మూII శ్రీనారాయణ ఉవాచ :
పార్వత్యువాచ :
సరస్వత్యువాచ :
సావిత్ర్యువాచ :
రత్యువాచ:
నారాయణునివచనమిట్లా –
ఇంతలో శుభురాలైన రాజ్లరుక్మిణి తల్లి, పతిపుత్రులు కలిగిన సాధ్వీమణులతో కలిసి ఆనందంగా వచ్చి (1) మంగళంచేసి, వడిగా ఎత్తైన సింహాసనాన్ని ఇతరమైనవి అమర్చి, రత్నములతో నిర్మించిన మందిరమున దంపతులను కూర్చోబెట్టింది. (2) అది రకరకాలైన విచిత్రమైన చిత్రములతో కూడినది వజ్రపుహారములతో అలంకరించబడినది. ముత్యములు, మాణిక్యములు, రత్నములు వీనితో బాగా వెలుగుతున్నది, అద్దము కూడా ఉంది. (3) కృష్ణుడు అక్కడే దుర్గతిని నశింపచే సేదుర్గను చూచాడు. సరస్వతిని, సావిత్రిని, రతిని రోహిణి సతిని (4) దేవపత్నులు, రాజపత్నులు, మునిపత్నులు, పతివ్రతలను, రత్నసింహాసనమందున్నవారిని, రత్నభూషణములతో అలంకరింపబడినవారిని చూచాడు. (5) జగతీపతియైన కృష్ణునిదూరం నుండే చూచి లేచారు. ఆతనిని ఆనందంతో రమ్యమైన రత్నసింహాసనమందు కూర్చోబెట్టారు. (6) దేవతలు మునిపత్నులు మాధవుని స్తుతించారు. క్రమంగా విడివిడిగా చేతులు జోడించి స్తుతించారు. (7) వరునితోపాటు కన్యకకు రాజ్ఞి భోజనం పెట్టింది. కర్పూరముగల తాంబూలమును, సువాసనగల నీటిని ఇచ్చింది. (8) దుర్గకృష్ణునకు మంగళపత్రికను ఇచ్చింది. అందరి ఆజ్ఞతో దేవి, ఆమె, చదువు అని అతనితో అన్నది. (9) దేవతాస్త్రీల సభలో నవ్వుతూ కృష్ణుడు ఆపత్రికను చదివాడు. లక్ష్మి, సరస్వతి, దుర్గ, సావిత్రి, సతి రాధిక (10) తులసి, పృథివి, గంగ, అరుంధతి, యమున, అదితి, శతరూప, సీత,దేవహూతి మేనిక (11) ఈ దేవతలు దంపతులకు ఉత్తమమైన మంగళమును చేయని అని కృష్ణుడు చదివాడు, వారలు విని నవ్వారు. (12) పార్వతిట్లా అన్నది - ఓ రుక్మిణీ కాంతుడ! నవ్వుతూనిన్నే చూస్తున్న రుక్మిణిని చూడు. ఆమె ప్రొడ, రూపవతి, సుందరి, నవయౌవని (13) సరస్వతి ఇట్లా - రత్నాలంకారములతో అలంకరింపబడింది, యువతి నీకు యోగ్యురాలు, ఇతరుని ఈశ్వరునిగా, అవమానించి (కాదని) చాలా సేపటి నుండి నిన్నే ప్రార్థిస్తున్నది. (14) సావిత్రిఇట్లా - వరునకు తగ్గట్టు కన్య ఉంది. ఇదివరలోనే విధి వీరిద్దరిని కలిపాడు. విదఛను విదగ్గునితో కలుపుట అంతటా శుభమేకదా (15) (పండితుడు) రతి అంది ఇట్లా - ఈభూమి పై ఈశ్వరునితో పరిహాసాన్ని చేయగలది సమర్ధురాలు ఎవరు? ధ్యానమునకు సాధ్యుడుకాడు. ఆరాధించుటకు కష్టమైనవాడు. ఇతరులైన ఈశ్వరులను తెగడినవాడు (భంగపరచినవాడు) (16)
గాయత్ర్యువాచ :
రోహిణ్యువాచ :
సరస్వత్యువాచ :
గాయత్రి ఇట్లా అన్నది :
