శ్రీ నారాయణ ఉవాచ :
నారాయణ మహర్షి పలికెను :
ఒకసారి శ్రీకృష్ణుడు బలరాముడు బాలకులతో బోటు ఇంటివద్ద ఆహార పానీయములు స్వీకరించి క్రీడించుటకు శ్రీ వనమున కేగిరి. గోవులను మేపుచు అక్కడ వారందరు నానావిధమైన ఆటలాడిరి. ఆయడవిలో తీయని నీరు త్రాగి మహాబలవంతుడైన శ్రీకృష్ణుడు గోవులను తోలుకొని గోపాలబాలురతో బాటు అక్కడి నుండి మధువనమున కేగెను.
ఆ మధువనములో నొక బలవంతుడైన రాక్షసుడు వికారమైన ఆకారము ముఖముతో భయము కల్గించు కొండంత తెల్లని కొంగ రూపము ధరించి వచ్చి గోకులము చూచి (ఆ వనములో) పూర్వ మగస్త్యుడు వాతాపిని మొత్తముగా ఒక లీలగా మ్రింగినట్లు గోపాల బాలురతో బోటు బలరామకృష్ణులను ప్రింగెను.
బకము చేత మ్రిoగబడిన శ్రీకృష్ణుని చూచి దేవతలందరు భయపడి హాహా అనీ అరచుచు తమ తమ శస్త్రములు చేతులలో పట్టుకొని పరిగెత్తిరి.
దధీచి ముని వెన్నెముకతో నిర్మించబడిన వజ్రాయుధమును ఇంద్రుడు విసిరివేయగా ఆ కొంగ చావలేదు. ఒక రెక్క మాత్రము కాలిపోయినది.
చంద్రుడు నీహారాస్త్రమును ప్రయోగించగా దానపుడు చలితో బాధపడెను. . సూర్యపుత్రుడైన యముడు తన దండాయుధము విసరగా దానితో వాడు గాయపడెను.
వాయువు వాయవ్యాస్త్రము ప్రయోగించగా కొంట అటనుండి వేరొక చోటబడెను. వరుణుడు శిలావర్షము కురిపించగా దానితో దానవుడు పీడనొందెను.
అగ్నిదేవుడాగ్నేయాస్త్రముతో వాని మొత్తము రెక్కలను కాల్చి వేసెను. కుబేరుడర్ధచంద్రబాణముతో వానీ పాదములను నరికివేసెను. శంకరుడు శూలము ప్రయోగించగా రాక్షసుడు మూర్ఛిల్లెను. ఋషులు మునులు భయముతో శ్రీకృష్ణునకాశీస్సులు పలికిరి.
ఇంతలో పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచు బక దైత్యుని సర్వాంగమును లోపల బయట మంట పెట్టెను. అప్పుడా రాక్షసుడు మ్రింగిన వారినందరిని క్రక్కివేసి ప్రాణములు వదిలెను.
బలవంతుడైన శ్రీకృష్ణుడిట్లు బకుని సంహరించి బాలురను గోవులను వెంటబెట్టుకొని మిక్కిలిగా మనస్సును హరించెడి కదంబవసమునకు.
ఆ కదంబవనములో ప్రలంబుడన్న రాక్షసుడు పర్వతమంత వృషభ (ఎద్దు) రూపము ధరించి బలవంతుడు గొప్ప దుష్కార్యములు చేయువాడు కనుక హఠాత్తుగా వచ్చి శ్రీకృష్ణుని తన కొమ్ములతో నెత్తీ పట్టి త్రిప్పుచుండెను. అది చూచి బాలకులందరు భయపడి ఏడ్చుచు పరిగెత్తిరి, బలవంతుడైన బలరాముడు తన తమ్ముడు పరమేశ్వరుడని ఎరిగినందున నవ్వి ఎందుకు భయము అని బాలురకు ధైర్యము చెప్పెను.
మధువను రాక్షసుని సంహరించినవాడగు శ్రీహరి వృషభాసురుని (ప్రలంబుడు) కొమ్ములు పట్టుకొని ఆకాశమున గిరగిర త్రిప్పి భూమీ మీద పడవేసెను. ఆ రాక్షసుడు నేలమీద పడి ప్రాణములు విడిచెను. బాలురందరది చూచి సంతసముతో నవ్విరి. నాట్యమాడిరి. పాటలు పాడిరి.
శ్రీకృష్ణుడు ప్రలంబునీట్లు సంహరించి బలరామునితో బాటు (గోపాల బౌలురను) వెంటగోని త్వరగా తమ ధనమైన గోబృందము మేపుచు భాండీర వనమున కేగుచుండెను. అట్లు పోవుచున్న మాధవుని జూచి బలవంతుడగు కేశియను దైత్యేశ్వరుడు భూమిని డెక్కలతో దున్నుచు (అశ్వరూపముననున్నందున) చుట్టు తిరిగి తలమీద శ్రీకృష్ణునెత్తుకొని సంతోషముతో నూరు యోజనముల యెత్తు ఆకాశమునకెగురవేసి గిరగిర త్రిప్పి నేలమీద పడవేసెను. తాను కూడ దిగి వచ్చి ఆ పాపాత్ముడు శ్రీహరిని పట్టుకొని కోపముతో స్వామిని నమీలివేయుచుండెను. వజ్రకాయుడైన శ్రీకృష్ణుని నములుట వలన ఆదైత్యునీ దంతములు భగ్నమయ్యెను. వాడు కృష్ణ తేజస్సులో దగ్గమై ప్రాణములు విడిచెను. స్వర్గమున దేవ దుందుభులు మ్రోగెను. పుష్పవర్షము కురిసెను.
