మూ॥శ్రీనంద ఉవాచ:
శ్రీభగవానువాచ :
నంద ఉవాచ :
శ్రీభగవానువాచ :
శ్రీనందుని వచనము - ఓ జగత్ర్పభు! సూర్యుడు కాని చంద్రుడు కాని రాహుగ్రస్తులెందుకైనారు. భాద్రపదశుక్ల కృష్ణ పక్షములందు చతుర్థియందు చంద్రుణ్ణి ఎందుకు చూడరాదు. (1) నీవు వేదములకు జనకుడవు. నిన్నుకాక ఎవరినడుగుతాను. వేదములలో, పురాణములందు గోప్యంగా ఉన్నదానిని విద్వాంసులు తెలుసుకోలేరు. అనే ఆమాట విని ఇట్లా అన్నాడు (2) భగవంతుని వచనము - ఈ మాట అబద్దము. వైదికులు దీనిని నిషేధించారు. ఓ నంద! క్షమించు, నీకు మేలు కలుగని. నన్ను మరో ప్రశ్నఅడుగు. (3) ఓతండ్రి! మాటను నమ్మాలి. బుద్దిమంతులు ప్రకాశింపచేయరాదు. ప్రకాశింపచేస్తే విఘ్నమౌతుంది. సజ్జనుల ఛిద్రము (దోషము) దైవతమైనది. (4) నందుడిట్లన్నాడు - ఓ జగన్నాథ! చెప్పండి. భక్తుని వంచించరాదు. దేవేశులు కన్పించనివారు ఐనా రాహువుచే మింగబడెడివారు,పుణ్యము నిచ్చువారు. (5) భగవంతుని వచనమిట్లా - పురాతనమైన ఈ కథను చెప్తాను విను ఓ నంద! విను. దానిని వింటే నరుడు తీర్థమందుస్నానము చేసిన వాడౌతాడు, నిష్కలంకుడౌతాడు. (6) అన్ని పాపములు చేసినవాణ్ణి చూస్తే వచ్చే పాపము ఈ ఆఖ్యానము విన్నందు వల్లనే భస్మమౌతుంది. (7) ఒకసారి జమదగ్ని చాలా కుతూహలముకలవాడై, రేణుకతో (భార్య) కూడి, ఆనందంగా నర్మదాతీరానికి వెళ్ళాడు. (8) ఆమెతో కలిసి జనంలేని నర్మదా తీరంలో విహరించాడు. ఆమెకు కొత్తగా పెళ్ళైంది. సుందరి, నవయౌవ్వనం కలది. (9) మంచి వేషము కలది, చిరునవ్వు కలది, రత్నపు సొమ్ములు కలది. స్తనముల బరువుతో కొంచెం వంగింది, పిరుదుల బరువుతో కొంచెం మెల్లగా నడుస్తోంది. (10) సుందరీ మణులతో పోల్చ వీలులేనిది, తెల్లని చంపక పువ్వు రంగు గలది, పూర్ణచంద్రుని వంటి ముఖం కలది, చూపులు అట్లాగే ఉన్నాయి. (11) చాలా సూక్ష్మమైన (సన్నని) వస్త్రం ధరించింది. కాముని బాణంతో బాధపడుతోంది. ఓప్రజ! శరీరమంతా పులకరించి ఉంది. సంభోగం వల్ల మూర్ఛపోయింది. (12) పుంస్కోకిలతో కూడి రమ్యంగా కూస్తున్న తుమ్మెదలు రమ్యంగా ధ్వనిస్తున్న, మంచి వాసనగల గాలి వీస్తుండగా, పుష్పతలమందు, శుభసమయమందు (13) ఒంటినిండా చందనం పులుముకొని, వస్త్రము మాలలు ధరించిన మునిని, మహారాస రసముతో కూడిన ఆతనితో భాస్కరుడు స్వయంగా ఇట్లా అన్నాడు. (14) నీవు వేదకర్తకు ప్రపౌత్రుడవు, ఆతడు జగత్పతి, బ్రహ్మ, నాలు వేదములు నీకు విధేయములు, అందులో నీవు చాలా నిష్ణాతుడవు. ఎప్పుడూ శుచివి. (15) వేదాంగకర్తవు ధర్మజ్ఞుడవు, శ్రేష్ఠుడవు, వేద విదులలో శ్రేష్టుడవు. మహాతపస్వివి. తేజస్వివి, బ్రహ్మచారివి, మంచి నియమములు కలవాడవు. (16) శాస్త్రమంతా నీవంటివారు చెప్పిందే, దాన్ని చదివి మరొకడు