాచ –
అను ॥ లక్ష్మి సమురాలు, వరుడైన విప్రునకు విష్ణు దర్శనం వల్ల కర్మక్షయమౌతుంది. మాకు విష్ణు దర్శనం వల్ల కర్మక్షయమైంది (103) ఆతీవ్రమైన పుణ్యం వల్ల కుమారుని దర్శనం ఐంది. కుమారుని ముఖం నుండి పరమదుర్లభమైన జ్ఞానాన్ని విన్నాను (104) బ్రహ్మ విష్ణుశివాదులకు సిద్దులకు, జగత్తుకు, ఈశ్వరుడు పరమాత్మ, ప్రకృతికి పరుడు శ్రీకృష్ణుడు. నిర్గుణుడు, నిరీహుడు, పరుడు , స్వేచ్ఛామయుడు, వరుడు (105) తులసి ఇట్లా అంది - అన్ని ప్రాణులలో విడివిడిగా దేవతలు ఉంటారు (106) విష్ణు ప్రాణము, విషయి. బ్రహ్మ మనస్సు, చేతన. ప్రకృతి బుద్ధిరూపమైంది. సర్వశక్తులకు అధిదేవత (107) శంభువు జ్ఞాన స్వరూపుడు, ధర్మం స్వయంగా పురుషుడు. నిర్గుణుడు పరమాత్మ, ఆతడే బ్రహ్మ ప్రకృతికి పరుడు (108) జీవుల కర్మలకు ఆకృష్ణుడే సాక్షి. సుఖదుః ఖముల భోక్త ఆతడే. జీవుడు అతనికి ప్రతిబింబము (109) చంద్ర సూర్యులు కళ్ళు.నాలుక పై సరస్వతి. చర్మమందు భూమి చేతులందు లోకపాలకులు (110) ఆతనికి వారంతా పరిచారక రూపులు. ఆ జీవులంతా ఆత్మయందే ప్రీతికలవారు (111) వారంతా సంసారంలో నరదేహంను అనుసరించువారి వలె అక్కడ ఆత్మననుసరిస్తారు. అందువల్ల అన్నివిధములుగా ఎప్పుడూ ఆత్మను భజిస్తారు (112) మిక్కిలి భక్తితో సంతులు, యోగులు ధ్యానిస్తారు. కర్మచేసే వారి కర్మలకు సాక్షి అతడు. కర్మలను దాచేదెట్లా. కృష్ణుడు అంతర్యామి. సంచరిస్తుంటాడు (113) కాలిక ఇట్లా అంది - నరులు, బాలురు, వృద్ధురు, యువకులు అని మూడు విధా (114) దేవాదులు, సిద్ధులు అంతా ఆ పరుని ఎరుగుదురు. ఇప్పుడు మూర్ఛితురాలైన రాధను మేల్కొలపాలి (115) ఇక్కడ యుక్తి ప్రధానము. ఉద్ధవ! ఆమెను మేల్కొలుపు. ఉద్ధవుడిట్లన్నాడు - ఓ ళ్యాణి! చైతన్యాన్ని పొందు. ఓ జగన్మాత! నన్ను మేల్కొలుపు (116) ఉద్ధవుణ్ణి. కృష్ణభక్తుని కింకరునకు కింకరుణ్ణి ఓ తల్లి! నన్ను అనుగ్రహించు. తిరిగి మధురకు వెళ్తాను (117) నేను స్వతంత్రుణ్ణికాను. పరాధీనుణ్ణి. కట్టెతో చేసిన స్త్రీ రూపం లాంటివాణ్ణి. ఎద్దు ఎక్కేవాడికి ఎద్దు స్వాధీనమైనట్టు నేను ఆతనికి స్వాధీనుణ్ణి. (118) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు రాధ ఉద్దవుల సంవాదమందు తొంబది నాల్గవ అధ్యాయము!!
Summary of chapter 94 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Dedicated to the holy river Yamunā, who flows through the heart of Vraja, this chapter details Her divine origin as Kalīndī, the daughter of the Sun God Sūrya and eternal consort of Śrī Kṛshṇa. The text presents Her secret Stotra, celebrating Her dark-blue waters that mirror the complexion of Kṛshṇa. Bathing in or drinking the sacred waters of the Yamunā cleanses the heaviest sins, bestows devotional sweetness, and guarantees freedom from the fear of death.