ఇంతలో నాభాండీర వనమునకు దివ్యరూపధారులైన గోలోకపాదులు (శ్రీహరితో కలిసియుండు గోలోక సభ్యులు) రత్నస్తారము చేత నిర్మింపబడి వెలుగుచున్న రథమెక్కి వచ్చిరి. వారు పీతాంబరములు ధరించి కిరీటములు కుండలములు వనమాలలచే నలంకృతులై వినోదముగా రెండు హస్తములతో మురళులు చేత బట్టి పాదములందు కుణుకుణుమనుచున్న మంజీరములతో - {అందెలు) శ్రీగంధము పూయబడిన సర్వాంగములు గలవారై గోపవేషధారులై చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖములు గలవారై - భక్తులననుగ్రహించు చూపులతో విరాజిల్లుచుండిరి. వారు దివ్య వస్త్రములను ధరించి రత్నాలంకార భూషితులై యుండిరి. శ్రీకృష్ణుడు సన్నిధి చేసియున్న ప్రదేశమునకు వచ్చి, వారు శ్రీకృష్ణునకు నమస్కరించీ స్తోత్రము చేసి ఉత్తమమైన గోలోకమునకు వెళ్లిరి.
ముగ్గురు విష్ణు భక్తులు దొనవ జన్మలెత్తి శరీరములు వదిలి సంసార బంధము నుండి విముక్తులై గోలోకమున శ్రీకృష్ణ సభలో సభ్యులైరి.
నారద ఉవాచ :
నారదుడు పల్కెను :
వైష్ణవులై దైత్యరూపములు ధరించి దివ్యరూపులైన వారెవరు ? ఓ మహానుభావుడా ! వారేమి పరమాశ్చర్యమైన కర్మలు నాకు చెప్పుము.
నారాయణ ఉవాచ :
నారాయణమహర్షి పల్కెను :
ఓ జ్ఞానీ ! నీకొక పురాతనమైన ఇతిహాసమును చేప్పెదను. వినుము. ఓ బ్రహ్మపుత్రుడా ! లోకములను పానము చేయు నీ కథను శంకరుని ద్వారా వినియుంటిని. ఒకసారి పుష్కర క్షేత్రమునందు సూర్యగ్రహణ సందర్భమున మునిగణములు ధర్మదేవత బ్రహ్మ నేను అడుగగా శ్రీహరి గుణములను ప్రసంగించుచు శంకరుడీకథను వివరించి చెప్పెను.
గంధమాదన పర్వతమున గంధవాహుడన్న గంధర్వరాజు గొప్ప తపస్విశ్రేష్ఠుడు హరి పాద సేవాసక్తుడు. ఓ నారదా ! అతనికి వసుదేవుడు, సుహోత్రుడు, సుదర్శనుడు, సుపార్శ్వకుడని నలుగురు కుమారులు కలరు. వారు కూడ శ్రీకృష్ణపాద పద్మములను నిద్రలో, మెలకువలో రాత్రింబగళ్లు స్మరించుచుండిరి. వారు దుర్వాస మహర్షి శిష్యులు. ఆ నలురు వైష్ణవ శ్రేషులు (గొప్ప విష్ణు భక్తులు). శ్రీకృష్ణ పూజాతత్పరులై పుష్కర క్షేత్రమున చిరకాలము తపస్సు జేసిరి. ప్రతీదినము శ్రీకృష్ణపాదములను ఒక్కొక్క కమలముతో అర్చించి జలపానము మాత్రమే చేయుచు మంత్రసిద్ధి పొందిరి.
వారిలో పెద్దవాడగు వసుదేవుడు దుర్వాసమహర్షి వలన యోగవిద్యను పొంది దానిలో సిద్ధిని పొంది యోగివరుడయ్యెను. అతడు వివాహము చేసికొనక బ్రహ్మతేజస్సుతో వెలుగుచు యోగశక్తితో వెంటనే శరీరము త్యజించి గోలోకమున శ్రీకృష్ణపారదుడయ్యెను.
ఒకసారి తపస్సుతో మంత్ర సిద్ధులైన తక్కిన ముగ్గురు సోదరులు సూర్యోదయ కాలమున శ్రీకృష్ణ పూజ కొరకు కమలములు సంపాదించుటకై చిత్ర సరోవరమునకు వెళ్లారి, పద్మముల కోసుకొని పోరు మరలి పోవుచుండగా చూచిన శివకింకరులు ఈ బలహీనులను పట్టి బంధించి శివుని వద్దకు తీసుకొని పోయిరి. గంధర్వులు శంకరుని చూడగనే నేలమీద శిరములానించి నమస్కరించిరి. శివుడు వారికి ఉత్తమమైన ఆశీస్సులిచ్చి కొద్దిపాటి చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్నముఖ మండలముతో భక్తులననుగ్రహించువాడై ఇట్లు పలికెను.
శివ ఉవాచ :
శివుడు పలికెను :
“మీరెవరు? పార్వతి తన ప్రతము కొరకు లక్ష యక్షుల చేత రక్షింపబడు పార్వతీ సరోవరములో పద్మముల దొంగిలించితిరి. భర్త సౌభాగ్యమును వృద్ధి పొందించు త్రైమాసిక ప్రతము (మూడు నెలలపరిమితి గల వ్రతము) పట్టీ పార్వతి దినదినము వేయి కమలములు శ్రీహరికి సమర్పించుచున్నదిగదా !” శివుని వాక్కు విని ఆ వైష్ణవులు భక్తితో తమ శిరస్పులు వంచి చేతులు జోడించి భయముతో నీటు పలికిరి.
