బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

91 - అధ్యాయము

మూ శ్రీభగవానువాచ:

వసుదేవ ఉవాచ:

 శ్రీదేవక్యువాచ:

శ్రీభగవానువాచ:

భగవంతుని వచనమిట్లా :

నిషేకంతో పరిష్వంగము, విభేదము దానితోనే. క్షణంలో దర్శనము. అందువల్ల ని షేకాన్ని ఎవరు తప్పిస్తారు. (1) రావటం పోవటం గురించి ఉద్దవుడు చెబుతాడు. ఆతన్ని త్వరగా బయలుదేరదీస్తాను. ఓ తండ్రి! ఆ తరువాత తెలుసుకుంటావు. యశోద , రోహిణి, గోపికలు, గోపబాలురు, ప్రాణాధికురాలైన రాధిక వీరి దగ్గరకు వెళ్ళి వారిని గూర్చి మాట్లాడుతాడు. (3) ఇంతలో అక్కడికి వసుదేవుడు, దేవకి, బలదేవుడు, ఉద్ధవుడు అక్రూరుడు త్వరగా వచ్చారు. (4) వసుదేవుని వచనమిట్లా - ఓ నంద! నీవు బలవంతుడవు,జ్ఞానివి, మంచి బంధువువు. నాకు సఖుడవు. మోహం విడువు ఇంటికి వెళ్ళు. వీడునీకెట్లా కొడుకో, అట్లాగేనాకును (5) గోకులం నుండి మధుర ద్వారమైంది. బాంధవుడు లేడు. ఓ నంద! ఎప్పుడూ ఆనందాన్నిచ్చే మహోత్సవ మందు, కొడుకును చూస్తావు. (6) దేవకి వచనమిట్లా - ఈతడు మాకొడుకైనట్టే, నీకు అట్లాగే కొడుకౌతాడు, నిశ్చయము. ఓనంద! అలసుడవెందుకైనావు. నీ దేహము శుచిగా కన్పిస్తోంది. (7) పదకొండు సంవత్సరాలు, బలరామునితో కూడి నీ ఇంట్లో సుఖంగా ఉండినాడు. కొద్ది రోజులకే శోకగ్రస్తుడవైనా వెందుకు. (8) కొడుకుతో పాటు మధురలో ఎన్నాళ్ళుంటావో ఉండు. పూర్ణచంద్రుని వంటి ముఖంగలవానిని చూస్తూ నీ జన్మను సార్థకపరచుకో. (9) భగవంతుని వచనమిట్లా - ఉద్భవ! సుఖంగా భద్రంగా వెళ్ళు. నీకు మంచి ఔతుంది. గోకులానికి వెళ్ళి యశోదను, తల్లి రోహిణిని చూచి ఆనందించు. (10) గోపబాలుర సమూహాన్ని, రాధికను, గోపికా గణాన్ని శోకాన్ని ఛేదించే నేనిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానంతో ఉద్బోధించు. (11) నా తల్లి ఆజ్ఞతో శుచిగా ఆనందంతో నందుడుండని. నందుని స్థితిని, నావినయాన్ని యశోదకు చెప్పు. (12) అని పలికి శ్రీకృష్ణుడు తండ్రి, తల్లి, బలరాముడు, అక్రూరుడు వీరితో కలిసి త్వరగా అభ్యంతర గృహానికి వెళ్ళాడు. (13) ఉద్ధవుడు ఆ రాత్రి మధురలో ఉండి, ఓ నారద! తెల్లవారి రమ్యమైన వృందావన వనమునకు త్వరగా వెళ్ళాడు. (14) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరభాగమందు నారాయణ నారద సంవాద మందు తొంబది ఒకటవ అధ్యాయము.