వరునికి తగ్గ కన్య అలజడిలేని భీష్మకుని గృహమందు ఉంది. రోహిణి ఇట్లా - ఈ స్త్రీల సభలో ఓ జగన్నాథ! నిజం చెప్పు. రాధిక ఏలాటిది, రమ్యమైన రుక్మిణి ఏలాటిది (17) సరస్వతి ఇట్లా - రాధయందున్నంత ప్రీతి రుక్మిణి పై లేదు. పూర్వకాలంలో (గతంలో) ఆమె కలిసి ఉండేది, అన్ని క్రీడలలో వృద్ధి చెందింది. (18) ప్రాణమునకు అధిష్టాతయైన దేవి ఆమె పంచప్రాణములకన్న అధికమైన సతి ఆమె. రుక్మిణి, కమల. సాక్షాత్తుగా సంపదలకు అధిదేవత. (19) సర్వశక్తుల స్వరూపము పరమాత్మయైన కృష్ణునకీమె. బుద్ధికి కూడా అధిదేవి, దుర్గ, నారాయణి, పరురాలు, (20) వేదములకు అధిష్టాతన దేవినీవు. సావిత్రి వేదమాతృక, నేను విద్యాధిదేవతను. ఆ పిదప ఇతరులు భాగములు భాగములు మాత్రమే. (21) బ్రహ్మయందు, శివుని యందు, శేషునియందు, గణేశదినేశ్వరులయందు, భక్తులయందు, పద్మయందు, పార్వతియందు, నాయందు కూడా (22) ఆమె యందున్నంత దయాగుణము, ఇతరులైన మాలో ఇతరులలో అంత లేదు. ముల్లోకములలో పృథివిధన్యురాలు. భారతభూమి పుణ్యురాలు కనుక (23) అందులో బృందావనము ధన్యము, కారణం రాధ పాదపద్మములతో గుర్తించబడింది కనుక దేవతాస్త్రీలందరిలో రాధపుణ్యవతియైన సతి. (24) రాధ పాదాబ్జముల గోళ్ళపై మృదువైనలత్తుక పెట్టాడు కనుక ఈతడు ఇలాంటివాడు అని విని ఆడవాళ్ళంతా నవ్వారు. (25) దూరంనుండి అంతా రాధ వక్షః స్థలమందు ఉన్నదని ధ్యానిస్తున్నారు. అందువలన రాధకు నమస్కరించి సామ్యాన్ని తలుస్తున్నారు గదా. (26) సరస్వతి మాటలు విని సావిత్రి, సతియై పార్వతి, ఇతర స్త్రీలంతా సభలో, బాగుంది అని అన్నారు. (27) లోపాముద్ర అనసూయ, అహల్య అరుంధతి, అందరు మునుల పత్నులు ఈశ్వరుని సంతోషపరిచారు, (28) ఇక దేవతలను, రాజులను, మునీంద్రులను భీష్మకుడు విధి ప్రకారము పూజించాడు. ఆదరముగా భుజింపచేశాడు. (29) జనులారా! తినండి, తినండి అని ఇవ్వండయ్యా ఇవ్వండయ్యా అని ఇచ్చేవారిని అన్నాడు. మంగళకరమైన వాద్య, సంగీతములతో నగరంలో పెద్ద శబ్దమైంది. (30) ఇక తెల్లవారగానే బ్రహ్మ ఈశ్వరుడు, శేషుడు మొదలగువారు, దేవతలు రాజులు తమతమ వాహనములను త్వర త్వరగా ఎక్కటమారంభించారు. (31) ఉగ్రసేనమహారాజు, వసుదేవుడు త్వరకలవారై శ్రీకృష్ణుని సతి రుక్మిణిని ప్రయాణ యాత్రకు సిద్ధం కమ్మన్నారు.(32)
సుభద్రోవాచ –
అను ॥ రుక్మిణి తల్లి సుభద్ర, రుక్మిణిని తన రొమ్మున అదుముకొని, నిన్ను వదలి ఎట్లా బతకాలి, నీవు కూడా నన్నొదిలి ఎట్లా జీవిస్తావు. (34) మహాలక్ష్మివి నా ఇంటినుండి కన్యారూపంలో మామతో వసుదేవుని ఇంటికి వెళ్తున్నావు. వాసుదేవునకు ప్రియసతివై (35) అని పలికి కన్నీటితో, దుఃఖంతో కన్యకను తడిపింది. భీష్మకుడు కన్నీటితో కన్యకను కృష్ణునకు