గంధర్వా ఊచుః :
గంధర్వులనిరి :
ఓ విభూ ! మేము గంధవాహుని పుత్రులము. గంధర్వులము. అనుదినము శ్రీహరికి కనులము సమర్పించి జలపానము చేయుదుము. ప్రభూ ! ఇది పార్వతీ దేవికి చెందిన సరస్పని ఎరుగము. ఈ కమలములన్నింటిని స్వీకరించి మీ వ్రతము నిర్వహించుడు. ఈనాడు కమలములను శ్రీహరికి సమర్పింపము. జలము స్వీకరించము, ఏమి ? కమలములు మీకు సమర్పించితిమి కదా ! ఎందుకు జలపానము. చేయము ? నిత్యమేవని పాదపద్మములను ధ్యానించి పద్మముతో పూజించుచుంటిమో అతనికి సాక్షాత్తుగా పద్మములీనాడు సమర్పించి మేము పూతాత్ములమైతిమి. ప్రభూ ! అద్వితీయమైన (సాటి లేని - రెండు వేరు కాని) పరబ్రహ్మ మొక్కటియే. దేహమెక్కడ? దేహము గలవాడు ( ఆత్మ) ఎక్కడ ? భక్తుల ననుగ్రహించుటకే ఆకారము మాయ వలన రూపభేదము ఏర్పడుచున్నవి. ఇక పద్మములను స్వీకరించువయ్యా ! స్వామీ ! నీవే మా ప్రభువువు. దేనితో మా మనస్సు నిండియున్నదో అట్టి రూపమును చూపించవయ్యా!
ఒకముఖము రెండు నేత్రములు రెండు హస్తములు శ్యామసుందరమైన కోరదగిన కిశోరరూపము వినోదార్ణము హస్తమందు మురళి పీతాంబరము ధరించిన చందనము అగురుల ద్రవము పులుముకొన్న రత్నాభరణములు పారిజాత ప్రసూనమాలలు ధరించిన - కొద్దిపాటి చిరునవ్వు గల ప్రసన్న ముఖము కౌస్తుభమణితో వెలిగిపోవుచున్న వక్షః స్థలము మాలతీపూలదండలు చుట్టి నెమిలి పింఛములలంకరించిన కొండి కొప్పు గల కోటి మన్మధుల సౌందర్య విలాసములకు స్థానమై మనోహరముగా నున్న చిరునవ్వులు ప్రక్క చూపులు గల గోపికాగణములతో చూడబడుచున్న నవ వన సంపదతో రాధాదేవి వక్షస్థలమున విలసిల్లియున్న బ్రహ్మాది దేవతలకు కోరదగి నమస్కరింపదగీ ధ్యానము చేయదగి పొగడబడుచున్న భక్తులననుగ్రహించుటయందు తొందర గల తనయందు తానానందమయమై పూర్ణకామమైన (కోరికలన్నీ నిండుగా తీరిన) దివ్యరూపమును దర్శింపజేయుమ"ని పల్కి ఆ గంధర్వపుంగవులు శివుని ముందు నిలిచియుండిరి.
శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహవర్ణనను వినుట వలన పులకించిన శరీరము గలవాడై ఆనంద బాష్పములు నిండిన కన్నులతో శివుడు వారి మాటలు వీసి ఇట్లు పలికెను.
వైష్ణవ శ్రేష్ఠులైన మీరు మీ పాదపద్మముల ధూళితో భూమిని పవిత్రమొనర్చుటకై తిరుగుచున్నౌరని నాకు తెలియును. శ్రీకృష్ణుని భక్తులను దర్శించవలెనని నేను కోరుచుందును. సాధువుల యొక్క సమాగమము {కలియుట) ముల్లోకములలో దుర్లభమైనది. పార్వతీ దేవికిని, దేవతలకును నాకును మీరెల్లప్పుడు ప్రియమైనవారు. నాకు నా భక్తులకంటే విష్ణుభక్తులు మిక్కిలి ప్రియులు.
ఐసను ఓ మహానుభావులారా ! ఒక మాట వినుడు. ఇంతకు ముందు పార్వతీదేవి ప్రతకర్మ ఆరంభించినప్పుడు ప్రతకాలములో ఈ సరస్సులోని పద్మములితరులెవరు కోసికొన్నను త్వరగా వారు రాక్షస జన్మనెత్తుదురు. ఈ మాట నిశ్చయమనీ పలికియుంటిని. నా వాక్కు వ్యర్థము కాదు. మరి శ్రీకృష్ణ భక్తులైన వారికి అశుభమన్నదెప్పుడుండదు. దానవ జన్మనెత్తి నిశ్చయముగా గోలోకమునకు వెళ్లుదురు. మీరు శ్రీకృష్ణ రూపమును ప్రత్యక్షముగా చూడవలెనను ఉత్సుకత (తీవ్రమైన కోరిక) కలిగియున్నందున భారతఖండమున బృందారణ్యములో తప్పక దర్శించగలరు. ఓ బిడ్డలారా ! శ్రీకృష్ణదర్శనము చేసికొని అతని వలననే మరణము పొంది వైష్ణవోత్తములైన మీరు (దివ్యరూపములతో) దివ్యరథమెక్కి శ్రీహరి గృహమునకు (గోలోకమునకు పోవుదురు. ఇప్పుడు కోరదగిన ఆ స్వామిని దర్శించుటకు ఉత్సుకత కలియున్నారు కదా, ఆ దివ్యమంగళ రూపమును చూడండి” అని శివుడు వారికి స్వామి రూపము చూపించెను. వారానందబాష్పములతో ఆ రూపము దర్శించి ఆ సర్వరూపునకు నమస్కరించి దానవజన్మను పొందిరి.