పండితుడౌతాడు. వేదములలో చెప్పబడ్డవి ధర్మము. దానికి విరుద్దమైంది అధర్మము. (17) ధర్మజ్ఞుడవై ఉండి ధర్మం విడిచావు. అధర్మంగా రమించావెందుకు. వేదము విశేషంగా దీవామైథునము (పగలు భార్యను కలియటాన్ని ) దోషంగా చెప్తుంది. (18) నేను ధర్మములకు సాక్షిని. అందుకే నేను నీకు చెబుతున్నాను. సూర్యుని మాటను విని ద్విజుడు మైథునాన్ని విడిచాడు. (19) ఎదురుగా బ్రాహ్మణ రూపంలో సూర్యునంత తేజస్సుగల సూర్యుణ్ణి చూచి, కోపములజ్జ కలిగినవాడై ముఖమంతా ఎర్రబడగా సూర్యునితో ఇట్టన్నాడు, ముని. అక్కడ సిగ్గుపడి రేణుక సతి వస్త్రము ధరించింది.
మూ॥ జమదగ్నిగువాచ –
శ్రీభాస్కర ఉవాచ :
జమదగ్ని ఇట్లన్నాడు - నీకు నీవుగా పండితునిగా భావించుకునే, నీవెవరు. నీకంటే వేరైన పండితులు లేరా (21) నేను భగవంతుడైన భృగువునకు శిష్యుడను. నీవు కశ్యపునకు చెందినవాడవు. ధర్మాధర్మములని రూపణయందు నాల్గు వేదములను కూడా ఎరిగినవాడను. (22) వేదములలో చెప్పబడ్డది ధర్మము. దానికి భిన్నమైనది అధర్మము. పురుషుడు ఎల్లప్పుడు అజ్ఞానిగా ఉన్నాడు. తన కర్మవల్ల జడుడైనాడు. (23) అగ్ని ఎట్లా అన్నిటిని భక్షిస్తాడో అట్లా తేజస్వంతులకు ఇది దోషం కాదు. ఇతరులు, నీవు, ధర్మము, అందరు కర్మలకు సాక్షి. (24) నీతనయుడెప్పుడు, ఫలాన్ని ఇచ్చేవాడు, శాస్త్రమెరిగినవాడు కాబట్టి. మీరు, వైష్ణవులకు శాసకులుకారు. మాకు కూడా కారు. (25) వాసుదేవభక్తులకు అశుభములేదుకదా. వైష్ణవులను, హరి యొక్క సుదర్శన చక్రము ఎల్లప్పుడు రక్షిస్తుంటుంది. (26) భగవాన్ నారాయణుడు స్వయంగా, బ్రహ్మ శంకరుడు, యముడు మాకు శాసకులుకారు. ఓ సూర్యుడ! నీవు కూడా శాసకుడవుకావు, (27) రాజపుత్రుడు ఎట్లా స్వేచ్ఛగా తిరిగేవాడో మేమూ అట్లాగే స్వచ్ఛందంగా ఉండేవాళ్ళం. నేను, యముణ్ణి, దేవతలందరిని భస్మం చేయటానికి సమర్ధుణ్ణి. (28) ఓ సూర్యుడ! మహేంద్రుడు మొదలగువారిని, క్షణకాలంలో అవలీలగా భస్మం చేయగలను. నాకు ధర్మం చెప్పటానికి నీవెవ్వడివి. నీస్థానానికి నువ్వు వెళ్ళు. (29) నన్ను శాసించేవాడు, ప్రకృతికి పరమైనవాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు. ఈ రోజు, నిర్జనమైన ఈ ప్రదేశంలో నాకు నీవు రసభంగాన్ని చేశావు. (30) నాశాపంవల్ల పాపదృష్టి కలవాడవు, రాహువుచే మింగబడేవాడవు ఔతావు. నిన్ను చూడటానికి, దూరమయ్యే మేఘములన్ని (31) వాయువుతో ప్రేరేపించబడి నిన్ను కప్పివేస్తాయి. నీవు, నీ తేజోగర్వంతో, తేజస్సును పోగొట్టుకుంటావు. (32) మేఘములతో కప్పబడి, తేజస్సు అల్పంగా కలిగి, రాహువుతో మింగబడతావు నీవు. బ్రాహ్మణుని మాటను విని భగవాన్ భాస్కరుడు స్వయంగా, ఆపిదప, చేతులు జోడించి, మునిశ్రేష్ఠుని స్తుతించాడు. (33) భాస్కరుని వచనమిట్లా - అన్ని ధర్మములనెరిగిన ఓ ముని! బ్రాహ్మణులు అవధ్యులు, ధన్యులు, గౌరవించతగినవారు, ముందు ఉంచుకోతగినవారు. (34) భగవాన్ నారాయణుడు, శంభువు, బ్రహ్మ స్వయంగా ప్రభువు, గణేశుడు, శేషుడు సనాతనమైన ధర్మము. (35) వీరంతా బ్రాహ్మణుని స్తుతిస్తారు. విప్రరూపుడైన జనార్దనుడు అని. క్షమించు. వైష్ణవుడు శుద్దుడు. నీ ధర్మాన్ని ఆచరించు. (36) హృదయంలో జనార్డునుని కలిగి ఉన్న వైష్ణవులకు కోపమెక్కడిది మేము విప్రులను పూజిస్తాము. మీరు దేవతలను పూజిస్తారు. (37) ఓద్విజ ఇట్లా చేయటమనేది పరస్సరము స్నేహమునకు పాత్రమైనది (స్థానము). నీవు నన్ను శపించావు. నేను నిన్ను శపిస్తున్నాను. (38) లేకపోతే, జనులంతా నన్ను సూర్యుడు తేజోహీనుడు అని అంటారు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడ! క్షత్రియునితో అవమానింపబడుతావు. (39) నీకు క్షత్రియునితో మరణం కలుగుతుంది. సూర్యుని మాటను విని బ్రాహ్మణుడు తిరిగి కోపగించాడు ముఖమంతా ఎర్రబడగా ఆ బ్రాహ్మణుడు, సూర్యుని శపించాడు. నీవు శివునితో జయింపబడుతావు. (శివుడు జయిస్తాడు) అని (40) ఇద్దరి తగాదా తెలిసి కశ్యపునితో ప్రేరేపింపబడి, ఓ ప్రజ! స్వయంగా,బ్రహ్మ జగత్తుల నేర్పరచేవాడు, వచ్చాడు.
బ్రహ్మఉవాచ :
బ్రహ్మ వచ్చి భయపడిన భాస్కరుని మేల్కొలుపసాగాడు. గురువులకు గురువైన బ్రహ్మ, ధర్మజ్ఞులలో ధర్మజ్ఞుడైన మునిశ్రేష్టుని ఉద్బోధించసాగాడు. (42) బ్రహ్మవచనమిట్లా - భాస్కర! నీవు క్షమించు. నీవు సాక్షాత్తుగా నారాయణుడవు. మీకు పాలింపతగినవాడు. బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ చంపదగినవాడు కాదు. (43) నేను, అధికమైన విప్రుని శాపమునకు అంతమును నీకు చెప్తాను. నేను భయపడి ఇక్కడికి వచ్చాను. ఆ పైన భృగువు పంపించాడు. (44) మరీచికశ్యపుడు స్పష్టంగా చెప్పి పంపగా వచ్చాను, నేను. ఓ సురశ్రేష్ఠుడ! నీవు శాంతించు. అన్ని కర్మలకు నీవే సాక్షివి. (45) ఓ బ్రహ్మన్ (సూర్య!) ఏదో ఒక రోజున, ఏదో ఒకక్షణంలో నిన్ను మేఘాలు ఆవరిస్తాయి. వెంటనే విడిపోతాయి. (46) అధిక మాసం, క్షామమాసం వచ్చిన సంవత్సరంలో నిన్ను రాహువు మింగుతాడు. అక్కడ కన్పించకుండా పోతావు కొందరికి. కొందరికి కన్పించి పుణ్యం కల్గిస్తావు. (47) లేకపోతే అన్ని కాలములలోను నీ దర్శనము భూమి పై పుణ్యదర్శనము. నిన్ను చూచి, నమస్కరించి జనులంతా పాపహీనులౌతారు. (48) జన్మ, ఏడు, ఎనిమిది, పన్నెండు, నాలుగు, పది స్థానములందు, జన్మనక్షత్రమందు నరులు నిన్ను చూడకూడదు. చూస్తే మరణం సంభవిస్తుంది. (49) అస్తమయ కాలమందు, మేఘములు కప్పినప్పుడు, మధ్యాహ్న కాలమందు, నీటియందు సగం ఉదయించిన కాలమందు నిన్ను చూచిన పాపము కల్గుతుంది. (50) భార్య