ఇచ్చి, (36) అతనిని వదిలి దూరంగా పోయి, ఆతడు గట్టిగా చాలా ఏడ్చాడు. రుక్మిణి ఏడ్చినది. శ్రీకృష్ణుడు కూడా మాయవలన ఏడ్చాడు. (37) వసుదేవుడు కొడుకును, వధువును రథము పైకి ఎక్కించాడు. ఇంతలో రాజు అల్లునకు అరణమిచ్చాడు. (38) వేయి శ్రేష్ఠమైన ఏనుగలను, వాటికన్న ఆరురెట్లెక్కువగా గుఱ్ఱలను, వేయిమంది దాసీలను, నూర్లు నూర్లుకింకరులను (39) వేయి రత్నములను, అమూల్యమైన రత్నభూషణములను పరిశుద్దమైన బంగారము ఐదులక్షలు, సాదరంగా ఇచ్చాడు. (40) నీటికి భోజనమునకు అవసరమైన పాత్రలు విశ్వకర్మచేసినవి ఇచ్చాడు. బంగారువి, రమ్యమైనవి, కామధేనువులను ఆనందంగా ఇచ్చాడు. (41) పాలిచ్చే ఆవులు, దూడలతో కూడా వేయి ఇచ్చాడు. అమూల్యమైన, అందమైన, వహ్నితో శుద్ధమైన వస్త్రములను ఇచ్చాడు. (42) వసుదేవుడు, ఉగ్రసేనుడు దేవతలతో, మునులతో కూడా ఆనందంతో నిండిన ముఖం కాలవాడై త్వరగా ద్వారకకు అభిముఖంగా వెళ్ళాడు. (43) రమ్యమైన తన నగరాన్ని ప్రవేశించి మంగళం చేయించాడు. వాయిద్యాలను వాయింపించాడు. అవి సుందరంగా మునోహరంగా ఉన్నాయి. (44) దేవకి, రోహిణి, రమ్యురాలైన నందుని ఇల్లాలు యశోద, అదితి, దితి అట్లాగే వరకామినులు, (45) శ్రీకృష్ణుని రమ్యమైన రుక్మిణిని మాటిమాటికి చూచి ఇంట్లోకి ప్రవేశ పెట్టారు. మంగళకార్యం చేయించారు. (46) దేవతలకు, మునిపుంగవులకు నాలుగు విధములుగా భుజింపచేసి (భక్ష్య భోజ్యచోష్య లేహ్యములు) నృపులకు బాంధవులకు అట్లాగే పెట్టి, దూరంగా వెళ్ళాడు, ఆరాజు, (47) భట్టులకు బ్రాహ్మణులకు, రత్నాదులను ఆనందంగా ఇచ్చాడు. వారికి భోజనం పెట్టాడు వారిని పరితుష్టులను చేశాడు. వారు చిరునవ్వుతో ఉన్నారు. (48) ఇట్లా భోంచేసి ధనాన్ని పొంది అందరు ఇళ్ళకు అనందంగా వెళ్ళారు. వసుదేవుని భార్య మంగళమును చేయించింది. (49)
అని బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రుక్మిణి వివాహమందు నూట తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 109 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Following the period of universal dissolution, when the Supreme Lord Śrī Kṛshṇa wills the renewal of creation, infinite new cosmic eggs expand from the pore-spaces of His transcendent body. Millions of new Brahmās, Vishṇus, and Śivas emerge to govern individual universes, setting into motion new cycles of creation, maintenance, and spiritual evolution, demonstrating the inexhaustible, boundless creative energy of the Supreme Being.