వసుదేవుడు యోగవిద్యవలన మొదటనే ముక్తి పొందెను. నుహోత్రుడన్నవాడు బకాసురుడు, సుదర్శనుడన్నవాడు ప్రలంబుడు, సుపార్శ్వరుడు కేశీ, వారు హరుని వరము వలన అత్యుత్తమమైన కృష్ణరూపము దర్శించి శ్రీకృష్ణుని వలన మరణము పొంది గోలోకమును పొందిరి. ఓ నారదా ! ఈ విధముగా అద్భుతమును దానవరూప బక కేశి ప్రలంబులకు విముక్తిని కల్గించినదియు శ్రోతలకు మోక్షమును కల్గించునదియునగు శ్రీహరి చరిత్రము నీకు చెప్పితీనీ, అని నారాయణ మహర్షి పల్కెను.
నారద ఉవాచ :
నారదుడు పలికెను :
ఓ మహానుభావా ! నీయనుగ్రహము వలన అద్భుతమైన ఇతిహాసము సర్వము వింటిని. పార్వతీదేవి ఏమి వ్రతము చేసేనో? అందు ఆరాధింపబడిన దైవమెవరు ? దాని వలన వచ్చు ఫలమేమి ? ఆ వ్రతము యొక్క నియమము లెట్టివి? ఆ వ్రతమందుపయోగింప వలసిన పదార్థములేవి ? ఆ వ్రతమెంతకాలమాచరించవలయును . దాని నాచరించు విధానమెటువంటిది. ఓ ప్రభూ ! ఈ విషయములను బాగుగా విచారించి చెప్పుము. వినవలెనని నాకు ఆసక్తిగానున్నది.
శ్రీ నారాయణ ఉవాచ :
నారాయణ మహర్షి పలికెను :
ఓ సారదమునీ ! ఇది మూడు మాసములు చేయవలసిన వ్రతము. స్త్రీలకు పతి సౌభాగ్యమును (ముతైదువతనము తోడిదొంపత్యము} వృద్ధి పొందించునదీ, ఇందు పూజింపబడు దైవము రాధాదేవితో గూడిన శ్రీకృష్ణ భగవానుడు. ఈ వ్రతమును విషపత్కాలమునందారంభించి దక్షిణాయనములో ముగించవలెను. ప్రతారంభమునకంటే ముందు రోజు తప్పని సరిగా హవిష్యము (బియ్యము కడుగకుండు ఉప్పు పప్పుతో కలిపి గంజిపార్చకుండ వండిన అన్నము - పొంగలి (పులగము)} భుజించి (ఒక్కపూట) నీయమనిష్ఠలతో ఆ రాత్రి గడపవలెను. మరునాడు వైశాఖ మాస సంక్రాంతి రోజున (వైశాఖ సంక్రాంతియనగా వైశాఖ మాసమున వచ్చు సూర్యసంక్రమణము. ఇదీ మేష సంక్రాంతి గానీ వృషభ సంక్రాంతి గానీ కావచ్చును. విషువత్తు సంబంధము చెప్పినందున ఆది మేష సంక్రమణమే అగును. అప్పటి నుండి కర్కాటక సంక్రమణారంభము వరకు మూడు మాసములగును. కర్కాటక సంక్రమణము దక్షిణాయనారంభము గనుక ఈ వ్రత సమాప్తి దక్షీణాయనమన్నందున మేషసంక్రాంతియే ఈ వ్రతారంభకాలమని తేలుచున్నది) గంగానదీ తీరమున స్నానమాడీ ఈ వ్రతమారంభించవలెను. పూర్ణకుంభము నందు గానీ ఒక రత్నమునందు గాని సాలగ్రామ శిలయందు గాని పుణ్యతీర్థజలమందు గాని రాధావిభుని ధ్యానించి ఆవాహనము చేసి భక్తితో పూజించవలెను. అంతకన్న ముందు పంచలోకపాలక దేవతాపూజ చేసి శ్రీకృష్ణ పూజ చేయవలయును.
శ్రీ కృష్ణుని ధ్యానించు విధము సామవేదమున చెప్పబడినది. దీనిని చెప్పెదను వినుము.
“కొత్త మేఘము వలె సల్లనివాడును పసుపువన్నె పట్టు వస్త్రము ధరించిన వాడును శరదృతువులోని పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గలవాడును చిరునవ్వుతో గూడినవాడును శరత్కాలమున వికసించిన పద్మములవంటి కన్నులు గలవాడును సుందరమైన అలంకారములతో గూడిన వాడును మాటిమాటికి గోపికల మనస్సులను వ్యామోహపరచుచున్నవాడును రాధాదేవి చేత చూడబడుచు ఆమె వక్షఃస్థలమున నున్నవాడును బ్రహ్మ అనంతుడు ధర్ముడు మొదలగు దేవగణములచేత స్తుతింపబడు వాడును అగు శ్రీకృష్ణుని నేను భజించుచున్నాను” ఈ విధముగా ధ్యానము చేసి ప్రీతితో స్వామీనీ. ఆవాహన చేయవలయును.