వల్ల దుఃఖకారణంగా, భార్యయే కారణమైన దానితో, మామతో, భావమరిదితోను నీతేజం నష్టమౌతుంది. (51) లేకున్న నీతేజాన్ని సంజ్ఞ (భార్య) కూడా సహించలేదు. మాలి సుమాలి యుద్ధంలో నీవు శివుని చేతిలో ఓడిపోతావు. (52) అని సూర్యునితో అని, బ్రాహ్మణునికి బోధించసాగాడు. ఓ ప్రజ! నమ్రంగా ఉన్న శాపంతో తిరస్కరింపబడ్డ, సిగ్గుపడుతున్న, కోపంతో ఉన్న బ్రాహ్మణునితో అన్నాడు. (53) ఓ బ్రాహ్మణ! నీ ఇంటికిపో. ఓ వత్స! సుఖంగా వెళ్ళు. నీతేజస్సుతో క్షణకాలంలో లోకం భస్మమౌతుంది. (54) సూర్యుని నీవు పాలించాలి. సూర్యుడు, నిన్ను నిరంతరం పాలించాలి. ఇద్దరు పరస్పరము పూజించుకోతగినవారు. మీ సంబంధము పోష్యపోషక సంబంధము. (55) విష్ణువు అంశమైన, క్షత్రియుడైన కార్తవీర్యార్జునునితో నీవు అవమానింపబడుతావు, అనుమానము లేదు. అవమానింపబడ్డ ద్విజుడు మృతప్రాయుడు. (56) నీ ప్రాచీనమైన కర్మ అంతా ఎప్పుడూ ఖండింపబడదు. నారాయణుడు తన అంశతో నీ కొడుకుగా జన్మిస్తాడు. (57) ఇరువది ఒక్క మారులు భూమి పై క్షత్రియులు లేకుండా చేస్తాడు. ఈభూమి పై నీకీర్తికి మృత్యువు కారణమౌతుంది. (58) ఓవ్రజేశ్వర! ఇట్లా చెప్పి బ్రహ్మ తన గృహమునకు వెళ్ళాడు. జమదగ్ని వెళ్ళాడు. భాస్యరుడు తన గృహమునకు వచ్చాడు. (59) ఓ తండ్రి! ఈ విధముగా పుణ్యమునకు కారణమైన ఆఖ్యానమును చెప్పాను. ఏ కారణంగా రాహుగ్రస్తుడైన సూర్యుడు అదృశ్యుడౌతాడు, (60) భాద్రపద మాస శుక్లకృష్ణ పక్షాల్లో చవితి చంద్రుడు, అదృశ్యుడు (చూడతగనివాడు) నష్టరూపుడౌతాడు చెప్పండి, వింటాను. (61) రాహుగ్రస్తుడు కళంకి అని ఇదివరలో నేను శపించాను, ఓ తండ్రి! పురాతనమైన ఈ కథనంతా నీకు చెప్తాను. (62) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ మందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుడు, నందుడు వీరి సంవాదమందు డెబ్బడి తొమ్మిదవ అథాయ్యము.
Summary of chapter 79 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Highlighting the limitless purifying potency of the divine name, the text recounts the famous history of Ajamila, a fallen Brāhmaṇa who lived a life of severe sin and moral degradation. At the moment of his death, as the terrifying messengers of Yamarāja arrived to claim his soul, Ajamila frantically called out the name of his youngest son, Nārāyaṇa. Hearing the holy name uttered even inadvertently, the divine messengers of Lord Śrī Vishṇu arrived immediately, repelled the lord of death's servants, and granted Ajamila full spiritual purification and ultimate liberation.