మధ్యందిన సామశాఖ యందు చెప్పబడిన ధ్యానపద్దతితో రాధాదేవిని ధ్యానించవలెను. “రాధానామము గలదియు రాసేశ్వరియు రమ్యమూర్తియు {సుందరాకృతి గలది) రాసముండలమందలి ఆనందరసమనుభవించుట కాసక్తి కలదియు రాసమండల మధ్యమున నుండునదియు, రాసమండలమునకు అధిష్టాన దేవతయు . {ప్రధాన దేవత) రాసేశ్వరుని (శ్రీకృష్ణుడు) ప్రియురాలును రసికులలో ఉత్తమురాలును అందమైన స్వభావము గలదియు రమాదేవియు ఆనందానుభవమందాసక్తి గలదియు శరత్కాల పద్మముల సౌందర్యము నపహరించినట్లున్న కన్నులు గలదియు వంకరయైన బోమముడి గలదియు కాలి అందెలతో శోభిల్లుచున్నదీయు శరత్పూర్ణిమనాటి చంద్రుని వంటి ముఖము గలదియు చిరునవ్వుతో అందముగానున్నదియు అందమైన సంపెంగ పూలవంటి పచ్చని దేహకాంతి గలదియు ఆ పై చందనమలంకరించుకొన్నదియు, కస్తూరి చుక్కతో పాటు సిందూరపుచుక్క తిలకముగా ధరించినదియు సుందరమైన మకరికా పత్రరేఖలు (చెంపల పై సనమండలము) గలదియు, అగ్నివర్ణము గల వస్త్రములతో మెరసిపోవుచున్నదియు రత్నాల చెవికమ్మల కాంతి చెక్కిళ్లపై తళతళమని ప్రకాశించుచున్నదియు మేలి ఇంద్రనీల మణుల హారము వక్షఃస్థలమున ప్రకాశించునదియు రత్నాల మొలనూలు ధరించినదియు బ్రహ్మాదుల చేత సేవింపబడుచు శ్రీకృష్ణుని చేత ప్రశంసింపబడుచు సేవింపబడుచున్నదియు సర్వమునకు బీజము (విత్తనము) వంటిదగు దేవిని భజించుచున్నాను” ఇట్లు ధ్యానించి కృష్ణునితో గూడియున్న రాధాదేవిని పూజించవలెను.
వ్రతము చేయు వ్యక్తి సంతోషముగా భక్తితో ప్రతిదినము షోడశోపచారపూజను చేయవలెను. పూజాద్రవ్యమును వేరువేరుగా నుంచి శ్రీకృష్ణుని రాధాదేవిని విడివిడిగా పూజించవలెను.
ఓ నారదా! వేయిరేకులు గల దీవ్యకమలములను నూట యెనిమిది గ్రహించి అర్చించి ప్రతిదినము నూట యెనిమీది ఆహాతులను అగ్నిలో హోమము చేయవలెను.
భక్తి శ్రద్ధలతో “కృష్ణాయ స్వాహా” అని పల్కుచు హోమము చేయవలెను.
ప్రతిదినము నూటయెనిమిది అరటి పండ్లు నూటయెనిమిది మామిడిపండ్లు చొప్పున అక్షతలతో బాటు అర్చించి నివేదన చేయవలెను. పక్వాన్నమును నివేదించవలెను.
ఓ నారదమునీ ! ప్రతిదినము వందమంది సబ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. నెయ్యి కలిపిన నువ్వులతో రాధాసహితుడైన శ్రీకృష్ణునకు భక్తి పూర్వక సమర్పణగా అగ్నిలో ప్రతిదినము 108 ఆహుతులు హోమము చేయవలెను.
నిత్యము మంగళవాద్యములను మ్రోగించవలెను. హరినామ సంకీర్తనము చేయించవలెను.
ఇట్లు మూడు మాసములు వ్రతము చేసి తరువాత “ప్రతిష్టి చేయవలెను. ఆ రోజున చేయవలసిన విధానము చెప్పెదను మినుము.
రేకులు విరగని తొంబది వేల కనులములతో ఆనాటీ అర్చన జరుపవలెను. తొమ్మిదివేల బ్రాహ్మణులకు రువీకరమైన పక్వాన్నములు పిండివంటలతో భోజనము పెట్టవలెను. నానావిధములైన నైవేద్యములు రుచిగా కంటికి ఇంపుగా సిద్ధము చేసి తొమ్మిది వేల ఏడువందల ఇరువై ఫలములతో బాటు స్వామికి నివేదన చేయవలెను. అగ్ని ప్రతిష్టచేసి నువ్వులతో నెయ్యితో తొంభై వేల ఆహుతులు హోమము చేయవలెను. వస్త్రములు భోజన పదార్థములు యజ్ఞోపవీతములు ఫలములను లడ్డూలు చల్లని నీరు నింపిన కుంభములు తొంబది (90} సమకూర్చి గంధపుష్పములతో అర్చించబడిన బ్రాహ్మణులు తొంబది మందికి దానమీయవలెను. ఈ వ్రతసమాప్తి చేసి ఈ కార్యమును నిర్వహించిన పురోహితుడు} బ్రాహ్మణునకు శాస్త్రములందు చెప్పిన ప్రకారము బంగారపు కొమ్ములు పొదిగిన కోడెలను (ఎదు) దానమీయవలెను. (ఇది ప్రత సమాప్తి (ఉద్యాపన) కార్యక్రమము. ఈ గ్రంథమున ప్రతిష్టాకార్యమని చెప్పబడినది).
ఈ విధముగా సామవేదమున చెప్పబడి పూర్వులాచరించిన త్రైమాసిక వ్రతము దాని విధానము నీకు చెప్పితిని. ఈ వ్రతము ప్రభావము వలన స్త్రీకి ఉత్తమ సంతానము పతి సౌభాగ్యవృద్ధి (ముత్తైదువతనము పెరుగుట)నూరు జన్మలలోను కలుగును, నూరు జన్మలలో సత్పుత్రులను కని భర్తతో కుమారులలో ఎన్నటికినీ భేద భావము కలుగకుండా జీవించును. కుమారులు దాసులవలె నుందురు. భర్త ఆమె మాట నెరవేర్చును. ఆ సాధ్వి ప్రతిక్షణము రాధాకృష్ణుల భక్తిగలదై ప్రత ప్రభావము వలన జ్ఞానమును హరి స్మృతిరూపమైన భక్తిని పొందును.
అన్నింటిలో ఈ వ్రతము శ్రేష్ఠమన్నదానికి క్రింది వార్తలను చెప్పెదను వినుము. మొట్టమొదట ఈ వ్రతమును స్వాయంభువ మనువు భార్యయైన శతరూపాదేవి అగస్త్యుని పురోహితుని జేసికొని ఆచరించెను. పులస్త్యుని పురోహితునిగా జేసికొని దేవహూతి ఆకూతి యన్న (కర్దమ ప్రజాపతి భార్యలు) వారు వేదోక్తముగా ఈ వ్రతము చేసిరి. క్రతువును పురోహితుని జేసికొని రోహిణియు (చంద్రునీ ' భార్య) గౌతముని పురోహితుని జేసికొని రతీదేవియు అనేకముగా పదార్థములు కూర్చుకొని భక్తితో బృహస్పతి భార్యయగు తారాదేవి వసిష్టుని పురోహితుని చేసికొనీయు ఈ వ్రతమాచరించిరి. గురువు భార్య చేసిన వ్రతమును చూచి ఇంద్రుని భార్య శచీదేవి బృహస్పతిని పురోహితుని జేసికొని ఎక్కువ పదార్థములతో దీనిని చేసెను. అగ్నిభార్యయగు స్వాహాదేవి అందరికంటే మిన్నగా వస్తువులు సమకూర్చుకొని మరీచిని పురోహితునిగా జేసికొని ఈ వ్రతమాచరించెను.
ఓ సారదా ! స్వాహాదేవి చేసిన వ్రతమును చూచి పార్వతీదేవి భక్తితో భర్తముందు తలవంచి చేతులు జోడించీ శంకరునితో నిట్లు వేడుకతో పలికెను.
పార్వత్యువాచ :
పార్వతి ఇట్లనెను :
ఓ జగత్రభూ ! వ్రతములలో శ్రేష్టమైనదియగు మన ఇష్ట దైవము యొక్క త్రైమాసిక వ్రతమును చేయుటకు నౌకాజ్ఞ ఇమ్ము, శ్రీహరి ఆరాధన (పూజ) సర్వమంగళములకు మూలము కదా. యజ్ఞయాగాది కర్మలు బావులు చెరువులు తోటలు గుడులు నిర్మించుట అన్నదానము అనెడి దానకర్మలు వేదపఠనము తీర్థయాత్రలు చేయుట భూప్రదక్షిణము అన్నవి శ్రీహరి ఆరాధనో మహిమ యొక్క పదహారవ భాగముతోను సరిపోవు.
ఏ వ్యక్తికి బయట లోపల ప్రతిక్షణము హరిస్మృతి (స్మరణము) కలదో వాడు పంచభౌతిక శరీరముతో నుండికూడ జీవన్ముక్తుడు. అతనిని దర్శించుట వలననే ఇతరులకును ముక్తి లభించును. అతని పాదధూళీ చేత భూమి వెంటనే పవిత్రమగును. అతనిని దర్శించినందు వలన ముల్లోకములు పావనమగును.
బ్రహ్మయు విష్ణువును ధర్ముడును శేషుడును నీవును గణపతియు ఎవని పాదాబ్దములు స్మరించి తేజస్సులో గొప్పవారు అతనికి సములు ఇతిరో అట్టి కృష్ణుని ఎడతెగక ధ్యానించువాడు అతనినే పొందునన్నది నిశ్చయమైన విషయము. గుణములో తేజస్సులో బుద్దిలో జ్ఞానములో ఆ స్వామికి సమానుడగును.
ఓ ప్రభూ ! శ్రీకృష్ణుని యొక్క స్మరణ వలన ధ్యానము వలన తపస్సు వలన అతని సేవ వలన నేను భగవంతుడైన భర్తను పొందితిని. పుత్రుని గంటిని. లీలగా నాకు సర్వము లభించినది. నామనసు పరిపూర్ణముగా నున్నది. నీవంటి భర్త కొడుకులు ఐన కుమారస్వామి గణపతులు కృష్ణాంశ గల హిమవంతుడు తండ్రి. ఇక నాకేమి దుర్లభము.
పార్వతి మాటలు విని శంకరుడు మిక్కిలి ప్రీతిపొంది ఆనంద పులకాంకురములేర్పడగా నవ్వి మధురముగా ఇట్లు పలికెను.
మహాదేవ ఉవాచ :
మహాదేవుడిట్లనెను :
ఈశ్వరీ ! నీవు మహాలక్ష్మీ స్వరూపిణివి. నీకసాధ్యమేదియుండును ? నీవు అన్ని విధముల సంపదల స్వరూపము గలదానవు. అనంత శక్తిరూపిణివి నీవు. నీవెవని యింట నుందువో అతడు సంపదలనుభవించును. ఎవని యింట లక్ష్మి ఉండదో వాడు జీవించుట కంటె మరణించుట మేలు. ఓ శుభము లిచ్చుదానా ! నేను బ్రహ్మ విష్ణువు నీయందు భక్తితో నీ అనుగ్రహము వలన సృష్టి సంహార కార్యములు చేయ సమర్శలమగుచున్నాము. హిమవంతుడెవరు ? నేనెవరు ? కుమారస్వామి గణపతి ఎవరు ? నీవు లేకుండ మేమశక్తులము. నీవలన మేము ప్రభువులము. ఈ వ్రతాచరణ మొనర్చిన లేక పూర్వమీ వ్రత విధాన మెరిగిన వేదములందు చెప్పబడిన పతివ్రతలెవరెవరో వారందరి ఆజ్ఞ తీసుకొని నీవు ఆ పరమేశ్వరుని ప్రతము (శ్రీకృష్ణుని) చేయుము. నీకు సనత్కుమార భగవానుడు పురోహితుడగు గాక. కమలములను బ్రాహ్మణులను కావలసిన పదార్థములను నేనిత్తును. ఓ సుందరీ ! నీ ధనాగారమునకు రక్షకునిగా కుబేరుని నియమించుము. ఈ వ్రతమున దానమునకధ్యక్షుడను గా నేనుందును. లక్ష్మీదేవి స్వయముగా ధనమిచ్చును. వంటలవాడు అగ్నిదేవుడు. వరుణుడు నీరు సమకూర్చును. వస్తువులను యక్షులు మోసితెత్తురు. వారిపై పెత్తనదారుగా కుమారస్వామి ఉండును. ఈ ప్రతకాలములో స్వయముగా వాయుదేవుడు స్థలమును శుభ్రపరచును. స్థలమును చుట్టుముట్టి రక్షించు క్షేత్రపాలకుడుగా ఇంద్రుడుండును. చంద్రుడందరీని అన్ని వస్తువులను తగినచోట నుంచును. శాస్త్రానుగుణముగా దాసమున యోగ్యత అయోగ్యతలను చెప్పుకోడుగా సూర్యుడుండును, ఈ విధముగా వ్రతమునకు ఉపయోగించు ద్రవ్యమంతయు ఇచ్చి నియమించితిని. ప్రియురాలా ! శాస్త్రమున చెప్పిన దాని కన్న అధికముగా ఫలములు పుష్పములు శ్రీహరికి సమర్పించుము. సుందరీ ! అట్లే అధిక సంఖ్యలో బ్రాహ్మణులను నియమించి సంతర్పణ చేయుము. భక్తితో అసంఖ్యాకముగా (ఇంతయని లెక్క పెట్టరాకుండ) బ్రాహ్మణులను భోజనముల కాహ్వానించుము. వ్రత సమాప్తినాడు బంగారము రత్నములు ముత్యాలు పగడములు వ్రతములో చెప్పిన దక్షిణను - సర్వము బ్రాహ్మణులకు సమర్పించుము. ఇట్లు చెప్పి శంకరుడాపార్వతితో త్రైమాసిక రాధాకృష్ణ వ్రతమును చేయించెను.
ఆ పార్వతి దేవి అందరికంటే విలక్షణముగా వ్రతము చేసెను. ఆమె వ్రతములో ఇచ్చిన రత్నములను బ్రాహ్మణులు మోసికొని పోలేక పోయిరి. ఇట్లు పార్వతీవ్రతమును మొత్తము ఇతిహాసమును చెప్పగా వింటివి. ప్రకృత కథను వినుము.
శ్రీకృష్ణుని బాల్య చరిత్ర అడుగడుగున క్రొత్త క్రొత్తగా నుండును. శ్రీకృష్ణుడా రాక్షసులను సంహరించి గోపాల బాలురతో కలిసి గోకులములో కుబేరుని భవనమును పోలియున్న తన గృహమునకు పోయెను. ఆపద తొలగిన సంతోషముతో పెద్దలందరికి అడవిలో జరిగిన సంఘటనలను శిశువులు చెప్పిరి. అది విని అందరాశ్చర్య పడిరి. నందుడు మాత్రము భయపడెను. వృద్ధులైన గోపాలురను ముసలివారైన గోపికలను పిలిచి నందుడు వారిలో నాలోచించి సమయమునకు తగిన ఒక యుక్తిని చేసెను.
గోపాలరాజగు నందుడట్లు యుక్తీనాలోచించి ఆ గోకులస్థానము విడువబూని ఆ క్షణముననే బృందావనమునకు పోవుటకు అందరికి చెప్పెను. అతని ఆజ్ఞను విని వారందరు పోవుటకు సిద్ధమైరి. గోపాలకులు గోపికలు బాలురు బాలికలు అందరు సిద్ధపడిరి. బాలకులు కృష్ణ బలరాములతో బాటు సంతోషముగా ప్రయాణము చేసిరి.
తీరు తీరు వేషములు ధరించి సంగీతము పాడుచు వెళ్లుచున్నవారిలో పిల్లన గ్రోవులూదు వారు కొందరు, కొమ్ములూదుపోరు కొందరు, చేతులలో చీరుతాళములు (వాద్యములు కలవారు కొందరు, వీణలు పట్టుకొన్నవారు కొందరు, శరయంత్రములు పట్టుకొని కొందరు, కొమ్ముబూరలు పట్టుకొని కొందరు పోవుచుండిరి. కొందరు గోపాల బాలకులు కొత్త చిగుళ్లను మరికొందరు మొగ్గలను ఇంక కొందరు విచ్చిన పుష్పములను చెవి సందులలో చిక్కుకొనిరి. కొందరు కొత్త పూలదండలు చేతబట్టుకొని కొందరు మోకాళ్ల వరకు వ్రేలాడు పూలమాలలు ధరించి, కొందరు కొండెకొప్పులపై చిగుళ్లు ధరించి, కొందరు పుష్పములు ధరించి యుండిరి. గోపాల బాలురందరు తొమ్మిది కోట్లు ఉండిరి. యువతులైన గోపికలు కోట్లకొలది (గుంపులు గుంపులుగా) వేడుకతో పోవుచుండిరి.
పెద్ద నితంబములు కలశముల వంటి కుచములు గల వృధ స్త్రీలు కోట్ల కొలది వెడలిరి. నారదమునీ ! రాధాదేవి సఖురాండ్రు గోపాల బాలికలు సుశీల మొదలగు నుత్తమ స్త్రీలు దీవ్యవస్త్రములు ధరించి నానావిధములైన ఆభరణములు అలంకరించుకొని చిరునవ్వుతో వేడుకతో ప్రయాణము చేసిరి.
వారిలో కొందరు పల్లకీలెక్కి మరికొందరు రథములెక్కి పోయిరి, రాధాదేవి బంగారు కలశములతో అలంకరించిన రథము నెక్కి రత్నాభరణములలంకరించుకొని ఆ సఖురాండ్రతో పాటు పోయెను.
యశోదాదేవియు రోహిణీదేవీయు రత్నాలంకారములలంకరించుకొని బంగారముతో అలంకరింపబడిన రథమెక్కి పోయిరి.
నందుడు సునందుడు శ్రీరాముడు గీరిభానుడు వీభాకరుడు వీరభానుడు చంద్రభానుడు సంతోషముతో గజములనెక్కి వెళ్లిరి. శ్రీకృష్ణ బలదేవులిద్దరు రత్నాభరణ భూషితులై బంగారు రథమెక్కి గొప్ప సంతోషముతో వెళ్లిరి.
కోటానుకోట్లు గోపాలురు వృద్ధులు యువకులు గర్వితులైన నందుని సేవకులు సంతోషముతో గుఱ్ఱము లెక్కి ఏనుగు లెక్కి పోయిరీ.
ఎద్దులెక్కి గాడిదలనెక్కి సంగీతరాగాలాపనలు చేయుచు గోపాలకులు పోయిరి. రాధాదేవి దాసీగణము నూట డెబ్బదిమూడు కోట్లు సంతోషముతో చిరునవ్వుతో బంగారు నగలు ధరించి పోవుచుండిరి. వారిలో కొందరు సిందూర ద్రవ్యమును కొందరు కాటుకను కొందరు క్రీడాకందుకములను (బంతులను కొందరు ఆటబొమ్మలను కొందరు భోగద్రవ్యములను మరికొందరు క్రీడా వస్తువులను కొందరు వేషధారణకనుకూలమైన ద్రవ్యములను కొందరు పుష్పహారములను కొందరు వాద్యములను కొందరు అగ్ని వర్ణము గల మేలి వస్త్రములను కొందరు కుంకుమ పువ్వు అగురు కస్తూరి చందనము వంటి ద్రవ్యములను చేతులలో పట్టుకొని ముదముతో గోపికలందరు పోవుచుండిరి.
కొందరు సంగీతమునందాసక్తులై మరికొందరు చిత్రకథల యందాసకులై పాడుచు చెప్పుకొనుచు కోటానుకోట్ల సుందరీమణులు . పల్లకీలలో వెళ్లిరి.
గుంపులు గుంపులు గుట్టములు గుంపులు గుంపులుగా రథములు గుంపులు గుంపులుగా ద్రవ్యములు {పదార్ధములు} నింపిన బండ్లు గుంపులు గుంపులుగా మావటీ వాళ్లతో అంబారీలతో కూడిన పదిలక్షల ఏనుగులతో బృందావనమునకు పోయిరి.
ఓ మునీ ! ఇట్లందరు గృహశూన్యమైన బృందావనమునకు పోయి అందరు తమకు తగిన విధముగా ఆయా స్థానములలో చెట్ల క్రింద కూర్చుండిరి. అప్పుడు గోపాలకులతో శ్రీకృష్ణుడు “నేడు మీరు మిక్కిలి సుందర గృహములలో నివసింతురు” అనగా ఆ గృహము లెక్కడ నున్నవి ? అని గోపాలకులడుగగా శ్రీకృష్ణుడిట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ :
శ్రీకృష్ణుడు పలికెను :
ఈ ప్రదేశమున దేవనిర్మితములై సుందరములైన గృహములున్నవి. కాని దేవతలకు ప్రీతి చేయకుండ ఎవ్వరును వాటిని చూడజాలరు. ఓ గోపాలులారా ! ఈనాడు వనదేవతలను చక్కగా పూజించి నిలువుడు. రేపు ఉదయమున రమ్యములైన గృహములను చూచి సంతసింపగలరు. ఈ వటవృక్షము మొదట నున్న చండికాదేవినీ గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము బలితో పూజింపుడు." అన్న కృష్ణ వాక్యములను ఏనీ గోపాలురు ఆ దేవతను పూజించి భోజన తాంబూలాది భోగములాపగలు అనుభవించి ఆ రాత్రి అక్కడనే నిద్రించిరి.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన బక ప్రలంబకేశి వధలును బృందావన గమనము ఆసు పదునారవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 16 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Seeking to destroy the child, Kaṃsa sent the powerful demon Tṛṇāvarta, who assumed the form of a terrifying, blinding whirlwind that swept across Gokula, enveloping the entire settlement in dust and darkness. Tṛṇāvarta snatched baby Kṛshṇa into the sky, intending to dash Him to death upon the mountain rocks. However, Kṛshṇa increased His weight millions of times over, becoming as heavy as the entire cosmos, which choked the demon and forced him to plummet downward. The demon crashed heavily upon the stone ground of Gokula and perished instantly, while little Kṛshṇa sat safely upon his chest, laughing and playing innocently.